Jump to content

Amaravati

Recommended Posts

160 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ, 8-10 అంతస్థులుగా సచివాలయం
 
636306497133714019.jpg
అమరావతి: పరిపాలన నగరంలో నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర శాసనసభ భవంతిని రాజధానికే తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల విస్తీర్ణాన్ని వెచ్చిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాల కోసమే వదిలిపెడతారు. మొత్తం నగరానికే వన్నె తెచ్చేలా ఏపీ కొత్త శాసనసభ భవంతి నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు సూచించినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు. ఈ మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు.
 
అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90 శాతం పూర్తయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ babu.jpgసమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈనెల 12 నుంచి 16 వరకు లండన్‌లో ఆకృతులపై జరిగిన కార్యగోష్టిలో పాల్గొన్నామని తెలిపారు. ముఖ్యంగా శాసనసభ కట్టడం, ప్రజా రవాణా వ్యూహం, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో చర్చించామని చెప్పారు. ఈనెల 22న ఫోస్టర్ బృందం మలి విడత ఆకృతుల్ని అందిస్తుందని అన్నారు. క్రిస్ బెర్గ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఆకృతుల్ని పరిశీలించి ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు అందిస్తే వాటిని పొందుపరుస్తూ తుది ఆకృతులు సిద్ధం చేసి అందిస్తారని చెప్పారు.
 
సచివాలయ భవంతి 8 నుంచి 10 ఫ్లోర్లతో కనీసం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా వుండేలా సచివాలయ నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర సచివాలయ భవంతి చూడ్డానికి బాగుండటమే కాకుండా పని చేసే వాతావరణం ఉట్టిపడేలా జల, హరిత ఆకర్షణలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందిస్తున్న ప్రజా రవాణా ప్రణాళిక రానున్న కాలపు అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూడాలన్నారు.
 
ప్రస్తుత ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ హైపర్ లూప్ తరహా వినూత్న రవాణా వ్యవస్థలు తెర ముందుకు వస్తున్నాయని చెబుతూ, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించేలా ఫోస్టర్ బృందానికి సూచించాలని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ నగరాల్లో ఓన్ యువర్ కార్, లీజ్ యువర్ కార్, రెంట్ యువర్ కార్ అనే కాన్సెప్ట్ నడుస్తోందని, అమరావతిలో డ్రైవర్‌లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీ, మెట్రో రైలు వ్యవస్థ, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్‌టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థ బృహత్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
 
నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకు డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయని, ఇవి నిర్ణీత బస్సు స్టాపులలో ఆగుతూ సాగుతాయని అధికారులు తెలిపారు. పరిపాలన నగరంలో ఒక రోడ్డు నుంచి మరొక రోడ్డుకు కాలినడకన చేరుకోవడానికి కేవలం 5 నిమిషాలే పట్టేలా వుంటుందన్నారు. బస్సు, రైలు, వాటర్ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టికెట్ విధానం వుండే పద్దతిని ప్రవేశపెడదామని ముఖ్యమంత్రి చెప్పారు.
 
అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించబోయే సాంస్కృతిక భవనం మన తరతరాల మన సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రలకు అద్దం పట్టేలా నిలవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర శాసనసభ తరువాత ఇదే నగరానికి తలమానికంగా వుండే నిర్మాణమని అన్నారు. రాజధానికి వచ్చే ప్రతి ఒక్కరూ దీన్ని చూసి స్పూర్తి పొందేలా వుండాలని చెప్పారు. రాజధానిలో ఫ్లైవోవర్లు లేనిదే నగరానికి ఆకర్షణ వుండదంటూ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా వున్న తొలి వంద ఫ్లైవోవర్లను పరిశీలించి అత్యుత్తమంగా ఉన్న ఆకృతులను తీసుకోవాలని కోరారు.
 
లండన్ పర్యటనలోనే కేంబ్రిడ్జికి వెళ్లి అక్కడ కాలువల వ్యవస్థపై అధ్యయనం చేశామని సీఆర్‌డీఏ కమిషనర్ తెలియజేశారు. త్వరలో అమరావతి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ పోర్టల్ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన మొత్తం నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, నిర్వహణ, పర్యవేక్షణలకు వీలుగా ఉంటుందని వివరించారు.
 
Link to comment
Share on other sites

Yekkadaina kukkala morugudu common
Link to comment
Share on other sites

160 ఎకరాల్లో అసెంబ్లీ

సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు 8 భవనాలు

సెంట్రల్‌ స్పైన్‌కి అటు నాలుగు, ఇటు నాలుగు నిర్మాణం

మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, ఉద్యోగులంతా ఒకేచోట

రాజధాని పనులపై ముఖ్యమంత్రి సమీక్ష

ఈనాడు - అమరావతి

17ap-main5a.jpg

రాజధాని అమరావతిలో పరిపాలనా నగరంలో శాసనసభ, శాసన మండలి భవంతికి 160 ఎకరాలు కేటాయిస్తున్నారు. దీనిలో 140 ఎకరాల్ని జల, హరిత అవసరాలకే వినియోగిస్తారు. ఇది వరకు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని వేర్వేరుగా నిర్మించాలనుకున్నారు. ఇప్పుడు ఈ రెండూ కలిపే... మొత్తం 8 భవనాలు నిర్మిస్తారు. పరిపాలనా నగరంలోని సెంట్రల్‌ స్పైన్‌ (మధ్యలో ఉండే రహదారి)కి ఒకపక్క నాలుగు, మరోపక్క నాలుగు భవనాలు వస్తాయి. ఒక శాఖకు సంబంధించి మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతులు, ఉద్యోగులు మొత్తం ఒకే చోట ఉండేలా ప్రతిపాదించారు. 900 ఎకరాల్లో పరిపాలనా నగరం, దానికి కొనసాగింపుగా మరో 468 ఎకరాల్లో న్యాయనగరం.. మొత్తం కలిపి 1368 ఎకరాలకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందిస్తున్న ప్రణాళిక 90 శాతంపైగా పూర్తయింది. దిగ్గజ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్నీ ఆసంస్థ దాదాపు సిద్ధం చేసింది. వీటిని వచ్చే సోమవారం ప్రభుత్వానికి అందజేయనుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో రాజధాని పనుల పురోగతిని సమీక్షించారు. దీనిలో నార్మన్‌

ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పరిపాలనా నగరం ప్రణాళికలో చేసిన మార్పులను వివరించారు.

మూడేసి ఆకృతులు..!

శాసనసభ, శాసనమండలి భవన ప్రాథమిక ఆకృతిని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇప్పటికే అందజేసింది. స్థూలంగా ఆ కాన్సెప్ట్‌నే మరింత మెరుగు పరిచి మూడు భిన్నమైన ఆకృతులు సిద్ధం చేస్తోంది. హైకోర్టు భవనానికి కూడా మూడు ఆకృతులు రూపొందిస్తోంది. వీటిని ఈ నెల 22న ముఖ్యమంత్రి తదితరులు పరిశీలించి వాటిలో ఒక ఆకృతిని ఎంపిక చేస్తారు. అప్పుడు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఆ భవనాల వివరణాత్మక ఆకృతులు సిద్ధం చేస్తుంది.

రాజధానిలో హైపర్‌లూప్‌ టెక్నాలజీ

ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన ప్రజా రవాణా ప్రణాళిక ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకూ తగ్గట్టుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలో హైపర్‌లూప్‌ తరహా వినూత్న రవాణా వ్యవస్థలు తెర మీదకు వస్తున్నాయని, ప్రస్తుతం అంతర్జాతీయ నగరాల్లో ఓన్‌ యువర్‌కార్‌, రెంట్‌ యువర్‌ కార్‌, లీజ్‌ యువర్‌ కార్‌ అనే విధానం నడుస్తోందని తెలిపారు. ప్రజా రవాణాకు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. బస్సు, రైలు, వాటర్‌ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టిక్కెట్‌ విధానం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. పరిపాలన నగరంలో నిర్మించే సాంస్కృతిక భవనం మన తరతరాల సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదకు అద్దంపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభ తర్వాత నగరానికి తలమానికంగా ఉండే నిర్మాణం ఇదేనన్నారు. రాజధానిలో పైవంతెనలు (ఫ్లైఓవర్లు) లేనిదే నగరానికి ఆకర్షణ రాదని, ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన 100 ఫ్లైవోవర్లను పరిశీలించి వాటి ఆకృతులు తీసుకురావాలని సలహాఇచ్చారు. రాజధాని నగర నిర్మాణ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ‘అమరావతి రియల్‌టైం’ పోర్టల్‌ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అమరావతి ప్రాజెక్టు వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

17ap-main10c.jpg

సౌర విద్యుత్‌ నిల్వపై అంతర్జాతీయ సదస్సు

సౌర విద్యుత్‌ నిల్వకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పద్ధతుల్ని తెలుసుకోవడానికి త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇంధన రంగంలో అగ్రగామి సంస్థల ప్రతినిధులంతా దీనిలో పాల్గొంటారన్నారు. సౌర, పవన విద్యుత్‌ నిల్వ విధానంపై సమగ్ర అధ్యయానికి అవసరమైన సహకారం కోసం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడు అశోక్‌ ఝున్‌ఝున్‌ వాలాను వెంటనే సంప్రదించాలని ఇంధన శాఖ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌కు సూచించారు. భారత్‌తో 50 శాతం విద్యుత్‌ను సౌరశక్తి ద్వారా సమకూర్చుకునేలా ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని, 2030 నాటికి దేశమంతా సౌర విద్యుత్‌పై ఆధారపడేలా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పరిపాలన భవనాలిలా...

నిర్మిత ప్రాంతం:

5 లక్షల చదరపు అడుగులు

ఎంత మంది ఉద్యోగులు పనిచేయొచ్చు:

26000

ఒక్కో భవనం మధ్య దూరం :

150 నుంచి 200 మీటర్లు

భవనం నుంచి మరో భవనానికి వెళ్లేందుకు:

డ్రైవర్‌ రహిత వాహనాలు.

Link to comment
Share on other sites

అదిరేలా అసెంబ్లీ
 
636306703995081095.jpg
  • 160 ఎకరాల్లో ప్రాంగణం.. 20 ఎకరాల్లో భవన నిర్మాణం
  • 140 ఎకరాల్లో జల, హరిత వనరులు
  • 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో
  • పది అంతస్థుల సువిశాల సచివాలయం
  • 90 ఎకరాల్లో కళాత్మక సాంస్కృతిక భవనం
  • చరిత్రకు అద్దం పట్టేలా అద్భుత నిర్మాణం
  • అమరావతిలో డ్రైవర్‌ లెస్‌ కార్లు, బస్సులు
  • అన్ని రవాణా వ్యవస్థలకూ ఒకే టికెట్‌
  • ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లై ఓవర్లు
  • 22న పాలనా నగరి మలి ఆకృతులు
  • సీఆర్డీయేతో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని మకుటాయమానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు పరిపాలనా నగరంలో అసెంబ్లీని 160 ఎకరాల్లో నిర్మించనున్నామని, ఇందులో కేవలం 20 ఎకరాల్లో భవన నిర్మాణం చేసి, మిగిలిన 140 ఎకరాలను జల, హరిత వనరుల (బ్లూ- గ్రీన కాన్సెప్ట్‌) కోసం కేటాయించనున్నట్లు సీఆర్డీయే ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకి తెలిపారు. అమరావతి నగర నిర్మాణ పురోగతిపై వెలగపూడి సచివాలయంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందిస్తున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ప్లాన, అందులోని 2 ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు 90 శాతం పూర్తయ్యాయని సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. అసెంబ్లీ భవనం అత్యంత ఆకర్షణీయంగా రాష్ట్రానికే వన్నె తెచ్చేలా ఉండాలని సీఎం సూచించడంతో రాజధాని మాస్టర్‌ప్లానలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల భవనాలను ఉత్తరదిశగా కొద్దిగా ముందుకు జరిపారు. ఈ నెల 22న ఫోస్టర్‌ బృందం మలివిడత ఆకృతులను అందజేస్తుందని, క్రిస్‌బెర్గ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యిందని శ్రీధర్‌ చెప్పారు.
 
సచివాలయ భవంతిని 8 నుంచి 10 అంతస్థులతో, కనీసం 5 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో, సుమారు 26 వేల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకొనేలా నిర్మించనున్నట్లు శ్రీధర్‌ చెప్పారు. అమరావతిలోని సాంస్కృతిక భవనాన్ని తరతరాల మన సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రకు అద్దం పట్టేలా నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీ తర్వాత ఇదే రాజధానిలో అందరూ చెప్పుకొనేలా ఉండాలని చెప్పారు. రాజధానికి వచ్చే ప్రతి ఒక్కరూ దీనిని చూసి స్ఫూర్తి పొందేలా ఉండాలని సీఎం సూచించారు. సాంస్కృతి భవన ప్రాంగణానికి 90 ఎకరాలను కేటాయించారు.
 
రాజధానిలో ప్రజారవాణా వ్యవస్థ భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఉండాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ హైపర్‌లూప్‌ తరహా వినూత్న రవాణా సాధనాలు అందులో కొలువుదీరేలా చూడాలని ఫోస్టర్‌కు సూచించాలని చంద్రబాబు సీఆర్డీయే అధికారులను కోరారు. నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకు డ్రైవర్లు ఉండని ఎలకి్ట్రకల్‌ బస్సులు నడుస్తాయని, పరిపాలన నగరంలో ఒక నోడ్‌ నుంచి మరొక దానికి కాలినడకన చేరుకునేందుకు కేవలం 5 నిమిషాలే పట్టేలా ఉంటుందని తెలిపారు. బస్సు, రైలు, వాటర్‌ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టికెట్‌ విధానం ఉండే పద్ధతిని ప్రవేశపెడదామని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
 
రాజధానిలో ఫ్లైవోవర్లు లేనిదే నగరానికి ఆకర్షణ ఉండదంటూ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా ఉన్న తొలి 100 ఫ్లైవోవర్లను పరిశీలించి, అత్యుత్తమంగా ఉన్న ఆకృతులను రూపొందించాలని పేర్కొన్నారు. అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ ప్రక్రియలో పురోగతిని ఎప్పటికప్పుడు వెల్లడించే అమరావతి పోర్టల్‌ను త్వరలో ప్రారంభిస్తున్నామని అధికారులు తెలిపారు.
 
సౌర విద్యుత్తు నిల్వపై అంతర్జాతీయ సదస్సు
సౌర విద్యుత్తు నిల్వ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పద్ధతుల గురించి తెలుసుకొనేందుకు త్వరలో అంతర్జాతీయస్థాయి సదస్సును నిర్వహించాలనుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
 
పైన.. పచ్చని వనాలు భూగర్భంలో.. రహదారులు
పైనంతా పచ్చని హరితవనాలు.. నీటి వనరులు.. కనిపిస్తాయి. భూగర్భంలో మాత్రం బోరింగ్‌ టన్నెల్‌ విధానంలో రహదారులు ఉంటాయి. సీఎం చంద్రబాబు ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో సోలార్‌ విద్యుత్తు బ్యాటరీ, ఆటోమేటిక్‌ సోలార్‌ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లాను సందర్శించారు. అక్కడ బోరింగ్‌ టన్నెల్‌ విధానంలో రహదారులు ఉండడాన్ని చంద్రబాబు బృందం గుర్తించింది. అమరావతిలోనూ ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో 100 మీటర్లకు దిగువన బోరింగ్‌ టన్నెల్‌ విధానంలో భూగర్భ రహదారులను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

రాజధానికి త్వరలో ప్రపంచబ్యాంకు నిధులు

రూ.3400 కోట్ల రుణం

సెప్టెంబరు-అక్టోబరుల్లో వచ్చే అవకాశం

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం పొందేందుకు అవసరమైన ప్రక్రియలన్నీ దాదాపు కొలిక్కి వచ్చాయి. వచ్చే సెప్టెంబరు-అక్టోబరు నాటికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు ప్రపంచబ్యాంకు రూ.3400 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రపంచబ్యాంకు రుణమిచ్చే ముందు నిర్వహించే పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనాలు, అభిప్రాయ సేకరణలు వంటి ప్రక్రియలన్నీ ముగిశాయి. ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచబ్యాంకు కోరిన మేరకు అవసరమైన పత్రాలన్నీ సీఆర్‌డీఏ దాదాపు అందజేసింది. ఒకటి రెండు నివేదికలు ఇవ్వాల్సి ఉందని, వాటిని త్వరలోనే అందజేస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. వడ్డీ ఎంత? తిరిగి చెల్లించే ప్రక్రియ ఎప్పటినుంచి మొదలు పెట్టాలి? వంటి అంశాలపై జూన్‌లో ప్రపంచబ్యాంకుతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చిస్తుంది. ఆ తర్వాత బ్యాంకు పాలకమండలి సమావేశంలో రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటారని, ఈ కసరత్తంతా ముగిసి డబ్బులు మన చేతికి వచ్చేసరికి మరో మూడు, నాలుగు నెలలు పడుతుందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

ఆరు శాతం వరకు వడ్డీ!

ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణానికి వడ్డీని లండన్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఆఫర్డ్‌ రేట్‌ (లిబార్‌) ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది 1.8 నుంచి 2 శాతం వరకు ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ప్రపంచబ్యాంకుకు రుణాన్ని రూపాయిల్లోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గినా అప్పటికి ఉన్న డాలర్‌ విలువను బట్టే చెల్లింపులు ఉండాలి. ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటే అసలుపై, మనం వడ్డీ రూపంలో చెల్లించాల్సింది గరిష్ఠంగా 6 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. రుణాన్ని 35 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పది నుంచి 15 ఏళ్ల వరకు రుణం చెల్లింపు మొదలుపెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ గడువు (మారటోరియం) ఎంతన్నది ప్రపంచబ్యాంకుతో సంప్రదింపుల సందర్భంగా నిర్ణయిస్తారు. గడువు తక్కువ ఉంటేనే మంచిదని, గడువు మరీ ఎక్కువున్నా అసలుకు వడ్డీ కూడా కలిసి భారం ఎక్కువవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఆ డబ్బులు తిరిగిచ్చేయవచ్చు..!

రాజధానిలో రహదారుల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల కోసం ప్రపంచబ్యాంకు నుంచి సీఆర్‌డీఏ రుణం తీసుకుంటోంది. వీటిలో ఏడు రహదారుల నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ప్రపంచబ్యాంకు రుణం తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుండటంతో హడ్కో నుంచి తీసుకున్న నిధుల్ని రహదారుల నిర్మాణానికి సీఆర్‌డీఏ వెచ్చిస్తోంది. సీఆర్‌డీఏకి రూ.3400 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదించిన నేపథ్యంలో ఆ మొత్తంలో 30 శాతాన్ని ముందుగా వేరే వనరుల ద్వారా సమకూర్చుకుని ఖర్చు చేసుకునే వెసులుబాటుంది. ప్రపంచబ్యాంకు రుణం వచ్చాక ఇతర వనరుల నుంచి తెచ్చుకున్న నిధులను వారికి చెల్లించవచ్చు. చేపట్టిన ప్రాజెక్టులు ప్రపంచబ్యాంకు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉన్నప్పుడే ఈ వెసులుబాటు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రాజధానిలో ఏడు రోడ్లను ప్రపంచబ్యాంకు నిబంధనలకు లోబడి అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేశాకే చేపట్టారు. హడ్కో సీఆర్‌డీఏకు ఇస్తున్న రుణానికి తొమ్మిది శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ప్రపంచబ్యాంకు రుణం వచ్చాక హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తామని, దాని వల్ల రుణభారం తగ్గుతుందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని 3 డి నమూనా ప్రదర్శన
 
636308681197398032.jpg
  • సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ప్రదర్శన
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధానిలోని 1,691 ఎకరాల్లో (6.84 చదరపు కిలోమీటర్లు) నిర్మితమవనున్న స్టార్టప్‌ ఏరియా భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చెందబోతోందో చూపుతూ సీఆర్డీయే రూపొందింపజేసిన 3 డి నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. విజయవాడలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజలు వేచి ఉండే హాలులో ఏర్పాటు చేసిన ఈ మినియేచర్‌ మోడల్‌ను కార్యాలయానికి వివిధ పనులపై వచ్చేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజధానిలోని మందడం వద్ద నిర్వహించిన స్టార్టప్‌ ఏరియా శంకుస్థాపనోత్సవం, బహిరంగసభను పురస్కరించుకుని ప్రజల సందర్శనార్ధం అక్కడ ఈ 3 డి నమూనాను తొలుత ఏర్పాటు చేశారు. సీఆర్డీయే ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చెన్నైకు చెందిన ఒక సంస్థ దీనిని దాదాపు రూ.10 లక్షలతో తయారు చేసినట్లు సమాచారం. అక్కడి కార్యక్రమం ముగిసిన తర్వాత దానిని జాగ్రత్తగా విజయవాడకు తరలించారు. స్టార్టప్‌ ఏరియాలోని వివిధ తరహా నివాసప్రాంతాలు (లో, మీడియం, హై డెన్సిటీ జోన్లు), కమర్షియల్‌ జోన్లు, రీజియనల్‌ సెంటర్‌ జోన, టౌన్ సెంటర్‌ జోన, సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌ జోన, బిజినెస్‌ పార్క్‌, లాజిస్టిక్స్‌, కాలుష్యరహిత జోన, రోడ్‌ రిజర్వ్‌, ఎడ్యుకేషన, స్పెషల్‌ జోనలతోపాటు భవిష్యత్తు అవసరాల నిమిత్తం అట్టే పెట్టబోతున్న ప్రొటెక్టెడ్‌ జోన, విలేజ్‌ ప్లానింగ్‌ జోన ఇత్యాదివే కాకుండా అందులోని పచ్చదనం, జలవనరులకు కేటాయించిన ప్రదేశాలను కూడా ఈ నమూనా సుస్పష్టంగా చూపుతోంది. వీటితోపాటు రాజధానికి మకుటాయమానంగా శోభిల్లనున్న ఈ అంకుర ప్రాంతంలోని సువిశాల రహదారులను బుల్లి తెలుపు రంగు విద్యుత్తు దీపాల సాయంతో చూడచక్కని విధంగా ప్రదర్శిస్తున్న ఈ నమూనాను చూసిన వారు దీని తయారీదారులను అభినందిస్తున్నారు. మొత్తంమీద.. రాజధాని అభివృద్ధికి ఉత్ర్పేరకంగా నిలిచి, అమరావతి శీఘ్రగతిన రూపుదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించగలదని విశ్వసిస్తున్న స్టార్టప్‌ ఏరియా భవిష్యత్తు చిత్రాన్ని ఈ విధంగా కళ్లెదుట నిలపడం పలువురి ప్రశంసలను చూరగొంటోంది.

bro ah photos unte ikkada veyyi

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...