Jump to content

Kia in Anantapur !


Recommended Posts

ఉద్యోగాలు 
ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏపీఎస్‌ఎస్‌డీసీ 
  కియా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్న సంస్థ 
  తొలివిడతలో 2వేల మందికి శిక్షణ 
ఈనాడు - అమరావతి 

అనంతపురంలో ఏర్పాటు చేయనున్న కియా మోటార్స్‌లో రాష్ట్రానికి చెందిన వారికే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), కియా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు బుధవారం విజయవాడలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో, ఎండీ కె.సాంబశివరావు, కియా మోటార్స్‌ భారత సీఈవో, ఎండీ కుక్‌ హ్యుమ్‌ షిమ్‌, ముఖ్యపాలనాధికారి జిన్‌, శిక్షణ,  అభివృద్ధి  డీజీఎం కిమ్‌లతో సమావేశమయ్యారు. ప్రధానంగా కార్ల కంపెనీలో పని చేయడానికి అవసరమైన సాంకేతిక, సాంకేతికేతర(నాన్‌టెక్నికల్‌) సిబ్బంది నియామకాలకు సంబంధించి ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా కియా మోటార్స్‌ ప్లాంట్‌లలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు.
సాంబశివరావు మాట్లాడుతూ.. కియా సంస్థలో పనిచేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం గల అభ్యర్థుల ఎంపిక, విధివిధానాలను పరిశ్రమల శాఖ సమన్వయంతో రూపొందిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుగా ముగ్గురు లేదా నలుగుర్ని అమెరికాలోని జార్జియాలో ఉన్న తమ ప్లాంట్‌కు పంపుతామని, నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎంపిక చేసుకోవడం కోసం సహకరించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ముందుకురావడం సంతోషంగా ఉందని కియా మోటార్స్‌ సీఈవో, ఎండీ షిమ్‌ తెలిపారు.
ఉద్యోగాల కల్పన ఇలా.. 
ఏపీఎస్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం..కియా కార్ల కంపెనీలో నేరుగా, దాని అనుబంధ కంపెనీల్లో పని చేసేందుకు సుమారు 9వేల మంది వరకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం కానున్నారు. మెకానికల్‌, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పాలిటెక్నిక్‌ చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కియాలో నేరుగా నైపుణ్యం కలిగిన 2వేలు మంది, కొద్దిపాటి నైపుణ్యం కలిగిన వెయ్యిమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక 
కియా, దాని అనుబంధ కంపెనీల్లో పని చేసేందుకు అవసరమయ్యే శిక్షణను కియా మోటార్స్‌ తరఫున మరో నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. త్వరలో అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఏపీఎస్‌ఎస్‌డీసీ దరఖాస్తులను స్వీకరిస్తుంచి, వీరికి ఒక ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తుంది. 
* మొదటి విడతగా 2వేలు మందిని ఎంపిక చేస్తుంది. వీరికి విజయవాడ, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన అనంతరం మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ప్రతిభ చూపిన వారికి అయా అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. 
* రెండో విడతలో మరో 3వేలు మందికి శిక్షణ ఇవ్వనున్నారు. 
* వారం రోజుల్లో 48గంటలపాటు ఇచ్చే శిక్షణ, ఇందుకు ఏర్పాటు చేసే సామగ్రికి అయ్యే వ్యయాన్ని ఏపీఎస్‌ఎస్‌డీసీ భరిస్తుంది. 
* ఒక్కో అభ్యర్థికి రూ.2,016 వ్యయమవుతుందని అంచనా వేశారు. 
* సామగ్రి ఏర్పాటుకు సుమారు రూ.2కోట్లు వరకు వ్యయం కానుంది.

Link to comment
Share on other sites

  • Replies 900
  • Created
  • Last Reply

కియ... క్రియ!
16-02-2018 02:55:49

చకచకా నిర్మాణ పనులు
2019 మార్చి నాటికి మొదటి కారు
కియ ప్లాంట్లలో ఇదే అత్యాధునికం
అదనంగా బ్యాటరీ కారూ తయారు
చకచకా నిర్మాణ పనులు
అనంతపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేది... నవ్యాంధ్రలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ ! ‘కియ’ కార్ల కంపెనీ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. మరొక్క ఏడాదిలోనే కియ ప్లాంటు నుంచి మొదటి కారు రోడ్డెక్కనుంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో... యర్రమంచి గ్రామం వద్ద, జాతీయ రహదారి పక్కనే ‘కియ’ ప్లాంటు ఏర్పాటవుతోంది. మొత్తం 535.5 ఎకరాలను దీనికి కేటాయించారు. అందులో 84.14 ఎకరాల్లో బాడీషాప్‌, పెయింట్‌షాప్‌, అసెంబ్లీ షాప్‌, ఇంజిన్‌ షాప్‌, ప్రెస్‌కు సంబంధించిన యూనిట్లను నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన ఐరన్‌ ఫ్రేమ్‌లు బిగించే పనులు ఇప్పటికే 40 శాతం పూర్తయ్యాయి. పరిశ్రమ ప్రాంగణంలోనే కార్ల రైడింగ్‌ ట్రాక్‌తోపాటు పార్కింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయి.
 
మిగిలిన అన్ని యూనిట్ల నిర్మాణాలు ఉధృతంగా సాగుతున్నాయి. భూమి చదునులో రాష్ట్ర ప్రభుత్వం చూపిన వేగాన్ని... కంపెనీ ఏర్పాటులో కియ కూడా చూపిస్తోంది. ప్రస్తుతం కొరియాకు చెందిన 200 మంది సిబ్బంది ఇక్కడ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1500 మంది కార్మికులు ఈ పనుల్లో పాల్గొంటున్నారు.
 
ఇదే అత్యాధునికం...
దక్షిణ కొరియాకు చెందిన కియ (హ్యుండయ్‌ మాతృ సంస్థ) కార్ల తయారీ ప్లాంట్లు జెకొస్లోవేకియా, చైనా, మెక్సికో, అమెరికాలోని అట్లాంటాలో ఉన్నాయి. వీటిలో... అట్లాంటా పరిశ్రమ సాంకేతికపరంగా అత్యాధునికమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంటులో అంతకు మించిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. అట్లాంటా ప్లాంటులో ఇప్పటికే బ్యాటరీ కార్లు తయారవుతున్నాయి. అయితే... అవి ఇంకా ట్రయల్‌ దశలోనే ఉన్నాయి. అనంతపురం కియ ప్లాంటులోనూ బ్యాటరీ కారు తయారీ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక్కడ... గంటకు 34 కార్లు తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే... రోజుకు 821 కార్లు! సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారవుతాయి. వీటిని ఇక్కడి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తారు. కియ ప్లాంటును వివిధ ఓడ రేవులకు అనుసంధానిస్తూ ప్రత్యేకంగా రైల్వే ట్రాక్‌ కూడా సిద్ధం చేస్తున్నారు.
 
రూ. 13 వేల కోట్లు.. 11 వేల ఉద్యోగాలు..
రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న కియ కార్ల పరిశ్రమలో 11 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వాటిలో నాలుగు వేల మంది నిపుణులు (స్కిల్డ్‌), 7 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లను నియమిస్తారని తెలుస్తోంది. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కియ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇప్పటికే దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. కియ పరిశ్రమ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు చేపడతారు. కియలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు. మరోవైపు... కియకు అనుబంధంగా 18 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే భూమిని పరిశీలించి వచ్చారు. వీటికోసం స్థలం కూడా సిద్ధంగా ఉంది. మరో 3 వేల ఎకరాల సేకరణకు ఆరు గ్రామాలను రెవెన్యూ అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
 
22న సీఎం రాక...
కియ ప్రతినిధుల ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఈనెల 22న ప్లాంటును సందర్శిస్తున్నారు. కియ పరిశ్రమ ప్రాంగణంలో సీఎం ముందుగా ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ (శిలా ఫలకం తరహా) చేస్తారు. దీనిపై సీఎం, కియ ఎండీ, సంస్థ ఇండియా జీఎంల సంతకాలు ఉంటాయి. ఇది కొరియన్ల సంప్రదాయమని... అనంతపురం ప్లాంటులోనూ దీనిని పాటిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా... 36 ఎకరాల్లో నిర్మించే కొరియా టౌన్‌షి్‌ప, 11 ఎకరాల్లో నిర్మించిన స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను కూడా సీఎం సందర్శించే అవకాశాలున్నాయి. సీఎం సభ కోసం 100 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు.
 
వచ్చే మార్చి నాటికి రోడ్డుపైకి కియ కారు : కలెక్టర్‌
 
2019 మార్చినాటికి అనంతపురం జిల్లాలోని కియ పరిశ్రమ నుంచి మొదటి కారు రోడ్డెక్కుతుందని కలెక్టర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. ‘‘కొరియా, అమెరికాలోని కియ కార్ల పరిశ్రమలను నేను సందర్శించాను. అనంతలోని ప్లాంటు అంతకంటే ఆధునికమైనది. పెనుకొండ మండలంలోని యర్రమంచి ప్రాంతంలో కొరియాను తలపించేలా ఆ దేశపు భాషతో బోర్డులు వెలిశాయి. కియతో అనంతపురం జిల్లాకు విదేశీయులతోపాటు దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వ్యాపారుల రాకపోకలు పెరుగుతాయి’’ అని తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, Urban Legend said:

 

Super Ap lo unna colleges from engineering to ITI andariki training ichi ready ga pettukunte sari.... Mana vallu bayata states ki velle paristiti tapputundi.. Lekapothe ah north batch vachi kampu kampu chestaru 

Link to comment
Share on other sites

17 minutes ago, MVS said:

Super Ap lo unna colleges from engineering to ITI andariki training ichi ready ga pettukunte sari.... Mana vallu bayata states ki velle paristiti tapputundi.. Lekapothe ah north batch vachi kampu kampu chestaru 

True Bhayya - At the same time kurrollu kooda reality telisu koni andi vacchina avakaasaalanu sadviniyogam chesu kuntoo - inka Pedda avakaasaala kosam chooseyy attitude alavaatu chesu ko vaali 

Link to comment
Share on other sites

Kia Motors to manufacture cars in Andhra Pradesh with nearly full localisation

Updated Feb 16, 2018 | 14:39 IST | ET Now Digital

The company has plans to launch 16 electric vehicles in India by the end of 2025. 

Kia Motors to manufacture cars in Andhra Pradesh with nearly full localisation
Photo Courtesy:  Indiatimes
Kia Motors dazzled the press screening of the Auto Expo 2018 by showcasing the SP Concept.

 

New Delhi: South Korean automobile giant Kia Motors, which showcased 16 models from its global portfolio in recently concluded Auto Expo 2018, has decided to manufacture them with nearly full localisation in Andhra Pradesh after the state government offered an upwardly revised incentives package, a report in the Economic Times said.

“The South Korean automobile giant Kia Motors has now agreed to manufacture nearly 100 per cent of its cars in Andhra Pradesh as against its earlier plan to import certain key components and assemble them in India, keeping in view the increased import duty,” the ET report quoted Cherukuri Kutumba Rao, vice-chairman of Andhra Pradesh State Planning Board as saying.

 

The development comes weeks after Kia Motors India CEO Kook Hyun Shim, at the Auto Expo 2018, hinted at plans to go in for a high level of localisation that would help the automaker reach volumes and market share targets early. He had also said that shipping parts from Korea will not be feasible and increased localisation could help gain a foothold in India quickly, the ET report said.

Kia Motors, Korea’s second-largest automaker is setting up its car manufacturing facility in Anantapur district of Andhra Pradesh with an installed capacity of 3 lakh cars a year, aimed at garnering around a tenth of its global sales once it reaches full capacity, the ET report said.

 
Link to comment
Share on other sites

1 hour ago, DiehardNTRfan said:

Traffic between Bangalore till KIA plant  has increased manifold...unbelievable development see across all fronts...just mesmerising...ika real estate aithe ,no need to talk...what a change this has brought!!

Jan-2018 lo CBN plant ni start chesthaaru annaru? is it postponed?

Jan-2019 ki 1st car production avuthunda?

ilaanti big industries rayalaseema lo 3-4 more vasthe before 2019 elections TDP will sweep all seats in Rayala Seema.

Link to comment
Share on other sites

5 hours ago, DiehardNTRfan said:

Traffic between Bangalore till KIA plant  has increased manifold...unbelievable development see across all fronts...just mesmerising...ika real estate aithe ,no need to talk...what a change this has brought!!

Nuvvu kooda plan chesthunnava Anna mari :poke:

Link to comment
Share on other sites

Guest Urban Legend
4 hours ago, RKumar said:

Jan-2018 lo CBN plant ni start chesthaaru annaru? is it postponed?

Jan-2019 ki 1st car production avuthunda?

ilaanti big industries rayalaseema lo 3-4 more vasthe before 2019 elections TDP will sweep all seats in Rayala Seema.

evaru chepparu bro 

1st car will be out from second half of 2019 maybe by sep 

Link to comment
Share on other sites

Guest Urban Legend
5 hours ago, DiehardNTRfan said:

Traffic between Bangalore till KIA plant  has increased manifold...unbelievable development see across all fronts...just mesmerising...ika real estate aithe ,no need to talk...what a change this has brought!!

heard that lands and house rents doubled 

Link to comment
Share on other sites

శరవేగంగా ‘కియా’ ముందుకు..! 
వచ్చే ఏడాది నుంచే కార్ల తయారీ లక్ష్యం... 
ముమ్మరంగా తాత్కాలిక  కార్యాలయాలు, నివాసాల పనులు
ఈ నెల 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగాఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌.. 
ఈనాడు - అనంతపురం 

‘‘కరవు జిల్లాగా పేరున్న అనంతపురం రూపురేఖలను మార్చేసి, మున్ముందు పారిశ్రామిక జిల్లాగా మలిచేందుకు దోహదపడే కీలకమైన కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి కార్ల తయారీ మొదలు కావాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 22న ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ జరగనుంది.’’
దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల తయారీ పరిశ్రమ యూనిట్‌ అనంతపురం జిల్లాలోని గోరంట్ల సమీపంలో హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని (ఎన్‌హెచ్‌-44) ఆనుకొని ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలోనే కార్ల తయారీ ఆరంభించేలా చూడాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకుఅనుగుణంగా పనులు సాగుతున్నాయి. ఇక్కడ ఏడాదికి 3లక్షల కార్లు తయారు కానున్నాయి.
జెట్‌ వేగంతో పనులు... 
* కియా కోసం ఎర్రమంచి పరిధిలో ఏపీఐఐసీ 600 ఎకరాలు కేటాయించి.. రూ.182 కోట్లతో చదును చేయించింది. 535.5 ఎకరాలలో ప్రాధాన ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. 
* కర్మాగారం లోపల వివిధ యూనిట్ల నిర్మాణ పనులను హుందాయ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ (హెచ్‌ఈసీ) ఆధ్వర్యంలో ఆ సంస్థే జరిపిస్తోంది. 
* కియా ప్రధాన ప్లాంట్‌లో భాగంగా ఇంజిన్‌ షాప్‌, బాడీ షాప్‌, పెయింట్‌షాప్‌, సీట్‌ షాప్‌, మార్జిలర్‌ షాప్‌, అసెంబుల్డ్‌ యూనిట్‌, యుటిలిటీ సెంటర్‌, వృథా నీటిని శుద్ధి చేసే కేంద్రం (డబ్ల్యూడబ్లూటీపీ), పవర్‌ ట్రైన్‌ షాప్‌ నిర్మిస్తున్నారు. వెనుకవైపు తయారైన కార్ల వేగం, తదితరాలు పరిశీలించేందుకు టెస్టింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు.
భారీ టౌన్‌షిప్‌... 
* కియా ప్లాంట్‌కు ఎదురుగా జాతీయ రహదారి అవతలివైపు 36 ఎకరాల్లో అత్యధునిక టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తున్నారు. 
* దీనికి సమీపంలోనే 11.2 ఎకరాలు శిక్షణ కేంద్రానికి కేటాయించగా, ఈ కేంద్రం పనులు జరుగుతున్నాయి. 
* కియాకు ట్రక్‌ టెర్మినల్‌ కింద 30 ఎకరాలు, రైల్వే సైడింగ్‌కు 50 ఎకరాలు కేటాయించగా,  మరో 70 ఎకరాలు కోరుతున్నారు.

పుష్కల ఉపాధి... 
వివిధ స్థాయుల్లో మొత్తంగా 10 వేల మందిని నియమించుకోనున్నారు. ఇందులో 7 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉంటారు. మొత్తం సిబ్బందిలో 70 శాతం వరకు అనంతపురం యువతకే అవకాశం కల్పించేలా ఒప్పందం జరిగింది. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి దక్కనుంది. 
* 18 అనుబంధ పరిశ్రమలు కూడా ఈ చుట్టుపక్కల ఏర్పాటు కానున్నాయి. వీటి కోసం 500 ఎకరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సంస్థలు కలిపి 130 ఎకరాలు తీసుకొని, భూమి చదును పనులు చేపట్టాయి. ఇందులో ఒకదానిలో కార్లకు అవసరమైన పెయింట్లు తయారు చేసి కియాకు అందజేస్తారు.
మారుతున్న పెనుకొండ స్వరూపం.. 
కియా రాకతో పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపం మారుతోంది. ప్రత్యేకంగా కొరియా హోటల్‌ ఏర్పాటయింది. కొరియా, ఆంగ్లంలో అనేక సూచికలు (బోర్డులు) ఏర్పాటయ్యాయి. మున్ముందు వేల మంది ఉద్యోగులు రానున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా పెనుకొండలో ఇళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గతంలో ఇక్కడ నాలుగైదు వేల రూపాయలకే లభించే ఒక పడక గది ఇల్లు.. ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు చేరిపోయింది. దీంతో పలువురు అద్దెలు చెల్లించలేక పెనుకొండను వదిలి హిందూపురం, అనంతపురానికి మకాం మారుస్తున్నారు.
అన్ని వసతులు కల్పిస్తున్నాం 

అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ ఎంతో కీలకమైంది. గొల్లపల్లి జలాశయం నుంచి నీటిని ఇవ్వనున్నాం. ప్లాంట్‌ చుట్టూ రహదారితోపాటు, పరిశ్రమలోకి వాహనాల రాకపోకలకు వీలుగా జాతీయ రహదారిపై వంతెన నిర్మించనున్నాం. ఈనెల 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరిశ్రమ ప్రాంతంలో ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం ఉంటుంది. ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేశాం.
- గణేశన్‌ వీరపాండియన్‌, కలెక్టర్‌, అనంతపురం

Link to comment
Share on other sites

On 17/02/2018 at 6:30 AM, DiehardNTRfan said:

Traffic between Bangalore till KIA plant  has increased manifold...unbelievable development see across all fronts...just mesmerising...ika real estate aithe ,no need to talk...what a change this has brought!!

Thanks for info anna

Link to comment
Share on other sites

శరవేగంగా కియ ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ పనులు
20-02-2018 00:20:19
22న ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శన
హిందూపురం, ఫిబ్రవరి 19: కియ కార్ల పరిశ్రమ ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమానికి ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం 44 జాతీయ రహదారి అమ్మవారుపల్లి వద్ద దక్షిణ కొరియ కియ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్ల పరిశ్రమలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా పరిశ్రమ ఎదురుగా నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికనిర్మాణం చేపడుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు.

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

Gujju batch Kia valla meda chala vattidi tecchadu anta,Delhi nundi phone kuda chesi vattidi teccharu anta,chivaraki AP ki pothe permissions aputamu ani Kia valla ni bhayapettaru anta Kia vallu gattiga nilabaddaru 

E dikkumalina baffas funds ivaru kanisam mana kastham tho techukuna projects kuda rakundha try chestunaru chii e pakodi ghadie gurtukuvastey ne xxxxxx yadava 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...