Jump to content

Amaravati


Recommended Posts

సీఆర్డీఏపై సీఎం సమీక్ష

అమరావతి: రాజధాని ఆకృతులపై అక్టోబర్‌ 24,25 తేదీల్లో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 25న పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ ప్రతినిధులు తుది ఆకృతులను సీఎంకు సమర్పిస్తారు. ఈలోగా అక్టోబర్‌ 11,12,13 తేదీల్లో అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై కార్యగోష్ఠి జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు సినీ దర్శకుడు రాజమౌళి సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు సీఆర్డీఏపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతిలో విద్యాలయాలు ఏర్పాటుకు 25 అగ్రశ్రేణి సంస్థల ప్రతిపాదనలపై చర్చించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌,ఐకానిక్‌ వారధుల నిర్మాణ పురోగతిని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి వివరించారు. ప్రణాళికల స్థాయి నుంచి బయటపడి పనులు ప్రారంభించాలని పార్థసారథికి ముఖ్యమంత్రి సూచించారు.

Link to comment
Share on other sites

ప్రతి పనిలో జాప్యమా?

ప్రణాళికల దశ నుంచి బయట పడండి

నిర్మాణ పనులు వేగవంతం చేయండి

అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

హోటళ్లకు స్థలాల కేటాయింపులో ఆలస్యంపై అసహనం

రాజధాని నిర్మాణాన్ని సాధారణ ప్రాజెక్టుగా తీసుకోవద్దని స్పష్టీకరణ

ఈనాడు - అమరావతి

నేను దిల్లీ వెళ్లినప్పుడు రాజధాని పనులు మొదలయ్యాయా అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నన్ను ఆరా తీశారు. పనులు ఇంత నెమ్మదిగా జరుగుతుంటే నేను ఏం సమాధానం చెప్పగలను! ఈ పరిస్థితులు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. విజయవాడలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మంచి అవకాశాలు. వీటిని పర్యాటక ఈవెంట్లుగా మలచడంలో దేవాదాయ, పర్యాటక, పురపాలక శాఖల అధికారులు విఫలమయ్యారు.
- చంద్రబాబు

రాజధాని అమరావతిలో హోటళ్లకు స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం, వివిధ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి చిన్న విషయంపైనా తన స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘ఇలాంటివన్నీ మీరు చూసుకోవాల’ని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణను ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలోని తన కార్యాయంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. ప్రణాళికల దశ నుంచి బయటపడి ఇక సత్వరం పనులు ప్రారంభించాలని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ‘‘రాజధాని నిర్మాణాన్ని ఏదో ఒక సాధారణ ప్రాజెక్టుగా తీసుకోవడం సరికాదు. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకదాన్ని నిర్మిస్తున్నామన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కన్సల్టెన్సీ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఆయా సంస్థల్లో అత్యుత్తమ మేధస్సు ఉన్నవారిని అమరావతి నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. దేవాదాయ, పర్యాటక, పురపాలక శాఖలపైనా సీఎం అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్లాను. లక్షల్లో భక్తులు వస్తున్నారు. అక్కడ దర్శనానికి ఏర్పాట్లు బాగానే చేశారు. కానీ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడ వస్తున్న భక్తులు ఒకటి రెండు రోజులు ఇక్కడ బస చేసేలా ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేయాల్సింది. పవిత్ర సంగమం వద్దకు వెళ్లేందుకు, ఇతర పర్యాటక ప్రదేశాల్ని తిలకించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే బాగుండేది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వూపందుకునేలా వినియోగించుకోవాలన్నదే నా ఆలోచన. దేవాదాయ, పర్యాటక, పురపాలక శాఖలు మరింత సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు కనిపించేవి. పండుగలు, విశేష ఉత్సవాల్లో ఫుడ్‌ కోర్డులు, క్రాఫ్ట్‌ బజార్లు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రజల్ని ఆకట్టుకుంటాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

పాఠశాలల ఏర్పాటుకి 11 సంస్థలు..

అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకి 25 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయని, వాటిలో 11 సంస్థలు ఇప్పటికే ప్రతిపాదనలు అందజేశాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. వాటిలో 8 సంస్థలు తొలి 10 ర్యాంకుల్లో ఉన్నాయని, మిగతా మూడు సంస్థలు 11 నుంచి 15 మధ్య ర్యాంకుల్లో ఉన్నాయని చెప్పారు. ఇవిగాక మరో 13 సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి వ్యక్తీకరించాయని తెలిపారు. ఆయా విద్యా సంస్థల ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

‘కృష్ణ కమలం’

అమరావతిలోని శాఖమూరు ఉద్యానవనంలో 4, 5 ఎకరాల్లో హస్తకళల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి తెలిపారు. దీనికి ప్రాథమికంగా ‘కృష్ణ కమలం’ అని పేరు పెట్టినట్టు చెప్పారు. భూసమీకరణ చేసిన గ్రామాల్లో 1400 ఎకరాలకు సంబంధించి సాంకేతిక సమస్యలున్నాయని, కలెక్టర్‌ నిరభ్యంతర పత్రాలు అందజేస్తే రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోతాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ సీఎం దృష్టికి తెచ్చారు.

రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి!

రాజధానిలో పరిపాలన నగర నిర్మాణం, ప్రధాన మౌలిక వసతులు, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన మొత్తం టెండర్ల ప్రక్రియ రెండు నెలల్లోగా పూర్తి చేస్తామని, అక్కడి నుంచి 12-15 నెలల్లో మొత్తం నిర్మాణ పనులు ఒక కొలిక్కి తెస్తామని మంత్రి పి.నారాయణ తెలిపారు.

మంత్రి చెప్పిన వివరాల్లో ముఖ్యాంశాలు ఇవి...

* వచ్చేనెల 10 లోపు అన్ని ప్యాకేజీలకు టెండర్లు పిలుస్తాం. అక్టోబరు 15 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో పనులు మొదలు పెట్టి ఏడాదిలోగా పూర్తి చేస్తాం.

* ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచాం. వీటిని 15 నెలల్లో పూర్తి చేస్తాం.

* సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలు, ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాస భవనాలు, మంత్రుల భవనాలకు ఆకృతులు సిద్ధమవుతున్నాయి. వాటికి మరో 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం.

* అమరావతిలో ఇంకా పనులు మొదలు పెట్టలేదని, ఇటుకరాయి కూడా పెట్టలేదని కొందరంటున్నారు. ఇది కొత్త నగరం. ప్లానింగ్‌కి తగిన సమయం తీసుకోవాలి. అందుకే జాప్యం జరిగింది.

* అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్‌ విగ్రహానికి సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన పూర్తి చేయమని, వచ్చే సమావేశానికి పక్కా ప్రణాళికలతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కృష్ణా నదిలో పవర్‌ బోట్‌ రేసింగ్‌! వచ్చే సంవత్సరం అమరావతి అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. కృష్ణా నదిలో ఫార్ములా వన్‌ తరహాలో పవర్‌ బోట్‌ రేసింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. 10 రోజులపాటు జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి పేరొందిన క్రీడాకారులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. బుధవారం రాజధానిపై సమీక్ష సందర్భంగా ఈ పోటీల నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఈ భారీ ఈవెంట్‌ నిర్వహణకు ఏ కాలం అనుకూలమో ఆలోచించి, నిర్దిష్ట ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. 24న నార్మన్‌ ఫోస్టర్‌తో భేటీ..! ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబరు 24, 25 తేదీల్లో లండన్‌లో పర్యటించనున్నారు. పరిపాలన నగర ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులు రూపొందిస్తున్న నార్మన్‌ ఫోస్టర్‌తో ఆయన లండన్‌లో సమావేశమవుతారు. దానికి ముందుగా అక్టోబరు 11, 12, 13 తేదీల్లో లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఆకృతులపై ప్రత్యేక కార్యగోష్ఠి నిర్వహిస్తోంది. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రాజమౌళి, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొంటారు.
Link to comment
Share on other sites

రాజధాని రోడ్లకు శరవేగంగా టెండర్లు
 
 
636421884064586357.jpg
  • 31 ప్యాకేజీల్లో అత్యధికం రెడీ
  • మిగిలినవాటికీ 4, 5 రోజుల్లో పిలుస్తాం
  • వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు
  • ఆ తర్వాత ఏడాదిలో నిర్మాణాల పూర్తి
  • మంత్రి పి.నారాయణ వెల్లడి
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదనడంలో ఎటువంటి వాస్తవం లేదని సీఆర్‌డీఏ ఉపాధ్యక్షుడు, పురపాలక మంత్రి పి.నారాయణ స్పష్టంచేశారు. అమరావతిలో తూర్పు- పశ్చిమ దిశల మధ్య దూరం 18 కిలోమీటర్లు ఉండగా 12 రోడ్లు వస్తాయని, ఉత్తరం- దక్షిణం మధ్య 11 కిలోమీటర్లు ఉండగా వాటి మధ్య 18 రోడ్లు వస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటికీ టెండర్లు పూర్తయ్యాయని, ఇవే రాజధాని నిర్మాణంలో కీలకమని చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఆర్‌డీఏ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపిన అనంతరం మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘217 చ.కి. పరిధిలోని అమరావతిలో మొత్తం 31 ప్యాకేజీల పనులు ఉండగా ఇప్పటికే అత్యధిక వాటికి టెండర్లు పిలిచాం. వచ్చే నెల 10వ తేదీలోగా మిగిలిన వాటికి కూడా పిలుస్తాం. ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన 13 ప్యాకేజీల్లో పదింటికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది.
 
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చేపడుతున్న రోడ్లు, కొండవీటివాగు వరద నివారణ, ఐకానిక్‌ బ్రిడ్జ్‌ ఇత్యాది పనులకు సంబంధించిన మొత్తం 18 ప్యాకేజీల్లో 16కి టెండర్లు పిలిచి, వాటిల్లో 14 ప్యాకేజీలవి ఓపెన్‌ కూడా చేశాం. మిగిలిన 2 ప్యాకేజీల టెండర్లను 4, 5 రోజుల్లో తెరుస్తాం. కొండవీటి వాగు, ఐకానిక్‌ బ్రిడ్జి, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, 3 ఆర్టీరియల్‌ రోడ్ల కోసం అక్టోబర్‌ నెలాఖర్లోగా టెండర్లు పిలుస్తాం. కొద్ది వారాల్లోనే రాజధానిలో నిర్మించాల్సిన అన్ని రోడ్ల పనులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 15 తర్వాత రాజధాని ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. అప్పటినుంచి పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేస్తాం’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగంపెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, రాజధాని నిర్మాణంలో సహకరిస్తున్న కన్సల్టెన్సీ సంస్థలు తమ ఉద్యోగుల్లో అత్యుత్తమ మేధస్సు కలిగిన వారిని అమరావతి రూపకల్పనలో భాగస్వాములను చేయాల్సిందిగా కోరారని చెప్పారు.
 
అత్యుత్తమ విద్యాసంస్థలకే అవకాశం సీఎం ఆదేశించారు: కమిషనర్‌ శ్రీధర్‌
అమరావతిలో నిర్మించదలచిన 9థీమ్‌ సిటీల్లో ఆర్థికాభివృద్ధికి తక్షణం దోహదపడే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, హోటళ్ల స్థాపనకు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకుని, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారని కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. అమరావతిలో విద్యాలయాల ఏర్పాటుకు 25సంస్థలు ముందుకు వచ్చాయని, వాటిల్లో 11 ఇప్పటికే తమ ప్రతిపాదనలు సమర్పించాయని చెప్పారు. వీటిలో 8 సంస్థలు తొలి 10 ర్యాంకుల్లో ఉండగా.. మిగిలిన 3 విద్యాలయాలు 11- 15 మధ్య ర్యాంకుల్లో నిలిచాయన్నారు. మరో 13 సంస్థలు తమంతట తాముగా అమరావతి వచ్చేందుకు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. ఒక్కొక్కటి 5ఎకరాల్లో నెలకొల్పే 2 కేంద్రీయ విద్యాలయాలకు ఇప్పటికే అనుమతి లభించిందన్నారు. స్కాటిష్‌ హై ఇంటర్నేషనల్‌ స్కూల్‌, చిన్మయ మిషన్‌, కేండోర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ది హెరిటేజ్‌ స్కూల్‌, సద్భావన వరల్డ్‌ స్కూల్‌, ర్యాన్‌ గ్లోబల్‌ స్కూల్‌, పోద్దార్‌ స్కూల్‌, గ్లాండేల్‌ అకాడమీ, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, జీఐఐఎస్‌, డీఏవీ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ప్రతిపాదనలు పంపాయని వెల్లడించారు. ఇవి కాకుండా సిద్ధార్ధ అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌, సెయింట్‌ మాథ్యూస్‌ పబ్లిక్‌ స్కూల్‌, శ్రీ సరస్వతి విద్యాపీఠం, లయోలా పబ్లిక్‌ స్కూల్‌, విజ్ఞాన విహార విద్యాకేంద్రం, శ్రీపతి సేవాసమితి, ఎల్‌కేఎస్‌ స్కూల్‌, ఆక్స్‌ఫర్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌, అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ, శ్రీ గౌరీ గాయత్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ మొదలైన 13 సంస్థలు అమరావతిలో పాఠశాలల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఆయా విద్యాసంస్థల ప్రమాణాలు, స్థితిగతులను పూర్తిగా తెలుసుకున్నాకే వాటి స్థాపనపై తుదినిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారని తెలిపారు.
 
రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు షురూ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను ప్రారంభించామని, ప్రస్తుతం 4 గ్రామాల్లో ఇది కొనసాగుతోందని శ్రీధర్‌ సమీక్ష సందర్భంగా సీఎంకు తెలిపారు. భూసమీకరణ జరిగిన గ్రామాల్లో 1400 ఎకరాలకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నుంచి నిరభ్యంతర పత్రాలను అందిస్తే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురైన స్వల్ప అడ్డంకులు తొలగిపోతాయన్నారు. ఆ కలెక్టర్‌ వెంటనే స్పందించి, తగు నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పారు.
 
ఎన్టీఆర్‌ విగ్రహానికి త్వరగా ఏర్పాట్లు..
అమరావతిలో అతి పెద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుతోపాటు పార్కుల ఏర్పాటుకు ఎంత స్థలం అవసరమో గుర్తించి, వచ్చే సమావేశంలో తుది నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. ఇంకోవైపు.. గ్రీన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నర్సరీ అభివృద్ధికి ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలోని 10 ఎకరాల అటవీ భూమిని కేటాయించనుంది. ఇందులో నర్సరీల పెంపకంలో శిక్షణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో పార్కులతోపాటు సెంట్రల్‌ డివైడర్లపై రంగురంగుల మొక్కలు నాటనున్నట్లు నారాయణ చెప్పారు.
Link to comment
Share on other sites

2 నెలల్లో తుది డిజైన్లు
 
 
  • అసెంబ్లీ, హైకోర్టులకు ఖరారు
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరపు ఫైనల్‌ మాస్టర్‌ ప్లాన్‌, ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లు రెండు నెలల్లో ఖరారు కానున్నాయి. వీటిని రూపొందిస్తున్న ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చించేందుకు సీఎం చంద్రబాబు అక్టోబరు 24, 25 తేదీల్లో వారితో లండన్‌లో సమావేశమవుతారు. సీఆర్‌డీఏ వ్యవహారాలపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు.
 
అనంతరం మంత్రి పి.నారాయణ విలేకరులతో మాట్లాడారు. పరిపాలనా నగరం ఆకృతుల రూపకల్పనపై అక్టోబరు 11, 12, 13 తేదీల్లో నార్మన్‌ ఫోస్టర్‌ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించే ప్రత్యేక వర్క్‌షాపులో దర్శకుడు రాజమౌళి పాల్గొని, సలహాలు, సూచనలిస్తారని తెలిపారు. కాగా.. సచివాలయం, రాజ్‌భవన్‌, సీఎం నివాసం, మంత్రుల బంగళాలకు డిజైన్లు రూపొందిస్తున్నారని, వీటికి 15రోజుల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారుల ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే పిలిచిన టెండర్లను అక్టోబరు 10న తెరుస్తామన్నారు. వీటితోపాటు ఎన్జీవోలు, గ్రూప్‌ 4 ఉద్యోగుల ఇళ్లను పనులు చేపట్టిన 15 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
 
 
Link to comment
Share on other sites

అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

రాజమండ్రి విమానాశ్రయ భూములు రాష్ట్రానికి బదలాయింపు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంబరిల్లా స్కీం పథకంలో భాగంగా ఫోరెన్సిక్‌ ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రి విమానాశ్రయ భూముల బదలాయింపునకు సమ్మతించింది. విమానాశ్రయ భూములు 10.25 ఎకరాలు రాష్ట్రానికి ఇచ్చేలా, అంతే భూమిని రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి ఇచ్చేలా నిర్ణయించారు. ఇలా బదలాయించే విమానాశ్రయ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డుని నిర్మించనుంది. ఫలితంగా పలు గ్రామాలకు రహదారి అనుసంధానం ఏర్పడుతుంది.

Link to comment
Share on other sites

అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌
 
 
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఫొరెన్సిక్‌ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
Link to comment
Share on other sites

రాజధాని రైతుల ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు డల్‌...!
29-09-2017 10:23:37
 
636422774419305219.jpg
  • రాజధాని రైతుల ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు డల్‌...!
  • ప్లాట్లు చూసుకోకుండా రిజిస్ర్టేషన్లకు రైతుల విముఖత
  • పూర్తయిన రిజిస్ట్రేషన్లు 1,360 మాత్రమే..
  • బతిమిలాడుతున్న సీఆర్డీయే అధికారులు
  • వీధిపోట్లు, అసైన్డ్‌ భూములపై స్పష్టత అవసరం
  • పరిష్కరించని అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాజధాని కోసం.. సమీకరించిన భూములకు ప్రతిగా రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. మీ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి బాబూ.. అని సీఆర్డీయే అధికారులు రైతులను బతిమాలుతున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. రాజధాని నిర్మాణం రీత్యా 33వేల 576 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద రైతులు ఇవ్వగా గత మూడు నెలల్లో రెండు శాతం రైతులు మాత్రమే తమ ప్లాట్లను రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో ఉండవల్లి, పెనుమాక మినహా 27 గ్రామాలలో లేఅవుట్లు వేసి ప్లాట్ల కేటాయించారు. నేలపాడు, అనంతవరం, శాకమూరు, పిచ్చుకలపాలెం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల్లో పెగ్‌ మార్కింగ్‌ పూర్తి అయినప్పటికీ నెంబరింగ్‌ ఇంకా అవలేదు. మిగిలిన గ్రామాల్లో పెగ్‌ మార్కింగ్‌ కూడా పూర్తి కాలేదు. ఆ కార్యక్రమాలు ఒకవైపు చేస్తూనే ప్రభుత్వం మరోవైపు రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. నేలపాడులో మూడు నెలల క్రితం లాంఛనంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందు కోసం తుళ్లూరు, అనంతవరం, మందడం గ్రామాల్లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
 
మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని కూడా రాజధాని రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశాన్ని కల్పించారు. కాని ఏ కార్యాలయంలోనూ సగటున రోజుకు 7, 8 రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. ప్లాటు ఎక్కడ ఉందో చూసుకోకుండా రిజిస్ర్టేషన్‌ ఎలా చేయించుకుంటామని ఎక్కువమంది రైతుల నుంచి వ్యక్తమౌతున్న ప్రశ్న. ప్లాట్ల కేటాయింపు పూర్తయినా అనేక అనుమానాలు, అపోహలతో ఉన్న రైతులు రిజిస్ట్రేషన్లకు తొందరపడటం లేదు. మూడు నెలల క్రితం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటివరకు అయిన రిజిస్ట్రేషన్లు 1,360 మాత్రమే. ఇప్పటివరకు రిజిస్ర్టేషన్లు చేయించుకున్న వారిలో భూములు అమ్ముకున్నవారు, బయటి ప్రాంతాల వారు మాత్రమే ఉన్నారు.
 
తమకు ప్లాట్లు కూడా చూపించకుండా రిజిస్టర్‌ ఎలా చేయించుకోమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లనే సీఆర్డీయే.. రైతులకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇంకా ఏ గ్రామంలోను రోడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. రాజధాని ప్రాంతం మొత్తాన్ని 14 జోన్లుగా విభజించి ప్రభుత్వం 10 జోన్లలో 14 వేల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి టెండర్లు పిలిచింది. త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. నేలపాడులో మాత్రం కచ్చా రోడ్లు తాత్కాలిక వేయడంతో రైతులు తమ ప్లాట్లను చూసు కోగలు గుతున్నారు. మిగిలిన చోట్ల కచ్చారోడ్లు కూడా లేకపోవడం సమస్య అవుతోంది. త్వరలో శాశ్వత రోడ్ల నిర్మాణం చేపడు తున్నందున ఈలోగా కచ్చారోడ్లు వేయడం అనవసర ఖర్చు అని ప్రభుత్వం భావిస్తోంది. పెగ్‌ మార్కింగ్‌ పనులు కూడా ఆలస్యంగా జరుగు తున్నాయి. ప్లాట్ల లెవెలింగ్‌ రైతులు ఆశించిన విధంగా చేయకపోవడం వారు రిజిస్ట్రేషన్లకు ముందుకు రాకపోవడానికి మరో కారణం.
 
వారసత్వ రిజిస్ట్రేషన్లకు జీవో ఏదీ...!
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూమి ఇచ్చిన రైతు తనకు వచ్చిన ప్లాట్లను సంతానానికి ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ముందుగా ఆ రైతు సీఆర్డీయే నుంచి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండానే ఆ ప్లాట్లను తన వారసులకు బదిలీ చేయవచ్చు. ఇందుకు జీఓ విడుదల చేయలేదు.
 
భయపెడుతున్న వాస్తు బూచి
కొంతమంది రైతులను వాస్తు బూచి భయ పెడుతోంది. ప్లాట్లకు వీధి పోటు వస్తే అరిష్ఠమని కొంతమంది ముందుకు రావడం లేదు. ఇలాంటి వీధి పోట్లు ఉన్నవి గ్రామానికి 20 నుంచి 30 ప్లాట్ల వరకు ఉంటాయని అంచనా. వీటిని ఇప్పుడు మార్చాలంటే లే అవుట్‌ మొత్తం మార్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కొంతమంది రైతులు తమ భూములకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్క రించుకోలేక సీఆర్డీయేకు అగ్రిమెంటు చేయలేదు. ఆ భూములు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం సీలింగ్‌ భూముల విషయం తేల్చకపోవడం, గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలకు ప్రభుత్వం ఇంకా పరిష్కారం చూపలేదు. రైతులకు ఈ భూములలో కూడా ప్లాట్లు కేటాయించటంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు పరిష్కారాలు అడుగుతుండటంతో అధికారులు కూడా చేతులు ఎత్తేసి ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని కోర్టుకు వెళ్లమని సూచిస్తున్నారు.
 
స్పష్టత లేకుండా ఎలా...!
రాజధానిలో ప్రభుత్వం తీసుకున్న భూముల్లో అసైన్డ్‌, దేవాదాయ భూములు, ప్రభుత్వ డొంకలు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం సీఆర్డీయేకి అధికారికంగా బదలాయించాల్సి ఉంది. అధికారుల అలసత్వం వల్ల ఇంకా ఆ పని జరగలేదు. ఈనాం భూములను ప్రభుత్వం ఎకరా 25 లక్షలు చెల్లించి తీసుకుంది. వీటికి ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈ భూములను ఇంత వరకు సీఆర్డీయేకు అప్పగించలేదు. దీంతో రైతులకు కేటాయించిన ప్లాట్లు ఈ భూముల్లో ఉంటే వాటిని ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం లేక సీఆర్డీయే పక్కన పెడుతోంది.
ఇటీవల హైదరాబాద్‌ నుంచి ఒక వ్యక్తి రిజిస్ర్టేషన్‌ చేయించుకోవటానికి వచ్చారు. ఆయనకు మూడు ప్లాట్లు వచ్చాయి. తీరా రిజిస్ర్టేషన్‌ జరిగేసరికి అందులో రెండు ప్లాట్లకు రిజిస్ర్టేషన్‌ చేస్తామని, మరో ప్లాట్‌ అసైన్డ్‌ భూములలో ఉన్నందున జీవో వచ్చే వరకు ఆగాలని చెప్పటంతో ఆయన అన్నీ కలిపి ఒకేసారి చేయించుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ మంది రైతులకు ఎదు
రౌతున్నాయి.
 
సమస్యకు దారేది?
రాజధాని రైతులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్ల విషయంలో తలెత్తుతున్న సందేహాలను అధికారుల నుంచి సరైన సమాధానాలు అందడంలేదు. గ్రామాల్లో లేఅవుట్లు, ప్లాట్ల కేటాయింపులలో ప్రభుత్వం వేగం పెంచాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. లే-అవుట్లు వేసిన గ్రామాల్లో ప్లాట్ల మార్కింగ్‌, నెంబరింగ్‌ విషయాల్లో కూడా అధికారులు నిదానంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ప్లాట్లు కేటాయించిన భూములను చదునుచేయకపోవడం, చెరువులను పూడ్చకపోవడం వల్ల రిజిస్ర్టేషన్లు చేయించుకోలేకపోతున్నామని పలువురు అంటున్నారు. కొంతమంది రైతులు తమ అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యో తి’కి వెల్లడించారు..
Link to comment
Share on other sites

ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం
29-09-2017 10:39:35
 
636422783991464373.jpg
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధానిలోని మరొక ఎల్పీఎస్‌ జోన్‌ అభివృద్ధి నిమిత్తం రూ.828.98 కోట్ల అంచనా వ్యయంతో ఏపీసీఆర్డీయే టెండర్లను ఆహ్వానించింది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ లేఅవుట్లను అత్యుత్తమ మౌలిక వసతులతో తీర్చిదిద్దే బృహత్‌ కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపట్టిన సంగతి విదితమే. ఈ కోవలో ఇప్పటికే పలు లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లను పిలిచిన సీఆర్డీయే తాజాగా జోన్‌-7 ఎల్పీఎస్‌ లేఅవుట్లను తీర్చిదిద్దేందుకు రూ.828.98 కోట్ల అంచనాతో బిడ్లను కోరింది. ఈ జోన్‌లో కొండమరాజుపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, మందడం లేఅవుట్లలోని కొంతకొంత భాగాలు కలసి ఉన్నాయి. ఇందులో నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, నీటి సరఫరా, సీవరేజ్‌, ఎస్‌.టి.పి., విద్యుత్తు- ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, రీయూజ్‌ వాటర్‌ లైన్ల కోసం భూగర్భంలో నిర్మించే యుటిలిటీ డక్ట్‌లు మరియు అవెన్యూ ప్లాంటేషన్‌ ఇత్యాదివి ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరిశీలన జరిపి, డిజైన్లు రూపొందించడమే కాకుండా నిర్మాణాన్ని సైతం ఎంపికైన సంస్థలు చేపట్టాల్సి ఉంటుంది. అభివృద్ధి పరచిన మౌలిక వసతులను ఏడేళ్లపాటు నిర్వహించాల్సిన బాధ్యత కూడా వాటిదే. ఆసక్తి ఉన్న సంస్థలు తమ బిడ్లను సమర్పించేందుకు వచ్చే నెల 27వ తేదీ వరకూ సీఆర్డీయే వకాశమిచ్చింది.
 
 
Link to comment
Share on other sites

Amaravati to host World Power Boating Championship next year.

వచ్చే సంవత్సరం అమరావతి అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. కృష్ణా నదిలో ఫార్ములా వన్‌ తరహాలో పవర్‌ బోట్‌ రేసింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. 10 రోజులపాటు జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి పేరొందిన క్రీడాకారులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. బుధవారం రాజధానిపై సమీక్ష సందర్భంగా ఈ పోటీల నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఈ భారీ ఈవెంట్‌ నిర్వహణకు ఏ కాలం అనుకూలమో ఆలోచించి, నిర్దిష్ట ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు.

22045964_1830293653650884_22436431331581

Link to comment
Share on other sites

అత్యున్నత స్థాయిలో అమరావతి నిలవాలని కోరుకున్నా 

amr-brk3a.jpg

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతి అత్యున్నత స్థాయిలో నిలవాలని జగన్మాత దుర్గమ్మను కోరుకున్నట్లు హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. దసరా మహోత్సవాల్లో పదో రోజు శనివారం శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలకృష్ణ దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన బాలకృష్ణకు దేవస్థానం అధికారులతో పాటు పాలకమండలి సభ్యులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ముఖ్యమంత్రి సంకల్ప దీక్షతో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం విజయవంతంగా పూర్తి కావాలని, అందుకు దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని వేడుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, సభ్యులు శంకర్‌బాబు, పద్మశేఖర్‌, ధర్మారావు, పీఆర్వో అచ్యుతరామయ్య పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...