Jump to content

Amaravati


Recommended Posts

 ప్రభుత్వంతో కలిసే సాగుతాం
 

 
  • మా బృందం ఇచ్చిన నివేదిక పరిశీలించలేదు!
  •  అమరావతికి నిధులపై..
  • ఎలాంటి ప్రభావమూ ఉండదు
  •  ప్రపంచ బ్యాంకు స్పష్టీకరణ
ఆంధ్రజ్యోతి, అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి అందించే రుణ సహాయ నిధులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో ఇటీవల పర్యటించిన బ్యాంకు బృందం ఇచ్చిన నివేదికను ఇంకా పరిశీలించలేదని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, బృందం సమర్పించిన నివేదికను కొందరు కావాలనే బహిర్గతం చేశారని పేర్కొంది. రాజధాని గ్రామాల్లో తమ పరిశీలనా బృందం ఇటీవల జరిపిన పర్యటన కేవలం తమ రుణసహాయంతో ఆ ప్రాంతంలో చేపడుతున్న పనులు నియమ నిబంధనలను అనుసరించి జరుగుతున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించడానికి ఉద్దేశించినదే తప్ప రుణ మంజూరు ప్రక్రియతో దానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. అందువల్ల అది సమర్పించే నివేదిక తాము రుణం సమకూర్చుతున్న ‘అమరావతి సస్టెయినబుల్‌ క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఏఎస్‌సీసీడీపీ)’పై ఎంతమాత్రం పడబోదని తెలిపింది. నివేదికతో సంబంధం లేకుండా తమ బ్యాంక్‌ ఈ ప్రాజెక్ట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్‌ ఫైనాన్స్‌ చేసే ప్రాజెక్టులపై వాటివల్ల ప్రభావితమయ్యే ప్రజల అభిప్రాయాలు, ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై పరిశీలన జరిపించడం ఎక్కడైనా తాము చేసేదేనని, ఒక వేళ నివేదికను పరిశీలించిన బ్యాంక్‌ బోర్డు దానిపై విచారణ జరపాలనుకుంటే అది పూర్తయి, ఆ నివేదిక అందేసరికి చాలా నెలలు పడుతుందని పేర్కొన్న బ్యాంక్‌ ఈ ప్రక్రియ అమరావతి ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని వివరించింది.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యేల ఇళ్లకు.. నేడు డిజైన్లు ఖరారు
 
 
636432866416102484.jpg
  • రాజధాని పరిధిలో 15 సంస్థలకు భూములు
  • 4500 అపార్టుమెంట్ల నిర్మాణం
  • మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో 15 సంస్థలకు 152.93 ఎకరాల మేరకు రాష్ట్ర కేబినెట్‌ భూ కేటాయింపులు జరిపినట్లు పురపాలక మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆ సంస్థల కార్యకలాపాలను బట్టి లీజుకు, ఉచితంగా, నామమాత్రపు ధర, మార్కెట్‌ ధరలకు ఇస్తున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులకు గృహసముదాయాల నిర్మాణ డిజైన్లు సిద్ధమయ్యాయని అన్నారు. ఢిల్లీకి చెందిన ఆర్కాప్‌ సంస్థ 10 డిజైన్లను రూపొందించిందని, వాటిని మంగళవారం కేబినెట్‌ భేటీలో ప్రదర్శించారని విలేకరులకు తెలిపారు. బుధవారం అమరావతి డే సందర్భంగా సీఎం చంద్రబాబుతో సమావేశమవుతున్నామని, వీటిలో ఏదో ఒక డిజైన్‌ను ఆయన ఖరారు చేస్తారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 4,500 అపార్ట్‌మెంట్లను నిర్మించనన్నట్లు తెలిపారు. ఈపీసీ మోడల్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 18 నెలల్లో ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
 
భూ కేటాయింపులు ఇలా..
అంబేద్కర్‌ స్మృతివనం: 20 ఎకరాలు
హెచ్‌పీసీఎల్‌: అర ఎకరం
కాగ్‌ కార్యాలయం:17ఎకరాలు (60ఏళ్లు లీజుకు)
రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌: 3 ఎకరాలు
న్యూఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ: 1.93 ఎకరాలు
సిండికేట్‌ బ్యాంకు: 1.3 ఎకరాలు
ఎపీఎన్‌ఆర్‌టీ సొసైటీ: 5 ఎకరాలు
రాష్ట్ర సహకార బ్యాంకు: 4 ఎకరాలు
బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి: 15 ఎకరాలు
జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌: 50 ఎకరాలు
ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌: 12 ఎకరాలు
గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ: 12 ఎకరాలు
బ్రహ్మకుమారి సొసైటీ: 10 ఎకరాలు
బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌: 1000 చ.గ.
రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌(రైట్స్‌): ఒక ఎకరం (ఉచితంగా)
 
కాగా, పేదలకు నాణ్యమైన ఇళ్లు అందించడం కోసమే అర్బన్‌ హౌసింగ్‌ నిర్మాణంలో షేర్‌వాల్‌ టెక్నాలజీ వాడినట్లు మంత్రి నారా యణ చెప్పారు. పేదల ఇళ్ల నాణ్య తలో రాజీలేకుండా నిర్మిస్తున్నామన్నారు.
Link to comment
Share on other sites

రూ.2652 కోట్లతో రాజధానిలో ఇళ్లు

అంచనా వ్యయం రూ.661 కోట్లు పెంపు

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు 61 టవర్ల నిర్మాణం

11ap-main10a.jpg

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేటగిరీల ఉద్యోగుల కోసం చేపట్టనున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,652 కోట్లకు పెరిగింది. ఒక్కొక్కటి జీ+12 పద్ధతిలో మొత్తం 61 టవర్లు నిర్మిస్తారు. వీటిలో వివిధ కేటగిరీలకు చెందిన 3,840 ఫ్లాట్లు ఉంటాయి. టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. గుత్తేదారుల్ని ఎంపిక చేశారు. సవరించిన అంచనాలకు, టెండరు ప్రక్రియకు బుధవారం జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదముద్ర వేసింది. గతంలో గృహ నిర్మాణానికి రూ.1,991 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పటితో పోలిస్తే అంచనా వ్యయం రూ.661 కోట్లు పెరిగింది. మొత్తం నిర్మాణ ఏరియాను 76,81,500 చ.అడుగుల నుంచి 84,57,078 చ.అడుగులకు పెంచామని, పార్కింగ్‌ కోసం పోడియం ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం ఫ్లాట్ల సంఖ్యను మొదట అనుకున్న 3,820 నుంచి 3,840కి పెంచామని సీఆర్‌డీఏ అజెండాలో పేర్కొంది. గతంలో పన్నులు, డ్యూటీలు అంచనాల్లో చేర్చలేదని, ఇప్పుడు జీఎస్టీ వంటి పన్నులన్నీ కలిపి సవరించిన అంచనాలు రూపొందించామని పేర్కొంది. ఆరు నెలల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించింది.

గుత్తేదారులు వీరే...

గెజిటెడ్‌ అధికారులు టైప్‌-1, టైప్‌-2, నాలుగోతరగతి ఉద్యోగుల గృహ నిర్మాణానికి షాపూర్జీ పల్లోంజీ సంస్థ గుత్తేదారుగా ఎంపికైంది. ప్రభుత్వం నిర్ణయించిన టెండరు విలువ (ఐబీఎం వాల్యూ) కంటే 3.73 శాతం ఎక్కువకి పని దక్కించుకుంది. నాన్‌గెజిటెడ్‌ అధికారుల గృహ నిర్మాణానికి గుత్తేదారుగా ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఎంపికైంది. ఆ సంస్థ 3.95 శాతం ఎక్కువకు పొందింది. ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల ఇళ్ల నిర్మాణానికి ఎన్‌సీసీ సంస్థ ఎంపికైంది. ఆ సంస్థ 4.59 శాతం ఎక్కువకి దక్కించుకుంది.

మేం చాలా నేర్చుకుంటున్నాం

అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ద్వారా తాము మరింత నేర్చుకుంటున్నామని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ ఛాంగ్‌ తెలిపారు. సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు చెందిన ముఖ్యులతో ఏర్పాటైన రాజధాని పనుల సంయుక్త అమలు సాధికార కమిటీ (జేఐసీసీ) సమావేశం వచ్చే నెలలో జరగాల్సి ఉందని ఆయన ప్రస్తావించారు.

11ap-main10b.jpg

 

పది రకాల ఆకృతులు

శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారుల అపార్ట్‌మెంట్లు, మంత్రుల బంగ్లాలకు సంబంధించి తాము రూపొందించిన 10 రకాల ఆకృతులను టీమ్‌ వన్‌ ఇండియా సంస్థ ఈ సమావేశంలో ప్రదర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో బ్లాక్‌కి ఒక నిర్మాణ శైలి ఉపయోగించుకునేలా తుది ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ‘‘విదేశీ పర్యటన నుంచి వచ్చాక రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అన్ని కన్సల్టెన్సీ సంస్థలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాను. రాజధాని నిర్మాణం కీలక దశకు చేరుకున్నందున పురోగతి ఎలా ఉందో, ఏ దశలో ఉన్నామో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నారు. అమరావతిలో ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధి, బాహ్య, అంతర వలయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై వచ్చే సమావేశంలో సమగ్ర వివరాలతో రావాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

వేగం పెంచండి.. పురోగతి కనిపించాలి

అంకుర ప్రాంత అభివృద్ధి పనులపై కన్సార్టియం ప్రతినిధులకు సీఎం సూచన

సింగపూర్‌ ప్రధాని వచ్చే అవకాశం ఉందని వెల్లడి

ఈనాడు - అమరావతి

11ap-main14a.jpg

రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులు వేగంగా మొదలు పెట్టాలని ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్‌ సంస్థల కన్సార్టియంకి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే గణతంత్ర దినోత్సవానికి భారతదేశ అతిథిగా సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ హూంగ్‌ వస్తున్నారని, ఆయన అమరావతిని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వచ్చే సమయానికి స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి మంచి పురోగతి కనిపించాలని స్పష్టంచేశారు. అవసరమైన ప్రక్రియలన్నీ దాదాపుగా పూర్తయ్యాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సింగపూర్‌ కన్సార్టియం ముఖ్య కార్యనిర్వహణాధికారి బెంజమిన్‌ యాప్‌ తెలిపారు. విజయవాడలో త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తున్నామని, అమరావతిలోను ప్రాజెక్టు ఆఫీసు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది.

పాఠశాలల ఏర్పాటుకు 8 సంస్థలకు స్థలాలు: అమరావతిలో అంతర్జాతీయ, జాతీయ పాఠశాలల ఏర్పాటుకి 8 సంస్థలకు 46 ఎకరాల స్థలం కేటాయించారు. కొన్ని సంస్థలు రెండింటినీ నెలకొల్పుతుండగా కొన్ని ఒకదానిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 7 ఎకరాలు, చిన్మయ మిషన్‌ కు 3, ద హెరిటేజ్‌ స్కూల్‌కు 6, సద్భావన వరల్డ్‌ స్కూల్‌కు 4, రియాన్‌ గ్లోబల్‌ స్కూల్‌కు 7, పోదార్‌ స్కూల్‌కు 7, గ్లెండేల్‌ అకాడమీకి 8, జీఐఐఎస్‌ స్కూల్‌కు 4 కేటాయించారు. అమరావతిలో ఎక్కువ బోర్డింగ్‌ స్కూళ్లు వచ్చేలా ప్రోత్సహించాలని అప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉండి చదువుకోగలరని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సింగపూర్‌కి 123 మంది రైతులు: సింగపూర్‌ పర్యటనకు దరఖాస్తు చేసుకున్న 123 మంది రైతుల్నీ పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట 100 మందినే లాటరీ ద్వారా ఎంపిక చేసినా, మిగతా 23 మందినీ నిరాశపరచకుండా సింగపూర్‌ పంపించాలని సీఎం సూచించారు. దీనికి అదనంగా రూ.12 లక్షల నిధులు మంజూరు చేశారు. ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ అన్న విధానంతో యాత్ర నిర్వహించాలని సీఎం సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచన సాకారం చేయడానికి కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రైతుల అభివృద్ధి జరగాలన్నారు. ‘‘రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలు సేకరించాలి. వారిని చిన్న చిన్న బృందాలుగా చేసి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలి. కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీకి బాధ్యతలు అప్పగించండి’’ అని సీఎం ఆదేశించారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు..

* రాష్ట్రస్థాయి కమాండ్‌ కేంద్రం ఏర్పాటుకు 2 ఎకరాలు కేటాయింపు.

* శాఖమూరు పార్కులో అరుదైన పుష్పాలతో వనం ఏర్పాటుకు నిర్ణయం. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చాక శంకుస్థాపన.

* అమరావతి ఆకర్షణీయ నగర ప్రాజెక్టు కోసం ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు ఆమోదముద్ర.

* అనంతవరం దగ్గర రిజర్వాయర్‌ ప్రతిపాదన ఉపసంహరించుకున్నందున కేటాయించిన భూమిని వేరే అవసరాలకు వాడుకోవాలని నిర్ణయం.

* రాజధానిలో రవాణా ప్రాజెక్టుకి తాత్కాలిక ప్రాతిపదికన రెండేళ్ల పాటు సీఆర్‌డీఏలో ఉద్యోగుల నియామకం. పనితీరు బాగుంటే శాశ్వత ప్రాతిపదికన అవకాశం కల్పించాలని సీఎం స్పష్టీకరణ.

* సీఆర్‌డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచిన వివిధ పనులకు ఆమోదముద్ర.

అంకుర ప్రాంతంలో జాతీయస్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు 70 ఎకరాల్లో గోల్ఫ్‌కోర్సు ఏర్పాటుకు నిర్ణయం.

Link to comment
Share on other sites

నవంబరులో డిజైన్లు ఖరారు!

636433750810665047.jpg



  • ఆ వెంటనే రాజధాని నిర్మాణ పనులు
  • అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై తుది కసరత్తు
  • నేడు లండన్‌కు మంత్రి నారాయణ బృందం
  • పారిశ్రామికవేత్తలుగా రాజధాని రైతులు: సీఎం
  • డ్రాలో ఎంపిక కాని 23 మంది రైతులకూ సింగపూర్‌ చాన్స్‌

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్లపై తుది కసరత్తు ఊపందుకుంది. నవంబరు మొదటి వారంలో డిజైన్లను ఖరారు చేసి, వెనువెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వెలగపూడిలో బుధవారం సీఆర్డీయే అథారిటీ కమిటీ 12వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆకాంక్ష కార్యరూపం దాల్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.

 

సింగపూర్‌ యాత్రకు అర్హత సాధించిన 123 మంది రాజధాని రైతుల్లో 100 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ సీఎంకు తెలిపారు. మిగిలిన 23 మంది నిరుత్సాహపడకుండా వారినీ సింగపూర్‌ తీసుకువెళ్లేందుకు మరో రూ.12 లక్షలను కేటాయించాలన్న ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. ‘సాధికారత దిశగా రాజధాని రైతు యాత్ర’గా సింగపూర్‌ పర్యటనను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. రాజధాని గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగాల వైపు మళ్లే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలన్నారు. రైతులకు నైపుణ్య శిక్షణ, వ్యాపారావకాశాలు, పరిశ్రమల స్థాపనపై ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ ద్వారా విస్తృతావగాహన కల్పించాలన్నారు.

 

ప్రజాభిప్రాయం మేరకే ‘క్వార్టర్ల’ డిజైన్లు

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోల కోసం నిర్మించనున్న గృహ సముదాయాల నిర్మాణ బాధ్యతలను ఆయా టెండర్లను తక్కువకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ గృహ సముదాయాలకు సంబంధించిన అంతర్గత డిజైన్ల ఎంపిక పూర్తవగా, టీం వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన 10 బాహ్య డిజైన్ల (ఎలివేషన్‌)ను పరిశీలించిన చంద్రబాబు వాటన్నింటినీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచి, అత్యధికులకు నచ్చిన డిజైన్లను ఖరారు చేయాలని ఆదేశించారు.

 

6 నెలల్లో క్వార్టర్ల నిర్మాణాలు నిర్మాణ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోల కోసం మొత్తం 84,57,078 చదరపు అడుగుల్లో 3,820 ఫ్లాట్లను నిర్మించనున్నారు. వీటిల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల కోసం ఒక్కొక్కటి 3,500 చ.అ. విస్తీర్ణం ఉండే 432 లగ్జరీ ఫ్లాట్లను 18 టవర్లలో నిర్మిస్తారు. క్లబ్‌ హౌస్‌ వంటి అధునాతన సదుపాయాలు వీటిల్లో ఉంటాయి. టైప్‌-1 గెజిటెడ్‌ అధికారుల కోసం ఒక్కొక్కటి 1800 చ.అ. ఉండే ఫ్లాట్లను 8 టవర్లలో, టైప్‌-2 గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోసం ఒక్కొక్కటి 1500 చ.అ. ఉండే ఫ్లాట్లను 7 టవర్లలో, ఎన్జీవోల కోసం ఒక్కొక్కటి 1200 చ.అ. ఉండే ఫ్ట్లాట్లను 22 టవర్లలో, 4వ తరగతి ఉద్యోగుల కోసం 900 చ.అ. చొప్పున ఉండే ఫ్లాట్లను 6 టవర్లలో నిర్మించనున్నారు.

 

అమరావతిలో పాఠశాలల స్థాపనకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులున్న 8 సంస్థలకు మొత్తం 32 ఎకరాలను కేటాయించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. గ్లెండేల్‌ అకాడమీకి 8 ఎకరాలు (డే కం బోర్డింగ్‌ స్కూల్‌), స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు 4 ఎకరాలు, చిన్మయ మిషన్‌కు 3 ఎకరాలు, ది హెరిటేజ్‌ స్కూల్‌కు 2, సద్భావన వరల్డ్‌ స్కూల్‌కు 4, ర్యాన్‌ గ్లోబల్‌ స్కూల్‌కు 4, పోదార్‌ స్కూల్‌కు 3, జీఐఐఎ్‌సకు 4 ఎకరాలను కేటాయించారు. జాతీయస్థాయి క్రీడల నిర్వహణకు అనువుగా క్యాపిటల్‌ రీజియన్‌లో గోల్ఫ్‌ కోర్సు కోసం 70 ఎకరాలు, అమరావతిలో రాష్ట్ర స్థాయి కమాండ్‌ సెంటర్‌ కోసం 2 ఎకరాలను కేటాయించేందుకూ సీఎం ఆమోదం తెలిపారు.

 

తాను లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సీఆర్డీయే, ఏడీసీల్లోని వివిధ విభాగాలు నియమించుకున్న కన్సల్టెంట్ల పనితీరును సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. సీఆర్డీయే అథారిటీ కమిటీ సమావేశానంతరం పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడు నారాయణ విలేకరులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం తన సారధ్యంలో అధికారుల బృందం లండన్‌కు బయల్దేరుతోందని తెలిపారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి కూడా ఈ బృందంతోపాటు ఉంటారన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో తాము నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌తో రాజధానిలోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లపై చర్చిస్తామని చెప్పారు. తమ బృందం సూచనల మేరకు రూపొందించే డిజైన్లను ఈ నెల 24, 25 తేదీల్లో సీఎం లండన్‌కు వెళ్లి పరిశీలిస్తారని, తుది డిజైన్లను వచ్చే నెల మొదటి వారంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

Link to comment
Share on other sites

అమరావతి: రాజధాని నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని తుది డిజైన్ల కోసం ఏపీ ప్రభుత్వం బృందం లండన్ వెళ్లింది. ఈ బృందంలో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు అమరావతిలో వీఐపీ నివాసాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దర్శకుడు రాజమౌళి, మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు లండన్ వెళ్లారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పుడు మంత్రి నారాయణ, డీఆర్‌డీఏ అధికారులతో పాటు రాజమౌళి కూడా లండన్ వెళ్లారు. ఇప్పటికే నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల బృందానికి రాజమౌళి పలు సూచనలు చేశారు. ఈ బృందం మూడు రోజుల పాటు లండన్‌లోనే ఉంటుంది. అందరూ కూర్చొని చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతికొచ్చే న్యాయవాదుల అవసరాలు చూడండి

సీఎంకు న్యాయవాదుల సంఘం వినతిపత్రం

ఈనాడు, అమరావతి: అమరావతికి వచ్చే న్యాయవాదుల సంక్షేమానికి ట్రస్టు ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నివాస గృహాలు, కార్యాలయాల నిర్మాణం కోసం 100 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. రాజధానిలో న్యాయ నగరానికి భూమి కేటాయింపుపై హర్షం వెలిబుచ్చారు. ఇక్కడకు వచ్చేవారికి స్థానికత కల్పించాలని, ఆరోగ్యబీమా వర్తింపజేయాలన్నారు. 2013-14 నుం చి చెల్లింపు నిలిచిపోయిన రికరింగ్‌ గ్రాంటు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై సీఎం సా నుకూలంగా స్పందించినట్లు అధ్యక్ష కార్యదర్శులు ధనంజయ, జ్యోతిప్రసాద్‌, బాచిన హనుమంతరావు వివరించారు.

Link to comment
Share on other sites

రాజధాని అభివృద్ధి పనులపై మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: రాజధాని పరిధిలో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చేపట్టే అభివృద్ధి పనులపై మార్గదర్శకాలు బుధవారం వెలువడ్డాయి. రాజధానిలో వివిధ పనుల నిర్వహణను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాల అవసరాన్ని గుర్తించి రూపొందించారు.

 
Link to comment
Share on other sites

ఆరు నెలల్లో అమరావతి
 
 
636434443654223555.jpg
అమరావతి: డిజైన్లు ఖరారు కావడం అలస్యం అమరావతి నిర్మాణం పట్టాలెక్కబోతోంది. నెలాఖరులో లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తుది డిజైన్లను, నార్మల్ పోస్టర్స్ అందజేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరు నెలల్లో కట్టడాలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
 
నమూనాల్లోనే నలుగుతున్న కోర్ కేపిటల్ నిర్మాణం పట్టాలెక్కబోతోంది. డిజైన్లపై కసరత్తు తుది దశకు చేరుకుంది. మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం నార్మల్ పోస్టర్స్ సంస్థ ఏర్పాటు చేసిన వర్క్ షాపుల్లో పాల్గొంటోంది. ఈ బృందంలో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు.
 
Link to comment
Share on other sites

లేఅవుట్ల అభివృద్ధి సంస్థల ఎంపిక
 
 
  • మేఘా, బీఎస్సార్‌, ఎన్‌సీసీలకు ఒక్కో జోన్‌
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాజధానికి భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన జోన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే సంస్థలను టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసింది. జోన్‌ 1, 2, 3లను వరుసగా మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, బీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌, ఎన్‌.సి.సి. లిమిటెడ్‌ దక్కించుకున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జోన్లను ఇవి 3 ఏళ్ల నిర్దిష్ట కాలవ్యవధిలోగా సమగ్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
 
  • నెక్కల్లు, శాఖమూరు, యూ-2, మాస్టర్‌ ప్లాన్‌ లేఅవుట్లు కలిపి మొత్తం 2144.40 ఎకరాల (8.68 చదరపు కిలోమీటర్లు)లో విస్తరించి, 2050 నాటికి 2,37,030 మంది నివసిస్తారని అంచనా వేసిన జోన్‌-1 అభివృద్ధికి రూ.652.88 కోట్ల అంచనా వ్యయంతో ఏపీసీఆర్డీయే టెండర్లు పిలిచింది. మేఘా సంస్థ 4.10 శాతం ఎక్సె్‌సకు... అంటే రూ.679.65 లక్షలకు టెండర్‌ వేసి వీటిని దక్కించుకుంది.
  • నేలపాడు, శాఖమూరు, నెక్కల్లు, తుళ్లూరు, అనంతవరం, యూ-2, మాస్టర్‌ ప్లాన్‌ ప్రదేశాలు కలిపి మొత్తం 2085.49 ఎకరాలు జోన్‌-2లో ఉన్నాయి. 2050 నాటికి ఇందులో మొత్తం 2,36,704 మంది నివసిస్తారని అంచనా. రూ.698.21 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీయే టెండర్లు పిలవగా 3.94 శాతం అధిక ధర (రూ.725.72 కోట్లు) కోట్‌ చేసిన బీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఈ బిడ్‌ను చేజిక్కించుకుంది.
  •  నేలపాడు, శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి(భాగాలు)ల్లోని మొత్తం 1313.66 ఎకరాలను కలిగి ఉన్న ఈ జోన్‌లో 2050 నాటికి 1,73,005 మంది నివసిస్తారని అధికారులు అంచనా వేశారు. రూ.626.61 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీయే టెండర్లు పిలవగా, 4.32 శాతం ఎక్సెస్‌ (రూ.653.68 కోట్లు) ధర కోట్‌ చేసిన ఎన్‌.సి.సి. లిమిటెడ్‌కు ఇది దక్కింది.
Link to comment
Share on other sites

జోన్ల అభివృద్ధికి త్వరలో టెండర్లు

‘హ్యామ్‌’ విధానానికి పచ్చజెండా

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌లలో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో (హెచ్‌ఏఎం-హ్యామ్‌) ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టే గుత్తేదారు సంస్థలకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చెల్లించాల్సిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వనుంది. మన రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల్ని హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో సీఆర్‌డీఏ ప్రత్యేకంగా విధివిధానాలు రూపొందించింది. వాటికి ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదముద్ర వేసింది. రాజధానిలోని మొత్తం ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లను 13 జోన్లుగా విభజించారు. వాటిలో ఏడు జోన్లను హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో ఐదు జోన్లకు ఈ విధానంలో టెండర్లు పిలిచేందుకు అథారిటీ పచ్చజెండా వూపింది.

ఎవరి వాటా ఎంత?

జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రహదారుల నిర్మాణాలకు హ్యామ్‌ విధానం అనుసరిస్తుంది. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐతో పాటు, నీతి అయోగ్‌ నిర్దేశించిన మార్గదర్శకాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. సీఆర్‌డీఏ తరపున కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ వీటిని రూపొందించింది. దీని ప్రకారం ఎల్‌పీఎస్‌ లేవుట్‌ల అభివృద్ధి ప్రాజెక్టు కాలావ్యవధి 13 సంవత్సరాలుగా నిర్ణయించింది. గుత్తేదారు సంస్థ మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, ఆ తర్వాత పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతనూ చూసుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఆ సమయంలో వడ్డీ, మూలధనం, నిర్వహణ, ఇతర వ్యయాలు కలిపి బిడ్‌ దాఖలు చేయాలి. బిడ్‌లో కోట్‌ చేసే విలువ సీఆర్‌డీఏ నిర్ణయించిన అంచనా వ్యయాన్ని మించి ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. సీఆర్‌డీఏ తన వాటా 49 శాతాన్ని ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే చెల్లిస్తుంది. అభివృద్ధిదారు వెచ్చించే 51 శాతం మొత్తాన్ని నిర్మాణం పూర్తయినప్పటి నుంచి పదేళ్లలో తిరిగి చెల్లిస్తుంది. ఏడాదికి రెండు దఫాలు చొప్పున, 20 వాయిదాల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అభివృద్ధిదారు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఖాతా ద్వారా వాయిదా మొత్తాన్ని సీఆర్‌డీఏ చెల్లిస్తుంది.

హ్యామ్‌ విధానంలో చేపట్టే ప్రాజెక్టులు ఇవీ..!

రాజధానిలో 13 ఎల్‌పీఎస్‌ జోన్లకుగాను 4, 5, 7, 9, 10, 12, 12ఎ జోన్లను హ్యామ్‌ విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో జోన్‌-4 (అంచనా వ్యయం రూ.817 కోట్లు), జోన్‌-5 (రూ.2383 కోట్లు), జోన్‌-9 (రూ.3714 కోట్లు), జోన్‌-12 (రూ.2265 కోట్లు), జోన్‌-12ఎ (రూ.1,567 కోట్లు) అభివృద్ధికి తొలి దశలో త్వరలో టెండర్లు పిలవనున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...