Jump to content

Amaravati


Recommended Posts

విశాల స్థలం.. వైవిధ్యం
1350 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సముదాయం
1.78 కోట్ల చదరపు అడుగుల్లో భవనాలు
5.99 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు
3.23 లక్షల చ.అ.ల్లో శాసనసభ
image.jpg

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వం 1350 ఎకరాల సువిశాల స్థలంలో ప్రభుత్వ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ విస్తీర్ణంలో ప్రభుత్వం దాదాపుగా అన్ని కార్యాలయాలు, అధికారుల నివాస సముదాయలన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోనుంది. మొత్తం ప్రభుత్వ భవనాలను 1,78,22,561 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానున్నాయి. భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా ఈ భవనాల్లోనే కొన్నింటిని పది శాతం మేర విస్తరించుకునేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అన్ని భవనాలు సువిశాలంగా, విశాలమైన పార్కింగ్‌ స్థలం ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. నిర్మించబోయే ప్రతి భవనం కూడా ఆంధప్రదేశ్‌ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఉంటూనే ఆధునికత మేళవింపులతో ఒక ఆదర్శ భవనాలుగా ఉండాలని చూస్తున్నారు. ఈ భవనాల్లో ఒక్క శాసనసభ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాలను మొత్తం 9,23,885 చదరపు అడుగుల (బిల్టప్‌ ఏరియా) విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించింది.

Link to comment
Share on other sites

నవంబరు నెలాఖరులోగా ఎంపిక

ప్రభుత్వ భవనాల సముదాయ  నిర్మాణ శిల్పి గుర్తింపు గడువిదీ..

అనంతరం 3 నెలల్లో కాన్సెప్ట్‌ డిజైన్లు

12 నెలల్లో వర్కింగ్‌ డ్రాయింగ్‌లు

నిర్దేశించిన సీఆర్‌డీఏ

ఈనాడు - అమరావతి

అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణాన్ని 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రధాన భవన నిర్మాణ శిల్పి ఎంపిక, ఆకృతుల రూపకల్పనకు నిర్దిష్ట గడువు పెట్టుకుంది. ప్రధాన భవన నిర్మాణశిల్పి (మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌) ఎంపికకు బిడ్లు దాఖలు చేసేందుకు నవంబరు 16 వరకు సీఆర్‌డీఏ గడువు ఇచ్చింది. అనంతరం నవంబరు నెలాఖరు లేక డిసెంబరు మొదటి వారంలో మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేయనుంది. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణాన్ని 918 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం మొదట భావించింది. తాజాగా ఈ పరిధిని 1350 ఎకరాలకు విస్తరించింది. కేవలం ప్రభుత్వ కార్యాలయ భవనాలే కాకుండా, ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుండే ప్రదేశాలు, వాణిజ్య, బహుళ ప్రయోజనకర ప్రదేశాలు వంటివి ఉంటాయి. దక్షిణం, తూర్పువైపు ఉన్న ప్రదేశాల్ని జన జీవనానికి అవసరమైన సదుపాయాలతో తీర్చిదిద్దుతారు. ప్రధాన భవన నిర్మాణ శిల్పి ఈ మొత్తం ప్రదేశానికి అవసరమైన బృహత్‌ ప్రణాళికతో పాటు, అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ సముదాయంలో దిగ్గజ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సమగ్ర ఆకృతులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రధాన భవన నిర్మాణ శిల్పిదే. దీనిలో భాగంగా ఆర్కిటెక్చరల్‌, స్ట్రక్చరల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, అగ్నిప్రమాద నివారణ, అంతర్గత అలంకరణలు (ఇంటీరియర్‌ డిజైన్‌)లకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరణాత్మక ఆకృతులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌ కీలకం

ప్రభుత్వ భవన సముదాయానికి అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌ రూపకల్పన కూడా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ప్రధాన బాధ్యత. భవనాల నిర్మాణంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి? ఎలాంటి సామగ్రి వినియోగించాలి? దీర్ఘకాలిక నిర్వహణ ఎలా ఉండాలి? స్ట్రీట్‌ నెట్‌వర్క్‌ ఏ విధంగా ఉండాలి. క్యారేజీ వేలు, ఫుట్‌పాత్‌ల వెడల్పు ఎలా ఉండాలి? ఇలా ప్రతి చిన్న అంశానికి సంబంధించిన మార్గదర్శకాలు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ రూపొందించాలి. భద్రత, రక్షణకు సంబంధించిన మార్గదర్శకాలు, వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానాలను సూచించాలి. ల్యాండ్‌స్కేప్‌కి సంబంధించిన వివరణాత్మక ప్రణాళిక కూడా సిద్ధం చేయాలి.

డీపీఆర్‌ బాధ్యతా..!

ప్రభుత్వ భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందేందుకు, అభివృద్ధి భాగస్వాముల ఎంపికకు అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించే బాధ్యత కూడా ప్రధాన భవన నిర్మాణ శిల్పిదేనని సీఆర్‌డీఏ తన టెండరు ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకృతులు అందజేయడంతో పాటు ప్రభుత్వ భవనాల సముదాయంలో వచ్చే వివిధ ఆర్కిటెక్చరల్‌, ల్యాండ్‌స్కేప్‌ ప్రాజెక్టుల వివరణాత్మక ఆకృతులు కూడా మాస్టర్‌ ఆర్కిటెక్టే రూపొందించాలి.

ఎప్పటిలోగా..!

ప్రధాన భవన నిర్మాణశిల్పి ఎంపిక పూర్తయిన తర్వాత మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన సంస్థకు ‘లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌’ అందజేస్తుంది. ఆ రోజు నుంచి ఏ పని ఎన్ని నెలల్లోగా పూర్తి చేయాలో నిర్దిష్టంగా పేర్కొంది. ప్రభుత్వ భవనాల సముదాయ బృహత్‌ ప్రణాళిక, అర్బన్‌ డిజైన్లకు సంబంధించిన కాన్సెప్ట్‌ డిజైన్లను మూడు నెలల్లో, వివరణాత్మక బృహత్‌ ప్రణాళికను ఐదు నెలల్లో ఇవ్వాలని సీఆర్‌డీఏ షరతు పెట్టింది. రెండు దిగ్గజ భవనాలకు కాన్సెప్ట్‌ డిజైన్లను మూడు నెలల్లో, స్కిమాటిక్‌ డిజైన్లను ఆరు నెలల్లో, వివరణాత్మక డిజైన్లు, టెండర్‌ డాక్యుమెంట్లను 9 నెలల్లో, వర్కింగ్‌ డ్రాయింగ్‌లు 12 నెలల్లో ఇవ్వాలని షరతు విధించింది. ఈ గడువులన్నీ మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌తో ఒప్పందం చేసుకున్న రోజు నుంచి లెక్కిస్తారు. ఒప్పందం చేసుకున్న రోజు నుంచి 30 నెలల వరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ పర్యవేక్షించాలి.

29ap-main13b.jpg

‘వాస్తు’కు పెద్ద పీట

ప్రణాళిక రూపకర్తలకు ప్రభుత్వం మార్గదర్శకాలు
ఈనాడు, అమరావతి: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాలన్నీ వాస్తుశాస్త్ర నియమాల ప్రకారమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్కిటెక్చర్లు కూడా వాస్తు శాస్త్ర నియమనిబంధనలను దృష్టిలో ఉంచుకునే ఆయా భవనాల నిర్మాణ ప్రణాళికలను, నమూనాలు రూపొందించాలని కోరింది. ‘వాస్తు’ అనేది హిందూ సంప్రదాయ నిర్మాణ విధానమని, దేశంలోని వాస్తు సంస్కృతి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని వాస్తు సంప్రదాయాలు దాదాపు చైనాలో నివాసాలకు పాటించే ‘ఫెంగ్‌ షూయ్‌’కు పోలి ఉంటాయని తెలిపింది. ప్రభుత్వం ప్రధానంగా కొన్ని వాస్తు నియమాలను ప్రతిపాదించింది.

‘ఈ-కార్యాలయాలు’

భవనాలన్నీ వాటిని ‘ఈ-కార్యాలయాలు’గా ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలని సూచించింది. విద్యుత్తు ఆదా చేసేలా ఉండాలని పేర్కొంది. రాష్ట్రానికి ఇది కొత్త రాజధాని కావడంతో భవన సముదాయమంతా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు కనిపించేలా ఉండాలి.పలు ప్రభుత్వ సంస్థలు, వినోదం, ఫలహారశాలలు లాంటికి తగిన పార్కింగ్‌ స్థలం ఉండాలని సూచించింది.

భద్రతకు అత్యాధునిక వ్యవస్థ

రాజధాని భవన సముదాయాలకు సంబంధించి భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.ఈ సముదాయాల్లో అత్యాధునిక భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అన్ని వైపులా స్పష్టంగా కనిపించాలని, అంతర్గత భద్రత విషయంలోనూ అత్యాధునిక వ్యవస్థ ఉండాలని సూచించింది. అదే సమయంలో సందర్శకులకు సౌకర్యవంతంగానూ ఉండాలని పేర్కొంది. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రధాన కార్యాలయాలు భద్రత వ్యవస్థను ఎక్కడికక్కడ వేర్వేరుగా ఏర్పాటు చేస్తూనే వాటన్నిటీని అనుసంధానం చేసేలా ఒక సమీకృత భద్రత వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది.
29ap-main13c.jpg

Link to comment
Share on other sites

పనులు సరిగా చేయకపోతే కఠినచర్యలు

అలాంటి గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి

అమరావతిలో పనుల నత్తనడకపై సీఎం ఆగ్రహం

ఈనాడు - అమరావతి

02ap-main1a.jpg

రాజధాని అమరావతిలో రహదారుల పనులు మందకొడిగా సాగుతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో చేపట్టే ప్రతి పని నిర్దేశించిన గడువులో పూర్తి కావాలని... అదే సమయంలో నాణ్యతలోనూ రాజీపడరాదని ఆయన స్పష్టం చేశారు. గుత్తేదారులు ఎవరైనా సకాలంలో పనులు పూర్తి చేయకపోయినా, నాణ్యత పాటించకపోయినా కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో మరేపనీ చేపట్టకుండా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనుల పురోగతిపై ఆయన బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనులన్నీ ఇంకా పూర్తిగా కొలిక్కి రాకపోవడం, రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై రాజధానిలో 252 కి.మీ. పొడవైన ప్రధాన, ఉప ప్రధాన రహదారులను తక్షణం, ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నట్టు సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. రహదారుల పనులకు రూ.3560 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలుస్తున్నామని, 2017 డిసెంబరు నాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. అమరావతిలో గ్యాస్‌, తాగునీరు, టెలిఫోను, విద్యుత్‌ సరఫరా లైన్లు వంటివన్నీ ఒకే మార్గంలో పైపుల ద్వారా ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌ నమూనాను అధ్యయనం చేయాల్సిందిగా సీఎం సూచించారు. అమరావతిలో విద్యాలయాలు, ఆస్పత్రులు, హోటళ్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా, నగరం నలుమూలలా ఉండేలా చూడాలని చెప్పారు. 2018 నాటికి జాతీయ క్రీడలను నిర్వహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని, దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్యానికి, ఘన వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 10 గ్రామాల రైతులకు స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామని, డిసెంబరు 15 నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి నోవాటెల్‌, ఐటీసీ, తాజ్‌ వంటి సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఆసుపత్రులు నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్న కార్పొరేట్‌ సంస్థలతో ఈ నెల 11న సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధానిలో పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ ఒక క్లస్టర్‌లో వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. న్యాయ నగరంలో న్యాయ సంస్థలు, ఆర్బిట్రేషన్‌ కేంద్రాలు, న్యాయ విద్యా సంస్థలు వంటివి వచ్చేలా చూడాలని తెలిపారు. అమరావతితో పాటు, చుట్టుపక్కల ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీనియర్‌ అధికారులు సతీష్‌ చంద్ర, సాయిప్రసాద్‌, అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ సీఎండీ లక్ష్మీపార్థసారథి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...