Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply

అనంతపురం నుంచి ‘కియా’కార్లు 

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం

అమరావతి: నవ్యాధ్రంలోని అనంతపురం జిల్లా నుంచి 2019 ప్రథమార్థంలో కియా కార్లను ఉత్పత్తి చేస్తామని ‘కియా మోటార్స్‌’ అధ్యక్షులు హాన్‌ వూ పార్క్‌ తెలిపారు. చిన్న కార్ల విపణిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్ల కంపెనీ ‘కియా మోటార్స్‌’ తాము ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కియా మోటార్స్‌ అధ్యక్షులు హాన్‌ వూ పార్క్‌లు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల విస్తీర్ణంలో కియా కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ.13వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పార్క్‌ మాట్లాడుతూ 1944లో ప్రారంభమైన కియా తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను సాధించిందన్నారు. 3.5 మిలియన్‌ కార్లను ఉత్పత్తి చేస్తూ 45 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ ఉన్న సంస్థగా కియా ఎదిగిందన్నారు. ప్రపంచ విపణితో ఒక దిగ్గజ కార్ల కంపెనీగా ఉన్న కియా ఉత్పత్తి చేసే కార్లలో 82 శాతం మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో కియా కార్లకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని తాము ప్రపంచవ్యాప్తంగా కంపెనీ విస్తరణ కార్యకలాపాలు నిర్వహించామన్నారు. 14 తయారీ యూనిట్లు, 5 అసెంబ్లింగ్‌ యూనిట్లున్న కియా తాజాగా అనంతపురం జిల్లాలో కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇది పూర్తిగా భారతీయ మార్కెట్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న పరిశ్రమ అన్నారు.

ఈ ప్లాంటు నిర్మాణాన్ని 2019 ద్వితీయార్థం కల్లా పూర్తి చేసి, కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతపురంలో ఏర్పాటు చేసే తమ పరిశ్రమ పర్యావరణ అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ ప్లాంటు నుంచి ఏటా 3లక్షల కార్లను తయారు చేస్తామన్నారు. దీనిద్వారా ఆ ప్రాంతంలో ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారతదేశంలో ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి తమకు అనుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌, కియా ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తాయని అన్నారు. ‘ఈ రోజు ఏపీ-కియా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖిస్తుంది’ అన్నారు. కార్ల మార్కెట్‌కు సంబంధించి భారత్‌ ప్రపంచంలో ఐదో పెద్ద మార్కెట్‌ అని, ఇక్కడ డిమాండుకు తగ్గట్టు కార్లను ఉత్పత్తి చేయడంతో పాటు అంతర్జాతీయంగా కూడా కార్లను ఎగుమతి చేస్తామన్నారు.

ఇదో గొప్ప మైలురాయి: చంద్రబాబు 
రాష్ట్ర ఆటో మొబైల్‌ రంగానికి సంబంధించి ‘కియా’ రాక ఒక గొప్ప మైలురాయిగా మిగులుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో వెనుకబడిన అనంతపురం జిల్లాకు ‘కియా’ రాకవల్ల ఆ జిల్లా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించనుందన్నారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న కియా మోటార్స్‌ రాష్ట్రానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంస్థ ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. ఈ ప్లాంటు ద్వారా 4వేల మందికి శాశ్వత ఉద్యోగాలు, 7వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. నైపుణ్యేతర మానవ వనరులను పూర్తిగా స్థానికంగా ఉండే వారినే తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తామని, అలాగే మిగిలిన ఉద్యోగాల్లోనూ మొదటి ప్రాధాన్యం స్థానికులకే ఉంటుందన్నారు. ఈ ప్లాంటుకు సంబంధించి తాము కేవలం ఎంఓయూతో వదిలేయడం లేదని, ఇకపై ప్రతి నెలా నాలుగో సోమవారం ‘కియా ప్లాంటు ప్రగతి’పై సమీక్షిస్తానన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఈ ప్రాజెక్టుకు సంబంధించి నోడల్‌ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు. 2018 చివరి త్రైమాసికంలోనే ఈ ప్లాంటు నుంచి ట్రయల్‌ ఉత్పత్తి జరిగేలా తాము కృషి చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

గొల్లపల్లి రిజర్వాయర్ అందుబాటులో ఉండడంతో కియో కంపెనీ అనంతపురం జిల్లాకు వచ్చిందని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Hope Changan works out next!! This news was from 2016

 

China’s Changan Automobile Company is planning to set up its first India factory, with a capacity to manufacture 200,000 vehicles a year. The company recently visited Andhra Pradesh and Tamil Nadu and, according to sources, is looking for a local partner.

Changan Automobile Company, China’s oldest automobile manufacturer, is headquartered in Chongqing. The company is a state-owned enterprise, which manufactures cars ranging from entry-level hatchbacks to sedans to sport utility vehicles to vans to pick-up trucks. It also has a range of electric and hybrid vehicles.

 

It has six manufacturing bases in China and four research and development centres at Turin in Italy, Yokohama in Japan, Nottingham in England and Detroit in US.

Link to comment
Share on other sites

కియా కారెక్కిన అనంత

2019 ద్వితీయార్ధంలో ఉత్పత్తి

90 శాతం విక్రయాలు భారతీయ మార్కెట్‌లోనే

‘కియా మోటార్స్‌’ అధ్యక్షుడు హాన్‌ వూ పార్క్‌

సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం

12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగంలో ఇదో మైలు రాయి: బాబు

ఈనాడు - అమరావతి

27ap-main1a.jpg

నవ్యాంధ్రలోని అనంతపురం జిల్లా నుంచి 2019 ద్వితీయార్థంలో కియా కార్లను ఉత్పత్తి చేస్తామని ‘కియా మోటార్స్‌’ అధ్యక్షులు హాన్‌ వూ పార్క్‌ తెలిపారు. చిన్న కార్ల విపణిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్ల కంపెనీ ‘కియా మోటార్స్‌’ తాము ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, కియా మోటార్స్‌ అధ్యక్షులు హాన్‌ వూ పార్క్‌లు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల విస్తీర్ణంలో కియా కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఆ సంస్థ రూ.13వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పార్క్‌ మాట్లాడుతూ తమకు 14 తయారీ యూనిట్లు, 5 అసెంబ్లింగ్‌ యూనిట్లుండగా తాజాగా అనంతపురం జిల్లాలో కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 90 శాతం విక్రయాలు భారతీయ మార్కెట్‌లోనే ఉంటాయన్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని 2019 ద్వితీయార్థం కల్లా పూర్తి చేసి, కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్లాంటులో ఏటా 3లక్షల కార్లను తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి తమకు అనుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌, కియా ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తాయని అన్నారు.

ఇదో గొప్ప మైలురాయి: చంద్రబాబు: రాష్ట్ర ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి ‘కియా’ రాక ఒక గొప్ప మైలురాయిగా మిగులుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో వెనుకబడిన అనంతపురం జిల్లాకు ఈ సంస్థ రాకవల్ల ఆ జిల్లా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించనుందన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ రాష్ట్రానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. ఈ ప్లాంటు ద్వారా 4వేల మందికి శాశ్వాత ఉద్యోగాలు, 7వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. నైపుణ్యేతర మానవ వనరులను పూర్తిగా స్థానికంగా ఉండే వారినే తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తామని, అలాగే మిగిలిన ఉద్యోగాల్లోనూ మొదటి ప్రాధాన్యం స్థానికులకే ఉంటుందని చెప్పారు. ఈ ప్లాంటుకు సంబంధించి తాము కేవలం ఎంవోయూతో వదిలేయడం లేదని, ఇకపై ప్రతి నెల నాలుగో సోమవారం ‘కియా ప్లాంటు ప్రగతి’పై సమీక్షిస్తానన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఈ ప్రాజెక్టుకు సంబంధించి నోడల్‌ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు. 2018 చివరి త్రైమాసికంలోనే ఈ ప్లాంటు నుంచి ట్రయల్‌ ఉత్పత్తి జరిగేలా తాము కృషి చేస్తామన్నారు.

అధికారులకు అభినందనలు: ఈ సంస్థ రాష్ట్రానికి రావడానికి విజయవంతంగా కృషి చేసిన అధికార్లను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమల కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. పరిశ్రమల శాఖ మాజీ సంచాలకుడు కార్తికేయ మిశ్రా కృషిని ప్రశంసించారు. వారితో పాటు ఈ పరిశ్రమ రాష్ట్రానికి రప్పించేలా కృషి చేసిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య, ఎండీ నివాస్‌ తదితరులను అభినందించారు. సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ మాట్లాడుతూ కియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 630 ఈ-మెయిళ్ల ద్వారా సంప్రదింపులు జరిగాయన్నారు. దిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌లో ఈ ప్రతిపాదనలు విని దానికి అక్కడే ఆమోదం తెలిపారన్నారు. సీఎం ఇచ్చిన ప్రోత్సాహ ఫలితమే ఇప్పుడు ఈ ఎంఓయూ అని ఆరోఖ్యరాజ్‌ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పరిటాల సునీత, గంటా శ్రీనివాస్‌రావు, పితాని సత్యనారాయణ, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎక్సైజు శాఖ మంత్రి జవహర్‌, పరిశ్రమల శాఖ సంచాలకులు సిద్ధార్థ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

సైకిళ్ల నుంచి కార్ల విపణి వరకు

ఏటా 3 మిలియన్‌ వాహనాల తయారీ

ప్రతి 53 సెకన్లకు ఒక కారు తయారీ

ఇదీ... కియా కంపెనీ ప్రస్థానం

ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లాలో అడుగుపెట్టనున్న ‘కియా’ కార్ల కంపెనీకి ప్రపంచంలో ఎంతో పేరుప్రఖ్యాతులున్నాయి. చిన్న కార్ల విపణిలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఈ కంపెనీ భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది ఇప్పటికి సాకారమైంది. ఈ కంపెనీని తమ రాష్ట్రాలకు తీసుకెళ్లాలని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడ్డాయి. చివరకు వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కంపెనీని అనంతపురం తీసుకురాగలిగింది.

కియా కంపెనీ ప్రస్థానం గురించి క్లుప్తంగా...

* 1944లో దక్షిణ కొరియాలోని సియోల్‌లో ‘కియా’ కంపెనీ ఆరంభమైంది. ‘క్యాంగ్‌ సంగ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ’ అనే సంస్థ మొదట్లో దీన్ని ప్రారంభించింది. ఈ సంస్థ దక్షిణ కొరియాలో సైకిళ్లు, వాటి విడిభాగాలను తయారు చేసేది.

* 1952లో సంస్థ పేరును ‘కియా’ ఇండస్ట్రీస్‌గా మార్చారు.

* 1986లో కేవలం 26 కార్లను తయారు చేస్తే మరుసటి ఏడాది ఏకంగా 95వేల కార్లను తయారు చేసింది.

* 1997లో ఆసియాలో వచ్చిన ఆర్థిక సంక్షోభ సమయంలో దివాలా తీసింది. ఆ సమయంలో హ్యూందాయ్‌ కార్ల కంపెనీ దీనిని తీసుకుంది. దాంతో మళ్లీ దశ తిరిగింది.

* దక్షిణ కొరియాలో ఇప్పుడు ఈ సంస్థ రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ.

* టర్నోవర్‌ 45 బిలియన్‌ డాలర్లు.

* దీనికి మొత్తం 14 ప్రాంతాల్లో కార్ల తయారీ యూనిట్లున్నాయి. చైనా, మెక్సికో, అమెరికా తదితర ఐదు ప్రాంతాల్లో అసెంబ్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది.

* కియా నుంచి ప్రతి 53 సెకన్లకు ఒక కారు తయారు అవుతుంటుంది.

* మొత్తం 51వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

* అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే తయారీ యూనిట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని అంచనా.

Link to comment
Share on other sites

కియ.. వచ్చిందయా!
 
636289434103076406.jpg
  • హ్యుండయ్‌ కార్ల తయారీ కేంద్రంగా రాష్ట్రం 
  • దక్షిణ కొరియా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం 
  • చరిత్రాత్మకమైన రోజుగా పేర్కొన్న సీఎం 
  • నిజాయితీగా.. పారదర్శకంగా అనుమతులు 
  • ప్రతి నెలా 4వ సోమవారం కియపై సమీక్ష 
  • నోడల్‌ అధికారిగా అనంతపురం కలెక్టర్‌ 
  • 2019 తొలి అర్ధభాగంలోనే కార్ల ఉత్పత్తి 
  • సంస్థలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే 
  • మా శ్రమ ఫలితంతోనే రాష్ట్రానికి కియ 
  • ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీ : చంద్రబాబు 

ఈ బంధం ఎంతో పటిష్ఠం
‘‘కియ ప్లాంటు ఏర్పాటుకు పలు రాష్ట్రాల నుంచి యాజమాన్యంపై ఒత్తిడి వచ్చింది. అయితే ఆంధ్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, విశ్వసనీయత, వంటి అంశాలను పరిశీలించాక రాష్ట్రంలోనే తమ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కియ యాజమాన్యం ముందుకొచ్చింది. ఇక ఏపీకి, కియకు వివాహం జరిగిపోయినట్లే.’’

- ముఖ్యమంత్రి చంద్రబాబు 

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న ‘కియ’తో ఒప్పందం చేసుకొన్న ఈ రోజు చరిత్రాత్మకమైనది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి - అమ్మవారిపల్లి ప్రాంతంలో రూ.13 వేల కోట్లతో కియ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సంస్థ యాజమాన్యానికి.. ప్రభుత్వానికి మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియాకు చెందిన కియ సంస్థ ప్రెసిడెంట్‌ - సీఈవో హూమ్‌ వూ పార్క్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియరాజ్‌ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి, పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో హ్యుండయ్‌ కార్ల ఉత్పతిక్తి అంకురార్పణ జరిగినట్లయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించారు. తమ తమ రాష్ట్రాల్లో కియ ప్లాంటు స్థాపించాలంటూ సంస్థ యాజమాన్యంపై ఒత్తిడి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. అయితే, ఏపీ ప్రభుత్వంలోని చిత్తుశుద్ధి, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రంలోనే తమ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కియ యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. ఏపీకి, కియకు వివాహం జరిగినట్టేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి అనుమతుల జారీలో పారదర్శకంగా.. నిజాయితీగా వ్యవహరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తానన్నారు. ప్రతి నెలా నాలుగో సోమవారం ‘కియ’పై సమీక్ష నిర్వహిస్తానన్నారు. ప్లాంటు పూర్తయ్యేంత వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అనంతపురం కలెక్టర్‌ వీరపాండ్యన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని చంద్రబాబు ప్రకటించారు. కియ కార్ల తయారీ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 14 ప్లాంట్లు ఉన్నాయని, ఏపీలో ఏర్పాటు చేస్తున్నది 15వ ప్లాంటని తెలిపారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా మార్చానని .. ఏపీని ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తానన్నారు. కియ రాకతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెద్ద దన్ను లభించిందన్నారు. రానున్న 15 ఏళ్లలో రాష్ట్రం 15 శాతం వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
స్థానికులకు ఉపాధి
సుమారు రూ.13 వేల కోట్లు పెట్టుబడితో స్థాపించే ఈ ప్లాంటులో 4000 మందికి శాశ్వతంగా, 7000 మందికి తాత్కాలికంగా ఉపాధి లభిస్తుందని చంద్రబాబు వివరించారు. కియ ప్లాంటులో 90 శాతం మేర స్థానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎగ్జిక్యూటివ్‌ తరహా ఉద్యోగాల్లో మాత్రమే స్థానికేతరులు ఉండే అవకాశముందని సీఎం స్పష్టం చేశారు. కియ ప్లాంటుకు సమీపంలో ఉద్యోగుల కోసం టౌన్‌షిప్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారని, ఈ సంస్థలో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను రాష్ట్ర స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ స్థానిక యువతకు అందజేస్తుందని సీఎం వివరించారు.
కియ కార్ల తయారీ యూనిట్‌ను రాష్ట్రానికి రప్పించడంలో తీవ్రస్థాయిలో కృషి చేశామని, ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగిసిపోలేదని సీఎం చెప్పారు. ఏడాదిన్నరగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, శ్రమించిన ఫలితంగానే రాష్ట్రానికి కియ వచ్చిందన్నారు. సుమారు 630 ఈ మెయిల్స్‌ సంప్రదింపులు, ఐదు సార్లు కియ యాజమాన్యంతో ద్వైపాక్షిక భేటీలు, సంస్థ ప్రెసిడెంట్‌తో తాను నేరుగా 2 సార్లు సమావేశం కావడంతో కియ రాష్ట్రానికి వచ్చిందన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియ రాజ్‌, కొద్దికాలంపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కార్తాకేయ మిశ్రా, సీఎంఓ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌ తదితరులు నిరంతరం కియ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని సీఎం వివరించారు. ఇప్పటికే దాదాపు 100 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. కియ నుంచి 2019 ద్వితీయార్థంలో వాణిజ్యపరంగా కార్ల ఉత్పత్తి జరుగుతుందని యాజమాన్యం చెబుతోందని, కానీ 2018 ముగింపు నాటికి ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసి, 2019 మొదటి క్వార్టర్‌లోనే కార్లను విక్రయాలకు సిద్ధం చేయాలని తాము కోరుతున్నామన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ నాలుగు, లేదా ద్విచక్రవాహనం ఉండాల్సిందేనని ఆ దిశగా తలసరి ఆదాయంలోనూ.. వృద్ధి రేటులోనూ పెరుగుదల కన్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
పరస్పర ప్రయోజనం: కియ ప్రెసిడెంట్‌ పార్క్‌
రాష్ట్రంలో కియ ప్లాంటు ఏర్పాటు వల్ల ఏపీకీ, సంస్థకూ పరస్పర ప్రయోజనం చేకూరుతుందని కియ ప్రెసిడెంట్‌ పార్క్‌ చెప్పారు. సీఎం చంద్రబాబు పారదర్శక పాలన, 9babu-kia.jpgదూరదృష్టి కారణంగానే తాము ఏపీలో ప్లాంటును స్థాపిస్తున్నామని పార్క్‌ వివరించారు. ఏపీ ప్లాంటులో ఏటా 3 లక్షల కార్లను తయారు చేస్తామని, ఇందులో 90 శాతం దేశీయ మార్కెట్లోనే విక్రయిస్తామన్నారు. కియ ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్త శకం మొదలైందని పార్క్‌ ప్రకటించారు. అట్టహాసంగా జరిగిన ఒప్పంద కార్యక్రమానికి మంత్రులు ఎన్‌. అమర్నాథ రెడ్డి, కామినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కిమిడి కళావెంకటరావు, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత, యువజన సర్వీసుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌, ఏపీఐఐసీ వీసీఎండీ నివాస్‌, అనంతపురం కలెక్టర్‌ వీర పాండ్యన్‌ తదితరులు హాజరయ్యారు. ‘కియ’ సంస్థ ప్రెసిడెంట్‌-సీఈవో హూమ్‌ వూ పార్క్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్యుంగ్‌యూన్‌ పార్క్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కూక్‌ హైయున్‌ షిన్‌, తదితరులతో కూడిన 15 మంది సభ్యుల బృందం పాల్గొంది.
Link to comment
Share on other sites

Kia, Changan, Beiqi Foton, Daihatsu and other car makers knocking on India's doors

 

MUMBAI: Half a dozen car makers making a beeline to enter India in the next 3-4 years including South Korea’s Kia Motor, Daihatsu from Toyota, PSA Group's Peugeot Citreon and three car makers from China, Beiqi Foton, SAIC and Changan Automotive, who are devising an India strategy to be part of market set to be the third largest in the world by the end of the decade.

 

Eight people privy to the launch plans of these car makers ET spoke with said Kia Motor would be the first to announce its entry in India. The company is close to finalising the location in Andhra Pradesh for its plant and is set to launch its cars in India by 2019.

 

Daihatsu and Toyota has just kicked off the emerging markets compact car company to plan products for the emerging markets like India while PSA Group will finalise its India partnership by 2018 with an eye on 2020-2021 roll-out.

 

Chinese Beiqi Foton which originally acquired a land in Chakan, Pune, to enter the Indian commercial vehicle space, decided to shift focus and bring in passenger vehicles under Borgward brand. The company has already started discussing with vendors a plan to localise a large Van and clutch of SUVs in India by 2019-2020.

 

Foton’s compatriot and rival Changan too is close to finalising the plant for India, likely to come up in Andhra Pradesh – in an around Sri City. Changan will be entering the fast growing B segment SUV space by 2019-2020 in India to take on Hyundai’s Creta and Maruti Suzuki’s Brezza

Link to comment
Share on other sites

Hard Work That Went in Bringing KIA Motors to AP Andhra Pradesh Government the other day has entered into a Landmark MOU with Kia Motors, the fifth biggest Automobile manufacturer in the World. The South Korea-based company selected AP as its home for its first ever plant in India and will be making a whopping 13000 Crore investment and will provide 10000 Employment Opportunities. Chandrababu government managed to get it competing with several other states. Andhra Pradesh government has formed a Special Team to negotiate with Kia Motors and convince them to ground the project in AP. Over 630 emails were exchanged and Kia team took up multiple site visits. The entire follow-ups were done in utmost secrecy. Numerous Conference calls and months of hard work ensured that the deal is clinched. The plant will come up near Erramanchi Village of Anantapur in 600 acres. Close Proximity to Chennai and Port and access to water from Gollapalli Reservoir helped the project come to AP.

 

Link to comment
Share on other sites

అనంత బాహుబలి
అనంతకు అతిపెద్ద ప్రాజెక్టు కియా
ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందం
జూన్‌ నుంచి నిర్మాణ పనులు
ఈనాడు - అనంతపురం
kiaatp.jpg

బాహుబలి.. భారత దేశ సినీ చరిత్రను ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన భారీ చలనచిత్రం. తెలుగువాడి ప్రతిభకు తార్కాణంగా.. సృజనకు ప్రతిరూపంగా.. రంగుల లోకంలో ధ్రువతారలా నిలిచింది. దర్శక నిర్మాతలకు కాసులు కురిపించడమే కాదు.. వేలాది మందికి ఉపాధిని, వందలాది మంది సాంకేతిక నిపుణులు, నటులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. కోట్లాదిమంది ఆసక్తితో ఎదురుచూస్తున్న బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలవుతున్న శుభ సందర్భంగా అనంతకూ ఓ బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్‌ దక్కింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అనంతవాసులకు తీపికబురు అందింది. జిల్లాకే తలమానికంగా నిలిచేలా కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సదరు కార్ల సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో వేలాది మంది యువతకు మెండుగా ఉపాధి లభించనుంది. అనంతకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఈ పరిశ్రమ జిల్లా ప్రగతికి బాహుబలి అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పరిశ్రమ పేరు: కియా
ఏర్పాటు చేసే ప్రాంతం: పెనుకొండ మండలం ఎర్రమంచి

పెట్టుబడి లక్ష్యం: రూ.13 వేల కోట్లు

ఏడాదికి కార్ల తయారీ: 3 లక్షలు

ఉపాధి: 11 వేల మందికి

అనంత ప్రగతికి మరో అడుగు పడింది.. అనంతపురానికి భారీ పరిశ్రమ వచ్చేసింది.. ఇక్కడికి కార్లు తయారు చేసే పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జిల్లాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. పెనుకొండ మండల పరిధిలోని ఎర్రమంచిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కియా సంస్థ, ప్రభుత్వంతో గురువారం రాజధానిలో అవగాహన ఒప్పందం కుదిరింది. వివిధ రాష్ట్రాలు ఈ పరిశ్రమ కోసం విశ్వప్రయత్నాలు చేశాయి. మన రాష్ట్రంలో కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాలవైపు ఆ సంస్థ చూసింది. అయితే పెనుకొండ పరిధిలో ఉన్న వివిధ వనరులు, రవాణా సదుపాయాలు ఆకట్టుకోవడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఆ సంస్థకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దీంతో కియా పెనుకొండవైపే మొగ్గు చూపింది. ఈ పరిశ్రమ రాకతో జిల్లాలో పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

జూన్‌ నుంచే పనులు..
ఎర్రమంచిలో ఏర్పాటు చేయనున్న కియా కార్ల పరిశ్రమలో ఆ సంస్థ రూ.13 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభించనుంది. దీనికితోడు మున్ముందు జిల్లాలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా పారిశ్రామిక ప్రగతికి దోహదపడనుంది. ఈ పరిశ్రమ నిర్మాణం 2019, ద్వితీయార్థం (జూన్‌ నాటికి) పూర్తిచేసి కార్ల తయారీ ఆరంభించనున్నారు. ఇక్కడ ఏడాదికి 3 లక్షల కార్లు తయారు చేసి దేశీయ మార్కెట్‌కు పంపనున్నారు. మరోవైపు ఈ పరిశ్రమ నిర్మాణ పనులు రానున్న జూన్‌ నుంచే ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఇతర ఏర్పాట్లను జిల్లా అధికారులు శరవేగంగా చేయాల్సి ఉంది.

అన్నింటికీ అనువుగా..
పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల్లో కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే బెంగళూరు విమానాశ్రయం ఉంది. అలాగే పరిశ్రమకు అవసరమైన నీటిని సమీపంలోని గొల్లపల్లి జలాశయం నుంచి సమకూర్చనున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ జలాశయానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి నింపారు. ఈ జలాశయ కనీస నీటినిల్వ సామర్థ్యం 0.6 టీఎంసీలు కాగా, కియాకు ఏడాది 0.3 టీఎంసీ వరకు నీరు అవసరమవుతుంది. జలాశయం నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేసి, నీటిని ఇవ్వనున్నారు. అలాగే 600 ఎకరాల్లో ప్రభుత్వ భూమితోపాటు పట్టా, డీకేటీల భూసేకరణకు ఇప్పటికే ధర కూడా నిర్ణయించారు. గత కలెక్టర్‌ శశిధర్‌, జేసీ లక్ష్మీకాంతం రైతులతో చర్చలు జరిపి, ఎకరాకు రూ.10.5 లక్షలు ఇచ్చేలా ఒప్పించారు. అలాగే 600 ఎకరాలు చదునుచేసి కియా సంస్థకు అప్పగించాల్సి ఉంది. ఈ పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఇటీవల టెండర్లు కూడా పిలిచింది. త్వరలో పనులు మొదలుకానున్నాయి. అలాగే ఆ భూముల నుంచి మూడు వాగులు వెళ్తున్నాయి. ఇవి సమీపంలోని ఓ చెరువులో కలుస్తాయి. ఆ వాగులను దారి మళ్లించనున్నారు. ఇందుకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విద్యుత్తు లైన్లను మార్చాల్సి ఉంది. కియా సంస్థకు అవసరమైన విద్యుత్తు సబ్‌స్టేషన్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఈ పనులన్నీ జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కియా సంస్థ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని తెలిసింది.

జిల్లాకే తలమానికం
కియా కార్ల పరిశ్రమ జిల్లాకే తలమానికం కానుంది. సాధారణంగా ఓ ఆటోమొబైల్‌ పరిశ్రమ వచ్చిందంటే, ఇతర సంస్థలు కూడా దృష్టి పెడతాయని అధికారులు చెబుతున్నారు. కియా ప్లాంట్‌ ఏర్పాటు, జిల్లాలో పలు పరిశ్రమల రాకకు నాంది పలకనుంది. దీంతో పెనుకొండ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు వీలుకలగనుంది. మరోవైపు ఈ పరిశ్రమ జిల్లాకు రావడంలో గత కలెక్టర్‌ శశిధర్‌ తనవంతుగా శ్రమించారు. ఆ సంస్థ ప్రతినిధుల సూచనల మేరకు వసతుల కల్పనకు శరవేగంగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. అలాగే పరిశ్రమలశాఖ తరఫున ఉన్నతాధికారుల బృందంతోపాటు, శశిధర్‌ కూడా ఈ ఏడాది జనవరిలో దక్షిణ కొరియా వెళ్లారు. అక్కడ కియా సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న వనరులు, తాము కల్పించబోయే వసతులను ఈ బృందం వివరించింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులను కాదని ఆ సంస్థ చివరకు మన రాష్ట్రాన్ని, అందులోనూ అనంతపురాన్ని ఎంపిక చేసుకుంది.

Link to comment
Share on other sites

1. Korean small car maker Kia Motors will invest $2 billion (about Rs 12,000 crore) on its first plant in India coming up in Erramanchi, Anantapur District 

2. Kia’s manufacturing unit in Andhra Pradesh will be built to produce 300,000 units every year 

3. Construction of the new factory will commence in the final quarter of this calendar year and is expected to begin production in the second half of 2019

4. Spread over 563 acres, Kia’s manufacturing plant will also be home to numerous supplier companies' facilities

5. Andhra Pradesh faced stiff competition from Maharashtra, Tamil Nadu and Karnataka to come up trumps 

6. The state government has extended a host of incentives for the company, treating Kia's investment as an ultra-mega project

7. The region's leadership, fast-developing supply chain network and skilled labor force were key reasons for the new investment by Kia Motors, its officials said 

8. Kia plans to produce a compact sedan and compact SUV for the Indian market. Both segments are seeing a lot of action and these vehicles also enjoy a lower excise duty, compared to large sedans and SUVs

9. Han-Woo Park, president of Kia, said the investment would enable them to sell cars in the world's fifth largest market, while providing greater flexibility for the global business 

10. Kia's parent company is Hyundai, this country's second biggest car maker, with 17 per cent market share

11. Kia sells a little more than three million vehicles a year from 14 manufacturing and assembly operations in five countries; it has annual revenue of $45 billion

12. India is expected to emerge as the third biggest market in the world by 2020, with annual volume of five million units, and Kia will be well placed to earn a big pie in that 

13. The plant will create 10000 direct jobs and 15000 indirect jobs for the local residents

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...