Jump to content

Kondapalli Fort & Mulapadu


Recommended Posts

కొండపల్లి అడవుల్లో జలపాతాల సోయగాలు
 
636301697862333775.jpg
ఓ పక్క కొండ చెరియలు.. మరో పక్క లోయలు.. చుట్టూ పరచుకున్న పచ్చదనం.. వందలాది పక్షల కిలకిలరావాలు.. ఇంకోవైపున జలపాతాల సోయగాలు.. ఇది కొండపల్లి రిజర్వు ఫారెస్టులో కనిపించే అద్భుత దృశ్యాలు. ఇక్కడ చిన్నవి.. పెద్దవి కలిపి వందలాది జలపాతాలు ట్రెక్కింగ్‌ బృందాలు గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
దట్టమైన కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి వందకు పైగా జలపాతాలు ఉన్నాయి. రిజర్వు ఫారెస్టులోకి కొంత వరకు వెళితేనే అనేక జలపాతాలు కనిపిస్తాయి. ఇంకా లోతుగా జల్లెడ పడితే ఇంకెన్ని జలపాతాలు ఉంటాయో! ట్రెక్కింగ్‌ బృందాలు కొన్ని ఈ జలపాతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాయి. వీరి ప్రచారంతో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనేకమంది వస్తున్నారు. ఇప్పుడు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో పర్యాటకుల కోలాహలం నెలకొంటోంది.
యూత్‌ హాస్టల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అడ్వెంచర్‌ పట్ల ఆసక్తి ఉన్న యువకులతో కూడిన ట్రెక్కింగ్‌ బృందాలు పలు ప్రాంతాలను సందర్శిస్తూ ట్రెక్కింగ్‌ నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలో అనుకోకుండా కొండపల్లి రిజర్వు ఫారెస్టును ఎంచుకున్నారు. క్లిష్టతరమైనప్పటికీ ట్రెక్కింగ్‌ నిర్వహిస్తుండంగా అత్యద్భుతమైన ప్రకృతి అందాలు కనిపించటంతో ఆ బృందం ముందుకు సాగింది. ఈ క్రమంలో పలు జలపాతాలను ఈ బృందం చూసింది. చిన్న చిన్న జలపాతాల నుంచి భారీ జలపాతాల వరకు బృంద సభ్యులు చూశారు. వర్షాకాలంలో జలపాతాల ఉధృతి ఎక్కువుగా ఉంటుంది. తొలకరి వర్షం కురిసినపుడు జలపాతాల ఉధృతి పెరుగుతుంది.
 
ప్రకృతి రమణీయత
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఎంతో ఉద్విగ్నతను కలిగిస్తుందని ట్రెక్కింగ్‌ సభ్యులు చెబుతున్నారు. తొలకరి వర్షం పడినపుడు వీరి ట్రెక్కింగ్‌ మొదలువుతుంది. బురద నేలల నుంచి వీరి ప్రయాణం ప్రారంభం అవుతుంది. బైకులపై కొంత దూరం వెళతారు. ఆ తర్వాత గడ్డి, గుబురు చెట్ల మధ్య నుంచి అడవిలోకి ప్రవేశిస్తారు. మూలపాడువైపు నుంచి ఇటు వెళ్ళటానికి మార్గం ఉంది. అడవిలోకి ప్రవేశిస్తే చిమ్మ చీకట్లు చూడాల్సి ఉంటుంది. జలపాతాల గలగలలు అనుభూతిని పంచుతాయి. తూనీగలు, రంగు సీతాకోక చిలుకలు జలపాతాల వద్ద చేసే సవ్వళ్ళు.. రాతి, చవుడు, ఇసుక నేలలు, నీటి కుంటలు, ఎత్తైన చెట్లు.. అనేక ప్రకృతి దృశ్యాలు గిలిగింతలు పెడతాయి.
కొండపల్లి రిజర్వు ఫారెస్టును పర్యాటకంగా అభివృద్ధి చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిఉంది. ఫారెస్ట్‌ లోపలికి వెళ్ళేందుకు బీటీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేస్తే అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతుంది. పొక్లెయినర్లతో సమతల ప్రాంతాలలో చదును చేయించి రెస్ట్‌ ఏరియాలను ఏర్పాటు చేయవచ్చు. ఇదే ప్రాంతంలో అందమైన ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయవచ్చు. అడవులను అలానే సహజంగా వదిలివేసి.. లోపలికి మార్గాలను, లైటింగ్‌ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళితే బాగుంటుంది. జలపాతాల దగ్గర సౌండ్‌ అండ్‌ లైట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయవచ్చు. విజయవాడ భవానీ ఐల్యాండ్‌ నుంచి కానీ, ఇక్కడే సర్క్యులర్‌గా కానీ రోప్‌వే వంటిది ఏర్పాటు చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది.
వందకు పైగానే జలపాతాలు
ట్రెక్కింగ్‌ సభ్యులు దాదాపు 60 నుంచి 70 వరకు జలపాతాలను వీక్షించారు. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో రాతి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాతి నేలల్లోంచి జలపాతాలు వస్తుంటాయి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికీ తెలియదు. ప్రాథమికంగా కొంత ప్రాంతం వరకు నిర్వహించిన ట్రెక్కింగ్‌లో ఎక్కువగా చిన్న జలపాతాలే బృందానికి కనిపించాయి. దట్టమైన అడవిలోకి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ట్రెక్కింగ్‌ బృందం కూడా వెనకడుగు వేసే పరిస్థితి. నీటి శబ్దాలను బట్టి పెద్ద పెద్ద జలపాతాలు చాలా వరకు ఉండవచ్చని ట్రెక్కింగ్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • Replies 136
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 3 weeks later...
కొండపల్లి కోట అభివృద్దికి మాస్టర్ ప్లాన్
 
 
విజయవాడ: కొండపల్లి కోట అభివృద్దికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. 4 కోట్ల తో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఆసియాలోనే మొదటి ఓపెన్ ఎయిర్ మ్యూజియం, జాతీయ,అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. పర్యాటక శాఖ అధికారులతో కార్యదర్శి మీనా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19న మాస్టర్ ప్లాన్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపనున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 months later...
  • 1 month later...
  • 2 months later...

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Amaravati&info=amr-sty1


అందాలను ఆస్వాదిద్దాం 
18న మూలపాడు కొండల్లో ట్రెక్కింగ్‌ 
కనువిందు చేయనున్న ప్రకృతి సోయగాలు 
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 
ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే 

ట్రెక్కింగ్‌ చేయాలని ఉందా?... స్నేహితులతో కలిసి ఆ కొండ కోనల్లో తిరిగి ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అందు కోసం ఎక్కడికో వెళ్లనవసం లేదు. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని కొండలు అందుకు వేదిక కానున్నాయి. ఆ కొండల్లో ఈ నెల 18న ట్రెక్కింగ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతలో మానసిన ఉల్లాసాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు వంద మంది పాల్గొంటారని అంచనా. అందుకు అవసరమైన బేస్‌ క్యాంప్‌తో పాటు దుస్తులు, బూట్లు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించాలని ఇటీవల నిర్వహించిన అధికారుల సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మానసిక ఉల్లాసానికి.. 
అమరావతి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలను  చేపడుతున్న ప్రభుత్వం తాజాగా ట్రెక్కింగ్‌ని కూడా ప్రోత్సహిస్తోంది. అందుకు రాజధానికి సమీపంలో ఉన్న అందమైన కొండలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కొందరికే పరిమితమైన ట్రెక్కింగ్‌ను యువత, ఉద్యోగులకు పరిచయం చేసి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మూలపాడు, కేతనకొండ, కొండపల్లి, చెరువు మాధవరం తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేయాలనుకునే వారికి వసతులు కూడా కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నా.. శిక్షణ లేని వారికి శిక్షణ ఇచ్చి ట్రెక్కింగ్‌కు వెళ్లేలా చేయనున్నారు. అందుకు కావాల్సిన వసతులను మూలపాడు అటవీ ప్రాంత ప్రారంభంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇక్కడే ఎందుకంటే 
విజయవాడ నగరానికి 20 కి.మీ. దూరంలోనే మూలపాడు అడవులు ఉండటంతో పాటు గ్రామం నుంచి నడక మార్గంలో దాదాపు 15 కి.మీ. సునాయాసంగా ప్రయాణం చేయడంలోనే ట్రెక్కింగ్‌ అనుభూతి లభిస్తుంది. అడవిలోకి ప్రవేశించగానే అడవి ఆంజనేయ స్వామి, దొంగమర్ల బావి, కిరసనాయల బావి, కుక్కల లోయ వంటివి ఆకర్షిస్తాయి. వివిధ రకాలైన ఔషధ మొక్కలు లభిస్తాయి. అడవి ఆంజనేయ స్వామి ఆలయం అనంతరం నాలుగు కిలో మీటర్లు దాటితే ఎతైన కొండలతో పాటు జలపాతాలు దర్శనమిస్తాయి. ఇన్ని అనుభూతులు ఒక్కచోటే లభించే అవకాశం ఉండటంతో ట్రెక్కింగ్‌కు మూలపాడు అనుకూలమైన ప్రాంతంగా జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

అద్భుత ప్రదేశం 
- రఘు, బెజవాడ అడ్వంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపక సభ్యుడు 
ట్రెక్కింగ్‌కు కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని ప్రాంతాలు ఎంతో అనుకూలం. ప్రకృతి ప్రసాదించిన మంచి ప్రాంతమని పేర్కొనవచ్చు. అడవిలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా సురక్షితంగా రాకపోకలను సాగించే అవకాశం ఉంది. సరైన మార్గదర్శనం ద్వారా అడవిలో అనువణువూ తెలుసుకోవచ్చు. 
 

అనువైన ప్రాంతం 
- సురేష్‌, విజయవాడ అడ్వంచర్‌ క్లబ్‌ సభ్యుడు 
కొండపల్లి రిజర్వు ఫారెస్టు ట్రెక్కింగ్‌కు అనుకూలం. ఎతైన కొండలు, జలపాతాలు ఈ ప్రాంత ప్రత్యేకతలు. విజయవాడ నగరానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం నుంచి అడవి చుట్టుపక్కల ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు 500లకు పైగా ట్రెక్కింగ్‌ స్పాట్‌లను నిర్వహించాం.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
కొండపల్లి ఖిల్లా ఆధునికీకరణ పనుల్లో జాప్యంపై ఆగ్రహం
16-06-2018 09:33:26
 
636647384194407729.jpg
  • కొండపల్లి ఖిల్లాను ఆకస్మికంగా సదర్శించిన మీనా
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఖిల్లా ఆధునికీకరణ పనుల్లో చోటు చేసుకున్న అలసత్వంపై పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ముఖేష్‌ కుమార్‌ మీనా కొండపల్లి కోటను ఆకస్మికంగా సందర్శించి తనీఖీ నిర్వహించారు. కొండపల్లి కోట ఆధునికీకరణ కోసం కేటాయించిన రూ.74 కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టగా అవి నత్తనడకన సాగటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను పర్యవేక్షిస్తున్న పురావస్తు శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆయన తీవ్రంగా మందలించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులు మరో నాలుగు నెలలో పనులు పూర్తి కావలసి ఉందని కాని నేటి వరకు 20శాతం పనులు మాత్రమే పూర్తి కావాటాన్ని ఆయన తప్పు బట్టారు. పనివారిని పెంచి వెంటనే పనులు పూర్తి చేయాలని, ఇకపై ప్రతి 15 రోజులకు తనిఖీ చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కోటను కాపాడుకునేందుకు ఇప్పటికే మంజూరు చేసిన నిధులే కాకుండా భవిష్యత్తులో కూడ నిధులు కొరత లేకుండా చూస్తామని అన్నారు.
 
జాతీయ రహదారి నుంచి కొండకు దారితీసే మార్గంలో అటవీశాఖతో మాట్లాడి ఒక పర్యాటక విడిది కేంద్రాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులతో ఆయన చర్చించారు. పర్యాటకుల రాకపోకలు, వసతులు ఏర్పాటుతో ముడిపడి ఉంటాయని, తదనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఆపసోపాలు
కొండపల్లి ఖిల్లా పటిష్ఠ పనుల్లో జాప్యం
కాలిబాట మెట్ల మార్గం కనుమరుగు
రూ.7.4 కోట్లతో చేసిన మరమ్మతులు అస్తవ్యస్తం
పురావస్తుశాఖను వేధిస్తున్న నిధుల కొరత
ఈనాడు, అమరావతి
amr-top2a.jpg
అది అయిదు శతాబ్దాల నాటి కట్టడం.. శత్రుదుర్భేధ్యంగా నిర్మాణం.. వారసత్వ సంపద.. పర్యాటకులను విశేషంగా ఆకుట్టుకునే నిర్మాణాలు.. అలాంటి పురాతన కట్టడాలను సంరక్షించడంలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. నిధుల సమస్య సవాళ్లుగా మారాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఉన్న అలాంటి కట్టడమే కొండపల్లి ఖిల్లా..!  కొండపల్లి ఖిల్లా గురించి తెలియని వారుండరు. ఈ ప్రాంతానికి వచ్చిన వారు కొండపల్లి ఖిల్లాను, కొండపల్లి బొమ్మలను సందర్శించకుండా వెళ్లరంటే అతిశయోక్తికాదు. అలాంటి కొండపల్లి ఖిల్లా.. శిథిల దశకు చేరుతోంది. వారసత్వ సంపదను కాపాడేందుకు పురావస్తుశాఖ ఆపసోపాలు పడుతోంది. నిధుల సమస్య పట్టి పీడిస్తోంది. పురాతన కట్టడాలను తిరిగి అదే విధంగా నిర్మాణం చేసేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. మరోవైపు కట్టడాలు శిథిల స్థితికి చేరుతున్నాయి.

ఇటీవల కాలంలో కొండపల్లి ఖిల్లాకు సందర్శకుల తాకిడి పెరిగింది. అసంపూర్తిగా నిర్మాణాలు, కూలేందుకు సిద్ధంగా ఉన్న కోట బురుజులు, శిథిలమైన కోట నడకదారి, మూసుకుపోయిన రథం ద్వారం పర్యాటకులను విస్మయ పరుస్తున్నాయి. కోటను పటిష్ట పరిచేందుకు పర్యాటక శాఖ మంజూరు చేసిన నిధులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట కట్టడాలను తిరిగి అదే రీతిలో నిర్మాణం చేసేందుకు పురావస్తు ఇంజినీరింగ్‌శాఖ గుత్తేదారులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం రూ.7.4 కోట్లతో చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏమాత్రం

పురోగతి లేవని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి ఖిల్లాలో జరుగుతున్న పనులపై ‘ఈనాడు’ పరిశీలన కథనం.

ఇదీ నేపథ్యం..!
కొండపల్లి ఖిల్లా విజయవాడ నగరానికి సుమారు 25 కి.మీ దూరంలో ఉంది. 16వ శతాబ్దంలో దీన్ని నిర్మాణం చేశారు. నాడు ముసునూరు పాలకులు దీన్ని నిర్మాణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని అత్యంత పటిష్టంగా నిర్మాణం చేశారు. కోట చుట్టూ ప్రాకారం, ఆ అంతస్తులు బురుజు నిర్మాణం, దర్బార్‌ హాలు, రాణిమహల్‌, నర్తనశాల, అంగడి, కారాగారం, ఆయుధగారం, కొలను, రాజకుటుంబీకుల కొలను తదితర నిర్మాణాలు ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకుల హయాంలో దీన్ని ఆయుధ శిక్షణ ప్రాంతంగా వినియోగించారు. గోల్కొండ కోటకు, ఈ కోటకు రహస్యమార్గం ఉండేదని చెబుతారు. ఈ కోటను పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తోంది.

శిథిలస్థితిలోకి పురాతన కట్టడం..!
కొండపల్లి కోట క్రమేపీ శిథిల స్థితికి చేరుతోంది. పురావస్తుశాఖ నిధుల లేమితో పటిష్ట చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయడం లేదు. ఇటీవల కాలంలో పలు సర్వేల అనంతరం పర్యాటకశాఖ రూ.7.4కోట్లతో పనులు చేపట్టింది. కోటబురుజులు ఎప్పుడు పడతాయో అన్నట్లుగా శిథిల స్థితికి చేరింది. కొన్ని పునర్నిర్మాణం చేశారు. మరికొన్ని చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడంతో పర్యాటకులను ఆకర్షించడం లేదు.
* కోట ప్రవేశమార్గం ఇరుకుగా ఉంది. కోటవద్ద గతంలోనే ఒక దర్గా నిర్మాణం చేశారు. టికెట్‌ కౌంటర్‌ కోసం ఒక నిర్మాణం చేయడంతో ప్రవేశమార్గం లేకుండా పోయింది. చాలా ఇరుకుగా ఉంది.
* కొండపల్లి కోటకు వేళ్లే నడకమార్గం పూర్గిగా మూసుకుపోయింది. భద్రాచలం జాతీయ రహదారి మీదుగా కొండపల్లి గ్రామం నుంచి 900 మీటర్ల దూరం నడకదారిలో కోట ఎక్కే అవకాశం ఉంది. గతంలో మెట్లు అలాగే ఉండేవి. క్రమేపీ అవి శిథిలమై మూసుకు పోయాయి. ప్రస్తుతం దాదాపు 10 కి.మీ దూరం పైగా తిరిగి వెనుకవైపు నుంచి రావాల్సి వస్తోంది. దూరదర్శన్‌ కేంద్రం వారు వేసిన బీటీ రహదారి దీనికి వినియోగించడం విశేషం.
* ఈ మార్గంలో వీటీపీఎస్‌ బూడిద చెరువు ఉంది. అక్కడి నుంచి కాలుష్యం విపరీతంగా వెదజల్లుతోంది.
* ప్రస్తుతం ఖిల్లా కట్టడాలను 16వ శతాబ్దం నిర్మాణాలుగానే పునర్నిర్మాణం చేస్తున్నారు. దీనికి గుత్తేదారు ఆపసోపాలు పడుతున్నారు. అక్కడ ఉన్న రాయితో సున్నం గానుగ పట్టించి దానికి నల్లబెల్లం నీరు, కరక్కాయ ఊరవేసిన నీరు కలిపి వీటిని గానుగ పట్టించి ఆ మిశ్రమంతో నిర్మాణాలు చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతోంది.
* ప్రస్తుతం కోట బురుజుల పునర్నిర్మాణం, స్లాబ్‌, దర్బార్‌హాలు, గోడల నిర్మాణం జరుగుతోంది. అసలు సిమెంట్‌ వినియోగించకుండా దీన్ని నిర్మాణం చేయాల్సి ఉంది. దీంతో జాప్యం పడుతోందని అధికారులు చెబుతున్నారు.
* నీటితో క్యూరింగ్‌ కూడా భిన్నమైన రీతిలో చేయాల్సి ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. అలనాటి కట్టడాన్ని తలపించే విధంగా పునర్నిర్మాణం చేస్తున్నారు. దీన్ని సురికి కాంక్రీట్‌ పద్ధతి అంటున్నారు.
* పచ్చిక మైదానాలు తయారు చేయాల్సి ఉంది. నీటి కొలను వద్ద ఒక ఫౌంటెన్‌తో పాటు గోడమీద ప్రదర్శించే విధంగా ఒక తెరను ఏర్పాటు చేయనున్నారు.

పెరిగిన అంచనాలు..!
ప్రస్తుతం రూ.7.4కోట్లతో చేపట్టిన పనులకు నిధుల సమస్య ఎదురవుతోంది. దీనికి అరోమా సంస్థ డీపీఆర్‌ తయారు చేసి ఇచ్చింది. దాని ప్రకారం టెండర్లను పిలిచారు. పర్యాటక శాఖ నిధులు సమకూర్చగా, పురావస్తు శాఖ పర్యవేక్షణ చేస్తోంది. ఇంజినీరింగ్‌ విభాగం అమలు చేస్తోంది. అయితే డీపీఆర్‌లో కేవలం 20ఎంఎం ప్లాస్టింగ్‌ సరిపోతుందని సూచించారు. కానీ దర్బార్‌ హాలు ఇతర గోడలకు 70 ఎంఎం వరకు పడుతోంది. దీనికి సున్నం, ఇతర పదార్థాలు కావాల్సి ఉంది. సిమెంట్‌ లేకుండా చేయాల్సి ఉండటంతో ఖర్చు అధికంగానే ఉంది. దీనిపై నివేదిక ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. మరో రూ.10 కోట్లు పైగా కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
* జాతీయ రహదారి నుంచి కొండమీదకు మెట్ల మార్గాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. దీనివల్ల పర్యాటకులు పెరగనున్నారు. ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రథం ద్వారం పునరుద్ధరించాల్సి ఉంది.
* ఖిల్లా మీదకు రోప్‌వే నిర్మాణం ప్రతిపాదనలు ఉంది. దీన్ని పక్కన పడేశారు. దీనిపై శ్రద్ధపెట్టాలని కోరుతున్నారు.
* గతంలో అధికారులు ఖిల్లా సహజత్వానికి అక్కడక్కడా సిమెంట్‌ నిర్మాణాలు చేశారు. ఇవి వారసత్వ సంపదకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని తొలగించాలని ప్రతిపాదించారు.
* ఒక మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. దీనికి అదనంగా నిధులు కావాల్సి ఉంది. కొండపల్లి ఖిల్లాకు సంబంధించిన వస్తువులు కొన్ని హైదరాబాద్‌ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని ఇక్కడకు తెప్పించి ఏర్పాటు చేయాల్సి ఉంది.
* వీటీపీఎస్‌ బూడిద చెరువు ప్రాంతంలో ఉద్యానవనం ఏర్పాటు చేయాల్సి ఉంది.

పటిష్టం చేయాల్సి ఉంది..!
కొండపల్లి కోట వారసత్వ సంపదగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం దీన్ని అలనాటి కట్టడం తరహాలో పటిష్ట పరిచే కార్యక్రమం చేపట్టాం. పర్యాటకశాఖ నిధులు సమకూర్చుతోంది. దీని బృహత్‌ ప్రణాళిక ప్రకారం మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. గతంలో పనిచేసిన అధికారులు సిమెంటు వినియోగించి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం పూర్తిగా సున్నం, బెల్లంఊట, కరక్కాయ ఊటతో కాంక్రీట్‌ తయారు చేసి వినియోగిస్తున్నాం. పనుల జాప్యంపై కొంత అసంతృప్తి ఉంది. మరో మూడు నెలల్లో పూర్తి చేస్తాం. కాలిబాట, రోప్‌వే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతిపాదనలు ఇచ్చాం.

- మల్లికార్జున రావు, ఉపసంచాలకులు, పురావస్తుశాఖ
 
 
 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...