Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 2 weeks later...
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు
 
636217427205673932.jpg
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. పలు నూతన రైల్వే లైన్ల సర్వేకు అనుమతిచ్చారు.
  • మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్‌ సర్వేకు అనుమతి
  • మంచిర్యాల-గడ్చిరోలి మధ్య రైల్వే లైన్‌ సర్వేకు అనుమతి
  • పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ సర్వేకు అనుమతి
  • మునీరాబాద్-మహబూబాబాద్ రైల్వేలైన్‌కు రూ.300కోట్లు
  • మనోహరాబాద్‌-కొత్తపల్లి మధ్య రైల్వేలైన్‌కు రూ.350కోట్లు
  • నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్‌కు రూ.340కోట్లు
  • అక్కన్నపేట-మెదక్‌ మధ్య రైల్వేలైన్‌కు రూ.196 కోట్లు కేటాయింపు
  • యాదాద్రి-ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు రూ.16కోట్లు
  • కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్‌కు రూ.240కోట్లు
  • కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్‌కు రూ.150కోట్లు
  • గుంటూరు-గుంతకల్‌ మధ్య రైల్వే డబ్లింగ్‌ పనులకు రూ.124కోట్లు
  • కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్‌కు రూ.430 కోట్లు
  • ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు
  • గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు
  • తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు
  • మంచిర్యాల- పెద్దపల్లి మధ్య మూడో లైన్‌కు రూ.100కోట్లు
  • విజయవాడ-అమరావతి మధ్య రైల్వేలైన్‌కు రూ.2680కోట్లు
  • గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు
  • విజయవాడ-గుడివాడ లైన్
  • మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు
  • చర్లపల్లిలో శాటిలైట్ స్టేషన్‌కు రూ.5కోట్లు
  • ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు
  • తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు
  • కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వే
  • కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్‌కు అనుమతి
  • మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్‌కు సర్వే
  • హిందూపురం-చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్‌కు సర్వేకు కేంద్రం అనుమతిచ్చింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


విజయవాడ-అమరావతి మధ్య రైల్వేలైన్‌కు రూ.2680కోట్లు

 

:super:

Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులివే!

3brk-railway1a.jpg

హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే పరిధిలో నూతన రైల్వే లైన్ల సర్వేకు, అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రైల్వే బడ్జెట్‌ను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు. * ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్‌లకు రూ.19 కోట్లు కేటాయింపు

* బొల్లారం, ముకుంద్‌ మధ్య 235 కి.మీ రైల్వేలైన్‌ డబ్లింగ్‌ సర్వే

* కాజీపేట-బలార్షా మధ్య నాలుగో లైన్‌ సర్వే

* కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్‌ సర్వే

* విజయవాడ-అమరావతి-గుంటూరు లైన్‌కు రూ.2,680 కోట్లు(106 కి.మీ)

* రాజమహేంద్రవరం యార్డు అభివృద్ధికి రూ.27.2 కోట్లు.

* రాయనపాడులో షెడ్‌ నిర్మాణానికి రూ.8.7 కోట్లు

* తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7కోట్లు

* మౌలాలి వద్ద ఈఎంయూ కార్‌షెడ్‌కు రూ.5.86 కోట్లు

* గూడూరు వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి రూ.2.7కోట్లు

*విజయవాడ-గుడివాడ లైన్‌ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించేందుకు రూ.130కోట్లు

*గుంటూరు- తెనాలి రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.36 కోట్లు

*కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.100 కోట్లు

* విజయవాడ-గూడూరు మూడో లైన్‌కు రూ.100 కోట్లు

* హిందూపురం-చిత్రదుర్గ మధ్య నూతన రైల్వే లైన్‌ సర్వేకు అనుమతి

*కొండపల్లి-కిరండోల్‌ మధ్య నూతన రైల్వేలైన్‌ సర్వేకు అనుమతి

* మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్‌ ఏర్పాటుకు సర్వే

*విజయవాడ-నిడదవోలు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.122 కోట్లు

*సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.50కోట్లు

*గుత్తి-ధర్మవరం రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.75కోట్లు.

*పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ నూతన రైల్వే లైన్‌కు రూ.25కోట్లు.

*జగ్గయ్యపేట-మేళ్లచెరువు-జాన్‌పహాడ్‌ మార్గానికి రూ.79 కోట్లు.

*మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు

*తిరుచానూరు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.6కోట్లు.*అక్కన్నపేట-మెదక్‌ రైల్వే లైన్‌కు రూ.196కోట్లు

*విజయవాడ-కాజీపేట, రేణిగుంట, గుత్తి బైపాస్‌లకు రూ.135 కోట్లు

*కాకినాడ-పిఠాపురం రైల్వే మార్గానికి రూ.150కోట్లు.

* ఓబులాపురం-కృష్ణపట్నం రైల్వేలైన్‌కు రూ.100కోట్లు

* గుంతకల్‌-కల్లూరు రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు రూ.52కోట్లు.

*మంచిర్యాల-పెద్దపల్లి మూడో లైన్‌కు రూ.100 కోట్లు

*యాదాద్రి-ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్‌ రైలు విస్తరణకు అదనంగా రూ.16కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు

Link to comment
Share on other sites

రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న రైల్వే మంత్రి
 
విజయవాడ: కాసేపట్లో రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రిమోట్ కంట్రోల్ ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు తరహాలో అందుబాటులోకి అత్యాధునిక సౌకర్యాలు రానున్నాయి. రైల్వేస్టేషన్లను వినోద, వాణిజ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రైల్వే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను సిద్ధం చేశారు. ప్రాజెక్టును రైల్వే మంత్రి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభిస్తారు.
Link to comment
Share on other sites

విజయవాడ - గూడూరు మధ్య మరో లైను
 
636229167162558467.jpg
 
  •  రాజధాని ప్రాంతానికి పెరగనున్న రైళ్ల కనెక్టివిటీ
  • ఆధునికీకరణ జాబితాలో తెనాలి రైల్వే జంక్షన్
  • మూడో రైల్వే లైనుతో మహర్దశ
దేశంలోనే అత్యంత కీలకమైన హౌరా-చెన్నై రైలు మార్గంలో మూడో లైను ఏర్పడనుంది. విజయవాడ - గూడూరు, విజయవాడ - దువ్వాడ మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ కీలకం కానుంది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.

గుంటూరు, తెనాలి : నవ్యాంధ్ర రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో రాజధానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన ఉంది. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ మీదుగా దువ్వాడ నుంచి గూడూరు వరకు మూడో లైను మంజూరైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది. రెండు లైన్లతో రద్దీ
ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు అవసరమని భావిసున్నారు. తెనాలి -విజయవాడ - గుంటూరును కలుపుతూ రాజధాని మీదుగా భవిష్యత్తులో కొత్త రైల్వే లైన్లు రానున్నాయి. రాజధానిని కలుపుతూ ఈ నగరాల మధ్య రైళ్ల కనెక్టివిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెనాలి - గుంటూరు - విజయవాడ మధ్య సర్క్యులర్‌ రైళ్లు నడుస్తున్నాయి.
తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌
తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో వైపు రాజధాని అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడల మధ్య కొత్త లైన ఏర్పడనుంది. తెనాలి మీదుగా ఉన్న హౌరా- చెన్నై ప్రధాన రైలు మార్గాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేస్తే పెరిగే ప్రయాణ అవసరాలకు తగిన విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యతలో ఈ మార్గంలో హై స్పీడ్‌ రైళ్లతో పాటు బుల్లెట్‌ ట్రైన్లను నడిపే ప్రతిపాదనను రైల్వే పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.
Link to comment
Share on other sites

త్వరలోనే అమరావతి రైలు మార్గం పనులు
 

గుంటూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి నూతన రైలు మార్గం నిర్మాణ ప్రక్రియ 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ రైలు మార్గం నిర్మాణ పనులను ఆర్‌వీఎనఎల్‌ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.2,680 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం మొదటి దశ పనులను 2017 ఆర్థిక సంవత్సరం ఆఖరుకు, గుంటూరు-తెనాలి డబ్లింగ్‌ పనులను 2018-19లో పూర్తి చేస్తామని చెప్పారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రప్రథమంగా గురువారం గుంటూరు రైల్వే డివిజన ఇనస్పెక్షనకు వచ్చారు. నడికుడి మార్గంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఇనస్పెక్షన నిర్వహించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...