Jump to content

AP Targets 5,000 Start-ups, 100 Incubators by 2019


Recommended Posts

  • 3 weeks later...
  • 1 month later...
15 ఆలోచనలతో ‘స్టార్ట్‌’
 
636230680524715400.jpg
  • యువ కలలకు వ్యాపార రూపం
  • విజయవాడలో ‘స్టార్ట్‌ ఏపీ’ మొదలు
  • తొలినాడే 2,500 ఆలోచనలపై కసరత్తు
  • ఎంపిక చేసిన ఆలోచనలకు తిరుపతి, విజయవాడ ఇన్‌క్యుబేషన్‌ల్లో సాన
  • ఇన్నోవేషన్‌ సొసైటీ, వైస్క్వేర్‌ నిర్దేశం
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): తమకు వచ్చిన విభిన్న ఆలోచనలపై ఒకవైపు వేలమంది యువత మథనం! మరోవైపు వాటిల్లో అత్యుత్తమ ఆలోచనలు ఏవీ? ఏ ఆలోచనలను అభివృద్ధి చేసి వ్యాపార స్థాయికి తీసుకెళ్లొచ్చన్న దానిపై ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల పరిశీలన! మొత్తంగా ఒక్కరోజులో 2,500 ఆలోచనలు! వడపోతలో 200 ఆలోచనల ఎంపిక! తుదిదశలో 15ఆలోచనలతో ‘స్టార్ట్‌ప’! ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ-వై స్వ్కేర్‌ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘స్టార్ట్‌ ఏపీ’ కార్యక్రమం ఇలా మొదలైంది.
 
     రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు 2,500 మంది పాల్గొన్నారు. రెండు వేదికలు ఏర్పాటుచేసి 35సెషన్లుగా వివిధ అంశాలపై అందరి ఆలోచనలను నిపుణులు, పారిశ్రామికవేత్తలు విన్నారు. చివరకు 15ఆలోచనలను ఎంపికచేశారు. ‘‘వినూత్న ఆలోచనలను తగిన మార్గదర్శకం అందిస్తాం. పెట్టుబడిదారులతో మాట్లాడి ఆ ఆలోచనలకు వ్యాపారరూపం తీసుకురావడంలో, ప్రభుత్వం తరఫున సాయపడతాం’’ అని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో నిఖిల్‌ అగర్వాల్‌ హామీఇచ్చారు. ఎంపికైన ఆలోచనలకు తిరుపతి, విజయవాడ ఇంక్యుబేషన్‌ కేంద్రాల్లో అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎంపికైన ఆలోచనలకు, ఆలోచనదారులకు.. ఎలాంటి చార్జీలు లేకుండా నెట్‌వర్కింగ్‌, మార్కెటింగ్‌చేసి పెడతామంటూ యువకులను వై స్క్వేర్‌ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం ఛైర్మన్‌ వై.వి.రత్నకుమార్‌ ఉత్సాహపరిచారు.
 
‘‘ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చి స్టార్ట్‌పగా మారాక.. వ్యాపార భాగస్వాములుగా చేసుకుంటాం. స్టార్ట్‌పగా మారిన ఆలోచనలకు ప్రపంచ, జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్న విస్తృత అవకాశాలను పరిశీలించి ఒక నెట్‌వర్క్‌ ఏర్పాటుచేస్తాం. ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌ను కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ట్‌ ఏపీ చైర్మన్‌ సిద్ధార్థ్‌ మారుపెద్ది, సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ చైర్మన్‌ విష్ణు ఇందూరి, పవర్‌హౌస్‌ వెంచర్స్‌ ప్రతినిధి పెద్దు, ఓయో ప్రతినిధి హేమసుందర్‌, ఇంక్‌మాంక్‌, డిజిటెంట్‌, పీడబ్ల్యూసీ తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 year later...
  • 4 weeks later...
‘స్టార్టప్‌’ లీడర్‌ ఆంధ్ర
27-12-2018 03:46:12
 
636814791720910830.jpg
  • ప్రత్యేక ఫండ్‌ కూడా ఏర్పాటు
  • అమరావతి అభివృద్ధికి సహకరించండి
  • సింగపూర్‌ తరహాలో జూ ఏర్పాటు
  • ఆ దేశ రాయబారితో లోకేశ్‌ భేటీ
  • వివిధ సంస్థల ప్రతినిధులతో కూడా..
  • ప్రవాసాంధ్రులతోనూ సమావేశం
  • బీజేపీ అన్యాయం చేసిందని ధ్వజం
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరించాలని మంత్రి లోకేశ్‌ సింగపూర్‌ విదేశీ వ్యవహారాల రాయబారి గోపీనాథ్‌ పిళ్లైను కోరారు. అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు సింగపూర్‌ ప్రభుత్వం పిళ్లైను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఎస్‌ఆర్‌ నాథన్‌ ఫెలోషి్‌పలో భాగంగా సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన లోకేశ్‌.. బుధవారం పిళ్లైను కలిశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా క్యాపిటల్‌ రీజియన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ, ఇన్నోవేషన్‌ కారిడార్‌ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఏర్పాటుచేసి అనేక స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 
‘ఏంజెల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అందులో మా రాష్ట్రం.. దేశంలోనే లీడర్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున స్టార్టప్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని పిళ్లై తెలిపారు. అనంతరం సింగపూర్‌ వైల్డ్‌లైఫ్‌ రిజర్వ్‌ సీఈవో మైక్‌బార్లేతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ నిర్వహణ ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో సింగపూర్‌ జూ ఒకటి. ఏటా 17 లక్షల మంది ఈ జూను సందర్శిస్తారని, 315 జాతుల జంతువులు ఇందులో ఉన్నాయని బార్లే వెల్లడించారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సింగపూర్‌ జూ తరహాలో జంతుప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని.. దీనికి సహకరించాలని కోరారు.
 
 
కట్టుబట్టలతో గెంటేశారు
అనంతరం లోకేశ్‌ను సింగపూర్‌ ఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదని, మనల్ని కట్టుబట్టలతో బయటకు గెంటేశారని చెప్పారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం సాకారం చేశారు. గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. కానీ ప్రత్యేక ప్యాకేజీ అని బీజేపీ మోసం చేసింది. దానితో పాటు ఇచ్చిన 18 హామీలను నెరవేర్చలేదు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ని అన్ని సీట్లలో టీడీపీ గెలిస్తే.. దేశ ప్రధాని ఎ వరనేది సీఎం నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...