Jump to content

Beach Road Corridor project gets underway


Recommended Posts

Beach Road Corridor project gets underway

THE HANS INDIA |   Jul 21,2016 , 12:34 AM IST
   
 
 
5301_Beach-Road.jpg
.
 
 

Nellore: State government, which is keen to promote tourism, issued notification for Techno-Economic Feasibility (TEF) study for Beach Road Corridor Project, which was proposed between Ichchapuram in Srikakulam and Tada in Nellore. 

 

The project is conceived to realise the tourism potential of the coastline and as a part of it a beach road which will be around 1,000 km abutting the shore, across the nine coastal districts will be built.

 

The works have been divided into four packages [ichchapuram-Visakhapatnam (250 km), Visakhapatnam –Narsapur (260 km), Narsapur-Ongole (260) and Ongole-Tada (240 km)] and the agencies are finalised for preparing the feasibility reports. 
Feedback Infra Private Limited, Aarvee Associates, AECOM Asia Company Ltd.

 

in consortium with AECOM India Private Limited, are for preparing the feasibility study for all the four packages. Works between Ongole and Tada are underway,” said a senior official from Infrastructure Corporation of Andhra Pradesh (INCAP).

 

Horticulture gardens, pastures, parks, amusement parks, hotels and beach resorts will flank the beach road. The corridor will provide avenues for a wide variety of tourist attractions, logistics hubs, industrial development, manufacturing and services. 

 

The project will be taken up in Public Private Partnership (PPP) or Engineering, Procurement, Construction (EPC) mode, which eases the burden on State exchequer.
 

Link to comment
Share on other sites

feasibility study aithe vakey...corridor em build avakunda antha roads ippude waste emo

 

1st phase vizag-kkd start chesthe will get an idea

 

 

Brother 1 thing these kind of roads in USA,... developed countries lo chala common deni valla tourist hotels, tourism spots chala baga develop avutayi

 

We need a clean road from Srikakulam to Chittur chala use

 

Deni valla 1000's of crores tourism investments will come

 

Main thing ports connectivity will increase and ports taxes will increase

 

Already chennai-vizag corridor undi deni ki seperate connectivity badulu deni use chesthe all ways useful

 

It is not that much easy to construct roads in sea side because there are few rivers for example antarvedi point where Godavari river reaches sea alanti places lo bridges not that much easy there are so many complications but atleast 500-600 kms roads vesina chalu chala useful

Link to comment
Share on other sites

  • 6 months later...

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

ఇప్పటివరకు ‘సాగరమాల’ పేరు విన్నాం. ఇది దేశంలోని మేజర్‌ పోర్టులన్నింటినీ అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న జలమార్గం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ‘సౌందర్యమాల’ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇది విశాఖ అవుటర్‌రింగ్‌ రోడ్డు. హైదరాబాద్‌కు రింగ్‌ రోడ్డు నిర్మించినట్టుగానే విశాఖలోను నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన వుంది. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా మళ్లించాలనేది ఆలోచన. అయితే బీజేపీ అధికారం చేపట్టాక...‘విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌’ను ప్రకటించింది. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడానికి సంకల్పించారు. సెప్టెంబర్‌ నెలలో విశాఖ నగరం మొత్తం పర్యటించినపుడు ఆయన రామకృష్ణా బీచ నుంచి భీమిలి బీచ వరకు వేస్తున్న నాలుగు లేన్ల రహదారిని పరిశీలించారు. ఆ మార్గాన్ని భోగాపురం వరకు వేస్తే బాగుంటుందని, విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారు బీచ మార్గంలో పయనించవచ్చునని సూచించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత భీమిలి, ఆనందపురం, మధురవాడ ప్రాంతాలను పరిశీలించినపుడు జాతీయ రహదారి నుంచి ఎక్కడికక్కడ మార్గాలు వేస్తూ బీచకు కనెక్టివిటీ ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు తాజాగా ‘సౌందర్యమాల’ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రకటించారు.
 
 

ఎలా ఉంటుందంటే...?
సౌందర్యమాల అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఒక ఆలోచన మాత్రమే. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధ్యయనం, ప్రతిపాదనలు జరగలేదు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ అధికారులే దీన్ని చేపట్టాల్సి వుంది. వారి మాటల ప్రకారం...జాతీయ రహదారి మీద నుంచి బీచ రోడ్డు మీదుగా భీమిలి, భోగాపురం...అక్కడి నుంచి తగరపువలస-ఆనందపురం-పెందుర్తి మీదుగా నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డును కలుపుతూ రింగ్‌ రోడ్డును పూర్తి చేయడానికి అవకాశం వుంది. భీమిలి-భోగాపురం మార్గానికి సీపీడబ్ల్యు అధికారులు ఇప్పటికే సర్వే చేస్తున్నారు. ఇది విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా వుంటుందనే వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవుటర్‌ రింగ్‌ రోడ్డుగా మారిస్తే నగరంలో ట్రాఫిక్‌ తగ్గుతుంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. నగరంలోకి వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండానే నేరుగా అవుటర్‌పై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చును

Link to comment
Share on other sites

భోగాపురం-భీమిలీ బీచ్ రోడ్‌...

విశాఖ-భీమిలీ బీచ రోడ్డును నిర్మిస్తున్నట్టే దానికి కొనసాగింపుగా భీమిలీ-భోగాపురం మధ్య బీచరోడ్డుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. విశాఖలో ఏర్పాటుచేసే కన్వెన్షన సెంటర్‌ సముద్రానికి అభిముఖంగా, ఆకర్షణీయంగా ఉండాలన్నారు. అనంతపురంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయదలిచిన ఎనర్జీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కాకినాడలో 90 ఎకరాల్లో నెలకొల్పే లాజిస్టిక్‌ యూనివర్సిటీ పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని పోర్టుల వాణిజ్యంలో వృద్ధి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. వాణిజ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ఆనలైనలో నమోదుచేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ ఎండీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

బీచ్ కారిడార్‌ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి: సీఎం
 
అమరావతి: రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాతీయ రహదారులపై 31 ఆర్వోబీల నిర్మాణంపై చర్చించారు. ఇదే సమయంలో సముద్రతీరంలో బీచ్ కారిడార్ నిర్మాణానికి సీఎం ఆదేశించారు. తొలి విడతలో విశాఖ-భోగాపురం మధ్య 48 కి.మీ మేర బీచ్ కారిడార్, రెండో విడతలో విశాఖ-కాకినాడ మధ్య 125 కి.మీ. బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.
 
3 నెలల్లోగా అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అమరావతి- అనంత ఎక్స్‌ప్రెస్ వే కోసం 10 వేల హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉందని, 5 జిల్లాల్లో భూసేకరణ కోసం ఐదు బృందాల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో అటవీశాఖ అనుమతుల కోసం మరో బృందం ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఎక్స్‌ప్రెస్‌వే పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం కేంద్రం రూ.1200 కోట్లు కేటాయించిందన్నారు.
Link to comment
Share on other sites

బీచ్‌కారిడార్‌ నిర్మాణానికి చంద్రబాబు ఆదేశం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాల శాఖపై మంగళవారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం ఆదేశించారు. తొలి విడతలో విశాఖ నుంచి భోగాపురం వరకు 48 కి.మీ మేర బీచ్‌ కారిడార్‌ నిర్మాణం. రెండో విడతలో విశాఖ-కాకినాడ మధ్య 125 కి.మీ మేర బీచ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు తుది అలైన్‌మెంట్‌కు సీఎం ఆమోదం తెలిపారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఐదు జిల్లాల్లో భూసేకరణ కోసం ఐదు బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా ఎక్స్‌ప్రెస్‌ వే పనుల ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న 31 ఆర్వోబీల నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు.

Link to comment
Share on other sites

లాస్‌ఏంజెలస్‌-శాండియాగో తరహాలో విశాఖ బీచ్‌రోడ్డు

 

* లాస్‌ఏంజిల్స్‌-శాండియాగో తరహాలో విశాఖ బీచ్‌ రోడ్డు. ఈ రోడ్డు విశాఖ నుంచి కాకినాడ, తడ వరకూ వెళ్తుంది ఈ రోడ్డు. కాకినాడ సమీపంలో ఉప్పాడ దగ్గర బీచ్‌ రోడ్డు తరచూ సముద్రపు కోతకు గురవుతున్నందున తగిన రక్షణ ఏర్పాట్లతో పటిష్ఠంగా నిర్మాణం. బీచ్‌ రోడ్డుకు జాతీయరహదారిని అనుసంధానించేటప్పుడు పర్వతాలుంటే అండర్‌టన్నెల్‌ రహదారుల నిర్మాణం.

బీచ్‌ రోడ్డు అంచనాలు పెంపు.. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ సాగర తీరాన నిర్మితమవుతున్న రహదారి నిర్మాణ వ్యయం రూ.130 కోట్ల మేర పెరగడంపై ఆర్థికశాఖ అభ్యంతరాలు లేవనెత్తింది. తొలుత రూ.65 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ రహదారి పనులు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వ్యయాన్ని రూ.195 కోట్లకు చేర్చారు. ఇందుకు ఉన్నతవర్గాలు ఆమోదం తెలిపినా ఆర్థిక శాఖ సాంకేతికపరమైన అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. నిర్మాణ వ్యయంలో 15శాతంపైబడి పెంచాల్సి వస్తే అనుసరించిన విధివిధానాలను పరిగణనలోకి తీసుకోలేదని, అధీకృత వర్గాలు ఆమోదించినా నిబంధనలు పాటించాల్సిందేనని ఆ శాఖ అభిప్రాయపడింది. మంగళవారం ముఖ్యమంత్రి దగ్గర నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ రహదారి ప్రస్తావన వచ్చింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 8 months later...
ఇచ్ఛాపురం-తడ ఆరులైన్ల బీచ్‌ రహదారి
27brk87a.jpg

అమరావతి: ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు వరుసల బీచ్‌ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించే ఈ రహదారికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో డీపీఆర్‌ తయారీకి ఆదేశాలిస్తామన్నారు. తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తామన్నారు. రహదారి వెంబడి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి 60శాతం భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి డీపీఆర్‌ తయారు చేస్తామని మంత్రి తెలిపారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

  • 6 months later...

Development of Beach Road Corridor from Ichchapuram to Tada

Development of Beach Road Corridor from Ichchapuram to Tada

Location: Mulitiple Districts

Sector: Tourism

Mode: PPP or EPC

Activity: Development of Beach Road Corridor from Ichchapuram to Tada

Components:

Components of the project will be determined based on the Techno-Economic Feasibility Report which is under preparation

Current Status:

  • TEFR consultant selection process completed. The following agencies were issued LoA in June, 2015 and agreements have been concluded with them.
    • Package I: Ichchapuram to Visakhapatnam (~ 250 km) – M/s. Feedback Infra Pvt. Ltd.
    • Package II: Visakhapatnam to Narsapur (~ 260 km) – M/s. Aarvee Associates.
    • Package III: Narsapur to Ongole (~ 260 km) – M/s. Aarvee Associates.
    • Package IV: Ongole to Tada (~ 240 km) – M/s. AECOM Asia Company Ltd. in consortium with AECOM India Private Limited. Field studies commenced.

Project Brief:

To promote tourism in Andhra Pradesh, there are plans for developing infrastructure such as the Beach Corridor, which will realize the benefits of the natural endowments of the state such as the coastline of 974 km, pristine beaches, bird sanctuaries, eye-catching natural rock formations, wild life, scenic back waters and river deltas etc. The Beach Corridor will have a beach road which will be around 1,000 km length abutting the shore, along the coast, across the 9 coastal districts, with a 30 km wide land side Corridor of Influence (CoI), from AP border in the north in Ichchapuram Mandal, Srikakulam District to AP border in the South in Tada Mandal, Nellore District.

Link to comment
Share on other sites

  • 4 months later...
పర్యటక వరదాయిని.. బీచ్‌ రహదారి 
 

 

రవాణా మెరుగుకూ అవకాశం

పర్యటక వరదాయిని.. బీచ్‌ రహదారి 

జిల్లాలో 43 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఉండగా నిజాంపట్నం పోర్టు నుంచి ప్రకాశం జిల్లా వాడరేవు వరకు 25 కి.మీ. మేర బీచ్‌ రహదారిని నిర్మించనున్నారు. దీని నిర్మాణం పూర్తయితే తీర ప్రాంతం రూపురేఖలు మారిపోవడమే కాకుండా పర్యటకపరంగానూ అభివృద్ధి చెందుతుంది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించేలా ప్రజాప్రతినిధులు చేసిన కృషి కొంత మేర ఫలించింది. అందుకు నిదర్శనంగా తొలి విడతలో రూ.కోటి కూడా మంజూరుకాగా సూర్యలంక నుంచి నిజాంపట్నం  వైపు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

న్యూస్‌టుడే, బాపట్ల

బాపట్ల సూర్యలంక బీచ్‌, లంకెవానిదిబ్బను ప్రముఖ పర్యటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో పెద్దగా పరిశ్రమలు లేవు. వ్యవసాయంతోపాటు ఆక్వారంగంపై ఎక్కువగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ఆక్వా పరిశ్రమలు వెలుస్తుండగా బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం ప్రాంతాల నుంచి ఏటా రూ.250 కోట్ల మత్స్య, రొయ్యల సంపద దేశవిదేశాలకు సైతం రవాణా అవుతుంటాయి. తుంగభద్ర, నల్లమడ వాగు, పేరలి కాలువలు ఈ పాంతంలోనే సముద్రంలో కలుస్తున్నాయి. సూర్యలంకకు నాలుగు కి.మీ. దూరంలోని పొగురు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉండే మడ అడవులు, వాగులు, కాలువలు, వివిధ రకాల పక్షులు పర్యటకులను ఆకట్టుకుంటుంటాయి. సూర్యలంకలో అద్భుతమైన బీచ్‌ ఉన్నా పర్యటకపరంగా ఆశించిన అభివృద్ధి చెందలేదు. 
తగ్గనున్న దూరాభారం: నిజాంపట్నం నుంచి సూర్యలంక చేరుకోవటానికి 36 కి.మీ. దూరాన్ని రహదారి మార్గంలో ప్రయాణించాలి. అదే సముద్రం వెంబడి నిజాంపట్నం పోర్టు నుంచి సూర్యలంక బీచ్‌ వరకు 12 కి.మీ. పొడవునా బీచ్‌ రహదారిని నిర్మిస్తే సులభంగా చేరుకోవచ్చు. అయితే వాగులు, కాలువలు, తీర ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంతెనలు నిర్మించాల్సివుంది. పాండిచ్చేరిలో ఉన్న బీచ్‌ రహదారిలా సముద్రతీరం వెంబడి ఏట వాలుగా కొండరాళ్లతో కరకట్టలాంటి నిర్మాణం చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని వాడరేవు వరకు పొడిగించవచ్చు. అయితే దీని నిర్మాణానికి అటవీ   ప్రైవేటు భూములు సేకరించాల్సివుంది.

2011లోనే పరిశీలన : నిజాంపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు బీచ్‌ రహదారి నిర్మించడంపై 2011లో అధికారులు పరిశీలన జరిపారు. సూర్యలంకకు వచ్చిన అప్పటి కేంద్రమంత్రికి అప్పటి ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు అందజేశారు. ఆ తర్వాత అవి మరుగునపడ్డాయి. తీరంలో వంతనెలతో కూడిన బీచ్‌ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లపైన వ్యయమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని వారు సూచిస్తున్నారు. ఇతర పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తే తీరం ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. దీనికి పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పట్టాలెక్కేలా కృషి చేయాలి. బీచ్‌ రహదారి వస్తే  తీరంలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. తుపానులు, వాయుగుండాలు, సునామీల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ విజ్ఞప్తి మేరకు తొలిగా సూర్యలంక బీచ్‌ నుంచి నిజాంపట్నం పోర్టు వైపునకు సముద్రం వెంబడి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యాన ఈ పనులకు టెండరు పిలిచారు. త్వరలో ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యలంక నుంచి పొగురు వరకు 4 కి.మీ. మేర బీచ్‌ రహదారి నిర్మాణానికి తొలిదశలో రూ.17.50 కోట్లు కావాలని అంచనా వేశారు. సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

త్వరలో నిర్మాణ పనులు : సుబ్రహ్మణ్యం, ఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ 
బీచ్‌ రహదారి టెండరు ప్రక్రియ పూర్తయింది. తొలి విడతగా 600 మీటర్ల మేర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం. తీర ప్రాంతం కావటంతో కోతకు గురికాకుండా పటిష్ఠంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...