Jump to content

AP Railway Projects


Recommended Posts

గుంటూరు-గుంతకల్లు రైలుమార్గం డబ్లింగ్‌

విద్యుదీకరణతో కలిపి వ్యయం రూ.3631 కోట్లు

చెరిసగం భరించనున్న కేంద్రం, రాష్ట్రం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు- గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గాన్ని నిర్మించి, విద్యుదీకరించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 401.47 కి.మీ. మార్గం డబ్లింగ్‌ పనులకు రూ.3631 కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీనిని రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్రం చెరిసగం చొప్పున భరించనున్నాయి. అయిదేళ్లలో ఈ పనులు పూర్తవుతాయని సమావేశానంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ విలేకరులకు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని రాయలసీమ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ రైలు మార్గం నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మార్గం డబ్లింగ్‌ వల్ల ఇప్పటికే జరుగుతున్న సరకు రవాణాకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా దీనిని మరింత పెంచుకోవడం వీలవుతుంది. ఈ మార్గంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉంటాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఇది అత్యంత దగ్గర దారి కానుంది.

వెంకయ్యనాయుడు హర్షం.. గుంటూరు-గుంతకల్లు మధ్య డబ్లింగ్‌ పనులకు కేబినెట్‌ ఆమోదం లభించడం పట్ల కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్గం వల్ల రాయలసీమ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి వూతం లభిస్తుందన్నారు. పారిశ్రామికంగానూ వృద్ధి చెందడానికి ఆస్కారం ఉందనీ, ఈ పనుల వల్ల 80.29 లక్షల పనిదినాల మేర ఉపాధి లభిస్తుందనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల్ని తీర్చడానికి నరేంద్రమోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందించేలా ఇటీవలి కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపామని గుర్తుచేశారు.

 

manollu 3600 cr ani sambara padutunnaru kani andulo state 1800 cr spend cheyyali. ekkadinunchi tewali, idi eppatiki avutundi 

Link to comment
Share on other sites

  • Replies 386
  • Created
  • Last Reply
  • 2 weeks later...

వ్యాగన్ల మరమ్మతు కేంద్రంపై ముందడుగు

జులైలో పనులు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న రైల్వేశాఖ

విశాఖ సమీపంలో ఏర్పాటు, నాలుగైదువేల మందికి ఉపాధి

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నం శివారు దువ్వాడ సమీపంలో వ్యాగన్ల మరమ్మతు కేంద్రం ఏర్పాటు విషయంలో ముందడుగు పడింది. జులైలో ఈ కేంద్రం పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సన్నద్ధం అవుతోంది. రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించింది. తొలుత రూ.256 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించిన తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.323 కోట్లకు పెరిగింది. మరోవైపు, వ్యాగన్‌ వర్క్‌షాప్‌ కేంద్రం నిర్మాణానికి టెండర్లు పిలవాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.

200 వ్యాగన్ల సామర్థ్యం

వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ను 200 వ్యాగన్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తారు. కనీసం రూ.పాతికవేల కిలోమీటర్ల దూరం తిరిగిన తర్వాత బోగీలకు అవసరమైన మరమ్మతులు చేస్తారు. దీనివల్ల వీటి జీవితకాలం పెరుగుతుంది. వ్యాగన్‌ వర్క్‌షాప్‌తో మెకానిక్‌లు, డ్రైవర్లు సహా దాదాపు నాలుగైదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఈ వర్క్‌షాప్‌ను 2013-14 బడ్జెట్‌లో తొలుత ఒడిశాలోని కలహండిలో చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత దీన్ని విశాఖపట్నం శివారు దువ్వాడ సమీపానికి మార్చారు. నీరు, ప్రాజెక్టుకు అవసరమైన భూమి ఉండడంతో ఇక్కడకు మార్చారు. విశాఖపట్నం నౌకాశ్రయం, స్టీల్‌ ప్లాంట్‌, ఎన్టీపీసీ నుంచి సరుకురవాణా అధికంగా జరుగుతుంటుంది. ఇక్కడ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటుకానుండడం వల్ల.. విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఇతర పరిశ్రమలకు ఈ వర్క్‌షాప్‌ ఉపయోగపడనుంది. సరకు రవాణా ఎగుమతులు, దిగుమతులకు వ్యాగన్ల కండీషన్‌ ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ఇది దోహదపడనుంది. రైల్వేబోర్డు ఛైర్మన్‌ ఏకే మిట్టల్‌ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ పనుల్ని జులైలో చేపడతామని స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబుతో పేర్కొన్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఐతే ఆఖరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదాపడింది. జూన్‌లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

డీజిల్‌ లోకోషెడ్‌ విస్తరణ

విశాఖలో ఉన్న డీజిల్‌ లోకోషెడ్‌ సామర్థ్యాన్ని కూడా విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ విస్తరణపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా విశాఖపట్నం స్టేషన్‌లో కొత్తగా నాలుగు ప్లాట్‌ఫారాల ఏర్పాటు విషయం కూడా పెండింగ్‌లోనే ఉంది. ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ విస్తరణ, కొత్త ప్లాట్‌పారాలు ఏర్పాటుచేస్తే విద్యుత్తుతో నడిచే రైలు ఇంజిన్లను పెద్దసంఖ్యలో నిర్వహించడంతో పాటు ఎక్కువ రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంటుంది.

తీరనున్న వ్యాగన్ల కొరత!

దువ్వాడ సమీపంలో వడ్లపూడిలో వర్క్‌షాప్‌ నిర్మిస్తే వ్యాగన్ల కొరత తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వర్క్‌షాప్‌తో.. వ్యాగన్లు వందలకిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సత్వరం మర్మతులు జరుగుతాయి. వాడకంలో లేకుండా పక్కనపెట్టిన వ్యాగన్లనూ వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాగన్ల కొరత తీరడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి విశాఖ పోర్టుద్వారా జపాన్‌కు ఇనుపఖనిజం ఎగుమతులు మరింత పెరిగి విదేశీమారకద్రవ్యం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 100 అధిక అశ్వికశక్తి డీజిల్‌ ఇంజిన్ల లోకోషెడ్‌ ఏర్పాటుద్వారా ఏటా 100 ఇంజిన్లను మరమ్మతులు జరగనున్నాయి.

Link to comment
Share on other sites

పల్నాట విద్యుత్తు రైళ్ల పరుగులు

త్వరలో ప్రయాణికులకూ..

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే

gnt-brk1a.jpg

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో నల్లపాడు - కంభం మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తవడంతోపాటు ఆ మార్గం ద్వారా రైళ్లను నడుపుకోవచ్చని రైల్వే ప్రధాన భద్రతాధికారి (సీఆర్‌ఎస్‌) తాజాగా అనుమతి మంజూరుచేశారు. దీంతో ఎలక్ట్రిక్‌ లోకోలతో సరకుల రైళ్లు రాకపోకలు సోమవారం నుంచి దొనకొండ వరకు ప్రయోగాత్మకంగా నడపడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ విజయవాడ, తెనాలి మార్గం నుంచి గుంతకల్లు వైపు వెళ్లే రైళ్లు నల్లపాడు వరకు మాత్రమే విద్యుత్తు సాయంతో నడిచే లోకోలను వినియోగించేవారు. ఇక్కడ ఆ రైళ్లను ఆపి డీజిల్‌ లోకోలను బిగించి పంపేవారు. ఇక నుంచి దొనకొండ వరకూ ఎలక్ట్రిక్‌ లోకోలతో నడిపే సౌలభ్యం కలిగింది. అదేవిధంగా బెంగళూరు, గోవా నుంచి వచ్చే రైళ్లకు దొనకొండ నుంచే ఈ సదుపాయం కల్పించనున్నారు. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే తెనాలి నుంచి మార్కాపూర్‌ వెళ్లే రైలుకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. రెండో దశలో ప్రారంభించిన కంభం నుంచి దిగువమెట్ట వరకు చేస్తున్న విద్యుద్దీకరణ పనులు కూడా మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. మరోవైపు గుంతకల్లు నుంచి దిగువమెట్ట వరకూ విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చౌకగా లభించే విద్యుత్తు సాయంతో లోకోలతో రైళ్లను నడపడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గి లాభాలు రెట్టింపయ్యే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేగాకుండా పర్యావరణం కలుషితం కాకుండా కాపాడవచ్చని తెలుపుతున్నారు. ఈ మార్గం అత్యంత లాభదాయకరమైనదని సర్వేలో తేలినందునే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తూ అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తున్నదని వివరిస్తున్నారు.

Link to comment
Share on other sites

నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత్‌ లైన్‌ నిర్మాణం పూర్తి
31-05-2017 08:57:33
 
636318179686442112.jpg
  • విద్యుత రైళ్లు.. రయ్‌!
  • ప్రారంభమైన విద్యుత్‌ రైళ్ల రాకపోకలు
  • ప్రయాణం వేగవంతం
  • గూడ్స్‌ రైళ్లలో ఆదాయం
నరసరావుపేట : ఎన్నో ఏళ్లుగా విద్యుత్‌ రైళ్ల కోసం కంటున్న కల సాకారమైంది. నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత లైన నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు నుంచి కంభం రైల్వేస్టేషన్‌ వరకు 170 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.380 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ పనులు చేపట్టింది. తొలివిడతగా రెండురోజుల నుంచి గూడ్స్‌ విద్యుత్‌ రైళ్లు గుంటూరు నుంచి కంభం వరకు పరుగులు తీస్తున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రైల్లే లైన్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పనులకు తొలివిడతగా ప్రభుత్వం రూ.124 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు 401.47 కిలో మీటర్లు డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు రూ.3,631 కోట్లు వ్యయం అంచనా వేశారు. సింగిల్‌ లైన్‌ విద్యుదీకరణ పనులు కంభం వరకు పూర్తయ్యాయి. కంభం నుంచి దిగువమెట్ట వరకు సుమారు 96 కిలో మీటర్లు విద్యుదీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం గూడ్స్‌ విద్యుత్‌ రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ త్వరలోనే ప్రయాణీకుల విద్యుత్‌ రైళ్ళను కూడా ఈ పట్టాలపై పరుగులు తీయించేందుకు రైల్వేశాఖ సమాయత్తమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువ మెట్ట నుంచి గుంతకల్లు వరకు సింగిల్‌ లైన్‌ విద్యుదీకరణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కంభం వరకు విద్యుత్‌ రైళ్లను నడపనున్నారు. ఇప్పటివరకు గుంటూరు వరకే విద్యుత్‌ రైళ్ళ సౌకర్యం వుంది. గుంటూరు నుంచి కంభం వరకు విద్యుత్‌ రైళ్ళను నడిపి అక్కడినుంచి డీజిల్‌ ఇంజన్‌లను కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి విద్యుత్‌తో రైళ్లు నడవనుండటంతో వీటి వేగం పెరగనుంది. ప్రయాణం కూడా సులభతరం కానుంది. ఇదే లైన్‌లో డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు సంబందించి రాయలసీమ ప్రాంతంలో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. రెండేళ్ళల్లో డబ్లింగ్‌ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద గుంటూరు నుంచి గోవా, బెంగళూరు సర్వీసులు వేగ వంతంగా నడిచే అవకాశాలు వున్నాయి. ఈ లైన్‌ లో సరుకుల రవాణా వలన భారీగా ఆదా యం లభిస్తుంది. మొత్తం మీద విద్యుత్‌ రైళ్ళు రెండు రో జులుగా నరసరావుపేట మీదుగా నడుస్తుండ టంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend
2 express trains to be flagged off today

 

Vijayawada: Ministry of Railways has approved introduction of new trains Vijayawada - Howrah- Vijayawada Humsafar Superfast Express (Weekly), Tirupati – Jammutawi - Tirupati Superfast Express (Weekly) and Kadapa– Pendlimarri-Kadapa DEMU with effect from June 15.

 

Chief Minister N Chandrababu Naidu and Railway Minster Suresh Prabhakar Prabhu will flag off the new train services in Vijayawada on Thursday simultaneously at Tirupati and Kadapa stations via video remote link. The Vijayawada–Howrah Superfast Humsafar Express (Train No. 00890) will depart Vijayawada at 12:30 pm on June 15 and arrive at Howrah at 8.15 am on June 16. 

 

This inaugural special train will leave Rajamahendravaram at 3 pm., arrive/depart Visakhapatnam at 6.45/7.05 pm., Vizianagram at 8.05/8.10 pm., Bhubaneswar at 1.40/1.45 am., Cuttack at 2.15/2.20 am and Kharagpur at 6.20/6.25 am.

 

This train consists of 19 coaches. Of them, 16 are AC III tier coaches, one pantry car and two generator power car coaches.

 

Besides, train No. 20890 Vijayawada – Howrah Superfast Humsafar Express, which runs as regular service, will depart Vijayawada at 11:05 a.m. on every Sunday and arrive Howrah at 6.30 pm on every Monday. In the opposite direction, train No. 20889 Howrah–Vijayawada Superfast Humsafar Express will depart Howrah at 12.40 p.m. on Saturdays and arrive Vijayawada at 7.45 a.m. the next day (Sundays).

 

En route these trains will stop at Rajahmundry, Visakhapatnam, Vizianagram, Bhubaneswar,Cuttack and Kharagpur.

 

The Railway Minister will also inaugurate train No. 02705 Tirupati–Jammu Tawi Superfast Humsafar Express will depart Tirupati at 12:30 pm on June 15 and arrive/depart Secunderabad at 2.30/2.45 p.m. (early hours on next day) and arrive Jammu Tawi at 3.40 p.m. on next day.  

 

This inaugural special train will also stop at Guntakal, Adoni, Raichur, Lingampalli, Kazipet, Balharshah, Sewagram, Nagpur, Habibganj, Jhansi, Delhi Safdarjung, Panipat, Ambala Cantt, Rajpura, Sirhind, Khanna, Ludhiana and Jalandhar Cantonment Stations.

 

Similarly, train No. 22705 Tirupati–Jammu Tawi Superfast Humsafar Express will depart Tirupati at 5:15 pm. on Tuesday and arrive/depart Secunderabad at 6.55/7.20 a.m. next day (Wednesday) and arrive Jammu Tawi at 11.10 p.m. on Thursday. In the return direction, train No. 22706 Jammu Tawi–Tirupati Superfast Humsafar Express will depart Jammu Tawi at 5.30 am on Fridays and arrive/depart at 10.45/11.00 pm next day (Saturdays) and arrive Tirupati at 11.25 pm on Sundays. 

 

En route these trains will also stop at Guntakal, Adoni, Raichur, Lingampalli, Kazipet, Balharshah, Sewagram, Nagpur, Habibganj, Jhansi, Delhi Safdarjung, Panipat, Ambala Cantt, Rajpura, Sirhind, Khanna, Ludhiana and Jalandhar Cantonment stations in both the directions.

 

Train No. 07405 Kadapa–Pendlimarri DEMU will depart Kadapa at 12:30 pm on June 15 and arrive Pendlimarri at 1:30 pm on the same day. In the return direction, train No. 07406 Pendlimarri–Kadapa DEMU will depart Pendlimarri at 1.45 pm and arrive Kadapa at 2.40 pm on the same day. 

 

This inaugural special train will stop at Pabbapuram and Ganganapalle stations. Train No. 77405 Kadapa– Pendlimarri DEMU will depart Kadapa at 9:55 am on June 16 and arrive at Pendlimarri at 10.45 am on the same day. 

 

In the return direction, train No. 77406 Pendlimarri – Kadapa DEMU will depart Pendlimarri at 10.55 am on June 16 and arrive Kadapa at 11.40 am on the same day. This DEMU trains will stop at Pabbapuram and Ganganapalle stations in both the directions

 

source : http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-06-15/2-express-trains-to-be-flagged-off-today-/306579

Link to comment
Share on other sites

Guest Urban Legend

Andhra Pradesh's first mechanised laundry ready

6819_1.jpg

Tirupati: To provide much better linen for the railway passengers, the South Central Railway (SCR) is commissioning the mechanised laundry in the pilgrim city on Thursday under Build, Own, Operate and Transfer (BOOT) model. This will be the first such laundry in Andhra Pradesh and second in the SCR division with the first one was already in use at Kacheguda railway station in Telangana.

 

Highlights:

 
  • Railway Minister Suresh Prabhu to inaugurate it today from Vijayawada through remote video linkage
  • He will also commission Kadapa-Pendlimarri railway line and launch DEMU service between two stations 
  • Minister to flag off Tirupati-Katra Humsafar train

Railway Minister Suresh Prabhu will inaugurate the laundry through remote video linkage from Vijayawada in the presence of Chief Minister N Chandrababu Naidu, Union Minister M Venkaiah Naidu and other dignitaries. In Tirupati, a programme will be held in which the two MPs, Tirupati MLA and MLCs will attend. Tirupati-Katra Humsafar train will also be flagged off on the occasion for which the reservation of berths was already started.

 

The fully automatic laundry with a capacity of 2.5 tonne was set up at a cost of Rs 2 crore two km away from Tirupati railway station. They private agency will have to operate it for 10 years and hand it over to Railways. It can wash, dry and iron the linen automatically.

 

 Per day it can make 2,500 bed rolls with each bed roll consists of two blankets, one pillow cover and one face towel. The cost of each bed roll washing and pressing cost would be Rs 11.58. The laundry was established in 7,750 square feet area. The operator has installed best equipment in the world like washer-cum-extractor,

 

 flat ironer-cum-feeder and folder and dryers from China-based Dolphin company. Best of the eco-friendly steam boilers for energy efficient and pollution free generation of steam and 25,000 litres of Sintex water tanks commissioned for huge water storage. It will provide quality and fresh linen to the passengers.

 

Hitherto, the process was being done manually at Ramachandrapuram near Tirupati. From Tirupati, linen should be supplied to 11 trains which the mechanised laundry cannot do. The left over will be sent for manual washing process also. Meanwhile, the much delayed Kadapa-Bengaluru railway line becoming a reality if not immediately but in the near future with the commissioning of Kadapa-Pendlimarri new railway line which is a part of the proposed project on Thursday. 

 

Railway Minister Suresh Prabhu will inaugurate the line and also flag off the Kadapa-Pendlimarri DEMU service via remote video linkage. The foundation stone was laid for the 257 km railway line on September 2, 2010 with an estimated cost of around Rs 2,000 crore to be executed in four phases. But, it took almost seven years to complete the first phase of 22 km line between Kadapa and Pendlimarri. 

 

During phase 2, work from Pendlimarry to Rayachoti will be taken up which will be followed in phase 2B from Rayachoti to Vayalpadu in Chittoor district. It will join the existing line from Vayalpadu to Madanapalle. In phase 3, works will be taken up to Madaghatta on Andhra Pradesh border from Madanapalle and phase 3B from Madaghatta to Mulabagal on the Karnataka border. In the last phase, works from Mulabagal to Kolar would be taken up and join with the Kolar-Bengaluru line. Once completed, this line will be of immense use to the people of western parts in Chittoor district.

Link to comment
Share on other sites

Railway Minister Sri Suresh Prabhu and Sri NCBN launched various rail development programmes in Vijayawada today heralding a new era in rail connectivity in Andhra Pradesh. The state is a proud recipient of 3 major trains that were flagged off today including two Humsafar Expresses which have 13 AC-3 tier coaches including facilities such as CCTV cameras, fire and smoke detection systems and tea-coffee vending machines among others. Several other rail infra projects were also commissioned and dedicated on the occasion.

 

1. Flagging of train between Tirupati - Jammu Tawai Humsafar Weekly Express
2. Flagging of train between Vijayawada - Howrah Humsafar Weekly Express
3. Flagging off Kadapa - Pendlamarri DEMU
4. Laying of Foundation Stone for Augmentation of Diesel Loco Shed in Visakhapatnam
5. Laying of Foundation Stone for Doubling of Gooty - Dharmavaram Section
6. Dedication of Doubling and Electrification of Guntakal - Wadi Section
7. Commissioning of 2.5 ton capacity mechanized laundry at Tirupati
8. Dedication of 3-phase Electric Locomotive Simulator at Electric Traction Centre, Vijayawada
9. Dedicated doubling, electrification of Guntakal - Wadi section
10. Commissioning of Kadapa - Pendlamarri New Railway Line as a part of Kadapa-Bengaluru Project
11. Laying of Foundation Stone for Wagon POH Workshop at Vadlapudi near Visakhapatnam

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూలేని విధంగా ఒకేరోజు పది రైల్వే ప్రాజెక్టులను కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మూడు రైళ్లను కేంద్రమంత్రి వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు. వీటిలో తిరుపతి-జమ్మూతావి వయా సికింద్రాబాద్‌ హమ్‌సఫర్‌ రైలు, విజయవాడ-హౌరా హమ్‌సఫర్‌ రైలు, కడప-పెండ్లిమర్రి డెమో రైలు ఉన్నాయి. రైళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. గుంతకల్‌-వాడి మార్గంలో విద్యుదీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కడప-పెండ్లిమర్రి రైల్వేమార్గాన్ని జాతికి అంకితం చేశారు. గుత్తి-ధర్మవరం మార్గంలో డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. విజయవాడలోని లోకో పైలట్‌ శిక్షణా కేంద్రంలో సిమ్యులేటర్‌, తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఆటోమేటిక్‌ లాండ్రీ సదుపాయం, విశాఖలో డీజిల్‌ లోకోషెడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సురేశ్‌ ప్రభు మాట్లాడుతూ.. ఒకే రోజు ఒక రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎన్నడూ ప్రారంభించలేదని, విజయవాడ భారతదేశానికి లాజిస్టిక్‌ హబ్‌గా మారుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయని, గతంలో కంటే 166శాతం అదనంగా నిధులిస్తున్నామని అన్నారు. అమరావతి అనుసంధానం కోసం రైల్వేలైన్‌ సర్వే చేస్తున్నారని, అలాగే అమరావతిలో రైల్వే క్లైమ్ ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేస్తామని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సత్వరం అందిస్తున్నందువల్లే ఇన్ని ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్రంలో రూ.41వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
సురేశ్‌ప్రభు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం వల్లనే రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సురేశ్‌ ప్రభుకు ధన్యవాదాలు తెలిపారు

 

19144116_1710602982286619_37251054454412

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...