Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో 2 ‘నిరంతర’ విద్యుత్ ప్లాంట్లు
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 24 గంటలూ విద్యుత అందించేలా రెండు ప్లాంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికయ్యే మొత్తం ఖర్చును రుణంగా తీసుకోవాలని భావిస్తోంది. మొదట్లో ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం ఖర్చును ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి, అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తర్వాత ఏషియన్‌ ఇన్‌ఫ్రా ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) తెరపైకి రావడంతో ఆ ప్రతిపాదనలను సవరించింది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు కంటే ఏఐఐబీ తక్కువ రేట్లకే రుణాలిస్తోంది. దీంతో అమరావతిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుల కోసం ఏఐఐబీ నుంచి కూడా రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలో మార్పులు కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాం లేఖ రాశారు. ఆ రెండు విద్యుత ప్రాజెక్టులకయ్యే మొత్తం ఖర్చులో 60 శాతం ప్రపంచ బ్యాంకు నుంచి, 40 శాతం ఏఐఐబీ నుంచి రుణంగా తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆ లేఖలో కోరారు.
Link to comment
Share on other sites

రాజధానిపై ఏపీ క్లారిటీకి వచ్చేసింది. ఎంత ఖర్చు చేయాలి ఎప్పుడెప్పుడు అని లెక్క తీసింది. మరో రెండేళ్లలో రూపురేఖలు రేఖామాత్రంగా అయినా కనిపించాలని ఏపీ కోరుకుంటున్న సమయంలో అంకెలు ఏం చెబుతున్నాయో… ఏం జరగబోతోందో చూద్దాం !


ఏపీ కోసం సుమారు 65 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధమైంది. మూడు దశల్లో నిర్మాణం చేపట్టాలనేది ఆలోచన. తొలి దశ కోం ఇందులో 4800 కోట్లు కేటాయిస్తారు. అటు తర్వాత మిగతా రెండు దశలూ ఉంటాయ్. మరి 67 వేల కోట్లు కావాలంటే…మరి చేతిలో ఎంతున్నాయ్ ? ఎవరెవరు ఎంత ఇస్తున్నారు…మరి కేంద్రం ఇంకెంత ఇవ్వాలో చూద్దాం ! తొలి దశ అంటే వచ్చే ఎన్నికల లోపు కొలిక్కి రావాల్సిన వ్యవహారం.



– ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ నిర్మాణం కోసం ఏసియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ – ఏఐఐబీ రుణం ఇచ్చేందుకు రెడీగా ఉంది. మొత్తం 3900 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్ట్ కోసం ఏఐఐబీ 2750 కోట్లు ఇస్తామంది. అంటే సింహభాగం వచ్చేసినట్టే! ఇలాంటివి మన చేతికి రావాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.


– ట్రాన్స్ పోర్ట్ రిలేటెడ్ ఇన్ ఫ్రా కోసం, ఫ్లడ్ మానేజ్ మెంట్ ప్లానింగ్ కోసం 7500 కోట్లు కావాలని అంచనా. హడ్కో 6700 కోట్లు ఇచ్చేందుకు రెడీ ఉందిప్పుడు. ఇది ఓకే అయిపోయింది. త్వరలో ప్రకటన వస్తుంది అంటున్నారు.


– రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం ఏపీ రెడీ అవుతోంది. దీనికోసం 1300 కోట్లు అవసరం అవుతాయంటన్నారు. గ్రీన్ జోన్స్ తోపాటు రిలేటెడ్ ఇన్ ఫ్రా కోసం దాదాపు 8 వేల కోట్లు కావాలి. పూలింగ్ చేసిన గ్రామాల్లో లే అవుట్ల నిర్మాణం కోసం మరో 17500 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఇప్పటికి పేపర్ మీదున్నాయ్. వీటికోసం నిధుల సమీకరణ మొదలు కావాల్సిఉంది. ఇదంతా దశల వారీగా జరగబోతోంది.


-ఇక ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం మరో పదివేల కోట్లకిపైగా అవసరం అవుతాయ్.


ఇంకొక్కమాట. ఇవన్నీ పరిపాలనా పరమైన వ్యవహారాలు నిర్మాణాల కోసం. అదే పూర్తిస్థాయిలో వనరులు క్రియేట్ చేసేందుకు, ప్రైవేటు ఆస్తులతో సిటీ అలరారేందుకు అయితే చంద్రబాబు రెండున్నరేళ్ల కిందట చెప్పినట్టు ఐదు లక్షల కోట్లు అవసరం అవుతాయ్. మొత్తానికి ఇవన్నీ పట్టాలెక్కాలంటే… మూడు దశలు కొలిక్కిరావాలంటే కేంద్రం అనుమతులతోపాటు సాయం కూడా కంపల్సరీ. వ్యూహంతో… ఆలోచనతో విదేశీ సాయం కొంతలో కొంత వస్తున్నా…అసలు కీ కేంద్రమే. అందుకే ఇపుడు ఏం ఇవ్వబోతోంది… మోడీ ఏం తేలుస్తారనేదాన్ని బట్టీ అమరావతి స్పీడు ఎంత అనేది నిర్ధారణ కాబోతోంది.





 
Link to comment
Share on other sites

బుధవారం సింగపూర్‌ పర్యటన ముగించుకుని మంత్రి నారాయణ బృందం బుధవారం విజయవాడకు చేరుకుంది. అనంతరం అమరావతిలో సచివాలయం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 14లోపు అమరావతిలో రైతులకు ప్లాట్ల కేటాయింపులు ఉంటాయన్నారు. అలాగే అమరావతిలో ఎలక్ట్రికల్‌ బస్సులు, రైళ్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంపై సింగపూర్‌ బృందంతో చర్చించామని, ఈనెల 15నాటికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను నియమిస్తామని నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

2018 కల్లా రాజధాని తొలి దశ నిర్మాణాలు పూర్తి
 
636090867560284283.jpg
  • అటు అదిరేలా అమరావతి- ఇటు దీటుగా సీఆర్డీయే పరిధి
  • రాజధాని రూపకల్పనలో ఆస్తానా, ఇతర ప్రముఖ నగరాల సాయం తీసుకుంటాం
  • గ్రామకంఠాలు, కొలతల్లో తేడాలు, ఈనాం, దేవాదాయ భూములపై సత్వర నిర్ణయాలు
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌
సీఆర్డీయే సీడ్‌ క్యాపిటల్‌లోని ప్రతిష్ఠాత్మక గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ను అందులోని ఐకానిక్‌ బిల్డింగ్‌లతో సహా 2019కల్లా కచ్చితంగా పూర్తి చేస్తుందని ఆ సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.శ్రీధర్‌ చెప్పారు. సీఆర్డీయే పరిధిలోనూ అమరావతి మాదిరిగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు పలు చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
(ఆంధ్రజ్యోతి, అమరావతి)

తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని అంతర్గత అలంకరణ (ఇంటీరియర్స్‌)తో సహా కేవలం ఆరు నెలల్లోపే పూర్తి చేయగలిగిన ఏపీసీఆర్డీయే సీడ్‌ క్యాపిటల్‌లోని ప్రతిష్ఠాత్మక గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ను అందులోని ఐకానిక్‌ బిల్డింగ్‌లతో సహా 2019కల్లా కచ్చితంగా పూర్తి చేస్తుందని ఆ సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.శ్రీధర్‌ చెప్పారు. అమరావతి నిర్మాణంలో భాగంగా కజకిస్తాన రాజధాని ఆస్తానా, జపాన రాజధాని టోక్యో, మలేసియాలోని పుత్రజయ, సింగపూర్‌లలో పర్యటించిన సీఆర్డీయే బృందానికి నేతృత్వం వహించిన ఆయన ఆ పర్యటనను ముగించుకుని శుక్రవారం నాడు విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..
అంతర్జాతీయ నగరిగా అమరావతి..
పలు విదేశీ నగరాల్లో పర్యటించి, తద్వారా పెంపొందించుకున్న అవగాహనతో అమరావతిలో నిర్మించ తలపెట్టిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ను అందరి మన్ననలూ చూరగొనేలా, పెద్దఎత్తున పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా 2019 ప్రథమార్ధంకల్లా నిర్మిస్తాం. ఇటీవలి కాలంలో నిర్మితమెన కజకిస్తాన రాజధాని ఆస్తానాకు, మన అమరావతికి మధ్య చాలా సారూప్యాలున్నాయి. త్వరలోనే ఆ నగరంతో ‘సిస్టర్‌ సిటీ’ ఒప్పందం కుదుర్చుకుంటాం. వచ్చే నెలలో అక్కడి నిపుణుల బృందం అమరావతిని సందర్శించి, మనకు ఉపకరించే సూచనలు అందజేయనుంది. ఈ నగరంతోపాటు పుత్రజయ, సింగపూర్‌ వంటి పలు విదేశీ, స్వదేశీ రాజధానులను సందర్శించి, వాటిల్లోని బాగోగులను గుర్తించిన సీఆర్డీయే అధికారుల నివేదికలను అనుసరించి అమరావతిని నిర్మించనున్నాం.
నచ్చితే మాకీ డిజైన్లు
సీడ్‌ క్యాపిటల్‌లో నిర్మించనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఇంతకు ముందు తాను ఇచ్చిన ప్లాన్లకు వ్యతిరేకత వచ్చిన దృష్ట్యా సవరించిన డిజైన్లను జపానకు చెందిన మాకీ అసోసియేట్స్‌ సంస్థ మరొక వారంలోగా సమర్పించనుంది. అవి బాగుండి, ఆచరణయోగ్యంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఒకవేళ అవి ఆశించిన స్థాయిలో లేకుంటే మాకీతో ఒప్పందాన్ని రద్దు పరచుకుని, ఇతర సంస్థలు రూపొందించిన మెరుగైన డిజైన్లలో ఈ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం. ఈ ఏడాది డిసెంబరుకల్లా పనులను ప్రారంభించి, ఏడాది నుంచి 14 నెలల్లోగా గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నిధులకేం ఢోకా లేదు..
అమరావతి నిర్మాణం కోసం రానున్న 10, 12 సంవత్సరాల్లో సుమారు రూ.42,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్ల మధ్య అవసరమవుతాయని అంచనా. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులుపోను మిగిలిన వాటిని దేశీ, విదేశీ బ్యాంకులు, ద్రవ్యసంస్థల నుంచి రుణరూపేణా తీసుకోనున్నాం. ఇప్పటికే ప్రపంచబ్యాంక్‌ ఒక బిలియన డాలర్లు (సుమారు రూ.6700 కోట్లు), హడ్కో రూ.7,500 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపగా జైకా, ఏడీబీ, ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌.బి.ఐ., ఎల్‌.ఐ.సి. వంటి పలు దిగ్గజ సంస్థలు కూడా రుణాల మంజూరుకు ఆసక్తి చూపుతున్నాయి. వారంలో ఎల్పీఎస్‌ నోటిఫికేషన్లు
ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాల్లో 9 గ్రామాల ఎల్పీఎస్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్లు ఇచ్చాం. వాటిపై అభ్యంతరాల దాఖలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ఈ వారంలోనే ఫైనల్‌ నోటిఫికేషన్లు విడుదల చేసి, ఆ వెంటనే ప్లాట్లను యజమానులకు అందజేస్తాం. నెలలోగా ప్లాట్లలో పగ్‌ మార్కింగ్‌ పూర్తి చేస్తాం. మరొక 4 గ్రామాల నోటిఫికేషన్లను ఒకట్రెండు రోజుల్లో, మరో 4 గ్రామాలవి వారంలో విడుదల చేయడంతోపాటు మిగిలిన అన్ని గ్రామాలకు చెందిన వాటిని ఈ నెల 23వ తేదీలోగా ఇస్తాం. వచ్చే నెలాఖరుకల్లా అన్ని గ్రామాల వారికీ ప్లాట్లను అందజేసి, ఏడాదిలోగా వాటిని అభివృద్ధి పరుస్తాం. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూముల కొలతలు, గ్రామకంఠాలు, ఈనాం భూములు, ఎండోమెంట్స్‌ ల్యాండ్స్‌కు తదితరాలకు సంబంధించి నెలకొన్న వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు గైకొన్నాం.
నిర్మాణాల్లో ఇష్టారాజ్యంచెల్లదు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లో విస్తరించిన సీఆర్డీయే పరిధి అంతటా కూడా అమరావతి మాదిరిగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సాధించే లక్ష్యంతో నిర్మాణపరమైన అతిక్రమణలను వాటి వెనుక ఎంతటి వారున్నా సరే కూలదోసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. తద్వారా సీఆర్డీయే పరిధిలో అమరావతికి ఆవల నివసించే వారు సైతం సౌకర్యవంతమైన, సురక్షితమైన, నాణ్యమైన జీవనాన్ని గడిపేలా చూడాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగానే నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన అంతస్థులు, ఇతర నిర్మాణాలను కూల్చివేస్తున్నాం. విజయవాడకు శివార్లలోని యనమలకుదురులో బుధవారం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు భవనాల్లో అక్రమంగా నిర్మించిన అంతస్థులను తొలగించాం. అనంతరం ఈ కూల్చివేత ప్రక్రియను ఇతర గ్రామాలకూ విస్తరిస్తాం.
అంతర్గత ప్రక్షాళనకూ శ్రీకారం చుట్టాం..
కేవలం పంచాయతీ కార్యదర్శుల అవినీతి కారణంగానే దాదాపు అన్ని గ్రామాల్లో ఇలా లెక్కకు మిక్కిలిగా అక్రమ నిర్మాణాలు జరిగాయంటే నమ్మలేం. అక్రమ నిర్మాణదారులకు మా సంస్థలోని కొందరు అధికారులు, ఉద్యోగులు కూడా లోపాయికారీగా చేయూతనందించడం వల్లనే ఇంత విచ్చలవిడిగా, వందల సంఖ్యలో అతిక్రమణలు చోటు చేసుకుని ఉంటాయి. అందుకనే ముందు ఇంటి దొంగల పని పట్టాలనుకుంటున్నాం. ఈ అంతర్గత ప్రక్షాణన ప్రక్రియ ద్వారా ఇకపై ఇలాంటి అక్రమాలు చోటు చేసుకునేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చేయనున్నాం.
ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం..
గృహాలు, ఇతర నిర్మాణాల ప్లాన్లకు అనుమతులను మంజూరు చేయడంలో ప్రస్తుతమున్న లోపాలను సరిదిద్దడంతోపాటు అందుకు ప్రస్తుతం పడుతున్న వ్యవధిని ఒక్క రోజుకే తగ్గించేందుకు పలు విప్లవాత్మక సంస్కరణలు అమలు పరచనున్నాం. ఇందుకోసం ఆనలైనలో ప్లాన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నాం. అవసరమైన అన్ని వివరాలనూ సమర్పించగలిగిన వారికి దరఖాస్తు చేసుకున్న రోజునే ‘ప్రిన్సిపల్‌ అప్రూవల్‌’ లభించేలా చూస్తాం. ఇంకా ప్లాన్లకు అనుమతుల కోసం దరఖాస్తుదారులు అక్కడికీ ఇక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ‘సింగిల్‌ ఎంట్రీ- సింగిల్‌ ఎగ్జిట్‌’ విధానాన్ని అమలు పరుస్తాం. అదనంగా.. ప్రతి శుక్రవారం నేను, అడిషనల్‌ కమిషనర్‌, ఇతర అధికారులు పాల్గొనే ‘ఓపెన్ ఫోరం’ నిర్వహించి, ప్రజలు తెలియజేసే ఎలాంటి సమస్యలనైనా సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తాం

Link to comment
Share on other sites

అమరావతికి ఫ్రాన్స్ చేయూత
 
636096761786338834.jpg
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతికి ఫ్రాన్స చేయూతనందించనుంది. ప్రజా రవాణా, నీరు, సీవరేజ్‌, ఇంధన రంగాలతోపాటు స్మార్ట్‌ సిటీకి సంబంధించిన అంశాల్లో సాంకేతిక సహకారాన్ని అందించడంతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ను శుక్రవారం కలిసి ఈ విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఏపీసీఆర్డీఏ కమిషనర్‌, ఇతరులు.. అమరావతి ముఖ్య విశేషాలను, అందులోని ప్రతిపాదిత మౌలిక వసతుల ప్రాజెక్టులను, సోషియో-ఎకనమిక్‌ మాస్టర్‌ ప్లాన గురించి ఫ్రాన్స బృందానికి వివరించారు. బృహత్తర ప్రణాళికలతో ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించడాన్ని ఫ్రాన్స ప్రతినిధులు ప్రశంసించారు. రాజధాని దిశగా అనతికాలంలోనే సాధించిన పురోగతిపై హర్షం వ్యక్తంచేశారు. అమరావతిలోని ప్రజారవాణా, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, ఇంధనం, స్మార్ట్‌సిటీ సంబంధిత అంశాలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ఫ్రెంచ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ(ఏఎ్‌ఫడీ) ఆసక్తి వ్యక్తం చేసింది. కాగా..అమరావతితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఫ్రాన్సకు చెందిన మదుపుదారుల బృందంతో కలసి మన దేశంలోని ఆ దేశపు రాయబారి రెండు నెలల్లో ఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Kashmir 50% missing ga

 

Yup. very sloppy job in proof reading. maname(CRDA) ilanti maps publish chestunte inka vere vallani ani emi labham

 

aa article publish chesindi oka dutch architect firm.. not CRDA

 

international community lo, kashmir lo pak occupy chesina part, china occupy chesina parts ni India lo part ga chupincharu, because those are not under Indian control

 

monna recent ga Modi govt rule pass chesindi.. solid lines kakunda aa disputed territory ni (PoK and CoK as we call it) dotted lines lo chupinchali else evaraina sare ban chestam ani

so google maps lo kuda dotted line tho update chesaru ventane, to reflect its not part of china or pak..

 

 

bNGtzKv.jpg

Link to comment
Share on other sites

I thought it was designed by Dutch firm, submitted their proposal to CRDA just like Singapore and CRDA made it public. If that article is meant for their entrepreneurs how did they use Singapore master plan in their article? 

 

kadu..

 

Frank Gersdorf ane journalist rasina article idi, athanu work chestunna "Het Financieele Dagblad" (the financial daily) ane Netherland news website lo publish ayindi

 

akkadi nunchi evaro copy chesi mana DB lo vesaru..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...