Jump to content

Asia's biggest Seed Park in Kurnool


Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 9 months later...
వ్యవసాయరంగంలో ఏ ఒప్పందాలు చేసుకున్నారు?

వ్యవసాయరంగంలో ఐయోవా స్టేట్‌ వ్యవసాయ యూనివర్సిటీ అనేది పరిశోధనలో అగ్రస్థానంలో ఉంది. దాంతో పలు అంశాలపై చర్చించారు. కర్నూలు జిల్లాల్లో 500 ఎకరాల్లో మెగా సీడ్‌పార్క్‌ను ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి విత్తనాభివృద్ధి, పరిశోదన జరగనుంది. నెదర్లాండ్స్‌లోని వాజింగ్‌ యూనివర్సిటీతోనూ చర్చలు జరుగుతున్నాయి. మెడిసిన్‌, బయోటె క్నాలజీలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అగ్రగామి. రాష్ట్రంలో కేన్సర్‌ చికిత్సలో ఈ సంస్థ సహకారం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో బయోసిటీ ఏర్పాటులో నాలెడ్జ్‌ సెంటర్‌(విజ్ఞాన కేంద్రం)గా పనిచేసేందుకు ముందుకురావాలని ఈ సంస్థను కోరారు.

Link to comment
Share on other sites

ఆగస్టులో మెగా ఫుడ్‌పార్కుకు శంకుస్థాపన
కర్నూలు మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్‌ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించారు. ఆగస్టులో దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. పార్కు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం, అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయం మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయం విదితమే.

వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌కు చంద్రబాబుకు ఆహ్వానం
అక్టోబరు 18 నుంచి 21 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రంలో నిర్వహించే వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌కు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్‌ సోమవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా జరిగే సభకు హాజరు కావాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారు.

Link to comment
Share on other sites

తంగడంచలో మెగా సీడ్‌పార్క్‌
 
 
  • 800 ఎకరాల్లో విత్తనసాగు, పరిశోధన శాల
  • భూములు పరిశీలించిన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి
జూపాడుబంగ్లా(కర్నూలు), మే 29: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో ఆసియాలోనే అతిపెద్ద మెగా సీడ్‌పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ తెలిపారు. తంగడంచ రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఆయన నంద్యాల ఏడీఆర్‌, తంగడంచ సాంకేతిక విత్తన ఉత్పత్తి, పరిశోదన కేంద్ర ప్రత్యేక అధికారి గోపాల్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలులోని భూములు ప్రపంచంలోనే సారవంతమైనవని ఇక్రిశాట్‌, ఇతర శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందన్నారు. మెగా సీడ్‌పార్క్‌ను రెండు నెలల్లో సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అమెరికా అయోవా యూనివర్సిటీ, వ్యవసాయశాఖ, ఏపీసీడ్స్‌, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌, సీడ్‌మెన్‌ అసోసియేషన, రైతులతో పాటు ప్రైవేటు కంపెనీలతో కలిసి సంయుక్తంగా విత్తన పరిశోధన, క్రాప్‌ ప్రొడక్షన్‌, శాస్త్రీయంగా విత్తన సాగుచేస్తామన్నారు. సీడ్‌పార్క్‌లో మొక్కజొన్న, వరి, జొన్న, బాజ్రా, పత్తి, వేరుశనగ, కంది, పప్పుశనగ, నువ్వులు, అన్ని రకాల కూరగాయాల విత్తన ఉత్పత్తి, పరిశోధన జరుగుతుందన్నారు.
Link to comment
Share on other sites

Sadinchadu CBN....cheppukoleka edustunaru batch...Mana kanna munde vachi info tho peekudam anukunnaru.....

malli daniki valle sadinchinatlu build up icharu....

 

TRIP tickets paruvu bokka so cheppukoleru bayataki emi jarigindo kuda....

Link to comment
Share on other sites

ఆసియాలోనే అతిపెద్ద సీడ్‌హబ్‌గా తంగడంచ

knl-brk4a.jpg

తంగడంచ (జూపాడుబంగ్లా), న్యూస్‌టుడే: తంగడంచలో ఏర్పాటు చేసిన ఆచార్య రంగా విత్తన సాంకేతిక పరిశోధన, ఉత్పత్తి కేంద్రం ఆసియాలోనే అతిపెద్ద సీడ్‌హబ్‌గా అవుతుందని వ్యవసాయశాఖ ప్రధాన కార్యరద్శి హరిజవహర్‌లాల్‌ అన్నారు. సోమవారం వ్యవసాయశాఖ, ఆయోవా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తనపరిశోధన కేంద్రం పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన కేంద్రం, సీడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేస్తారని చెప్పారు. వివిధ విత్తన కంపెనీల భాగస్వామ్యంతో విత్తన ఉత్పత్తి, పరిశోధన ఇక్కడే చేస్తామన్నారు. సాగు చేసిన వివిధ రకాల విత్తనాలను పరిశోధన చేసి ఆయా కంపెనీలకు అప్పజెప్తామన్నారు. మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ, పత్తి, వేరుశనగ, కంది, పప్పుశనగ, కూరగాయాల పంటలు సాగు చేస్తామన్నారు. ప్రాసెసింగ్‌ తర్వాత రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేస్తామన్నారు. అయోవా విశ్వవిద్యాలయం ఇంజినీరు వరప్రసాద్‌, తంగడంచ విత్తన పరిశోధన కేంద్రం ప్రత్యేక అధికారి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 1 month later...
9న కర్నూలులో మెగాసీడ్ పార్క్‌కు శంకుస్థాపన
 
 
636426377883340704.jpg
అమరావతి: ఈనెల 9వతేదీన కర్నూలులో మెగాసీడ్ పార్క్‌కు శంకుస్ధాపన జరగనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ. 671 కోట్లతో 650 ఎకరాల్లో ఈ
మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విత్తనాల తయారీ, మేలు రకం విత్తనాల ఎంపికే లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పరిశోధనల్లో తమిళనాడు రాష్ట్రం ముందుందని, మెగాసీడ్ పార్క్ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీనే నెంబర్ వన్ అని మంత్రి అన్నారు.
Link to comment
Share on other sites

9న మెగాసీడ్‌పార్క్‌కు శంకుస్థాపన: సోమిరెడ్డి
 
 
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి మెగా సీడ్‌పార్క్‌కు ఈ నెల 9న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. 650 ఎకరాల్లో చేపట్టనున్న ఈ పార్కుకు రూ.670 కోట్ల వ్యయం అవుతోందని వివరించారు.

 

16న అమెరికాకు చంద్రబాబు
 
 
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని అయోవా యూనివర్సిటీలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైస్‌ కాన్ఫరెన్స్‌ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు సీఎం చంద్రబాబు అక్కడకి వెళుతున్నారు. 18, 19 తేదీల్లో అయోవా వర్సిటీని కూడా సీఎం సందర్శిస్తారు.
Link to comment
Share on other sites

మెగా సీడ్‌ పార్క్‌కు అనుమతి
 
 
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా జూపాడు బంగా మండలం తంగడంచ వద్ద రూ.670 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రపంచస్థాయి మెగా సీడ్‌ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ గురువారం జీవో 77ను జారీ చేశారు. మెగా సీడ్‌ పార్క్‌కు 623 ఎకరాల 40 సెంట్ల భూమిని కేటాయించారు. నిర్మాణానికి తొలి విడత రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం సహకారంతో దీన్ని ఏర్పాటు చేస్తుంది. దీని నిర్మాణానికి ఈనెల 9న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
Link to comment
Share on other sites

కర్నూలు జిల్లా తంగెడంచలో మెగా సీడ్‌పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక్కడకు 100 పైగా అంతర్జాతీయ విత్తన సంస్థలు వస్తున్నాయన్నారు. దీనికి అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా తాను ఈ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నానన్నారు. బిల్‌, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో అంతర్జాతీయ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేసే సాంకేతికతను వీరు అందిస్తారని వివరించారు. ప్రతిరైతు ఒక శాస్త్రవ్తేతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ‘కర్షకుల ఇళ్లు పశుసంపదతో కళకళలాడాలి, వ్యవసాయం, పశుపోషణ ఉభయతారకం కావాలి. ఇంటికి రెండు, మూడు ఆవులుంటే లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమని’ ఆయన పేర్కొన్నారు. వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఏపీలో రైతు ఉత్పత్తి సమాఖ్యలతోపాటు పంట నిల్వలకు సంబంధించి భారీగా శీతలగిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Link to comment
Share on other sites

మున్ముందు మన విత్తనానికే జై..

తంగెడంచలో మెగా సీడ్‌ పార్కు

తొలిదశలో రూ.150 కోట్లు

చిన్న రైతులు, ఉత్పత్తి సంఘాలకు భాగస్వామ్యం

దేశీయ విత్తన తయారీ సంస్థలకూ చోటు

ఈనాడు, అమరావతి: పంట దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు.. అధిక ఆదాయం సాధించాలంటే రైతుకు విత్తనమే కీలకం. వాటికోసం ఎకరానికి రూ.వేలకు వేలు వెచ్చిస్తున్నా వ్యాపారులు నాసిరకాలే అంటగడుతున్నారు. ఫలితంగా రైతన్నలు పెట్టుబడులు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా భారీస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నా ఉత్పాదకతలో వెనకబడుతున్నాం. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ఈ నష్టాలు నివారించి కర్షకులకు నాణ్యమైన విత్తనం అందించేందుకు కర్నూలు జిల్లా తంగెడంచలో 650ఎకరాల్లో భారీ విత్తనపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు, సామాజిక భాగస్వామ్యంకింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.

ఇప్పటి పరిస్థితిది..: మన అవసరాలకు సరిపడా విత్తనాలను ప్రభుత్వ సంస్థలు అందించలేకపోతున్నాయి. ప్రైవేటు రంగం నుంచి 75శాతం వస్తుంటే ప్రభుత్వ రంగంలోని విత్తన క్షేత్రాల ద్వారా 25శాతమే వస్తోంది. విదేశాల నుంచీ హైబ్రిడ్‌ విత్తనాల దిగుమతి తప్పటం లేదు. ఉద్యాన పంటల్లో సొంత ముద్ర తగ్గిపోతోంది.

మెగా సీడ్‌ పార్కు విస్తీర్ణం : 650 ఎకరాలు

అంచనా వ్యయం : రూ.670కోట్లు

ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన వ్యవధి : అయిదేళ్లు

లక్ష్యం ఇలా: రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాల తయారీ, చిన్న రైతుకు కూడా వాటిని అందేలా చూసి అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విత్తనాలపై పరిశోధనలు, పరిశీలనలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలూ ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. విత్తనాభివృద్ధికి ఇక్కడి వాతావరణం సరిపోతుందనే తంగెడంచను ఎంపిక చేశారు. ఇక్కడ విత్తనాలను అభివృద్ధి చేసే సంస్థలు దేశీయ అవసరాలు తీర్చుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వాటి ఉత్పత్తుల విక్రయానికి ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల విత్తనాలను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. ఈ రంగంలో పనిచేస్తున్న అయోవా విశ్వవిద్యాలయం మెగా సీడ్‌పార్కు ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తోంది.

ఏం చేస్తారంటే

* విత్తనాలపై విస్తృత పరిశోధనలు

* విత్తన తయారీలో విజ్ఞాన వ్యాప్తి

* వ్యాపార అవకాశాల కల్పన

* సామర్ధ్యం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు

* విత్తన విధానం రూపకల్పన

తొలిదశలో రూ.150కోట్ల వ్యయంతో..

మెగాసీడ్‌ పార్కు తొలిదశలో రూ.150కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఉత్పత్తి సంఘాలు, చిన్న రైతులకు ప్రాధాన్యమిచ్చి ఇక్కడ విత్తనాలు తయారుచేసే అవకాశమిస్తారు. వివిధ విత్తన తయారీ సంస్థలూ ఇక్కడ ప్లాట్లు అభివృద్ధి చేయనున్నాయి. వారికి కూడా కేటాయింపులు చేస్తారు. విత్తన శాస్త్ర సంబంధిత కోర్సులు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖతోపాటు వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ విత్తన సంఘం, రాష్ట్ర విత్తన సంఘం, రైతు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.

చేపట్టే పనులు: పరిశోధనాశాల, శుద్ధి/శిక్షణ కేంద్రాలు, గిడ్డంగులు, ఐటీ సౌకర్యాలు, ఇతర వసతులు, సామర్థ్య పెంపు, రైతు ప్రదర్శన క్షేత్రాలు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...