Jump to content

Amaravati


Recommended Posts

 

5 భాగాలుగా శాసనసభ!

మధ్యలో సందర్శకులకు ప్రత్యేక ప్రదర్శనశాల

చల్ల చల్లగా అమరావతి పరిపాలన నగరం

ఈనాడు - అమరావతి

amar5.jpg 

అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐకానిక్‌ భవనంగా నిర్మించే శాసనసభలో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఈ భవనం మధ్య భాగంలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శన శాల (సెంట్రల్‌ ఆట్రియం) ఉంటుంది. దీనికి చుట్టూ మూడు మూలల్లో... శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్‌ హాల్‌ ఉంటాయి. నాలుగో మూల బ్యాంకు, పోస్టాఫీసు, క్యాంటీను వంటి సదుపాయాలకు ఒక భవనం ఉంటాయి. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు ఎదురెదురు మూలల్లో ఉంటాయి. శాసనసభ కోసం 160 ఎకరాలు కేటాయించాలని మొదట అనుకున్నా, దాన్ని తుది ప్రణాళికలో 100 ఎకరాల్లోపే కుదించనున్నారు. పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించి 1365 ఎకరాల్లో రూపొందించిన తుది ప్రణాళికను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ నెల 15 నాటికి అందజేయనుంది.శాసనసభ భవన తుది ఆకృతులు, హైకోర్టుకి భవనానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని కూడా సిద్ధం చేస్తుంది. వచ్చే సమావేశంలో ప్రభుత్వం ఒక నమూనా ఆకృతిని ఎంపిక చేస్తే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు దాన్ని చూపించి, వారి సూచనల మేరకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వివరణాత్మక ఆకృతి సిద్ధం చేస్తుంది.

ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనశాల..!

శాసనసభలో ప్రదర్శనశాల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనిలో కింది నుంచి అసెంబ్లీ పై భాగం వరకు వెళ్లడానికి వర్తులాకారపు మార్గం ఉంటుంది. శాసనసభ, రాజధాని చరిత్ర, పరిణామ క్రమానికి చెందిన చిత్రాలు, నమూనాలు వంటివి దీనిలో ప్రదర్శిస్తారు. సందర్శకులు వర్తులాకారపు మార్గంలో పైకి నడుచుకుంటూ వెళుతూ... వీటిని తిలకించే అవకాశం ఉంటుంది. భద్రతాపరంగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే... సందర్శకుల్ని ప్రదర్శనశాలలోకి అనుమతిస్తారు. సెంట్రల్‌ హాల్‌ ప్రాంగణంలో శాసనసభ కార్యదర్శి, ఉప కార్యదర్శుల ఛాంబర్లు, శాసనసభ పరిపాలనా కార్యాలయం ఉంటాయి.

సందర్శకులకు శీతల ప్రాంతాలు

పరిపాలనా నగరానికి వచ్చే సందర్శకులు, మరీ ముఖ్యంగా పాదచారుల కోసం ఈ ప్రాంతంలో ప్రత్యేక శీతల ప్రాంతాలు (కూల్‌ స్పాట్స్‌) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో వేసవిలో ఉండే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను ప్రణాళికలో పొందుపరిచారు. ఇక్కడ సందర్శకులు సేదదీరేందుకు అవసరమైన వసతులన్నీ ఉంటాయి. నీడనిచ్చే ఏర్పాట్లు (షెల్టర్‌), ఫ్యాన్లు, తాగునీరు, వైఫై వంటి సదుపాయాలన్నీ కల్పిస్తారు. మెట్రో రైలు, బీఆర్‌టీ (బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) స్టాపులతో వీటిని అనుసంధానం చేస్తారు. పరిపాలన నగరంలో సందర్శకులు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడానికి డ్రైవర్‌ రహిత ఎలక్ట్రికల్‌ కార్లు ఏర్పాటు చేస్తారు.

ఉష్ణోగ్రతలు తగ్గించేదిలా...!

పరిపాలనా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు, వాతావరణం హాయిగా ఉండేందుకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తమ ప్రణాళికలో కొన్ని ప్రతిపాదనలు చేసింది. విస్తృతంగా చెట్లు పెంచడం వల్ల 3 డిగ్రీలు, సూర్య కిరణాలు ఏటవాలుగా నేలను తాకేందుకు వీలుగా సన్నని వీధులు ఏర్పాటు చేయడం వల్ల మరో రెండు డిగ్రీలు, కాలువలు, జలాశయాలు ఏర్పాటు చేయడం ద్వారా రెండు డిగ్రీలు, ‘కూల్‌స్పాట్‌’ల ఏర్పాటు ద్వారా మరో 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని పేర్కొంది.

Link to comment
Share on other sites

Just wanted to express my appreciation for the time, effort and dedication many of you here have towards the state of AP and TDP. 

 

It's a pleasure coming to this site and reading these posts. You guys are doing remarkable work  :shakehands:

 

I wish it could reach wider audience. I don't follow social media channels that much,  but is there a way to mirror some of these informational posts on social media without too much overhead to the posters? Like, posting them to a dedicated youtube channel, fb page and twitter etc? 

 

I see lot of negativity on TDP being spread around social media (I don't particularly think it hurts TDP, as only a fraction of voting public follows social media. Only some fringe elements :) ) . But, I think just mirroring many of these posts on these channels with dedicated accounts would help. Sends positive message.

Link to comment
Share on other sites

Just wanted to express my appreciation for the time, effort and dedication many of you here have towards the state of AP and TDP. 

 

It's a pleasure coming to this site and reading these posts. You guys are doing remarkable work  :shakehands:

 

I wish it could reach wider audience. I don't follow social media channels that much,  but is there a way to mirror some of these informational posts on social media without too much overhead to the posters? Like, posting them to a dedicated youtube channel, fb page and twitter etc? 

 

I see lot of negativity on TDP being spread around social media (I don't particularly think it hurts TDP, as only a fraction of voting public follows social media. Only some fringe elements :) ) . But, I think just mirroring many of these posts on these channels with dedicated accounts would help. Sends positive message.

++1111

Link to comment
Share on other sites

నెదర్లాండ్స్‌కు ఏడీసీ బృందం




  • రాజధానికి వరద ముప్పు నివారణపై అధ్యయనం

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అమరావతి నగరానికి వరద ముప్పును తప్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)కి చెందిన ఉన్నతాధికారుల బృందం త్వరలో నెదర్లాండ్స్‌ వెళ్లనున్నట్లు తెలిసింది. కృష్ణానది నుంచి రాజధానికి వరద ముప్పును వైకుంఠపురం వద్ద నిర్మించే బ్యారేజీతో చాలా వరకూ కట్టడి చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొండవీటి వాగు ముంపును ఎదుర్కోవడంపైనే ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వరదల ప్రమాదాన్ని దాదాపు పూర్తిగా తగ్గించుకున్న నెదర్లాండ్స్‌ నుంచి అమరావతికి మేలు చేసే అంశాలపై అధ్యయనానికి ఈ పర్యటనను ఉద్దేశించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కాడిస్‌ సంస్థను అమరావతికి ‘బ్లూ కన్సల్టెంట్‌’గా నియమించుకున్నది కూడా ఈ లక్ష్యంతోనే.


Link to comment
Share on other sites

Just wanted to express my appreciation for the time, effort and dedication many of you here have towards the state of AP and TDP. 

 

It's a pleasure coming to this site and reading these posts. You guys are doing remarkable work  :shakehands:

 

I wish it could reach wider audience. I don't follow social media channels that much,  but is there a way to mirror some of these informational posts on social media without too much overhead to the posters? Like, posting them to a dedicated youtube channel, fb page and twitter etc? 

 

I see lot of negativity on TDP being spread around social media (I don't particularly think it hurts TDP, as only a fraction of voting public follows social media. Only some fringe elements :) ) . But, I think just mirroring many of these posts on these channels with dedicated accounts would help. Sends positive message.

 

++1111

try chestham bro

Link to comment
Share on other sites

Just wanted to express my appreciation for the time, effort and dedication many of you here have towards the state of AP and TDP.

 

It's a pleasure coming to this site and reading these posts. You guys are doing remarkable work :shakehands:

 

I wish it could reach wider audience. I don't follow social media channels that much, but is there a way to mirror some of these informational posts on social media without too much overhead to the posters? Like, posting them to a dedicated youtube channel, fb page and twitter etc?

 

I see lot of negativity on TDP being spread around social media (I don't particularly think it hurts TDP, as only a fraction of voting public follows social media. Only some fringe elements :) ) . But, I think just mirroring many of these posts on these channels with dedicated accounts would help. Sends positive message.

+1111

Link to comment
Share on other sites

Just wanted to express my appreciation for the time, effort and dedication many of you here have towards the state of AP and TDP. 

 

It's a pleasure coming to this site and reading these posts. You guys are doing remarkable work  :shakehands:

 

I wish it could reach wider audience. I don't follow social media channels that much,  but is there a way to mirror some of these informational posts on social media without too much overhead to the posters? Like, posting them to a dedicated youtube channel, fb page and twitter etc? 

 

I see lot of negativity on TDP being spread around social media (I don't particularly think it hurts TDP, as only a fraction of voting public follows social media. Only some fringe elements :) ) . But, I think just mirroring many of these posts on these channels with dedicated accounts would help. Sends positive message.

 

 

+1111111 likes to all

Link to comment
Share on other sites

మహా స్వప్నం.. మహోన్నత యజ్ఞం
శరవేగంగా అమరావతి నిర్మాణం
ప్రణాళికలు, నిధులూ సిద్ధం
విద్యా సంస్థల దూకుడు
వూపందుకున్న ఎస్‌ఆర్‌ఎం, విట్‌, ఎన్‌ఐడీ నిర్మాణాలు
చురుగ్గా సాగుతున్న రహదారుల పనులు
లేఅవుట్‌ల అభివృద్ధికి టెండర్లు
అంకుర ప్రాంత అభివృద్ధికి సన్నాహాలు
image.jpg

మన పరిపాలన మన గడ్డపైనుంచే సాగాలన్న పట్టుదలతో రాజధాని నడిబొడ్డున వెలగపూడి వద్ద రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం నిర్మించింది. సచివాలయ యంత్రాంగాన్నంతటినీ హైదరాబాద్‌ నుంచి యుద్ధ ప్రాతిదికన ఇక్కడికి తరలించింది. శాసనసభ భవనాన్ని సిద్ధంచేసి బడ్జెట్‌ సమావేశాలు ఇక్కడే నిర్వహించింది. ఇదే వేగంతో రాజధానిలో అన్ని కీలక కట్టడాలను పూర్తిచేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. రాజధాని భూసమీకరణ ప్రక్రియ ప్రారంభించి రెండున్నరేళ్లే అయింది. ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ఇంత త్వరగా నిర్మాణ దశకు చేరుకున్న దాఖలాలు... ప్రపంచంలో ఏ అంతర్జాతీయ నగరంతో పోల్చి చూసినా కనిపించవు.

ఐదుకోట్ల ఆంధ్రుల కలల రాజధాని సాకారమవుతోంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. విద్యా సంస్థల నిర్మాణం... కీలక రహదారుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అంకురప్రాంతంలో 8 లక్షల చదరపు అడుగుల టవర్‌ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన లేఅవుట్‌ల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలుస్తోంది. మరో 15 రోజుల్లో పరిపాలనా నగర ప్రణాళిక, ఐకానిక్‌ భవనాల ఆకృతులు సిద్ధమవుతాయి. 2 నెలల్లో వీటి నిర్మాణ పనులూ మొదలవుతాయి. హడ్కో, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు రుణాలిచ్చేందుకు ముందుకు రావడంతో నిధుల కొరతా లేదు. పనుల జోరు కొనసాగితే 2018 చివరి నాటికి... రాజధానిలో పరిపాలనా నగర నిర్మాణం, ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన, లేఅవుట్‌లు, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటు వంటి లక్ష్యాలు ఆచరణలోకి రావడం కష్టమేమీ కాదు..! అన్నీ అనుకున్నట్టు జరిగితే... కలల రాజధాని త్వరలోనే కళ్లముందు ఆవిష్కృతమవుతుంది.

అమరావతిలో వివిధ సంస్థలకు సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్శిటీలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమరావతి క్యాంపస్‌లలో తరగతులు నిర్వహించేందుకు శరవేగంగా భవనాలు సిద్ధం చేస్తున్నాయి. నీరుకొండ సమీపంలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 6 లక్షల చ.అడుగుల భవనాల్ని వచ్చే ఆగస్టుకి సిద్ధం చేసి తరగతులు ప్రారంభించనుంది. విట్‌ క్యాంపస్‌ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడంతస్తుల నిర్మాణం పూర్తయింది. ఆ సంస్థ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక్కడే తరగతులు నిర్వహించనుంది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) ఇప్పటికే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తరగతులు నిర్వహిస్తోంది. అమరావతి క్యాంపస్‌ నిర్మాణం పూర్తయిన వెంటనే అక్కడ తరగతులు ప్రారంభిస్తుంది. అమృత యూనివర్సిటీ నిర్మాణ పనులు వచ్చే ఆగస్టులో ప్రారంభమవుతాయి. బిఆర్‌షెట్టి, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వంటి సంస్థలూ త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సీఆర్‌డీఏ ఇంత వరకు పలు సంస్థలకు 945 ఎకరాలు కేటాయించింది.

వేగంగా రహదారుల నిర్మాణం..!
image.jpg

రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు)తో పాటు, మరో ఏడు ప్రధాన రహదారుల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం 34 ప్రధాన రహదారులుంటాయి. దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకి వెళ్లేవి 18, పడమర నుంచి తూర్పుకి వెళ్లేవి 16 రహదారులు నిర్మిస్తారు. 18.27 కి.మీ. పొడవైన ప్రధాన అనుసంధాన రహదారి పనులు రెండు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొదట నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత 8 వరుసలుగా విస్తరించాలన్నది ఆలోచన. మధ్యలో భూసేకరణ సమస్యలున్న మూడు చోట్ల తప్ప, మిగతా రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చినట్టే..! మరో ఏడు ప్రధాన రహదారుల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వీటి మొత్తం పొడవు 66 కి.మీ.లు. అంచనా వ్యయం రూ.1020 కోట్లు. ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మార్చిలో పనులు అప్పగించారు. ఏడాదిలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొత్తం 72 కి.మీ. పొడవైన మరో 11 రహదారులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేశారు. వీటి అంచనా వ్యయం రూ.1700-1800 కోట్లు.

వరద నీటిని ఎత్తిపోస్తారు..!
image.jpg

రాజధానిలో జల మార్గాలు, జలాశయాల అభివృద్ధి, కొండవీటివాగు వరద ముంపు నివారణకు టాటా-ఆర్కాడిస్‌ సంస్థ బ్లూ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. దీనిలో భాగంగానే కొండవీటివాగులో భారీగా వరద వచ్చినప్పుడు రాజధాని ప్రాంతం ముంపునకు గురవకుండా... వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు ప్రకాశం బ్యారేజీ పైన ఎత్తిపోతల పథకం చేపట్టారు. మొత్తం 5 వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రూ.222 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆరు నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం

అమరావతిలో నిర్మించే ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థగా, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం. మాకు 200 ఎకరాల స్థలం కేటాయించారు. శరవేగంగా పనులు చేస్తున్నాం. వచ్చే ఆగస్టు నుంచి ఈ క్యాంపస్‌లోనే తరగతులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం 6 లక్షల చ.అడుగుల భవనాలు నిర్మిస్తున్నాం. మొదటి సంవత్సరం 240 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభిస్తున్నాం.

- ఎస్‌ఆర్‌ఎం ఛాన్స్‌లర్‌ పచ్చముత్తు

జులైలో అమరావతి వీఐటీ ప్రారంభం

అమరావతిలో వీఐటీని జులైలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. వెంటనే తరగతులు మొదలవుతాయి. ప్రస్తుతం వసతిగృహ భవనాలు తప్ప... మిగిలిన భవనాలు అన్నీ పూర్తికావొచ్చాయి. తొలిదశలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు ప్రారంభిస్తాం. మలి దశలో వైద్య కళాశాలను కూడా నెలకొల్పుతాం.

-జి.విశ్వనాథన్‌, వ్యవస్థాపకులు, కులపతి, వీఐటీనిధుల సమీకరణ ఇలా...!

నిధుల సమీకరణ ఇలా

రాజధాని అభివృద్ధికి వచ్చే 20 ఏళ్లలో రూ.58,236 కోట్లు కావాలని అంచనా. దీనిలో రూ.32,463 కోట్లు వచ్చే మూడేళ్లలోనే కావాలి. రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) వివిధ మార్గాలు అనుసరిస్తోంది. రూ.7500 కోట్ల రుణం కోసం హడ్కోతో ఒప్పందం చేసుకుంది. తొలి విడతలో రూ.1275 కోట్లు హడ్కో మంజూరు చేసింది. ప్రపంచబ్యాంకు తొలి విడతలో రూ.3400 కోట్ల రుణం ఇవ్వనుంది. వీటితో పాటు ఏఐఐబీ, జేబీఐసీ, జైకా వంటి అంతర్జాతీయ సంస్థలతోను సీఆర్‌డీఏ సంప్రదింపులు జరుపుతోంది. బాండ్లు విడుదల చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచనా ఉంది.

image.jpgరైతు రుణం తీర్చుకు‘నేల’
image.jpg

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన లేఅవుట్‌ల (ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌)అభివృద్ధి పనులు మొదలయ్యాయి. నేలపాడు, దొండపాడు, పిచ్చుకలపాలెం గ్రామాలకు సంబంధించిన లేఅవుట్‌లలో పెగ్‌మార్కింగ్‌ (సరిహద్దుల గుర్తింపు) పనులు పూర్తయ్యాయి. జూన్‌ నెలాఖరుకి మిగతా లేఅవుట్‌లలోను పెగ్‌మార్కింగ్‌ చేస్తారు. డీజీపీఎస్‌, జీపీఎస్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెగ్‌మార్కింగ్‌ చేస్తున్నారు. సకల వసతులతో లేఅవుట్‌ల అభివృద్ధికి మొదటి మూడేళ్లలో రూ.10,815 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 29 గ్రామాలకు సంబంధించిన మొత్తం లేఅవుట్‌లను 13 జోన్లుగా విభజించారు. వీటిలో మూడు జోన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.2892 కోట్లు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. అంతర్గత రహదారులు, గ్యాస్‌, విద్యుత్‌, తాగునీరు, మురుగునీరు, వర్షపునీటి పారుదల వ్యవస్థలు వంటివన్నీ ఏర్పాటు చేస్తారు.

2018 చివరికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాలు..

* 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కొలిక్కి తేవడం.
* న్యాయ నగరంలో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయడం.
* ఆకర్షణీయంగా, సుస్థిరంగా ఉండేలా ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి.
* అత్యున్నత ప్రమాణాలతో సామాజిక మౌలిక వసతుల కల్పన.
* భూసమీకరణ/సేకరణ ప్రక్రియ నూరుశాతం పూర్తి చేయడం. రైతులకు నూరు శాతం స్థలాలు ఇవ్వడం.
* ప్రముఖ యూనివర్శిటీలు, విద్యాసంస్థల ఏర్పాటు

విద్యా సుగంధం ..!
image.jpg

image.jpg

రాజధాని స్వరూపం..

* మొత్తం విస్తీర్ణం: 217 చ.కి.మీ.లు (53,478 ఎకరాలు)
* కేంద్ర రాజధాని ప్రాంతం విస్తీర్ణం: 4283 ఎకరాలు
* స్టార్టప్‌ ప్రాంత విస్తీర్ణం: 1691 ఎకరాలు
* పరిపాలనా నగరం, న్యాయనగరం విస్తీర్ణం: 1365 ఎకరాలు.

తలమానికం పరిపాలన నగరం
image.jpg

అమరావతిలో 900 ఎకరాల్లో పరిపాలన నగరం, మరో 465 ఎకరాల్లో న్యాయనగరం నిర్మాణ పనులు అతి త్వరలో మొదలవనున్నాయి. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ 1365 ఎకరాల్లో పరిపాలన, న్యాయ నగరాలకు ప్రణాళిక, ఐకానిక్‌ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుల ఆకృతులు సిద్ధం చేస్తోంది. పరిపాలన నగర ప్రణాళిక దాదాపు సిద్ధమైంది. శాసనసభ ఆకృతిపై కూడా ఒక స్పష్టత వచ్చింది. హైకోర్టు ఆకృతిని రెండు వారాల్లో ఖరారు చేయనున్నారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి, రెండు నెలల్లో పరిపాలన నగర పనులు ప్రారంభించాలన్నది ఆలోచన. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతులు కార్యాలయ భవనాలు, గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాల ఆకృతుల రూపకల్పనకు ఆర్కిటెక్ట్‌ల ఎంపిక ప్రక్రియ తుది దశలో ఉంది. పరిపాలన నగరాన్ని రాజధానికే తలమానికంగా, అత్యద్భుతంగా నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం. శాసనసభ భవనంతో పాటు, నగరం మొత్తాన్ని తిలకించేందుకు పరిపాలన నగరం మధ్యలో నిర్మించే 560-600 అడుగుల ఎత్తైన టవర్‌, జలమార్గాలు, ఎలక్ట్రిక్‌ కార్లు, వాటర్‌ ట్యాక్సీలు, సెంట్రల్‌ స్పైన్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పరిపాలన నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు, వివిధ దేశాల కాన్సులేట్లు, మిషన్లు, కల్చరల్‌ సెంటర్లు వంటివి ఉంటాయి.

8 లక్షల చ.అడుగుల టవర్‌..!
అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్ని... సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాయి. సింగపూర్‌ సంస్థల కన్సార్టియంతో ఇటీవలే ఒప్పందం, ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగాయి. 1691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదట 656 ఎకరాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఉత్ప్రేరక అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో 50 ఎకరాల్లో 8 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన వాణిజ్య టవర్‌ నిర్మిస్తారు. ఆ తర్వాత అలాంటిదే మరో టవర్‌ నిర్మాణం చేపడతారు. 15 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

అమరావతిలో 80 ఎకరాల్లో బిజినెస్‌ పార్కు, 40 ఎకరాల్లో మైస్‌హబ్‌ ఏర్పాటుకి సీఆర్‌డీఏ త్వరలోనే టెండర్లు పిలవనుంది. మైస్‌ హబ్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ స్పేస్‌; హోటళ్లు వంటివి వస్తాయి. రాజధానిలో ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లకు టెండర్లు పిలవగా 8 బిడ్‌లు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాఠశాలల ఏర్పాటుకి బిడ్‌లు ఆహ్వానించగా 16 బిడ్‌లు వచ్చాయి. ప్రస్తుతం బిడ్‌ల పరిశీలన జరుగుతోంది.

- ఈనాడు, అమరావతి


 

Link to comment
Share on other sites

ఏపీకి మరో ప్రాజెక్టు!
 
 
636322255216692785.jpg
  • అమరావతికి ‘సూపర్‌ ఈసీబీసీ’
  • వెల్లడించిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ
  • సూపర్‌ ఈసీబీసీకి ఎంపికైన తొలి రాష్ట్రం ఏపీ
  • దీని ద్వారా రాష్ట్రానికి రూ.5 కోట్ల అదనపు నిధులు
  • స్వాగతించిన మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఎంపికైంది. వార్మ్‌ హ్యుమిడ్‌ జోన్‌లో ఉన్న అమరావతిని ‘సూపర్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌’(సూపర్‌ ఈసీబీసీ) భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఎంపిక చేసింది. అమరావతి నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న హరిత విధానాలను అవలంభిస్తున్న సీఎం చంద్రబాబు కృషికి దక్కిన ఫలితంగా దీన్ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాషా్ట్రనికి బీఈఈ రూ.5 కోట్ల నిధులను అదనంగా కేటాయించనుంది.
 
సూపర్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ విధానం వల్ల సాధారణ ఈసీబీసీ భవనాల కంటే 30 నుంచి 40 శాతం ఇంధన వనరులను ఆదా చేయవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 1500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. సూపర్‌ ఈసీబీసీ భవనాలను నిర్మించే పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపికైన తొలి రాష్ట్రం ఏపీ అని బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భక్రే పేర్కొన్నారు. సూపర్‌ ఈసీబీసీ ప్రాజెక్టుకు అమరావతిని ఎంపిక చేయడంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో ఏపీ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని గోయల్‌ వ్యక్తం చేశారు.
 
సూపర్‌ ఈసీబీసీ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీని ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారాయణ స్వాగతించారు. ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఏపీలో ఎనర్జీ కనర్వేషన్‌ మిషన్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో అమరావతిలో ఈసీబీసీ విధానాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ అన్నారు. రాజధానిలో నిర్మించనున్న సూపర్‌ ఈసీబీసీ భవనాలు అమరావతిని పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడు తాయని, తద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాజధానిలో 1500 చదరపు గజాల స్థలం కేటాయించామని చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో ఎనర్జీ ఎఫిషియన్సీ నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Link to comment
Share on other sites

2 నెలల్లో పాలన నగర పనులు

40 రోజుల్లో మిగిలిన భూసేకరణ పూర్తి

రైౖతులకిచ్చిన స్థలాల్లో నెలలో లేఅవుట్ల అభివృద్ధి: ‘ఈనాడు’తో మంత్రి నారాయణ

4ap-main9a.jpg

ఈనాడు, అమరావతి: పాలనానగరం, అంకుర ప్రాంతం (స్టార్టప్‌ ఏరియా)లో నిర్మాణాలు, విద్యాసంస్థలు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, నక్షత్రాల హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్మాణంతో... వచ్చే ఏడాది చివరి నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ కొలిక్కి వస్తుందని మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. మొత్తం రాజధాని నగర ప్రాంతంలో సమీకరణ కింద ప్రభుత్వానికివ్వని భూమంతటినీ 40రోజుల్లో సేకరణ రూపంలో తీసుకుంటామని వెల్లడించారు. 2013 భూసేకరణ చట్టం కింద ఈభూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులకిచ్చిన స్థలాల అభివృద్ధి పనులకు నెలలో శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. గ్రామకంఠాల సమస్య 99శాతం పరిష్కారమైందని, ఇతరత్రా భూవివాదాల పరిష్కారమూ దాదాపు పూర్తయినట్లేనని వెల్లడించారు. అమరావతి నిర్మాణ విశేషాల్ని ‘ఈనాడు’కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

‘‘రాజధానిలో అత్యంత కీలకమైన పాలనానగర నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభించబోతున్నాం. 15 రోజుల్లో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ తుది నమూనా అందిస్తుంది. ఆపై మూడు వారాల్లో స్ట్రక్చరల్‌ డిజైన్‌ ఇస్తుంది. వెంటనే టెండర్లు పిలుస్తాం. ఆ పనులతో పాటే దిగ్గజ (ఐకానిక్‌) నిర్మాణాలైన శాసనసభ, హైకోర్టు పనులు ప్రారంభమవుతాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల భవనాల పనులు వేగంగా సాగుతున్నాయి.

తొలిదశలో బ్యారేజీ పక్కనుంచే సీడ్‌ యాక్సెస్‌ రహదారి: కనకదుర్గ వారధి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రహదారిని నిర్మించాలంటే భారీ పైవంతెనతోపాటు జనావాసాల మధ్యనుంచి ఆరు వరసల రహదారి నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఆలస్యమవుతున్నందున... ప్రజలకు సీడ్‌ యాక్సెస్‌ రహదారి త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్‌ పక్కనుంచే సీడ్‌ యాక్సెస్‌ రహదారి ప్రారంభమయ్యేలా కొన్ని మార్పులు చేశారు. ఇక్కడ కొంత భూమిని సేకరించాలి. అది పూర్తయ్యాక ఈపనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఈరహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. నాలుగైదు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మలిదశలో మణిపాల్‌ ఆసుపత్రి వరకు పొడిగిస్తాం. రైతులకిచ్చిన స్థలాల్ని లేఅవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. నెలలో ఈ పనులు ప్రారంభమవుతాయి. రాజధాని నగరాభివృద్ధికి హడ్కో నుంచి రూ.7వేల కోట్లు, ప్రపంచబ్యాంకు నుంచి రూ.6800 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తం రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం.

పేదలకు 5వేల ఇళ్లు!

రాజధానిలో ఇళ్లు లేని పేదలకి మొదటి దశలో ఒక్కోటి రూ.5.5లక్షల వ్యయంతో 300చ. అడుగుల విస్తీర్ణంలో 5 వేల మందికి ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.3లక్షలు, లబ్ధిదారుని పేరిట బ్యాంకు రుణం రూ.2.5లక్షలు చొప్పున ఉంటుంది. రెండోదశలో మరో రెండు వేల ఫ్లాట్లు నిర్మిస్తాం. ఉపాధి లేని రైతు కూలీలందరికీ నిర్మాణ పనుల్లోకి తీసుకునే ఏర్పాటుచేశాం.

Link to comment
Share on other sites

నేడు రాజధానిలో హరిత భవనాల అభివృద్ధిపై సమావేశం

ఈనాడు, అమరావతి: రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో హరిత భవనాలు, సుస్థిర ఆవాసాల నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన అవకాశాలపై చర్చించేందుకు ‘ద ఎనర్జీ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (టెరీ) ప్రతినిధి బృందంతో సోమవారం సీఆర్‌డీఏ అధికారులు సమావేశం కానున్నారు. హరిత, నీలి నగరాల అభివృద్ధిలో భాగంగా విధివిధానాల రూపకల్పనపై చర్చించనున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...