Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply

https://cdn.ncbn.in/ncbn/feed/ncbnBanner1519386707007.jpeg

Kia Motors - Framework Installation Ceremony
 
Framework Installation ceremony of the KIA Motors factory was held in the presence of the Chief Minister Chandrababu Naidu. The plant is KIA's first Indian manufacturing facility, located in Anantapur district of Andhra Pradesh and announced that vehicle production of SP Concept SUV will begin in 2019.
 
Speaking on the occasion, the Chief Minister Nara Chandrababu Naidu said, “Korea’s oldest company had already invested about 12,900 crores in this plant and would soon start its production. Although it aims to produce 3 lakh cars per annum, we are quite sure that the number would soon reach 10 lakh cars per annum. We want this plant to be Kia's biggest production location globally. We hope KIA Motors will act as our Ambassador in the Korean market and will lead to bringing more investments.”
 
The Chief Minister said that Andhra Pradesh will become an auto hub of the country, since the formation of the state, Andhra Pradesh has been able to attract companies like Kia, Hero, Apollo Tyres, Ashok Leyland, and various other companies to the state. We have signed a total of 1956 MoU’s and brought in 13.54 lakh crore investments and once all these projects are completed, they would generate 32 lakh employment. He further added that of the current 1946 projects, 945 are in advance stage and would soon generate 8 lakh employment. He said that Anantapur is the best city in the country to do business as it is connecting three industrial corridors Bangalore to Hyderabad, Vizag to Chennai, Bangalore to Chennai.
 
Han-Woo Park, President & CEO, Kia Motors Corporation, said that the company will bring change and hope to Andhra Pradesh, as well as India. Kia aims to set a new standard of automotive lifestyle experience by offering Indian customers world-class products and service, he added. The company wants to deeply engage with its customers in India and give back to the community whenever possible. Kia has already invested $1.1 billion in its plant in Andhra Pradesh; however, the company has big plans for the future. Kia Motors has big plans for India and the company has already made a significant investment in its plant in the country. He was happy to announce that the construction of the plant is one month ahead of schedule. We are making additional investments and Kia will spend a total of $2 billion in India by 2021. This investment will create more than 10,000 jobs.
 
Kia Motors India will soon start recruiting 3000 employees needed to operate the plant. The company is currently in discussion with the Andhra Pradesh Government to start a joint training programme at the state Government level to develop necessary manufacturing skills among local residents.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
కియా ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం 
atp-brk1a.jpg

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: కియా పరిశ్రమ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, స్థాకులకు మొదటి ప్రాధాన్యతలో ఉద్యోగావకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మండలంలోని ఎర్రమంచి కియా పరిశ్రమ కార్యాలయంలో కియా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ లోపు కియా పరిశ్రమకు గొల్లపల్లి జలాశయం నుంచి నీళ్లు, బొక్సంపల్లి, సుబ్బరాయుడిపల్లి నుంచి విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామన్నారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి కియాలో ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే కియా పరిశ్రమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటున్నారనీ..  ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు  కల్పిస్తామని చెప్పారు. రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌ కోసం టెండర్లు పిలిచామనీ.. మార్చి 13న టెండర్లు తెరచి పనులు వేగంగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. టౌన్‌షిప్‌ అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ జిల్లాలోని తాడిపత్రిలో టౌన్‌షిప్‌ నిర్మిస్తోందనీ.. పరిశీలించి డిజైన్‌ నిర్ణయించాలని కియా ప్రతినిధులకు సూచించారు. కియాలో ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు వస్తే.. నిరుద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దన్నారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలో కియాన్‌ మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ పేరుతో ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్న కంపెనీపై కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌, పోలీసులను ఆదేశించారు. ఆ సంస్థకు అనుమతులు ఇచ్చిన స్థానిక కార్మిక అధికారిని సస్పెండ్‌ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు చŸరవాణిలో ఆదేశించారు. అంతకుముందు ఆయన పెనుకొండ కొండపైకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సమావేశంలో కియా ప్రతినిధులు, ఆర్డీఓ రామమూర్తి, పరిశ్రమలశాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఏసీఐఐసీ డీజడ్‌ఎం శివానందనాయక్‌, తహసీల్దార్‌ హసీనా సుల్తానా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కొనసాగుతున్న ‘కియ’ కమాల్‌
17-03-2018 00:55:02
 
  •  రాష్ట్రానికి రూ.4,790 కోట్ల పెట్టుబడులు
  •  16 అనుబంధ కొరియా సంస్థల సమ్మతి
అమరావతి (ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియా కార్ల కంపెనీ ’కియ’ తన సంస్థ నిర్మాణ పనులను రాష్ట్రంలో శరవేగంగా చేపడుతుండగా, ఆ దేశానికే చెందిన ఆటోమొబైల్‌ రంగ అనుబంధ సంస్థలు, పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ‘కియ’కు అనుబంధంగా పరికరాలను తయారుచేసి, అందించేందుకు 16 తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందుకోసం అనంతపురం జిల్లాలో రూ.4,790 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. దీనివల్ల 6,583 మందికి ఉపాధి లభించనుంది. ఈ విషయాలను రాష్ట్ర పరిశ్రమల శాఖకు దక్షిణ కొరియా సంస్థలు నివేదించాయి. ఈ సంస్థల తయారీ సామర్థ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ సంస్థలు పరిశ్రమల శాఖతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.
Link to comment
Share on other sites

కియ +16
20-03-2018 02:03:03
 
636571081828210631.jpg
  • అనంతలో ఆటోమొబైల్‌ క్లస్టర్‌
  • కియకు తోడుగా మరో 16 సంస్థలు
  • ఎర్రమంచిలో 574, గుడిపల్లిలో 71 ఎకరాలు కేటాయింపు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందాలు
 
 
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఎర్రమంచిలో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ కియ తన కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించిన వెంటనే, ఆ సంస్థకు అనుబంధంగా మరో 16 కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సంస్థలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందాలను చేసుకుంది.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను రెండో ఇల్లుగా మార్చుకోవాలని కొరియన్‌ కంపెనీలను కోరారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్‌ అనుంబంధ సంస్థలుగా ప్రసిద్ధి చెందిన 16 కంపెనీలు రూ. 4790 కోట్ల పెట్టుబడులతో, వెనుకబడ్డ అనంతపురం జిల్లాలోని 6583 మంది యువతకు ఉపాధిని కల్పించేందుకు ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తమ విధానాలు, నిబద్ధత కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.24,600 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అనంతపురం నుంచి నెల్లూరు దాకా, చిత్తూరు మీదుగా ఆటో కారిడార్‌గా తయారవుతుందని అన్నారు.
 
అనంతపురం జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్‌కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గత నెలలో కియ మోటార్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ వ్యవస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంగణలోని పురోగతిని చూశాక చాలా సంతోషంగా ఉందన్నారు. ఆటోమొబైల్‌ అనుబంధ సంస్థలతో కలసి ఏర్పాటు చేస్తేన్న ఈ క్లస్టర్‌ దేశంలోనే అతి పెద్దదిగా చంద్రబాబు అభివర్ణించారు. అనంతపురం జిల్లాకు , తద్వారా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బాటలు వేస్తాయని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కొరియన్‌ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
 
రాష్ట్రంలో ఆటోమొబైల్‌ రంగ అభివృద్ధి వాతావరణం కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. కొరియన్‌ సంస్థల రాకతో ఎంఎ్‌సఎంఈ యూనిట్లు పెరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్‌ విధానాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చామని అన్నారు. అనంతపురం, బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉందనీ, త్వరలోనే ఓర్వకల్లులో ఒక విమానాశ్రయం రానున్నదని సీఎం చెప్పారు. తిరుపతి, పుట్టపర్తిలోనూ విమానాశ్రయాలున్నాయని అన్నారు. కియతో సహా రాష్ట్రంలో దిగ్గజ సంస్థలైన ఇసుజు మోటార్స్‌- అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, అపోలో టైర్స్‌, భారత్‌ ఫోర్జ్‌ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని అన్నారు. సుజుకీ ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియమోటార్స్‌కు రాష్ట్రం లో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావని హామీ ఇచ్చారు.
 
ముందుగానే పరిశ్రమలకు అనువైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతం ఆటోమొబైల్‌ క్లస్టర్‌గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని సీఎం చెప్పారు. ఇటీవల దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగానూ, ఉద్యానవనాలతోనూ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మూడేళ్లలో 3.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఆటోమొబైల్‌ కంపెనీలను తమ రాష్ట్రానికి తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యాపార సానుకూలత ఉందని, ప్రపంచ బ్యాంకు సర్వేలో మొదటి స్థానంలో ఉన్నామని వివరించారు. కొరియాకూ, రాష్ట్రానికి సారూప్యత ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ నెల ముగిసేలోగా తొలి కారును విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
 
ఏపీ ఆదర్శం: అమర్నాథ్‌రెడ్డి
రాష్ట్రంలో ఆటోమొబైల్‌ రంగానికి అనుకూల వాతావరణం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్‌లో దేశానికి ఆదర్శంగా ఉండేలా పారిశ్రమిక రంగం ఏపీ ముందంజలో ఉందన్నారు. ఉపాది పెంచేందుకు కియా అనుబంధ సంస్ధ హ్యూండై మొబిన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆటో మొబైల్‌ అనుబంధ సంస్ధలతో కలిసి ఏర్పాటు చేస్తున్న క్లస్టర్‌ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐగా మంత్రి అభివర్ణించారు.
 
kiy-360.jpg 
Link to comment
Share on other sites

విదేశీ పెట్టుబడులకు చిరునామాగా రాష్ట్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు
   ‘హ్యుండై మొబిస్‌’తో అవగాహన ఒప్పందం
19ap-state1a.jpg
ఈనాడు, అమరావతి: అనంతపురం నుంచి చిత్తూరు మీదుగా నెల్లూరు వరకు ఏర్పాటయ్యే ఆటోకారిడార్‌ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు చిరునామాగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్‌ అనుసంధ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కియా అనుబంధసంస్థలైన ‘హ్యుండై మొబిస్‌’తో ప్రాథమిక అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ఈ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, నిబద్ధతతో ఆటోమొబైల్‌ రంగంలో కొరియా సంస్థలు రూ.24,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ప్రత్యేకించి అనంతపురం-నెల్లూరు మధ్య కారిడార్‌లో  రూ.4,790 కోట్ల పెట్టుబడులు పెట్టి 6,583 మందికి ఉపాధి కల్పించనున్నాయని వివరించారు. అనంతపురం జిల్లా ఎర్రమంచి దగ్గర దక్షిణకొరియా క్లస్టర్‌కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, అమ్మవారిపల్లిలో 131 ఎకరాలు కేటాయించామని వివరించారు. ఆటోమొబైల్‌ రంగంలో రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతోందని, దిగ్గజ సంస్థలైన ఇసుజు మోటార్స్‌ అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్‌, అశోక్‌ లేల్యాండ్‌, అపోలో టైర్స్‌, భారత్‌ ఫోర్ట్‌ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేస్తాయని వివరించారు. నెలాఖరులోగా తొలి కారును విడుదల చేయాలని కియా కంపెనీ నిర్వాహకులకు చంద్రబాబునాయుడు సూచిస్తూ... ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, హ్యుండై మొబిస్‌ మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్న కొరియన్‌ సంస్థల్లో... హ్యుండై డైమోస్‌, హ్యూండై స్టీల్స్‌, హ్యూండై గ్లోవిస్‌, సింగ్‌ వూ, సేహాన్‌, సియోవయాన్‌ ఎవహా, ఎన్‌.వి.హెచ్‌, హ్యూండై మెటీరియల్స్‌, ఫోరేసియా, ఎస్‌ఎల్‌, వూయంగ్‌, హోసీయంగ్‌, ఇంజి, డీఎస్సీ ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో ఆటోమొబైల్‌ రంగ అభివృద్ధికి అనుకూల వాతావరణం ఉందని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథరెడ్డి అన్నారు.

అసెంబ్లీ తర్వాత జిల్లా పర్యటనలు
అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లా పర్యటనలకు వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నీరు-ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, వివిధ రంగాలపై సోమవారం వివిధశాఖల అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ప్రభుత్వమే ఎప్పటికప్పుడు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.. ధర రాలేదని ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు..’ అని ఆయన స్పష్టం చేశారు. కందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్ల వరకు కొంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 600 గ్రామాల్లో పోషకాహారతోటలకు భూములను గుర్తించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అరకొర తోడ్పాటు ఉన్నా మన కాళ్లపై మనం నిలబడే స్థితికి వచ్చామని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. డిసెంబరులో 57శాతం ఉన్న సంతృప్తి స్థాయి ఫిబ్రవరిలో 62శాతానికి పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో రూ.9వేల కోట్లతో ఉపాధిహామీ పనులు చేపట్టేలా సామర్థ్యం పెంచుకోవాలని నిర్దేశించారు. తొలిదశ కింద 20కోట్ల పనిదినాలకు రూ.7,260కోట్ల పనులకు ఆమోదం లభించినట్లు తెలిపారు. జలసంరక్షణ కింద చెరువులను పటిష్టం చేసే చర్యలు చేపట్టాలన్నారు. రైతుబజార్ల సంతల్లో షెడ్లు నిర్మించి నీడలో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా చూడాలన్నారు. పశుగ్రాసం కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

 

రాష్ట్ర వార్తలు

Link to comment
Share on other sites

4 years taruvaatha temporary high court deniki? why hurry? Can't they go ahead with permanent high court even if takes more than 1 year.

Raj bhavan, high court ilaantivi late ayina what will be issue.

 

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

4 years taruvaatha temporary high court deniki? why hurry? Can't they go ahead with permanent high court even if takes more than 1 year.

Raj bhavan, high court ilaantivi late ayina what will be issue.

 

temporary high court  kadu adi Amaravati city civil court, dani lo high court pedtaru  high court iconic building kadha, time padthudi dani works nadusthute untayi

Link to comment
Share on other sites

8 minutes ago, RKumar said:

4 years taruvaatha temporary high court deniki? why hurry? Can't they go ahead with permanent high court even if takes more than 1 year.

Raj bhavan, high court ilaantivi late ayina what will be issue.

 

Temporary high court kadu,city civil court Amaravathi lo permanent ga kadutunnaru,konni days permanent high court katte varuku idi use chesukuntaru

Link to comment
Share on other sites

5 minutes ago, Saichandra said:

Temporary high court kadu,city civil court Amaravathi lo permanent ga kadutunnaru,konni days permanent high court katte varuku idi use chesukuntaru

Ok then no issues. Aa temporary peru vaadakunda vunte better.

Link to comment
Share on other sites

6 minutes ago, Saichandra said:

Temporary high court kadu,city civil court Amaravathi lo permanent ga kadutunnaru,konni days permanent high court katte varuku idi use chesukuntaru

By the way before elections Secretariat, Assembly laanti building emanna complete avuthaaya? 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

https://www.just-auto.com/analysis/analysis-kia-future-models-part-2_id181766.aspx

 

Project SP, a small SUV, should be the second model for Kia's forthcoming Indian plant. This is being erected in Anantapur District in the state of Andhra Pradesh at a cost equivalent to US$1.1bn. Construction commenced in the final quarter of 2017.

The manufacturing facility is expected to begin production in the second half of 2019 and produce up to approximately 300,000 units each year. As well as the SUV, the Penukonda plant in Anantapur District will also make a small sedan.

Link to comment
Share on other sites

2019లో మార్కెట్లోకి కియా మోటార్స్ కారు
మండలిలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వెల్లడి

01353002BRK91A.JPG

అమరావతి: అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా మోటార్స్ నుంచి 2019 సెప్టెంబర్లో తొలి వాణిజ్య ఉత్పత్తి మార్కెట్లోకి రానుందని  పరిశ్రమల మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు. కియా ఏర్పాటు ద్వారా వెనుకబడిన రాయలసీమకు ఆర్ధికంగా తోడ్పాటు లభిస్తోందన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి దీనిపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం సహాయం చేసిందో చెప్పాలన్నారు. భాజపా సభ్యుడు మాధవ్ జోక్యం చేసుకొని మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగానే కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పారు. మంత్రి సమాధానం ఇస్తూ కేంద్ర సాయం చేస్తే సంతోషిస్తామని.. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని గుజరాత్‌కు తరలించాలని ప్రయత్నం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడబోగా తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ మరో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. అనంతపురంలో ఏర్పాటవుతున్న పరిశ్రమ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆటో మొబైల్ పరిశ్రమ అని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 వేల మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి చెప్పారు.

 

Link to comment
Share on other sites

‘కియ’.. సూపర్‌ ఫాస్ట్‌
08-04-2018 01:43:49
 
636587486305972820.jpg
  • 2 నెలల్లోనే 30% పనులు పూర్తి
  • బాడీ బిల్డ్‌, ప్రెస్‌, పెయింటింగ్‌
  • అసెంబ్లింగ్‌ పనులు వేగవంతం
  • 2019 మార్చికి పరిశ్రమ నిర్మాణం
  • నవంబరు నాటికి మార్కెట్లోకి కార్లు
  • నిర్మాణ పనుల్లో ఊపును పెంచిన
  • ‘కియ’, ఏపీ సర్కారు సమన్వయం
  • పైపులైన్ల పనులు 70% పూర్తి
  • ఉద్యోగుల టౌన్‌షిప్‌ 30% సిద్ధం
 
అనంతపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. ఆ ఏడాది నవంబరు నాటికి తమ కార్లను ‘కియ’ మార్కెట్‌లోకి తీసుకురాగలుగుతుంది.
 
ఈ పరిశ్రమ ఫ్రేమ్‌వర్క్‌కు గత ఫిబ్రవరిలో ఆ కంపెనీ ఎండీ పార్కర్‌ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాతనుంచీ పనులు వేగం పుంజుకున్నాయి. వెనుకబడిన అనంతకు పారిశ్రామిక కళను తీసుకొస్తూ..దక్షిణ కొరియ కార్ల దిగ్గజం ‘కియ’ కు పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద ప్రభుత్వం భూములను, మౌలిక సదుపాయాలను కల్పించిన విషయం తెలిసిందే. పెనుకొండ మండలంలో అమ్మవారిపల్లి, ఎర్రమంచి వద్ద 597 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
 
రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్‌షాపు యూనిట్‌, ప్రెస్‌ యూనిట్‌, అసెంబ్లింగ్‌ యూనిట్‌, పెయింటింగ్‌ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మోడల్‌ షాపు, పవర్‌ట్రైన్‌ షాపు, సీట్‌ షాపు నిర్మాణ క్రమం ముమ్మరమయింది. కాగా, కియకు అనుబంధంగా 16 సంస్థలు అనంతపురం జిల్లాకు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు మొదలు పెట్టగా మరికొన్ని సిద్ధం అవుతున్నాయి.
 
 
ఏ పని.. ఎంతవరకు...
ఉద్యోగుల కోసం దుద్దేబండ క్రాస్‌ వద్ద చేపట్టిన టౌన్‌షిప్ నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయి. 12.6 ఎకరాల్లో 16 భవనాల్లో 82 గదుల నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు నాటికి ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పరిశ్రమకు నీటిని అందించడానికి చేపట్టిన రూ.22 కోట్ల విలువైన పైప్‌లైన్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.3.5 కోట్లతో ఇంటెక్‌వెల్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఉద్యోగ నియామకాల అనంతరం శిక్షణ ఇవ్వడానికి దుద్దేబండ క్రాస్‌లో 11 ఎకరాల్లో నిర్మిస్తున్న శిక్షణ కేంద్రం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
 
ఈ కేంద్రంలో ఒకేసారి వంద మందికి శిక్షణ ఇచ్చే వీలుంది. ఈ పరిశ్రమకు అవసరమయ్యే 70 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్‌సరఫరా చేయడానికి రూ.60 కోట్ల ఖర్చుతో పనులు సాగుతున్నాయి. రొద్దం మండలం బొక్సంపల్లి ఫీడర్‌ కనగానిపల్లి, సుబ్బరాయనపల్లి ఫీడర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేయడానికి పనులు వేగవంతమయ్యాయి. బొక్సంపల్లిలో 18 కిలోమీటర్ల మేర, సుబ్బరాయనపల్లిలో 13 కిలోమీటర్ల మేర విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ 2019 మార్చినాటికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ఈ పనులను కలెక్టర్‌ వీరపాండ్యన్‌, పరిశ్రమశాఖ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు సీఎకి నివేదిస్తున్నారు.
 
 
ఎస్కేయూలో కొరియా శిక్షణ
కొరియా భాష నేర్పేందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా అవసరాల రీత్యా ఎస్కేయూ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకొంది. ఎస్కేయూ స్కిల్‌ డెవలప్ మెంట్‌ ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఈ భాషా శిక్షణ సాగనుంది. ‘కియ’ వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే కొరియా భాష వచ్చి ఉంటే మంచిదనే అభిప్రాయంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టు మండలి తెలిపింది. ఆసక్తి కలిగిన వారు www.skuniversity.ac.in, www.skillsku.com నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈనెల 12 లోగా పూర్తిచేసి సమర్పించాలని కోరింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
శరవేగం.. ప్రగతి రాగం!
రెండు నెలల్లోనే మారిన రూపురేఖలు
ముమ్మురంగా కియా పరిశ్రమ నిర్మాణం
atp-sty3a.jpg

రంగుల లోకం
ఇది కియా పరిశ్రమలో పెయింట్‌ దుకాణం కోసం నిర్మిస్తున్నారు. రెండు నెలల క్రితం 30 శాతం పనులే పూర్తి కాగా.. తాజాగా 60 శాతం పూర్తయ్యాయి.

అచ్చులు అద్దేలా..
ఈ కేంద్రంలో కార్ల ఉత్పత్తికి అనుగుణంగా స్టీలును తయారు చేస్తారు. ఇనుప అచ్చులు ఇక్కడే తయారవుతాయి. కేంద్రం పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి.

రైట్‌.. రైట్‌!
కార్ల తయారీ తర్వాత వాటి పనితీరును పరిశీలించడానికి అవసరమైన ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ఈ పనులు 20 శాతం పూర్తి చేశారు.

రూపకర్తలు
ఇక్కడ కార్ల పైభాగం, కింది భాగాలను ప్రెస్సింగ్‌ చేసే పనులు జరుగుతాయి. ప్రస్తుతం 40శాతం పనులు పూర్తయ్యాయి.

ముంపు తప్పించేందుకు..
కియా కార్ల పరిశ్రమలో వృథా నీరు, వర్షపు నీరు వెలుపలకు పంపడానికి భూగర్భ పైపులైన్‌ పనులు చేపట్టారు. 50 శాతం పూర్తి చేశారు.

అభిరుచికి తగ్గట్టు
ఇది వినియోగదారుల సేవా కేంద్రం. వారి అభిరుచికి తగ్గట్టుగా కార్ల తయారీ జరుగుతుంది. వినియోగదారుల నుంచి అవసరమైన వివరాలను సేకరిస్తారు. రెండు నెలల నుంచి పనులు శరవేగంగా చేపట్టి.. 90 శాతం పనులు పూర్తి చేశారు.

బహుళ ప్రయోజనం
కార్ల పరిశ్రమలో పనిచేసే కొరియన్‌ ప్రతినిధుల కోసం 36 ఎకరాల్లో నిర్మిస్తున్న టౌన్‌షిప్‌ ఇది. బహుళ అంతస్తుల భవనాలు 15 వరకు నిర్మిస్తున్నారు. 60 శాతం పనులు పూర్తి చేశారు.

అనుబంధమస్తు..!
కియా కార్ల పరిశ్రమకు అనుబంధంగా పలు పరిశ్రమలు రానున్నాయి. ఆరు అనుబంధ పరిశ్రమలకు భూమి చదును పనులు జరుగుతున్నాయి. త్వరలో నిర్మాణ పనులు కొనసాగనున్నాయి.

జల ధార!
కియా పరిశ్రమకు రోజుకు 3 మిలియన్‌ లీటర్ల తాగునీరు రిజర్వాయర్‌ నుంచి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పరిశ్రమకు, తాగునీటికి దాదాపు 15 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమని కొరియన్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. అందులో భాగంగా పైపులైన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయి.

అమరిక.. సాగునిక
కార్ల విడిభాగాలను ఒకచోటుకు చేర్చి అమర్చే ప్రధాన కేంద్రం ఇది. రెండు నెలల క్రితం 25 శాతం పనులు పూర్తికాగా, ప్రస్తుతం 65 శాతం పూర్తి చేశారు. దీన్నిబట్టి ఎంత వేగంగా నిర్మాణాలు చేపడుతున్నారో అర్థమవుతోంది.

నిల్వ చేద్దాం
ఇక్కడ హ్యూందాయ్‌ స్టీల్‌ను నిల్వ చేస్తారు. అవసరమైన మేరకు స్టీల్‌ను కత్తిరించి ఆయా కేంద్రాలకు తరలిస్తారు. ఈ కేంద్రం నిర్మాణం 30 శాతం జరిగింది.

చకచకా అడుగులు
ఇది కాయిల్‌ సెంటర్‌. ఇక్కడ కార్ల విడిభాగాలను అమర్చుతారు. పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికి 20 శాతం పూర్తయ్యాయి.

తుది రూపు ఇచ్చేస్తాం
కార్ల ఉత్పత్తి అనంతరం ఈ కేంద్రంలో సీటు కవర్లు, అద్దాలు వంటి తుదిమెరుగులు దిద్దుతారు. భవన నిర్మాణం 30 శాతం పూర్తి చేశారు.

ఇంజిన్‌ బిగిస్తాం..
కియా కార్లకు సంబంధించి ఇంజిన్లను అమర్చడానికి ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం పనులు పూర్తయ్యాయి.

నైపుణ్యాభివృద్ధి
దీన్ని కియా కార్ల పరిశ్రమలో పనిచేసే యువతీ, యువకులకు శిక్షణ ఇవ్వడానికి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 60 శాతం వరకు పనులు చేపట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...