Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 900
  • Created
  • Last Reply

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో టౌన్‌షిప్‌, శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సర్వే నంబరు 14-6లో 58.40 ఎకరాలు, సర్వే నంబరు 17-2బీ2లో 36 ఎకరాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణం కోసం 129.09 ఎకరాలు, ట్రక్కు టెర్మినల్‌, రైల్వే సైడింగ్‌ వెండర్స్‌ కోసం 402.32 ఎకరాల రెవిన్యూ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు.
* అనంతపురం జిల్లాలోనే పవన విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో 4.59 ఎకరాల ప్రభుత్వ భూమిని, రామగిరి మండలం పేరూరు గ్రామంలో

0.24 సెంట్ల రెవిన్యూ భూమిని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి బదలాయింపు

Link to comment
Share on other sites

decoit mafia fraud 1 lakh acres science city kosam 2009 lo decoit gadiki votes vesaru ATP lo prajalu amayakam ga...

 

atlantidi e roju jarugutunna development reality ni chusi guddutaru ani asiddam...ATP ki world's top automobile,agri lo highest growth and people eve making lakhs on agri,

 

First star hotel in Andhra after Vizag,TPT is ATP.....Feeling happy for them :super:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కియా విద్యుత్‌ కార్లొస్తాయ్‌
హైబ్రిడ్‌ విభాగంలోకీ అడుగు
2021 కల్లా ఉత్పత్తి
మూడేళ్లలో మూడు మోడళ్లు
గడువు కన్నా 10 శాతం ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్లాంటు పనులు
కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్‌
దిల్లీ
11business2a.jpg
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా, 2021 కల్లా భారత్‌లో విద్యుత్‌, హైబ్రిడ్‌ కార్లు ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నుంచే వీటినీ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంటు నుంచి పెట్రో కార్లను వచ్చే ఏడాది సంస్థ విడుదల చేయనుంది. వచ్చే మూడేళ్లలో మూడు మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ కియా మోటార్స్‌ ఇండియా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వాహన ప్రదర్శనలో చూపించిన ఎస్‌యూవీ, ఎస్‌పీ కాన్సెప్ట్‌ కార్లను ముందుగా ఆవిష్కరిస్తారు. మా అనంతపురం ప్లాంటులో విద్యుత్‌, హైబ్రిడ్‌ కార్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామ’ని కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్‌ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కంపెనీ ఈ ప్లాంటుపై 1.1 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఏటా 3 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంటుంది. ఒక్కసారి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే 3,000 మందికి ఉపాధి లభిస్తుంది.

‘మా బ్రాండ్‌ను పర్యావరణ హిత కార్ల తయారీ కంపెనీగా నిలబెట్టాలని మేం భావిస్తున్నాం. ఈ మార్కెట్లో దిగ్గజ సంస్థగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి 2021 కల్లా పూర్తి స్థాయి విద్యుత్‌ కారు తీసుకువస్తామ’ని షిమ్‌ పేర్కొన్నారు. అయితే ప్రతిపాదిత విద్యుత్‌ కారు గురించిన వివరాలను ఆయన వివరించలేదు. ఈ ఏడాది జరిగిన వాహన ప్రదర్శనలోనూ 2019-21 మధ్య భారత్‌ కోసమే ప్రత్యేకంగా ఒక కాంపాక్ట్‌ విద్యుత్‌ కారును తయారు చేస్తామని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ హంకూ పార్క్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా 2025 కల్లా 16 విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టాలని ఆ కంపెనీ అనుకుంటోంది. ‘ఇప్పటికే ఐరోపా, అమెరికా మార్కెట్లలో విద్యుత్‌ కార్ల(ఈవీ)ను విక్రయిస్తున్నాం. కాబట్టి కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌ విషయంలో అందుకే ధీమా ఉన్నామ’ని షిమ్‌ చెప్పుకొచ్చారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
* ప్రస్తుతం ఈవీ (విద్యుత్తు వాహనా)లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో దేశంలో ఇబ్బందులు ఉన్నాయి. వీటికి 2021 కల్లా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం.
* మూడేళ్లలో మూడు మోడళ్లను ప్రారంభిస్తాం. ఈ విషయంలో భారత్‌లో మార్కెట్‌ సర్వే చేస్తున్నాం. అంతర్జాతీయంగా చేపట్టనున్న 16 బ్రాండ్లలో భారత్‌కు ఏ మూడు అయితే బాగుంటుందని పరిశీలిస్తున్నాం.
* అంతర్జాతీయంగా ఎస్‌యూవీ, ఎమ్‌పీవీల విభాగంలో కియాకు మంచి పట్టుంది. ఈ వాహనాలకు భారత్‌లో భారీ గిరాకీ ఉంది. అందుకే మా ప్రాధాన్యత ఎస్‌యూవీలకే. అయినప్పటికీ మా పోర్ట్‌ఫోలియోలో హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్‌ కార్లు కూడా ఉంటాయి.
* ప్రస్తుతం సరైన డీలర్‌షిప్‌ భాగస్వామ్యాలను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉన్నాం. భారత్‌ మొత్తం నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
* హ్యుందాయ్‌ ఇండియాతో భాగస్వామ్యం ఉన్నా విక్రయాలు, సేవల నెట్‌వర్క్‌ విషయంలో స్వతంత్రంగానే ఉంటాం. స్థానిక సరఫరాదార్లు కూడా వేర్వేరుగానే ఉంటారు. అయితే దక్షిణ కొరియా సరఫరాదార్లు ఇద్దరికీ ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 120 మంది సరఫరాదార్లతో కియా ఇండియా చర్చలు జరపడం ప్రారంభించింది.
* హ్యుందాయ్‌తో మా ప్లాంటును పంచుకునే అవకాశం లేదు. మా కియా వాహనాలకు భారత్‌లో గిరాకీ కనిపిస్తోంది.
* ఈ ఏడాది అక్టోబరు నుంచి 3000 మంది సిబ్బంది నియామక ప్రక్రియను మొదలుపెడతాం. 2020 కల్లా పూర్తి చేస్తాం. ప్లాంటులో మూడు షిఫ్ట్‌లకు సరిపడా ఉద్యోగులను తీసుకుంటాం.
* అనంతపురం ప్లాంటు 65 శాతం పూర్తయింది. సాధారణ గడువు కంటే 10 శాతం ముందే ఉన్నాం. మిగిలిన సమయాన్ని కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నమూనా ఉత్పత్తికి ఉపయోగిస్తాం.

 
Link to comment
Share on other sites

అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ కార్ల తయారీ
12-06-2018 00:01:56
 
636643585284262184.jpg
 
  • 2021నాటికి ఎలక్ర్టిక్‌ వాహనం విడుదల
  • మూడేళ్లలో మార్కెట్లోకి మూడు మోడళ్లు
  • కియా మోటార్స్‌ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నిర్మిస్తున్న ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ కార్లను కూడా తయారు చేయాలని దక్షిణ కొరియాకు చెందిన కియా యోచిస్తోంది. 2021నాటికి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. కియా మోటార్స్‌ కార్పొరేషన్‌కు చెందిన కియా మోటార్స్‌ ఇండియా వచ్చే మూడేళ్ల కాలంలో దేశీయ మార్కెట్లో మూడు మోడళ్లను విడుదల చేయానుకుంటోంది. వీటి ద్వారా దేశీయ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశిస్తుంది. మొద ట ఎస్‌యువి, ఎస్‌పి కాన్సె్‌ప్టలను విడుదల చేస్తుంది. వీటిని ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘‘అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ వాహనాలను తయారు చేయాలనుకుంటున్నాం’’ అని కియా మోటార్స్‌ ఇండియా సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కూక్‌ హ్యున్‌ షిమ్‌ పిటిఐ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎలక్ర్టిక్‌ కార్ల మార్కెట్లో మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నామని, ఇందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే 2021నాటికి పూర్తి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఎలక్ర్టిక్‌ వాహనాలను యూరప్‌ , అమెరికా మార్కెట్లలో విక్రయిస్తున్నామని, వీటికి సంబంధించిన మొత్తం టెక్నాలజీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. చార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, బ్యాటరీ లైఫ్‌ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సమస్యలు 2021నాటికి పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు.
 
తమ గ్లోబల్‌ పోర్ట్‌ఫోలియోలో 16 బ్రాండ్స్‌ ఉన్నాయని, వీటిలో ఏ మోడల్‌ను భారత మార్కెట్లోకి లోకలైజేషన్‌ తర్వాత విడుదల చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎస్‌యువి, ఎంపివి మార్కెట్లో కియా ఇప్పటికే సత్తా చాటుకుంటోందని, ఇలాంటి వాహనాలకు భారత మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉందని షిమ్‌ పేర్కొన్నారు. హ్యాచ్‌బ్యాక్స్‌, కాంపాక్ట్‌ కార్లు కూడా తమ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా కియా వాహనాలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నామని, ఇందులో భాగంగా సరైన డీలర్‌ పార్ట్‌నర్లను ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోందని ఆయన చెప్పారు. 120 మంది సప్లయర్లతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. తమ ప్లాంట్‌లో హ్యుండయ్‌ కంపెనీ కార్లను తయారు చేసే అవకాశం ఉండదన్నారు. కియా కార్లకు భారత్‌లో అధిక డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నామని, కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌ (సికెడి) రూపంలో విడిభాగాలను తెచ్చి ఇక్కడి ప్లాంట్‌లోనే కొన్ని మోడళ్లను అసెంబుల్‌ కూడా చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్లాంట్‌కు అవసరమైన 3,000 మంది సిబ్బంది నియామకాలను వచ్చే అక్టోబరులో ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియ 2020నాటికి ముగుస్తుందని ఆయన చెప్పారు.
 
అనంతపురం ప్లాంట్‌ కోసం కంపెనీ 110 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతోంది. వార్షికంగా మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తే దాదాపు 3,000 మందికి ఉపాధి కలుగనుంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం 65 శాతం పూర్తయిందని, షెడ్యూల్‌కన్నా పనులు ముందుగానే జరుగుతున్నాయని షిమ్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

జనవరి 1 కల్లా  కియా కారు! 
కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన 
12ap-state1a.jpg

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనవరి ఒకటి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కియా తొలి కారును బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కియా మోటార్స్‌ భారత్‌ ప్రతినిధులకు సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ప్లాంట్‌ పనులను వివరించి, వీడియో చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన వేగాన్ని కియా అందుకుంటుందని వ్యాఖ్యానించారు. పనుల నిర్వహణపై సంతృప్తి ప్రకటించారు. కొత్త సంవత్సరంలో భారత్‌లో తయారయ్యే మొదటి కియా కారును దేశానికి అందించాలని కోరారు. కియాకు సంబంధించి భూసేకరణ అంశాలను వెంటనే పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్‌ను ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని యువతకు ఆటోమొబైల్‌ విభాగంలో నైపుణ్యం కల్పించేందుకు కియా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి ఈనెల 20 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Link to comment
Share on other sites

అనంతపురంలో 400 మందికి ఉపాది ఇచ్చే, కియా అనుబంధ పరిశ్రమకు శంకుస్థాపన...

Super User
14 June 2018
Hits: 1
 
kia-14062018.jpg
share.png

మన రాష్ట్ర ప్రగతికి అడ్డు పడుతూ, ఢిల్లీ పెద్దలు పన్నిన కుట్రలకు, మన రాష్ట్రంలో కొంత మంది తోడేళ్ళు కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎన్ని కుట్రలు పన్నుతున్నారో చూస్తున్నాం.. ఇలాంటి కుట్రలను ఎదుర్కుంటూ, మరో పక్క రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు చంద్రబాబు... ఇప్పటికే కియా సంస్థ తన ప్లాంట్ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, ఇప్పుడు కియా అనుబంధ పరిశ్రమలు కూడా, రెడీ అవుతున్నాయి. కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, కియాకి అనుబంధంగా ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక కంపెనీ అయిన, Faurecia Interior Systems, ఈ రోజు శంకుస్థాపన చేసుకుంది.

 

kia 14062018 2

Faurecia Interior Systems అనే సంస్థ, కార్ ఇంటీరియర్ తాయారు చేస్తుంది. ఈ కంపెనీ కార్ ఇంటీరియర్ తాయారు చెయ్యటంలో, ప్రపంచంలోనే ఒక టాప్ కంపెనీ గా ఉంది. కియా మోటార్స్ నిర్మాణం జరుగుతున్న చోట, ఈ ప్లాంట్ ఈ రోజు శంకుస్థాపన జరుపుకుంది. 180 రోజుల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చెయ్యనున్నారు. 12 ఎకరాల్లో, ఈ కంపెనీ స్థాపన జరగనుంది. మొత్తం 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఈ ప్లాంట్ లో, 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, రూ.4,790 కోట్ల పెట్టుబడులతో 6.,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ పరిశ్రమల కోసం, అనంతపురము జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్ కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, , అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది.

kia 14062018 3

చంద్రబాబు మాట్లాడుతూ, కియా మోటార్స్ సహా ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ కంపెనీలైన ఇసుజు మోటార్స్-అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని, వీటిలో సుజుకి ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియామోటార్స్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్ గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని అన్నారు. తాను ఇటీవల బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. అనంతపురాన్ని రెండవ స్వగృహంగా భావించాలని ముఖ్యమంత్రి కోరారు. ఓవైపు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున చేపడుతూనే మరోవైపు భారీ స్థాయిలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

Faurecia-France (Worlds top auto parts supplier) today done foundation for parts supply plant in "KIA vendor zone"...They mfg car interior in their Ammavaru Palli Auto Vendor park by ANdhra Pradesh govt...

With this global giant in AUTO parts other vendors also will follow :no1:......AUTO industry, always one giant can pull multiple vendors and that is what started in ATP....

 

new-2-699x380.jpeg?1528968835

new-699x380.jpg?1528968835

 

whatsapp-image-2018-06-14-at-1-699x380.j

 

2-699x380.jpg?1528968835

Edited 2 hours ago by AnnaGaru
Link to comment
Share on other sites

Global component and technology major Faurecia’s Interior Systems division today laid the foundation stone for a new plant at Kia Motors India’s component Vendor Park A at Ammavaru Palli, Penukonda Tensil, Anantpur district in Andhra Pradesh.

Faurecia Interior Systems will produce injection moulding and assembly for supply to Hyundai Mobis, which will make the vehicle cockpit for Kia Motors India.  

The start of production for Faurecia’s India plant is Q3 of 2019. The company aims to get the plant ready in 180 days. The plant, spread across 15,000 square metres, is to come up on a 12-acre site. Faurecia is investing Rs 50 crore in the plant, which will employ around 400 people once production commences.  

As is known, Kia Motors India is going all out with its India operations. The carmaker has laid down the structural framework for its new manufacturing facility in the Anantapur district of Andhra Pradesh. The plant covers an area of 23 million square feet and is expected to create about 3,000 jobs and produce 300,000 vehicles annually once it is fully operational. Construction of the facility began mid-2017 with an investment of about $1.1 billion (around Rs 7,050 crore)

Link to comment
Share on other sites

సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కియా మోటార్స్‌ ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ప్లాంట్‌ పనులను వివరించి, వీడియో చిత్రాన్ని ప్రదర్శించింది.ఇందులో భాగంగా అనంతపూర్ జిల్లాలో AP స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4000 విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాము అని తెలియచేసారు.

https://pbs.twimg.com/media/DfojPx8VQAUaA2l.jpg

Link to comment
Share on other sites

Super ! - Next year ki complete shape ki vasthundi. This type of employment is missing. IT boom tho inka neglect chesukunnam. (lx: TN - before IT boom)

water is important for KIA and ancillary units. due to location and weather conditions.

save/conserve it - atleast for 2 years - looks like completely depending on govt. for water which is frm Gollapalli.  

Gollapalli reservoir - completely depends on HNSS pumps

greenary is much needed. its may takes several years for self sufficient.

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...