Jump to content

NBK 101 MOVIE "RAITHU" BY KRISHNA VAMSI


sree balu

Recommended Posts

CONFORMED BY BALAYYA

 

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక వందో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా నటిస్తున్న బాలయ్య.. తాను తర్వాత నటించబోయే 101వ సినిమాను అనంతపురంలో ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా ఈ ప్రకటన చేశారు. తన 101వ సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో ఉంటుందంటూ.. ఆ సినిమా పేరు ‘రైతు’ అని తెలిపారు. గత కొంతకాలంగా ఇదే వార్త మీడియాలో వస్తున్నప్పటికీ మంగళవారం బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘గౌతమిపుత్రశాతకర్ణి’ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. చిత్ర దర్శకుడు క్రిష్‌కు పెళ్లి నిశ్చమైన నేపథ్యంలో ఇటీవల కొంత విరామం తీసుకున్నారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘గౌతమిపుత్ర’గా తెరకెక్కనున్న బాలయ్య తదుపరి ‘రైతు’గా కనిపించనున్నారనే వార్త నందమూరి అభిమానులకు సంతోషాన్నిస్తుంది.

 

source:abn

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...