Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
కియా నవశకం
అనంతపురంలో శరవేగంగా రికార్డు స్థాయిలో నిర్మాణాలు
ఏడాదిలో 90% పనులు పూర్తి
16ap-story1a.jpg

అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్‌ ఇండియా కేవలం ఏడాది వ్యవధిలోనే 90 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఒక కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలంటే సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. కియా సంస్థ ప్రపంచవ్యాప్తంగా 14 చోట్ల తన కర్మాగారాలను ఏర్పాటు చేయగా ఇంచుమించు ప్రతిచోటా నిర్మాణానికి మూడు నుంచి నాలుగేళ్ల సమయం పట్టింది. అలాంటిది రాష్ట్రప్రభుత్వ చొరవ, సహకారంతో గతేడాది నవంబరులో అనంతపురంలో నిర్మాణ పనులు మొదలుపెట్టి ఇప్పటికే 90 శాతం పూర్తి చేసింది. ‘మరో పదిశాతం పనులను వచ్చే జనవరి నెలాఖరుకల్లా పూర్తి చేస్తాం. ట్రయల్‌కార్లను విస్తృత స్థాయిలో పరీక్షించిన అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తిని 2019 సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తాం. జనవరి నెలాఖరుకు ట్రయల్‌ కారు భారతదేశ రహదారులపై షికారు చేయబోతోంది’ అని కియా డిప్యుటీ మేనేజర్‌ జి.సి.శ్యామ్‌సుందర్‌ తెలిపారు. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ సగటున రోజుకు 4,100 మందితో పనులను అలుపెరగకుండా చేయిస్తోంది. మొత్తం 48 సంస్థలు వివిధ బాధ్యతలను యుద్ధప్రాతిపదికన నిర్వర్తిస్తున్నాయి. కొరియా నుంచి అధునాతన యంత్రాలను దిగుమతి చేసుకుని కర్మాగారంలో ఏర్పాటు చేస్తున్నారు.  అనంతపురంలో తయారైన కార్లను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలించడానికి, విక్రయించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

16ap-story1d.jpg

16ap-story1b.jpg

హైబ్రిడ్‌ కార్లకు సన్నాహాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్‌, పెట్రోలు/డీజిలు రెండింటితోనూ నడిచే కార్లు అందుబాటులో లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని కియా సంస్థ హైబ్రిడ్‌ వర్షన్‌ కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కారును ఎలక్ట్రిక్‌ కారుగానూ, పెట్రోలు/డీజిల్‌ కారుగానూ ఎవరికి నచ్చిన మోడ్‌లో వారు వాడుకోవచ్చు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం, ఫ్యూయల్‌ సెల్‌ బ్యాటరీ కార్ల వినియోగం కూడా విస్తృతమయ్యే సూచనలున్న నేపథ్యంలో ఆయా వర్షన్లను కూడా అనంతపురం కర్మాగారంలో తయారు చేయడానికి అవసరమైన మౌలికసదుపాయాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. కియాసంస్థ ప్రపంచవ్యాప్తంగా 16 మోడళ్లను, సుమారు 70 వరకు వేరియంట్లను మార్కెట్‌ చేస్తున్నప్పటికీ వాటిలో ఏ ఒక్కదాన్నీ భారత్‌ మార్కెట్లోకి తీసుకురావటం లేదు. ఇప్పుడు భారతదేశం కోసమే ప్రత్యేకించి ‘ఎస్‌.పి.2ఐ’ సరికొత్త మోడల్‌ను తయారుచేస్తోంది. పదివేల కార్ల సామర్థ్యంతో భారీ స్టాక్‌యార్డ్‌ను సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ యార్డ్‌ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కార్లను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తొలి దశలో కనీసం వంద మంది డీలర్లతో విక్రయాలు ప్రారంభించనుంది.

16ap-story1c.jpg

16ap-story1e.jpg

ఇప్పటి వరకు అత్యధికశాతం పూర్తైన నిర్మాణాలు...
* కారులోని 17 భాగాలను తయారుచేసే ప్రెస్‌ విభాగం
* బాడీషాప్‌ విభాగం. వెల్డింగులన్నీ రోబోలే చేస్తాయి.
* కార్ల పెయింట్స్‌ విభాగం.
* ఇంజిన్‌ విభాగం. కారుకు అవసరమయ్యే ఇంజన్లన్నీ ఇక్కడే తయారవుతాయి.
* కారు విడిభాగాలను కలిపే అసెంబ్లింగ్‌ విభాగం.
* 3.5 కి.మీ.ల దూరమున్న టెస్ట్‌ ట్రాక్‌ నిర్మాణం. కారు మొత్తం తయారైన తరువాత వివిధ రకాల పరిస్థితులుండే రహదారులపై కారు ఎలా ప్రయాణిస్తుందో తనిఖీ చేస్తారు.
* వివిధ హోదాల ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌-1 నిర్మాణం.
* ఉద్యోగులుగా చేరబోయే వారి కోసం నిర్మించిన శిక్షణ కేంద్రం.
అనుబంధ సంస్థల పెట్టుబడి రూ.4,977కోట్లు
కియా సంస్థ అనంతపురంలో సుమారు రూ.7,700కోట్లు (1.1బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి నేరుగా పెట్టనుంది. ఈ సంస్థకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులు, విడిభాగాలు తయారు చేసి ఇవ్వడానికి వీలుగా మరో 15 సంస్థలు సుమారు రూ. 4,977 కోట్ల (711 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడిని పెట్టనున్నాయి.
- ఈనాడు, విశాఖపట్నం
Link to comment
Share on other sites

  • 2 weeks later...

 

29న కియా తొలికారు సిద్ధం

 

 

ఈనాడు, అనంతపురం: కియా కార్ల తయారీ పరిశ్రమలో.. తొలికారు ఈ నెలాఖరుకు సిద్ధం కానుంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44కి ఆనుకుని కియా కార్ల తయారీ పరిశ్రమ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ ప్రధాన ప్లాంట్‌కు ప్రభుత్వం 535 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడ కియా యాజమాన్యం రూ.13,500 కోట్ల మేర పెట్టుబడి పెడుతోంది. ఈ పరిశ్రమ ద్వారా 11 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కనుంది. గత ఏడాది కియా పరిశ్రమకు సంబంధించి ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో తొలి కారు ట్రయల్‌ రూపంలో తయారు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 29న తొలికారు అసెంబుల్డ్‌ చేయనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అదే రోజు కారు బయటకు రానుంది. ఈ తొలి కారు తయారీ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా కీలక ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. ఆ తర్వాత కియాలో పూర్తిస్థాయి కార్ల తయారీ ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో మొదలుకానుంది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...