Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
  • 1 month later...
ఫిబ్రవరి నుంచి గుంటూరు-గుంతకల్లు మధ్య విద్యుత్‌ రైలు
11-12-2017 13:27:48
 
636485956731235917.jpg
  • ఫిబ్రవరి నుంచి గుంటూరు-గుంతకల్లు మధ్య విద్యుత్‌ రైలు
  • జనవరి 17న దక్షిణ మధ్య రైల్వే జీఎం నంద్యాలకు రాక
  • గుంటూరు డీఆర్‌ఎం జ్యోతి భూమా
నంద్యాల(కర్నూలు జిల్లా): వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి గుంటూ రు- గుంతకల్లు మధ్య విద్యుత్‌ రైలు రాకపోకలు ప్రారంభమవుతాయని గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ జ్యోతి భూమా అన్నారు. ఆదివారం నంద్యాల రైల్వే స్టేషన్‌ తనిఖీకి ఆమె ప్రత్యేక రైలులో వచ్చారు. రైల్వే స్టేషన్‌లోని వసతులను, వివిధ కార్యాలయాలను పరిశీలించి తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పాణ్యం నుంచి గుంతకల్లు, దిగువమెట్ట నుంచి గుంటూరు వరకు విద్యుత్‌ మార్గంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించామని, నంద్యాల నుంచి దిగువమెట్ట వరకు రైలు మార్గం విద్యుత్‌ పనులు జరుగుతున్నాయని తెలి పారు. ఫిబ్రవరి మొదటి వారంలో ముం దుగా గూడ్స్‌ రైలు నడిపి చివరి వారంలో రైళ్లను నడుపుతామని తెలిపారు. అలాగే గుంటూరు నుంచి గుంతకల్లు వరకు డబుల్‌ లైన్‌ పూర్తిస్థాయిలో మార్చి నెల నుంచి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డబుల్‌ లైన్‌ నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు జరిగాయని, కేవలం 11 ఎకరాల భూమి సేకరణ పెండింగ్‌లో ఉండటంతో మార్చిలో పనులు జరుగుతాయన్నారు.
 
 
నంద్యాల రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్‌కు పెద్దపీట వేశామని, క్లీన్‌ ఇండియా, క్లిన్‌ నంద్యాల పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా జనవరి నెల 17 వ తేదీన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ యాదవ్‌ నంద్యాల రైల్వేస్టేషన్‌కు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నంద్యాల రైల్వే స్టేషన్‌ దక్షిణం వైపు ఉన్న బుకింగ్‌ కౌంటర్‌ నుంచి సేవలను అందిస్తామన్నారు. మూలసాగరం రైల్వే గేటు పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నంద్యాల విజయ డెయిరీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌లో, గాజులపల్లె రైల్వే స్టేషన్‌లో ఎంపీ ఎస్‌పీవైరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. డీఆర్‌ఎం వెంట గుంటూరు రైల్వే డివిజన్‌ వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు, స్థానిక సిబ్బంది ఉన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
8 hours ago, kishbab said:

Bro.small doubt..ee line nadikudi-srikalahasthi antunnaru.. already ndkd to pdglra line undi kda.so piduguralla-srikalahasthi kda.deeni venka Amna logic unda

nadiukudi-piduguralla line goes south towards Nallapadu Jn. from there one line goes to Guntur and other line goes to Vinukonda-donakonda-guntakal.

this new line separates before piduguralla and joins vinukonda-nadikudi-guntaka line at Savalyapuram. separates after vinukonda and goes south towards Srikalahasti.

https://s9.postimg.org/4gjnln2j3/nadikudi-srikalahasti-rail-line.jpg

track in the red color is the new Nadikudi -Srikalahasti line

Link to comment
Share on other sites

 

రెండో లైనుకు సై? 
బీబీనగర్‌- నల్లపాడు డబ్లింగ్‌ సర్వే పూర్తి 
రైల్వే బడ్జెట్‌లో ఆమోదించే అవకాశం 
విష్ణుపురం వద్ద బైపాస్‌కు ప్రతిపాదన 
తెలుగు రాష్ట్రాల రాజధానుల  మధ్య తగ్గనున్న దూరం 
24ap-state1a.jpg

ఈనాడు- హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌- నల్లపాడు మార్గంలో రెండో రైల్వే లైను నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీబీనగర్‌- నల్లపాడు మధ్య రెండు వరుసల (డబ్లింగ్‌) లైను ఏర్పాటుకు సర్వే ఇటీవల పూర్తయింది. సర్వే నివేదిక రెండో లైను నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మార్గంలో విష్ణుపురం వద్ద బైపాస్‌ నిర్మించాలని కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. ఇక్కడ బైపాస్‌ లైను నిర్మిస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రస్తుతమున్న రెండు ప్రధాన రైలు మార్గాలు అనుసంధానమవుతాయి. దూరం కూడా తగ్గుతుంది. 
తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రస్తుతం రెండు రైలు మార్గాలున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి భువనగిరి, కాజీపేటల మీదుగా విజయవాడ ఒకటి. రెండోది వయా నల్గొండ- నల్లపాడు- గుంటూరు- విజయవాడ. రెండో మార్గంలో సికింద్రాబాద్‌- బీబీనగర్‌, నల్లపాడు- గుంటూరు- విజయవాడ మినహా మిగిలిన మార్గం అంతా సింగిల్‌ లైనే. ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఒక రైలు వెళ్లేవరకు మరో రైలును ఆపాల్సిన పరిస్థితి. దీంతో రెండో లైను సర్వేకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణలో బీబీనగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నల్లపాడు వరకు 243 కిలోమీటర్ల మేర రెండో లైను నిర్మాణానికి సర్వే ఇటీవల పూర్తయ్యింది. నిర్మాణ వ్యయం, అదనంగా చేపట్టాల్సిన భూసేకరణ అంశాల్ని నివేదికలో పొందుపరిచారు. వచ్చే బడ్జెట్‌లో రెండో లైనుకు ఆమోదం తెలపడం దాదాపు ఖాయమేనని రైల్వే వర్గాల సమాచారం.

ప్రత్యామ్నాయం.. తగ్గనున్న దూరం 
బీబీనగర్‌- నల్లపాడు సర్వేలో విష్ణుపురం వద్ద బైపాస్‌ నిర్మిస్తే రెండు ప్రధాన మార్గాల మధ్య అనుసంధానంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయం అవుతుందని, దూరం కూడా తగ్గతుందని సర్వే నివేదికలో సూచించినట్లు సమాచారం. తెలంగాణలోని విష్ణుపురం నుంచి మేళ్లచెరువు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట వరకు పూర్తిస్థాయి రైలు మార్గం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. విష్ణుపురం వద్ద బైపాస్‌ లైను నిర్మిస్తే సికింద్రాబాద్‌, నల్గొండ వైపు నుంచి.. లేదంటే గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లను అవసరమైనప్పుడు విష్ణుపురం నుంచి జగ్గయ్యపేట వైపు మళ్లించవచ్చని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ బైపాస్‌ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య దూరం 50- 60 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రెండు ప్రధాన లైన్లలో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఈ బైపాస్‌ మీదుగా మరో మార్గంలోకి రైళ్లను మళ్లించవచ్చు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

Visakhapatnam - Vijayawada Premium Double Decker Train Named as UDAY Express Launching This Summer Train No : 22701/22702 Frequency : 5 Days Except Sun, Thu Stoppages : Duvvada, Anakapalle, Tuni, Samalkot, Rajahmundry, Eluru Coaches : All Coaches are Air Conditioned (AC)

DSqzSyfVwAErRuY.jpg

Link to comment
Share on other sites

10 hours ago, Urban Legend said:

f3505f46-bc69-4310-925a-4d0b2ca13fa6.jpg

Mari bullet train ki 1lakh koka ekkadi nundi thecchaaru - mana daani ki 45k cr ivva Leka pakkanettaadanta 

 

mana rammohan naidu private bill bill emi ayyindi ?? No disco just Talaq talaq talaq Ani paari poyyaadaaa pushp head ??

Link to comment
Share on other sites

Guest Urban Legend
తుది దశలో ఆర్వోబీ, ఆర్‌యూబీ 
పనులు పరిశీలించిన ప్రాజెక్టు ముఖ్య ఇంజినీరు సూర్యబ్రహ్మానందం 
amr-brk4a.jpg

నకరికల్లు,న్యూస్‌టుడే: నవ్యాంధ్రలో కీలకమైన నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ముఖ్య ఇంజినీరు పి.సూర్యబ్రహ్మానందం పేర్కొన్నారు. పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు కొనసాగుతున్న పనుల తీరును మంగళవారం ఆయన పరిశీలించారు. తొలిదశలో పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు 75 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. సదరు మార్గంలో కంకరతో పాటు రైల్వే లైను ఏర్పాటు చేసేలా స్లీపర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. న్యూ పిడుగురాళ్ల, నకరికల్లు (పెదనెమలిపురి), రొంపిచర్ల రైల్వే స్టేషన్లు పనులు తుదిదశకు చేరాయన్నారు. ఆయాచోట్ల సిగ్నల్‌ వ్యవస్థ, ఎలక్ట్రీకల్‌ పనులు చేయాల్సి ఉందన్నారు. దీంతో పాటు కుంకలగుంట సమీపంలో రైలు హల్ట్‌ స్టేషను పనులు చేపడుతున్నట్లు సీఈ చెప్పారు. రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు ఇప్పటికే 30 శాతం పనులు పూర్తి చేశామని ఆయన వివరించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉన్న నేపథ్యంలో పనులు వేగవంతంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. 308 కిలోమీటర్ల మేర వెంకటగిరి వరకు సాగే సదరు ప్రాజెక్టు పరిధిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో త్వరలో పనులు ప్రారంభిస్తామని బ్రహ్మానందం వివరించారు. రైల్వేప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న ఆర్‌యూబీ, ఆర్వోబీ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఈ బ్రహ్మానందం వివరించారు. త్రిపురాపురం, కొండమోడు సమీపంలో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మరో 35 వరకు ఆర్‌యూబీలు పనులు చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టు పనుల వద్ద నాణ్యత ప్రమాణాలు పరీక్షించే ప్రయోగశాలను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు. ఆయన వెంట ప్రాజెక్టు ఉప ముఖ్య ఇంజినీరు కె. ముత్యాలనాయుడు, రైల్వే ఈఈ పీవీ సుధాకర్‌, డీఈఈ శైలేష్‌, రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్లు చిలంకుర్తి ఎన్వీ సుబ్బారావు, బీఎంకే గుప్త, విజయ్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
చకచకా... రైల్వే లైన్‌ డబ్లింగ్‌
26-01-2018 11:02:02
 
636525613265795371.jpg
  • విజయవాడ నుంచి నర్సపూర్‌ వరకు డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌
  • ఐదు ప్యాకేజీల్లో విజయవాడ, గుడివాడ, బందరు, నర్సపూర్‌
  • రైల్వే డివిజన్‌ పరిధిలో విజయవాడ నుంచి నర్సపూర్‌ వరకు డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు
  • 221 కి.మీ. రూ.1504 కోట్లు
  • ఐదు ప్యాకేజీల్లో విజయవాడ, గుడివాడ, బందరు, నర్సపూర్‌ మధ్య పనులు
  • 2020కి పూర్తి.. ఆ దిశగా చర్యలు
  • రైల్వే వికాస్‌ నిగమ్‌ సంస్థ అదనపు జీఎం మూర్తి
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ, నర్సపూర్‌ మధ్య డబ్లింగ్‌, ఎలక్ర్టిఫికేషన్‌ పనులు చకచకా జరుగు తున్నాయి. విజయవాడ నుంచి 221 కిలోమీటర్లు దూరం..నర్సపూర్‌ వరకు .రూ 1504 కోట్లతో డబ్లింగ్‌ పనులు చేపట్టారు. వీటిని రైల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్థ ఆధ్వర్యాన జరుగుతున్నాయి. రైల్వే డివిజన్‌ పరిధిలో విజయవాడ- గుడివాడ, గుడివాడ- భీమ వరం, భీమవరం- నిడదవోలు, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నర్సపూర్‌ వరకు ప్రస్తుతం సింగల్‌ లైనే. దీంతో క్రాసింగ్‌ల కారణంగా చాలాసేపు రైళ్ల నిలిపేయాల్సిన పరిస్థితి ఉంది. దీని నివారించడానికి 30 ఏళ్ల నుంచి ఎంపీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. బీజేపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఈ రైల్వే లైనుకు ప్రాధాన్యమిచ్చారు. దీనికోసం మూడేళ్ల కిందట రైల్వే బడ్జెట్‌లో రూ 1504 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 221 కిలోమీటర్ల దూరం డబ్లింగ్‌ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి కేంద్రం పచ్చజెండా ఇవ్వడంతో పనులు మొదలయ్యాయి.
 
 
ఐదు ప్యాకేజీలు ఇవే
ఈ పనులు ఐదు ప్యాకేజీల్లో జరుగుతాయని ప్రకటించారు. విజయవాడ- గుడివాడ, గుడివాడ- భీమవరం, భీమవరం- నిడదవోలు, గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నర్సపూర్‌ మధ్య పనులు జరగాలి. వీటిని వేర్వేరుగా ప్రకటించినా మొత్తం పనులు 2020 నాటికి పూర్తి చేసేలా అఽధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్థ అదనపు జనరల్‌ మేనేజర్‌ మూర్తి రెండు రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్‌లో 66 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైళ్లు వెళుతున్నాయి. సింగిల్‌ లైన్‌ కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు పూర్తయితే అవస్థలు తొలగుతాయి.
 
భూసేకరణలో పలు అడ్డంకులు
అయితే పనుల కోసం అవసరమైన భూసేకరణ విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అవసరమైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. భూసేకరణ పనులు పూర్తి చేసేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
 
 
సమయానికి పూర్తి చేస్తాం
ఎన్ని అడ్డంకులు వచ్చినా2020కి డబ్లింగ్‌ పనులు, ఎలక్ర్టిఫికేషన్‌ పూర్తి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. దీంతో పాటు విజయవాడ- బిట్రగుంట మధ్య మూడో లైను ఏర్పాటు చేయడానికి టెండర్ల దశ దాటింది. భూసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ప్లాన్‌లు, డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి.
మూర్తి, అదనపు జీఎం, రైల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రైలు ప్రాజెక్టులకు కేటాయింపులు షురూ 
నరసాపురం-కోటిపల్లికి రూ. 200 కోట్లు 
నిడదవోలు-గుడివాడ డబ్లింగ్‌ పనులకు రూ. 200 కోట్లు 
ఈనాడు, ఏలూరు, నిడదవోలు - న్యూస్‌టుడే 
tpg-top2a.jpg

సాధారణ బడ్జెట్‌లో కలిపి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు ఆశాజనక కేటాయింపులు జరిగాయి. ప్రధానమైన నరసాపురం-కోటిపల్లి, భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌  పనులు పూర్తిచేసే దిశగా నిధులు కేటాయించారు. జిల్లాకు మొత్తంగా రూ. 400 కోట్లు ప్రకటించారు.

జిల్లాలో ప్రధానమైనది, ఎన్నోఏళ్ల కలగా ఉన్న నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌. ఈ పనులకు గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపులు భారీగానే ఉన్నాయి. ప్రధానంగా నరసాపురం ఎంపీ భాజపా ప్రతినిధి కావడంతోపాటు కోస్తా ద్వారా వాణిజ్యపరంగా భారీ ఆదాయం వస్తుందని సర్వేల ద్వారా తెలుసుకున్న రైల్వేశాఖ ఈ లైన్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. 2016-17 బడ్జెట్‌లో  అప్పటి రైల్వేమంత్రి సురేష్‌ప్రభు రూ. 200 కోట్లు కేటాయించారు. అదేక్రమంలో 2017-18 బడ్జెట్‌లో రూ. 450 కోట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్లుగానే ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. గోదావరిపై కీలకమైన వంతెన పనులకు టెండర్లు కూడా పిలిచారు.  ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా బడ్జెట్‌ 2018-19 ఆర్థికసంవత్సరంలో రూ. 200 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది కాస్తంత తక్కువే. క్షేత్రస్థాయిలో పనులు చురుగ్గా జరిగి నిధులు వినియోగించుకుంటేనే కేటాయించిన నిధులకు  సార్థకత చేకూరుతుంది. కారణమేమిటంటే గతంలో 2000-01 ఆర్థికసంవత్సరంలో ఈలైన్‌కు రూ. 700 కోట్లు కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడం వల్ల ఈ నిధులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నిధులు కాగితాలకే పరిమితమయ్యాయి.

కొవ్వూరు-భద్రాచలానికి రూ. కోటి: కీలకమైన కొవ్వూరు-భద్రాచలం లైన్‌కు రూ. కోటి మాత్రమే నిధులు కేటాయించారు. దీనిద్వారా గిరిజన ప్రాంతాలకు రైలుమార్గం వెళుతుందన్న ఆశలకు కాస్తంత ఊపిరి కలిగింది.  నిధులు స్వల్పమే అయినప్పటికీ అసలు కేటాయింపు అంటూ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డెల్టాకు తీపికబురు 
మచిలీపట్నం-భీమవరం-నరసాపురం-నిడదవోలు డబ్లింగ్‌ పనులకు కూడా నిధుల కేటాయింపు అనుకున్న స్థాయిలోనే జరిగింది. డబ్లింగ్‌ పనులతోపాటు విద్యుద్దీకరణకు కలిపి ఈలైన్‌కు కేటాయింపులు చేయాల్సిఉంది. ఈ పనులు ఇప్పటికే చురుగ్గా సాగుతుండగా దీనికి నాలుగేళ్లక్రితం బీజం పడింది. తాజా బడ్జెట్‌ 2018-19లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇది డెల్టా ప్రాంత ప్రజలకు తీపి కబురు. దీని పొడవు 187 కిలోమీటర్లు. మచిలీపట్నం, గుడివాడలను కలుపుతూ విజయవాడ వరకు 1928లో మీటరుగేజ్‌ లైన్‌ను ప్రారంభించారు, 1961లో ఈ మీటర్‌గేజ్‌ రైలు మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌ మార్గంగా మార్చారు. 1929లో నిడదవోలు నుంచి నరసాపురం వరకు సుమారు 77 కిలోమీటర్లు బ్రాడ్‌గేజ్‌ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు రైలు మార్గాలు సింగిల్‌లైన్‌ బ్రాడ్‌గేజ్‌ మార్గంగానే మిగిలిపోయాయి. ఈ మార్గాలను డబ్లింగ్‌ చేయాలని, విద్యుద్దీకరణ ఏర్పాటు చేయాలని 1957 నుంచి ఈ ప్రాంత ప్రజలు వేడుకున్నారు. అయితే 2011-12 రైల్వేబడ్జెట్‌లో ఈ మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రకటించారు. అందుకు రూ.1050 కోట్ల వరకు అవసరమవుతాయని వాటిని విడుదల చేసి ఆ ఏడాదే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాలో రూ.46 కోట్లను విడుదల చేసినా పనులు ప్రారంభం కాలేదు. 2012-13 రైల్వేబడ్జెట్‌లో కూడా మళ్లీ అదే ప్రకటన చేశారు. అనంతరం సర్వే పూర్తి చేశారు. 2013-14 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఊసు ప్రస్తావనే రాలేదు. 2015-16 బడ్జెట్‌లో రూ.150 కోట్లు, 2016-17 బడ్జెట్‌లో రూ.75 కోట్లు వరకు నిధులు కేటాయించారు. 2017-18 బడ్జెట్‌లో రూ.122 కోట్లు కేటాయించడంతో గత ఏడాది కాలంగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం పనిని 5 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో కూడా రూ.200 కోట్ల వరకు కేటాయించారు. దాంతో పనులు మరింత చురుగ్గా సాగుతాయి ప్రజలు భావిస్తున్నారు. దాంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీరే సమయం దగ్గరకు రావడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఈ పనులకు సంబంధించి 2011-12 నుంచి 2018-2019 వరకు అంటే ఇంతవరకు రూ.593 కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది పనులు మరింత ముందుకు...  ఎంతో ప్రాధాన్యం కల్గిన ఈ రైల్వే బ్రాంచిలైన్‌పై నిత్యం 14 నుంచి 15 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటిలో ప్రధానంగా విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లు విశాఖ ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లు శేషాద్రి, లోక్‌మాన్య తదితర ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ బ్రాంచిలైన్‌ పొడవునా ప్రధానంగా నిడదవోలు, తణుకు, అత్తిలి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం, తరిగొప్పల, విజయవాడ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా పలు చిన్న రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల నుంచి నిత్యం లక్ష నుంచి లక్షాఏభై వేల మంది వరకు ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రధానమైన ఈ రైల్వే మార్గాన్ని డబ్లింగ్‌ చేస్తే ఈ ప్రాంత ప్రయాణికులకు మరిన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగవుతాయి.

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్గం... బ్రాంచిలైన్‌ ఇంతవరకు సింగిల్‌ మార్గంగానే మిగలడంతో ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. ఏటా కోట్లాది రూపాయల ఆక్వా, చక్కెర, వ్యవసాయ ఉత్పత్తులు, కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు అంచనా. అయినా ఈ రైల్వేలైన్‌ అభివృద్ధికి ఇంతవరకు సరైన రీతిలో కృషి జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ లైన్‌ను డబుల్‌లైన్‌గా అభివృద్ధి చేస్తే తణుకు ప్రాంతంలో చక్కెర, భీమవరం, నరసాపురం, ఆకివీడు వంటి ప్రాంతాల నుంచి ఆక్వా ఎగుమతులు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి ఎగుమతులకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. అలాగే ప్రయాణ వేగం పెరగడంతో పాటు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు పెరిగే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...