Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని అమరావతికి మూడు రింగ్ రోడ్లు

amaravati-ring-roads-30112016.jpg

మెట్రో నగరాలను తలదన్నేలా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బీజింగ్ తరహాలో రింగ్ రోడ్ల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

రాజధాని అమరావతిలో చేపట్టనున్న అంతర, బాహ్య, ప్రాంతీయ వలయ రహదారుల నిర్మాణంపై బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మౌలిక వసతులు కల్పించకుండా రాజధాని ప్రాంతం అభివృద్ధి అసాధ్యమని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా మౌలికవసతులు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ఇందులో భాగంగా రింగ్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రింగ్ రోడ్లు సాగేదిలా..
రాజధాని చుట్టూ మూడు రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కొలిక్కివచ్చాయి. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగ్ రోడ్లుగా పిలిచే వీటిని మొత్తం 454.5 కి.మీ మేర నిర్మించాల్సివుంది. 15 కి.మీ పరిధిలో 94.5 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డు, 25 కి.మీ. పరిధిలో 150 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 34 కి.మీ. పరిధిలో 210 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల రాజధాని నగరంతో సహా 1,36,000 ఎకరాల ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 4,73,000 ఎకరాల ప్రాంతం, రీజినల్ రింగ్ రోడ్డు 9 లక్షల ఎకరాల ప్రాంతం కలిగి వుంటుంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గన్నవరం విమానాశ్రయానికి రాజధాని ప్రాంతం నుంచి మరింత వేగంగా చేరుకోవచ్చు. ఐఆర్‌ఆర్ కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, తాడిగడప, ఎనికేపాడు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తుంది. విజయవాడ నగరంపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐఆర్ఆర్ ఉపకరిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మైలవరంలో సొరంగ మార్గం నిర్మించాల్సి వుంది. ఇది ఐదో నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ గుంటూరు, తెనాలి, కంచికచర్ల మీదుగా వెళ్లనుంది.
స్థూలంగా అమరావతి ఇది.

 

అమరావతి రాజధాని ప్రాంతం స్థూలంగా ఇలా వుండనుంది. దీని విస్తీర్ణం మొత్తం 8,603 చ.కి.మీ. 2 మెగా నగరాలు, 9 పట్టణాలు సహా 12 అర్బన్ నోడ్స్ వుంటాయి. మల్టీ మోడల్ కనెక్టివిటీ దీని ప్రత్యేకత. ఐదు జాతీయ రహదారులు, పది రాష్ట్ర రహదారులు, ఐదు రైల్వే జంక్షన్లు, 4 జాతీయ జల మార్గాలు, రెండు ప్రత్యేక రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్స్-పార్క్‌లు, హైస్పీడ్ రైల్ కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయం, 94 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు, 210 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక ఆర్ధిక కారిడార్, 217 చ.కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్, కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి వుంటుంది.

అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై భారీ వంతెనలు నిర్మించాల్సి వుంది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వయంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం బాధ్యతను మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని యోచిస్తోంది.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రతి రూపాయికి ఫలితం వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రైవేట్ ఏజెన్సీలు మరింత ప్రతిభ కనబరచాల్సి వుందన్నారు. ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పని చేయకుంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్ప ఎటువంటి ప్రయోజనం వుండదని చెప్పారు.

రాజధాని పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎటువంటి విధానం అనుసరించాలో మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ బిల్డింగ్ రూల్స్-2016పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఈ అంశంపై కొద్దిసేపు చర్చ జరిగింది. మరింత కసరత్తు చేసి రావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, మునిసిపల్ కార్యదర్శి కరికాల వలవన్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, అదనపు కార్యదర్శి రాజమౌళి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్, రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

కృష్ణానదిపై వివిధ ప్రదేశాల్లో భారీ వంతెనలు..
 
636161687261177000.jpg
  • 454.5 కి.మీ. పొడవుతో మూడు రింగ్‌రోడ్ల నిర్మాణం 
  • నాణ్యతలో రాజీలొద్దు.. ప్రైవేట్‌ ఏజన్సీలు మరింత ప్రతిభ కనబరచాలి 
  • అమరావతిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రజ్యోతి, అమరావతి :మెట్రో నగరాలను తలదన్నేలా అమరావతి చుట్టూరా అంతర, బాహ్య, ప్రాంతీయ రింగ్‌రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బీజింగ్‌ తరహాలో ఈ రింగ్‌రోడ్లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయంలోని తన చాంబర్‌లో బుధవారం అమరావతిలో చేపట్టదలచిన రింగ్‌రోడ్ల నిర్మాణంపై సీఎం ప్రధానంగా సమీక్షించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు లేకుంటే అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దడమన్నది సాధ్యం కాదన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని ప్రాంతంలో దశలవారీగా, శీఘ్రంగా మెరుగైన ఇనఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించాలని, ఇందులో భాగంగా రింగ్‌రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆదేశించారు. ప్రైవేట్‌ ఏజన్సీలన్నీ మరింత ప్రతిభ కనబరచాలన్నారు. పూర్తిస్థాయిలో పని చేయకుంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నారు. రాజధాని పరిసరాల్లో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ రివైజ్డ్‌ బిల్డింగ్‌ రూల్స్‌-2016పై అధికారులు ప్రజంటేషన ఇచ్చిన అనంతరం దానిపై కొద్దిసేపు సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై మరింత కసరత్తు చేసి, మళ్లీ రావాలని అధికారులకు సీఎం సూచించారు. 

ఇదీ రింగ్‌రోడ్ల స్వరూపం..
రింగ్‌రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమావేశంలో ఓ కొలిక్కి వచ్చాయి. ఇన్నర్‌, ఔటర్‌, రీజియనల్‌ రింగ్‌రోడ్లుగా పిలిచే వీటిని మొత్తం 454.50 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. వీటిల్లో భాగంగా కృష్ణానదిపై వివిధ ప్రదేశాల్లో భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డును స్వయంగా నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ మాత్రం కేంద్రానికి అప్పగించాలనుకుంటోంది. వీటిల్లో ఇన్నర్‌ రింగ్‌రోడ్డును అమరావతికి చుట్టూ 15 కిలోమీటర్ల వ్యాసార్ధంతో 94.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. దీని పరిధిలోపల రాజధాని నగరంతో సహా మొత్తం 1,36,000 ఎకరాల ప్రాంతం ఉంటుంది. 25 కిలోమీటర్ల వ్యాసార్ధంతో 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధి 4,73,000 ఎకరాలమేర విస్తరించి ఉంటుంది. అమరావతి చుట్టూ 34 కి.మీటర్ల వ్యాసార్ధంతో 210 కి.మీ. పొడవుతో రీజియనల్‌ రింగ్‌రోడ్డును నిర్మిస్తారు. దీని పరిధిలో 9 లక్షల ఎకరాలుంటాయి.
పలు ప్రయోజనాలు
తొలుత చేపట్టనున్న ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, తాడిగడప, ఎనికేపాడు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నంల మీదుగా వెళ్తుంది. విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంలోనూ, అమరావతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సత్వరం చేరుకోవడంలోనూ ఇది కీలకం కానుంది. 5వ నెంబర్‌ జాతీయ రహదారిని అమరావతికి కలుపుతూ నిర్మించనున్న ఔటర్‌ రింగ్‌రోడ్డు గుంటూరు, తెనాలి, కంచికచర్ల ప్రదేశాల మీదుగా వెళ్తుంది. దీనికోసం మైలవరంలో సొరంగమార్గం నిర్మించాల్సి ఉంటుంది.


మొత్తం 8,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విజయవాడ, గుంటూరు వంటి 2 పెద్ద నగరాలు, 9 పట్టణాలతోపాటు 12 అర్బన నోడ్స్‌ను కలిగి ఉండే అమరావతి రాజధాని ప్రాంతం మల్టీమోడల్‌ కనెక్టివిటీతో అలరారనుంది. 5 జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులు, 5 రైల్వే జంక్షన్లు, 4 జాతీయ జలమార్గాలు, 2 ప్రత్యేక రవాణా కారిడర్లు, లాజిస్టిక్‌ హబ్‌లు-పార్కులు, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఆర్‌ఆర్‌, ఔటర్‌, రీజినల్‌ రింగ్‌రోడ్లు, విశాఖ- చెన్నై పారిశ్రామిక, ఆర్థిక కారిడార్‌, 217 చదరపు కిలోమీటర్ల గ్రీనఫీల్డ్‌ డెవల్‌పమెంట్‌, మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం దీని ప్రత్యేకతలు. సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, మున్సిపల్‌ కార్యదర్శి కరికాల వల్లవన, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, అదనపు కార్యదర్శి రాజమౌళి, మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన డైరెక్టర్‌ కన్నబాబు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన, కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వలయ సిగ

తక్కువ ఖర్చుతో రోడ్లను త్వరగా అందుబాటులోకి తేవడంపై దృష్టి

image.jpg

 

ఈనాడు, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతికి మూడు రూపాల్లో వలయ రహదారులు ఏర్పాటుకావటానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సులువుగా ఆచరణ సాధ్యమయ్యే వాటికి తొలుత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదట అంతర్‌ వలయ రహదారిని నిర్మించాలని భావిస్తోంది. ఆపై కేంద్రంతో బాహ్య వలయ రహదారిని నిర్మింపజేయాలని, ఇప్పటికిప్పుడు ఏమేరకు ఉపయోగకరం అన్న దాని ఆధారంగా ప్రాంతీయ బాహ్య వలయ రహదారిని నిర్మించాలని అనుకుంటోంది. వీటి నిర్మాణంపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ, మున్సిపల్‌ అధికారులతో సమావేశమయ్యారు.

ముఖ్యాంశాలు...

* అంతర్‌ వలయ రహదారి: దీనిని పూర్తి వలయంగా నిర్మించాలంటే విజయవాడకి సమీపంలోని కొండపల్లి వద్ద కొండల్ని తొలచాల్సి ఉంటుంది. భారీ ఖర్చుతో కూడింది కాబట్టి ఆ ప్రాంతాన్ని మినహాయించాలని భావిస్తున్నారు. అలా చేస్తే ఇది పూర్తి స్థాయి అంతర్‌ వలయంగా కాకుండా కాస్త ఆంగ్ల అక్షరం ‘యూ’ ఆకారంలో వస్తుంది. ఇది 94.5కిలోమీటర్ల పొడవున ఉంటుంది. గామన్‌ ఇండియా సంస్థ చేపట్టిన విజయవాడ బైపాస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ ఉండే జలాలపై నుంచి భారీ వంతెన నిర్మిస్తోంది. దీనినే పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఉండేలా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. సూరాయపాలెం వద్ద నిర్మించే దీనినే ఈ రహదారికి కూడా వాడుకోనున్నారు. తద్వారా భారీ మొత్తం ఆదా చేయొచ్చు. రాజధానిని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు అత్యంత కీలకమైన మార్గంగా భావిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని త్వరగా చేపట్టే వీలుంది. ఇది రహదారికి లోపల సుమారు 1.36లక్షల ఎకరాల ప్రాంతం ఉంటుంది. దీని నిర్మాణం పూర్తయితే రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయాన్ని వేగంగా చేరుకోవచ్చు.

* బాహ్య వలయ రహదారి: దీని సవివర నివేదికను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ తయారుచేస్తోంది. భూసేకరణ బాధ్యత రాష్ట్రం తీసుకుంటే... కేంద్రం పీపీపీ విధానంలో నిర్మిస్తుంది. ఇప్పటికున్న సమాచారం మేరకు దీనిని 150కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంటుంది. ఈ వలయ రహదారి లోపల రాజధాని నగరం, విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో సహా సుమారు 4.73లక్షల ఎకరాల ప్రాంతముంటుంది. దీనికి మైలవరం వద్ద సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుంది.

* ప్రాంతీయ వలయ రహదారి: సింగపూర్‌ సంస్థలు రాజధాని ప్రణాళికని రూపొందించినప్పుడు ఈ రహదారిని కూడా అందులో చేర్చారు. రాజధాని నగరానికి బాగా దూరంగా పోతున్నందున దీనిని ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన అవసరం లేదన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. దీనికి సంబంధించిన ప్రణాళిక ముందుకు పోలేదు. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం 210 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఈ వలయ రహదారి లోపల సుమారు తొమ్మిది లక్షల ఎకరాల ప్రాంతముంటుంది. తాజా భేటీలోనూ దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. మొత్తంమీద మూడు రహదారుల నిర్మాణం చేపడితే మూడూ కలిపి 454.5కిలోమీటర్ల పొడవు ఉంటాయి.

స్థిరాస్తి వ్యాపారంపై... రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారానికి ఎలాంటి విధానం అవలంభించాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

Link to comment
Share on other sites

అమరావతిలో... 4వేల కోట్లతో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి
 
అమరావతి : ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో రూ. 4వేల కోట్లతో మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి, స్టార్‌హోటల్‌ నిర్మాణం జరిపించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. బీఆర్‌శెట్టి మెడికల్‌ వర్సిటీకి 100 ఎకరాలు కేటాయించాలని, అలాగే అమరావతి సబ్‌డివిజన్‌ పీఎస్‌కు 1.5 ఎకరాలు కేటాయింపు, రాజధాని భవనాల ప్రభుత్వ డిజైన్లపై రెండు రోజుల్లో బిడ్‌ల పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. నారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

 

అమరావతిలో 4 వేల కోట్లతో మెగా హెల్త్ సిటీ !

అమరావతి హెల్త్ కేపిటల్ కూడా కాబోతోంది. కింగ్ జార్జ్, ఎయిమ్స్ లాంటి పేర్లే కాదు ఇపుడు ఏకంగా హెల్త్ సిటీనే అమరావతిలో కొలువుదీరబోతోంది. ఇక నిర్మాణం మరో మూడు నెలల్లో మొదలుకాబోతోంది.

అవును. బిఆర్ శెట్టి గ్రూప్ అమరావతిలో మెగా హెల్త్ సిటీ కడుతోంది. 150 ఎకరాల స్థలం కోరింది. ప్రాజెక్టు రిపోర్ట్ పరిశీలించాక 100 ఎకరాలు కేటాయింపును సీఆర్ డీఏ కన్ఫామ్ చేసింది. 4 వేల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి, మెడికల్ డివైజెస్ యూనిట్, త్రీస్టార్ హోటల్ రెడీ అవుతాయ్.

బహుశా అమరావతిలో నిర్మాణాలకి లైన్ క్లియర్ అయిన తర్వాత పట్టాలెక్కబోతున్న తొలి మెగా ప్రాజెక్ట్ ఇదే కాబోతోందేమో అంటున్నారు ! ఎందుకంటే, టెంటర్ల గడుపు పూర్తయ్యి అమరావతిలో మరో దశ మొదలుకోబోతున్న సమయంలో సీఆర్ డీఎ క్లియరెన్స్ వచ్చేసరికి, కేపిటల్ సిటీలో హెల్త్ సిటీకి

 

Link to comment
Share on other sites

అమరావతిలో ఆర్బీఐకు 11 ఎకరాలు
 
  • సీపీడబ్ల్యూడీకి 28 ఎకరాలు కేటాయింపు
  • అమృత వర్సిటీకి 200 ఎకరాలు.. జీవోలు విడుదల
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ), అమృత యూనివర్సిటీలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన డెవల్‌పమెంట్‌ గురువారం జీవోలను విడుదల చేసింది. మాస్టర్‌ప్లానను అనుసరించి, అనువైన ప్రదేశాల్లో ఆర్బీఐకి 11 ఎకరాలు, సీపీడబ్ల్యూడీకి 28 ఎకరాలు, అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలను కేటాయించాల్సిందిగా ఏపీసీఆర్డీయే కమిషనర్‌ను ఈ జీవోల్లో ఆదేశించింది. గతనెల 26న సమావేశమైన మంత్రుల బృందం (జీవోఎం) ఈ మేరకు నిర్ణయించగా అందుకు సంబంధించిన జీవోలు గురువారం విడుదలయ్యాయి. ఆయా సంస్థలకు భూకేటాయింపు, అవి పాటించాల్సిన నియమనిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, సీపీడబ్ల్యూడీలకు లీజ్‌ హోల్డ్‌ ప్రాతిపదికన భూములను ఇవ్వనుండగా అమృతకు ఎకరా రూ.50 లక్షల ధరకు విక్రయించనున్నారు. భూముల కేటాయింపులో ఎలాంటి వివక్షకు తావులేకుండా వ్యవహరించాలని సీఆర్డీయే కమిషనర్‌ను ఆదేశించారు.
 
ఆర్బీఐ, సీపీడబ్ల్యూడీకి ఇలా..
ఆర్బీఐకు కేటాయించే 11 ఎకరాల్లో 5 ఎకరాలు కార్యాలయానికి, 6 ఎకరాలు నివాసాలకు కేటాయించనున్నారు. సీపీడబ్ల్యూడీకి ఇవ్వబోయే 28 ఎకరాల్లో 11 ఎకరాలు ఆఫీసుకు, 17 ఎకరాలు నివాసాలకు నిర్దేశించారు. ఈ భూములకు సంస్థలు చెల్లించాల్సిన ధరను వాటి ఉన్నతాఽధికారులతో సంప్రదింపుల అనంతరం ఖరారు చేసే అధికారాన్ని జీవోఎం మెంబర్‌ కన్వీనర్‌కు అప్పగించారు. ఈ రెండు సంస్థలూ తమ కార్యాలయాలను ఆకట్టుకొనే డిజైన్లతో ఐకానిక్‌ భవనాలుగా నిర్మించాలని, భూమి ఇచ్చిన 4 సంవత్సరాల్లో అందులో అభివృద్ధి పనులు పూర్తవ్వాలని ఆదేశించారు. భూకేటాయింపునకు ముందే తాము చేపట్టదలచిన నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే దశల వారీ ప్రణాళికతోపాటు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను అవి సమర్పించాల్సి ఉంటుంది.
 
రెండు దశలుగా అమృతకు భూములు..
అమృత యూనివర్సిటీకి మొత్తం 200 ఎకరాలను కేటాయించారు. వీటిలో 150 ఎకరాలను తొలి దశలో (ఎకరా రూ.50 లక్షల ధరకు), మిగిలిన 50 ఎకరాలను 2వ దశలో (వీటి ధర తర్వాత నిర్ణయిస్తారు) ఇస్తారు. తొలి దశను ఈ విశ్వవిద్యాలయం 7 సంవత్సరాల్లో విజయవంతంగా పూర్తి చేస్తేనే మిగిలిన 50 ఎకరాలను ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ ఈ యూనివర్సిటీ ఈ విషయంలో విఫలమైనా, నిబంధనలను అతిక్రమించినట్లు రుజువైనా అనుమతులను రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ చర్యలనూ తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. మెడికల్‌, నాన మెడికల్‌ అనే 2 క్యాంప్‌సలుగా ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయంలో వాటిని ఏవిధంగా, ఎంతకాలంలో అభివృద్ధి చేయాలనే విషయాలను జీవోలో పేర్కొన్నారు. మెడికల్‌ క్యాంప్‌సను 2019లో ప్రారంభించి 5 ఏళ్లలో పూర్తి చేయాలి. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ 2024కల్లా ప్రారంభం కావాలి. నాన మెడికల్‌ క్యాంప్‌సను 2018లో ప్రారంభించి ఐదేళ్లలో పూర్తి చేయాలి.
Link to comment
Share on other sites

అమరావతిలో అయిదు నక్షత్రాల హోటళ్లు
 
636165217380002172.jpg
ఆంధ్రజ్యోతి, గుంటూరు: అమరావతి రాజధాని నగరంలో స్టార్‌ హోటళ్లను నిర్మించేందుకు సీఆర్‌డీఏ సన్నాహక ప్రక్రియని ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకొన్న హోటళ్లను నిర్మించేందుకు లీజు ప్రాతిపదికన భూములు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లను రాజధానిలో నిర్మింప చేయతలపెట్టింది. రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్న నేపథ్యంలో ఆ స్థాయిలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. రెండునెలల వ్యవధిలో బిడ్‌లు నిర్వహించి లీజు ఒప్పందం చేసుకోవాలని భావిస్తోన్నది. 2018 డిసెంబర్‌ నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొన్న నేపథ్యంలో కనీసం మూడు, నాలుగు స్టార్‌ హోటళ్లను అయినా ఆ లోపు ఇక్కడ ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచంలో టాప్‌-10 నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సీఎం చంద్రబాబు ఆ దిశగా దేశ, విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే విట్‌ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కొద్దిరోజుల్లోనే ఎస్‌ఆర్‌ఎం, అమృత, బీఎం షెట్టీ మెడికల్‌ యూనివర్సిటీల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరంగా ఎయిమ్స్‌ తరహా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, బోధన సంస్థ మంగళగిరిలో రూపుదిద్దుకొంటోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల సందర్శనకు భవిష్యత్తులో దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. అలానే అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టే సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సందర్శనకు అధికారులు వస్తారు. వారి విడిదికి ప్రస్తుతం చెప్పుకోదగ్గ హోటళ్లు లేవు. విజయవాడ నగరంలో రెండు, మూడు స్టార్‌ హోటళ్లు ఉన్నాయి. గుంటూరు నగరంలోనూ రెండు, మూడు హోటళ్లు ఉన్నప్పటికీ అవి రాజధానికి 30 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లోనే స్టార్‌ హోటళ్లను నిర్మింప చేయించాలని సీఎం పట్టుదలతో ఉన్నారు.
రివర్‌ ఫ్రంట్‌ వ్యూ ఉంటే హోటళ్లకు కొద్ది కాలంలోనే ప్రాధాన్యం లభిస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెంలో హోటళ్లకు భూములను లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సీఆర్‌డీఏ ముందుకొచ్చింది. ఆర్‌బీఐ, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్కు డిపార్టుమెంట్‌కు ఇప్పటికే 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూములు ఇచ్చింది. ఇంచుమించు అదే పద్ధతిని హోటళ్ల విషయంలోనూ అవలంబిస్తారు. ఈ నెల 15వ తేదీన ప్రీబిడ్‌, జనవరి 9న బిడ్‌ దాఖలు, 21న ఫైనాన్సియల్‌ బిడ్‌లు నిర్వహించి ఫిబ్రవరి నెలాఖరు లోపు పేపర్‌ వర్కు అంతా పూర్తి చేసే దిశగా సీఆర్‌డీఏ అడుగులు వేస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...