Jump to content

Amaravati


Recommended Posts

it's not just 42% mana govt asset ki value perugutundi and that will be with us. also 4 crores per acre choppuna 100 acres kontaru ani kuda undi.

 

 

DECOIT gadu Raheja,Emaar e.t.c annitlo lo kuda CBN govt ki best equation teste vadu govt percentage ni mottan ettesa vadu personel ga dabbulu dobbadu...

CBN bada to ivvala kuda adi cheppadu..

 

https://www.youtube.com/watch?v=dMD1sfgdKCA

Acre ki 4Cr per acre kontaru ani ekkada vundhi bro ?? Can you post here ??

Link to comment
Share on other sites

సింగపూరే’ లాభసాటి

ఆ కన్సార్టియం స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

15 ఏళ్లలో 3 దశల్లో 1691 ఎకరాల స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి

4 లక్షల గృహాల మంజూరు

800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం

మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన చంద్రబాబు

ఈనాడు - అమరావతి

2ap-main1a.jpg

అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే రెండేళ్లలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు అనుమతించింది. కొత్తగా 800 కానిస్టేబుళ్ల నియామకానికి ఆమోదం తెలిపింది. పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ), సింగపూర్‌ కన్సార్టియం కలిసి అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) కంపెనీగా ఏర్పడి స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయనున్నాయి. ఏడీపీలో సింగపూర్‌ కన్సార్టియంకు 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుంది. మొత్తం 1691 ఎకరాలు స్టార్టప్‌ ఏరియాకుగానూ 15 ఏళ్లలో 3 దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల భూమిని అభివృద్ధి పరుస్తారు. ఏడీపీ కంపెనీలో 58:42 నిష్పత్తికి సంబంధించి సింగపూర్‌ కన్సార్టియం రూ.306 కోట్లు, ఏడీసీ రూ.220 కోట్లు పెట్టుబడులు పెడతాయి. ఆ మేరకు లాభాలను అదే నిష్పత్తిలో పంచుకుంటాయి. స్థూల విక్రయాదాయంపై రెవెన్యూ వాటా కింద మొదట దశలో 5 శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతాన్ని ఏడీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మొత్తం మూడు దశల్లో కలిపితే ఇది 8.7 శాతం ఉంటుంది.

ఏడీపీ కంపెనీ కేంద్ర రాజధాని ప్రాంతంలో భూమిని అభివృద్ధి పరిచి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పరుస్తుంది. క్వీన్‌బీలను, ఉద్యోగ అవకాశాలను పెంచే సంస్థలను ఆకర్షించే విధంగా మార్కెటింగ్‌ చేస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్లాట్లను విక్రయించే అధికారం సీఆర్‌డీఏకే ఉంటుంది. దీనివల్ల భూమిపై హక్కులు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఆ ఫ్లాట్లను వేలంద్వారా అత్యధిక పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను అందించగలిగే సంస్థలకు విక్రయిస్తాం. తొలి దశలో రిజర్వు ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించారు. ఏడీపీ, ప్రభుత్వ కమిటీ ద్వారా మిగతా దశల్లో విక్రయ ధరలను నిర్ణయిస్తారు.

మెకన్సీ అండ్‌ కో సంస్థ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో 15 ఏళ్లలో అమరావతిలో 1.25 లక్షల కుటుంబాలు స్థిరపడతాయి. 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.1,15,000 కోట్లు లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నులు రూపంలో రూ.8వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు రాబడి వస్తుంది. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి చోదకంగా ఉపయోగపడతాయి.

2ap-main1b.jpg

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుతో నగదు రూపంలో ప్రభుత్వానికి రూ.1246 కోట్లు (53 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడంద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు (75.3 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం లభిస్తుంది.

4 లక్షల గృహాల మంజూరు: ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 2017-18, 2018-19 సంవత్సరాలకు 4 లక్షల ఇళ్లు మంజూరు. నిర్మాణ బాధ్యత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు అప్పగింత. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల నిర్మాణం.

800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ: కొత్తగా 800 కానిస్టేబుళ్ల నియామకానికి ఆమోదం. ఇందులో 600 సివిల్‌, 200 ఏఆర్‌ కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ. విశాఖ గ్రామీణం, నగరం, ఉభయగోదావరి జిల్లాలకు సమానంగా ఈ పోస్టుల కేటాయింపు. విశాఖపట్నం, కడప కేంద్ర కారాగారాల్లో, కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఏలూరు జిల్లా కారాగారాల్లో కొత్త పోస్టుల సృష్టి. జైళ్లశాఖలో కొత్తగా 14 పోస్టులు. మరో 12 పోస్టుల మార్పిడి (కన్వర్షన్‌), పోస్టులకు పునర్‌నిర్వచనం (రీ-డిజిగ్నేషన్‌). మరో 14 పోస్టుల సరెండర్‌. 31 మందికి బదిలీలు. రాజమహేంద్రవరం, రాజోలు, ఆలమూరు, కందుకూరు, భీమునిపట్నం, ఆలూరు, రాయదుర్గం, మడకశిర, పొదిలి సబ్‌ జైళ్లను మూసివేయాలని ప్రతిపాదన. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల్ని డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1గా ఉన్నతీకరణ. మొత్తం 25 పోస్టుల ఉన్నతీకరణ.

పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం: ఒలింపిక్స్‌ విజేత పి.వి.సింధును గ్రూప్‌-1 సర్వీసులో నియమించేందుకు వీలుగా ఏపీ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనలైజేషన్‌ ఆప్‌ స్టాఫ్‌ ప్యాట్రన్‌ అండ్‌ పే స్ట్రక్చర్‌) చట్టానికి సవరణలు.

సీసీఎల్‌ఏ ఉత్తర్వులు వెనక్కి: విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని సర్వే నెం.15, రిషికొండ గ్రామంలోని సర్వే నెం.37, 38ల్లో ఉన్న 36.07 ఎకరాల భూమిపై 26.02.14న భూపరిపాలన ప్రధాన కమిషనరు (సీసీఎల్‌ఏ) జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. సీసీఎల్‌ఏ గతంలో ఈ భూములను ఏవైనా సంస్థలకుగానీ, ప్రభుత్వశాఖలకుగానీ ఇచ్చి ఉంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.

బుగ్గ కార్లు: మంత్రులు, అధికారులు, ప్రముఖుల వాహనాలపై నీలి, ఎర్రరంగు బుగ్గల వినియోగాన్ని ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం.

రెండున్నరేళ్లు అడ్డుకున్నారు

ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా తయారవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రెండున్నరేళ్లు స్విస్‌ ఛాలెంజ్‌ ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నారని ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. ఏ పనీ లేకనే దీక్షలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిర్చికి ఎవ్వరూ ఇవ్వనంత ధర ఇచ్చామని వివరించారు. ఎకరానికి రూ.30వేల ప్రయోజనం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో కొనలేక వదిలేసిన శనగల్ని తాము సేకరించామని తెలిపారు. ఉల్లి, పొగాకు, ఇప్పుడు పసుపు కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. మాకీ ఆకృతుల విషయమై మాట్లాడుతూ.. అవి మీకు నచ్చాయా? ఆయనేదో ఇచ్చేస్తే నేను తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ‘నార్మన్‌ ఫోస్టర్‌ నుంచి ఇంకా ఇంకా లాగుతున్నాం. ఏదో తెస్తే నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది రావాల్సిందే. హైటెక్‌ సిటీ ఆకృతులు 20 సార్లు తెప్పించుకున్నాం. జీఎంఆర్‌ విమానాశ్రయం కోసం 20 విమానాశ్రయాలు పరిశీలించాం’ అని వివరించారు.

కన్నన్‌ ఏం చెప్పారంటే...

కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌కు రావడం వెనుక కష్టాన్ని తమిళనాడుకు చెందిన కన్నన్‌ రామస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ పోస్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో వినిపించారు. దీని వెనక ఎంత కష్టముంది.. శ్రమ ఉంది అనేది గుర్తించాలని కోరారు.

నేను ఈ పోస్టును నా గుండెల్లో అంతులేని బాధతో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతో రాస్తున్నాను. దక్షిణకొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారతదేశంలో వాహనాల తయారీకి ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీకి సంబంధించిన స్థానిక సలహాదారుగా విశ్లేషణాత్మకంగా లోతుగా సర్వే చేసి మొదటిగా తమిళనాడు, రెండోదిగా గుజరాత్‌, మూడోదిగా శ్రీసిటీ ఆంధ్రప్రదేశ్‌ను సూచించాం. మా సలహా మేరకు సంస్థ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించారు. కియా మోటార్స్‌ భూమితో పాటు పన్ను రాయితీలు, ఇతర సౌకర్యాలకు ప్రభుత్వం అంగీకరించింది. 70 అనుబంధ పరిశ్రమల స్థాపనకు కూడా ఏర్పాట్లు జరిగాయి. అయితే సినిమా ఇక్కడే అడ్డం తిరిగింది. రాజకీయ నాయకులు కియా మోటార్స్‌కు కేటాయించదలచిన భూమికి ప్రభుత్వ విలువ కంటే 50శాతం ఎక్కువ రేటును లంచం అడిగారు. దీంతో కియా మోటార్స్‌ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. మేం చెప్పినట్లు శ్రీసిటీకి కాదు.. వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాకు. ఇక్కడ నీటి వనరులు చాల పరిమితం. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఎంతో ఉంది. ఎన్నో రాయితీలు ఇచ్చారు.

Link to comment
Share on other sites

విస్ చాలెంజ్ కే సై
 

636293743927248150.jpg
  • 15 ఏళ్లలో 1691 ఎకరాల్లో అద్భుత ఆర్థిక నగరం
  • సింగపూర్‌ కన్సార్షియం ప్రతిపాదనలకు ఓకే
  • ఏడీసీతో కన్సార్షియం.. లాభాల్లో 42% వాటా
  • భూమి విలువలోనూ కొంత వాటాకు అంగీకారం
  • మూడేళ్లలో 8.07 లక్షల చ.అడుగుల నిర్మాణం
  • 15 ఏళ్లలో రాజధానిలో 1.25 లక్షల కుటుంబాలు
  • 2.5 లక్షల మందికి అమరావతిలో కొత్తగా ఉపాధి
  • కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన సీఎం చంద్రబాబు
  • 2 ఏళ్లలో 4 లక్షల ఇళ్లు.. 800 కానిస్టేబుల్‌ పోస్టులు
  • బుగ్గల తొలగింపునకు మంత్రి మండలి ఓకే
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆర్థికనగరం అభివృద్ధి కోసం సింగపూర్‌ కంపెనీలు సమర్పించిన స్విస్‌ చాలెంజ్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం కేబినెట్‌ భేటీ జరిగింది. భేటీ వివరాలను సీఎం విలేకరులకు వివరించారు. సీఎం తెలిపిన వివరాలు ఇవీ.. సింగపూర్‌ కంపెనీల కన్సార్షియం అసెండాస్‌, సింగ్‌ బ్రిడ్జ్‌, సెంబ్‌ కార్ప్‌ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
 
ఈ సంస్థలు.. అమరావతి అభివృద్ధి కార్పొరేషన(ఏడీసీ)తో కలిసి అమరావతి అభివృద్ధి భాగస్వామి(ఏడీపీ) పేరుతో ఒక ఎస్పీవీని ఏర్పాటు చేస్తారు. 1691 ఎకరాలను 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ కన్సార్షియం అభివృద్ధి చేస్తుంది. మొదటి దశలో 651 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడతారు. రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేసి ఒక అద్భుత ఆర్థిక నగరాన్ని ఆవిష్కరించేందుకు ఇది దోహదపడుతుంది. అభివృద్ధి చేసి అమ్మినదానిలో వచ్చే లాభంలో 58 శాతం సింగపూర్‌ కంపెనీలకు, 42 శాతం ఏడీసీకి వాటాగా వస్తుంది.
 
అదే విధంగా కన్సార్షియంకు వచ్చే ఆదాయంలో భూమి విలువగా తొలి దశలో 5 శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం వాటాగా ఏడీసీకి వస్తుంది. ఇవన్నీ కలిపితే ఏడీసీ వాటా 53 శాతం, సింగపూర్‌ సంస్థల వాటా 47 శాతంగా ఉంటుంది. గతంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌, ఇతర సంస్థలకు భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వ వాటా 11 శాతం.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏడీసీకి అత్యధిక ఆదాయం వచ్చేలా ఒప్పందం జరిగింది.
 
పెట్టుబడులు ఇలా..
సింగపూర్‌ సంస్థలు-ఏడీసీ కలిసి అమరావతి అభివృద్ది భాగస్వామి(ఏడీపీ)లో 58:42 నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. అదే నిష్పత్తిలో లాభాలను పంచుకుంటాయి. దీని ప్రకారం సింగపూర్‌ కంపెనీలు రూ.306 కోట్లు, ఏడీసీ రూ.222 కోట్లు పెట్టుబడిగా పెడతాయి. ఇది కాకుండా ఏడీపీ రూ.2,118 కోట్లను ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఖర్చు చేస్తుంది. ఈ మౌలిక సదుపాయాలను ఆ తర్వాత ఏపీ సీఆర్‌డీఏకు బదలాయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నగదు రూపంలో రూ.1246 కోట్లు, మౌలిక సదుపాయాల రూపంలో రూ.2,118 కోట్లు, సింగపూర్‌ కన్సార్షియం పొందే ఆదాయం రూ.1105 కోట్లు ఉంటుందని మెకిన్సీ అండ్‌ కో అంచనా వేసిందన్నారు. ఈ కన్సార్షియంకు ఇచ్చే భూమి విలువను తొలి దశలో ప్రాథమికంగా ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించామన్నారు.
 
ఏడీపీ అభివృద్ధి చేసే నగరంలో 15 ఏళ్లలో 1.25 లక్షల కుటుంబాలు స్థిరపడతాయని, మొత్తం 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు వలన రాష్ట్ర జీఎ్‌సడీపీకి రూ.1.15 లక్షల కోట్లు సమకూరుతుందని, ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రూ.8-10 వేల కోట్ల పన్నుల రాబడి వస్తుందని అంచనా వేశామన్నారు. స్విస్‌ చాలెంజ్‌ మొదటి బిడ్‌పై ఆగస్టు 2016లో ఆదిత్య హౌసింగ్‌, ఎన్వీయన ఇంజనీర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ హైకోర్టులో బిడ్‌ నియమాలను సవాలు చేస్తూ రిట్‌ పిటిషన వేశాయని, దానిపై కోర్టు స్టే ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం అప్పీలుకు వెళ్లిందన్నారు. 2016 అక్టోబరు 26న రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన దృష్ట్యా అప్పీలు విరమించుకుని కొత్త బిడ్‌ను విడుదల చేశామన్నారు. ఆ రెండో బిడ్‌కు వచ్చిన ప్రతిపాదనలను ఇప్పుడు మంత్రివర్గం ఆమోదించిందన్నారు.
 
ఏ నగరానికి ఆ నగరమే
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుతోపాటు పాలనా నగరం, విద్యానగరం, వైద్య నగరం ఇలా అన్ని నగరాలను ప్రపంచస్థాయి సంస్థల సహకారంతో అభివద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని జీఎంఆర్‌, జీవీకే, శ్రీసిటీ రాజు తదితరుల ఆలోచనలు కూడా తీసుకుంటున్నామన్నారు. మాకి అసోసియేట్స్‌ డిజైన్లను తీసుకోలేదన్న కారణంగా ఆ సంస్థ ప్రభుత్వంపై చెడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లు మీకు నచ్చాయా? అని విలేకరులను ప్రశ్నించారు. ప్రస్తుతం నార్మన ఫోస్టర్‌ సంస్థ డిజైన్లను అందిస్తుందని, అవి కూడా ఒక పట్టాన తమకు నచ్చడం లేదన్నారు.
 
Link to comment
Share on other sites

ఈ కన్సార్షియంకు ఇచ్చే భూమి విలువను తొలి దశలో ప్రాథమికంగా ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించామన్నారు.

Link to comment
Share on other sites

Consortium is not getting 1600 acres in one shot. they get 50+ acres initially. once they finish 70% of development in that land they get next lot. There are so many "if", "only" ...etc in the agreement. it is by no means a blank check to singapore. Watch CBN's cabinet update video on the subject.

Link to comment
Share on other sites

ANnitiki answer crystal clear ga undi.inta kanna best deal India lo ippati varaku ledu Urban development lo...

 

DECOIT galla di emunde le deni kaina ekalu peekutaru.... CBN techina AP govt 48% agreement ni ni dabbulu dobbi govt di ZERO ga marcharu....

 

here IS DECO HISTORY just very few....list chala undi

 

- Emaar deal he said he will cancel once to power. Actually CBN made agreemnent for 48% to AP govt and DECO made it ZERO after taking bribes

- Raheja&other it parks lo per acre emplyoment lanti already unna conditions mottam ettesaru laluchilu chesi

- Vizag pharma city got established by CBN and by the time he got down 30 companies started there....DECO ramki tho kalisi a agreement marchesi land ni RE plots ki marchadu

- Krishanapatnam port lo port based CBN industrial park iste danni tokkesi tana vallaki SEZ lo kottaga ichadu

- 120 SEZ lo endukani GOvt ki share ledu? Why SEZ owners were allowed to borrow bank loans with lands from farmers and then gayab!!

- chivaraki gali gadu kuda bank loans techukunnadu steel plant lands kodava petti

- Anatapur lo 30k acres farmers vi bank lo petti dobbesaru

- Vapic 30k acres ni asalu project start kakunda bank lo petti malli danni beram pettaru RAS-ALKHAIMA gadiki

 

 

 

 

 

Link to comment
Share on other sites

2 నెలల తర్వాతే అమరావతి ఫైనల్‌ డిజైన్లు?
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి): అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ భవంతుల (అసెంబ్లీ, హైకోర్టు) ఫైనల్‌ డిజైన్లు సిద్ధమయ్యేందుకు కనీసం మరో 2 నెలలన్నా పట్టవచ్చునని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకూ అందుతున్న వార్తలను బట్టి ఈ తుది ఆకృతులను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని భావించారు. అయితే అది సాధ్యపడేలా లేదని, కాస్త ఆలస్యమైనా ఫర్లేదుగానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఈ డిజైన్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు తరచుగా పునరుద్ఘాటిస్తున్న దృష్ట్యా డిజైన్ల తయారీ ప్రక్రియను సాధ్యమైనంత వరకూ లోపరహితంగా జరపాలని సీఆర్డీయే అనుకుంటోం ది. ఫలితంగా ఫైనల్‌ డిజైన్లు మనకందేసరికి ఈ ఏడాది జులై కావొచ్చునని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

karakatta.jpgdini 4 lane cheyyali superga untundi appudu

 

brother 4 lane aa....naku Amaravathi side teliyadu kani maa side (Vij to Avanigadda) side cheyataniki chacharu bcz chala matti kavali height penchali kada

 

oka palce lo ite 3 or 4 times vesaru road poendi bcz aa area lo chala loose soil anta...malli daniki i think 1/2 km ki extra budget echaru...... edi rajanna rajya lo start chesaru adi vere vishyam

Link to comment
Share on other sites

karakatta.jpgdini 4 lane cheyyali superga untundi appudu

errii puvvu Eenadu gadu paper mossesukunte best..

 

errii puvvu Eenadu Errii puvvu Journalism

 

aa katta medha vellali ante bayam vesedhaa.. that too 2-3 years back.. :lol2:

 

Eenadu vadiki mind dobbindhaa..

 

antha bayam vunte Guest houses endhuku kattukuntaru, manthena satyanarayana buildings endhuku kattadu 2001 lo..

 

1995 lo idhe karakatta medha cycle medha Vij-Mandadam vellamu at 10:00 PM.

Ippudu vunattu street lights kuda vundevi kadhuu 3 years back varaku.. but chala busy road.. So many people used to travel in this way..

CBN house vachaka ee way lo Travel cheyyadam taggindhi..

 

Ilanti stories rayadaniki Siggu vundali

Link to comment
Share on other sites

 

2 నెలల తర్వాతే అమరావతి ఫైనల్‌ డిజైన్లు?

 

(ఆంధ్రజ్యోతి, అమరావతి): అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ఐకానిక్‌ భవంతుల (అసెంబ్లీ, హైకోర్టు) ఫైనల్‌ డిజైన్లు సిద్ధమయ్యేందుకు కనీసం మరో 2 నెలలన్నా పట్టవచ్చునని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకూ అందుతున్న వార్తలను బట్టి ఈ తుది ఆకృతులను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని భావించారు. అయితే అది సాధ్యపడేలా లేదని, కాస్త ఆలస్యమైనా ఫర్లేదుగానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఈ డిజైన్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు తరచుగా పునరుద్ఘాటిస్తున్న దృష్ట్యా డిజైన్ల తయారీ ప్రక్రియను సాధ్యమైనంత వరకూ లోపరహితంగా జరపాలని సీఆర్డీయే అనుకుంటోం ది. ఫలితంగా ఫైనల్‌ డిజైన్లు మనకందేసరికి ఈ ఏడాది జులై కావొచ్చునని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

 

 

Endee Torture..ennallu saame..antha perfect ga kaakapoina kontha start cheyandi..

Link to comment
Share on other sites

‘ఐకానిక్‌ బ్రిడ్జి’పై నోటిఫికేషన్‌
 
636295517598280569.jpg
  • డిజైన్‌, నిర్మాణం కోసంసంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు ఏడీసీ ఆహ్వానం
అమరావతి మే 4(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో కృష్ణానదిపై నిర్మించదలచిన ఐకానిక్‌ బ్రిడ్జి డిజైన, నిర్మాణానికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను(ఈవోఐ) కోరుతూ అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) నోటిఫికేషన జారీ చేసింది. అటూ ఇటూ మూడు వరుసల చొప్పున మొత్తం ఆరు లేన్లతో రూపుదిద్దుకోనున్న ఈ వంతెన అమరావతి ఖ్యాతిని చాటిచెప్పేలా ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. కృష్ణానదికి ఆవలివైపున ఉన్న ప్రాంతాలను రాజధానితో అనుసంధానించేందుకు నిర్మించే వంతెనల్లో ఇది తొలిది. అందువల్ల, ఈ బ్రిడ్జి రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు.
 
ఇందుకోసం పలు నమూనాలను పరిశీలించి, కూచిపూడి నాట్యముద్రలో అది రూపుదిద్దుకొంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిడ్జి డిజైనను సిద్ధం చేయడంతోపాటు, నిర్మించే బాధ్యతలనూ చేపట్టాలనే ఆసక్తి ఉన్న అనుభవం కలిగిన సంస్థ లేదా జాయింట్‌ వెంచర్లను గుర్తించేందుకు ‘ఏడీసీ’... ఈవోఐలను ఆహ్వానించింది. ఈ నిర్మాణాన్ని ఈపీసీ విధానంలో నిర్మించాలని నిర్ణయుంచారు. ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ నెల 8 నుంచి ‘ఏడీసీ’.. అధీకృత వెబ్‌సైట్‌ నుంచి డౌనలోడ్‌ చేసుకోవచ్చు. బిడ్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 5 వరకు గడువు ఇచ్చారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...