Jump to content

Amaravati

Recommended Posts

స్థూపాకృతిలో అసెంబ్లీ
 
636319714782967261.jpg
అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని ప్రతిష్ఠాత్మక కట్టడాల (ఐకానిక్‌ బిల్డింగులు)లో ఒకటైన శాసనసభ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కాన్సెప్ట్‌ డిజైన్‌ను ఏపీ సీఆర్డీయే తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. 160 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదాల్చనున్న ఈ భవంతి బాహ్యస్వరూపం, అంతర్గత రూపురేఖలపై అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, తదనుగుణంగా అవసరమైన మార్పుచేర్పులను పొందుపరుస్తూ, ఫైనల్‌ డిజైన్‌ను రూపొందించనున్నారు. ఇందుకు సుమారు 2 నుంచి 3 వారాలు పట్టవచ్చునని భావిస్తున్నారు. వాస్తవానికి గత నెల 22వ తేదీన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలోనే అసెంబ్లీ కాన్సెప్ట్‌ డిజైన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ అయిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారులకు చూపగా, దానిపై ఏకాభిప్రాయం కుదిరింది. తాజాగా సీఆర్డీయే వీటిని వెల్లడించింది.
 
బౌద్ధ స్థూపాలను తలపించేలా..
రాజధాని ప్రాంతం గతంలో ప్రపంచంలోని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లిన సంగతి విదితమే. అందుకు చిహ్నంగా ఈ ప్రాంతంలోని వేదాద్రి, ఘంటసాల, భట్టిప్రోలు తదితర ప్రదేశాల్లో పలు బౌద్ధ స్థూపాలు, చైత్యాలు బయల్పడ్డాయి. దీంతో, చరిత్ర, ఆధునికతలకు అద్దం పట్టేలా నిర్మాణాలుండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు అసెంబ్లీ భవన డిజైన్లను తీర్చిదిద్దారు. బయటి నుంచి చూస్తే భారీ బౌద్ధ స్థూపాన్ని తలపిస్తూ, అత్యంత ఆకర్షణీయంగా గోచరించే ఈ భవంతి... అదే సమయంలో అసలుసిసలైన ఐకానిక్‌ బిల్డింగ్‌లా ఉందనిపించేందుకు అవసరమైన జాగ్రత్తలూ తీసుకున్నారు. అసెంబ్లీ అంటే కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలవాలని, ప్రజలెవరైనా అందులోకి ప్రవేశించి చట్టసభలను వీక్షించడమే కాకుండా విజ్ఞానం, వినోదాన్ని సముపార్జించే వీలు కల్పించాలని సీఎం ఇచ్చిన ఆదేశానుసారం ఇందులో మొత్తం 4 బ్లాకులు, వాటి మధ్యన పబ్లిక్‌ ఫోరాన్ని ప్రతిపాదించారు. దానికి ఇరువైపులా శాసనసభ, మండలి, పార్లమెంట్‌ తరహాలో సెంట్రల్‌ హాల్‌, సందర్శకులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సదుపాయాలతో కూడిన కామన్‌ ఫెసిలిటీలను కల్పించనున్నారు. పబ్లిక్‌ ఫోరంలో యాంఫీ థియేటర్‌, విశాలమైన మ్యూజియం, వర్తులాకారంలో ఉండే ర్యాంపుల ద్వారా పైఅంతస్థులకు వెళ్లే మార్గాలు, కళ్లు జిగేలనిపించే బ్రహ్మాండమైన ఎలివేషన్‌, అంతర్గత అలంకరణలు ఎన్నో ఉంటాయి. పైన సూర్యకాంతి లోనికి ప్రసరించి, ఈ భవంతిని వెలుగులతో నింపేందుకు వీలుగా భారీ డోమ్‌ను ఏర్పాటు చేస్తారు. రాజధాని ప్రాంతంలో ఎండ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి, ఉష్ణోగ్రతలను సాధ్యమైనంత కిందికి దించేలా ఈ భవంతి ప్లాన్‌ ఉంది. ఎక్కడికక్కడ అన్ని వైపుల నుంచి గాలి ఇందులోకి ప్రవేశించి, మూలమూలలకూ సోకేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. వాననీటి సంరక్షణకు, వాడిన నీటిని రీసైక్లింగ్‌ చేసి గార్డెనింగ్‌ తదితరాలకు వాడుకునేందుకు కూడా ఇందులో ప్రతిపాదించారు. నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన అసెంబ్లీ కాన్సెప్ట్‌ డిజైన్లు గతంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఉండి, ఆనక ఉద్వాసనకు గురైన జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్‌ ఇచ్చిన డిజైన్ల కంటే చాలా బాగున్నాయన్న వ్యాఖ్యలు సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల నుంచే కాకుండా వీటిని సీఆర్డీయే వెబ్‌సైట్‌లో చూసిన పలువురి నుంచి కూడా వినిపించాయి.
Link to comment
Share on other sites

inka prajabiprayam ledu em ledu...tenders start chesi..inko 2 mnths lopu cnstructions start cheyyandra.. boothulu tidatannaru janalu poddugukulu ee bommalu chupistante.. lekapothe asalu ee designle release cheyyamakandi, ivi release chesinappudalla geliki mari tittinchukunnattoutundi..

Prajabhiprayam ani cheppi vaalle design final chesesaru ga. Aa mathram dhaaniki adagatam dheniki time waste kakapothe
Link to comment
Share on other sites

2 options lo okati idhi, inkoti tower kada. Separate ga kattadam enti?

100 అడుగుల శాసనసభ భవనం..!

నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇది వరకు నాలుగు గోళాకారపు భవనాలు, దానిపై 540 అడుగుల ఎత్తైన టవర్‌తో శాసనసభ భవన ఆకృతిని రూపొందించింది. ఇప్పుడు 100 అడుగుల ఎత్తుతో, 10 అంతస్తులతో మరో ఆకృతిని రూపొందించింది. ఈ రెండో ఆకృతి వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. దానికి మరింత మెరుగులు దిద్దాలని సూచించారు. శాసనసభ, శాసనమండలి భవనానికి మధ్యలో సెంట్రల్‌ హాల్‌ ఉండాలన్నారు. శాసనసభ భవనం పైన టవర్‌ ఉండటం భద్రతా పరంగా సరైనది కాదని, టవర్‌ను విడిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పరిపాలనా నగరం పొడవు 4 కిలోమీటర్లు. అటు రెండు, ఇటు రెండు కిలోమీటర్లు ఉండేలా... పరిపాలనా నగరం మధ్యలో 560 నుంచి 600 అడుగుల ఎత్తైన టవర్‌ను ఏర్పాటు చేస్తారు. సందర్శకులు ఈ టవర్‌పైకి ఎక్కితే నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. అష్కాబాద్‌, అస్థానా... ఇలా వివిధ నగరాల్లో టవర్లు విడిగానే ఉన్నాయని, అమరావతిలో కూడా విడిగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Madhyalo tower kadithe Assembly ekkada kadatharu?
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...