Jump to content

Canal beautification in Vijayawada


Recommended Posts

అభిముఖం... అందాలు బహుముఖం!

నదీ, కాలువ ముఖధ్వారాలపై సమగ్ర ప్రణాళిక

ఖాళీ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు, వాణిజ్య సముదాయాలు

వాకింగ్‌, సైకిల్‌ ట్రాక్‌లు

అంతర్గత జలరవాణాకు ప్రణాళికలు

ఈనాడు, అమరావతి

amr-top1a.jpg

విజయవాడ నగరంలోని నదీ, కాలువ ముఖద్వారాలు ఇక పర్యాటక ప్రాంతాలుగానే కాదు.. వాణిజ్య ప్రాంతాలుగా మారనున్నాయి. నగరంలోని కృష్ణానది ముఖద్వారాలతో పాటు కాలువ గట్లను ఆధునికీకరించి పర్యాటక ప్రాంతాలుగా రూపొందించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిని అత్యంత సుందరంగా, ఆహ్లాదంగా, వాణిజ్య పరంగా ‘మిశ్రమ అభివృద్ధి’ ప్రాంతాలుగా రూపొందనున్నాయి. దీనికి మిక్స్‌డ్‌ డెవలప్‌మెంట్‌ అప్రోచ్‌ పేరుతో ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అమరావతి నగరం తరహాలోనే అన్ని రకాల నిర్మాణాలు రానున్నాయి. బుధవారంనాడు వెలగపూడిలో జరిగిన అమరావతి అభివృద్ధి సమావేశంలో నదీ, కాలువల ముఖద్వారాల అభివృద్ధిపై నగరపాలక సంస్థ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌ ఆధ్వర్యంలో కన్సల్టెన్సీ ప్రతినిధులు ఒక ప్రజంటేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించారు. దీన్ని అసాంతం పరిశీలించిన ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ మార్పులతో రావాలని సూచించారు. సమగ్ర ప్రణాళిక, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా ఉండాలని సూచించారు. దాదాపు అర్థగంట సేపు దీనిపై సమీక్ష జరిగింది. అమరావతి అభివృద్ధి సంస్థ ఎండీ లక్ష్మీపార్థసారథి, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. తాను వూహించిన స్థాయిలో ప్రణాళికలు లేవని మరింత మెరుగ్గా తీసుకురావాలని కన్సెల్టెన్సీ ప్రతినిధులకు సూచించారు. వివిధ ప్రాంతాల్లో రూపించిన చిత్రాలను వారు ప్రదర్శించారు.

ఇదీ ప్రణాళికలు..!

కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో కృష్ణానదిపై పెద్ద ఘాట్లు నిర్మాణం చేశారు. కృష్ణవేణి ఘాట్‌, పద్మావతి ఘాట్‌, భవానీ, పున్నమి ఘాట్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేశారు. పవిత్ర సంగమం వద్ద ప్రస్తుతం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుతో పవిత్ర సంగమం రూపు మారిపోయింది. ఘాట్లు నిర్మించే సమయంలోనే వీటిని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నగరపాలక సంస్థకు అప్పగించారు. దుర్గగుడి, పర్యటక సంస్థలకు రెండు అప్పగించారు. వీటిపై సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు కన్సల్టెన్సీలను నియమించారు. యాహూ, మైక్రోసాప్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలకు ఆకృతులు ఇతర ప్రణాళికలు అందించి ఆర్‌ఎఫ్‌టీ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఆర్‌ఎఫ్‌టీ బుధవారంనాడు తన ప్రణాళికలను ముఖ్యమంత్రికి సమర్పించింది. వీటిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని మరింత మెరుగ్గా రూపొందించాలని సమగ్ర అభివృద్ధి ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రస్తుతం నదీ ముఖద్వారాలు, కాలువ గట్లు కేవలం కట్టడాలతో కాకుండా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసుకొనే విధంగా ఉండాలని సూచించారు.

* ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువున, ప్రకాశం బ్యారేజీ ఎగువున ఉన్ననదీ ముఖద్వారాలు, నగరంలో ప్రధానంగా ప్రవహించే కాలువలను అభివృద్ధి´ చేయాల్సి ఉంది. వీటిని కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంది.

* బ్యారేజీ దిగువన, బస్టాండ్‌ ప్రాంతం, నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంతం, రైల్వేస్టేషన్‌ ప్రాంతాలు, బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవస్‌ కాలువలపై వంతెనలు, ఇతర నిర్మాణం చేయాల్సి ఉంది.

* ఈ ప్రాంతాల్లో బిజినెస్‌ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, సర్వీసు అపార్టుమెంట్లు, మల్టీఫ్లెక్సులు, ఫుడ్‌కోర్టులు, సెంట్రల్‌ పార్కులు, పచ్చదనం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు.

* ప్రత్యేకంగా పైవంతెనలను ఆకర్షణీయంగా నిర్మించాల్సి ఉందని భావించారు. సైకిల్‌ ట్రాక్‌లు నిర్మించాలని...వాకింగ్‌ ట్రాక్‌లు ఉండాలని సీఎం సూచించారు. కాలువల్లో జలక్రీడలతో పాటు అంతర్గత జలరవాణా ఉండాలని సూచించారు.

* సమగ్ర అభివృద్ధి ఉండే విధంగా చూడాలని ఆయన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు. చక్కని లేఅవుట్లతో రావాలని కన్సెల్టెన్సీలను సూచించారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా ఆదాయ మార్గాలను చూడాలని సీఎం అధికారులకు సలహా ఇచ్చారు.

* కన్వెన్షన్‌ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్సుల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వారి అవసరాలను తీర్చేవిధంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. నదీ ముఖద్వారాల వద్ద ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఫుడ్‌ కోర్టులప్ప్రత్యేక తరహాలో ఉండాలని సలహా ఇచ్చారు.

* ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌టీ సంస్థ ఇచ్చిన ప్రణాళికలు, ఆకృతులపై అంతగా సంతృప్తి వ్యక్త ంచేయని సీఎం తాను సూచించిన విధంగా మెరుగైన ప్రణాళికలు ఆకృతులతో రావాలని ఆదేశించారు.

* నదీ ముఖద్వారాలు, కాలువగట్లు అభివృద్ధిని, పచ్చదనం ఇతర అంశాలను అమరావతి అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది.

* కన్సల్టెన్సీలు ఇచ్చిన ఆకృతులు మార్చి మరింత మెరుగైన వాటిని తీసుకురావాలని సీఎం సూచించారని వీఎంసీ కమీషనర్‌ వీరపాండ్యన్‌ ‘ఈనాడు’తో చెప్పారు. వాకింగ్‌ ట్రాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఉండే విధంగా ఆకృతులు ఉండాలని అభిప్రాయపడ్డారని వివరించారు. ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా రూపొందించనున్నామని చెప్పారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 months later...
Guest Urban Legend

adenti, garbage ni stop chestunnaru, but drainage going to drinking/agri canal ?  :blink:

 

thats just a start brother

Link to comment
Share on other sites

  • 2 weeks later...
స్లూయిజ్‌ చెంత ఆహ్లాదం.. ఆతిథ్యం
 
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఇటు తూర్పు డెల్టా హెడ్‌ స్లూయిజ్‌... అటు పశ్చిమ డెల్టా హెడ్‌ స్లూయిజ్‌... మధ్యలో కృష్ణా బ్యారేజి. తూర్పు డెల్టా హెడ్‌ స్లూయిజ్‌ కాలువ రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత రైవస్‌, ఏలూరు, బందరు కాలువలుగా విడిపోతుంది. స్లూయిజ్‌ నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వరకు ఉన్న దూరం కిలోమీటరున్నర. ఈ ప్రధాన కాలువకు అటూఇటూ త్వరలో ఆహ్లాదకర వాతావరణం రాబోతున్నది. ఆతిథ్యం, అమ్మకం, ఆనందం, ఆహ్లాదం ఈ నాలుగింటి కలయితో కాలువకు రెండు వైపులా అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కాలువ వైపులా కొంత మేర ల్యాన్‌తో పచ్చదనాన్ని తీసుకొచ్చారు. కొంతభాగాన్ని ఖాళీగా వదిలేశారు. ఇక్కడ హోటళ్ల, షాపింగ్‌ కాంప్లెక్స్‌, రిక్రియేషన్‌ కాంప్లెక్స్‌లను నిర్మించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజి ఈస్ట్రన్‌ కాలువ నుంచి నీరు విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
  • 1 month later...
బెజవాడ కాలువల్లో బోటింగ్ ప్రారంభం ...
vijayawada-boating-1102017.jpg
share.png

విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు.

 

విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు.

కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు..

అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

22426487_882268428589902_315317498050307

22291409_882268521923226_878568375890007

22384262_882268248589920_640954573743113

22384136_882268251923253_518361441410215

22281597_1465777840166095_40868023579901

Link to comment
Share on other sites

బెజవాడ కాలువల్లో బోటింగ్ ప్రారంభం ...

vijayawada-boating-1102017.jpg

 

share.png

విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు.

 

 

విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు.

కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు..

అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

22426487_882268428589902_315317498050307

22291409_882268521923226_878568375890007

22384262_882268248589920_640954573743113

22384136_882268251923253_518361441410215

22281597_1465777840166095_40868023579901

Super
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...