Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
 
గుంటూరు - తెనాలి రైల్వే డబ్లింగ్‌ తుది దశకు..
27-04-2018 08:54:53
 
636604160928414947.jpg
  • జూన్‌ నెలాఖరుకు పూర్తి చేసేందుకు లక్ష్యం
  • ఆమోదం తెలిపిన కలెక్టర్‌ కోన శశిధర్‌
గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు - తెనాలి రైల్వే డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు చివరి దశకు చేరుకుం టున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) ఈ ఏడాది జూన్‌ నెలాఖరుకు మొత్తం పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నట్లు కలెక్టర్‌కు తాజాగా నివేదించింది. ప్రాజెక్టులో కీలకమైన డొంకరోడ్డు మూడొంతెనల వద్ద మరో వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నది. పది రోజుల పాటు ఆ మార్గంలో రోడ్డు ట్రాఫిక్‌ని నిలుపుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇందుకు కలెక్టర్‌ ఆమోదం తెలిపి నగరపాలకసంస్థ, పోలీసు శాఖకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావడానికి జిల్లా యంత్రాంగం అందిస్తోన్న సహకారంపై డీఆర్‌ఎం వీజీ భూమా హర్షం వ్యక్తం చేశారు.
 
గుంటూరు - తెనాలి డబ్లింగ్‌, విద్యుద్దీకరణ ప్రాజెక్టుని ఇంచు మించు ఏడు, ఎనిమిది సంవత్సరాల క్రితమే రైల్వేబోర్డు సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. రైల్వే పింక్‌బుక్‌లో కూడా దీనిని చేర్చారు. మొత్తం 24.38 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గం నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం రైల్వే శాఖ మొత్తం రూ. 197 కోట్లను విడతలు వారీగా విడుదల చేసింది. ప్రాజెక్టు ప్రారంభ దశ లో అంచనా వ్యయం రూ. 120 కోట్లే కాగా దశలవారీగా వ్యయం పెరిగిపోయింది. భూసేకరణలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. డొంకరోడ్డు మూడొంతెనల వద్ద నుంచి నందివెలుగురోడ్డు ఎల్‌సీ గేటు వరకు ఉన్న ఇళ్లని తొలగించేందుకు పలుమార్లు గృహ యజమానులతో చర్చలు జరపాల్సి వచ్చింది. అలానే చేబ్రోలు మండలంలోనూ భూసేకరణ ప్రక్రియ జాప్యం జరిగింది. కలెక్టర్‌ శశిధర్‌, జాయింట్‌ కలెక్టర్‌గా గతంలో పని చేసిన కృతిక శుక్ల, డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ రైల్వే ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఆర్‌డీవోలు, తహసీల్దార్లను ఆదేశించి భూసేకరణ పూర్తి చేయించారు.
 
ఈ ప్రాజెక్టులో కొన్ని ముఖ్యమైన పనులను ఆర్‌వీఎన్‌ఎల్‌ గుర్తించింది. బకింగ్‌హామ్‌ కాలువపై ఐరన్‌ గడ్డర్స్‌తో బ్రిడ్జీ, నంది వెలుగురోడ్డులో ఆర్‌వోబీ, మూడొంతెనల విస్తరణ పనులు ఎంతో క్లిష్టమైనవి. బకింగ్‌హామ్‌ కాలువపై వంతెన దాదాపుగా పూర్తి కావొచ్చింది. గుంటూరు నుంచి జాగర్లమూడి సెక్షన్‌ వరకు రైల్వే ట్రాక్‌ నిర్మాణం పూర్తి అయింది. మూడొంతెనల వద్ద నూతన బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేస్తే జాగర్లమూడి వరకు డబ్లింగ్‌ పూర్తిగా అందు బాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని డీఆర్‌ఎం భూమా ఇటీవల జరిగిన రైల్వే అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రకటించారు. మూడొంతెనల బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రోడ్డు ట్రాఫిక్‌ బ్లాక్‌ని అనుమ తించాలని ఆర్‌వీఎన్‌ఎల్‌ కోరింది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఆమోదం తెలిపింది.
 
బైపాస్‌ కానున్న కొన్ని రైళ్లు
ప్రస్తుతం గుంటూరు - తెనాలి మార్గం సింగిల్‌ లేన్‌గా ఉండ టం వలన ఎక్కువ రైళ్లను నడపలేని పరిస్థితి. క్రాసింగ్‌ల కోసం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని కూడా లూప్‌లైన్‌లో నిలపాల్సి వస్తోంది. అదే డబ్లింగ్‌ అందుబాటులోకి వస్తే క్రాసింగ్‌ సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లని తెనాలి - న్యూ గుంటూరు మీదగా విజయవాడకు మళ్లించే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
విశాఖ, విజయవాడలో ‘రైల్‌ నీర్‌’ కర్మాగారాలు

ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం, విజయవాడ సహా దేశవ్యాప్తంగానున్న 11 నగరాల్లో త్వరలో ‘‘రైల్‌ నీర్‌’’ ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటుచేయాలని ఐఆర్‌సీటీసీ ప్రణాళికలు రచిస్తోంది. జాబితాలో విశాఖపట్నం, విజయవాడతోపాటు గువాహటి, జబల్‌పూర్‌, కోట, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, భుసావల్‌, నంగల్‌, రాంచీ పేర్లువున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటుచేయబోయే ఈ 11 కర్మాగారాలకు  రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ఏడు రైల్‌ నీర్‌ కర్మాగారాలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా రోజుకు 6 లక్షల లీటర్ల మంచి నీటి సీసాలను ఉత్పత్తి చేస్తోంది.  డిమాండ్‌ మాత్రం 16 లక్షల లీటర్ల వరకూ ఉంది. తాజా కర్మాగారాల ఏర్పాటుతో 85 శాతం వరకూ డిమాండ్‌ను అందుకోగలుగుతామని అధికారులు తెలిపారు. రైలు డ్రైవర్లు, వారి సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు 47 వర్చువల్‌ రియాలిటీ సిమ్యులేటర్లను రైల్వే కొనుగోలు చేయనుంది. దీని కోసం రూ.350 కోట్ల వెచ్చించనుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
1 minute ago, Kiran said:

Edho oka long term pending pani jaruguthundhi enjoy ani:rolleyes:

Nuvvu poorthi ga chandramukhi la maripoyina Jyothika type lo thayarayyav ga .. asal nee posts chusthunte neeku aa state bjp leaders ki theda ne theliyatam ledu :(  India kosam BJP ante okay .. kaani maata kooda padanivvani range lo moyyala aa jaffas ni ?‍♂

Link to comment
Share on other sites

42 minutes ago, Sree Ram said:

Nuvvu poorthi ga chandramukhi la maripoyina Jyothika type lo thayarayyav ga .. asal nee posts chusthunte neeku aa state bjp leaders ki theda ne theliyatam ledu :(  India kosam BJP ante okay .. kaani maata kooda padanivvani range lo moyyala aa jaffas ni ?‍♂

National level topics only disking ga majority?

Other topics lo ki ee seenu454 batch calling

Link to comment
Share on other sites

గుంటూరు - నంద్యాల.. ఇంటర్‌సిటీ రైలు కోసం పట్టు
01-07-2018 10:47:45
 
636660388638333082.jpg
  • కనీసం స్పెషల్‌ ట్రైన్‌గానైనా పట్టాలెక్కించాలి..
  • డీఆర్‌యూసీసీ ఏకగ్రీవ తీర్మానం
  • రైల్వే జీఎం దృష్టికి తీసుకెళతానని డీఆర్‌ఎం హామీ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): నంద్యాల - గుంటూరు - నంద్యాల రైల్వేస్టేషన్ల మధ్యన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును పట్టాలెక్కించాలని డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్‌సల్‌టేటివ్‌ కమిటీ గుంటూరు రైల్వే డివిజన్‌ అధికారులపై ఒత్తిడిని పెంచింది. కమిటీలో సభ్యులుగా ఉన్న గుంటూరు, నంద్యాలకు చెందిన నాయకులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త రైలు అంటే రైల్వేబోర్డు నుంచి మంజూరు కావాల్సి ఉన్న దృష్ట్యా కనీసం స్పెషల్‌ ట్రైన్‌గా అయినా ప్రవేశ పెట్టాలని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వీజీ భూమాని కోరారు. నిత్యం నడపకపోయినా వారంలో ఐదు రోజులు నడిపేలా చూడాలని, స్పెషల్‌ ట్రైన్‌ని మంజూరు చేసే అధికారం జనరల్‌ మేనేజర్‌ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. డీఆర్‌యూసీసీలో తీసుకొన్న ఈ కీలక నిర్ణయంపై జోనల్‌ అధికారులు ఏ విధంగా స్పందిస్తారోనన్న చర్చ డివిజనల్‌ రైల్వే వర్గాల్లో జరుగుతోన్నది.
 
గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో నంద్యాల మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో ఎలాంటి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపడం లేదు. ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్టు రైళ్లు మాత్రమే నడుస్తోన్నాయి. అది కూడా దూర ప్రాంతాలకు నడిచేవి. దీని వలన ఆయా రైళ్లలో జనరల్‌ భోగీల్లో సీట్లు, రిజర్వేషన్‌ కోచ్‌ల్లో టిక్కెట్‌లు లభించక ప్రయాణీకులు ఇబ్బంది పడుతోన్నారు. ఎప్పటి నుంచో గుంటూరు - నంద్యాల/కర్నూలు మధ్యన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ నడపాలన్న డిమాండ్‌ ఉన్నది. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ రైల్వేబోర్డు ఇప్పటివరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు.
 
ఈ నేపథ్యంలో డీఆర్‌యూసీసీ సభ్యులు దీనిపై గట్టి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని నగరం గుంటూరులో ఉన్న దృష్ట్యా నంద్యాల, కంభం, గిద్దలూరు, మార్కాపురం, దొనకొండ, వినుకొండ, నరసరావుపేట నుంచి ఇక్కడికి వచ్చి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని దృష్ట్యా గుంటూరు - నంద్యాల ఇంటర్‌సిటీకి కచ్చితంగా డిమాండ్‌ ఉంటుందని కమిటీ సభ్యులు విశ్లేషిస్తోన్నారు. నిత్యం వేకువజామున 4.30 గంటలకు నంద్యాలలో బయలుదేరి పైన పేర్కొన్న స్టేషన్ల మీదగా ఉదయం 9.45కి గుంటూరు చేరుకొనేలా టైంటేబుల్‌ రూపొందించాలని సిఫార్సు చేశారు. అలానే సాయంత్రం వేళ 5.15కు గుంటూరు నుంచి బయలుదేరి రాత్రి 10.30కి నంద్యాల చేరుకొనేలా రైలు నడిపితే ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ ఉంటుందని నివేదించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ వద్ద ప్రస్తుతం రెండు రేక్‌లు అందుబాటులో ఉన్నాయని, వాటిని లింగంపల్లి - కాకినాడ మధ్యన నడుపుతోన్నారని చెప్పారు. వాటిల్లో ఒకటి గుంటూరుకు మంజూరు చేయిస్తే నంద్యాలకు స్పెషల్‌ట్రైన్‌గా నడపొచ్చని సూచించారు.
 
 
ప్రయాణీకుల ఆదరణను బట్టి రెగ్యులర్‌ సర్వీసు కోసం బోర్డుకు సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ అధికారులతో మాట్లాడతానని జీఎం హామీ ఇచ్చినట్లుగా డీఆర్‌యూసీసీ సభ్యులు ఆంధ్రజ్యోతికి తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...