Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
కొరియా సంస్థలు బారులు 
9న 30 కంపెనీల ప్రతినిధుల రాక 
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ 
రాష్ట్రంలో పెట్టుబడులపై పరిశ్రమల శాఖతో చర్చలు 
6ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి కొరియా కంపెనీలు బారులు తీరుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా కార్ల సంస్థకు అనుబంధంగా 39 అనుబంధ కంపెనీలు వస్తున్న సంగతి తెలిసిందే. అవి అక్కడ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతూ.. ఏకంగా 2500మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. తాజాగా మరో 30 కంపెనీలతో కూడిన కొరియా ప్రతినిధుల బృందం రాష్ట్రానికి రానుంది.వచ్చే 9న ఈ బృందం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. వెంట ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా రానున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలత నేపథ్యంగా దక్షిణ కొరియాకు చెందిన చిన్నకార్ల విపణిలో దిగ్గజ సంస్థ కియా ఏపీలో అడుగుపెట్టడానికి ముందుకొచ్చింది. ప్లాంటు ఏర్పాటుకు పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుండటంతో, దాని బాటలోనే అక్కడి మరికొన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల పరిశ్రమల మంతి అమరనాథరెడ్డి, ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, అనంతపురం కలెక్టర్‌ వీరపాండ్యన్‌లు దక్షిణ కొరియాలో పర్యటించి.. ఆయా కంపెనీల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో వాటి ప్రతినిధుల బృందం విజయవాడకు వస్తోంది.

సీఎంతో సమావేశం.. 
దక్షిణ కొరియా నుంచి వచ్చే పారిశ్రామిక బృందం అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానుంది. ముందుగా ఆ కంపెనీల ప్రతినిధులతో పరిశ్రమల శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఇందుకోసం విజయవాడలోని ఒక హోటల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయి, ఎక్కడెక్కడ భూముల లభ్యత ఉంది, ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి కల్పించే రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితరాలపై అధికారులు వివరిస్తారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పాట్లు చేస్తోంది. హ్యుందాయ్‌, శామ్‌సంగ్‌ తదితర పెద్ద సంస్థల ప్రతినిధులు కూడా కొరియా నుంచి వస్తున్న బృందంలో ఉన్నారు.వీరి పర్యటన ద్వారా రాష్ట్రానికి మరికొన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Link to comment
Share on other sites

  • ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌
గోరంట్ల రూరల్‌, నవంబరు 10 : కియ పరిశ్రమ ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారనుందని ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో బెల్‌, నాసిన్‌ ఎయిర్‌బస్‌ పనులను ఆయన పరిశీలించారు. అలాగే పెనుకొండ మండలంలో కియ పరిశ్రమల పనులు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కియ పరిశ్రమను అనంతపురం జిల్లాలో స్థాపించడం రాష్ర్టానికి వరం లాంటిదన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే కేంద్రంలో సంబంఽధిత అధికారులతో చర్చించడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున గత నెలలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పర్యటించానన్నారు.
 
ప్రస్తుతం అనంత, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటవుతున్న కియ, బెల్‌, నాసెన్‌ ఎయిర్‌బస్‌, ఐఐఐటీ, సెంట్రట్‌ యూనివర్శీటీ, ఎనర్జీ యూనివర్శీటీ పనులను పరిశీలిస్తానన్నారు. బెల్‌లో మిగిలిన పనులకు రూ.170 కోట్లతో టెండర్‌లకు స్ర్కీనింగ్‌ జరుగుతున్నదని తెలిపారు. ఈ పరిశ్రమలు పూర్తయితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. లేపాక్షి నంది ఉత్సవాలు జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

villu jet speed lo eltunaru ga

/****

Kia Wins Loan Guarantees for India Production Plant

 

Korea Trade Insurance reportedly will back Kia’s $1.1 billion capital investment in India to build its first vehicle-assembly plant in the world’s second most-populous market, through loan guarantees of up to $650 million.

Support from the state-run insurance company will make it easier for the Korean automaker to raise loans for its investment in India as well as recruit builders and suppliers for the facility, the Korean Pulse business-news website reports.

In April, Kia signed an agreement with the state government of Andhra Pradesh in southern India to build the plant on a 23.25 million sq.-ft. (2.16 million-sq.-m) site. Completion is scheduled for 2019. Capacity of the plant, which will make compact sedans and utility vehicles tailored to the Southwest Asian market, is expected to be 300,000 units annually, the automaker says.

Link to comment
Share on other sites

కొరియాకు అనంత ప్రేమ!
కియా రాకతో కంపెనీల  చూపంతా అక్కడే
బూసాన్‌ తరహా పారిశ్రామికాభివృద్ధికి ఊతం
3 వేలకుపైగా పరిశ్రమలు తరలివచ్చే అవకాశాలు
డిసెంబరులో అవగాహన ఒప్పందాలు
ఈనాడు - అమరావతి
అనంతపురం... ఈ పదాన్ని ఇప్పుడు కొరియా కలవరిస్తోంది. ‘కియా’ మోటార్స్‌ అక్కడ కాలు పెట్టడంతో ఆ దేశంలోని పలు పరిశ్రమలు కూడా ఇప్పుడు ఆంధ్రావైపు ఆసక్తిగా చూస్తున్నాయి. కియా రాకతో కేవలం ఆటోమొబైల్‌ ఆధారిత పరిశ్రమలు మరిన్ని వస్తాయని ఊహించిన అధికార యంత్రాంగానికి ఆ దేశం నుంచి భారీ పరిశ్రమలు కూడా కొన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో తబ్బిబ్బవుతోంది. ప్రధానంగా ఈ కంపెనీలన్నీ అనంతపురం జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవలే అక్కడి నుంచి 30 కంపెనీలు, పారిశ్రామిక సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తపరిచారు. ముఖ్యంగా ‘కియా’ కార్ల పరిశ్రమ ఇటువైపు రావడంతో అక్కడున్న మిగిలిన   పరిశ్రమలకు ఈ ప్రాంతమంటే నమ్మకం కలుగుతోంది. అది భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పలు ప్రాంతాలను అన్వేషించింది. చివరకు ఆంధ్రాలోనే అడుగు పెట్టడానికి మొగ్గు చూపింది. డిసెంబరులో ఇక్కడి నుంచి రాష్ట్ర అధికారుల బృందం సియోల్‌, బుసాన్‌లో పర్యటించనుంది. వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నాయి. దక్షిణ కొరియాలో బుసాన్‌ రెండో అతిపెద్ద నగరం. పెద్ద నౌకాశ్రయం కూడా ఉంది. అక్కడ దాదాపు 90 శాతం ప్రజలందరూ ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు చేస్తున్నవారే. వేల పరిశ్రమల క్లస్టర్లు ఇక్కడ ఏర్పాయ్యాయి. కొరియా సంస్థల ఆసక్తిని గమనించిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి నేతృత్వంలో కొరియా, ఆంధ్రా అధికారులతో ఒక ఉప బృందాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వారికి ఆ ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాల సాయంతో వీడియోలు పంపి వారు సమ్మతిస్తే దానికి సంబంధించి అవగాహన పత్రాలు కూడా సిద్ధం చేయనున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, అనంతపురం జిల్లాలోని కియా ప్లాంటుకు సమీపంలోనే కొరియాకు చెందిన పలు పరిశ్రమలు రానున్నాయి.

ఏపీలో అనుకూల వాతావరణం
- జాంగ్‌ డియోక్‌ మిన్‌, భారత్‌లో కొరియా కాన్సుల్‌ జనరల్‌
ఆంధ్రాలో మంచి వాతావరణం ఉంది. బుసాన్‌లోని దాదాపు 3వేలపరిశ్రమలున్న పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలు ఏపీలో తమకొక పునాది ఏర్పాటు చేసుకోవాలని అభిలషిస్తున్నాయి. ఆ దిశగానే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. కనీసం 1800 ఎకరాల్లో ఈ తరహా పారిశ్రామిక నగరం అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం.

పెట్టుబడులు పెట్టాలని ఆసక్తిగా ఉన్నాం
- గున్‌ పాంగ్‌, ఎండీ, బీఐపీ ఇండస్ట్రీస్‌
క్యాబిన్‌ ఇంటీరియర్‌ వస్తువుల తయారీలో మాది అగ్రగామి సంస్థ. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అనంతపురం వద్ద అయితే మాకు ఇంకా బాగుంటుంది. ఇతర అనువైన ప్రాంతాలు చూస్తాం. త్వరలో మా పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన వివరాలు అందించగలం.
త్వరలోనే మంచి వార్తలు వింటారు
‘‘లాజిస్టిక్స్‌ రంగంలో మాదో పెద్ద కంపెనీ. మేం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి పొడవైన తీరప్రాంతం ఉంది. పైగా ఇక్కడ కార్మికుల ఆందోళనలు, సమ్మెలు లాంటివి లేకుండా ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం ఉందని తెలుసుకుని సంతోషించాం. త్వరలోనే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మీరు మంచి వార్తలు వింటారు.
- ఊ స్యూంగ్‌ సన్‌, మేనేజర్‌ (అంతర్జాతీయ విపణి), టీఎన్‌సీ గ్లోబల్‌ కంపెనీ లిమిటెడ్‌
నమ్మకం కలిగించాం... ఫలితమిస్తోంది
-సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కార్యదర్శి, పరిశ్రమల శాఖ
కొరియా సంస్థలకు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం. కియాతో అది మనం సాధించాం. అది ఫలితమిస్తోంది. ఆ సంస్థలు ఇటువైపు వస్తున్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకుని సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులు సాధించాలి.

వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి
- ఎ.బాబు, ఎండీ, ఏపీఐఐసీ
బుసాన్‌ నుంచి 3 వేల పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపడం మామూలు విషయం కాదు. అవన్నీ సాకారమైతే కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబును కలిసిన దక్షిణకొరియా బృందం
18-11-2017 16:11:25
అమరావతి: సీఎం చంద్రబాబును దక్షిణకొరియా బృందం కలిసింది. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా కంపెనీల ఆసక్తి చూపారు. అత్యధిక వృద్ధిరేటు, స్నేహపూర్వక వాతావరణం..చంద్రబాబు విజన్ ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయని కిమ్ హంగ్ టే అన్నారు. ఏపీలో ఏర్పాటయ్యే కొరియన్ సిటీలో కొరియా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి 37 కంపెనీలు రానున్నాయని, 7 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కిమ్ హంగ్ టే తెలిపారు. ఏపీ నుంచి మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్స్ ఎగుమతులకు ప్రోత్సాహం ఉంటుందని దక్షిణ కొరియా కౌన్సిల్ జనరల్ కిమ్ హంగ్ టే వెల్లడించారు.

Link to comment
Share on other sites

అనంతలో ‘కొరియా నగరం’
ఆ దేశానికి చెందిన 37 సంస్థల రాక
రూ.4 వేల కోట్ల పెట్టుబడులు
సీఎంతో ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌  కిమ్‌ హంగ్‌ టే భేటీ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు మరిన్ని కొరియా సంస్థలు రానున్నాయి. శనివారం దక్షిణ కొరియా కాన్సుల్‌ జనరల్‌ కిమ్‌ హంగ్‌ టే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 37 కొరియా సంస్థలు వస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.  వీటి ద్వారా అక్కడ రూ.4వేల కోట్ల పెట్టుబడులు, ఏడు వేల మందికి ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని చెప్పారు. అక్కడ కొరియా నగరం (కొరియన్‌ సిటీ)ను అభివృద్ధి చేయనున్నాయని వివరించారు. కియా మోటార్స్‌, దాని అనుబంధ సంస్థలు ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ వైపు కొరియాలోని పరిశ్రమలు ఆసక్తిగా చూస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీతో తాము ఆర్థిక సంబంధాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక బంధాలను కూడా బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నుంచి మిర్చి, పొగాకు, జౌళి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కొరియాన్‌ సిటీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పెట్టుబడులు అక్కడికి రానున్నాయి, అవి కల్పించబోయే ఉద్యోగావకాశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కొరియా సంస్థలకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొరియా భాషను నేర్పే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని యువతను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి దక్షిణ కొరియాకు చెందిన కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

మా దేశానికి రండి
దక్షిణ కొరియా దేశంలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కిమ్‌ హంగ్‌ టే ఆహ్వానించారు. ఇప్పటికే కొరియా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని, ఈ బంధం మరింత బలోపేతం చేసుకోవడానికి వీలుగా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మార్చిలో దక్షిణ కొరియాలో పర్యటిస్తానని చెప్పారు. ఈ లోగా అక్కడ పరిశ్రమలను ఆకర్షించడానికి తమ రాష్ట్రం నుంచి పరిశ్రమల శాఖ, ఆర్థికాభివృద్ధి మండలి అధికారులు రోడ్‌షో నిర్వహిస్తారని, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారని వెల్లడించారు. దక్షిణ కొరియా డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ డేసూ చాంగ్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

నవ్యాంధ్రకు వస్తాం
19-11-2017 01:23:36

    రాష్ట్రానికి కొరియా సంస్థల క్యూ!
    4 వేల కోట్ల పెట్టుబడులతో 37 సంస్థలు రెడీ
    సీఎంతో కొరియన్‌ కాన్సుల్‌ జనరల్‌ కిమ్‌ భేటీ

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కొరియా పారిశ్రామిక సంస్థలు తరలి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురంలో పరిశ్రమలను స్థాపించేందుకు 37 కొరియన్‌ కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. ఈ కంపెనీలు రూ.4 వేల కోట్లను పెట్టుబడి పెడతామంటూ ముందుకొచ్చాయి. వీటిలో అత్యధికంగా ఆటోమొబైల్‌ రంగానికి చెందినవే ఉన్నాయి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ అత్యధికంగా ఉండడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కొరియన్‌ సిటీలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశంలోని పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చంద్రబాబుకు దక్షిణ కొరియా కాన్సూల్‌ జనరల్‌ కిమ్‌ హంగ్‌ టీ వివరించారు.
 
వెలగపూడి సచివాలయంలో శనివారం సీఎంని కిమ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక వృద్ధి రేటు, స్నేహ పూర్వక పారిశ్రామిక వాతావరణం, చంద్రబాబు వంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఉండడం వంటి అంశాలు తమను ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయని కిమ్‌ తెలిపారు. ఏపీతో సాంస్కృతిక, సామాజిక సంబంధాలనూ బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు సీఎంకి కింగ్‌ వివరించారు. ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్‌, చీరల ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని కింగ్‌ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే కొరియన్‌ సిటీపై సీఎం చంద్రబాబు, కిమ్‌ నడుమ చర్చ జరిగింది.
 
త్వరితగతిన కొరియన్‌ సిటీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. విజ్ఞాన మార్పిడిలో భాగంగా విద్యార్థుల పరస్పర మార్పిడికి ఒక ప్రణాళిక రూపొందించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొరియన్‌ లాంగ్వే జ్‌ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని సీఎంను కిమ్‌ కోరారు. రాష్ట్రంలోని యువతను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియాకు చెందిన కోచ్‌లతో శిక్షణ ఇప్పించాలని కింగ్‌ను సీఎం కోరారు. 

Link to comment
Share on other sites

 " ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్‌, చీరల ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని కింగ్‌ హామీ ఇచ్చారు." this is going to be double bonanza if materializes correctly, manchi help avutundi farmers ki :terrific:

Link to comment
Share on other sites

10 minutes ago, MVS said:

 " ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్‌, చీరల ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని కింగ్‌ హామీ ఇచ్చారు." this is going to be double bonanza if materializes correctly, manchi help avutundi farmers ki :terrific:

 

Link to comment
Share on other sites

Arrival of Kia Motors & Toyota Motors the major reason for Honda looking at AP

Kannada Herald 19 Nov. 2017 11:00

 

According to sources the successor state of Andhra Pradesh is soon emerging as the hub for automobile industry. After world's famous Kia Motors arrived to AP, Toyota Motors is on the verge of signing the deal with AP to set up its plant for the Hybrid Vehicles manufacturing in AP. This is a huge step for the industrial sector of AP given that it has beaten the states like Maharashtra, Gujarat and bagged Toyota.

Meanwhile joining the bandwagon is Japanese automobile giant Honda which is also toying with the idea of starting its unit in AP. While Honda already has a plant in Karnataka that manufactures 6600 motor cycle units, the automobile firm is planning to set up a bigger capacity unit in Andhra Pradesh.

 

Moreover talk is that Honda is considering districts such as Kurnool, Anantapur and Chittoor to start its plant. It is of the opinion that one of these districts could be ideal for transportation to Karnataka, Tamil Nadu and Telangana. If Honda arrives, this would be another feather in the cap of AP.

 

Link to comment
Share on other sites

14 hours ago, MVS said:

 " ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్‌, చీరల ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని కింగ్‌ హామీ ఇచ్చారు." this is going to be double bonanza if materializes correctly, manchi help avutundi farmers ki :terrific:

 

Link to comment
Share on other sites

KIA tu to kamal kiya :super::terrific:

/*****************KIA opened gates for Korea and Korea even planning to set up consulate offie in Andhra

key elements of the trip are two MoU signings with Kia Motors ancillaries, visit to KIA Motors headquarters, business seminar in partnership with Krishnapatnam Port and Kia Motors, two major roadshows, visits to Pusan Newport Company (Busan), Nok-san National Industrial Complex (Busan) and Myeongji Free Economic Zone.

On November 9, the Chief Minister met with a delegation of 20 entrepreneurs from South Korea lead by Consul General Jeong Deok-Min. The delegation proposed to establish a 'South Korea City' in Andhra Pradesh, bringing in at least 30 companies to set up their units.

Twenty-nine companies in written and 10 more companies have orally expressed their interest in investment in the state of Andhra Pradesh. Twenty-seven tier 2 and 3 ancillaries of Kia Motors have issued LoIs, and will invest approximately Rs. 8,000 crore. The cluster of Korean companies will be spread across 850 acres, and generate employment for 30,000 people in Anantapur.

Assetz group for the development of a world class "SMART industrial City" in Anantapur which includes: Industrial park, logistics park and warehousing, commercial space, housing (affordable as well as luxury), golf course, legoland and wellness centre

Other key bilateral meetings planned are with Lotte Corp, Kokam Co. Ltd., OCI Company Ltd., Youngone and Korea Automobile Manufacturers Association.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...