Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
కియలో మొదటి ప్రాధాన్యం అనంతవాసులకే
21-06-2018 12:15:05
 
636651801195946496.jpg
పెనుకొండ రూరల్(అనంతపురం జిల్లా): కియ కార్ల పరిశ్రమ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం జిల్లా యువతకే ఇచ్చి.. వారిలో తగు నైపుణ్యాలు పెంపొందిస్తామని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ పేర్కొన్నారు. పెనుకొండ మండలంలోని కియ కార్లపరిశ్రమ సమీపంలో దుద్దేబండ క్రాస్‌ వద్ద 11 ఎకరాల్లో బుధవారం కియ మోటార్స్‌ ఇండియా శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఇందులో ఆటోమొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సులను కియ మోటార్స్‌ ఇండియా ఎండీ హ్యున్‌ కుక్‌ షిమ్‌, కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు లాఛనంగా శిక్షణ తరగతులు ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా మొదట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కియ కార్లపరిశ్రమకు విచ్చేసి అభివృద్ధి పనులు పరిశీలించిన దృశ్యాలు ప్రదర్శించారు. అనంతరం శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన 20 విభాగాల పనితీరు గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్‌ వీరపాండ్యన్‌ మాట్లాడుతూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందన్నారు. తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభించడం చారిత్రకమని అభివర్ణించారు. ఎంపిక చేసిన 2 వేల మందికి ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారన్నారు.
 
1:3 నిష్ఫత్తిలో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియ ప్రతినిధులు ఉమ్మడిగా ప్రాథమిక, సాంకేతిక కోర్సు డిజైన్‌ చేశారన్నారు. ఈ శిక్షణలో నైపుణ్యం కనబరచిన 600 మంది అభ్యర్థులను మెయిన్‌ ప్లాంటుకు తీసుకుంటారన్నారు. మిగిలిన వారిని వివిధ విభాగాల్లోకి తీసుకుంటారన్నారు. తొలి విడతగా జిల్లావాసులు 2 వేల మందిని ఎంపిక చేశారన్నారు. ఒప్పందం ప్రకారం 11వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వచ్చే నెలలో అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాలలోనూ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి మిగిలిన వారికి కూడా శిక్షణ ఇస్తారన్నారు.
 
కియ పరిశ్రమకు భూములిచ్చిన రైతు కుటుంబాల్లోని వారికి చదువును బట్టి శిక్షణ ఇచ్చి కియతోపాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఇస్తామన్నారు. కియ మోటార్స్‌ ఇండియా ఎండీ షిమ్‌ మాట్లాడుతూ కియలో స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
 
 
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియ కలిసి శిక్షణ కోసం అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాయన్నారు. 2 వేల మంది అభ్యర్థులకు దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. నిర్ణీత సమయానికి కియలో ఉత్పత్తి ప్రారంభించేలా చూస్తామన్నారు. కియ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, అలాగే సహాయ సహకారాలందిస్తున్న జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నైపుణ్యభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ సాంబశివరావు మాట్లాడుతూ కియ కార్లకు 20 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఒక్కో ప్లాంటుకు సంబంధించి క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వనున్నారన్నారు.
 
 
ఇలాంటి కేంద్రాన్ని అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాలలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తె లిపారు. ఒక్కో బ్యాచ్‌లో 20మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ఇందులో నైపుణ్యం కనబరచిన వారికి మాత్రమే ప్రధాన ప్లాంట్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మిగిలిన వారిని ఇతర విభాగాల్లోకి తీసుకుంటారన్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే కియ అధికారులు అద్భుతంగా శిక్షణకేంద్రం నిర్మించారన్నారు. శిక్షణకు రూ.2కోట్లు ఖర్చు చేయనున్నారన్నారు. అనంతరం స్పాట్‌ వె ల్డింగ్‌ రోబోటిక్‌, హ్యాండ్లింగ్‌ రోబోటిక్‌ యంత్రాల పనితీరును కియ ప్రతినిధులు వివరించారు. స్పాట్‌ వెల్డింగ్‌ రోబో ఐలవ్‌మై ఇండి యా అని, హ్యాండ్లింగ్‌ రోబో కియ లోగో ప్రారంభ సూచకంగా రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్యక్రమంలో కియ పీఏఓ జిన్‌జియా, డీఆర్‌డీఏ పీడీ రామారావు, ఏ పీఐఐసీ జడ్‌ఎం నాగేశ్వర్‌రావు, డీజీఎం శివానందనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కియాలో అవకాశాలు అందిపుచ్చుకోండి
atp-gen1a.jpg

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: అనంత యువత కియాలో కల్పించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రమంచిలోని దుద్దేబండ కూడలిలో నిర్మించిన శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమల ప్రాథమిక సాంకేతిక కోర్సులో మొదటి బ్యాచ్‌ శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. అధికారులు, కొరియా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శిక్షణ కేంద్రంలోని రోబోల పనితీరు, యంత్రాలు, యంత్ర పరికరాలను అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ వీరపాండియన్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో సాంబశివరావు, కియా మోటార్స్‌ ఇండియా ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ పాల్గొని మాట్లాడారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకొంటున్న కియా మోటార్స్‌కు నైపుణ్య యువతను అందించాలనే ముఖ్యమంత్రి సంకల్పంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ, కియా ఆధ్వర్యంలో నాలుగు నెలల వ్యవధిలోË నైపుణాభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రం నిర్మించామన్నారు. శిక్షణ కేంద్రంలో 20 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామనీ.. 4 వేల మంది రెగ్యులర్‌, 7 వేల మందికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తామన్నారు. వీరిలో అనంత యువత రెండు వేల మంది ఉంటారని వివరించారు. జేఎన్టీయూ, ఎస్కేయూలో కొరియా భాష నేర్చుకొనేందుకు తరగతులు ప్రారంభిస్తామనీ.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కేశవచంద్రరావు, ఈసీఈ హెచ్‌వోడీ సుధాకర్‌రెడ్డి, ఏపీఐఐసీ జడ్‌ఎం నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ వెలుగు పీడీ రామారావు, పలువురు కొరియా ప్రతినిధులు పాల్గొన్నారు.

డీజీపీ సందర్శన...: కియా పరిశ్రమను బుధవారం డీజీపీ మాలకొండయ్య సందర్శించారు. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళుతూ మార్గమధ్యలో కియా పనులను పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. కియా పరిశ్రమ వద్ద మంజూరైన నూతన పోలీసుస్టేషన్‌ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసివ్వాలని ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడారు. డీఐజీ ప్రభాకర్‌రావు, పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తదితరులున్నారు.

Link to comment
Share on other sites

కియోపదేశం... నైపుణ్య సందేశం 
1 సహనం. 2. నిబద్ధత 3. సమయపాలన. 4. క్రమశిక్షణ. 5.నైపుణ్యం 
వీటిపై పట్టు చిక్కితే కొలువు సులువే..! 
కియా శిక్షణ తరగతుల తీరు 
atp-sty1a.jpg
ప్రముఖ రచయిత యండమూరి రవీంద్రనాథ్‌ రాసిన ‘విజయానికి ఐదు మెట్లు’ పుస్తకం ఒకప్పుడు సంచలనం. యువతకు దిక్సూచి. మార్గనిర్దేశనం చేసిన గ్రంథం. విజయాన్ని చేరుకోవాలంటే ప్రతీ వ్యక్తి ఐదు సూత్రాలు పాటించాలని ఆ పుస్తకం తెలియజేసింది. ఇప్పుడు జిల్లాలో కార్ల తయారీ రంగంలో దిగ్గజం కియా కంపెనీ యువతకు ఇస్తున్న శిక్షణలో కూడా ఐదు సూత్రాలే ప్రధానం. వాటిని అనుసరించి పట్టు సాధిస్తే.. కొలువు సాధించడం సులువే.. అని శిక్షణ చెబుతోంది. ఆ కియా కంపెనీలో ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకుందామా..
న్యూస్‌టుడే, పెనుకొండ పట్టణం

పెనుకొండ వద్ద నిర్మితమవుతున్న కియా కంపెనీ కార్ల తయారీకి వేగంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలో కీలకమైన సాంకేతిక మానవ వనరులు సమీకరణకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారిలో కియా ఆశిస్తున్న ఐదు అంశాలు ఉన్న వారిని ఎంపిక చేయనుంది. జిల్లాలో యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా సంయుక్తంగా ఆటో మొబైల్‌ పరిశ్రమలపై సాంకేతిక శిక్షణ కోర్సు ప్రారంభించాయి. ఈ నెల 20వ తేదీన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, కె.ఎం.ఐ. ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ పొందటం కోసం పాలిటెక్నిక్‌ అభ్యర్థులు అర్హులు. అర్హులైన వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం నమోదు (రిజష్టరు) చేసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 6 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. ఇందులో మొదటి విడతలో 340 మంది అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 290 మంది హాజరయ్యారు. ఇందులో 79 మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిని 20 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. ఐదు రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయం ఏపీఎస్‌ఎస్‌డీసీ కల్పిస్తోంది. రోజుకు 8 గంటల పాటు శిక్షణ కొనసాగుతుంది. మొత్తం 5 రోజులకు 40 గంటలు శిక్షణ ఉంటుంది. ఇందులో 10 గంటలు సైద్ధాంతిక శిక్షణ, 30 గంటలు 20 విభాగాల్లో ప్రయోగ శిక్షణ (ప్రాక్టికల్స్‌) ఇస్తారు. ఒక్కో విభాగాంలో 25 నిమిషాలు పాటు శిక్షకుడు అవగాహన కల్పిస్తారు. మిగిలిన 1 గంట 5 నిమిషాలు అభ్యర్థి ప్రాక్టికల్స్‌ పూర్తి చేయాలి. ఈ శిక్షణలో అభ్యర్థి, సహనం, పనిపట్ల నిబద్ధత, పనిలో కచ్చితత్వం, సమయపాలన, నైపుణ్యత కొలమానంగా అభ్యర్థులను తరువాత పరీక్షకు ఎంపిక చేస్తారు. శిక్షణలోని ప్రధానమైన అంశాలివీ. 
 

హ్యాండ్‌టూల్స్‌ 
atp-sty1b.jpg
ఆటో మొబైల్‌ రంగంలో హ్యండ్‌టూల్స్‌ ప్రధానమైనవి. ఈ రంగంలో ప్రతి పని వీటిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరికరాలపై పట్టు ఉండాలి. శిక్షణలో అభ్యర్థులకు మొదట హ్యాండ్‌ టూల్స్‌ను ఎక్కడ ఎలాంటి పరికరం ఉపయోగించాలో వివరంగా అవగాహన కల్పిస్తారు. ప్రాక్టికల్స్‌లో శిక్షకుడు అడిగిన ప్రకారం తడబడకుండా పరికాలరాలను గుర్తించాలి.
atp-sty1c.jpg
కారు తయారీలో బాడీ పాలిషింగ్‌ ముఖ్యమైనది. ఇక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం తుదిమెరుగులు దిద్దినప్పుడు లోపాలు కనిపిస్తాయి. ఇక్కడ బాడీ పాలిషింగ్‌పై ఒక క్రమపద్ధతిలో శిక్షణ ఇస్తారు. కారుబాడీ పై ఎలాంటి గీతలు పడనీయకుండా జాగ్రత్తగా తుడవాల్సి ఉంటుంది.
atp-sty1d.jpg
కారుబాడీ ఏర్పాటు చేయటంలో ఉపయోగించే షీట్‌ కొలతలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఇక్కడ షీట్‌ కత్తిరించటంపై మెలకువలు నేర్పుతారు. ఓవర్‌ హెడ్‌ సీలింగ్‌ బోర్డుపై ఇచ్చిన గీతల్లోనే కచ్చితంగా చేతులను అటు ఇటు కదిలించకుండా మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌లో వివిధ కోణాల్లో నిలబడి చేయాల్సి ఉంటుంది.
atp-sty1e.jpg
ఇక్కడ పెయింటింగ్‌ ఎలా చేయాలి అన్న అంశంపై శిక్షణ ఇస్తారు. బాడీ పాలిషింగ్‌ పూర్తయిన తరువాత రంగుల అద్దకం చేస్తారు. రంగులు వేసే సమయంలో గాలిబుడగలు, మచ్చలు లాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి పరీక్షిస్తారు.
atp-sty1f.jpg
ఇక్కడ వివిధ కొలతల్లో ఉన్న షీట్‌ను గుర్తించి.. కేటాయించి పెట్టెలో అమర్చాలి. అభ్యర్థులు సరిగ్గా గుర్తించాలి. లేని పక్షంలో తరువాత విభాగంలో పని నిలిచిపోతుంది. ఇలాంటివి తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అప్పగించిన పని పూర్తిచేయాలి.
atp-sty1g.jpg
కారు తయారీలో ఉపయోగించే వివిధ రకాల బోల్టులు, నట్లు, వాషర్‌లు, స్క్రూలు గుర్తించి.. శిక్షలు చెప్పిన విధంగా పెట్టెలో అమర్చాలి. ఎలాంటి పొరపాటు జరిగనీయకుండా అప్రమత్తంగా ఉండాలి.
atp-sty1h.jpg
కారులో ప్రయాణిచే సమయంలో గాలి, నీళ్లు , దుమ్ము లోపలికి రాకుండా కారు ముందు, వెనక అద్దాలు, కిటికీలు, తలుపులు వద్ద రబ్బరుతో ఏర్పాటు చేస్తారు. క్రమ పద్ధతిలో ఒకదాని తరువాత ఒకటి అమర్చేలా శిక్షణ ఇస్తారు.
atp-sty1i.jpg
ఇక్కడ 6 రకాల ప్లేట్స్‌ అమర్చే పెట్టెలు ఉంటాయి. అభ్యర్థి శిక్షకుడు సూచన మేరకు స్కేల్‌తో కొలతలు తీసి సరైన పెట్టెలో అమర్చాలి. ఒక్కో బాక్సులో 20 ప్టేట్లు పెట్టాలి.
atp-sty1j.jpg
కారు ముందు, వెనుక భాగాల్లో చక్రాలను అమర్చటంలో మెలకువలు నేర్పుతారు. శిక్షకుడు సూచించిన విధంగా చక్రాలను వర్టికల్‌, హారిజంటల్‌ పద్ధతిలో అమర్చాలి. ఒక్కో చక్రం 14 కిలోల బరువు ఉటుంది. ఈ విభగాంలో పనిచేసే వారికి సహనం ఉండాలి. చక్రం అమర్చే సమయంలో నట్లు బిగిచటంలో మెలకువలను వివరిస్తారు.
ఓవర్‌హెడ్‌ ట్రాంక్‌ ప్లేట్‌ ఇన్‌స్టాలేషన్‌లో రెండు రకాల ప్లేట్లు అమర్చాల్సి ఉంటుంది. మొదట ఆరు రంధ్రాలతో, రెండోది ఎనిమిది రంధ్రాలతో ఉంటుంది. అభ్యర్థి తల పైభాగంలో వీటిని అమర్చాలి. ముందుగా ప్లేట్‌ను వ్యతిరేక దిశలో రంధ్రాలకు బోల్టు అమర్చి బిగించాలి.
atp-sty1k.jpg
ఇక్కడ కారులో ఉపయోగించే లైటు, హారన్‌, బ్యాటరీ, ఏసీలకు సంబంధించి వైరింగ్‌ ఎలా చేయాలి అన్న అంశంపై శిక్షణ ఇస్తారు. తరువాత అభ్యర్థి శిక్షకుడు సూచించిన చోట జాగ్రత్తగా అమర్చాల్సి ఉంటుంది. పొరపాటు జరిగితే ప్రమాదం సంభవిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయాలి.
atp-sty1l.jpg
కారు డ్రైవింగ్‌లో ప్రధానమైనవి క్లచ్‌, యాక్సిలేటర్‌, బ్రేక్‌ పెడల్‌. వీటిని అమర్చటంలో అభ్యర్థి కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. శిక్షకుడి సూచనమేరకు  కొలతలు పాటించాలి.
atp-sty1mm.jpg
ఇక్కడ కారు బాడీ, ఇంజిన్‌, పైభాగంలో వివిధ కోణాల్లో, ఆకృతుల్లో రంధ్రాలున్న ప్లేట్లను గుర్తించి.. శిక్షకుడు సూచించిన ప్రాంతంలో అమర్చాలి. ఇలా చేయటంలో ముందుగా వ్యతిరేక దిశలో ఉన్న రంధ్రాలకు బోల్టులు బిగించాలి. ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రతి బోల్టును బిగించాల్సి ఉంటుంది.
నైపుణ్య సాధనకు మంచి అవకాశం
కళాశాలలో పుస్తకాల్లో చదువుకొన్న అంశాలకు.. స్వయంగా చూసి నేర్చుకొన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. చదువు పూర్తయిన వెంటనే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణకు ఎంపికవటం సంతోషంగా ఉంది. కళాశాల ప్రయోగశాలలో చెప్పిన అంశాలకు ఇక్కడ చూసి నేర్చుకోవటం వల్ల నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చు.
- రవికిషోర్‌, గుంతకల్లు
వ్యక్తిగత భద్రతకు పెద్దపీట
కళాశాల ప్రయోగశాలలో కేవలం వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ శిక్షణలో శిరస్త్రాణం, బూట్లు, పనిచేసే సమయంలో చేతి రక్షణ కోసం గ్లౌజులు, కళ్లజోడు ధరిస్తేనే శిక్షణ తరగతికి అనుమతిస్తారు. వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. నిరుద్యోలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధునిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటం శుభపరిణామం.
- కలీంబాబా, తాడిపత్రి
ఎంపికలో ప్రతిభే కొలమానం
శిక్షణకు ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయటం గొప్పవిషయం. కళాశాల్లో బోధన కేవలం తరగతి గదికే పరిమితమవుతోంది. ఇక్కడ శిక్షణ అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. కియాలో ఎంపిక జరగకపోయినా.. ఉపాధి అవకాశం కల్పించేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ భరోసా ఇచ్చింది.
- రుకేష్‌కుమార్‌, కదిరి
Link to comment
Share on other sites

కియా మోటార్స్‌కు మరో 187 ఎకరాలు
27-06-2018 01:10:54
 
అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో కియా మోటార్స్‌కు మరో 187 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనకు ఏపీఎల్‌ఎమ్‌ఏ ఆమోదం తెలిపింది. మంగళవారం సచివాలయంలో ఇన్‌చార్జి సీఎస్‌, సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్రపునేఠా అధ్యక్షతన ఏపీఎల్‌ఎమ్‌ఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. ఆరు కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ... ఒక ప్రతిపాదనను తిరస్కరించారు. 
Link to comment
Share on other sites

య’లో కొలువుల సందడి
02-07-2018 02:21:37
 
636660948964489933.jpg
  • జెట్‌ స్పీడ్‌తో కార్ల పరిశ్రమ పనులు
  • ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
  • శిక్షణలో తొలి బ్యాచ్‌.. స్థానికులకు, డిప్లమోకు ప్రాధాన్యం
అనంతపురం, జూలై 1(ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియా కార్ల దిగ్గజం.. కియ పరిశ్రమ పనులు ఊపందుకున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద జెట్‌ స్పీడుతో సాగుతున్న పరిశ్రమ పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం విదితమే!. తాజాగా.. పరిశ్రమ ఉత్పత్తి సమయానికి అవసరమైన సిబ్బంది, కార్మికుల కోసం ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కియ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తుండగా.. తొలిగా 20 మంది డిప్లమో పూర్తి చేసిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. దశలవారీగా ఈ నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని కియ ప్రతినిధులు చెబుతున్నారు.
 
 
సీఎం ఆదేశాలతో శరవేగంగా...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సకాలంలో ఉత్పత్తిని ప్రారంభించే దిశగా రాత్రింబవళ్లూ పనులు జరుగుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటులో జిల్లా అధికార యంత్రాంగం తలమునకలైంది. పరిశ్రమ ప్రాంగణంలోని యుటిలైజేషన్‌ ప్లాంట్‌ మొదలు ఉద్యోగుల నివాసానికి సంబంధించిన టౌన్‌షిప్‌ వరకు 60.10 శాతం పనులు పూర్తయ్యాయి.
 
 
శరవేగంగా అనుబంధ పరిశ్రమలు
కియ అనుబంధ సంస్థలకు కేటాయించిన 195ఎకరాల భూమి చదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ భూముల్లోనే హుండై, మోదీష్‌, డైమోష్‌, ఫీల్‌, గోనిక్‌ కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పరిశ్రమకు నీరందించే పైప్‌లైన్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. బొక్సంపల్లి నుంచి 12 కి.మీ. మేర 32 కేవీ విద్యుత్‌ లైను నిర్మాణ పనులు, సుబ్బరాయనపల్లి నుంచి 12 కి.మీ. మేర 220 కేవీ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులు 80శాతం పూర్తయ్యాయి.
 
 
భూమి హక్కులు ఏపీఐఐసీకి బదలాయింపు..
కియ మోటార్స్‌కు సంబంధించిన భూకేటాయింపులు రెవెన్యూశాఖ నుంచి ఏపీఐఐసీకి హక్కులు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం టౌన్‌షి్‌ప 36 ఎకరాలు, శిక్షణా కేంద్రాలకు 112 ఎకరాలు, సైట్‌ట్రాక్‌ 50 ఎకరాలు, ట్రాక్‌ టెర్మినల్‌ 30 ఎకరాలను జిల్లా ఏపీఐఐసీ కియ పరిశ్రమకు రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. అనుబంధ పరిశ్రమల భూములనూ ఏపీఐఐసీ నుంచి రిజిస్టర్‌ చేయించుకోవాలి.
 
 
స్థానికులకు ప్రాధాన్యం
కియ కార్ల పరిశ్రమలో అనంతపురంజిల్లా వాసులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే జిల్లాలో డిప్లమో పూర్తి చేసిన వారందరినీ కియ వెబ్‌సైట్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపు ఇచ్చాం. దాని ఆధారంగా నమోదైన వారికి శిక్షణ ప్రారంభించాం. అర్హులందరికీ ఉద్యోగాలు వస్తాయి.
-వీరపాండ్యన్‌, అనంతపురం కలెక్టర్‌
 
 
 
ప్రాథమిక, సాంకేతిక శిక్షణ
కియ కార్లపరిశ్రమలో ప్రాథమిక, సాంకేతిక కోర్సులో శిక్షణ ప్రారంభమైంది. పరిశ్రమలో ఉద్యోగ నియామకాల కోసం 5400 మంది డిప్లమో అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకోగా, వారిలో ముందుగా 290 మందికి అర్హత పరీక్షలు నిర్వహించారు. పరిశ్రమ సమీపంలోని దుద్దేబండ క్రాస్‌ వద్ద 11 ఎకరాల్లో కియ మోటార్‌ ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 20న ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణా తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అందులో 20 విభాగాల పనితీరుకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 20 మందికి ఐదేసి రోజుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు.
 
 
ఈ శిక్షణలో నైపుణ్యం కనబరచిన 600 మంది అభ్యర్థులను మెయిన్‌ ప్లాంట్‌కు, మిగిలిన వారిని వివిధ విభాగాల్లో పనికి నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కియ పరిశ్రమ ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిదశలో అనంతపురం జిల్లా వాసులు 2వేల మందికి మొదట పెనుకొండలో శిక్షణ పూర్తి చేస్తారు. డిప్లమో పూర్తి చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటో మొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సు శిక్షణలో అత్యత్తమమైన ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు కియ ప్రధాన ప్లాంటులో నియమించనున్నారు. పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా 4 వేలు, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించనుంది.
Link to comment
Share on other sites

కియా ఎలక్ట్రిక్‌ కార్లు!
రాష్ట్ర వేదికగా మరో కీలక ప్లాంట్‌
570 ఎకరాల కోసం ప్రతిపాదనలు
భూ సేకరణ దిశగా యంత్రాంగం
ఈనాడు, అమరావతి: కియా ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సైతం రాష్ట్రం వేదిక కానుంది. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం చివరకు ఆంధ్రప్రదేశ్‌లోనే యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.
భారత్‌లో మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతులకూ వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కర్మాగార పనులు అనంతపురం జిల్లా వెనుకొండ మండలం ఎర్రమంచిలిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. 535 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ కర్మాగారంలో కొత్త సంవత్సర కానుకగా మొదటి కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కియా యత్నిస్తోంది. పనుల పురోగతిని కియా ప్రతినిధుల బృందం ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రికి వివరించగా.. జనవరి ఒకటికల్లా తొలి కారును మార్కెట్లోకి తేవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కర్మాగార పనులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌నూ నెలకొల్పేందుకు కియా ఆసక్తి చూపుతోంది. ఇదే అంశాన్ని  సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి ముందుంచగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కియా మోటార్స్‌ కోసం ఎర్రమంచిలిలో ఇదివరకే దాదాపు 672 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వందెకరాల్లో కొండ కూడా ఉంది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు మరో 570 ఎకరాలకు పైగా భూములు అవసరమని కియా మోటార్స్‌ తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. 73.50 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ప్లాంట్‌, 433 ఎకరాల్లో అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఇంకో 84 ఎకరాలు డంపింగ్‌ యార్డు కోసం అవసరమని సూచించింది. దీంతో అదనపు భూ సమీకరణ కోసం అధికారులు దృష్టిపెట్టారు. భూ కేటాయింపు పూర్తయ్యాక కియా ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించే యోచనతో ప్రభుత్వం ఉంది. దీంతో అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.
 
 
 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:
కియా ఎలక్ట్రిక్‌ కార్లు!
రాష్ట్ర వేదికగా మరో కీలక ప్లాంట్‌
570 ఎకరాల కోసం ప్రతిపాదనలు
భూ సేకరణ దిశగా యంత్రాంగం

ఈనాడు, అమరావతి: కియా ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సైతం రాష్ట్రం వేదిక కానుంది. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం చివరకు ఆంధ్రప్రదేశ్‌లోనే యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.
భారత్‌లో మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతులకూ వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కర్మాగార పనులు అనంతపురం జిల్లా వెనుకొండ మండలం ఎర్రమంచిలిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. 535 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ కర్మాగారంలో కొత్త సంవత్సర కానుకగా మొదటి కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కియా యత్నిస్తోంది. పనుల పురోగతిని కియా ప్రతినిధుల బృందం ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రికి వివరించగా.. జనవరి ఒకటికల్లా తొలి కారును మార్కెట్లోకి తేవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కర్మాగార పనులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌నూ నెలకొల్పేందుకు కియా ఆసక్తి చూపుతోంది. ఇదే అంశాన్ని  సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి ముందుంచగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కియా మోటార్స్‌ కోసం ఎర్రమంచిలిలో ఇదివరకే దాదాపు 672 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వందెకరాల్లో కొండ కూడా ఉంది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు మరో 570 ఎకరాలకు పైగా భూములు అవసరమని కియా మోటార్స్‌ తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. 73.50 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ప్లాంట్‌, 433 ఎకరాల్లో అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఇంకో 84 ఎకరాలు డంపింగ్‌ యార్డు కోసం అవసరమని సూచించింది. దీంతో అదనపు భూ సమీకరణ కోసం అధికారులు దృష్టిపెట్టారు. భూ కేటాయింపు పూర్తయ్యాక కియా ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించే యోచనతో ప్రభుత్వం ఉంది. దీంతో అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.

 
 
 

ముఖ్యాంశాలు

 

Fantabulous news 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...