Jump to content

Amaravati


Recommended Posts

కళకళలాడేలా అంకుర ప్రాంతం
ఉత్ప్రేరక ప్రాంతంలో 10-15 వేల మంది నివాసం
మేం స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకోవడం లేదు
సింగపూర్‌ కన్సార్టియం సీఈఓ బెంజమిన్‌ యాప్‌ వెల్లడి
సీఆర్‌డీఏ ‘డీప్‌ డైవ్‌’ సదస్సులో పలు అంశాలపై మేధోమథనం
ఈనాడు - అమరావతి
14ap-main12a.jpg

రాజధాని అమరావతిలో 1691 ఎకరాల్లో అంకుర (స్టార్టప్‌) ప్రాంత అభివృద్ధికి డిజైన్లు సిద్ధం చేస్తున్నామని, జనజీవనంతో నిత్యం కళకళలాడేలా రూపొందుతాయని... సింగపూర్‌ కన్సార్టియం సీఈఓ బెంజమిన్‌ యాప్‌ పేర్కొన్నారు. మొదట 50 ఎకరాల్ని ఉత్ప్రేరకాభివృద్ధిగా చేపడతామని ఆయన పేర్కొన్నారు. 50 ఎకరాల్లో వచ్చే సంస్థల్లో వేల మందికి ఉపాధి లభిస్తుందని, మొత్తం 10-15 వేల మంది అక్కడ నివసిస్తారని తెలిపారు. . మూడేళ్లలో రాజధాని పనుల పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ‘అమరావతి డీప్‌డైవ్‌ వర్క్‌షాప్‌’ పేరుతో గురువారం విజయవాడలో కార్యశాల నిర్వహించింది. శుక్రవారం కూడా ఇది కొనసాగుతుంది. గురువారం పలు అంశాలపై జరిగిన మేధోమథనంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. చర్చాగోష్ఠుల సారాంశాన్ని క్రోడీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక నివేదిక అందజేస్తారు. శుక్రవారం జరిగే ముగింపు సమావేశంలో సీఎం పాల్గొంటారు. ‘‘అమరావతిలో మేం అభివృద్ధి చేయనున్న అంకుర ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. వాళ్లను ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మీరు భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు తీసుకుని అలా ఉంచుకుందామనుకుంటున్నారా? లేక వెంటనే అక్కడికి వచ్చి కార్యకలాపాలు ప్రారంభిస్తారా? అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకుంటే మేం చేసేది స్థిరాస్తి వ్యాపారం కాదు. ఎప్పుడూ ప్రజలతో కళకళలాడే, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా లక్ష్యం’’ అని సింగపూర్‌ కన్సార్టియం సీఈఓ బెంజమిన్‌ యాప్‌ పేర్కొన్నారు. అక్కడ పాఠశాలలు, ఆస్పత్రులు వంటివీ వస్తాయన్నారు. ఇప్పటికే మూడు నాలుగు దఫాలు మార్కెట్‌ స్టడీ చేశామని, అత్యుత్తమ ప్రమాణాలతో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సింగపూర్‌ కన్సార్టియం సీటీవో మహీధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ఏడీసీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసాధి తదితరులు పాల్గొన్నారు.

చర్చాగోష్ఠుల్లో ముఖ్యాంశాలు..
* ప్రణాళికలు, భవనాల ఆకృతుల రూపకల్పనకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారని, కానీ ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించడం రాత్రికి రాత్రే సాధ్యంకాదని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ‘‘రాజధానికి నిధులపై సందేహాలు అవసరం లేదు. కేంద్రం ప్రభుత్వం మరో రూ.1500 కోట్లు ఇవ్వనుంది. ప్రపంచబ్యాంకు, హడ్కో రుణం వస్తోంది. భూమి హామీగా ఉంచి బ్యాంకుల నుంచి నిధులు తెస్తున్నాం. దానికోసమే 4 వేల ఎకరాలు కేటాయించాం’’ అని తెలిపారు.

* ఈ మూడేళ్లలో రాజధానిప్రాంత జనాభా 15 వేలు పెరిగిందని, కొత్తగా 10 వేల ఉద్యోగాలు వచ్చాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. రాజధానిలో రూ.13,500 కోట్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయన్నారు. ప్రపంచంలో కొత్తగా నిర్మించిన ఏ నగరంతో పోల్చినా అమరావతి పనులు జరిగినంత వేగంగా ఎక్కడా జరగలేదన్నారు.

* రాజధాని నిర్మాణంలో ప్రణాళిక, సుపరిపాలన, కెపాసిటీ బిల్డింగ్‌ వంటివి కీలకాంశాలని సింగపూర్‌లోని సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖూ టెంగ్‌ చెయ్‌
పేర్కొన్నారు.

* అమరావతి కృష్ణానదీ జలాలపైనే ఆధారపడటం సరికాదని, ప్రత్యామ్నాయ వనరుల చూసుకోవాలని సింగపూర్‌లోని సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌కి చెందిన లూ ఆన్‌ తువాన్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

తెలుగుతల్లికి... సూర్య నమస్కారం
14ap-main13a.jpg

ఈనాడు అమరావతి: అరసవిల్లిలోని సూర్యదేవాలయంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యకిరణాలు మూలవిరాట్‌పై ప్రసరించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి... శాసనసభ సెంట్రల్‌ హాల్‌లో తెలుగుతల్లి విగ్రహానికి ఆ మాదిరి హంగులద్దాలని భావిస్తున్నారు. ఆ వీడియో చిత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. శాసనసభ భవనం పైకప్పుపై ప్రత్యేక కోణాల్లో దర్పణాలు అమర్చి సూర్యకిరణాలు భవనంలోని తెలుగుతల్లి విగ్రహంపై ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. వీడియో చిత్రంలో ఉన్న ప్రకారం... సూర్యకిరణాలు సరిగ్గా ఉదయం 9.15 నిమిషాలకు తెలుగుతల్లి విగ్రహాన్ని తాకి, క్రమంగా మొత్తం విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆ వెలుగులో తెలుగుతల్లి విగ్రహం కాంతులీనుతూ కనిపిస్తుంది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రాజమౌళి వివరించారు. దీన్ని మరింత మెరుగుపరచాల్సిందిగా సీఎం సూచించారు.

ప్రజల మొగ్గు టవర్‌ ఆకృతికే..!
శాసనసభ భవనానికి... సూది మొనను పోలిన పొడవైన టవర్‌ ఆకృతే ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా దానికే మొగ్గు చూపుతున్నారు. శాసనసభ భవనానికి సంబందించి నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన రెండు ఆకృతుల్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సామాజిక మాధ్యమాల్లో ఉంచి జనాభిప్రాయం కోరింది. గురువారం రాత్రి 7 గంటల వరకు 20,225 మంది స్పందించారు. వారిలో 13,915 మంది టవర్‌ ఆకృతికి ఓటేయగా, 6,310 మంది చతురస్రాకారపు ఆకృతి బాగుందని చెప్పారు. ముఖ్యమంత్రి శుక్రవారం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, లేకపోతే శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకోవచ్చునని అధికారవర్గాలు చెబుతున్నాయి.

టవర్‌ ఆకృతి భవనంపైనే సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఆలోచిస్తోంది.

Link to comment
Share on other sites

అమరావతి కోసం మేధోమథనం
15-12-2017 04:07:37
 
636489076622718666.jpg
  • 2 రోజుల డీప్‌ డైవ్‌ వర్క్‌షాపు
  • దేశ విదేశాల నుంచి ప్రతినిధుల రాక
  • నేడు హాజరు కానున్న చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలుగువారికి గర్వకారణంగా, ప్రపంచంలోనే బెస్ట్‌ సిటీగా రూపుదిద్దాలనుకుంటున్న అమరావతికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు దాదాపుగా చివరి అంకానికి చేరాయి. వాటిని పకడ్బందీగా అమలు పరచి, ఆశించిన విధంగా నిర్మించేందుకు ఏవిధంగా ముందుకు సాగాలన్న విషయంపై ఏపీసీఆర్డీయే నిర్వహిస్తున్న డీప్‌ డైవ్‌ వర్క్‌షాప్‌ ఘనంగా ప్రారంభమైంది.
 
 
విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో గురువారం మొదలైన 2 రోజుల ఈ భారీ మేథోమధన సదస్సులో పలు అంశాల్లో నిష్ణాతులైన దేశ విదేశాలకు చెందిన పలువురు హాజరయ్యారు. వీరిలో ప్రపంచ ప్రఖ్యాత మెకన్సీ, సింగపూర్‌లోని సెంటర్‌ ఫర్‌ లివింగ్‌ సిటీస్‌, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌, సీహెచ్‌2ఎం, ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ప్రపంచ బ్యాంకు స్వతంత్ర కన్సల్టెంట్లు, జీఎంఆర్‌, ఎండీ ఆక్టస్‌ అడ్వైజర్స్‌, ఓలాక్యాబ్స్‌, ఓసీజీ టోక్యో, తెరి, సింగపూర్‌ కన్సార్షియం, ఏపీయూఐఎఎంఎల్‌, సర్బానా జురాంగ్‌, సిస్కో, గ్రీన్‌ స్పేస్‌ అలయన్స్‌, ఏబీబీ వంటి సంస్థలు ఉన్నాయి. ‘అమరావతి - గ్లోబల్‌ సిటీ ఇన్‌ ది మేకింగ్‌, ప్లాన్‌ ఫర్‌ వరల్డ్‌ బెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ది హ్యాపీ సిటీ విజన్‌, ప్లాన్‌ అండ్‌ యాక్షన్‌, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ప్లాన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ మొబిలిటీ, ఐసీటీ అండ్‌ స్మార్ట్‌ సిటీ, పవర్‌ అండ్‌ రినెవబుల్స్‌, గవర్నెన్స్‌, స్టార్టప్‌ ఏరియా..’ తదితర ప్రధానాంశాలపై తొలిరోజున చర్చ జరిగింది.
 
 
భావి ప్రణాళికలపై చర్చ
రాజధానికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌, భావి స్వరూపం వంటి వాటిని కళ్లకు కట్టే విధంగా 3-డి వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు. అమరావతి ప్రకటన తర్వాత సుమారు మూడున్నరేళ్లలో ఆ దిశగా సాగిన ప్రస్థానం గురించి తెలిపే ప్రత్యేక పుస్తకాలను అందజేశారు. అనంతరం పలు బృందాలుగా విడిపోయిన నిపుణులు రాజధాని నిర్మాణాంశాలపై చర్చించి అనేక సూచనలు ఇచ్చారు. వీటన్నింటినీ క్రోడీకరించి, శుక్రవారం వర్క్‌షాపునకు హాజరయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తారు. అమరావతి ఆవిర్భావం వెనుక చరిత్ర, ప్రపంచంలోనే మేటి నగరంగా దానిని నిర్మించేందుకు సీఎం పడుతున్న కష్టం గురించి మంత్రులు నారాయణ, పుల్లారావు వివరించారు.
 
 
రాజధాని కోసం వేలాది ఎకరాలను ఇచ్చిన రైతుల త్యాగనిరతిని కొనియాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యుత్తమ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అమరావతి అతి త్వరలోనే కళ్లెదుట నిలుస్తుందని సీఆర్‌డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు.అకుంఠిత దీక్షాదక్షతలతో తమ దేశాన్ని అభివృద్ధి చేసుకున్న సింగపూర్‌ ఇప్పుడు అంతే శ్రద్ధాసక్తులతో అమరావతిని నిర్మించేందుకు మనతో చేతులు కలపడం హర్షణీయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.
 
 
ఈ డీప్‌ డైవ్‌ వర్క్‌షాప్‌ తమకొక పరీక్ష లాంటిదని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో భూసమీకరణ, ప్లానింగ్‌, డిజైనింగ్‌ సమర్ధంగా పూర్తి చేశామని, నిర్మాణపనులు కూడా 10 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. రానున్న 12 నుంచి 14 నెలల్లో మరిన్ని నిర్మాణాలు కొలిక్కి వస్తాయన్నారు. ఆస్తానా, నయా రాయపూర్‌, పుత్రజయ వంటి ఇతర రాజధానీ నగరాలతో పోల్చితే అమరావతి నిర్మాణం చాలా వేగంగా సాగుతోందని చెప్పారు.
 
 
‘లక్ష్మీ పార్వతి’ని కాదు..
వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్నప్పుడు సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీ పార్థసారథి పేరును ‘లక్ష్మీ పార్వతి’గా సంబోధించారు! ఇలా ఒకసారి కాదు.. 3, 4 సార్లు జరిగింది! ఆ తర్వాత మాట్లాడిన లక్ష్మీ పార్థసారథి... సీఆర్డీయే కమిషనర్‌ పేరును ప్రస్తావించకుండా, కొందరు తన పేరును తప్పుగా పేర్కొంటున్నారని చెప్పారు. తన పేరు ‘లక్ష్మీ పార్థసారథి’ అని గమనించాలని కోరారు. ఇదే వేదిక నుంచి ప్రసంగించిన మంత్రి నారాయణ కూడా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ పేరును ‘శివరామ్‌’ కమిటీగా ఒకటికి రెండుసార్లు ప్రస్తావించడం సభికులను ఆశ్చర్యపరిచింది!
 
 
ఐకానికే కాదు...పవర్‌ హౌస్‌ కూడా..!
శాసనసభ కోసం రూపొందించిన 250 అడుగుల సమున్నత, సూదిమొనలాంటి టవర్‌ అశేష ప్రజల మన్ననలు చూరగొంటోంది. ఇది ఖరారైతే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐకానిక్‌ డిజైన్‌గా ఏపీ అసెంబ్లీని నిలపనుంది. అమరావతిలోని 2 ఐకానిక్‌ బిల్డింగుల్లో ఒకటైన అసెంబ్లీ కోసం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన చతురస్రాకారం, టవర్‌ డిజైన్లలో ఒకదానిని ప్రజాభిప్రాయం మేరకు ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఖరారు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీప్‌ డైవ్‌ వర్క్‌షాపులో ప్రసంగించిన ఫోస్టర్‌ సంస్థ నిపుణులు టవర్‌ డిజైన్‌ , భవంతి పైభాగాన వేలాది సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చన్నారు.
 
 
 
Link to comment
Share on other sites

రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో 217 చ.కి.మీ విస్తీర్ణంలో మొత్తం 1680 కి.మీ రహదారులు, డ్రెయిన్లు, మంచినీటి లైన్లు, విద్యుత్తు లైన్లు వేయనున్నట్లు తెలిపారు.

టవర్ల నిర్మాణం ప్రారంభమైంది: రాజధానిలో రూ.32వేల కోట్ల అంచనాలతో పనులు చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రధానమైన రహదారుల నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. 13 అంతస్తులతో 61 టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతినెల 4 అంతస్తుల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మొత్తం 3,480 అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు ఈ వసతిభవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Link to comment
Share on other sites

Data accessed by TNM shows there is a boom when it comes to vehicle registrations in Vijayawada, one of the cities closest to the upcoming Amaravati.
 
 
inside-vt.jpg?itok=5hGE8wpG

There were 3,73,320 more motorbikes on Vijayawada’s streets between 2016 and 2017 January, according to transport department data accessed by TNM. This is an increase of 73.5% from the previous year – there were just over 5 lakh bikes in the city in 2016. Between 2015 and 2016, the growth was just 6.17%.

Similarly, the number of cars in the city has also seen a sudden increase: Whereas, there were 61,422 cars in Vijayawada in 2016, in 2017, the number increased to 85,931, which is a 40% rise, compared to 9.72% in the previous year. 

It’s not just non transport vehicles like cars and bikes, even vehicles used for transporting goods have seen a significant increase of 15%, from 94,259 in 2016 to 1,08,441 in 2017. Between 2015 and 2016, the increase was less than 10%.

This boom in the number of vehicles in the city is directly linked to the construction of the new Andhra capital Amaravati, say people in the transport department. 

E Meera Prasad, Krishna district Deputy Transport Commissioner told TNM, “The shifting of the capital and the construction of the Secretariat has resulted in all-round development. This happened with transportation too. As a result, ownership of the vehicles has gone up.”

Speaking about non-transport vehicles, Meera Prasad said that since the land rates have increased in and around Vijayawada, people who sold off their land could have purchased vehicles.

Percentage%20_growth_autorickshaws_Vijay

Percentage_growth_motorbikes_vijayawada.

Percentage_growth_cars_Vijayawada.jpg

The swelling strength of Vijayawada’s traffic is evident in the city’s chaotic traffic jams during peak hours. This is especially prominent on routes that lead to the capital city of Amaravati. The metropolitan areas of Guntur and Vijayawada are closest to Amaravati’s border.

While the bifurcation of the state in itself had undeniably created a buzz among the cities in Andhra Pradesh like Vijayawada and Visakhapatnam, Chief Minister N Chandrababu Naidu's indication to shift his administrative base from Hyderabad to Amaravati might have also given impetus for the increase in the number of vehicles.

While transport vehicles include autorickshaws, goods carriages, school and college buses, cabs etc, non-transport vehicles include cars, motorbikes and tractor trailers, among others.

As of January 2016, transport officials in Vijayawada said that a total of 6,80,594 vehicles were plying the roads of the city. In the next year, this number increased to 9,86,870, which is an increase of 45%.

This figure is almost double that of 2010, just four years before the state’s bifurcation. In 2010, there were only 4,14,865 vehicles in the city.

However, there is a definite downside to the vehicle boom, say experts. 

Earlier this year, it was reported that Vijayawada had the highest level of PM10 in the state with 110 µg/m³, as compared to 90 u µg/m³ in 2011.

The state's Pollution Control Board (PCB) determines the Air Quality Index (AQI) of an area by breaking it down into PM2.5 and PM10 levels, where ‘PM’ stands for particulate matter, while the accompanying numbers give the size of these particles, which are measured in microns. 

The standard values of PM 2.5 and PM 10 that are considered acceptable are 60 and 100 micrograms per cubic metre (µg/m³) respectively.

According to data from the Ambient Air Quality Station at MC Guest House in Vijayawada, as of last month, the air quality index parameters were crossing the standard values every day during peak traffic hours.

Urban development experts feel that a continuous check on the transport system and adopting alternative transport means can reduce the traffic chaos, while also keeping another major issue – pollution – in check.

Link to comment
Share on other sites

CM Launched
Amaravati WebGIS
Amaravati Blockchain Asset Management System (BAMS)
Amaravati Building Information Model(BIM) based Building Approval System (BBAS)

WebGIS system is the backbone for both systems - also online.
------------------------------------------------------------
    Overall Master plan
    LPS Layouts
    Land Allocations
    Infrastructure Planning

 Base platform for all applications that require location services
    BIM based Building Approval System (BBAS)
    Amaravati Block Chain Asset Management System (BAMS)
    Land Registration Application for LPS layouts
    Mobile GIS Apps (Mana AMARAVATI)
    Online pdf generation with Aadhaar & plot coordinates for LPS layouts

https://gis.apcrda.org/PrintPlot/Index.html


Blockchain technology has been integrated into LPS plots.
---------------------------------------------------------
 Salient Features
    Blockchain Enforced Tamaper Proof System
    Immutable Records
    No Single Point of Failure Vulnerability
    Services to other applications through API's
 Secured data
    Geospatial co-ordinates to Identify the property accurately
    Plot Details
    Extent
    Owner Details / Aadhar 
    Past & Future Transactions
    Mutations and Registrations in Future
 Benefits to Citizens
    Hacker Proof and Tamper Proof land records
    Improved transparency and reduced scope for disputes
    Printed certificates of land records on blockchain system
    Efficient and convenient DaaS API's to verify details of a given property

Every (land)certificate created will have the log of the transaction in blockchain to ensure its data validity

Building Information Model(BIM) based Building Approval System (BBAS)
---------------------------------------------------------------------
 BIM is the future of planing smart cities.
    Complete 3D Building Information
    Models of all private development undertaken in the city
    Infrastructure plans of the overall city
    Integrated GIS System
    
    For CRDA: City scale modelling
        1. 3D visualization and dashboards that helps to engage decision makers
        2. Analytical and scenario planing for Infrastructure
        3. Operational monitoring that informs services & operations

    For citizens: Know your building
        1. 3D visualization of buildings 
        2. Reduction in contruction costs (upto 3-5% of building cost during construction)
        3. Digital availability of 3D designs for asset management and operations.
http://bbas.ap.gov.in:8085/BPAMSClient/default.aspx

 

:terrific::terrific:

Link to comment
Share on other sites

8 hours ago, AnnaGaru said:

CM Launched
Amaravati WebGIS
Amaravati Blockchain Asset Management System (BAMS)
Amaravati Building Information Model(BIM) based Building Approval System (BBAS)

WebGIS system is the backbone for both systems - also online.
------------------------------------------------------------
    Overall Master plan
    LPS Layouts
    Land Allocations
    Infrastructure Planning

 Base platform for all applications that require location services
    BIM based Building Approval System (BBAS)
    Amaravati Block Chain Asset Management System (BAMS)
    Land Registration Application for LPS layouts
    Mobile GIS Apps (Mana AMARAVATI)
    Online pdf generation with Aadhaar & plot coordinates for LPS layouts

https://gis.apcrda.org/PrintPlot/Index.html


Blockchain technology has been integrated into LPS plots.
---------------------------------------------------------
 Salient Features
    Blockchain Enforced Tamaper Proof System
    Immutable Records
    No Single Point of Failure Vulnerability
    Services to other applications through API's
 Secured data
    Geospatial co-ordinates to Identify the property accurately
    Plot Details
    Extent
    Owner Details / Aadhar 
    Past & Future Transactions
    Mutations and Registrations in Future
 Benefits to Citizens
    Hacker Proof and Tamper Proof land records
    Improved transparency and reduced scope for disputes
    Printed certificates of land records on blockchain system
    Efficient and convenient DaaS API's to verify details of a given property

Every (land)certificate created will have the log of the transaction in blockchain to ensure its data validity

Building Information Model(BIM) based Building Approval System (BBAS)
---------------------------------------------------------------------
 BIM is the future of planing smart cities.
    Complete 3D Building Information
    Models of all private development undertaken in the city
    Infrastructure plans of the overall city
    Integrated GIS System
    
    For CRDA: City scale modelling
        1. 3D visualization and dashboards that helps to engage decision makers
        2. Analytical and scenario planing for Infrastructure
        3. Operational monitoring that informs services & operations

    For citizens: Know your building
        1. 3D visualization of buildings 
        2. Reduction in contruction costs (upto 3-5% of building cost during construction)
        3. Digital availability of 3D designs for asset management and operations.
http://bbas.ap.gov.in:8085/BPAMSClient/default.aspx

 

:terrific::terrific:

Endi idi... India lo ee MNc company using ee Blockchain technology ni ee level lo :blink:

Edited by KaNTRhi
Link to comment
Share on other sites

శాసనసభకు టవర్‌ ఆకృతే!
నమూనాలు పరిశీలించిన ముఖ్యమంత్రి
15ap-main5a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో శాసనసభ భవనానికి సంబంధించి టవర్‌ ఆకృతే ఖరారు కానుంది. శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్‌లో సీఆర్‌డీఏ కార్యశాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... పరిపాలన నగర బృహత్‌ ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు ఆకృతులకు సంబంధించిన నమూనాల్ని పరిశీలించారు. వాటిలో చేసిన మార్పులు, చేర్పుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. పరిపాలన నగర బృహత్‌ ప్రణాళిక, హైకోర్టు భవనాల ఆకృతులు ఖరారయ్యాయి. 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగర ప్రణాళికను ఇప్పటికే ఖరారు చేయగా... తాజాగా అందులోని పార్కులు, రహదారుల ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, వివిధ కార్పొరేషన్ల కార్యాలయాల కోసం నిర్మించే టవర్లు ఒకే బ్లాక్‌లోకి వస్తాయి. ఇది వరకు శాసనసభ భవనాన్ని ఈ బ్లాక్‌లో ఒక చివరగా ప్రతిపాదించగా... ఇప్పుడు బ్లాక్‌ మధ్యలోకి తీసుకువచ్చారు. ఈ బ్లాక్‌ మొత్తం విస్తీర్ణం 250 ఎకరాలు. దానిలో 125 ఎకరాల్లో తటాకంలా ఏర్పాటు చేసి... దాని మధ్యలో శాసనసభ భవనాన్ని నిర్మిస్తారు. భవనం ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. టవర్‌ ఆకృతిలో రూపొందించిన శాసనసభ భవనం ఎత్తు 250 మీటర్లు ఉంటుంది. టవర్‌లో 40 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి నగరం మొత్తాన్ని వీక్షించే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాలు జరగని రోజుల్లో సందర్శకుల్ని అనుమతిస్తారని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శాసనసభ భవనం నాలుగు భాగాలుగా ఉంటుంది. శాసనసభ, శానమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్‌ హాల్‌, పరిపాలనా విభాగాలు ఉంటాయి. ఇవి నాలుగూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మధ్యలో మ్యూజియం ఉంటుంది.

68 శాతం మందిని ఆకట్టుకున్న టవర్‌
శాసనసభ భవనం కోసం రూపొందించిన రెండు ఆకృతులపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాభిప్రాయం కోరగా... శుక్రవారం సాయంత్రం వరకు 24,905 మంది స్పందించారని, వారిలో 17088 మంది టవర్‌ ఆకృతికి, 7817 మంది చతురస్రాకారపు ఆకృతికి మొగ్గు చూపారని మంత్రి నారాయణ తెలిపారు. టవర్‌ ఆకృతి 68 శాతం మందిని ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

15ap-main5b.jpg

15ap-main5c.jpg

15ap-main5d.jpg

Link to comment
Share on other sites

జధాని నిర్మాణం.. దేవుడిచ్చిన వరం
16-12-2017 02:44:33
 
636489890781131764.jpg
  • రాజధాని నిర్మాణంపై సీఎం వ్యాఖ్య
  • అత్యుత్తమ నగర నిర్మాణమే లక్ష్యమని ఉద్ఘాటన
  • అమరావతిలో ఆయుష్షు పెరుగుతుంది: బాబు
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని పేరుగాంచిన మేధావుల సూచనలు, సలహాలు తీసుకుని అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలో అమరావతి డీప్‌డైవ్‌ వర్క్‌షాపు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. నూతన నగరం నిర్మించడం భగవంతుడు తనకిచ్చిన వరంగా పేర్కొన్నారు.
 
ఎన్నో నగరాలు నిర్మించుకునే అవకాశం రావచ్చు గానీ.. పరిపాలన నగరాన్ని నిర్మించుకునే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. ‘సింగపూర్‌ వంటి అత్యుత్తమ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రజలకు మాటిచ్చాను. ఎందుకంటే సింగపూర్‌ అందమైన, అభివృద్ధి చెందిన, సురక్షితమైన నగరం. ఎన్నికలు పూర్తి కాగానే సింగపూర్‌ వెళ్లి అక్కడ ప్రధానిని రాజధాని కోసం బృహత్తర ప్రణాళిక అడిగాను. వారు సమ్మతించి ఆర్నెల్లల్లో అద్భుతమైన మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా ఇచ్చారు. వారికి ధన్యవాదాలు’ అని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రైతులు ఒక్క పిలుపుతో తనను నమ్మి 35 వేల ఎకరాలు భూమిని ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు.
 
ఏ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి భూసమీకరణ జరగలేదని.. ఇది అపూర్వమని పేర్కొన్నారు. ‘అమరావతికి నేను చాలా ఇవ్వాలి. దీనిని ప్రపంచశ్రేణి నగరం కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా నిర్మించాలని భావిస్తున్నాను. మరే నగరానికీ జలం, పచ్చదనం రెండూ లేవు. అవే అమరావతికి అదనపు వనరులు. ఇక్కడ నివసిస్తే మరో 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుంది’ అని వెల్లడించారు.
 
సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ప్రతి 6 నెలలకోసారి ఇలాంటి వర్క్‌షాపులను నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా.. ఇంధన పొదుపులో రాష్ట్రానికి జాతీయస్థాయిలో వరుసగా 3వ ఏడాది కూడా పురస్కారం లభించడాన్ని పురస్కరించుకుని అజయ్‌జైన్‌, సీఆర్డీయే మీడియా సలహాదారు చంద్రశేఖరరెడ్డిలను చంద్రబాబు అభినందించారు. వర్క్‌షాపులో 11 దేశాలకు చెందిన 400 మంది నిపుణులు హాజరయ్యారు.
 
మూడు యాప్‌లు ప్రారంభించిన సీఎం
ఈ సందర్భంగా సీఆర్డీయే రూపొందించిన 3 ప్రత్యేక యాప్‌లను చంద్రబాబు ప్రారంభించారు. సీఆర్డీయే ల్యాండ్‌ రికార్డులు, యాజమాన్య వివరాలు తదితరాలకు చెందిన డేటాను సురక్షితంగా ఉంచేందుకు రూపొందించిన ‘బ్లాక్‌ చైన్‌ బేస్డ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ (బీఏఎంఎస్ )ను, భవనాలకు సత్వరమే అనుమతులిచ్చేందుకు సింగిల్‌విండో విధానంలో రూపొందించిన ‘బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడల్‌ పర్మిట్‌ సిస్టం’ (బీఐఎంపీఎస్ )ను, రాజధానిలోని రైతులు ప్లాట్లు, ఖాళీ స్థలాలు, సరిహద్దులు, ఓవరాల్‌ మ్యాప్‌ ఇత్యాది అన్ని వివరాలనూ ఇట్టే తెలుసుకునే వీలు కల్పించే ‘వెబ్‌ బీఐఎస్‌ ఆన్‌లైన్‌ సిస్టం’ యాప్‌లను సీఎం ఆవిష్కరించారు.
Link to comment
Share on other sites

ఓటర్లకు రీకాల్‌ అధికారం
రాజధాని ప్రాంతానికి మహానగర స్థానిక ప్రభుత్వం
కీలక సేవలన్నీ ప్రైవేటు సంస్థలు, సొసైటీలకు
దార్శనికపత్రం రూపొందించిన సీఆర్‌డీఏ

ఈనాడు అమరావతి: అమరావతి నగర నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిపుణులతో ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించింది. ‘అమరావతి డీప్‌ డైవ్‌’ పేరుతో నిర్వహించిన సదస్సులో వివిధ అంశాలపై రూపొందించిన దార్శనిక పత్రాలపై చర్చ జరిగింది. అమరావతిలో పరిపాలనకు సంబంధించి కీలక ప్రతిపాదనలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..!

* 2050 నాటికి అమరావతితో పాటు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలన్నీ కలిపి రాజధాని ప్రాంతం మొత్తానికి ఒక ‘యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ లోకల్‌ గవర్నమెంట్‌’ (సమీకృత మహానగర స్థానిక ప్రభుత్వం)ని ఏర్పాటు చేయాలి. దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాల్ని 9 పరిపాలనా జోన్లుగా విభజించాలి.

* ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, సిబ్బంది ఓటర్లకు జవాబుదారీగా ఉండాలి. పనితీరు బాగాలేనివారిని ‘రీకాల్‌’ చేసే అధికారం ఓటర్లకు ఉండాలి. ఆరు నెలలకు ఒకసారి వార్డు సభలు నిర్వహించి వారు నిర్ణయం తీసుకోవచ్చు.

* రవాణా, తాగునీరు, మురుగునీరు, పారిశ్రామిక మౌలిక వసతులు, విద్యుత్‌ వంటి వ్యవస్థల నిర్వహణను రింగ్‌ ఫెన్స్‌డ్‌ ఎంటిటీస్‌(కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రత్యేక వాహక సంస్థలు వంటివి)కి అప్పగించాలి.

* సమీప భవిష్యత్తులో రాజధాని నగరంలో పురపాలక సేవల నిర్వహణకు ‘అమరావతి సిటీ కౌన్సిల్‌’ని ఏర్పాటు చేయాలి.

* రాజధాని అమరావతిలో జనాభా ఒక స్థాయికి వచ్చిన వెంటనే అమరావతి మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.

* అమరావతి మున్సిపల్‌ కౌన్సిల్‌ పరిధి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. క్రమంగా సీఆర్‌డీఏ ప్రాంత పరిధి పెంచుకుని, మెట్రోపాలిటన్‌ లోకల్‌ గవర్నమెంట్‌గా ఆవిర్భవించాలి.

Link to comment
Share on other sites

భద్రంగా రాజధాని భూములు
త్రీడీ విధానంలో భవనాలు, నిర్మాణ చిత్రాలు
మూడు వెబ్‌సైట్లు ప్రారంభించిన సీఎం

ఈనాడు-అమరావతి: అమరావతి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు సాంకేతిక విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూముల సమగ్ర సమాచారాన్ని రైతులు, అవసరమైన వారు ఆన్‌లైన్‌లోనే తీసుకునే వీలుగా వీటిని తయారు చేశారు.

అమరావతి వెబ్‌ జీఐఎస్‌: రాజధాని ప్రాంత మాస్టర్‌ప్లాన్‌ మొత్తం ఇందులో ఉంటుంది. లేఔట్లు, భూమి కేటాయింపులు, మౌలిక సౌకర్యాల ప్రణాళిక  కన్పిస్తాయి. ఆధార్‌తో తమకు కావాల్సిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే పీడీఎఫ్‌ రూపంలో తీసుకోవచ్చు.

వెబ్‌ చిరునామా: https://gis.apcrda.org/printplot/index.html

భూముల సమాచారం, భద్రతకు..
బ్లాక్‌చైన్‌: ఇది భూములకు సంబంధించిన సమాచారానికి పూర్తి భద్రత కల్పించే సాంకేతిక విధానం. హ్యాక్‌ చేయలేరు. నకిలీవి సృష్టించలేరు. వివాదాలకు తావులేకుండా సమాచారాన్ని అందిస్తుంది. ఏదైనా ఒక స్థలాన్ని ఎంచుకోగానే దాని యజమాని, విస్తీర్ణం, హద్దులు కన్పిస్తాయి. భవిష్యత్తులో సవరణలు, రిజిస్ట్రేషన్లు చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి తెస్తారు. భూములు, స్థలాల దస్తావేజులు, ఇతర పత్రాలను ప్రింటు తీసుకోవచ్చు.

వెబ్‌ చిరునామా: https://gis.apcrda.org/LPS/index.html

అమరావతి భవన సమాచారం: దేశంలోనే మొదటిసారిగా ఈ వ్యవస్థను రాజధానిలో ప్రారంభించారు. మొత్తం ప్రాంతంలో ఏ మూల ఏముందో చెప్పేస్తుంది. భవనాల అంతస్తులు, గోడలు, తలుపులు, కిటికీలు పూర్తి వివరాలను త్రీడీ రూపంలో చూడొచ్చు. రహదారులు, భూగర్భ మురుగు కాల్వలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థ, వాటి సెన్సర్లు, మీటర్లు ఏ ప్రాంతంలో బిగించారనే వివరాలు కన్పిస్తాయి. ఏదైనా ప్రాంతంలో నిర్మాణం చేయాలన్నా, తవ్వకాలు చేపట్టాలన్నా భూమిలోపల ఏముందో తెలియజేస్తుంది. వెబ్‌ చిరునామా: http://bbas.ap.gov.in:8085/BP AMSClient/default.aspx

Link to comment
Share on other sites

20 ఏళ్ల అదనపు ఆయుర్దాయం
కాలుష్యరహిత నగరంగా  రాజధాని అమరావతి నిర్మాణం
సీఆర్‌డీఏ కార్యశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు - అమరావతి

‘‘సారవంతమైన నేల.. 30 కిలోమీటర్ల కృష్ణా తీరం.. చుట్టూ కాల్వలు.. ఏడాది పొడవునా పచ్చదనం.. నదిలో జలరవాణా.. ఎక్కడ నుంచి ఎక్కడికైనా 30 నిమిషాల్లో చేరుకునే అంతర్గత రవాణా వ్యవస్థ.. ఇక్కడంతా కాలుష్య రహితం. వీటన్నింటి కారణంగా అమరావతిలో జీవిస్తే 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యశాల ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రెండురోజుల పాటు జరిగిన మేధోమథనానికి వివిధ దేశాలతోపాటు పలు రాష్ట్రాల నుంచి నిపుణులు హాజరవడంపై ఆయన సంతోషం వెలిబుచ్చారు. ఇందులో చర్చించిన అంశాలు, చేసిన సూచనలు రాజధాని నిర్మాణంలో అమలు చేస్తామన్నారు. ‘‘ఇది ఆరంభం మాత్రమే.. కలసి ప్రయాణం చేద్దాం.. వచ్చే ఏడాది మరోసారి సమావేశమై సమీక్షించుకుందాం’’ అని సూచించారు. అమరావతిని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఇతర ఐటీ కంపెనీల రాక, హైటెక్‌సిటీ, సైబరాబాద్‌ తదితర అభివృద్ధిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పేరున్న సలహాదారులకే పనుల అప్పగింత
రాజధాని నిర్మాణ పనుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న సలహాదారుల్ని ఆహ్వానించి అప్పగించినట్లు వివరించారు. నార్మన్‌ఫోస్టర్స్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన రాజధాని ఆకృతులను ప్రస్తావించారు. ప్రపంచంలో అయిదు ఉత్తమ నిర్మాణాల్లో అమరావతి ఒకటి కావాలని అభిలషించారు. రాజధాని నిర్మాణం తనకు దేవుడిచ్చిన అవకాశంగా ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ప్రశంసించారు. అమరావతి నిర్మాణంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటూ ముందుకెళ్తానని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లే
రాష్ట్రంలో విద్యారంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించి ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. దాని ఫలితమే ప్రపంచంలో ఏ విమానాశ్రయానికి వెళ్లినా అమరావతి వాసులే కన్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. సిలికాన్‌ వ్యాలీలో అధికంగా సంపాదించే వారిలో మనవారే ముందుంటున్నారని కితాబిచ్చారు.

Link to comment
Share on other sites

Economic Development Initiatives under Implementation in Amaravati

 

Organization                                                                          Activity                              Acres           Investment    Employment

VIT- AP                                                                      Integrated University                     200                 3700                 8000

Indo-UK Institute of Health                                             Healthcare Project                      150                 1000                10000

National Institute of Design (NID)                                     Design Institute                         50                   108                    90

Andhra Pradesh Human Resources                                HRD Training Institute                    25                    50                    80

Development Institute (APHRDI)

Tirumala Tirupati Devasthanam                                              Temple                                25                   80                    120

Central Institute of Tool Design (CITD)                            Tool Design Institute                     5                    20                     30

SRM University                                                              Integrated University                   200                3400                 6300

Amrita University                                                           Integrated University                   200                2200                12000

Central Public Works Department (CPWD)                     GPOA & GPRA Complexes                 28                1600                 5551

Reserve Bank of India                                                    State Head Quarters                      11                 160                  426

BRS Medicity Healthcare & Research Pvt Ltd                      Healthcare Project                      100                5450                6700

Sub-divisional Police Office,                                       Sub Divisional Police Office &              1.5                  40                  429

Thullur &Traffic Police Station                                        Traffic Police Station

Indian Navy                                                                 Boat Rescue Training                     15                 150                 1300

                                                                                 Institute & State Office 

National Institute of Fashion (NIFT)                             Fashion Designing Institute               10                 NA                   NA

Kendriya Vidhyalaya - 1                                                      Central School                          5                  16                    50

Kendriya Vidhyalaya - 2                                                          Central                                5                  16                    50

Bureau of Indian Standards                                                     Office                                0.3                 15                   40

Department of Posts                                                               Office                                5.5                 97                  300

National Bio-diversity Museum                                               Museum                               25                150                  250

Food Corporation of India                                                       Office                                 1.1                11                   100

Life Insurance Corporation of India                                          Office                                0.75               22                   250

State Bank of India                                                       Office/Residential                         3.3                350                  600

Andhra Bank                                                                Office/Residential                         2.65              100                  400

Bank of India                                                                Office/Residential                         1.5                14                   100

NABARD                                                                       Office/Residential                         4.3               197                  300

State Archeological Museum                                                  Museum                                 8                200                  400

AP State Civil Supplies Corporation                                          Office                                  0.4                40                   NA

Comptroller & Auditor General of India                            Office/Residential                          17               500                  2048

Rail India Technical Economic Services (RITES)                        Office                                   1                 35                    200

Dr.B.R.Ambedkar Smruti Vanam                                       Smruthi Vanam                           20               200                    50

State Forensic Science Laboratory                                           Office                                   3                254                    80

New India Assurance Company Ltd.                                 Office/Residential                       1.93               93                    935

Hindusthan Petroleum Corporation Ltd.                                    Office                                 0.5               20                     20

Syndicate Bank                                                                     Office                                 1.3                65                    202

Andhra Pradesh Non-Residential                                             Office                                   5               350                   5000

Telugu (APNRT) Society

Andhra Pradesh Cooperative Bank Ltd.                             Office/Residential                         4                 85                    225

Nandamuri Basavataraka                                                      Hospital                               15                400                   800

Rama Rao Memorial Cancer Foundation

Xavier School of Management                                              Education                             50                250                    400

LV Prasad Eye Institute  Quartenary Care                               Hospital                              12                 250                   200

Gopichand Badminton Academy                                     Badminton Academy                    12                  41                    80

Brahmakumaris Society                                                   Spiritual Center                         10                 220                   80

MICE Hub                                                                   Convention center &                     42                1220                2000

                                                                                entertainment activities 

3-Star Hotels - 4                                                                    Hotels                          1 for each           240                  200

4-Star Hotel                                                                          Hotels                                2                  120                  100

5-Star Hotel                                                                          Hotels                                4                  200                  150

International & National Schools                                             Schools                     3 to 8 acres each     400                 1000

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...