Jump to content

Amaravati


Recommended Posts

హెచ్‌సీఎల్‌కు 20 ఎకరాలు
 
 
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని ఐటీ హబ్‌గా అభివృద్ధి పరచాలని గట్టిపట్టుదలపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌)కు అమరావతిలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో 20 ఎకరాలను కేటాయించింది. ఎకరం రూ.50 లక్షల చొప్పున ఈ భూములను ఇవ్వనున్నట్లు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కొద్ది రోజుల కిందటే విజయవాడకు సమీపంలోని గన్నవరంలో జాతీయ రహదారి పక్కన సుమారు 27 ఎకరాలను ప్రభుత్వం హెచ్‌సీఎల్‌కు కేటాయించిన సంగతి విదితమే. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 7500కి ఉపాధి లభించనుంది.
Link to comment
Share on other sites

ఎక్కడి పనులు అక్కడే గప్‌చుప్‌!
రాజధానిలో మొదలు కాని ప్రైవేటు ప్రాజెక్టులు
భూములు తీసుకుని జాప్యం చేస్తున్న సంస్థలు
5ap-main9a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రాజెక్టులతో పాటు, ప్రైవేటు ప్రాజెక్టుల్లో కూడా చాలా జాప్యం జరుగుతోంది. భూములు తీసుకున్న సంస్థలు పనులు ప్రారంభించడంలో తాత్సారం చేస్తున్నాయి. బీఆర్‌ షెట్టి, ఇండో యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, అమృత యూనివర్సిటీలు రాజధానిలో ఇప్పటికే భూములు తీసుకున్నాయి. బీఆర్‌ షెట్టి, ఇండో యూకే ప్రాజెక్టులకు, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు.

బీఆర్‌ షెట్టి మెడిసిటీ: అబుదాబికి చెందిన బీఆర్‌ షెట్టి సంస్థ రాజధానిలో మెడిసిటీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రాజధానికి వస్తామని ఆ సంస్థ చెప్పి ఏడాదిన్నర దాటింది. ప్రతిపాదన దశలోనే చాలా జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఆ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) 100 ఎకరాలు కేటాయించింది. బీఆర్‌ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టుకు ఆగస్టు రెండో వారంలో శంకుస్థాపన జరిగింది. తొలి దశలో రూ.6,500 కోట్లు పెట్టుబడి పెడతామని బీఆర్‌ షెట్టి ప్రకటించారు.

5ap-main9b.jpg

ప్రస్తుత పరిస్థితి: సీఆర్‌డీఏ భూమి అప్పగించింది. అమ్మకపు ఒప్పందం జరగాల్సి ఉంది. తమ పెట్టుబడులకు రిజర్వు బ్యాంకు నుంచి కొన్ని అనుమతులు కావలసి ఉందని, ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడానికి సమయం పడుతోందని బీఆర్‌ షెట్టి సంస్థ చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అబుదాబీలో పర్యటించినప్పుడు బీఆర్‌ షెట్టితో రాజధానిలో మెడిసిటీ ప్రాజెక్టు ప్రస్తావనా వచ్చింది. ఒక గుత్తేదారు సంస్థను ఎంపిక చేశామని, ప్రణాళిక సిద్ధమవుతోందని షెట్టి చెప్పారు. ఇప్పుడు గుత్తేదారు ఎంపిక కోసం మళ్లీ టెండర్లు పిలవనున్నట్టు ఆ సంస్థ చెబుతోందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. మరో నెలా, రెండు నెలల్లో పనులు మొదలు కావొచ్చునని భావిస్తున్నారు.
ఐయూఐహెచ్‌: బ్రిటన్‌కు చెందిన ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కాలేజీ హాస్పిటల్‌ భాగస్వామ్యంతో మెడిసిటీ ప్రాజెక్టు చేపడుతోంది. ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 50 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో మరో 100 ఎకరాలు ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన జరిగింది.

ప్రస్తుత పరిస్థితి: సీఆర్‌డీఏ భూమి అప్పగించింది. అమ్మకపు ఒప్పందం ఇంకా జరగలేదు. ఇండో-యూకే సంస్థ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ఇటీవల సీఎం చంద్రబాబు లండన్‌కు వెళ్లినప్పుడు ఆ సంస్థ సీఈఓ అజయ్‌ రాజన్‌గుప్తా ఆయనతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పనులు వేగంగా చేపడతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలు మొదలవలేదు.

అమృత యూనివర్సిటీ: అమృత యూనివర్సిటీకి సీఆర్‌డీఏ తొలి దశలో 150 ఎకరాలు కేటాయించింది. రెండో దశలో మరో 50 ఎకరాలు ఇస్తుంది.
ప్రస్తుత పరిస్థితి: ఆ సంస్థకు చాలా రోజుల క్రితమే సీఆర్‌డీఏ భూమి అప్పగించింది. కానీ ఇంత వరకు శంకుస్థాపన జరగలేదు. మంచి రోజుల కోసం చూస్తున్నారని, సంక్రాంతి తర్వాత శంకుస్థాన కార్యక్రమం ఉండొచ్చని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. నేల చదును చేయడం, విద్యుత్‌, నీటి సరఫరా లైన్లు ఏర్పాటు, అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం వంటి ప్రాథమిక పనుల దశలోనే ఉంది.

స్టార్టప్‌ ప్రాంతం: అమరావతిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఎంపికైంది. 2017 మేలో శంకుస్థాపన జరిగింది.

ప్రస్తుత పరిస్థితి: ఇంత వరకు ఒక్క ఇటుకరాయి కూడా పడలేదు. పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రే తొందర పెడుతున్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని కన్సార్టియం చెబుతోందిగానీ, ఆ దిశగా ఇంకా పూర్తిస్థాయిలో సన్నాహాలు కనిపించడం లేదు.

Link to comment
Share on other sites

మార్చి ఆఖరుకు సెంట్రల్‌ పార్క్‌ తొలిదశ పూర్తి
07-12-2017 07:21:45
 
636482281061600616.jpg
  • మెత్తం 300 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం సహా పలు ఆకర్షణలు
  • తొలి విడతలో 49 ఎకరాల్లో రోజ్ గార్డెన్,విల్డర్‌నెస్ పార్క్, క్రాఫ్ట్స్ బజార్ సిద్ధం
  • మలి దశల్లో వినోదం, జలక్రీడలు, రిసార్టు, స్టార్ హోటళ్లు
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి) అమరావతి ప్రత్యేకతను నలుదిశలా చాటే ఆకర్షణల్లో ప్రధానమైనదిగా భావిస్తున్న ‘అమరావతి సెంట్రల్‌ పార్క్‌ (ఇటీవలి వరకు దీనిని శాఖమూరు రీజియనల్‌ పార్కుగా వ్యవహరించేవారు)’లో తొలిదశ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. రాజధాని గ్రామాల్లో ఒకటైన శాఖమూరు వద్ద మొత్తం 300ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ ఉద్యానవనంలో 49ఎకరాల్లో తొలి దశను 3, 4 నెలల్లోపే అభివృద్ధి పరచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. 
సందర్శకులకు విరామం, వినోదం, థ్రిల్‌, ఆతిథ్యం అందించేందుకు ఉద్దేశించిన ఈ భారీ ఉద్యానవనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని అభివృద్ధి పరచేందుకు నిర్ణయించిన ఏడీసీ ఆయా రంగాల్లో అనుభవం ఉన్న ప్రముఖ నిర్మాణసంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోయూ- ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)ను ఇప్పటికే కోరింది. ‘టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్స్‌’లో భాగంగా అభివృద్ధి పరుస్తున్న ఈ పార్కులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ భారీ విగ్రహంతో కూడిన స్మృతివనాన్ని 20 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా.. ఈ పార్కులో తొలిదశలో భాగంగా రోజ్‌గార్డెన్‌, విల్డ ర్‌నెస్‌ పార్క్‌ (అడవుల ను తలపించే ప్రదేశం), క్రాఫ్ట్స్‌బజార్‌ (శిల్పారామం తరహాలో హస్తకళాకృతులు, ఇతర కళారూపాల ప్రదర్శన, అమ్మకాలకు ఉద్దేశించిన ప్రాంతం) కొలువు దీరనున్నాయి. ఇవి సిద్ధమైన తర్వాత జలక్రీడలు, సాహసక్రీడలు, వినోద కేంద్రాలు, స్టార్‌ హోటళ్లు వంటి ఎన్నెన్నో ఆకర్షణలు వరుస వెంబడి రానున్నాయి.
 
చెరువు తవ్వకాల మట్టితోనే అభివృద్ధి!
తొలిదశకు నిర్దేశించిన ప్రదేశాల్లో ఆయా అవసరాలకు అనుగుణంగా నేలను చదును చేయడం, మెరక తోలడం ఇత్యాది పనులు ఏడీసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే ఇవి పూర్తి కానున్నాయి. ఆ వెంటనే వాటిల్లో కొలువు దీరబోయే వాటి కోసం ఏడీసీ టెండర్లు ఆహ్వానించనుంది. మరొక పక్క.. ప్రస్తుతం జరుగుతున్న పనులకు అవసరమైన మట్టిని ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకు రావడం కాకుండా అమరావతి సెంట్రల్‌ పార్క్‌ మధ్యభాగంలో సుమారు 52ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జలాశయం కోసం జరుపుతున్న తవ్వకాల నుంచి వచ్చిన దానినే వినియోగిస్తుండడం విశేషం! తద్వారా మట్టి తరలింపునకు అయ్యే లక్షలాది రూపాయల వ్యయాన్ని ఏడీసీ పొదుపు చేస్తోంది.
 
20 ఎకరాల్లో రోజ్‌ గార్డెన్‌
దేశ, విదేశాలకు చెందిన వందలాది విలక్షణ, ఆకర్షణీయ గులాబీ జాతులతో అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకోనున్న ఈ రోజ్‌ గార్డెన్‌కు ప్రఖ్యాతి చెందిన ఆర్కిటెక్ట్‌ నితీశ్‌ రాయ్‌ డిజైన్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ ఎన్టీఆర్‌ ఘాట్‌ సహా దేశంలోని పేరొందిన ఎన్నో సందర్శనీయ స్థలాలు, ఉద్యానవనాల ఆకృతులను ఈయనే రూపొందించారు. ప్రస్తుతం ఈ గులాబీల తోట ప్రదేశాన్ని అనువైన విధంగా తీర్చిదిద్దే మట్టి పనులు జోరుగా సాగుతున్నాయి.
 
22 ఎకరాల్లో విల్డర్‌నెస్‌ పార్క్‌
రాజధాని ప్రాంతంలో అటవీ వాతావరణాన్ని తలపింపజేసేలా దీనిని దట్టమైన వృక్షాలతో తీర్చిదిద్దనున్నారు. పూర్తిస్థాయిలో ఇది రూపుదిద్దుకున్న తర్వాత దీనిలోకి అడుగుపెట్టిన వారికి తామేదో ఫారెస్ట్‌లో ఉన్న భావన కలిగించడం ధ్యేయంగా ఏడీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో ఏర్పాటవబోయే నక్షత్ర వనాలు, రాశి వనాలు ఇత్యాదివి దీని ప్రత్యేకతలను మరింతగా పెంచనున్నాయి.
 
7 ఎకరాల్లో క్రాఫ్ట్స్‌బజార్‌
రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలకు చెందిన సుందర హస్తకళాకృతులు, కళారూపాలను ప్రదర్శించడంతోపాటు క్రయవిక్రయాలకూ వీలు కల్పించేలా దీనిని అభివృద్ధి పరచనున్నారు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేసే సందర్శకుల మదిని దోచే ఇతర ఆకర్షణలనూ దీనిలో ఏర్పాటు చేస్తారు
Link to comment
Share on other sites

జపాన్‌ సంస్థ ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ
అమరావతి: జపాన్‌కు చెందిన కుని ఉమి ఎస్పెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయం పరిసర ప్రాంతాల్లో తరలించగలిగే పెవిలియన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ఐటీ స్పేస్‌ నిర్మాణం, నెస్ట్స్‌ జనరేషన్‌ ఆటో ఎలెక్టిక్‌ వెహికిల్‌ మోడల్‌ సిటీ నిర్మాణానికి ఈ సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం. ఆధునాతన వసతులు, మౌలిక వసతులతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని లోకేశ్‌ వారికి తెలిపారు.గృహ సదుపాయంతో కూడిన ఐటీ పార్కుల అభివృద్ధి కోసం ఐఐటీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.

 

 
 
 
Link to comment
Share on other sites

అమరావతిలో జపాన్‌ స్థిరాస్తి ప్రాజెక్టు!
లోకేశ్‌తో కుని ఉమి ఎస్సెట్స్‌ ప్రతినిధుల భేటీ

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన కుని ఉమి ఎస్సెట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. గురువారం సచివాలయంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. గృహ నిర్మాణం, ఐటీ కార్యాలయాలు, ఆటో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మోడల్‌ నగర నిర్మాణంపై ఆ సంస్థ ఆసక్తి తెలిపింది. సమగ్ర ప్రతిపాదనలతో ముందుకు రావాలని లోకేశ్‌ వారికి సూచించారు. రాష్ట్రంలో త్వరలోనే విద్యుత్తు వాహనాలకు సంబంధించి ఒక విధానం తీసుకువస్తామని వివరించారు.
* సాఫ్ట్‌వేర్‌, ఏరోస్పేస్‌, ఐఓటీ, టర్బో జెట్‌ సెన్సార్ల తయారీలో అనుభవమున్న హనీవెల్‌ కంపెనీ భారత ఉపాధ్యక్షుడు అక్షయ్‌ మంత్రి  గురువారం లోకేశ్‌తో సమావేశమయ్యారు. రైతులకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో భూసార పరీక్షలు, నేలలో తేమ తదితరాలు తెలుసుకునే సెన్సార్లు రూపొందించాలని లోకేశ్‌ వారిని కోరారు. త్వరలోనే తమ బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని అక్షయ్‌ తెలిపారు.
* రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధుల బృందం గురువారం లోకేశ్‌తో సమావేశమైంది. స్పోర్ట్స్‌ ఎరీనాల నిర్మాణంలో రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

Link to comment
Share on other sites

అమరావతి రైలు మార్గానికి ఆర్థికంగా సహకరించాలి
ఏపీ ప్రభుత్వ సీఎస్‌ను కోరిన దక్షిణమధ్యరైల్వే జీఎం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని రైలు మార్గంతో అనుసంధానించే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని రైల్వేశాఖ కోరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,200 కోట్ల వ్యయం కానుందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేశ్‌కుమార్‌తో దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ వెలగపూడి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. అమరావతి రైలు మార్గం నిర్మాణం కోసం అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించాలని కోరారు. ప్రాజెక్టు చేపట్టేందుకు జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుచేయాలని జీఎం అడిగారు. అమరావతి అనుసంధాన రైలు ప్రాజెక్టు ప్రతిపాదనల్ని ఆమోదం కోసం రైల్వేబోర్డుకు పంపామని వివరించారు. దీంతోపాటుగా ఏపీలో వివిధ రైల్వేప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం, భూసేకరణ సమస్యలపై సీఎస్‌ దృష్టికి వినోద్‌కుమార్‌ యాదవ్‌ తీసుకెళ్లారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల వ్యయంలో ప్రాధాన్యతలను తెలపాలని కోరారు. నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం నిర్మాణంలో గుంటూరు జిల్లాలో 38.5 ఎకరాల భూసమీకరణ ఆలస్యం కారణంగా పనులపై ప్రభావం పడుతుందని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు విజయ్‌అగర్వాల్‌, పి.శ్రీనివాస్‌, ఆర్‌.ధనుంజయ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో కొరియన్‌ సిటీ
08-12-2017 02:20:30
 
636482964321592828.jpg
  • పారిశ్రామికవేత్తలు సానుకూలం.. 8 వేల కోట్ల పెట్టుబడులు
  • కియ సంస్థలతో డీల్‌.. ఎల్‌జీ, హ్యుండయ్‌ వస్తాయి: సీఎం
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో సింగపూర్‌ సిటీ తరహాలో కొరియన్‌ సిటీని అభివృద్ధి చేయాలని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలను కోరాం. మా ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించారు. అమరావతిలో వీలైనన్ని దేశాలు భాగస్వామ్యమైతే అది అంతర్జాతీయ నగరం అవుతుంది.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దక్షిణ కొరియా పర్యటన విశేషాలను వెల్లడించారు. దక్షిణ కొరియా పర్యటనలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా చేయగలిగామని సీఎం వెల్లడించారు.
Link to comment
Share on other sites

మరావతికి స్టార్ హోటళ్లు వచ్చేస్తున్నాయ్!
09-12-2017 08:15:25
 
636484041264894167.jpg
 
అమరావతి: అమరావతిలో స్టార్‌ హోటళ్లు, పాఠశాలలను స్థాపించాలన్న ఆసక్తి ఉన్న ప్రముఖ సంస్థలతో ఏపీసీఆర్డీయే అధికారులు విజయవాడలోని తమ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చర్చలు జరిపారు. వీటికి పలు జాతీయ, అంతర్జాతీయ హోటల్‌ గ్రూపులతోపాటు దేశ, విదేశాల్లో విద్యారంగంలో పేరొందిన ఇన్‌స్టిట్యూషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి అమరావతిలో ఆతిథ్య, విద్యారంగాలకు ఉన్న అపారావకాశాల గురించి సీఆర్డీయే ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు తమ గ్రూపులకు సంబంధించిన వివరాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లను ఇచ్చారు. అనంతరం వారిలో కొందరు వ్యక్తం చేసిన అనుమానాలు, సందేహాలను సీఆర్డీయే అధికారులు నివృత్తి చేశారు. కొందరు తమకు కేటాయించబోయే భూముల ధరలు, ఇతర అంశాలకు సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వగా, పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
 
 
           రాజధానిలో వివిధ క్యాటగిరీల స్టార్‌ హోటళ్లను సాధ్యమైనంత త్వరగా స్థాపింపజేయడం ద్వారా అమరావతిలో ఆర్ధిక కార్యకలాపాలకు ఊపు తేవడంతోపాటు క్రమేణా దానికి పెరగబోయే సందర్శకులకు మెరుగైన వసతి లభించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం విదితమే. అమరావతిని అంతర్జాతీయస్థాయి విద్యాకేంద్రంగా మలచేందుకు దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్కూళ్ల యాజమాన్యాలతో ఇక్కడ క్యాంపస్‌లను నెలకొల్పేలా చేయాలని కూడా అది అనుకుంటున్న విషయం విదితమే. ఇందుకోసం సీఆర్డీయే ఇటీవల తగిన అర్హతలున్న సంస్థలను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సమావేశం నిర్వహించింది.
 
 
రాజధాని ప్రాంత రవాణా ప్రణాళికపై..
కాగా.. అమరావతితోపాటు రాజధాని ప్రాంతం మొత్తానికీ అధునాతన, సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యతలను స్వీకరించిన జపాన్‌ అధికారులు ఈ విషయమై సీఆర్డీయే ఉన్నతాధికారులతో శుక్రవారం విస్తృత చర్చలు జరిపారు. రాజధాని ప్రాంత పరిస్థితులు, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్‌ రద్దీ ఇత్యాది విషయాల గురించి తెలుసుకున్న జపాన్‌ బృందం సభ్యులు పరిస్థితి మెరుగుదలకు ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై సీఆర్డీయే అధికారులతో చర్చించారు.
Link to comment
Share on other sites

పరుగులు పెడుతున్న, అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు...

   
amaravati-09122017-1.jpg
share.png

రాజధానికే తలమానికమైన సీడ్ యాక్సెస్ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. బ్లూ అండ్ గ్రీన్ సిటీలో భాగంగా అమరావతిని బ్లూ సిటీగా మార్చటంలో ఈ రోడ్డు ముఖ్య పాత్ర పోషించనుంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సహా మొత్తం 8 ప్రాధాన్య రహదారులు వచ్చే ఏడాది జనవరి ఆఖరుకల్లా పూర్తి కానున్నాయి. ఈ రోడ్లను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తుం డడంతోపాటు ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా లేని విధంగా, నిర్మాణ సమయంలోనే వాటి వెంబడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ల పక్కన పలు రకాలకు చెందిన వేలాది మొక్కలను పెంచనుండడం ఓ ప్రత్యేకత! దాదాపు ఎక్కడా మలుపుల్లేకుండా, సువిశాలంగా రూపుదాల్చుతుండడం ఇంకో విశేషం..

 

amaravati 09122017 2

ప్రాధాన్య రహదారులుగా వ్యవహరిస్తున్న ఈ 8 రోడ్లలో రాజధానికి జీవరేఖగా అభివ ర్ణితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు మరో 7 రహదా రులున్నాయి. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ రహదారి అమ రావతిలోని తూ ర్పు- పడమర దిక్కులను కలుపుతూ ఉండగా, మిగిలిన వాటిల్లో 4 ఉత్తరం నుంచి ద క్షిణ దిశ లను, 3 తూర్పు- పశ్చిమ ప్రాంతాలను అనుసం ధానిస్తున్నాయి. ఈ రోడ్లన్నింటి పొడవు మొత్తం 85.17 కిలో మీటర్లు కాగా, వీటి మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,306 కోట్లు. వర్షపు నీరు నిలిచి, రోడ్లు పాడవడాన్ని నిరోధించేందుకు స్మార్ట్‌ వాటర్‌ డ్రెయిన్లను ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే లీకులకు తద్వారా కలుషిత మయ్యేందుకు ఆస్కారం లేని విధంగా తాగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

amaravati 09122017 3

విద్యుత్తు, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) కోసం యుటిలిటీ డక్టులను నిర్మించనున్నారు. వాడిన జలాలను రీసైక్లింగ్‌ చేసి టాయ్‌ లెట్‌ ఫ్లషింగ్‌, గార్డెనింగ్‌, ల్యాం డ్‌స్కేపింగ్‌ తదితర అవసరాలకు ఉప యో గించుకు నేందుకు వీలు కల్పించే రీయూజ్డ్‌ వాటర్‌ పైపులైన్లనూ నిర్మించనున్నారు. పాదచారులు, సైక్లిస్టుల కోసం వేర్వేరు మార్గాలు, నేత్రపర్వం కలిగించే అవెన్యూ ప్లాంటేషన్‌, నాణ్యమైన స్ట్రీట్‌ ఫర్నిచర్‌ తదితరాలూ ఈ రోడ్ల పక్కన కొలువు దీరనున్నాయి. భూఉపరితలంపై ఎక్కడా కనిపించకుండా, భూగర్భంగుండానే సాగే విద్యుత్తు సరఫరా వ్యవస్థను కల్పించనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతిలో పెన్సిల్వేనియా వర్సిటీ!
10-12-2017 03:27:31
 
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ నెల 14న పెన్సిల్వేని యా వర్సిటీ బృందం విజయవాడకు రానుంది. అమరావతిలో వర్సిటీని స్థాపించడంపై రాష్ట్ర ఆర్థిక మండలితో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ వర్సిటీలో లక్ష మంది రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసే పనికి పూనుకున్నట్టు ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ చెప్పారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...