Jump to content

Amaravati


Recommended Posts

కొండవీటి వాగు నాడు దుఃఖదాయిని... నేడు వరప్రదాయిని
 
 
636325976801532679.jpg

  • అమరావతికి జలవనరుగా కొండవీటి వాగు
  • రెండోదశ వాగు విస్తరణకు వారంలో టెండర్లు
  • తొలిదశలో జరుగుతున్న ఎత్తిపోతల పనులు
 కొండవీటి వాగు దుఃఖదాయని.. అనేది ఒకప్పటి మాట. నేడు దానినే వరప్రదాయినిగా మార్చి సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే రూ.237 కోట్లతో భారీ ఎత్తిపోతల నిర్మాణ పనులు జరుగుతుండగా.. రెండోదశ కింద వాగు విస్తరణ, వరద నీటిని నిల్వచేసే మూడు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.

గుంటూరు/ మంగళగిరి: రాజధాని అమరావతికి పొంచివున్న ముప్పును సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్‌ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలిదశ కింద ఉండవల్లి కృష్ణాతీరం వద్ద రూ.237 కోట్ల వ్యయంతో వాగు వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేవిధంగా 16 మోటార్లతో భారీ ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పనులు జరుగుతుండగనే.. రెండోదశ కింద కొండవీటి వాగు విస్తరణ, వరద నీటిని నిల్వచేసే మూడు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకుగాను ఏడీఏ సంస్థ సిద్ధమైంది. వారం రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్టు తాజాగా సీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు.
 
ప్రణాళిక ఇలా..
రాజధాని అమరావతిని బ్లూగ్రీన్‌ సిటీగా అభి వృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ప్రపంచబ్యాంకు రూ.400 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ నిధులతోనే కొండవీటివాగు విస్తరణ, సుందరీకరణ పనులను చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో నిర్మించనున్న ఆనకట్ట ద్వారా ఏడెనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడినుంచి సుమారు పది కిలోమీటర్ల మేర కొత్తగా కాలువను నిర్మించి నేలపాడు-నీరుకొండ మధ్య ఏర్పాటు చేయనున్న జలాశయానికి కలుపుతారు. లాం ఆపైనుంచి వచ్చే కొండవీటి వాగు వరద నీటితో కూడ ఈ జలాశయాన్ని నింపుకొనే వెసులుబాటు వుంటుంది. ఇక్కడి నుంచి ఉండవల్లి కృష్ణాతీరం వరకు 11కిలోమీటర్ల పొడవున కొండవీటివాగును భారీగా విస్తరించనున్నారు.
 
ప్రస్తుతం 25మీటర్ల వెడల్పువున్న వాగు బెడ్‌లెవల్‌ను 75మీటర్లు, పై ఎత్తులో వంద నుంచి 115 మీటర్ల వరకు విస్తరిస్తారు. దీనివలన వాగులో 22వేలకు పైగా క్యూసెక్కులు ప్రవహించే వీలవుతుంది. నీరుకొండ నుంచి కృష్ణానది వరకు సాగే వాగు ప్రవాహం మధ్య కృష్ణాయపాలెం వద్ద మరో రిజర్వాయరును నిర్మిస్తారు. కొండవీటివాగుతో పాటు దానిలో కలిసే ఉప వాగులైన పాలవాగు, కొట్టేళ్లవాగు, అయ్యన్నవాగులను సైతం ఇదే తరహాలో విస్తరిస్తారు. వైకుంఠపురం రిజర్వాయరు నుంచి కొత్తగా నిరిమ్రంచబోయే కాలువను నీరుకొండ జలాశయానికి కలపడం వలన వైకుంఠపురం రిజర్వాయర్‌ నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించే వెసులుబాటు కలుగనుంది.
 
అంచనాలివి..
కొండవీటి వాగు విస్తరణ కోసం సుమారు 885 ఎకరాలు, పాలవాగు ఇతర పిల్లవాగుల విస్తరణ నిమిత్తం 433 ఎకరాలు, వైకుంఠపురం నుంచి కొత్తగా నిర్మించనున్న కాలువ కోసం 217 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. అలాగే నీరుకొండ-నేలపాడు మధ్య నిర్మించనున్న జలాశయం కోసం 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద నిర్మించనున్న మరో జలాశయం కోసం 190 ఎకరాలు కేటాయించాలని అంచనా వేశారు. వీటితోపాటు శాఖమూరు వద్ద కూడ 50 ఎకరాల విస్తీర్ణంలో మరో జలాశయాన్ని ఏర్పాటుచేసేవిధంగా మాస్టర్‌ప్లానులో ప్రతిపాదించారు. ప్రస్తుతానికి కొండవీటివాగు విస్తరణ, అభివృద్ధి పూర్తిగా రాజధాని పరిధిలో మాత్రమే అంటే నీరుకొండ నుంచి ఉండవల్లి తీరం వరకు మాత్రమే జరుగనుంది. తరువాతి దశలో నీరుకొండ నుంచి లాం వరకు వాగు విస్తరణ పనులు చేపడతారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వలన కొండవీటివాగుకు ఏస్థాయిలో వరదలు వచ్చినా రాజధాని ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడ ముంపుకు గురయ్యే అవకాశం వుండదు.
 
ఇదీ ముంపు సమస్య
కొండవీటి కొండల నుంచి వచ్చే ప్రవాహం లాం నుంచి వాగు రూపాన్ని సంతరించుకుంటుంది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల మధ్యగా 28.5 కి.మీ ప్రయాణించి ప్రకాశం బ్యారేజి వద్ద ఎగువ కృష్ణలో కలుస్తుంది. ఈ వాగు కేవలం 25 మీటర్ల వెడల్పుతో వుండి అధిక వర్షాలు కురిస్తే ఎనిమిదివేల క్యూసెక్కుల సామర్ధ్యంతో ప్రవహిస్తుంది. తక్కువ వెడల్పు.. ఎక్కువ సామర్ధ్యంతో కూడిన ప్రవాహం రావడంతో బలహీనంగా ఉన్న చోట కట్టలు తెగి సమీప భూములను ముంచెత్తుతుంది. వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటిమట్టం పెరగడంతో కొండవీటివాగు వరద నీరు నదిలోకి పారలేక ఒత్తిడి వల్ల ఎక్కడికక్కడ పొంగి పొర్లుతుంది.
Link to comment
Share on other sites

నేడు అసెంబ్లీ తుది నమూనా సమర్పణ




  • హైకోర్టు ముసాయిదా నమూనా కూడా

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని ప్రభుత్వ భవనాల తుది మాస్టర్‌ ప్లానతోపాటు అందులోని రెండు ఐకానిక్‌ భవంతుల్లో ఒకటైన అసెంబ్లీ తుది నమూనా(డిజైన)ను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ శనివారం ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న సమీక్షా సమావేశంలో ఇదే రోజు దీనిపై చర్చించనున్నారు. వీటితోపాటు మరొక ప్రతిష్టాత్మక కట్టడం హైకోర్టు ముసాయిదా నమూనాను కూడా నార్మన ఫోస్టర్‌ అందజేస్తారని తెలుస్తోంది. గత నెల 22న సీఎం ఆధ్వర్యంలో జరిగిన రాజధాని రివ్యూ మీటింగ్‌లో సమర్పించిన అసెంబ్లీ డిజైనకు స్థూలంగా ఆమోదం లభించింది. అయితే, కొద్దిపాటి మార్పుచేర్పులను సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సూచించారు. తదనుగుణంగా అసెంబ్లీ తుది నమూనాను సవరించారు.


Link to comment
Share on other sites

పదివేల కోట్ల పనులకు టెండర్లు!
 
 
  • ఈ నెలలోనే ముహూర్తం
  • ఎల్పీఎస్‌ లే అవుట్లు
  • రాజధానిలో మౌలిక వసతుల కల్పన
  • ఉండవల్లి, పెనుమాకలకు మినహాయింపు
అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల(ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌)కు నెలవుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రధాన పనులకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఆయా పనులకు ఈ నెల ఆఖరులోగా సీఆర్డీఏ, ఏడీసీలు టెండర్లు పిలవనున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. వీటి విలువ సుమారు రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఉండవచ్చునని సమాచారం. ఈ పనులను పలు ప్యాకేజీల కింద విభజించి, ఆయా రంగాల్లో నైపుణ్యం, అనుభవం ఉన్న పేరెన్నికగన్న నిర్మాణ సంస్థలకు అంతర్జాతీయ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా అప్పగించనున్నారని భోగట్టా.
 
వీటికి అవసరమైన నిధులను వివిధ జాతీయ, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, బ్యాంకుల నుంచి రుణరూపేణా సమీకరించేందుకు సీఆర్డీఏ జరిపిన ముమ్మర కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినందున టెండర్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా(నెలాఖరులోగా) చేపట్టేందుకు సన్నాహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు రాజధాని నగరాన్ని మొత్తం 13 జోన్లుగా విభజించారు. అయితే, ప్రస్తుతానికి 11 జోన్ల పనులకే టెండర్లు పిలవనున్నారు.
 
వీటిల్లో ఎల్పీఎస్‌ లే అవుట్లతో కూడిన 10 జోన్లతోపాటు ప్రభుత్వ కాంప్లెక్స్‌కు సంబంధించిన జోన ఉన్నాయి. మిగిలిన 2 జోన్లు ఉండవల్లి, పెనుమాకల్లో అధిక విస్తీర్ణంలోని భూములను పూలింగ్‌ కింద అమరావతికి ఇచ్చేందుకు అక్కడి రైతులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో వాటిని భూసేకరణ ద్వారా తీసుకునే ప్రక్రియ జరుగుతున్నందున వాటిని మాత్రం ఈ టెండర్ల నుంచి మినహాయించారు. ఆయా జోన్లలో భూసేకరణ ప్రక్రియ ముగిసి, అక్కడి భూములు కూడా సీఆర్డీఏకు దఖలు పడిన తర్వాత వాటిల్లోనూ మౌలిక వసతులను కల్పించేందుకు టెండర్లు పిలుస్తారు.
 
వసతులు ఇవీ..
217 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన రాజధాని నగరం మొత్తంతోపాటు అమరావతి కోసం పూలింగ్‌ ప్రాతిపదికన భూములిచ్చిన రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ లే అవుట్లన్నింట్లో మెయిన ట్రంక్‌, అంతర్గత ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ కల్పించేందుకు మొత్తం రూ.15,000 కోట్లకు పైగా అవసరమని తెలుస్తోంది. వీటిల్లో ఎల్పీఎస్‌ లే అవుట్ల కోసం రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు వ్యయమవనుండగా మిగిలిన మొత్తం ప్రభుత్వ కాంప్లెక్స్‌కు ఉద్దేశించిన ప్రదేశం, రాజధాని నగరానికి వెచ్చించనున్నారని సమాచారం.
 
రాజధానిలో ప్రధాన రహదారులు, నీటి సరఫరా, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, సీవరేజ్‌ వ్యవస్థ, స్టార్మ్‌ వాటర్‌ వ్యవస్థ, విద్యుత లైన్లు, భూగర్భ డక్ట్‌లు, భద్రతా ఏర్పాట్లు వంటి పనులను చేపడతారు. ఎల్పీఎస్‌ లేఅవుట్లలో ప్రధాన, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, నీరు, మురుగునీరు, వర్షపునీటి పైపులైన్లు, విద్యుత, కమ్యూనికేషన, వంటగ్యాస్‌ తదితరాలకు ఉద్దేశించిన భూగర్భ డక్ట్‌ల నిర్మాణం చేపడతారు.
Link to comment
Share on other sites

రాజధానిలో వ్యవసాయ కూలీలకు ఇళ్లు కట్టిస్తాం

అమరావతి: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు భూసేకరణ 45 రోజుల్లో పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ తెలిపారు.ఆర్థిక, క్రీడా నగరాలపై మెకెన్సీ నివేదిక ఇచ్చినట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. జాతీయ క్రీడల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన చెప్పారు. రాజధానిలో ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు ఇళ్లు కట్టించాలని నిర్ణయం తీసుకున్నామని.. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పదిచోట్ల ఇళ్లు నిర్మించబోతున్నాయని ఆయన వెల్లడించారు. శాఖమూరు వద్ద 250 ఎకరాల్లో పార్కు నిర్మించాలని సీఎం నిర్ణయించారన్నారు. ప్రహరీ గోడ లేకుండా వివిధ సంస్థల ఏర్పాటు.. వర్శిటీలు, వివిధ సంస్థలకు పబ్లిక్‌ యాక్సెస్‌ ఉండే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మూడు గంటలు సాగిన సమీక్ష...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమీక్షా సమావేశం సుదీర్ఘంగా సాగింది. వివిధ అంశాలపై చంద్రబాబు మూడున్నర గంటలకు పైగా సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధాని రహదారులు, ప్రభుత్వ పరిపాలన నగరంపై చర్చించారు. విద్యానగరం నిర్మాణ పురోగతిపైనా సమీక్షించారు. ఈ సందర్భంగా విట్‌, అమృత, ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌ఐడీ తదితర విద్యాసంస్థలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.

Link to comment
Share on other sites

గోడల్లేని నగరం!

వర్సిటీలకు, పార్కులకు వద్దు

గేటెడ్‌ కమ్యూనిటీలూ అవ‌స‌రం లేదు..

ప్రయాణం సులువవుతుంది..

ప్రజలకు అందుబాటులో ఉంటాయి

సంతోష నగరంగా అమరావతి

భారతదేశ డిస్నీవరల్డ్‌గా అభివృద్ధి

రాజధానిపై సీఎం సమీక్ష

10ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే యూనివర్సిటీలు, ఉద్యానవనాలకు ప్రహరీ గోడలు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఉండరాదన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ నగరాల్లో ప్రముఖ వర్సిటీలకు గోడలుండవని, అమరావతిలోనూ అదే విధానం అనుసరించాలని కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ సూచించిన నేపథ్యంలో ఈ యోచన చేస్తోంది. శనివారం రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. అమరావతిని సంతోష నగరంగా (హ్యాపీ సిటీ) తీర్చిదిద్దేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్న అంశంపై మెకన్సీ ప్రజంటేషన్‌ ఇచ్చింది. యూనివర్సిటీలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాటిలోని లైబ్రరీ, క్రీడా వసతులను ప్రజలూ వాడుకునే అవకాశముండాలని, కావాలంటే వారి నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేయవచ్చని తెలిపింది. ఈ ఆలోచన ముఖ్యమంత్రికి నచ్చింది. దీన్ని అమలు చేయాల్సిందిగా విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీల ప్రతినిధులకు ఆయన సూచించారు. దానికి వారు అంగీకరించారు. గేటెడ్‌ కమ్యూనిటీలకు రెండు మూడు ప్రవేశమార్గాలే ఉండటంవల్ల ఆ ప్రాంగణంలో ఏ మూల ఉన్నవారైనా కచ్చితంగా ఈ మార్గాల ద్వారానే రాకపోకలు సాగించాలని, దానివల్ల ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని మెకన్సీ పేర్కొంది. అదే ప్రహరీ లేకుండా, ఎటునుంచైనా వెళ్లే వీలుంటే ఇంధనం, సమయం ఆదా అవుతాయని పేర్కొంది. భద్రతకు సంబంధించి అత్యాధునిక వసతులు అందుబాటులోకి వచ్చినందున, ప్రహరీలు అవసరం లేదని వెల్లడించింది. ప్రపంచంలో సంతోష నగరాల జాబితాలో ముందు వరుసలో ఉన్న నగరాల్లో ఇలాంటి విధానాలే అమల్లో ఉన్నట్లు పేర్కొంది.

రాజధానిలోని పర్యాటక, మీడియా- సాంస్కృతిక, క్రీడా, తయారీ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై మెకన్సీ వ్యూహ పత్రాలు సిద్ధం చేయనుంది. ఈ నగరాల్లో తొలి ప్రధాన పెట్టుబడిదారును (యాంకర్‌ ఇన్వెస్టర్‌) తీసుకొచ్చే బాధ్యత మెకన్సీదే..

* అమరావతిలోని శాఖమూరులో 250 ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్ధి చేస్తారు. ఇందులో సాహస క్రీడలు, జల క్రీడలు, మ్యూజిక్‌ ఫౌంటెయిన్‌, కృత్రిమ జలపాతాలు, పక్షుల పార్కు, రిసార్టులు, హోటళ్లు, షాపింగ్‌ మాళ్లు, థియేటర్లు వంటివన్నీ ఉంటాయి. దీన్ని భారతదేశ డిస్నీవరల్డ్‌గా తీర్చిదిద్దుతామని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్థసారధి తెలిపారు.

* భూసమీకరణలో రాని భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకోవాలి. భూసేకరణ ప్రకటన జారీ చేసిన గ్రామాల్లో తుది గడువు ముగిసేలోగా ఎవరైనా భూసమీకరణలో భూములు ఇస్తే తీసుకోవాలి.

* ఇంకా ఎవరైనా తమ భూముల్లో వ్యవసాయమే చేసుకుంటామంటే... ఆ భూముల్ని అలాగే విడిచిపెట్టి, భవిష్యత్తులో వాటిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించాలి.

రాజధానిలో సీడ్‌యాక్సెస్‌, ఇతర ప్రధాన రహదారుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జాప్యాన్ని ఏ మాత్రం సహించబోనని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు అల్టిమేటం ఇవ్వాలని ఆదేశించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని స్వార్థ బుద్ధితో అడ్డుకోవడం సమంజసం కాదని, అత్యాశకు పోతే దక్కాల్సింది దక్కదని ఆయన వ్యాఖ్యానించారు.

వచ్చేవారం పరిపాలనా నగరం తుది ప్రణాళిక

* పరిపాలన నగరం తుది ప్రణాళికను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ వచ్చే వారం అందజేస్తుంది.

* శాసనసభ భవన తుది ఆకృతులు సిద్ధమయ్యాయి. పరేడ్‌ గ్రౌండ్‌ను హైడెన్సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాంతంలోనే ఉంచుతారు.

* సెంట్రల్‌ యాక్సిస్‌లో వ్యూయింగ్‌ టవర్‌ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతిని మిళితం చేస్తూ నిర్మించే కల్చరల్‌ సెంటర్‌ తుది ప్రణాళికలో ఉంటుంది.

* హైకోర్టు వ్యూహ ప్రణాళికను మారుస్తూ నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కొత్త కాన్సెప్ట్‌ రూపొందించింది. వాటిలో సీఆర్‌డీఏ కొన్ని మార్పులు సూచించింది. వాటిని తుది ఆకృతిలో పొందుపరుస్తారు.

10ap-main4b.jpg జులై 19న విట్‌ ప్రారంభం.. * అమరావతిలో నిర్మిస్తున్న విట్‌ యూనివర్సిటీని జులై 19న ఉదయం 9 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. అత్యుత్తమ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వైఫై బస్సులు, హాస్టళ్లు అప్పటికి సిద్ధమవుతాయి. ఈ క్యాంపస్‌కు అడ్మిషన్లు జులైలో జరుగుతాయి. మొదట గుంటూరులో తరగతులు ప్రారంభించి అమరావతి క్యాంపస్‌ పూర్తిగా సిద్ధమైన వెంటనే అక్కడికి మారుస్తారు. ‘స్టార్‌ స్టూడెంట్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఒక బాలిక, బాలుడిని ఎంపిక చేసి వారికి ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. 2050కి 15 లక్షల ఉద్యోగాలు * 2050కి 15 లక్షల ఉద్యోగాలు, జీడీపీకి రూ.1.2 లక్షల కోట్లు అందించగల, మెట్రోస్థాయి నగరంగా అమరావతిని రూపొందించగలమని మెకన్సీ అంచనా వేసింది.

* రాజధానిలోని 9 నగరాలను (థీమ్‌ సిటీస్‌) అనుసంధానం చేస్తూ రూపొందించిన హ్యాపీ సర్కిల్‌పై మెకన్సీ ప్రజంటేషన్‌ ఇచ్చింది.

* అమరావతిని ఒలింపిక్స్‌ బంగారు పతకాలకు కార్ఖానాగా తయారు చేయాలన్న మెకన్సీ ప్రతిపాదనపై సవివరంగా చర్చించాలని సీఎం సూచించారు.

10 చోట్ల పేదలకు ఇళ్లు..! రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం నివశిస్తున్న ఇళ్లులేని వ్యవసాయ కూలీలకు 5వేల ఇళ్లు నిర్మిస్తారు. మొత్తం 10 ప్రాంతాలను ఎంపిక చేసి, ఒక్కోచోట 500 ఇళ్లు కడతారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల చొప్పున సబ్సిడీ అందజేస్తాయి. మిగతా డబ్బును బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు. 15 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం.
Link to comment
Share on other sites

ఏపీ రాజధానిలో రాచబాటలు
13-06-2017 08:56:01
 
636329410832828160.jpg
  • రూపు సంతరించుకుంటున్న రాజధాని ఫేజ్‌-1 రోడ్లు
  • పాపిట రేఖలా ప్రధాన రహదారులు
  • వేగంగా అటు సీడ్‌ యాక్సెస్‌,
  • ఇటు ఏడు ప్రాధాన్య దారుల నిర్మాణం
  •  ఫేజ్‌-2 లోని 3 రోడ్లకు త్వరలో
  • రూ.510 కోట్లతో టెండర్లు
  •  మిగిలిన వాటికీ ఏడీసీ సమాయత్తం
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
రాజధాని నలుమూలలనూ పరస్పరం అనుసంధానించి, అమరావతి అభివృద్ధికి చోదకశక్తులుగా విరాజిల్లబోతున్న ఫేజ్‌-1 రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇందులోని సీడ్‌ యాక్సెస్‌, 7 ప్రాధాన్య రోడ్ల ఏర్పాటు పనులు ప్రస్తుతం సాగుతున్న తీరునుబట్టి చూస్తే కొద్ది నెలల్లోనే ఈ 8 రహదారులూ పూర్తయి, తమ సేవలను అందించేందుకు సిద్ధమవుతాయని భావిస్తున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయించేందుకు దాని అధికారులు, కాంట్రాక్ట్‌ కంపెనీల సిబ్బంది కృషి చేస్తున్నారు.
 
సాధ్యమైనంత వరకూ నేరుగా..
మొత్తం పొడవు 84.49 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.1306.50 కోట్లుగా ఉన్న ఈ ఫేజ్‌-1 రోడ్లను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించవచ్చు. ఇవి- సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, 7 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లు. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును 8 వరుసలతో నిర్మించనుండగా, సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లలోని ఈ-8, ఎన్‌-9లను 6 లేన్లు (వీటిల్లో 2 బీఆర్టీఎస్‌ కోసం), మిగిలిన ఎన్‌-4, ఎన్‌- 14, ఎన్‌-16, ఈ- 10, ఈ-14లను 4 వరుసలతో ఏర్పాటు చేస్తున్నారు. తదనుగుణంగా వీటి వెడల్పు 60 మీటర్ల నుంచి 40 మీటర్ల మధ్య ఉంటుంది.

ఇవన్నీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాధ్యమైనంత వరకూ మలుపులు లేకుండా రూపుదిద్దుకుని, ఎక్స్‌ప్రెస్‌ వేలను తలపించనున్నాయి. మధ్యలోనూ, ఇరు పక్కలా అలరించే పచ్చదనం, సైక్లింగ్‌ ట్రాక్‌లతోపాటు కొన్నింటికి బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (బీఆర్టీఎస్‌) కోసం ప్రత్యేక లేన్లు ఉంటాయి.
 
రాజధానికి వెన్నుముక..
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు..

ఈ ఫేజ్‌- 1 రోడ్లన్నింట్లో అత్యంత ప్రధానమైనదిగానూ, రాజధానికి జీవనాడిగానూ అభివర్ణించబడుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును వాస్తవానికి కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకూ నిర్మించాల్సి ఉండగా, భూసేకరణ ఇత్యాది సమస్యల కారణంగా ప్రస్తుతం వెంకటపాలెం- దొండపాడుల మధ్య 18.27 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మిస్తున్నారు. వారధి- వెంకటపాలెం మధ్య భాగాన్ని (3.03 కి.మీ.) భూసేకరణ పూర్తయిన అనంతరం చేపట్టనున్నారు. ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ సంస్థ ఎన్‌.సి.సి. ఈ 18.27 కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మిస్తోంది. దీని అంచనా వ్యయం రూ.215.15 కోట్లు. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన దీని నిర్మాణం వివిధ కారణాల దృష్ట్యా మొదట్లో కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి హెచ్చరికలు, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి నిరంతర పర్యవేక్షణతో ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. ఒక్క లేయర్‌ మినహా దీని నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ తెలిపారు. అయితే కొద్ది చోట్ల భూసమీకరణ జరగనందున పనులు ఆగాయని, 45 రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరించి, కొద్ది నెలల్లోనే వెంకటపాలెం- దొండపాడుల మధ్య సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పూర్తి చేయనున్నామని చెప్పారు. వారధి నుంచి వెంకటపాలెం మధ్య నిర్మించాల్సిన ఈ రహదారి 2వ భాగపు పనులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
 
పాపిట రేఖలా ప్రాధాన్య రహదారులు..
ఈ 7 ప్రయారిటీ రోడ్లు (సబ్‌ ఆర్టీరియల్‌) సైతం చురుగ్గా నిర్మితమవుతున్నాయి. రాజధానిలోని వివిధ ప్రదేశాలను ఒకదానికొకటిని కలుపుతూ, అద్భుత అంతర్గత రవాణా వ్యవస్థ ఏర్పాటవడంలో వీటిదే ప్రధాన పాత్ర. వీటిల్లో 3 తూర్పు- పడమరల మధ్య, మిగిలిన 4 ఉత్తరం- దక్షిణ దిశల మధ్య సాగనున్నాయి. వీటన్నింటి మొత్తం పొడవు 66.22 కిలోమీటర్లు, నిర్మాణ వ్యయం రూ. 1091.35 కోట్లు. వీటిని 4 ప్యాకేజీలుగా విడగొట్టి, టెండర్లు పిలవగా వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి.

ప్యాకేజీ-1 లో ఉన్న ఈ- 8 వెంకటపాలెం నుంచి నెక్కల్లు వరకు వెళ్తుంది. దీని పొడవు 13.65 కి.మీ. ఖర్చు రూ.272.19 కోట్లు. ప్యాకేజీ- 2లోని ఎన్‌-9 (ఉద్ధండరాయునిపాలెం- నిడమర్రు) పొడవు 13.16 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.214.94 కోట్లు. ప్యాకేజీ-3 లోని ఎన్‌-4 (వెంకటపాలెం- నవులూరు, 7.23 కి.మీ.), ఎన్‌-14 (అబ్బరాజుపాలెం- శాఖమూరు, 8.27 కి.మీ.)ల మొత్తం వ్యయం రూ.266.25 కోట్లు. ప్యాకేజీ-4లోని ఈ-10 (పెనుమాక- నీరుకొండ, 7.81 కి.మీ.), ఈ-14 (నీరుకొండ- మంగళగిరి, 7.33 కి.మీ.), ఎన్‌-16 (దొండపాడు- నెక్కల్లు, 8.77 కి.మీ.)ల మొత్తం నిర్మాణ వ్యయం రూ.337.97 కోట్లు.
 
ఫేజ్‌-2 రోడ్ల పనులపైనా దృష్టి
మొత్తం 11 రోడ్లున్న అమరావతి ఫేజ్‌-2 రోడ్ల నిర్మాణాన్ని కూడా సత్వరమే చేపట్టేందుకు ఏడీసీ సమాయత్తమవుతోంది. ఈ-2, ఈ-4, ఈ-6, ఈ-12, ఈ-15 అనే తూర్పు- పడమర ప్రదేశాలను కలిపే వాటితోపాటు ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-5, ఎన్‌-7, ఎన్‌-11, ఎన్‌-18 పేర్లతో రాజధానిలోని ఉత్తర- దక్షిణ దిశలను అనుసంధానించే రహదారుల ఏర్పాటుకు వడివడిగా చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో ఈ-6, ఈ-12, ఎన్‌-11 అనే 3 రహదారులకు రూ.510 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచబ్యాంక్‌ నిధులు సమకూర్చనున్న ఈ రోడ్లకు టెండర్ల ప్రక్రియ ముగుస్తూండగానే మిగిలిన 8 రోడ్లకు కూడా టెండర్లు పిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
Link to comment
Share on other sites

అమరావతిలో స్టార్‌ హోటళ్లు

త్వరలో బిడ్‌లు ఖరారు చేయనున్న సీఆర్‌డీఏ

పాఠశాలలతో కలిపి మొత్తం 27 దాఖలు

వర్సిటీలకు ఎనిమిది సంస్థల నుంచి ప్రతిపాదనలు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో స్టార్‌ హోటళ్లు, జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) మరో వారంలో బిడ్‌లు ఖరారు చేయనుంది. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ముందుకువచ్చిన సంస్థలకు స్థలాల కేటాయింపు ప్రక్రియ మరో రెండు నెలల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజధానిలో హోటళ్లు, పాఠశాలల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించగా సీఆర్‌డీఏ వూహించినంతగా స్పందనేమీ రాలేదు. ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు నాలుగు సంస్థలు కలిసి 11 బిడ్‌లు దాఖలు చేశాయి. పాఠశాలల ఏర్పాటుకు ఆరు సంస్థలు 16 బిడ్‌లు వేశాయి. విశ్వవిద్యాలయా(వర్సిటీ)లకు టెండర్‌ విధానం కాకుండా ఆసక్తి అభివ్యక్తీకరణ(ఈఓఐ) ప్రకటన జారీ చేసిన సీఆర్‌డీఏ, ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఎనిమిది సంస్థలు ప్రతిపాదనలు అందజేశాయి.

ఆరు హోటళ్లకు టెండర్లు

రాజధానిలో ఐదు, నాలుగు నక్షత్రాల హోటళ్లు ఒక్కొక్కటి, మూడు నక్షత్రాల హోటళ్లు నాలుగు ఏర్పాటుచేసేందుకు సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. హోటళ్లకు చ.మీటరుకు కనీస ధరను రూ.5,000గా సీఆర్‌డీఏ నిర్ణయించింది. అన్ని అర్హతలూ ఉండి ఎక్కువ మొత్తానికి బిడ్‌ వేసిన వారికి స్థలాలు కేటాయిస్తారు. హోటళ్లకు మొత్తం 11 బిడ్‌లు వచ్చాయి. ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్‌ల పరిశీలన కార్యక్రమం ఈ వారంలో జరుగుతుంది. మూడు దశల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదట పోటీలో నిలిచేందుకు ప్రాథమికంగా అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అర్హతలు ఆయా సంస్థలకున్నాయో లేదో పరిశీలిస్తారు. ఆ తర్వాత సాంకేతిక బిడ్‌లు తెరుస్తారు. హోటళ్ల కోసం భారీగా బిడ్‌లు దాఖలైతే సాంకేతికంగా అర్హత సాధించిన వాటిలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన సంస్థల ఆర్థిక బిడ్‌లే తెరవాలని మొదట అనుకున్నారు. ఆశించిన స్థాయిలో బిడ్‌లు రాకపోవడంతో వచ్చినవాటిలో సాంకేతిక బిడ్‌లలో అర్హత సాధించిన వారందరి ఆర్థిక బిడ్‌లు తెరవాలని నిర్ణయించారు. ఐదు నక్షత్రాల హోటల్‌కు నాలుగెకరాలు, నాలుగు నక్షత్రాల హోటల్‌కి రెండు, మూడు నక్షత్రాల హోటల్‌కు ఎకరం చొప్పున స్థలం కేటాయిస్తారు.

పాఠశాలలు ఐదు..!

అమరావతిలో మొదటి దశలో అంతర్జాతీయ బోర్డింగ్‌ పాఠశాల ఒకటి, అంతర్జాతీయ డే పాఠశాల ఒకటి, జాతీయ బోర్డింగ్‌ పాఠశాల ఒకటి, జాతీయ డే పాఠశాలలు మూడు ఏర్పాటు చేసేందుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. చ.మీటరుకు కనీస ధరను రూ.1250గా నిర్ణయించింది. అంతర్జాతీయ బోర్డింగ్‌ పాఠశాలకు ఎనిమిది, డే పాఠశాలకు నాలుగెకరాల చొప్పున, జాతీయ బోర్డింగ్‌ పాఠశాలకి 4 ఎకరాలు, డే పాఠశాలకి 2 ఎకరాల చొప్పున స్థలం కేటాయిస్తారు. పాఠశాలల ఏర్పాటుకి 6 సంస్థలు పోటీలో నిలిచాయి.

యూనివర్సిటీల రేసులో ప్రముఖ సంస్థలు...!

రాజధానిలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి నిర్దిష్టంగా ఇంత మొత్తం స్థలం కేటాయించాలని నిర్ణయించలేదు. ఆయా సంస్థల నుంచి ప్రతిపాదనలు మాత్రమే కోరింది. ఆయా సంస్థలకు ఉన్న అర్హతల్ని బట్టి రాజధానిలో స్థలం కేటాయించాలా వద్దా? కేటాయిస్తే ఎంత కేటాయించాలి? అన్నది నిర్ణయిస్తారు. ధరపై కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 8 సంస్థలు రాజధానిలో యూనివర్సిటీల ఏర్పాటుకి ప్రతిపాదనలు అందజేశాయి. వీటిని ప్రాథమిక స్థాయిలో సీఆర్‌డీఏ పరిశీలించిన తర్వాత, స్థలాల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘానికి వెళుతుంది. ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దానిపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రతిపాదనలు అందజేసిన వాటిలో తమిళనాడుకి చెందిన సవిత, పీఈఎస్‌ బెంగళూరు, ఐఎస్‌బీఆర్‌, గీతం, బసవతారకం ఫౌండేషన్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ యూనివర్సిటీ(జంషెడ్పూర్‌) తదితర సంస్థలున్నాయి. ఈ సంస్థల నుంచి సీఆర్‌డీఏ మరికొన్ని వివరాలు కోరుతోందని, ఆయా సంస్థలకున్న అర్హతల్ని అన్ని కోణాల్లో కూలంకషంగా పరిశీలిస్తున్నామని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తవడానికి రెండు నెలల సమయం పడుతుందని పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...