Jump to content

Amaravati


Recommended Posts

 

అమరావతి డిజైన్లపై సీఎం సంతృప్తి

25-10-2017 22:22:36

 

 

లండన్‌: అమరావతి డిజైన్లపై ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సమర్పించిన నివేదికలపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన మార్పులు చేసి తుదిరూపు ఇవ్వాలని నిర్దేశించారు. ఐదు టవర్లుగా సచివాలయం నిర్మించాలని, సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. హైకోర్టు భవన డిజైన్‌ తుదిరూపానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ డిజైన్‌లో స్వల్పమార్పులు సూచించారు.

మంత్రుల ఆఫీసులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల ఆఫీసులకు 4 భారీ టవర్లు ఏర్పాటుచేయాలని, వీటికి కొంచెం దూరంలో సీఎం కార్యాలయం, సీఎం కార్యదర్శుల ఆఫీసులు ఉండాలని సూచించారు. పరిపాలన శాఖ కార్యాలయం కోసం మరో టవర్‌ను నిర్మిస్తామన్నారు. త్వరలో భవన సముదాయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. పరిపాలన నగర నిర్మాణంలో జాప్యం చేయొద్దని సీఎం భావిస్తున్నారు.

Ye building ki? 13 vunnayi list lo. Avi kakunda ee roju paper lo inkoka kottha design kuda vesaru. Public voting ani cheppi eeyana endhuku design changes chesthunnadu finalize avvakunda?
Link to comment
Share on other sites

హైకోర్టు ఆకృతి ఖరారు!

స్థూపాకార రూపానికే చంద్రబాబు మొగ్గు

కొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి

శాసనసభకు చతురస్ర, స్తంభాకృతులు సిద్ధం చేయాలని సూచన

వాటిని పూర్తిగా పరిశీలించాక తుది నిర్ణయం

5 టవర్లుగా సచివాలయం, విభాగాధిపతుల భవనాలు

ఈనాడు - అమరావతి

25ap-main5a.jpg

రాజధాని అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే హైకోర్టు భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ స్థూపాకారంలో రూపొందించిన ఈ ఆకృతి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకట్టుకుంది. కొన్ని చిన్న చిన్న మార్పులతో ఆయన దీనినే దాదాపు ఖాయం చేశారు. ముఖద్వారాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, భవనం లోపలి ఇతర భాగాల్లోను కొన్ని మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ భవనం ఆకృతిపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తాజాగా రూపొందించిన కింద సన్నగా, పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉండే చతురస్రాకారపు ఆకృతితో పాటు, గతంలో భవనం పైన పొడవైన స్తంభం (టవర్‌)తో రూపొందించిన ఆకృతులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ రెండింటిని మరింత మెరుగుపరచి తీసుకురావాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన వెంట వెళ్లిన ఇతర ప్రతినిధులు బుధవారం మరోసారి లండన్‌లోని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కార్యాలయంలో శాసనసభ, హైకోర్టు ఆకృతులపై సంస్థ ప్రతినిధులతో కూలంకషంగా చర్చించారు. వీటితో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అన్న అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం మొత్తం ఐదు టవర్లు నిర్మించాలని నిర్ణయించారు. శాసనసభ కోసం ఇప్పుడు రూపొందించిన రెండు ఆకృతుల్లో స్థూపాకార ఆకృతిని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ ఆకృతి మరింత ఆకట్టుకునేలా, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. ‘‘రెండు ఆకృతులపై విపులంగా అధ్యయనం చేసి, ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరిచిన నమూనాలు తీసుకురండి. అప్పుడు తుది నిర్ణయం తీసుకుందాం...’’ అని ఆయన తెలిపారు. స్థంభాకార ఆకృతితో భవన నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుందని, నిర్వహణ కూడా వ్యయంతో కూడుకున్న వ్యవహారమన్న ప్రస్తావన వచ్చింది. ఈ ఆకృతులు అద్భుతంగా రూపొందిస్తే, వ్యయం గురించి తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇప్పటి వరకు రూపొందించిన ఆకృతులపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయం కోరగా భవనంపై పొడవైన స్థంభంతో రూపొందించిన ఆకృతికే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మెరుగుపరచాలని సూచించారు.

25ap-main5b.jpg

25ap-main5c.jpg

20-25 అంతస్తులతో సచివాలయ భవనాలు

* సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాలు ఒక్కొక్కటి 20-25 అంతస్తులతో ఐదు టవర్లుగా నిర్మాణం.

* మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం నాలుగు టవర్లు. ఒక భవనంలోంచి మరో భవనంలోకి వెళ్లేలా అనుసంధానం.

* ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కొంచెం ఎడంగా మరో టవర్‌. సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం కూడా ఇందులోనే.

* ఈ ఐదు టవర్లను ఒకే వరుసలో రూపొందించాలా, రెండు రెండు టవర్లు ఎదురెదురుగా ఉండేలా నిర్మించాలా? అన్న అంశంపై చర్చ.

* రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం సూచన.

* ఈ టవర్లు పరిపాలన నగరంలో ఎక్కడ రావాలన్న విషయంలోనూ కొన్ని ఆప్షన్లు సిద్ధం చేయాలి.

* ఐదు టవర్లూ ఒకే ఆకృతిలో ఉండాలా? ఒక్కో టవర్‌ ఒక్కో ఆకృతిలో ఉండాలా? అన్న అంశంపైనా ప్రతిపాదనలు అందజేయాలి.

పరిపాలన నగర నిర్మాణం విషయంలో ఇక జాప్యం చేయడానికి వీల్లేదని, వెంటనే పనులు మొదలు పెట్టేలా శాసనసభ, హైకోర్టు భవనాలు తుది ఆకృతుల్ని త్వరలోనే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తనకు చూపించాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఆర్కిటెక్ట్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో ఆకృతులు సిద్ధమయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆకృతులు, శిల్ప రూపాలపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని, రాజధాని సలహా కమిటీ సూచనల్ని, ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్‌ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సినీ దర్శకుడు రాజమౌళికి సీఎం చంద్రబాబు సూచించారు.

25ap-main5d.jpg

చరిత్రలో నిలిచిపోవాలి

అంతకు ముందు నార్మన్‌ రాబర్ట్‌ ఫోస్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అత్యద్భుతమైన రాజధానిని నిర్మించేందుకే ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వస్తోంది. ఐదు కోట్ల ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. విలక్షణమైన నమూనాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణ శైలి, ఆకృతులు అసాధారణ రీతిలో ఉండాలి. దాని కోసమే ఇంత కష్టపడుతున్నాం. అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందజేస్తారనే మీకు బాధ్యత అప్పగించాం. దాన్ని నిలబెట్టేలా తుది ఆకృతులు ఉండాలి. మీరిచ్చే ఆకృతులు, ప్రణాళికలతో చరిత్రలో నిలిచిపోతారు...’’ అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

మనకూ ఓ జూ కావాలి!

 

  • కోరుకుంటున్న జంతు ప్రేమికులు
  • జంతు ప్రదర్శనశాలకు భూమి కొరత లేదనే అభిప్రాయం
  • రాజధాని వాసుల్లోనూ ఆసక్తి

 

(ఆంధ్రజ్యోతి, అమరావతి)
పచ్చదనం-జల వనరులు(బ్లూ-గ్రీన్‌ కాన్సెప్ట్‌), అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య, ఆర్థిక, ఐటీ తదితర సంస్థల ఏర్పాటుతో అమరావతిని యావత్ప్రపంచం అబ్బురంగా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని... ఓ జంతు ప్రదర్శనశాల (జూ) కూడా ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంతవాసులు కోరుతున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ విశాఖపట్నం, తిరుపతిలలో ఇవి ఉన్నప్పటికీ విజయవాడ- గుంటూరు ప్రాంతాల్లో లేవు. దీంతో, అటవీ జంతువులను ప్రత్యక్షంగా తిలకించే అవకాశానికి ఈ ప్రాంతవాసులు నోచుకోలేకపోతున్నారు. అయితే, అమరావతి నిర్మాణంతో ‘జూ’ ఏర్పాటుపై స్థానికుల్లో ఆసక్తి కలిగింది. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం సుమారు 33,000 ఎకరాలను సమీకరించగలగడంతోపాటు అమరావతి ప్రాంతంలో వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన దాదాపు 12,000 ఎకరాలు కూడా దశలవారీగా దఖలు పడనున్నాయన్న వార్తలు ప్రజల్లో ‘జూ’ ఏర్పాటు సాధ్యమేనన్న ఆశాభావాన్ని పెంచింది. అంతే కాకుండా రాజధానికి చుట్టుపక్కల ఉన్న సుమారు 29,000 ఎకరాల అటవీ భూమిని డైవర్షన్‌ (మళ్లింపు) చేసి, తమకు ఇస్తే అమరావతి ప్రాజెక్ట్‌ను మరింతగా దిగ్విజయం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేస్తున్న యత్నాలు సైతం క్రమంగా ఫలిస్తుండడంతో రాజధానిలో భూమికి కొరత లేదన్న అభిప్రాయాన్ని కలిగించింది.
 
ఇతర రాష్ర్టాల్లో ఇదీ పరిస్థితి...
జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు వందల ఎకరాలు అవసరం లేదని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. భారతదేశంలో అతి పెద్దవిగా పేరొందిన చెన్నైలోని వడలూరు జూ(1300 ఎకరాలు), భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జూ(990 ఎకరాలు), విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ(625), జునాగఢ్‌లోని శక్కర్‌బాగ్‌ జూలాజికల్‌ గార్డెన్‌(490), హైదరాబాద్‌లోని నెహ్రూ జూ(380) భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయకపోయినా ఎంత ప్రసిద్ధి చెందాయో, సమర్థ నిర్వహణ ద్వారా అంతకంటే విస్తీర్ణంలో చిన్నవైన మైసూర్‌ జూ (245), న్యూఢిల్లీ జూ (176), పుణే జూ (165), పట్నా జూ (153.) కూడా వాటి స్థాయిలోనే ఎన్నెన్నో జంతువులు, పక్షిజాతులకు నెలవై ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిన్నింటినీ మించి కేవలం 71.6 ఎకరాల్లోనే కొలువుదీరిన లఖ్‌నవ్‌ జూ కూడా ప్రశంసలు చూరగొంటోందన్న విషయాన్ని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ నిధుల కొరతను అధికారులు కారణంగా చూపుదామన్నా రాజధానిలో పలు రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు పలు దేశ, విదేశీ సంస్థలు రూ.వేల కోట్లు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నందున నిధుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నమవదంటున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...