Jump to content

AP Railway Projects


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 386
  • Created
  • Last Reply
కీలక దశలో గుంటూరు - తెనాలి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణ
 
636250793722825382.jpg
  • నందివెలుగురోడ్డు నుంచి మూడొంతెనల వరకు సేకరణకు సన్నాహాలు 
  • రంగంలోకి దిగిన రెవెన్యూవర్గాలు .. 140 ఇళ్లు ప్రభావితమయ్యే అవకాశం 
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు కాలనీల నివాసితులు
ఆంధ్రజ్యోతి - గుంటూరు/సంగడిగుంట: గుంటూరు-తెనాలి రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటి వరకు గుంటూరు మండలం పరిధిలో నందివెలుగు రోడ్డు వరకు భూమిని సేకరించారు. ఇక్కడి నుంచి మూడొంతెనల వరకు సుమారు 3.60 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. త్వరలో సామా జిక ప్రభావిత అంచనాను పూర్తి చేసి ఎవరెవరికి ఎంతెంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ణయించి ముందుకెళ్లాలని రెవెన్యూ, రైల్వే శాఖలు తలపో స్తోన్నాయి. అయితే తాము నిరుపేదలమని, తమ బతుకులు ఛిద్రం చేయొద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అక్షింతలతో అధికారుల్లో చలనం
భూసేకరణలో జాప్యం కారణంగా గుంటూరు - తెనాలి రైల్వే డబ్లింగ్‌ నత్తనడకన కొనసాగుతుండ టంపై ప్రభుత్వం నుంచి జిల్లా రెవెన్యూ అధికారు లకు అక్షింతలు పడ్డాయి. దీంతో ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ఒక కొలిక్కి తీసుకొచ్చేందు కు రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఆదేశాల మేరకు గుంటూరు ఇనచార్జ్‌ ఆర్‌డీవో మురళీ, తహసీల్దార్‌ నాగిరెడ్డి, రెవెన్యూ అధికారులు సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మణిపురం బ్రిడ్జికి సమీ పంలో వినోభానగర్‌ దర్గా వద్దకు ప్రకాశనగర్‌, గణేశ్వరరావువీధి బాధితులను పిలిపించి ప్రాజెక్టు గురించి వివరించారు. వినోభానగర్‌ వైపున నంది వెలుగు రోడ్డు నుంచి డొంకరోడ్డు మూడొంతెనల వరకు రైల్వేట్రాక్‌ పొడవునా ఏడు మీటర్ల భూమి ని సేకరించాల్సి ఉందన్నారు. 140 ఇళ్లు పాక్షికంగా /పూర్తిగా ప్రభావితమౌతాయని తెలిపారు. బాధి తులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టప రిహారం అందుతుందని వివరించారు. పూర్తిగా ఇల్లు కోల్పోయే వారికి వేరొక చోట ఇల్లు కట్టించి ఇస్తామని ఆర్డీవో మురళీ వివరించారు.
 
స్థలం ఇచ్చే ప్రసక్తే లేదంటున్న బాధితులు
రైల్వే ప్రాజెక్టు కోసం తమ గూడును కూల్చేస్తామనడం భావ్యం కాదని బాధితులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్‌కు అవతల వైపున పుష్కలంగా రైల్వే స్థలమే అందుబాటులో ఉన్నప్పటికీ దానిని వదిలేసి తమ ఇళ్లను కూల్చుతామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తాము నిరుపేదలం కాబట్టే సంవత్స రాల తరబడి అన్ని సమస్యలను అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నామని, అలాంటిది అది కూడా తీసేస్తామనడం సమంజసం కాదన్నారు. బాధితుల ఆవేదనను స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఏదైనా ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో మళ్లీ సంప్ర దింపులు జరుపుతామని అధికారులు ప్రకటించి వెనుదిరిగారు. యజమానులందరూ రైల్వే శాఖకు నెహ్రూనగర్‌, ఇజ్రాయిల్‌పేట వైపు ట్రాక్‌ నుంచి 18 మీటర్ల స్థల ఉంది. ఆ స్థలం తీసుకుంటే ట్రాక్‌ నిర్మించుకోవచ్చు అనేది అందరి అభిప్రాయం. వారి స్థలం ఉంచుకుని ప్రైవేటు స్థలం ఇవ్వమంటే ఇచ్చే ప్రశ్నేలేదని తేల్చి చెప్పారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...

తీర ప్రాంత రైల్వే లైన్‌!

రాష్ట్రానికి అవసరం

నౌకాశ్రయాలతో రైల్వేను అనుసంధానించాలి

రాష్ట్రాభివృద్ధిలో ఆ మార్గం కీలకమవుతుంది

ద.మ.రైల్వే జీఎంతో లోక్‌సభ సభ్యుల సమావేశం

ఈనాడు - అమరావతి

9ap-main3a.jpg

శ్రీకాకుళం నుంచి తడ వరకు తీర ప్రాంతం వెంట రైల్వే లైన్‌ అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యులు సూచించారు. తీర ప్రాంతవాసులకు రైల్వే సదుపాయాన్ని పెంచడంతోపాటు నౌకాశ్రయాలను అనుసంధానించడం ఈ మార్గం ఉద్దేశం కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తీర ప్రాంత రైలు మార్గం కీలకమవుతుందని చెప్పారు. మంగళవారం విజయవాడలో లోక్‌సభ సభ్యులతో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నడుస్తున్న రైల్వే ప్రాజెక్టులతోపాటు మంజూరైన ప్రాజెక్టులు, అపరిష్కృత సమస్యలతోపాటు కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. గతంలోనూ సమావేశాలు నిర్వహించారని, వివిధ సందర్భాల్లో ఇచ్చిన విజ్ఞాపనలు ఏ దశలో ఉన్నాయో కూడా స్పష్టత లేదని రైల్వే అధికారులను ఎంపీలు తప్పుబట్టారు. పురోగతిని తెలిపే బాధ్యతను ఓ అధికారికి అప్పగించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కాకినాడను ప్రధాన రైల్వే మార్గంలోకి తీసుకువచ్చేందుకు పనులను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సమావేశం వివరాలను తెలియజేస్తూ జనరల్‌ మేనేజర్‌ తన పరిధిలోని పనులనైనా వేగవంతంగా చేయాలని అభిప్రాయపడ్డారు.

చిన్నచిన్న పనులూ చేయడం లేదు: రాయపాటి

సమావేశం మధ్యలోనే నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బయటకు వచ్చేశారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భోజనం, టిఫిన్ల కోసమా సమావేశాలకు వచ్చేదంటూ అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్‌ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానిని, రైల్వే మంత్రులనూ కలిశారని, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ నుంచి విభజించడానికి అధికారులు అంగీకరించడం లేదని అన్నారు. అధికారులు ప్రధానికంటే శక్తిమంతులుగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై తానేమైనా మాట్లాడితే ముఖ్యమంత్రికి కోపం వస్తుందని వ్యాఖ్యానించారు. మరో ఏడాది గడిస్తే జోన్‌ గురించి మరిచిపోతామని, విశాఖలో జోన్‌ ఏర్పాటు అసాధ్యంలా ఉందని అభిప్రాయపడ్డారు.

9ap-main3b.jpg

ఈ ఏడాది చివరికి 30 కిలోమీటర్లు పూర్తి

నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 309 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. ఈ మార్గానికి సంబంధించి 30కిలోమీటర్ల లైను వేసేందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించి ఇచ్చిందని, ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేస్తామని అన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు టెండర్ల దశకు వచ్చాయన్నారు.

Link to comment
Share on other sites

What happened to Vizag Railyway Zone? Vizag Metro?

 

Indulo Railway Zone raakapothe maathram BJP & TDP ni next elections lo marchipovachhu in Vizag.

 

No pressure from state MPs at all. No pressure from State Government on Center.

 

Railways ki ekkuva income vachhedi south that too AP region, but spend chesedi migatha states lo.

Link to comment
Share on other sites

డప-బెంగళూరు రైలు మార్గానికి భూసేకరణ

kdp-gen7a.jpg

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: కడప-బెంగళూరు రైలు మార్గానికి సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి గురువారం పెండ్లిమర్రి మండలంలోని ఆరు గ్రామాల్లో భూసేకరణకు అవసరమైన ప్రదేశాలను రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆర్‌ఐఎస్‌ఈఎస్‌ సామాజిక సంస్థ గుర్తించింది. ఈ సందర్భంగా ఆర్‌ఐఎస్‌ఈఎస్‌ సామాజిక నిపుణుడు దేవరాజు మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి విభాగం వారు రైల్వే విస్తరణ అభివృద్ధిలో భాగంగా కడప-బెంగళూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైను నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు అమలుకు ప్రస్తుతం 233.88 ఎకరాల భూమిని పెండ్లిమర్రి మండలంలో భూసేకరణ చేయాల్సి వస్తుందని చెప్పారు. అందులో భాగంగానే భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అంచనా నివేదికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక ప్రభావ అంచనా నివేదికను తయారుచేయుటకు ఆర్‌ఐఎస్‌ఈఎస్‌ ఏజెన్సీని కలెక్టరు నియమించినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా ఆర్‌ఐఎస్‌ఈఎస్‌ టీమ్‌ కడప నుంచి బెంగళూరు వరకు కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైను పనుల్లో భాగంగా పెండ్లిమర్రి నుంచి వీరన్నగుట్టపల్లె రైల్వేస్టేషన్ల మధ్య 18 కిలోమీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పు (రైల్వే స్టేషన్‌ ప్రదేశంలో 135 మీటర్ల వెడల్పు)తో భూసేకరణ అవరసం ఏర్పడిందని చెప్పారు. దీనికి గాను దాదాపు 233.88 ఎకరాల భూమి పెండ్లిమర్రి మండలానికి చెందిన పెండ్లిమర్రి, చిన్నదాసరిపల్లె, చీమలపెంట, గొందిపల్లె, నందిమండలం గ్రామాల్లో చేపట్టాల్సి ఉందన్నారు. అలాగే ఆలిరెడ్డిపల్లె గ్రామం వేంపల్లె మండలానికి సంబంధించి ఆరెకరాల్లో భూమి సేకరించాల్సి వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. భూమి కోల్పోయే రైతులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వేలో వివరాలు సేకరిస్తామన్నారు. అలాగే ఈ నెల 15న ఉదయం 9 గంటలకు పెండ్లిమర్రి, మధ్యాహ్నం 12 గంటలకు చిన్నదాసరిపల్లె, మధ్యాహ్నం 3 గంటలకు చీమలపెంట, సాయంత్రం 5 గంటలకు గొండిపల్లె గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతను అదే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంను తహసీల్దార్ల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు (నష్టపోయేవారు) పాల్గొని వారి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. భూమి నష్టపోయేవారు ఇచ్చే సూచనలు, సలహాలు ఆడియా, వీడియో రూపంలో, లిఖిత పూర్వకంగా రికార్డు చేసి జిల్లా కలెక్టరుకు నివేదికను సమర్పిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్‌ఐఎస్‌ఈఎస్‌ సంస్థ ప్రతినిధులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

What happened to Vizag Railyway Zone? Vizag Metro?

 

Indulo Railway Zone raakapothe maathram BJP & TDP ni next elections lo marchipovachhu in Vizag.

 

No pressure from state MPs at all. No pressure from State Government on Center.

 

Railways ki ekkuva income vachhedi south that too AP region, but spend chesedi migatha states lo.

odisha elections ayye varuku deeni gurinchi matladina vupayogam ledhu. Poni Vij center ga istamu ante manam flexibility chupincham. manaki kavalsindhi ivvamante vallu kudaradhu antaru. avasaram manadhi so konchem flexible ga manam vunte bagundhedhi.

Link to comment
Share on other sites

గుంటూరు- గుంతకల్ రైల్వేలైన్‌ విద్యుద్దీకరణకు గ్రీన్‌సిగ్నల్‌
17-05-2017 13:32:03
636306248315589782.jpg
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు- గుంతకల్ రైల్వేలైన్‌ విద్యుద్దీకరణ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.3631 కోట్లతో 401 కి.మీ మేర ఉన్న ఈ రైల్వే లైన్‌ విద్యుద్దీకరణ పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం మీదుగా ఈ రైల్వేలైన్ ఉంది. ఇదిలా ఉండగా రైల్వే లైన్ విద్యుద్దీకరణ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

18-05-2017 03:58:01
636306767870029163.jpg
  • రైల్వే బోర్డు అనుమతి.. భూసేకరణ ప్రారంభం
  • ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుమ్మల
హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): భద్రాచలం రోడ్‌ - సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ లైన్‌ నిర్మాణానికి రైల్వే బోర్డు బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈ లైన్‌ కోసం ఎదురు చూస్తున్న స్థానిక ప్రజల కోరిక నెరవేరబోతోంది. రైల్వే లైన్‌కు భూసేకరణ కూడా మొదలైంది. ఈ ప్రాజెక్టుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైల్వే, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు టెండర్లు కూడా త్వరలో పిలుస్తామని మంత్రి తెలిపారు. భద్రాచలం రోడ్‌ - సత్తుపల్లి మీదుగా కొవ్వూరు వరకు 133.70 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును భారత రైల్వే సంస్థ, సింగరేణి కాలరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే 500 ఎకరాల భూసేకణ ఖర్చును భారత రైల్వే సంస్థ భరిస్తుంది. మన రాషా్ట్రనికి సంబంధించి 53.20 కి.మీ.ల లైన్‌ను రూ.704.31 కోట్లతో సింగరేణి నిర్మించనుంది. కొత్తగూడెం జిల్లాలో 36 కి.మీ., ఖమ్మం జిల్లాలో 17.3 కి.మీ.ల రైల్వేలైన్‌ అందుబాటులోకి రానుంది. భూసేకరణకు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి తుమ్మల ఆదేశించారు. పాండురంగాపురం - కొత్తగూడెం రైల్వే లైన్‌ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం రామాలయానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించాలని రైల్వే అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అనుమతించిన సత్తుపల్లి - కొవ్వూరు, సత్తుపల్లి - కొండపల్లి మార్గాల్లో ఎక్కువ భాగం ఏపీలో ఉండటంతో నిర్మాణాన్ని తెలుగు రాషా్ట్రలు సంయుక్తంగా చేపట్టాల్సి ఉందన్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 9 ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల పనుల గురించి కూడా తెలుసుకున్నారు. వీటితో పాటు కొత్తగా ప్రాతిపాదించిన 40 ఆర్‌వోబీల పనులు కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి సునీల్‌ శర్మ, ఈఎన్‌సీ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

AP projects ki state government kharchu to land acquisition cheyyamantunnaru mari ee project ki railways chestundi enti?

గుంటూరు-గుంతకల్లు రైలుమార్గం డబ్లింగ్‌

విద్యుదీకరణతో కలిపి వ్యయం రూ.3631 కోట్లు

చెరిసగం భరించనున్న కేంద్రం, రాష్ట్రం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు- గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గాన్ని నిర్మించి, విద్యుదీకరించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 401.47 కి.మీ. మార్గం డబ్లింగ్‌ పనులకు రూ.3631 కోట్లు ఖర్చవుతాయని అంచనా. దీనిని రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్రం చెరిసగం చొప్పున భరించనున్నాయి. అయిదేళ్లలో ఈ పనులు పూర్తవుతాయని సమావేశానంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ విలేకరులకు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని రాయలసీమ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ రైలు మార్గం నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మార్గం డబ్లింగ్‌ వల్ల ఇప్పటికే జరుగుతున్న సరకు రవాణాకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా దీనిని మరింత పెంచుకోవడం వీలవుతుంది. ఈ మార్గంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉంటాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఇది అత్యంత దగ్గర దారి కానుంది.

వెంకయ్యనాయుడు హర్షం.. గుంటూరు-గుంతకల్లు మధ్య డబ్లింగ్‌ పనులకు కేబినెట్‌ ఆమోదం లభించడం పట్ల కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్గం వల్ల రాయలసీమ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి వూతం లభిస్తుందన్నారు. పారిశ్రామికంగానూ వృద్ధి చెందడానికి ఆస్కారం ఉందనీ, ఈ పనుల వల్ల 80.29 లక్షల పనిదినాల మేర ఉపాధి లభిస్తుందనీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల్ని తీర్చడానికి నరేంద్రమోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందించేలా ఇటీవలి కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపామని గుర్తుచేశారు.

Link to comment
Share on other sites

ఇక వేగంగా రైలు ప్రయాణం

నల్లపాడు-కంభం, గుంతకల్లు-వాడి మార్గాల్లో విద్యుదీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలో మరో 301 ట్రాక్‌ కిలోమీటర్ల మేర విద్యుత్తు మార్గం అందుబాటులోకి రానుంది. గుంటూరు-నంద్యాల మార్గంలోని.. నల్లపాడు-కంభం, గుంతకల్లు-చిక్సుగురు (రాయచూర్‌-వాడి వైపు) రూట్లలో విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. ఈ మార్గాల్లో విద్యుత్తు ఇంజిన్లతో రైళ్లు నడిపేందుకు కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. చెన్నై, బెంగళూరు వంటి దక్షిణాది ప్రాంతాల నుంచి ముంబయికి, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు గుంతకల్లు-రాయచూర్‌-వాడి సెక్షన్‌ కీలకమైంది. గుంతకల్లు-వాడి విద్యుదీకరణ ప్రాజెక్టు 2009-10లో మంజూరైంది. 228 కిలోమీటర్లకు.. గుంతకల్లు నుంచి చిక్సుగురు వరకు 136 కిలోమీటర్లలో పని పూర్తయింది. నల్లపాడు-కంభం-దిగువమెట్టు-డోన్‌-గుంతకల్లు వరకు 426 రూట్‌ కిలోమీటర్ల విద్యుదీకరణ పనుల కోసం 2012-13లో రూ.363.32 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. తాజాగా నల్లపాడు-కంభం వరకు పనులు పూర్తయ్యాయి. దీంతో గుంటూరు నుంచి నంద్యాల-గుంతకల్లు వెళ్లే రైళ్లకు 165 ట్రాక్‌ కిలోమీటర్ల మేర విద్యుత్తు మార్గం అందుబాటులోకి రానుంది. తెనాలి-మార్కాపురం మధ్య ప్రస్తుతం డీజిల్‌ ఇంజిన్‌తో నడుస్తున్న రైలును విద్యుత్తు ఇంజిన్‌తో నడిపేందుకు అవకాశం ఏర్పడింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...