Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply
శరవేగంగా ‘కియ’ పనులు
 
 
636425086322384431.jpg
  • ఎప్పటికప్పుడు అనుమతుల జారీ
  • గడువులోగా ఉత్పత్తి ఆరంభించాలి: సీఎం ఆదేశం
  • పుట్టపర్తి విమానాశ్రయంలో సమీక్ష
అనంతపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘కియ’ కార్ల పరిశ్రమ పనులు శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పరిటాల శ్రీరామ్‌ వివాహానికి హాజరైన సందర్భంగా ఆదివారం విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌తో కియ పరిశ్రమ పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఈ పరిశ్రమ ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. జరుగుతున్న పనులపై కలెక్టర్‌ సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కియ పరిశ్రమకు సంబంధించి పర్యావరణ అనుమతులు, ఎన్‌ఓసీల జారీ, ఏపీ టూరిజం కార్యాలయంలో తాత్కాలిక వసతి, ట్రాఫిక్‌ సైట్‌ పనులను డ్రోన్‌ ద్వారా సర్వే చేసేందుకు నిరంతర ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటినీ కల్పించామని తెలిపారు.
 
అనంతరం సీఎం.. ట్రాఫిక్‌ సైట్‌ వద్ద ఉన్న బోర్లకు అదనంగా మరికొన్ని బోర్లు వేసి శిక్షణ కేంద్రం, టౌన్‌షి్‌పలకు పైప్‌లైన్‌ ద్వారా నీటిని అందించాలని ఆదేశించా రు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను, ఉత్తర్వులను విజయవాడలోని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు జారీ చేస్తామన్నారు.నిర్దేశించిన గడువులోపే యాజమాన్యంపనులు పూర్తిచేయాలన్నారు. చెప్పిన సమయానికి కార్ల ఉత్పత్తి పని ప్రారంభించాలని సూచించారు. సమీక్షలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రఘునాథ్‌, పరిశ్రమల జీఎం సుదర్శనబాబు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత హందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌తో కలిసి వెంకటాపురం చేరుకున్నారు.
Link to comment
Share on other sites

కమాల్‌ ‘కియ’!
 
 
636426840096571351.jpg
అనంతలో కార్ల కంపెనీతో జోరు.. చుక్కల్లోకెక్కిన భూముల ధరలు
  • పరిశ్రమకు అనుకుని ఉంటే బంగారమే
  • ఎకరా ధర 50 లక్షలకు బేరాలు
  • దూరంగా ఉంటే ఎకరం రూ.10-20 లక్షలు
  • 3 రాష్ర్టాల నుంచి కొనుగోళ్లు
అనంతపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోతుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ క్రమంలో కియకు భూములు కేటాయించిన అమ్మవారిపల్లెలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
 
దశ తిరిగింది...
అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది. ఈ పరిశ్రమ రాకమునుపు అమ్మవారిపల్లె ప్రాంతంలో ఎకరం రూ.రెండు లక్షలకు మించేది కాదు. కియ దెబ్బకు అక్కడ సీన్‌ మారిపోయింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు మరింత గిరాకీ పెరిగింది. ఇప్పటికే ఎకరా ధర రూ.50 లక్షలు పలుకుతోంది. పరిశ్రమకు ఆనుకుని ఉండే భూముల ధర ఎకరం రూ.కోటి చెబుతున్నారు. హైవేకు దూరంగా ఉన్న భూముల ధర... ఆ దూరాన్ని బట్టి ఎకరం రూ.10 లక్షల నుంచి 20 లక్షలు పలుకుతోంది. ఈ భూముల్లో భవిష్యత్త్తులో భారీ హోటళ్లు ఏర్పాటు చేసేందుకు, వెంచర్లు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చి మరీ ఇక్కడ భూములు కొంటున్నారు. ఇటీవల తమిళనాడు అధికార పార్టీ అన్నా డీఎంకేకు చెందిన నేతలు కొందరు పరిశ్రమకు అనుకుని 50 ఎకరాల ను ఎకరా రూ.50 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.
 
అనంతపురం జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు కలిసి 500 ఎకరాలు కొన్నట్లు సమాచారం. ఒకేచోట ఏకమొత్తంగా ఉండేలా ఈ 500 ఎకరాలను కొనడం విశేషం. కొందరు మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు కూడా వారి బంధువుల పేర్లతో భూములను కొన్నట్టు తెలుస్తోంది. కొందరు విడివిడిగా ఎకరా నుంచి ఐదెకరాల వరకూ కొనుక్కుంటున్నారు. ఇలా మరో 200 ఎకరాల వరకూ చేతులు మారినట్టు ఆ ప్రాంత రైతులు వివరిస్తున్నారు. ఇప్పటికే స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందిన మధ్యవర్తులు భూముల సమాచారం సేకరిస్తూ... క్రయ విక్రయాలకు ఊతమిస్తున్నారు.
 
ఉద్యోగం ఇస్తామంటే..
5.20 ఎకరాల భూమిని 13 సంవత్సరాల క్రితం రూ.10 వేలు పెట్టి కొన్నాను. అందులో 1.20 ఎకరాలకు ప్రభుత్వం రూ.11 లక్షలు ఇచ్చింది. మాతోటి రైతుల ఎక్కువ ధరకు భూమి అమ్ముకుంటున్నారు. మా కొడుకు ఎంబీఏ చదువుకుని ఖాళీగా ఉన్నాడు. వాడికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. దాన్ని నమ్ముకుని ఉన్నాం.
- రామాంజనేయులు, రైతు,
అమ్మవారిపల్లె.
 
plants.jpg20 వేలతో కొన్నాం.. ఇప్పుడు 50 లక్షలు
నాకు రెండెకరాల భూమి ఉండేది. పదేళ్ల కిందట ఎకరా రూ. 20 వేలకు కొన్నాను. దాన్ని పరిశ్రమ కోసం ప్రభుత్వం తీసుకుంది. రూ.21 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు మా పక్క రైతుల భూములు ఎకరా రూ. 50 లక్షలు అమ్ముతున్నాయి. నా చిన్నకొడుకు ఎంబీఏ చదువుకున్నాడు. ఉద్యోగం ఇస్తామంటున్నారు. దానిమీదే ఆశలు. మేము ఫ్యాక్టరీలో ఏదో పనిచేసుకుని బతకాలనుకుంటున్నాం.
- అంజన్‌రెడ్డి, అమ్మవారిపల్లె
 
ఇళ్ల అద్దెలు.. మూడింతలు
కియ పరిశ్రమతో పెనుకొండలో ఇళ్ల అద్దె ధరలు మూడింతలు అయ్యాయి. పరిశ్రమ పనుల కోసం 346 యంత్రాలు వచ్చాయి. వాటిని నడిపే కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కలిపి 524 మంది స్థానికంగా పనిచేస్తున్నారు. పది ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలు పనులు చేయిస్తున్నాయి. 12 స్టోన్‌ గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ, టెయిన్‌, హ్యుండయ్‌ ఇంజనీరింగ్స్‌, ఎంఎ్‌ఫఆర్‌ఏ వంటి కంపెనీలు ప్రధాన పనులు చేస్తుండగా... ఆర్‌బీఆర్‌, ఎస్‌కేకే, చక్రవర్తి, బాలాజీ, మోహన్‌ జీవన్‌, సీఅండ్‌డబ్ల్యూ కంపెనీలు సబ్‌కాంట్రాక్టులు తీసుకున్నాయి. కియ పరిశ్రమ వద్ద నుంచి పెనుకొండ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అక్కడ ఇళ్ల అద్దెలు మూడింతలు పెరిగాయి.
 
అన్నీ మంచి శకునములే...
కియ పరిశ్రమ ఉన్న అమ్మవారిపల్లె గ్రామానికి బెంగళూరు విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గొల్లపల్లి జలాశయం నుంచి ప్రత్యేక పైపులైను ద్వారా నీటి వసతి కల్పిస్తున్నారు. కియతోపాటు అనుబంధ పరిశ్రమల్లో కలిపి ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఇది ఉత్తుత్తి ప్రకటనలకు పరిమితం కాకుండా... కళ్లముందే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దీంతో కియ చుట్టూ భూములకే ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగింది.
Link to comment
Share on other sites

కియ... క్రియ!
 
 
636428542591263299.jpg
  • భూమి పూజకు ముందే పనుల జోరు.. దాదాపు పూర్తయిన భూమి చదును
  • వ్యర్థ జల శుద్ధి ప్లాంటు పని మొదలు.. పెయింట్‌, బాడీ షాప్‌ పనులూ షురూ
  • 30 ఎకరాల్లో ‘కొరియన్‌ టౌన్‌షిప్‌’.. 12 ఎకరాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రం
  • రాకపోకల కోసం 3 కిలోమీటర్ల ఆర్వోబీ.. వచ్చే నెలాఖరులో భూమి పూజ!
(అనంతపురం - ఆంధ్రజ్యోతి)
పదులకొద్దీ యంత్రాలు రణగొణ ధ్వనులతో
నిర్విరామంగా పనులు చేస్తున్నాయి. ఎగుడు దిగుడు
నేల చదునవుతోంది! నవ్యాంధ్రకు వరంలాంటి, కరువు సీమ అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చే ‘కియ’ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు జరుగుతున్న ముందస్తు
కసరత్తు ఇది! అక్కడి పనులపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న
ప్రత్యేక కథనం...
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! జాతీయ రహదారి 44 పక్కన పొలాలు, చిన్నపాటి గుట్టలతో కూడిన సుమారు 600 ఎకరాల స్థలం! ఇప్పుడు... ఆ స్థలం రూపు రేఖలు శరవేగంగా మారిపోతున్నాయి! కొండలు, గుట్టలు, పొలాలూ అన్నీ కలిసి... చక్కగా చదునవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ‘హ్యుండయ్‌’ కార్ల కంపెనీ మాతృసంస్థ ‘కియ’ ప్లాంటు నిర్మాణం కోసం స్థలం సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు నవంబరు నెలాఖరున భూమి పూజ జరగనుండగా... అంతకుముందే ప్రాజెక్టుకు సంబంధించిన అనేక పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సమీక్షిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం దీనిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. భూమి పూజకు దక్షిణ కొరియా ప్రముఖులతోపాటు ప్రధానమంత్రి మోదీ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
పనుల జోరు ఇలా...
కియ పరిశ్రమకు కేటాయించిన 600 ఎకరాల్లో ఏపీఐఐసీ అధికారులు 535 ఎకరాలు అప్పజెప్పారు. మిగిలిన భూమిని అప్రోచ్‌రోడ్లు, సర్వీసు రోడ్లు, మురుగు కాల్వలకు కేటాయించారు. భూమి చదును పనులను ఐదు దశల్లో చేపట్టగా... మూడు దశల పనులు పూర్తయ్యాయి. నాలుగో దశ పనులు 30 శాతం, ఐదో దశ పనులు 20 శాతం ముగిశాయి. కియ కేటాయించిన భూమిలో కొన్ని వంకలు కూడా ఉన్నాయి. వాటిని దారి మళ్లిస్తున్నారు. భూమి చదును పూర్తయిన చోట ఇప్పటికే పరిశ్రమకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. కొరియా నుంచి తెప్పించిన సామగ్రితో తాత్కాలిక పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్లకు వాడే పెయింట్‌ నిల్వ కోసం పెద్దఎత్తున గుంతలు తీసి కాంక్రీటుతో నిర్మాణాలు చేస్తున్నారు. బాడీ షాప్‌ కాంక్రీటు పనులు కూడా మొదలయ్యాయి. రోజుకు 68 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణమూ జరుగుతోంది.
 
భారీ యంత్రాల మోత..
పరిశ్రమకు సంబంధించిన పనులను 12 ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలు చేస్తున్నాయి. 24 భారీ సామర్థ్యం కలిగిన బుల్డోజర్లు, 55 ఎక్స్‌కవేటర్లు, 23 రాక్‌ బ్రేకర్లు, 150 డంప్‌ ట్రక్కులు, 39 డ్రిల్‌ మిషిన్లు, 18 రోలర్లు, 15 వాటర్‌ ట్రక్కులు, 9 మొబైల్‌ క్రషర్లు, 8 గ్రేడర్లు, 3 వీల్‌ లోడర్లు, ఐదు లైట్‌ మాస్ట్‌లు కలిపి మొత్తం 347 యంత్రాలను ఈ పనుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 524 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఆ భూమిలో ఉన్న సుమారు 10కి పైగా చిన్ని చిన్న గుట్టలను పిండి చేసి... చదునుగా మార్చారు. ఎగుడు దిగుడుగా ఉన్న భూమిని శరవేగంగా చదును చేసి అవసరమైన చోట్ల కాంక్రీటు వేస్తున్నారు.
 
కొరియా టౌన్‌షిప్‌...
కియ ప్లాంటులో పని చేస్తున్న, చేయనున్న కొరియా అధికారులు, సిబ్బంది కోసం... ఇక్కడే 30 ఎకరాల్లో పూర్తిగా వారి శైలిలో ప్రత్యేక టౌన్‌ షిప్‌ నిర్మిస్తున్నారు.ఇక్కడ కొరియా ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు క్యాంటీన్‌ కూడా సిద్ధమవుతోంది. దానికి అనుకునే... 12 ఎకరాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి సాధించిన ‘కియ’కు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. అటు... పరిశ్రమ వర్గాలు కూడా అదే స్థాయిలో, శరవేగంగా పనులు సహకరిస్తుండటం విశేషం. ఇక... కియకు అనుబంధంగా రానున్న సంస్థల కోసం 600 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి.
 
ఇది ‘కియా’ స్వరూపం..
అనంతపురం జిల్లాలో నిర్మించే నిర్మిస్తున్న ‘కియ’ ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ప్లాంటుగా గుర్తింపు తెచ్చుకోనుందని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.
 
  • జాతీయ రహదారి పక్కనే రెండు చదరపు కిలోమీటర్ల (రెండు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు) వైశాల్యంలో కియ ప్లాంటు ఏర్పాటవుతోంది.
  • పరిశ్రమ ప్రాంగణంలో 6.5 కిలోమీటర్ల పొడవునా కాల్వలు, ఏడు కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నారు.
  • రైల్వే క్రాసింగ్‌ దాటడానికి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటరుకు, టౌన్‌షి్‌పకు వెళ్లేందుకు అనువుగా జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల పొడవునా రూ.35 కోట్లతో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి.
శరవేగంగా మౌలిక వసతులు!
కియ పరిశ్రమ కోసం అవసరమైన మౌలిక వసతులను శరవేగంగా కల్పిస్తున్నాం. తాత్కాలిక నీటి అవసరాల కోసం గొల్లపల్లి రిజర్వాయరు నుంచి 8 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్‌ వేస్తున్నాం. ఈనెల 15న విద్యుత్‌ పనులకు టెండర్లు పిలుస్తున్నాం.
- పి.నాగేశ్వరరావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనజర్‌, అనంతపురం
 
 ఇది ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
కియ పరిశ్రమ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైనది. రౌడీయిజం, దౌర్జన్యం, వసూళ్ల వల్ల రాయలసీమకు పరిశ్రమలు రావు అనే అభిప్రాయం ఉంది. నా నియోజకవర్గంలో ఏ నాయకులూ జోక్యం చేసుకునే అవకాశమే లేదు. ఇక్కడ ఎవరి దందాలూ పనిచేయవు. పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించేందుకు నేను ముందుంటాను. మా ప్రాంతానికి భారీగా ఉద్యోగాలు వస్తున్నాయంటే అంతకంటే నాకేం కావాలి.
- బీకే పార్థసారథి, ఎమ్మెల్యే
Link to comment
Share on other sites

శరవేగంగా కియా ప్లాంట్ పనులు...

 

 
kia-06102017.jpg
share.png

కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది.

పెనుకొండ మండలంలో పరిశ్రమకు అవసరమైన భూమిని అధికారులు కేటాయించారు. అమ్మవారిపల్లి, ఎర్రమంచి, పరిసర భూముల్లో 599 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. ఇందులో 535 ఎకరాలు కియా పరిశ్రమకు అప్పగించగా.. మిగిలిన భూమిని రోడ్డు, ఇతర మౌలిక వసతులకు ఉపయోగించేలా ప్రణాళిక తయారు చేశారు. పరిశ్రమకు కేటాయించిన భూముల్లో చదును, విద్యుత్‌ కోసం 220కేవీ సబ్‌స్టేషన్‌, వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణం చేపట్టారు.

 

జూలై నెలాఖరుకు భూమి చదును పనులు పూర్తి చేసి ఆగస్టు నుంచి పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కియా ప్రతినిధులు తెలిపారు. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

పనుల వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కియా ప్రతినిధులతో, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. వచ్చే నెలలో ప్రధాని కియా కంపెనీ భూమి పూజకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి..

ఈ పరిశ్రమలో 4 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 7 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తారు. పరోక్షంగా మరో 11 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సమాచారం.

దక్షిణకొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ 15వ ప్లాంటు కోసం దేశంలోని పలు రాష్ర్టాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు గట్టిగా పోటీపడ్డాయి. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆ పరిశ్రమను అనంతపురం జిల్లాకు వచ్చేలా చేశారు.

21743378_10209632575120999_2813585093933

21462515_10209632573040947_8430431890810

21686410_1435261456527117_25782923878416

21761615_1435261593193770_48404073008847

21686280_1435261633193766_76040672985719

21617680_1435261703193759_33902849433014

DEbyNQrVwAAs4ED.jpg

Link to comment
Share on other sites

రెండు అంశాలపై ప్రతినిధులకు వివరించిన మంత్రి
 
 
636437686804207580.jpg
అమరావతి: కియా మోటార్స్, హుండాయ్ మోబిస్, ఎస్ఎల్ గ్రూప్ సుంగ్ వూ కంపెనీ ప్రతినిధులతో మంత్రి అమరనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్, మౌలిక వసతుల ప్రత్యేక ప్రతినిధి ఆర్. ప్రీతమ్‌రెడ్డి పాల్గొన్నారు. పెనుగొండ దగ్గర కియా మోటార్స్ కంపెనీ పనులు, ప్రభుత్వ సహాయ సహకారాలపై కంపెనీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, రాయితీల గురించి హుండాయ్ మోబిస్, ఎస్ఎల్ గ్రూప్ ప్రతినిధులకు మంత్రి వివరించారు.
Link to comment
Share on other sites

వాహనరంగానికి ప్రధాన కేంద్రంగా ఏపీ

భారీగా పెట్టుబడులు పెట్టండి

అన్ని విధాలా సహకారం అందిస్తాం

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి

సియోల్‌లో విడిభాగాల తయారీ సంస్థలతో భేటీ

16ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: వాహన రంగానికి (ఆటోమొబైల్‌) నవ్యాంధ్ర ప్రధాన కేంద్రంగా మారబోతోందని, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంబంధిత సంస్థలు ముందుకు రావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి దక్షిణ కొరియా సంస్థలకు పిలుపునిచ్చారు. సియోల్‌లో సోమవారం కియా మోటార్స్‌కు విడిభాగాలు తయారు చేసి అందించే సంస్థలతో మంత్రి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. కియా మోటార్స్‌ సంస్థ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు సంబంధించి భూమి అభివృద్ధి చేస్తున్న తీరును మంత్రి వివరించారు. అనుమతుల మంజూరు మొదలు, భూముల కేటాయింపు వరకు ప్రభుత్వం అన్ని విధాలాసహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ అహ్మద్‌ బాబు మాట్లాడుతూ కియా కార్ల కంపెనీకి విడి భాగాలు తయారు చేసే సంస్థల కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించిందని, ఆ భూములను కూడా ఈ సంస్థ సూచనల మేరకు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ మాట్లాడుతూ ఆటోమొబైల్‌ రంగానికి అనంతపురం ఒక ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల ప్రత్యేక ప్రతినిధి ఆర్‌. ప్రీతమ్‌రెడ్డి, కియా మోటార్స్‌కు విడిభాగాలు తయారు చేసే అనుబంధ సంస్థలు హ్యూండాయ్‌ మోబిస్‌, ఎస్‌ఎల్‌ గ్రూపు, సంగ్‌ వూ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భూములు అభివృధ్ధి చేసి అప్పగించిన వెంటనే తాము తమ యూనిట్ల పనులు మొదలుపెడతామన్నారు. కియా విడిభాగాల కోసం ఏకంగా 18 అనుబంధ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ కంపెనీలు రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా దాదాపు 8500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

Link to comment
Share on other sites

పెట్టుబడులకు కొరియా ఆసక్తి
19-10-2017
 
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కరువు జిల్లా అనంతపురంలో కియా మోటార్స్‌ను స్థాపించడంలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు కొరియా పారిశ్రామిక వేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొరియాలో పర్యటిస్తున్నపరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథరెడ్డి బృందానికి అక్కడి పారిశ్రామిక వేత్తల మంచి స్పందన లభించింది. స్థానిక పారిశ్రామిక వేత్తలు మంత్రితో భేటీ అయ్యారు. రెండు నుంచి పది బిలియన్‌ డాలర్ల దాకా ఆహార తయారీ ఉత్పత్తి సంస్థలను స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు వివరించారు. భారత దేశం నుంచి తాము వ్యవసాయోత్పత్తులను కొనుగోలుచేసి, వాటిని ప్రాసెసింగ్‌ చేసేందుకు వియత్నాం పంపుతున్నామని, రవాణా చార్జీలకే అత్యధికంగా వ్యయం చేస్తున్నామని ఆ వర్గాలు వివరించాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
 
‘అనంత’కు కొరియా కంపెనీల క్యూ
01-11-2017 04:11:46
 
  • 10న 20 కంపెనీల పర్యటన
  • ఇప్పటికే 19 అనుబంధ సంస్థల రాక
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ సంస్థలకు అనంతపురం జిల్లా ఖిల్లాగా మారుతోంది. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియ’ అనంతపురం జిల్లాలో ప్లాంటు ఏర్పాటు పనులను జోరుగా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సులభ వాణిజ్య సరళి విధానాల గురించి ‘కియ’ ద్వారా తెలుసుకున్న దాని అనుబంధ సంస్థలు 19... ఏపీలో వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు సీఎంతో చర్చలు జరపగా... మరిన్ని కొరియా సంస్థలు రాష్ర్టానికి వచ్చేందుకు వరుస కడుతున్నాయి. 20 ప్రముఖ సంస్థలు నవంబరు 9వ తేదీన విజయవాడకు రానున్నాయి. పదో తేదీన అవి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నాయి. ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే 12,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...