Jump to content

Vizag-Kakinada PCPIR


Recommended Posts

భూసేకరణకు లైన్‌క్లియర్‌!
 
636028683508046548.jpg
నక్కపల్లి: రసాయన, పెట్రో పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణకు లైనక్లియర్‌ అయ్యింది. తమకున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం భూసేకరణకు సిద్ధమైంది. ఆరేళ్ల నుంచి భూములు వదులుకోలేమంటూ పోరాడిన రైతాంగం చివరకు భూములు ఇచ్చేందుకు అంగీకరించింది. పెట్రో కారిడార్‌పై ప్రభుత్వ నిర్ణయాలను, భూసేకరణ విధానాన్ని నిరసిస్తూ రైతాంగం హైకోర్టును కూడా ఆశ్రయించింది. చివరకు రెండుమాసాల కిందట హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలం రావడంతో అధికార యంత్రాంగం భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. అన్ని పార్టీల నాయకులు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీకి చెందిన రైతు నేతలు తమకు జీవనాధారమైన భూములే ముఖ్యమంటూప్రకటనలు ఇచ్చి, రైతు ఉద్యమానికి రెండేళ్లపాటు వెన్నుదన్నుగా నిలిచారు. ఆరుమాసాల కిందట విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో తీరం వెంబడి పలు పరిశ్రమలు ఏర్పాటుకు ఎంవోయు ఒప్పందాలు కుదిరాయి. దీంతో గతంలో ఏపీఐఐసీ గుర్తించిన భూముల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా అధికారులు అధికారపక్ష నేతలను ఒప్పించారు. అధికారపక్షానికి చెందిన రైతులు తమ భూముల కొలతలు జరిగేలా అధికారులకు సహకరించారు. ఇదే సమయంలో ఇప్పుడు భూములివ్వకపోతే ఆ తరువాత అభ్యంతరాలు కూడా స్వీకరించమని, పరిహారం అందుకోవడానికి ఈ జన్మచాలదంటూ అధికారులు తమదైన శైలిలో రైతులకు హెచ్చరికలు పంపారు. అధికారులు భూములను సేకరించిన వారం రోజుల్లోపే పరిహారపు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. పెద్ద రైతులే తమ భూములను కొలిపించుకుంటున్నప్పుడు తామేమి చేయగలమని చిన్న రైతులు కూడా అదే బాటలో పయనించారు. రైతు ఉద్యమంలో కీలకనేతగా మారిన బుచ్చిరాజుపేట సర్పంచ్‌ అమ్మాజీ భర్త ,గొర్లబాబూరావు వైసీపీ నుంచి ఈనెల 24న తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ఎకరానికి రూ.18 లక్షలకు భూములిచ్చేందుకు సిద్ధపడ్డారు.
 
ఇక పోరాటంలో మిగిలిన నాయకులు మహా అయితే పది మంది కూడా వుండరు. మరో పది రోజుల్లో వీరంతా కూడా తమ భూములను సమగ్ర సర్వే జరిపించుకోవడానికి అయిష్టంగానైనా సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలంలోని వేంపాడు, రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, డీఎల్‌పురం గ్రామాల్లో మొదటి దశలో 1330 ఎకరాలు డి.పట్టాభూములుండగా ఇప్పటి వరకూ 1100 ఎకరాల భూముల్లో సర్వే పూర్తవ్వడం విశేషం. ఇందుకోసం నలుగురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ సేకరణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. తొలివిడత సర్వేలో సుమారు 2,500 ఎకరాల జిరాయితీ భూములను గుర్తించారు. ఇప్పటివరకూ 600 ఎకరాల భూములను సేకరించడమే కాకుండా రైతులకు పరిహారాన్ని కూడా అందజేయడం విశేషం. ఆరేళ్లపాటు భూములివ్వమని భీష్మించుకుని పోరాటం చేసిన రైతునాయకులంతా ఇప్పుడు తమ భూములివ్వడానికే సిద్ధమేనంటూ అధికారులకు వర్తమానాలు పంపుతున్నారు. ఎటువంటి తలనొప్పి లేకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగిపోతుండడంతో అధికారులు ఊరట చెందారు.
Link to comment
Share on other sites

Visakhapatnam, June 30:  

The Petroleum, Chemicals, Petro-chemical Investment Region (PCPIR) will certainly come up in Andhra Pradesh and there is no rethinking on the project, Sushma Rath, the Joint Secretary in the Union Ministry of Petroleum and Natural Gas, has asserted.


She was responding to questions by reporters here on Thursday after participating in a ceremony in Andhra University to mark the signing of a memorandum of understanding between the Indian Institute of Petroleum and Energy (IIPE) and IIT, Kharagpur, the mentoring institute.


Scotching speculation in the local media that the PCPIR project, originally proposed between Visakhapatnam and Kakinada, had been shelved or shifted to other States, she said the location had to be decided yet. "There are certain issues to be resolved and it is not yet finalised whether it should be in the Vizag-Kakinada region, as originally envisaged, or near Machilipatnam. But it will be in AP," she said.


It may be noted that originally the PCPIR was proposed to be located between Visakhapatnam and Kakinada, and the former prime minister, Dr. Manmohan Singh, first made the announcement at the Visakhapatnam steel plant that PCPIR would be set up in the then undivided State.


However, for various reasons, the project had not really taken off and one of the main reasons is that there is really no anchor (main) unit for the proposed PCPIR. It has led to speculation of late that the project might have been shelved.


sarma.rs@thehindu.co.in


(This article was published on June 30, 2016)

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
ఏపీలో 62 వేల కోట్ల పెట్టుబడులు
 
636126107699800240.jpg
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి 
వంగలి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పెట్రోలియం కెమికల్‌ కాంప్లెక్స్‌కు రూ.35 వేల కోట్లతో ఏడాదికాలంలోగా శంకుస్థాపన చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. పెట్రోలియం ఎనర్జీ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. యాభై ఏళ్లుగా విశాఖలో క్రూడాయిల్‌ రిఫైనరీ పనిచేస్తోందని, దీని సామర్థ్యాన్ని ఇప్పుడున్న 8.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుంచి 15 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచేలా హిందూస్థాన్‌ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)ను విస్తరిస్తున్నామన్నారు. అందుకోసం రూ.2100 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. డిసెంబరులో దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు. ‘మా శాఖ ఆంధ్రలో రూ.62 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే ఏపీ పెట్రో హబ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. విశాఖ నుంచి కాకినాడ వరకు ఈ హబ్‌ విస్తరిస్తుంది. రాష్ట్ర ప్రజలు మోదీపై, చంద్రబాబుపై విశ్వాసం ఉంచారు. దానిని వమ్ము చేయం. పెట్రోలియం విశ్వవిద్యాలయం కోసం కేంద్రం రూ.600 కోట్లు వెచ్చిస్తున్నాం. రానున్న కాలంలో ఈ రంగానికి మంచి భవిష్యత ఉంది. ఈ పెట్రో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. నాలుగేళ్ల తర్వాత విద్యార్థులకు డిగ్రీలతోపాటు అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీని కిరోసిన్‌ వినియోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
Link to comment
Share on other sites

Petrochemical complex will create jobs: AP CM
  •  

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today announced that the petrochemical complex which would come up here with the investment of Rs 35,000 crore would create a lot of employment opportunities for the local educated youths.

Naidu was speaking after flagging off 'Swachha Andhra Pradesh' campaign here.

 


The petrochemical complex will change the economy of entire East Godavari district, he said.

He alleged that the opposition parties were trying to create hurdles in the way of every project to gain political mileage, may it be the capital city Amaravathi or the Pattiseema project.

He was determined to go ahead with all developmental projects, he said.

Naidu reiterated commitment made in the election manifesto that Kapu community would be provided reservations.

Referring to a request made by Kakinada MLA Kondabau, the CM said a third road bridge across Upputeru in the city would be sanctioned soon.

(This story has not been edited by Business Standard staff and is auto-generated from a syndicated feed.)

Link to comment
Share on other sites

  • 4 weeks later...
‘పీసీపీఐఆర్‌’ భూసేకరణ పరిహారం ఎకరాకు 18 లక్షలు
 

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో పెట్రో కెమికల్స్‌-పెట్రో ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌) ఇండసి్ట్రయల్‌ పార్క్‌ కోసం సేకరించిన అసైన్డ్‌ భూములకు పరిహారం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో ఎకరాకు రూ.13.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించగా దానిని రూ.18 లక్షలకు పెంచాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. దీంతో ఈ మేరకు ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోక్యరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Link to comment
Share on other sites

పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై గెయిల్‌ అధ్యయనం
 
ఏపీలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను నెలకొల్పడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై గ్యాస్‌ అథారిటీ లిమిటెడ్‌ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) అధ్యయనం చేస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యాసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...