Jump to content

AP Railway Projects


Recommended Posts

22 minutes ago, rk09 said:

45 KM ki 4+ years padithe 

inka remaining 250+ KM yenni years chestharo

malli AP 50% investment share and land allotment. Repu adigo AP govt. not cooperative antaremo. ade jarigela vundi

- aa area lo velle trains ki toll gate pettalemo 

 

 

Link to comment
Share on other sites

  • Replies 386
  • Created
  • Last Reply
చివరి దశలో.. విద్యుద్దీకరణ
25-12-2018 10:42:25
 
636813313469324250.jpg
  • నడికుడి రైలుమార్గంలో వేగంగా పనులు
  • ఇప్పటికే నల్లపాడు - తుమ్మలచెరువు భాగం పూర్తి
  • మూడు రోజులుగా నల్గొండ - పగిడిపల్లె సెక్షన్‌ ట్రయల్‌రన్‌
  • మార్చి నెలాఖరుకు మొత్తం సెక్షన్‌ పూర్తి చేసేందుకు లక్ష్యం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): నల్లపాడు - పగిడిపల్లె వయా నడికుడి రైలుమార్గం విద్యుద్దీకరణ పనులు చివరి దశకు చేరుకొంటోన్నాయి. ఇప్పటికే పూర్తి అయిన నల్గొండ - పగిడిపల్లె 70 కిలోమీటర్ల సెక్షన్‌ని మూడు రోజులుగా కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ పరిశీలిస్తున్నారు. సీఆర్‌ఎస్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే ఈ మార్గంలో విద్యుత్‌ లోకోలతో రైళ్లు నడిపేందుకు అనుమతి వస్తుంది. మొత్తం సెక్షన్‌లో మిగిలిపోయిన తుమ్మలచెరువు - నల్గొండ భాగాన్ని కూడా 2019 మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఆ తర్వాత సెక్షన్‌ మొత్తాన్ని పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తారు. నడికుడి మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి అయితే రైళ్ల వేగం మరింత పెరుగుతుందని, గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు తక్కువ దూరం కలిగిన రైలుమార్గంగా నడికుడి సెక్షన్‌ ఉన్నది. 281 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ సెక్షన్‌ సికింద్రాబాద్‌ నుంచి పగిడిపల్లె వరకు దశాబ్దాల క్రితమే విద్యుద్దీకరణ జరిగి ఉన్నది.
 
అక్కడి నుంచి ప్రారంభమయ్యే గుంటూరు డివిజన్‌కి ఎలక్ట్రిఫికేషన్‌ లేకపోవడంతో డీజిల్‌ ఇంజన్లతో రైళ్లని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు వైపు నుంచి నల్లపాడు వరకు ఎలక్ట్రిఫికేషన్‌ జరిగింది. మూడేళ్ల క్రితమే నల్లపాడు - పగిడిపల్లె విద్యుద్దీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి మొత్తం రూ.145 కోట్లను రైల్వే శాఖ మంజూరు చేసింది. మొత్తం పనిని మూడు భాగాలుగా విభజించి పూర్తి చేస్తోన్నారు. తొలుత నల్లపాడు నుంచి తుమ్మలచెరువు వరకు పూర్తి కాగా ఈ సెక్షన్‌ని సేఫ్టీ అధికారులు పరిశీలించి ఎలక్ట్రికల్‌ లోకోలతో రైళ్లు నడుపుకోవచ్చని క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే మార్గమధ్యలో ఎక్కడా డీజిల్‌ లోకోలని మార్చే అవకాశం లేకపోవడంతో నేటికీ డీజిల్‌ ఇంజన్లతోనే రైళ్లని నడుపుతున్నారు.
 
మూడు రోజుల నుంచి కమిషనర్‌ ఆఫ్‌ సేఫ్టీ రైల్వేస్‌ నల్గొండ - పగిడిపల్లె సెక్షన్‌ని ఇన్‌స్పెక్షన్‌ చేస్తున్నారు. ఈ కారణంగా పల్నాడు, ఫలక్‌నుమా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు పైగా ఆలస్యంగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఆదివారంతో ఇన్‌స్పెక్షన్‌ పూర్తి అయింది. ఇక ఈ సెక్షన్‌లో మిగిలి ఉన్న తుమ్మలచెరువు - నల్గొండ భాగం మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి అయితే 2019-20 నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రికల్‌ లోకోలతో రైళ్లు నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది.
 
తగ్గనున్న ప్రయాణ సమయం
దక్షిణ మధ్య రైల్వేజోన్‌లోనే పగిడిపల్లె - గుంటూరు సెక్షన్‌ అత్యంత నాణ్యమైనదిగా ఉన్నది. ఇటీవల ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించిన అధికారులు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపినా ఎలాంటి కుదుపులు లేకుండా వచ్చింది. గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్య ఎలాంటి స్టాపులు లేని నెంబర్‌ 12796/12795 లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌ సిటీ రైలు కేవలం 3 గంటల 40 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటున్నది. మిగిలిన రైళ్ల వేగం కూడా పెరగడంతో అవి 15 నుంచి 20 నిమిషాల ముందుగానే గుంటూరుకు చేరుకుంటున్నాయి. విద్యుద్దీకరణ మార్గం అందుబాటులోకి వస్తే సెక్షన్‌ స్పీడ్‌ మరింత పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెబుతోన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
పశ్చిమలో ప్రగతి కూత
 

చివరి దశకు కృష్ణపట్నం - ఓబులవారిపల్లె ట్రాక్‌ పనులు
ట్రైల్ రన్‌ విజయవంతం
పెరగనున్న రవాణా.. తగ్గనున్న దూరం
వెంకటాచలం, న్యూస్‌టుడే

nlr-top1a_43.jpg

జిల్లాలోని పడమటి పల్లెల్లో రైలు కూత వినిపించనుంది. నిన్న మొన్నటి వరకు రోడ్డు మార్గాలే సక్రమంగా లేని మెట్ట ప్రాంతాల్లోనూ ఇక రైళ్లు పరుగులు తీయనున్నాయి. కలగానే మిగులుతుందనుకున్న రైలు మార్గం ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైలు మార్గం పూర్తికావస్తుంది. రైల్వే అధికారులు తొలిసారిగా ఈమార్గంలో మంగళవారం ట్రయిల్‌ రన్‌  విజయ వంతమైంది. మొత్తం మార్గాన్ని  నెల రోజుల్లో  పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. ఈ మార్గం పూర్తయితే కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరనున్నాయి. నెల్లూరు- కడప జిల్లాల మధ్య దూరం కూడా తగ్గనుంది.

ప్రస్తుతం సొరంగ మార్గం మినహా ఇస్తే రెండు వైపులా  రైల్వేలైను పనులు పూర్తయ్యాయి. సొరంగ మార్గం పనులు కూడా సగానికి పైగా పూర్తయ్యాయి.  సొరంగం మినహా పనులు పూర్తి కావటంతో అధికారులు మంగళవారం వెంకటాచలం నుంచి సొరంగ మార్గం వరకు 65 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా రైలును తిప్పారు. ఈ దూరాన్ని కేవలం 40 నిమిషాల్లోపలే.. రైలింజన్‌ చేరింది. రైల్వే చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ వీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

* జాతీయ రహదారి, గ్రామీణ రహదారులు, గ్రామాల్లోకి వెళ్లే మార్గాలున్న ప్రాంతాల్లో బాక్స్‌టైపు బ్రిడ్జిలు, పంటకాలువలు ఉన్న చోట కల్వర్టులు, పటిష్టమైన బ్రిడ్జిల నిర్మాణాలు చేశారు.

సులభ రవాణాకు బీజం
* పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రవాణా వ్యవస్థ కీలకం. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే ఏరంగంలో అయినా విస్తృత అభివృద్ధి సాధించవచ్చు.
* ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం పోర్టుకు కేవలం రవాణా కోసమే ఈమార్గాన్ని మొదట ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం ఓబులవారిపల్లె నుంచి నేరుగా లైను వేయటంతో సుమారు 76 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
* ప్రస్తుతం ఈమార్గంలో కసుమూరు, ఆదురుపల్లి, రాపూరు, చెర్లోపల్లి, మంగంపేటల వద్ద మొత్తం అయిదు రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
* పోర్టుకు రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈమార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థ్యం ప్యాసింజర్‌ రైళ్లు కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఈరైల్వే లైను పనులను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పరిశీలించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ఆయన రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైళ్లు తిరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువమంది ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైల్వేస్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించారు.

* ప్రస్తుతం ఒకమార్గం మాత్రమే ఏర్పాటు చేయగా, రవాణా పెరిగే అంశాన్ని బట్టి రెండో మర్గం కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

పల్నాట రైలు కూత
 

చురుగ్గా నడికూడి-శ్రీకాళహస్తి రైలు మార్గం
తుది దశకు చేరిన మొదటి దశ పనులు
త్వరలో గుంటూరు- గుంతకల్‌ మార్గానికి అనుసంధానం
వినుకొండ, న్యూస్‌టుడే

gnt-top1a_48.jpg

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నడికూడి-శ్రీకాళహస్తి రైలు మార్గం మొదటి దశ నిర్మాణ పనులు తుది అంకానికి చేరుకున్నాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తొలిదశ గుంటూరు జిల్లాలో 45.5 కి.మీ రైలు మార్గం నిర్మిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నాటికి అంటే మరో రెండు నెలల్లో గుంటూరు-గుంతకల్‌ మార్గానికి అనుసంధానం చేయాలన్నా అధికారుల ప్రయత్నాలు సఫలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని రొంపిచర్ల, శావల్యాపురం మధ్య వంతెనల నిర్మాణాలు, రైలు కట్ట పనులు చురుగ్గా సాగుతున్నాయి.

నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడికూడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణం చేపట్టారు. నాలుగు దశల్లో పూర్తి చేయాలని సంకల్పించారు. ఇందుకవసరమైన భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 200 మీటర్లు న్యాయస్థానంలో వ్యాజ్యం వలన నిలిచిపోగా, ప్రకాశంలో అసైన్డ్‌ భూముల సమస్య పరిష్కర దశలో ఉండగా నెల్లూరులో వేగవంతం చేశారు. మొదటి దశలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు రూ.350 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో రొంపిచర్ల వరకు 33 కి.మీ గత ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి ట్రయిల్‌ రన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత మిగిలిన 18 కి.మీ ఈ సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలన్నా లక్ష్యంతో పనులు వేగవంతం చేశారు. ఈరెండింటి మధ్య ఆరు స్టేషన్లు నిర్మించాల్సి ఉండగా, వాటిల్లో న్యూ పిడుగురాళ్ల(కొండమోడు), నకరికల్లు, కుంకులగుంట, రొంపిచర్ల పూర్తి కాగా సంతగుడిపాడు, వేల్పూరు స్టేషన్ల పనులు మొదలయ్యాయి. వీటితో పాటు శావల్యాపురం, న్యూ పిడుగురాళ్లలో అదనపు వసతులు కల్పించాల్సి ఉంది.

దశల వారీగా  ఇలా..
మొదటి దశ పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 45.5 కి.మీ, రెండోదశలో గుండ్లకమ్మ- దర్శి మధ్యలో 41.95 కి.మీ, మూడో దశలో దర్శి-కనిగిరి మధ్య 95.55 కి.మీ, నాలుగో దశలో కనిగిరి- ఓబులేయపల్లి(నెల్లూరు జిల్లా) వరకు 95.55 కి.మీ పూర్తి చేయాలని లక్ష్యం నిర్ణయించారు. మొత్తం 309 కి.మీ లైన్‌ నిర్మాణానికి 5189 ఎకరాలు భూమి అవసరమవుతుందని తేల్చారు. ఇందుకుగాను రూ.2300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో 160 వంతెనలు, 28 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, 144 రోడ్‌ అండర్‌  బ్రిడ్జిలతో పాటు 37 రైల్వేస్టేషన్లు, 26 క్రాసింగ్‌లు, 11 హాల్ట్‌లు ఏర్పాటుచేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ ప్రణాళికల్లో పేర్కొన్నారు.

ప్రయోజనాలు ఎన్నో..
నడికూడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తయితే, దీన్ని దిల్లీ-చెన్నై, హౌరా-చెన్నై మార్గాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చు. తుపాన్‌ వలన తరచూ దిల్లీ, చైన్నై ట్రాక్‌ దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. ఈ రైలుమార్గం నిర్మాణంతో ఆ సమస్య అధిగమించవచ్చు. గుంటూరు-తిరుపతికి దగ్గర మార్గమవుతుంది. రాజధాని అమరావతికి మూడు జిల్లాల మెట్ట ప్రాంత వాసుల రాకపోకలకు సులవవుతుంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల, గురజాల ప్రాంతంలోని ఖనిజ సంపద బెంగుళూరు తదితర ప్రాంతాల రవాణాకు మెరుగవుతుంది. రాయలసీమలోని అనంతపురం నుంచి హైదరాబాద్‌ ఇతరత్రా ప్రాంతాలకు సరకు రవాణా రైళ్ల రాకపోకలు పెరుగుతాయి.

విద్యుద్దీకరణకు ప్రతిపాదన
ఈరైలు మార్గంలో విద్యుద్దీకరణకు ప్రతిపాదనలు పంపించాం. ఈ పనులు 2022 నాటికి పూర్తి చేయాలన్నా లక్ష్యంతో ఉన్నాం. త్వరలో శావల్యాపురం వద్ద గుంటూరు-గుంతకల్‌ మార్గానికి అనుసంధానం చేస్తాం. ఇది గొప్ప ప్రాజెక్టుగా భావిస్తున్నాం. 

Link to comment
Share on other sites

Allocations of Railway Projects In #Budget2019 for #VijayawadaDivision

Doubling of Vijayawada-Bhimavaram-Nidadavolu Line

Length : 220 KM

Estimated Cost : Rs 1504 Cr

Released till date : Rs 795 Cr

Allocated in this Budget : Rs 175 Cr

Total : Rs 970 Cr Released

 

Tripling of Vijayawada - Gudur Line

Length : 287 Km

Estimated Cost : Rs 3,246 Cr

Released till date : Rs 284 Cr

Allocated in this Budget : Rs 350 Cr

Total Funds Released : Rs 634 Cr

 

Tripling of Vijayawada - Kazipet Line

Length : 219 KM

Estimated Cost : Rs 1,857 Cr

Released till date : -----

Allocated in this Budget : Rs 110 Cr

Total Funds Released : Rs 110 Cr

 

New Railway Line b/w Kotipalli - Narsapur

Length : 57 KM

Estimated Cost : Rs 2,120 Cr

Released till date : Rs 323 Cr

Allocated in this Budget : Rs 200 Cr

Total Funds Released : Rs 523 Cr 

Link to comment
Share on other sites

  • 1 month later...
వేగం పుంజుకోని పనులు
 

నింపాదిగా గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌
నల్లపాడు-సాతులూరు, డోన్‌- పెండేకల్లు మధ్య నెలాఖరుకు పూర్తయ్యేనా?

gnt-top1a_81.jpg

రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానం చేసే ప్రధాన రైలు మార్గం గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏడాది క్రితం మంజూరైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో సుమారు 401.47 కి.మీ. మార్గాన్ని ఆరు భాగాలుగా విభజించుకొని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కొద్ది శాతం మినహా అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. అయితే పనులు నత్తనడకన నడుస్తుండడంతో గడువు నాటికి పూర్తవుతాయా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

న్యూస్‌టుడే, వినుకొండ

గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో డబ్లింగ్‌ ఆవశ్యకతను గుర్తించిన రైల్వేశాఖ 2017 జనవరిలో విద్యుద్దీకరణతో కలిపి రూ.3,631 కోట్లు మంజూరు చేసింది. రాయలసీమ జిల్లాల నుంచి నేరుగా అమరావతికి చేరుకోవడానికి ఇదే సరైన మార్గం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు సాధించింది. తద్వారా నవ్యాంధ్ర రాజధానికి పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని, అందుకు తగ్గట్లు రైళ్ల సంఖ్య పెంచాలంటే రెండో మార్గంతోపాటు విద్యుద్దీకరణ అత్యవసరంగా భావించారు. అంతేకాకుండా రాయలసీమలో సున్నపురాయి, నాపరాయి, సిమెంటు, రంగురాళ్ల పరిశ్రమలు అధికంగా ఉన్నందున కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవులకు గూడ్స్‌ రైళ్లల్లో వాటి ఉత్పత్తులను తరలించడానికి సులువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. నంద్యాల- ఎర్రగుంట్ల మార్గం పూర్తి చేసి ఈ లైన్‌కు అనుసంధానం చేయడంతో కడప, కర్నూలు జిల్లాల నుంచి రాజధానికి చేరుకోవడానికి చేరువుగా ఉంది. గతంలో కడప నుంచి విజయవాడ రావాలంటే తిరుపతి మీదుగా తిరిగి వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి.

gnt-top1b_19.jpg

ఇవే ప్రణాళికలు
నల్లపాడు-సాతులూరు, డోన్‌-పెండేకల్లు మధ్య మొదటి దశలో చేపట్టిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ అధికారులు ధీమాగా చెప్పలేకపోతున్నారు. సాతులూరు-దిగువమెట్ట, నంద్యాల-డోన్‌, పెండేకల్లు-గుంతకల్లు చోట్ల మట్టి పనులు చేస్తున్నారు. వచ్చే 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో దిగువమెట్ట- నంద్యాల మధ్య నల్లమల అభయారణ్యం ఉండడం, బొగద, చలమ వద్ద సొరంగాలను విస్తృతపరచాల్సివుండడంతో కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయ్యాయి. దాంతో ఇక్కడ పనుల పూర్తికి 2022 వరకు గడువు ఇచ్చారు. ఈ మార్గం మొత్తం కలిపి భారీ, మధ్యతరహా వంతెనలు, ఆర్వోబీలు, సబ్‌వేలు సుమారు 700 నిర్మించాల్సివుండగా వీటిలో కొన్ని పూర్తయ్యాయి.

gnt-top1c_7.jpg

ఎలక్ట్రికల్‌ రైళ్లకు లైన్‌ క్ల్లియర్‌
గుంటూరు నుంచి గుంతకల్లు వరకు సింగిల్‌ లైను విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నారు. పాణ్యం, దిగువమెట్ట మధ్య అడవిలో నుంచి సాగే మార్గంలో రెండు చోట్ల సొరంగాలు ఉన్నందున విద్యుత్తు తీగల ఏర్పాటుకు ఎదురైన ఇబ్బందులను అధిగమించి పనులు పూర్తి చేసినట్లు సీనియర్‌ డీఈ శ్రీనివాస్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...