Jump to content

Kia in Anantapur !


Recommended Posts

కేంద్రం ప్రారంభం 
హాజరవుతున్న కియా అధ్యక్షుడు పార్క్‌, చంద్రబాబు 

ఈనాడు, అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అనంతపురం జిల్లా పెనుకొండ పరిధిలో ఎర్రమంచి వద్ద కియా పరిశ్రమలో కార్ల తయారీ కేంద్రం ప్రారంభం కానుంది. దీనిని సాంకేతికంగా ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమంగా పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా అధ్యక్షుడు పార్క్‌ చేతుల మీదుగా ఈ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది వీఐపీలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతోపాటు, భూములు ఇచ్చిన 300 మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. తర్వాత కియాకు ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. 2017 నవంబరులో ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి.

Link to comment
Share on other sites

  • Replies 900
  • Created
  • Last Reply

కియ.. కమాల్‌
22-02-2018 04:00:03

ఉత్తమ డిజైన్‌, సాంకేతిక నైపుణ్యం
జనవరి నాటికే ‘అనంత’లో కార్లు సిద్ధం
 వచ్చే దీపావళికి మార్కెట్‌లోకి విడుదల
ఆలస్యంగా వచ్చినా... ఆధిపత్యం సాధిస్తాం
కియ ప్రతినిధుల ప్రకటన
 నేడు అనంత ప్లాంటులో ‘ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌’
పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
(బెంగళూరు నుంచి ఆంధ్రజోతి ప్రతినిధి): భారతీయులను ఆకట్టుకునే డిజైన్‌, అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ నైపుణ్యం... వీటన్నింటి సమాహారంగా ‘కియ’ కార్లు తయారవుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ‘కియ’ ప్లాంటులో వచ్చే ఏడాది జనవరి నాటికే కార్లు సిద్ధమవుతాయన్నారు. వీటిని అన్ని రకాలుగా పరీక్షించి... వచ్చే ఏడాది దీపావళి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతలో కియ ప్లాంటులో ‘ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌’ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ కార్ల ప్రత్యేకతలు, అనంతపురం ప్లాంటు విశేషాలను బెంగళూరులో మీడియాకు వివరించారు.
 
కార్ల డిజైన్‌ విషయంలో భారతీయ యువతను దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. ‘‘సెడాన్‌, ఎస్‌యూవీ, కాంపాక్ట్‌ మోడళ్లను అనంత ప్లాంటులో తయారు చేస్తాం. ఇంజన్‌ నుంచి పెయింటింగ్‌ దాకా మొత్తం పనులు అక్కడే జరుగుతాయి. మూడేళ్లలో ఎలక్ట్రిక్‌ కారును కూడా తయారు చేస్తాం’’ అని ప్రకటించారు. అనంత ప్లాంటులో 110 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని... ఏటా 3 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యం ఉంటుందని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కియ కార్లకు డిమాండ్‌ ఉన్నా.. భారత్‌ మార్కెట్లోకి ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. మారుతీ, హ్యుండయ్‌తోపాటు జపాన్‌ కార్ల కంపెనీలు ఇండియన్‌ మార్కెట్లో పాతుకు పోయాయి. మేం ఆలస్యంగా వస్తున్నప్పటికీ... ఆధిపత్యం సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.
 
బాబు భేష్‌
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కియ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఆయన దిట్టగా అభివర్ణించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే... చకచకా అన్ని రకాల అనుమతులు, భూకూటాయింపులు జరిపారని చెప్పారు. ఆ వెంటనే త్వరితగతిన కార్ల ఉత్పత్తిని చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచిందన్నారు. అందువల్ల భూమి పూజను అట్టహాసంగా చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఫ్రేమ్‌ల బిగింపును మాత్రం కాస్త ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రస్తుతం హ్యుండయ్‌ (కియ అనుబంధ సంస్థ) డీలర్లతో సహా.. కొత్తగా డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కియ స్పష్టం చేశారు.
 
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వస్తు సేవా పన్నుపై కియ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా 10 శాతం మాత్రమే పన్ను ఉంటుందని... భారత్‌లో ఏకంగా 33శాతం దాకా ఉంటోందని వాపోయారు. దీనివల్ల భారతీయ మారర్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురంలో తయారు చేసిన కార్లను ఇండియా మార్కెట్‌కే పరిమితం చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

46 minutes ago, baabuu said:

Bengaluru ni vaadaam modalettesaadu

near Bengaluru  is going to major auto hub ani start chesadu...
 

hope AP will aslo get Hosuru type city near bengaluru

Bangalore degera, chennai degera ani kadu adu start chesindi.. Ap Govt teesukuna initiatives, quick support regarding permission, land, water &  making govt officials available at company site 24/7 & cm monitoring it  directly made it happend

Link to comment
Share on other sites

Just now, baabuu said:

*vadatam 
we are near to Bang Intl airport, my intention is, he is using Bang lo for selling the state (selling ante ammatam kaadu baabu, promote)

Selling ante ammatam ani nenu ekkada chepanu.. 

Link to comment
Share on other sites

ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీ
కియా కార్ల పరిశ్రమ ఇన్‌స్టలేషన్‌ను ప్రారంభించిన చంద్రబాబు

అనంతపురం :  ఆంధ్రప్రదేశ్‌కే తనమానికమైన కియా కార్ల తయారీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో కొలువుదీరింది. పెనుకొండలో కియా కార్ల పరిశ్రమ ఇన్‌స్టలేషన్‌ విభాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కియా కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పనులు శరవేగంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు. కియా మోటార్స్‌ కోసం త్వరితగతిన హంద్రీనీవా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే వాహన తయారీ రంగంలో కొరియా రెండో అతిపెద్ద దేశమని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్లాంట్ల కంటే అనంతపురం ప్లాంటే అధికంగా ఉత్పత్తులు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం కియా ప్లాంట్‌కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. చెన్నై-కృష్ణపట్నం కారిడార్‌ అందుబాటులో ఉందని వివరించారు. ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కియా మోటార్స్‌ రాకతో అనంతపురం రూపురేఖలు మారిపోనున్నాయన్నారు.

Link to comment
Share on other sites

రూ.200 కోట్లతో విజయవాడలో  ట్రాఫిక్‌ వ్యవస్థ 
డీపీఆర్‌ రూపకల్పన జరుగుతోంది 
ఆధునిక వ్యవస్థలకు కేంద్రం టోక్యో 
‘ఈనాడు’తో నగరపాలక సంస్థ  కమిషనర్‌ నివాస్‌ 
ఈనాడు డిజిటల్‌, విజయవాడ 

అధునాతన రవాణా వ్యవస్థ.. అద్భుతమైన పౌరస్పృహ.. సాంకేతికత మిళితమైన నగర నిర్మాణం.. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు.. ఇవన్నీ కలగలిపిన నగరం జపాన్‌ రాజధాని టోక్యో. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మౌలికవసతులు కల్పన జరగాల్సిన సమయమిది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రజలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోక్యోలోని ఆధునిక వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు ఇక్కడి నుంచి తరలివెళ్లిన అధికారుల బృందం నాలుగు రోజుల పర్యటన అనంతరం విజయవాడకు తిరిగి వచ్చింది. ఈ బృందంలో ఒకరైన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌.. అక్కడి విశేషాలను ‘ఈనాడు’కు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
అన్నీ ప్రత్యేకమే..: ఎక్కువ జనాభా ఉన్న నగరం జపాన్‌ రాజధాని టోక్యో. 2,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.3 కోట్ల జనాభా కలిగిన ఈ నగరంలో రహదారులు, నడకదారులు, అత్యాధునిక ట్రాఫిక్‌ వ్యవస్థ, సెన్సార్ల వాడకం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, అంతర్గత జల సొరంగం మార్గం, హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థ, పారిశుద్ధ్యం అన్నింటినీ మనం చూసి నేర్చుకోవాల్సినవే.

ట్రాఫిక్‌ వ్యవస్థ అద్భుతం..: యూవీ, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లు, వాహనాలను కనుగొనే లూప్స్‌, ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సమాచారం తెలిపే బోర్డులు, ఎటువైపు వెళ్లాలో చూపించే సూచికలు ఉన్నాయి. ఆ సెన్సార్లతో వాహన వేగాన్ని గమనించి ఎక్కడ వాహన రద్దీ ఉందో తెలుసుకుంటారు. వీటితో పాటు అక్కడే ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా రద్దీ పెరగడానికి కారణాలు, ప్రమాదం ఏమైన జరిగిందా.. జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. దీనికి సంబంధించి మెట్రోపాలిటన్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే ఆదేశాలు అందుతాయి. వీటిని విజయవాడ నగరంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీనికి రూ.200 కోట్లు ప్రాథమిక అంచనాగా డీపీఆర్‌ తయారు చేస్తున్నాం.

తక్కువ ప్రదేశంలో నిర్మాణాలు.. 
భవన నిర్మాణ వ్యవస్థ చాలా బాగుంది. తక్కువ ప్రదేశాన్ని ఉపయోగించి నిర్మాణాలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. స్కై ట్రీ పేరుతో 634 మీటర్ల పొడవైన నిర్మాణాలు అబ్బురపరిచాయి. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం అయినప్పటికీ అంత ఎత్తైన భవనాలు వారి పూర్వీకులు అమలు చేసే పద్ధతులను ఉపయోగించి నిర్మించారు. ముందుగా భూమిలోకి పిల్లర్‌ వేసి దానికి చుట్టుపక్కల భవనాలు నిర్మాణం చేస్తారు. దీంతో భూకంప తీవ్రత మొత్తం ఆ పిల్లర్‌పైనే పడుతోంది. భవనాలలో పైకి వెళ్లేందుకు హైస్పీడ్‌ లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. మేము 330 మీటర్ల ఎత్తుకు పోవడానికి కేవలం 30 సెకన్లు మాత్రమే పట్టింది. అలాగే దుకాణ సముదాయాలను కలుపుతూ ఉండేలా బస్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేశారు. సముద్ర మార్గం ద్వారా ఏర్పాటు చేసిన సొరంగం మధ్యలో మాల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని విజయవాడలో తూర్పు, పశ్చిమ భాగాలను కలిపేలా సొరంగం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

Link to comment
Share on other sites

యోత్సాహం! 
సీఎం పట్టుదల, అధికారుల కృషి ఫలం 
అనంతకు తీసుకురావడంలో సఫలం 
యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు 
నేడు ఇన్‌స్టలేషన్‌ వేడుకకు సన్నద్ధం 
ఈనాడు - అనంతపురం 
atp-top1a.jpg

అనంత రూపురేఖలను మార్చేలా.. పుష్కల ఉపాధిని దరి చేర్చేలా.. సీమలోనే అతి పెద్ద పరిశ్రమగా భావిస్తున్న కియా కార్ల తయారీ పరిశ్రమ కొలువుదీరనుంది. కియాను జిల్లాకు తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా అధికారుల కృషి ఎనలేనిది. కియా భారత్‌ వైపు చూస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. అయినా ముఖ్యమంత్రి తనదైన శైలిలో అన్ని వసతుల కల్పనకు అభయం ఇవ్వడంతో కల సాకారమైంది. ఎలాగైనా కియా అనంతకే రావాలని అధికారులు కూడా శ్రమించారు. కియా యాజమాన్యం తమకు ఫలానా వసతులు కావాలని అడగడమే తరువాయి.. చక్కటి ప్రణాళికతో వీరు పరుగులు పెట్టారు. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడి.. గురువారం ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ వేడుకకు సిద్ధమైంది. ఈ క్రతువులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా అధ్యక్షుడు పార్క్‌ పాల్గొనున్నారు. ఈ శుభ తరుణంలో.. కరవు ప్రాంతం, తాగునీటికే కటకటలాడే జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో కియా పరిశ్రమ ఏర్పాటు కానుండటం, వేల మందికి ఉపాధి దక్కనుండటం, అనుబంధ పరిశ్రమలు బారులు తీరనున్న నేపథ్యంలో.. దీని వెనుక జరిగిన కృషిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

నాలుగు రాష్ట్రాల పోటాపోటీ... 
తొలుత కియా యాజమాన్యం ఏదైనా దేశంలో ఐదో కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుచేయాలనుకుంది. ఇందుకు గతంలో దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంతి చంద్రబాబు ఓసారి తమ వద్ద భూములు పరిశీలించాలనీ.. అవసరమైన వసతులు కల్పిస్తామని వారికి చెప్పారు. దీంతో భారత్‌ వైపు కియా మొగ్గు చూపింది. అయితే కియా మన దేశానికి వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ మధ్య పోటీ మొదలైంది. పారిశ్రామికంగా గుజరాత్‌ అభివృద్ధి చెందటం, ఎక్కువగా ఆటోమొబైల్‌ పరిశ్రమలు మహారాష్ట్రలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు గట్టిగా ప్రయత్నాలు చేశాయి. ఇదే సమయంలో ఏపీకి వస్తే శరవేగంగా అన్ని అనుమతులు, మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు అభయం ఇచ్చారు. అలాగే సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోక్యరాజ్‌, ఏపీఐఐసీ ఎండీ జె.నివాస్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కార్తికేయ మిశ్రా, అప్పటి అనంతపుం కలెక్టర్‌ కోన శశిధర్‌తో కూడిన బృందం దక్షిణ కొరియాకు వెళ్లి.. కియా యాజమాన్యాన్ని కలిసి కీలక ప్రజంటేషన్‌ ఇచ్చింది. దీంతో వారు మన రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపారు.

ఏపీలో అనువైనదెక్కడ?... 
ఇక మన రాష్ట్రంవైపు కియా దృష్టి సారించినప్పుడు మూడు జిల్లాల మధ్య పోటీ ఏర్పడింది. తయారైన కార్లను దేశం మొత్తంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన నేపథ్యంలో.. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, నెల్లూరు, చిత్తూరు సరిహద్దులో ఉన్న శ్రీసిటీ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో అనంతలో కావాల్సినంత భూములు ఇస్తామని కూడా చెప్పారు. చివరకు అనంత వైపు కియా మొగ్గుచూపింది. జాతీయ రహదారికి ఆనుకొని, రహదారి వెంట కనీసం కిలోమీటరున్నర, వెనుకకు కి.మీ. వరకు ఉండేలా భూమి కావాలని కోరారు. పెనుకొండలోని ఎర్రమంచి వద్ద, సోమందేపల్లి, పుట్టపర్తి, కూడేరు మండలాల్లోని భూములను అధికారులు చూపించారు. వీటన్నింటిలో కియా ప్రతినిధులు మట్టి నమూనాలు తీయించి, పరీక్షలు చేయించారు. చివరకు పెనుకొండ మండలంలోని ఎర్రమంచి భూములపై మొగ్గు చూపారు.

కృష్ణమ్మ వస్తుందా?... 
పెనుకొండ సమీపంలో ఏర్పాటుకు ఆసక్తి ఉన్నా.. గొల్లపల్లి జలాశయంలో చుక్కనీరు లేకపోవడం, అసలు జలాశయమే పూర్తవుతుందా అని కియా ప్రతినిధులు సందేహంతో ఉండేవారు. వారు 2016 ఆగస్టులో తొలుత ఈ జలాశయాన్ని చూసి నీరు వస్తుందా? అని అడిగారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై గొల్లపల్లి పనులు పూర్తిచేయించి, 2016 డిసెంబరుకే నీటిని తీసుకొచ్చారు. ఆ తర్వాత కియా ప్రతినిధులు ఈ నీటి నమూనాలు కూడా తీసుకొని హైదరాబాద్‌, మరికొన్ని చోట్ల పరీక్షలు చేయించారు. తమ పరిశ్రమకు ఈ నీరు ఉపయోగపడుతుందని తేలడంతో ఇక పూర్తిగా పెనుకొండకే ఓటేశారు.

అసౌకర్యమనే ఊసేలేకుండా.. 
కియా ప్రతినిధులు తొలుత జిల్లాలో భూములు చూసేందుకు వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం పరిశ్రమ పనులు చేస్తున్నప్పుడు కూడా వారికి ఎక్కడా అసౌకర్యమనే మాట రానివ్వకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కియా ప్రతినిధులు జిల్లాకు బెంగళూరుకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి జిల్లాకు వచ్చేవారు. వారు విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత సరిగ్గా 60-70 నిమిషాల్లో ఎర్రమంచి భూముల వద్దకు చేరుకునేలా పక్కా ఏర్పాట్లు చేసేవారు. దీంతో ఈ ప్రాంతం బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరే అనే భావన వారిలో వచ్చింది. అలాగే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని చెబితే.. దుద్దేబండ క్రాస్‌లో దాదాపు సిద్ధంగా ఉన్న పర్యాటక శాఖ హోటల్‌ను కియాకు అప్పగించారు.

ఇటు చెక్కు.. అటు రిజిస్ట్రేషన్‌.. 
కియా పరిశ్రమకు భూములు తీసుకున్నపుడు అక్కడ పట్టా, డీకేటీలు ఉన్న 475 మందికి పరిహారం చెల్లించారు. తొలుత వారంతా తక్కువ పరిహారం వస్తుందనే భావనతో ఉండేవారు. దీంతో అధికారులు చర్చలు జరిపి ఎకరాకు రూ.10.5 లక్షలు ఖరారు చేశారు. ఆ తర్వాత ఆయా భూముల యజమానులతో దాదాపుగా ఒకే రోజు రిజిస్ట్రేషన్‌ జరిపించారు. పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఒక్కో భూ యజమానికి చెక్కు ఇవ్వగానే.. అక్కడి నుంచి పెనుకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు రోజు కేటాయించి కియా భూముల రిజిస్ట్రేషన్‌ మినహా ఇతర రిజిస్ట్రేషన్లు నిలిపేశారు.

అధికారుల విశేష కృషి.. 
కియా కోసం మన రాష్ట్రంలో ఆయా జిల్లాల మధ్య పోటీ ఉన్నప్పుడు.. అనంతపురం జిల్లా అధికారులు ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశారు. అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ నేతృత్వంలో భూసేకరణ మొదలుకొని అనేక అవరోధాలు అధిగమించారు. ఒప్పందం చేసుకున్న మూడు నెలల్లో భూసేకరణ జరిపి, తమకు అప్పగించాలని కియా యాజమాన్యం కోరింది. దీంతో అధికారులు భూసేకరణపై దృష్టిపెట్టారు. పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి చుట్టుపక్కల ఎక్కువగా ప్రభుత్వ, డీకేటీ భూములు ఉండటంతో వీటిపై దృష్టిపెట్టారు. గత ఏడాది ఏప్రిల్‌లో కియా ఉపాధ్యక్షుడు, అమరావతిలో సీఎంను కలిసే నాటికి.. కియా పరిశ్రమతోపాటు, అనుబంధ పరిశ్రమలు, టెస్ట్‌ ట్రాక్‌, రైల్వేసైడింగ్‌, టౌన్‌షిప్‌కు అవసరమైన 1,500 ఎకరాలు సిద్ధంగా ఉంచామని కలెక్టర్‌ శశిధర్‌ తెలిపారు. ఈచొరవను సీఎంతోపాటు, కియా ఉపాధ్యక్షుడు కూడా అభినందించారు. 
కియా ఖరారైన తర్వాత.. ప్లాంట్‌కు అవసరమైన 600 ఎకరాల సేకరణలో జాగ్రత్తగా వ్యవహరించారు. ఎక్కువగా డీకేటీ ఉండటంతో, తమకు మొక్కుబడిగా పరిహారం ఇస్తారని రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని పార్టీల నాయకులు ఆయా రైతులను కలిసి, మీ వెంట మేమున్నామని చెబుతూ వచ్చారు. దీంతో భూసేకరణలో ఇబ్బందులు వస్తాయేమో అనుకున్నారు. కానీ కలెక్టర్‌ శశిధర్‌, అప్పటి సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీకాంతం, పెనుకొండ ఆర్డీవో రామమూర్తి రైతులతో జాగ్రత్తగా మాట్లాడి.. పట్టా, డీకేటీలకు సైతం ఎకరాకు రూ.10.5 లక్షలు ధర ఖరారు చేశారు. వాస్తవానికి అప్పటికి అక్కడ ఉన్న భూముల ధరలతో పోలిస్తే, అది ఎంతో అధికం. దీంతో రైతులెవరూ దాదాపు అభ్యంతరం చేయకుండా, భూములిచ్చారు. 
ఇక కియాకు భూములు ఇచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం శరవేగంగా చదును చేసి అప్పగించింది. ఆ భూముల్లో ఉన్న మూడు వాగులు మళ్లించి, విద్యుత్తు లైన్లు తప్పించి, కొండలు, గుట్టలు తొలిచి, లోతైన ప్రాంతాన్ని పూడ్చి సరిగ్గా ఆరు నెలల్లో భూమిని చదును చేసింది. ఈ పనులను ప్రస్తుత కలెక్టర్‌ వీరపాండియన్‌ తరచూ పర్యవేక్షిస్తూ, ప్రతి వారం పనుల పురోగతిని డ్రోన్‌ ద్వారా చిత్రీకరించి సీఎంకు నివేదించేవారు. పలుమార్లు కియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి ఏఏ వసతులు అవసరమో తెలుసుకొని వాటిని సమకూరేలా చూశారు. అలాగే గత ఏపీఐఐసీ జిల్లా జోనల్‌ మేనేజర్‌ రఘునాథ్‌, ప్రస్తుత పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ సుదర్శన్‌బాబు తదితరులు బాగా కష్టపడ్డారు.

నేటి సీఎం పర్యటన ఇలా.. 
కియా పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు గురువారం సీఎం చంద్రబాబు చేరుకొని వివిధ విభాగాల పనులను చూస్తారు. తర్వాత కియా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబు, కియా అధ్యక్షుడు పార్క్‌ కియా పరిశ్రమ పైనుంచి కనిపించే చిత్రాలు (బర్డ్స్‌ ఐ వ్యూ) ప్రారంభిస్తారు. ఆపై ఇద్దరూ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఓ ఫ్రేమ్‌పై వారిద్దరూ సంతకాలు చేస్తారు. వెంటనే ఆ ఫ్రేమ్‌ క్రేన్‌ సాయంతో పైకిలేపి, ఇన్‌స్టలేషన్‌ చేస్తారు. అటుపై కియా ప్రతినిధులు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో ఫొటోలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సీఎం, కియా అధ్యక్షుడు కొంతసేపు మీడియాతో మాట్లాడతారు. ఈ వేడుకకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. వీవీఐపీలు, కొందరు మీడియా ప్రతినిధులతోపాటు, కియాకు భూములిచ్చిన రైతుల్లో 300 మందిని ఆహ్వానించారు. వీరిని ఆరు బస్సుల్లో ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుంచి కియా ఎదురుగా జరిగే బహిరంగ సభలో సీఎం, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొంటారు.

Link to comment
Share on other sites

23 minutes ago, sonykongara said:

Darunam ga rents penchadu anta akkada

this phenomena occurs every where. in bangalore/hyderabad/chennai rents increased due to software employees salaries.

in villages surrounding krishnapatnam port also rents increased due to industries

providing housing at reasonable rent helps employees a lot .

if you see any central government project like rinl/sail/ntpc/power grid/ iit/nit/iim they build colonies for workers to reduce rental burden

as ap don't have sufficient funds , it can acquire land for houses along with industry and can build house under ppp by guarantee rents to developer. or it can allocate land to industry and ask them build houses/dormitaries for workers.

if any TDP IT WING person read this suggestion please inform it to tdp high command.

Link to comment
Share on other sites

49 minutes ago, sonykongara said:

Darunam ga rents penchadu anta akkada

Darunam ga emi penchaledu...people are just  making some money, as demand is high. This happens anywhere.

I was there and one guy was saying they use to get 300  rent for a house in the village(Ammavaripalli) ..now he is getting 10000 rs. The construction companies has to accomodate their workers and they are ready to pay.

 

Link to comment
Share on other sites

చంద్రబాబు పాలన అద్భుతం
23-02-2018 03:30:42

ఆయన చొరవతోనే దేశంలోకి..
రోల్‌ మోడల్‌లా మా భాగస్వామ్యం
సీఎంపై ‘కియ’ చైర్మన్‌ పార్క్‌ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని కియ మోటార్స్‌ చైర్మన్‌ పార్క్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. దూరదృష్టితో పాలనను అందిస్తున్నారని కొనియాడారు. ‘‘ఆసియాలోనే మాది అతి పెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ. 180 దేశాల్లో మా కంపెనీ కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కిందట సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాక .. అనంతపురంలో కియ కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆయన చొరవ కారణంగానే దేశంలో మొట్ట మొదటిసారిగా మా కార్ల తయారీ ప్లాంటును స్థాపించగలిగాం. 2019 ద్వితీయార్థంలో కియ కార్లు మార్కెట్లోకి వస్తాయి. ఈ ప్లాంటులో తయారయ్యే కార్లను దేశీయ మార్కెట్లోనే విక్రయిస్తాం. చంద్రబాబుతో మా భాగస్వామ్యం విదేశీ వాణిజ్య ఒప్పందాలకు ఒక రోల్‌ మోడల్‌గా మారనుంది. 2018 ఆటో ఎక్స్‌పో ప్రదర్శనకు ఉంచిన కొత్త ఎస్‌.వి.యును అనంతపురం ప్లాంట్‌లోనే తయారు చేయనున్నాం. ఈ ప్లాంటులో 15,000 ఉద్యోగాలను స్థానికంగా ఇస్తాం’’ అని పార్క్‌ వివరించారు.

Link to comment
Share on other sites

ఆ కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తాం: చంద్రబాబు
23-02-2018 08:18:18

అనంతపురం/ హిందూపురం: కియ కార్ల పరిశ్రమ అనంత అభివృద్ధికి మలుపు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద గురువారం కియ రూపకల్పన ప్రక్రియ ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అనంతపురాన్ని ఆటోమొబైల్‌ హ బ్‌గా తీర్చిదిద్ది ఉపాధి పెం పొందిస్తామన్నారు. దక్షిణ కొరియా దేశంలో రెండవ అతిపెద్దదైన కియ కార్ల పరిశ్రమ జిల్లాలోని పెనుకొండ మం డలం ఎర్రమంచి వద్ద రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా భారీ పరిశ్రమ నెలకొల్పుతోందన్నారు.
 
ప్రతిఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాల్లో ల్యాండ్‌మార్కుగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో అనంత ల్యాం డ్‌మార్కుగా కియ పరిఢవిల్లుతుందన్నారు. ఇది రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎడారిగా మారుతుందనుకున్న అనంతకు హంద్రీనీవా నీటిని తీ సుకువచ్చామన్నారు. జిల్లాలోని ప్రతి చెరువుకూ నీరిచ్చి సస్యశ్యామల చేస్తామన్నారు. జిల్లాలో 20 ఏళ్లలో 18 సార్లు కరువు వచ్చిందని, దీన్ని అధిగమించడానికి కసిగా హంద్రీనీవా పనులు పూర్తి చేసి ఇప్పటికే జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లకు నీరిచ్చామన్నారు. త్వరలో చి త్తూరు జిల్లా కుప్పంకు నీరిస్తామన్నారు. హిం దూపురం, మడకశిర ప్రాంతాల్లోని చెరువులన్నింటినీ నింపుతామన్నారు.
 
హంద్రీనీవా రాకతో జిల్లాలో సరాసరిన 17.5 మీటర్ల నీటిమట్టం పెరిగిందన్నారు. ప్రజలు కూడా నీటిని ఆదా చేసి భూగర్భ జలాలు పెంపొందించాలన్నారు. నీటిమట్టంలో పశ్చిమ గోదావరితో అనంత పోటీపడుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాల్లో కియ పెద్దపీట వేస్తుందన్నారు. నాలుగు వేల మందికి శాశ్వత, ఏడువేల మందికి తాత్కాలిక ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కియ పరిశ్రమను మూడు భారీ పరిశ్రమల కారిడార్ల తో అనుసంధానిస్తామన్నారు. బెంగళూరు-హైదరాబాద్‌, చెన్నై-వైజాగ్‌, క్రిష్ణపట్నం-అనంతపురం పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానం చేస్తామన్నారు. దీంతో దేశంలో పెద్ద ఆటోమొబైల్‌హ బ్‌గా అనంతపురం మారుతుందన్నారు.
 
జిల్లాలో సోలార్‌విండ్‌ పవర్‌తో పాటు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. తె లుగుదేశం పార్టీకి జిల్లా కంచుకోటగా నిలుస్తోందని, జిల్లాపై ప్రేమతో అడగకుండానే కియ కా ర్లపరిశ్రమను ఇక్కడికి తీసుకొచ్చానని చంద్రబా బు వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకంటే అ నంత జిల్లాకే అధిక పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. కూరగాయలు, పండ్లు, పూలకు జిల్లా అ నుకూలంగా ఉందని, వ్యవసాయ ఆఽధారిత పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు.
 
జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తామన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఈ జిల్లా నుంచి ప్రాతినిఽథ్యం వహించారని, దీంతో ఈ జిల్లాపై తమకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. జిల్లాలో పేదరికం అధికంగా ఉందని, ఇ క్కడి ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో జి ల్లాను అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషిచేస్తున్నానన్నారు. కియకు భూములు ఇవ్వరా దని కొంతమంది ప్రతిపక్షాల వారు రెచ్చగొట్టినా ఇక్కడి రైతులు ముందుకు వచ్చి ఈ జిల్లా ఆ ర్ధిక మలుపునకు కృషి చేశారని కొనియాడారు. పెనుకొండలోనే కొరియన్‌ టౌన్‌షి్‌ప ఏర్పడుతుందన్నారు. దేఽశంలోనే అతిపెద్ద కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ఇక్కడి రైతులు, ప్రజలే కారణమన్నారు.
 
గొల్లపల్లి లేకుంటే పరిశ్రమలు వచ్చేవికాదు
వీలైనంత త్వరగా హంద్రీనీవా కాలువ రెండో దశ పనులు పూర్తి చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకురాకుండా ఉండి ఉంటే కియ పరిశ్ర మ జిల్లాకు వచ్చేది కాదని చంద్రబాబు చెప్పా రు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు పై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ఎ నర్జీ యూనివర్సిటీ ఫైలును సంబంధిత మంత్రి ద్వారా పురోగతిలో ఉంచామన్నారు. జిల్లాలో ప రిశ్రమలతో పాటు వ్యవసాయాన్ని అభివృద్ధి చే సి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన రైతుల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామన్నారు. జిల్లాలో గతఏడాది 29 శాతం వర్షపాతం లోటున్నా 14 శా తం అభివృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది 13 శాతం వర్షపాతం లో టున్నా 25 శాతం అభివృద్ధి సాధించామన్నారు. ఇది ఒక చరిత్ర అన్నారు.
 
ఎడారిగా మారిపోతుందనే ఆందోళన నుంచి జిల్లాను ప్రగతివైపు నడిపిస్తున్నామన్నారు. తాను దావో్‌సలాంటి ప్రపంచ దేశాలకు వెళ్లి పరిశ్రమల కోసం ఇప్పటివరకు 1946 ఒప్పందాలు చేసుకున్నామన్నారు. హంద్రీనీవాతో కియ, కియతో కొరియా టౌన్‌షి్‌ప వచ్చాయన్నారు. ఏపీ ఆటోమొబైల్‌ హబ్‌కు కియ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలువనుందన్నారు. రాష్ట్రానికి ఇంకా భారత్‌ ఫో ర్డ్‌, అపోలో టైర్స్‌, అమరరాజా వంటి భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు. కాంగెరస్‌ హ యాంలో వోక్స్‌వాగన్‌లాంటి కార్ల తయారీ పరిశ్రమను ఆ పాలకుల తప్పిదంతో కోల్పోయామని, ఇప్పుడు దానికి బదులుగా అనంతపురానికి కియను తీ సుకొచ్చామని వివరించారు. పరిశ్రమలకు కొత్త పెట్టుబడుల కోసం ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించామన్నారు.
 
అనంతపురం జిల్లాకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధా నం చేసి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ని ల్వ చేసే నీటిని అవసరమైన చోట వాడుకుంటామన్నారు. సమావేశంలో కియ మెటార్స్‌ ఇం డియా ఎండీ షిం మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం ఈ పరిశ్రమ ఏర్పాటైందని, 2.3 మిలియన్ల కా ర్లు 180 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ఈ సంస్ధ ఏర్పాటుకు సహకరించి పది నెలల్లో పనులు పూర్తి చేసి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఏపీ ప్రజలను అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర్‌రావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జవహర్‌, ఎంపీ లు నిమ్మల క్రిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు పయ్యావుల కేశవ్‌, పల్లె రఘునాథ్‌రెడ్డి, విప్‌ యామినీబాల, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఈరన్న, హనుమంతరాయచౌదరి, చాంద్‌బాషా, ప్రభాకర్‌చౌదరి, స్కిల్‌డెలవ్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు, కలెక్టర్‌ వీరపాండ్యన్‌, వడ్డెర్ల కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవుళ్ల మురళి, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు మెంబర్‌, న్యాయవాది ఆదెన్న, టీడీపీ జిల్లా నాయకుడు బీవీ వెంకటరాముడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, మేయర్‌ స్వరూప, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...