Jump to content

Amaravati | Heritage City


Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply

Top Posters In This Topic

రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధితో పర్యాటకానికి ఊతం
 
636077079582592576.jpg
పుష్కరాలతో ఐదు కిలోమీటర్ల మేర రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి
 స్థానిక సంస్థలదే బాధ్యత అంటున్న జలవనరుల శాఖ
ఆంధ్రజ్యోతి, గుంటూరు : కృష్ణా పుష్కరాల పుణ్యమా అని గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి చెందింది. గతంలో నదిలోకి దిగి స్నానం చేయాలన్నా భయానకంగా ఉండే స్నానఘట్టాలను జలవనరుల శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పటిష్టమైన కాంక్రీట్‌ బెడ్డింగ్‌, మెట్లకు రంగు రంగుల డిజైన్లతో ఫ్లోరింగ్‌ టైల్స్‌, అతికించి తీర్చిదిద్దింది. నదిలో సురక్షితంగా స్నానం చేసేందుకు ఐరన్‌ మెష్‌ చుట్టింది. ఒకవేళ నదిలో నీటిమట్టం తక్కువగా ఉన్నా స్నానం చేసేందుకు వీలుగా తుంపరస్నానం ఆచరించేందుకు షవర్లను అమర్చింది. పుష్కరాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో ఊడిపోయిన టైల్స్‌ అన్నింటిని తిరిగి అతికించి సంబంధిత దేవాలయం, స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఇకపై వాటిని కంటికి రెప్పలా కాపాడుకొంటూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత వారిదేనని జలవనరుల శాఖ స్పష్టం చేస్తోంది.
ఘాట్ల అభివృద్ధి
జిల్లాలో ప్రధానంగా అమరావతిలో 603 మీటర్లు, ధరణికోటలో 700 మీటర్లు, తాళ్ళాయపాలెం(శైవక్షేత్రం)లో 440 మీటర్లు, సీతానగరంలో 460 మీటర్లు, పెనుమూడిలో 500 మీటర్లు, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువున 18 ఘాట్లలో 297 మీటర్లు, బ్యారేజ్‌ దిగువున 39 ఘాట్లలో 395 మీటర్ల మేరకు రివర్‌ఫ్రంట్‌ను పుష్కరాల సందర్భంగా జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్‌ కార్యాలయం అభివృద్ధి చేసింది. ఇదేవిధంగా నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణవేణి, అనుపు, సత్రశాల, దైద, తంగెడ, పొందుగల, మాదిపాడు, నందులరేవు, కోగంటివారిపాలెం, కస్తల, చామర్రు తదితర ఘాట్లలో మరో 1200 మీటర్ల రివర్‌ఫ్రంట్‌ను లింగంగుంట్ల సర్కిల్‌ కార్యాలయ అధికారులు అభివృద్ధి చేశారు. 2004 పుష్కరాలు జరిగిన ఘాట్‌లే కాకుండా కొత్తగా స్నానఘట్టాలను అభివృద్ధి చేశారు. ఇందుకోసం పలుచోట్ల కొండలను తొలిచారు. అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు.
జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది నిద్రలు లేని రాత్రిళ్లు గడిపారు. ఇందుకు కారణం పుష్కరాలకు కొద్ది రోజులు ముందే పరిపాలన, సాంకేతిక అనుమతులు రావడం. కొన్ని ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలను చివరి నిమిషంలో మార్పు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా సీతానగరం ఘాట్‌ని సీఎం చంద్రబాబు సందర్శించి పలు మార్పులు సూచించారు. దాంతో ఆగమేఘాలపై సీతానగరంలో లీడింగ్‌ చానల్‌ను నిర్మించారు. అందులోకి నీరు ప్రవహించేలా చేసేందుకు ఒక రెగ్యులేటర్‌, పంపుహౌస్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. సత్రశాలలో చిన్నగా ఉండే ఘాట్‌ని సుమారు 200 మీటర్ల మేరకు విస్తరించారు. దైద, తంగెడ, పొందుగలలోనూ 100 నుంచి 150 మీటర్ల మేరకు స్నానఘట్టాన్ని పొడిగించారు. పొందుగలలో నూతనంగా ఘాట్‌ను నిర్మించారు.
రూ.80 కోట్ల నిధులు
జిల్లాలోని 72 పుష్కర ఘాట్ల అభివృద్ధికి ఇంచుమించు రూ.80 కోట్ల మేరకు నిధులు వెచ్చించారు. కొన్ని పనులు హడావిడిగా చేయాల్సి రావడంతో ఈ 12 రోజుల్లోనే స్వల్పంగా మరమ్మతులకు గురయ్యాయి. ముఖ్యంగా మెట్ల మీద అతికించిన ఫ్లోరింగ్‌ టైల్స్‌ ఊడిపోతున్నాయి. వాటన్నింటిని వచ్చే వారం, పది రోజుల్లో తొలగించి కొత్త వాటిని అమర్చుతామని జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్‌ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి ఆంధ్రజ్యోతికి తెలిపారు. బ్యారికేడింగ్‌, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణాలు, అమరేశ్వరాలయం వెనక రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి సంబంధిత దేవాలయం, పర్యాటక శాఖ, స్థానిక సంస్థలకు అప్పగిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ హృదయ్‌, ప్రసాద్‌ పథకాల కింద విడుదలౌతోన్న నిధులను రివర్‌ ఫ్రంట్‌ నిర్వహణకు వినియోగించి మంచి పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దితే జిల్లా పర్యాటకరంగానికి ఎంతో ఊతమిస్తుందని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

15VJTAN-Dharani_GQ_3012094e.jpg

 

 

A team, comprising an epigraphist and a historian, has deciphered the 13th century pillar inscription at the Jagannath temple here, highlighting the Dharanikota connection with the port town of Machilipatnam.

 

The inscription, which dated back to 1240 A.D., speaks about donating a piece of land by king Kota Bheemaraju of Kota dynasty of Dharanikota near Amaravati in Guntur district for performing puja at the Bheemeswara temple.

 

The land was given to two groups of priests for performing the annual rituals in the temple. While one group comprised 12 priests, the other had seven of them.

Which Bheemeswara temple?

“The last few paras of the inscription are not visible due to damage done to it, leaving no evidence to confirm the actual place of the Bheemeswara temple. The language is a mix of Sanskrit and Telugu,” Repalle-based epigraphist B. Ramesh Chandra told The Hindu .

 

It is learnt that there are two Bheemeswara temples near Machilipatnam —one in Draksharamam in East Godavari district and the other in Movva village in Krishna district.

 

Mr. Ramesh Chandra said that the inscription read as follows:

“A certain extent of land was donated for procuring necessary provisions to perform rituals at the Bheemeswara temple.”

Beginning with the images of the sun and a crescent, the inscription was written on four sides of the pillar. One side of the inscription was completely damaged. A portion of the pillar was buried, damaging the last paras of the inscription.

The Dharanikota kings maintained good relations with the Chalukyas, Velanati Cholas and the Kakatiyas.

The expert team was of the opinion that the pillar did not belong to the Jagannath temple of Machilipatnam and might have been brought from somewhere during the period of its renovation in the 1990s.

Glorious history

Mr. Ramesh Chandra and V.V. Krishna Rao, a research scholar in Acharya Nagarjuna University, are documenting the details of several inscriptions found across Krishna district in a bid to bring the glorious history to limelight.

“Our effort is to document the history and stress the need for conservation of important pillars and inscriptions in Krishna district, which have not been deciphered so far,” Mohammed Silar, a historian, said.

Link to comment
Share on other sites

ఏపీలో పురావస్తు సర్కిల్‌
 
  • అమరావతి పురావస్తు సర్కిల్‌గా నామకరణ
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అమూల్యమైన సంపదకు కేంద్రం రక్షణ ఏర్పడింది. ఏపీలోని 129 ప్రత్యేక, చారిత్రక ప్రదేశాలు, నాలుగు పురావస్తు శాఖ మూజియంలు, 4 కోటలను సంరక్షించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ఏపీకి ప్రత్యేక పురావస్తు సర్కిల్‌ను ఏర్పాటుచేసింది. 302 మంది సిబ్బందిని కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాకేష్‌ తివారీ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. పురావస్తు కార్యాలయం రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోనే ఉంది. అయితే ఏపీ విభజన జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా, ఏపీ మాత్రం కొత్త సర్కిల్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో అమూల్యమైన సంపద సంరక్షణకు అసవరమైన నిధులు, సిబ్బంది లేకుండా పోయింది. దీన్ని ‘అంఽధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై కేంద్రం స్పందించింది. దీంతో ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసే సర్కిల్‌కు ‘అమరావతి పురావస్తు సర్కిల్‌’గా నామకరణం చేయనుంది. అంతేకాకుండా కీలకమైన సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్ట్‌లతో సిబ్బందిని కేటాయించింది. ఆక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాటికి ఈ సర్కిల్‌ను అమరావతిలో ప్రారంభించాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు తెలిపారు.
Link to comment
Share on other sites

http://www.indianlink.com.au/stolen-statues-returned/

 

The National Gallery of Australia returns Indian sculptures linked to illegal art smuggling ring

During the recent visit of India’s Minister of State for Culture and Tourism Dr Mahesh Sharma, Australia’s Minister for the Arts, Senator Mitch Fifield formally returned two statues to the Government of India from the National Gallery of Australia’s Asian art collection.

 

statues.jpg

 

In a special event at the National Gallery of Australia (NGA), Senator Fifield formally handed over the three ancient statues, The Seated Buddha, Goddess Pratyangira and Worshippers of the Buddha.

Receiving the artefacts, Dr Mahesh Sharma said, “Our sincere thanks to the Government of Australia and Prime Minister Malcolm Turnbull and Minister Mitch Fifield and the National Gallery of Australia for the gesture of returning these three antiquities, which will carry a big message of the relations between the two countries.”

Senator Fifield said in a statement, “The statues have been significant items in the National Gallery’s Asian art collection and treated with the utmost care while in Australia, but as significant examples of India’s heritage, the statues will be returned.”

“The work between our institutions and governments leading up to this return is a demonstration of Australia’s close relationship with India,” he added.

On Twitter, Dr Sharma thanked the Minister for his “kind gesture” saying, “This means a lot to the people of India. These sculptures have emotional value for Indian people.”

He also tweeted, “The journey of three ancient artefacts back to their home begins. They will be placed where they should be – The National Museum.”

Also in attendance at the Indian sculpture repatriation ceremony were the Indian High Commissioner to Australia His Excellency Navdeep Suri and top officials from the NGA.

“We welcome the return of these sculptures and commend the National Gallery of Australia for its approach to dealing with this complex and difficult issue,” Mr Suri said.

The artefacts were part of a selection of items allegedly stolen and smuggled out of India through an illegal art smuggling ring operated by disgraced art dealer Subhash Kapoor. Goddess Pratyangira, a 12th century stone statue from Tamil Nadu, and Worshippers of the Buddha, a third-century rock carving from Andhra Pradesh, together valued at $1.1 million, were purchased by the NGA in 2005 from the New York-based dealer.

 

The Seated Buddha was purchased from Kapoor by Rosalyn Packer for the NGA in 2007 for more than $1 million, but it subsequently emerged that the statue was stolen from an Indian archaeological site. The 2nd century statue is from the Kushan period.

 

During then Australian Prime Minister Tony Abbott’s visit to India in 2014, the Australian government returned the statue of the ‘Dancing Shiva’ to Indian Prime Minister Modi. The 900-year-old bronze Shiva Nataraja, purchased for $5 million in 2008, was another artefact found to have been acquired by Kapoor through illicit means, before being sold to the NGA.

 

Dr Mahesh Sharma was in Australia on an official visit as part of the Confluence Festival of India in Oz. He also conducted a series of bilateral meetings with Senator Fifield, as well as Australia’s Assistant Minister for Trade, Tourism and Investment Keith Pitt MP.

 

 

Cswha73UsAAz7Es.jpg

 

CswhcCKUMAABIBX.jpg

 

CswhcOQUEAAc0Xe.jpg

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
ఘంటసాలలో బయటపడిన బౌద్ధ కళాఖండం
 
636149747274499431.jpg
ఘంటసాల: ఘంటసాలలో జరిగిన తవ్వకాల్లో శాతవాహనకాలపు నాటి బౌద్ధకళాఖండం బయటపడింది. అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయం పక్కనే ఉన్న రామాలయ పునరుద్ధరణ పనుల కోసం జరిపిన తవ్వకాల్లో బౌద్ధ కళాఖండం బయల్పడిందని జిల్లా పరిషత మాజీ వైస్‌ ఛైర్మన్‌ గొర్రెపాటి వెంకటరామకృష్ణ తెలిపారు. ప్రముఖ బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతున్న ఘంటసాలలో గతంలో జరిగిన తవ్వకాల్లో అనేక బుద్ధుని అవశేషాలు బయల్పడ్డాయి. అమరావతి శిల్పకళకు అద్దంపట్టేలా ఉన్న ఈ శిలాఫలకంపైన, అడుగు భాగంలో పద్మాలు, పరుగు పెడుతున్న గుర్రాలు, ఎద్దులు, ఏనుగు, సృజనాత్మకతతో కూడిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బౌద్ధకళాఖండాన్ని పరిశీలించిన కల్చరల్‌ సెంట్రర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి ఇది క్రీస్తుశకం ఒకటవ శతాబ్దానికి చెందిన శాతవాహన కాలం నాటిదని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం ఘంటసాలలో పెన్నేరమ్మ దిబ్బ వద్ద జరిగిన తవ్వకాల్లో బుద్దుని ప్రతిమ లభ్యంకాగా, పెన్నేరమ్మ దిబ్బకు సమీపంలోనే జరిగిన తవ్వకాల్లో బౌద్ధకళాఖండం లభ్యం కావడంతో ఈ ప్రాంతాల్లోనే మరిన్ని బౌద్ధమతానికి చెందిన శిలాఫలకాలు మరిన్ని బయల్పడగలవని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.  బ్రిటీష్‌ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండరే ఘంటసాలలో జరిపిన తవ్వకాల్లో ఇదే రకమైన గొడుగు కుదురు 1870వ సంవత్సరంలో లభించినట్లుగా ఆయన రాసిన గ్రంథంలో ఉన్నట్లు శివనాగిరెడ్డి తెలిపారు. ఘంటసాల స్థూపంపైన అమర్చే గొడుగును బిగించటానికి ఏర్పాటు చేసిన పల్నాటి సున్నపురాతి కుదురు అని ఆయన తెలిపారు.  తవ్వకాల్లో దొరికిన బౌద్ధకళాఖండంపైన గతంలో నిలబెట్టిన సున్నపురాతి గొడుగు స్థానిక మ్యూజియమ్‌లో ఉందని శివనాగిరెడ్డి వివరించారు. అత్యంత ప్రాచీనత కలిగిన బౌద్ధకళాఖండాన్ని స్థానిక మ్యూజియమ్‌కు చేర్చి ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. బౌద్ధకళాఖండానికి బౌద్ధభిక్షువు ధమ్మధజ బంతేజా పరిశీలించి బౌద్ధధర్మాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బౌద్ధకళాఖండాన్ని గ్రామ ప్రముఖులు మ్యూజియమ్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకటరామకృష్ణ, విశ్వేశ్వరాలయ ధర్మకర్త వేమూరి శివరామకృష్ణ, స్వచ్ఛ ఘంటసాల కన్వీనర్‌ గొర్రెపాటి సురేష్‌, గొర్రెపాటి రామకృష్ణ (దయాకర్‌)లు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ప్రపంచ వారసత్వ కట్టడంగా మహాచైత్యం!
 
అమరావతి: అమరావతికి వారసత్వ సంపదగా.. ప్రపంచ దేశాల్లోని బౌద్ధులకు పవిత్రస్థలంగా పేరుగాంచిన అమరావతిలోని మహాచెత్యానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రానుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలను గుర్తించే జాబితాలో ఈ మహాచైత్యం ఉండటం విశేషం. మహాచైత్యానికి యునెస్కో గుర్తించాలని జాతీయ పంచాయతీ పరిషత జాతీయ కార్యదర్శి జాస్టి వీరాంజనేయులు సెప్టెంబర్‌ 21న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యదర్శి, కేంద్రమంత్రి మహేష్‌శర్మ కార్యదర్శి, ఏఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాకేష్‌తివారీలకు వినతిపత్రం ఇచ్చారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రిత్వశాఖ గత నెల 17న మహాచైత్యం పూర్తి సమాచారాన్ని హైదరాబాద్‌లోని పురావస్థుశాఖ నుంచి తెప్పించుకుంది. మహాచైత్యం ఏరియా మ్యాప్‌, ఫొటోలు, యునెస్కో ఫార్మెట్‌లో పంపాలని కేంద్ర పురావస్తుశాఖ డైరక్టర్‌ లూర్ధుస్వామి హైదరాబాద్‌ సర్కిల్‌ పురావస్తుశాఖ సూపరిండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. తన వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాధాలు తెలియజేస్తున్నట్లు వీరాంజనేయులు తెలిపారు. మహాచైత్యం యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు జరిగితే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు, బౌద్ధులు అధికసంఖ్యలో అమరావతి సందర్శించే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
వారసత్వ నగరం అమరావతి
 
636187494036071742.jpg
అమరావతికి చెందిన అనేక శిల్పాలు న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, నాగార్జున కొండ, హైదరాబాద్‌లో వున్న పురావస్తు ప్రదర్శన శాలలోనే కాకుండా లండన్‌లో వున్న బ్రిటీష్‌ మ్యూజియంలో కూడా ప్రదర్శనలో వున్నవి. భారతదేశంలో వున్న శిల్పాలను స్థూపఫలకాలను తిరిగి అమరావతికే రప్పించి రాజధాని నగరంలో నిర్మించబోయే రాష్ర్టీయ పురావస్తు సంగ్రహాలయంలో ప్రదర్శింపవలసిన అవసరం వున్నది.
 
కేంద్ర ప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసి దానికి అవసరమైన నిధిని సమకూర్చింది. దీని వెనుక కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు కృషి చాలా వున్నది. ఈ వారసత్వ నగరాభివృద్ధిలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వం స్థానికుడు, ప్రముఖ వారసత్వ నిపుణులలో ఒకరైన డాక్టర్‌ అమరేశ్వర్‌ గల్లాను అమరావతి వారసత్వ ప్రాధికార సంస్థకు సలహాదారునిగా నియమించడం ముదావహం. డాక్టర్‌ గల్లా నేతృత్వంలో అమరావతి వారసత్వ నగరంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.
వారసత్వ నగరంగా అభివృద్ధి చేయడం అంటే రహదారులు వెడల్పు చేసి తారు లేక సిమెంట్‌ రోడ్లు వేయటం, వీధి లైట్లను మెరుగుపరచటం, మురుగు నీటి వ్యవస్థను బాగు చేయటం, నాగరికులకు తాగునీరు సమృద్ధిగా అందించడం మాత్రమే కాదు. అమరావతి (ధాన్య కటకం) చాలా పురాతనమైన నగరం. పురాతన వస్తుసంపదను పరిరక్షించి భావితరాలకు అందించడం వారసత్వంలో ముఖ్యమైన అంశం. వారసత్వ నగరాభివృద్ధిలో భాగంగా ఈ కింది అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
అమరావతి మహాస్థూపం స్థలం, అతిక్రమణల మూలంగా చాలా కుచించుకుపోయింది. మహాస్థూపం చుట్టూ వున్న అనేక మట్టి దిబ్బలను చదును చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. బ్రిటీష్‌ పాలకుల హయాంలో పురావస్తు నిపుణులు మహాస్థూపం చుట్టూ మాత్రమే తవ్వకాలు (ఉత్పననం) నిర్వహించారు. కానీ మహాస్థూపం, ధరణికోట మధ్య వున్న స్థలంలో తవ్వకాలు నిర్వహించిన దాఖలాలు లేవు. భారత పురావస్తు శాఖ కూడా అలాంటి ప్రయత్నం చేసినట్లుగా లేదు. ఆ స్థలాల్లో నివశిస్తున్న వారికి తగిన పరిహారం ఇచ్చి వారిని వేరే చోటికి తరలించి, అక్కడ శాస్ర్తీయ పద్ధతిలో తవ్వకాలు నిర్వహిస్తే, స్థూపం చుట్టూ వుండే విహారాలు, ఆరామాలు, ఉద్దేశిక స్థూపాలే కాక అనేక కొత్త విశేషాలు వెలుగులోకి తప్పకుండా వస్తాయనడంలో ఏమాత్రం సందేహం ఉండదు. ఆనాటి జనావాసాలు కూడా అనేకం వెలుగులోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉన్నది. భారత పురావస్తు శాఖ అనుమతితో ఆ ప్రదేశంలో తవ్వకాలు చేయొచ్చు. ఆ ప్రదేశాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక ముందు ఎటువంటి నిర్మాణాలకు అనుమతించరాదు.
 
భారత పురాతత్వశాఖ ధరణి కోట (ఇప్పటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల ప్రాంతం)లో 1962–65 సంవత్సరాల్లో నిర్వహించిన తవ్వకాలలో 30 అడుగుల వెడల్పు వున్న కాలువ బయటపడింది. ఈ కాలువ కోటను, కృష్ణానదిని అనుసంధానం చేస్తూ నిర్మింపబడింది. శాతవాహనుల కాలంలో తూర్పుకోస్తా ప్రాంతం రోమన్‌ దేశాలలో నౌకా యానం ద్వారా వర్తక వాణిజ్యాలు నిర్వహించినట్లుగా తేలింది. రోమన్‌ నాణాలే కాక అనేక ఇతర వస్తువులు కూడా లభించాయి. ఈ కాలువకు ధరణికోట వద్ద రేవు వున్నట్లుగా నిదర్శనాలు లభించాయి. వాణిజ్య పడవలు ఈ కాలువ ద్వారా కృష్ణానదిలోకి ప్రవేశించి ముందుకు సాగి భట్టిప్రోలు దగ్గర వున్న పోతవరంలంక (పోతార్లంక) ఓడ రేవులో లంగరు వేసి ఓడలో సరుకుల్ని నింపి రోమ్‌, గ్రీసు, శ్రీలంక, బర్మా, ఇండోనేషియా, మలేషియా, మధ్య ఆసియా, తూర్పు ఇండియా దీవులు, ఇండో చైనా దేశాలకు ఎగుమతులు అవుతుండేవి. కృష్ణానది ఒడ్డున నావల ద్వారా సరుకులు దేశ, విదేశాలకు ఎగుమతి - దిగుమతులు జరపటానికి రేవులను కట్టిన ఆధారాలు వున్నాయి. ఒడ్డు జారకుండా అటూ - ఇటూ రాళ్లు, ఇటుకలతో పెద్ద గోడల పునాదుల ఆనవాళ్లు ధరణి కోట వద్ద జరిపిన తవ్వకాలలో వెలుగు చూశాయి. ఈ తవ్వకాలలో వెలుగు చూసిన కాలువ అన్యాక్రాంతమై అదృశ్యమైపోయింది. ఈ కాలువను పునరుద్ధరించి ఆనాటి వారసత్వాన్ని పునరుద్ధరించవలసిన అవసరం వున్నది.
 
ధాన్యకటకం శాత వాహనుల రెండవ రాజధాని. ఆ సమయంలో మట్టితో నిర్మించబడిన కోట గోడలు శిథిలమై అన్యాక్రాంతం కాబడి కోట ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. శిథిలమైపోతున్న ఆ కోట గోడల్ని కనీసం కొంత భాగమైనా పునఃనిర్మించి శాత వాహనుల ఔన్నత్యాన్ని భావితరాలకు చూపించవలసిన అవసరం ఎంతైనా వున్నది.
 
అమరావతిలో కేంద్ర పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాలలో లభించిన స్థూప ఫలకాలను, విగ్రహాలను, శాసనాలను, ధాతుపేటికలను మహాస్థూపం దగ్గరలోనే వున్న పురావస్తు ప్రదర్శన శాలలో ప్రదర్శించారు. అమరావతికి చెందిన అనేక శిల్పాలు న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, నాగార్జున కొండ, హైదరాబాద్‌లో వున్న పురావస్తు ప్రదర్శన శాలలోనే కాకుండా లండన్‌లో వున్న బ్రిటీష్‌ మ్యూజియంలో కూడా ప్రదర్శనలో వున్నవి. భారతదేశంలో వున్న శిల్పాలను స్థూపఫలకాలను తిరిగి అమరావతికే రప్పించి రాజధాని నగరంలో నిర్మించబోయే రాష్ర్టీయ పురావస్తు సంగ్రహాలయంలో ప్రదర్శింపవలసిన అవసరం వున్నది. ఒకవేళ బ్రిటీష్‌ ప్రభుత్వం అమరావతి పురావస్తు సంపదను తిరిగి ఇవ్వటానికి అంగీకరించకపోతే కనీసం ఆ శిల్పసంపద నమూనాలనైనా, ఛాయా చిత్రాలనైనా తెప్పించి రాష్ర్టీయ పురావస్తు సంగ్రహాలయంలో ప్రదర్శిస్తే అమరావతి శిల్పకళా వైభవం గొప్పతనం ప్రేక్షకులకు తేలికగా అర్ధమౌతుంది.
 
ధాన్యకటకం క్రీ.శ. తొలి శతాబ్దాలలో గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లింది. అక్కడ వున్న విశ్వవిద్యాలయంలో బౌద్ధమత వాజ్మయం సముపార్జన కోసం దేశవిదేశాల నుంచి, బౌద్ధ భిక్షువులు వచ్చినట్లుగా చరిత్ర తెలియచేస్తున్నది. బౌద్ధమతానికి రాజాదరణ లేకపోవటం, శైవమత విజృంభణ మొదలైన కారణాల మూలంగా అమరావతిలో బౌద్ధం కనుమరుగైంది. ప్రస్తుతం ఆ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని పునఃప్రతిష్ఠించి అమరావతిలో బౌద్ధ వారసత్వాన్ని కొనసాగించవలసిన అవసరం వున్నది. బిహార్‌లోని నలందా బౌద్ధ విశ్వవిద్యాలయపు శాఖను అమరావతిలో ప్రారంభించి, బౌద్ధంలోని నిష్ణాతులైన బుద్ధఘోషుడు (డాక్టర్‌ అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆంజనేయరెడ్డి, వీరనారాయణరెడ్డి, డాక్టర్‌ శివనాగిరెడ్డి, డాక్టర్‌ వావిలాల సుబ్బారావు గార్లను డైరక్టర్లుగా నియమించి వారి ఆధ్వర్యంలో బౌద్ధమత చరిత్రను, వాజ్మయాన్ని, కళలను, భావి తరాల వారికి అందించవలసిన అవసరం వున్నది.
కాలచక్ర మహాసమ్మేళనం (2006) సందర్భంగా ప్రభుత్వం అమరావతిలో వారసత్వ వస్తు సంగ్రహాలయాన్ని నిర్మించి, ఆ భవనం కింది అంతస్థులో వున్న భాగాన్ని మాత్రమే వాడుకలోకి తెచ్చింది. దీనిని విస్తృత పరచి రాష్ర్టీయ పురావస్తు సంగ్రహాలయంగా మార్చి దేశ, విదేశాలలో వున్న శిల్పాలను, నమూనాలను, ఛాయా చిత్రాలను ఈ భవనంలో ప్రదర్శించి ముందు తరాల వారికి ఆంధ్ర శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రదర్శింపవలసిన అవసరం వున్నది. ఈ వారసత్వ ప్రదర్శన శాల మొదటి అంతస్థులో భారతదేశంలో వున్న ఇరత దేశాలలో వున్న బౌద్ధ స్థూపాల నిలువెత్తు ఛాయా చిత్రాలను ప్రదర్శింపవలసిన అవసరం వున్నది.
 
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న వస్తు సంగ్రహాలయాన్ని విస్తృతపరచి రిజర్వు కలెక్షన్‌ హాలులో భద్రపరచిన స్థూప ఫలకాలను, శిల్పాలను కొత్తగా నిర్మించిన గ్యాలరీలలో ప్రదర్శించడం ద్వారా సుమారు 50 సంవత్సరాలుగా ప్రేక్షకులు చూడలేని శిల్ప సంపదను సందర్శించే భాగ్యం వారికి కలుగచేయవలసిన అవసరం వున్నది. దురదృష్టవశాత్తూ ఈ వస్తు ప్రదర్శన శాలను నిర్వహించగల బాధ్యతాయుతమైన అధికారి కొన్ని సంవత్సరాలు లేక పోవటంతో గుమాస్తాతో మాత్రమే ఈ వస్తు సంగ్రహాలయం నడుస్తోంది. ఒకవేళ దీనిని నిర్వహించగలిగే బాధ్యత గల అధికారిని నియమించలేని స్థితిలో కేంద్ర పురావస్తు శాఖ వుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పురావస్తు సంగ్రహాలయాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుని, రాజధాని నగరానికి దీటుగా ఈ పురావస్తు ప్రదర్శనశాలను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుండే అమరావతి సందర్శించే బౌద్ధ యాత్రికులకు అనుకూలంగా నిర్వహింపవలసి వుంటుంది. ఈ వస్తు సంగ్రహాలయంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రదర్శించిన వస్తువులను నూతన ప్రదర్శనా పద్ధతులను అనుసరించి ప్రదర్శింపవలసిన అవసరం వున్నది.
 
ధాన్యకటక వాసులు బౌద్ధంతో పాటు, జైన మతాన్ని కూడా ఆదరించినట్లుగా ప్రస్తుతం అమరావతిలో జీర్ణదశలో వున్న జైనదేవాలయం ద్వారా మనకు తెలుస్తున్నది. జీర్ణదశలో వున్న జైన దేవాలయాన్ని పునఃనిర్మించి జైన మత వారసత్వాన్ని భావి తరాల వారికి తెలియచేయవలసిన అవసరం వున్నది.
 
ధాన్య కటకంలో 11వ శతాబ్దంలో వేంగిచాళుక్యులు అమరేశ్వరాలయాన్ని నిర్మించారు. శైవపంచారామక్షేత్రాలలో కృష్ణానదికి కుడివైపున నిర్మింపబడిన ఈ శైవక్షేత్రం శైవులకు పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ శైవక్షేత్రం సందర్శించటానికి వచ్చే యాత్రికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కలుగజేసి ఇంకా ఎక్కువ మంది యాత్రికులను అమరావతి నగరానికి ఆకర్షింపవలసిన అవసరం వున్నది. పుష్కర ఘాట్లను ఇంకా అభివృద్ధి పరచవలసి వుంటుంది.
 
రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1796లో చింతపల్లి నుంచి తన రాజధానిని అమరావతికి మార్చి, కోటను, రాజమహల్‌ను (వైజయంతి) నిర్మించాడు. వారి వంశీకుల అనుమతితో ఆ రాజమహల్‌ను వారసత్వ మ్యూజియంగా మార్చి, వెంకటాద్రినాయుడు వాడిన ఆయుధాలను, పనిముట్లను, ఫర్నీచర్‌ను, ఆ వంశపు ప్రముఖుల ఛాయా చిత్రాలను ప్రదర్శించాలి. వెంకటాద్రి నాయుడు తన రాజ్యంలో నిర్మించిన దేవాలయాల అభివృద్ధికి చేసిన సేవలను భావితరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత ఈ తరం వారిపై వున్నది.
 
ఈ పైన పేర్కొన్న అంశాలను కూడా అమరావతి వారసత్వ నగర ప్రాజెక్టు వారు దృష్టిలో వుంచుకుంటారని, భారత పురావస్తు శాఖ అమరావతిలో నిర్వహించిన తవ్వకాలలో పాల్గొన్న, కేంద్ర పురావస్తు సంగ్రహాలయాధికారిగా పనిచేసిన నాతో పాటు, మా తరం వారు కోరుకుంటున్నారు. పై అంశాలు కూడా వారసత్వ నగరానికే చెందిన అంశాలు కనుక వీటిని ప్రభుత్వం గమనించి, ఆచరించినప్పుడే వారసత్వ హోదాకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.
కొసరాజు వెంకటేశ్వరరావు
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...