Jump to content

Kia in Anantapur !


Recommended Posts

  • Replies 900
  • Created
  • Last Reply

Idi maatram....great turning point.

 

Auto industry by nature accumulates in the same place.....

 

One auto plant..suppliers (ancillaries) around that plant......more auto plants...cycle..

Yes bro suppliers increase aithe job opportunities will be more in and around ananthapur

Link to comment
Share on other sites

ఏపీలో ఆటోమొబైల్‌ ఎకో సిస్టమ్‌కు నాంది: చంద్రబాబు
 
636288963214289193.jpg
అమరావతిః ఏపీలో ఆటోమొబైల్‌ ఎకో సిస్టమ్‌కు నాంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ప్రముఖ కార్ల కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రతి 53 సెకన్లకు ఒక కారు ఉత్పత్తి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌, ఇసూజీ, అపోలో టైర్స్‌ కంపెనీలు ఈ మధ్యకాలంలోనే ఏపీకి వచ్చాయని ఆయన తెలిపారు. కియా పరిశ్రమకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే రహేజా టెక్స్‌టైల్‌ పార్కు వస్తుందని, రాబోయే రోజుల్లో 2వ అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఇండియా మారుతుందని చంద్రబాబు చెప్పారు. ఓర్వకల్లు ఆగ్రో ప్రాసెసింగ్‌ పార్కుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ను కర్నూల్‌లో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, భావనపాడు పోర్టు నిర్మిస్తే ఫార్మా, ఇతర పరిశ్రమలు భారీగా వస్తాయని ఆయన ఆకాంక్షించారు.
Link to comment
Share on other sites

పొరుగు రాష్ట్రాలు మూడూ
ఇంగ్లీషులో ఇరగదీసి
కుయ్యో మర్రో అన్నా
అర్థం చేసుకోకుండా

ఈ కియా వాళ్లు
ఆంధ్రాలో
12 వేల కోట్ల పెట్టుబడులు
కుమ్మరిస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు అంటే

ఖచ్చితంగా బాబు గారు
ప్రతిపక్ష నాయకుడి ఎద్దేవాతో సిగ్గుపడి
కొరియా బాష నేర్చుకొని వుంటారు

ఈ వయసులో బాబు గారికి
ట్యూషన్ మాష్టారు ఎవరైవుంటారబ్బా?

Link to comment
Share on other sites

అమరావతి: కియా కంపెనీతో బెస్ట్‌ ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోటీ ఉన్నా కియా మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. మెజారిటీ ఉద్యోగాలు స్ధానికులకే ఇచ్చేలా చూస్తామని, అవసరమైతే వారికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ అందుబాటులో ఉండడంతో కియో కంపెనీ అనంతపురం జిల్లాకు వచ్చిందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌కు పరిశ్రమలను ఆహ్వానిస్తే పాకిస్తాన్‌లోని హైదరాబాదా..? అని అడిగారని, హైదరాబాద్‌కు పరిశ్రమలను తేవడానికి తాను ఎంతో కష్టపడ్డానని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

అమరావతి: కియా కంపెనీతో బెస్ట్‌ ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోటీ ఉన్నా కియా మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. మెజారిటీ ఉద్యోగాలు స్ధానికులకే ఇచ్చేలా చూస్తామని, అవసరమైతే వారికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ అందుబాటులో ఉండడంతో కియో కంపెనీ అనంతపురం జిల్లాకు వచ్చిందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌కు పరిశ్రమలను ఆహ్వానిస్తే పాకిస్తాన్‌లోని హైదరాబాదా..? అని అడిగారని, హైదరాబాద్‌కు పరిశ్రమలను తేవడానికి తాను ఎంతో కష్టపడ్డానని చంద్రబాబు అన్నారు.

 

enti gollapalli reservoir ki anthala water ekkadaki vastundi.... Pothireddypadu nunchi vadilthene gaaa :blink: 

Link to comment
Share on other sites

సూపర్… నవ్యాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషితో రాష్ట్రానికి అంతర్జాతీయ దిగ్గజాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ మోటార్స్ అనంతపురం జిల్లాలో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏటా 3 లక్షల హ్యుందయ్ కార్ల ఉత్పత్తి లక్ష్యంగా 12,910 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనుంది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో 599 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుండగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. అందులోనూ వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కియా ముందుకు రావడంతో ఆ సంస్థకు అల్ట్రా మెగా ఇండస్ట్రీకి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో విశేషం ఏమిటంటే… ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కియా మరో రెండేళ్లలోనే అంటే 2019 నాటికే ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అలాగే అక్టోబరు 2019 నాటికి పూర్తి స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయాలని ఏపీ సర్కారు కూడా షరతు విధించింది. 1944లో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీకి దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన సంస్థ. వాహన తయారీ రంగంలో దీనికి ప్రపంచంలోనే ఐదో స్థానం. దీంతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమయ్యింది. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...