Jump to content

Schedule 9 and 10 Institutions


Recommended Posts

Appulu kuda ekkada vunnavi akkade kattalani chatta savarana Cheyandi jako's

 

Sivasena valane pakkanettaru Villu.. inka TDP Entha le.. Disgusting souls Villu matiki. Thupuk

Appulu ante tg appulone untadi

Link to comment
Share on other sites

Appulu kuda ekkada vunnavi akkade kattalani chatta savarana Cheyandi jako's

 

Sivasena valane pakkanettaru Villu.. inka TDP Entha le.. Disgusting souls Villu matiki. Thupuk

Adey ga appulu emo Janalu bati division cheyali, kani astulu matram tg ka shhhh ey Bjp ika assam ey
Link to comment
Share on other sites

Guest Urban Legend

Adey ga appulu emo Janalu bati division cheyali, kani astulu matram tg ka shhhh ey Bjp ika assam ey

 

inka comedy enti antey

hyd ORR and metro appulu AP kattali anta

Link to comment
Share on other sites

Political motivated split personality patriotism itlane untundi...

 

I bet on what I said...India lo eyana garu EAST-WEST divide testadu...Andhra bad luck is gujarat strong points lo CBN punyama ani internatinal ga mana vypu chudatam variki nachadu..

 

Fintech valley,Amaravati financial city=> GIFT city financial rendu banking areas mede

 

Ports gurinchi cheppavasaram la..EAST side CBN inko 3 ports kattatam variki nachadu..2004 lo cbn chupinchina private ports margam follow ayina variki CBN gurinchi baga telusu

 

Jai kottukuni murisipondi nationalism ani cheppukuni..

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Nenu inka singareni TG ichhesaremo ee congress Jaffa anukunna. Singareni lo ummadi AP capital vunte we should get our share. Likewise Hyderabad lo chaala Organizations lo we will have our share.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
Guest Urban Legend

Laddulodhi..ivi asala settle cheyyara

TG kantey siggu ledhu Central govt ki em ayindhi Thuuuuuuuu

Link to comment
Share on other sites

సుప్రీంలోనే తేల్చుకుందాం!


636339569612722673.jpg



  • కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్‌ చేద్దాం
  • ఉన్నత విద్యామండలి ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ఏపీ నిర్ణయం

 

 

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా మండలి ఆస్తులు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోంశాఖ ఏప్రిల్‌ 18న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో ఇంటెరిమ్‌ అప్లికేషన్‌ (ఐఏ) దాఖలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఢిల్లీ వెళ్లి అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ (ఏఆర్‌) గుంటూరు ప్రభాకర్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పీపీ రావుతో చర్చించారు. ఉన్నత విద్యా మండలి తయారుచేసిన స్టేటస్‌ నోట్‌ను కేబినెట్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ అంశంపై ఐఏ దాఖలు చేయాల్సిందిగా ఉన్నత విద్యా మండలికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) లేఖ రాసింది. దీంతో డ్రాఫ్టు తయారీకి మండలి కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఐఏ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఉన్నత విద్యా మండలి వాదన ఇదీ..


  • విభజన చట్టంలోని సెక్షన్‌ 47 ప్రకారం ఆస్తులను రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆస్తులను 58ః 42 నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టం చేసింది. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. కానీ కేంద్రం నియమించిన కమిటీ ఈ తీర్పును పక్కనపెట్టి సెక్షన్‌ 48 ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం.
  • ఉద్యోగుల విభజన గురించి సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించలేదు. కానీ ఉన్న ఉద్యోగులు ఏపీ ఉన్నత విద్యా మండలి చట్టం కింద నియమితులైనందున వారిపై సర్వాధికారాలు ఏపీ మండలికే ఉంటాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఎలాంటి అధికారాలు ఉండవు. దీనిపై కేంద్ర కమిటీ ఆదేశాలు న్యాయ సూత్రాలకు విరుద్ధం.
  • ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు గతంలోనే ఒక అంగీకారానికి వచ్చాయి. కానీ కమిటీ దీనిని పరిగణలోకి తీసుకోలేదు.
  • ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరనప్పుడు మాత్రమే కేంద్ర కమిటీ ద్వారా ఆస్తుల పంపకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆస్తుల పంపిణీపై ఈ కమిటీ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలనుకుంటే పదో షెడ్యూల్‌లోని 142 సంస్థలకు ఉన్న ఆస్తులు, ఉద్యోగుల విషయంలో రాష్ట్రం తన వాటాను వదులుకోవలసి వస్తుంది.


Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
కొలిక్కిరాని సంస్థల విభజన
27-09-2017 02:39:59
 
  • నేడు మరో 13 సంస్థలపై భేటీ
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-9లో ఉన్న ఏడు సంస్థల విభజనపై నిర్వహించిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిశ్రమలభవన్‌లో షెడ్యూల్‌-9 ప్రభుత్వ రంగ సంస్థల విభజన కమిటీ చైర్మన్‌ షిలాబిడే నేతృత్వంలో మంగళవారం సమావేశం జరిగింది. సీపీడీసీఎల్‌, ఏపీ ఫుడ్స్‌, మహిళా ఆర్థిక సంస్థ, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌), హౌసింగ్‌బోర్డు, పౌరసరఫరాల సంస్థ, గిరిజన సహకార సంస్థల విభజన కోసం రెండు రాష్ట్రాలు ఇచ్చిన ప్రణాళికపై చర్చ జరిగింది. మరో 13 సంస్థల విభజనపై బుధవారం సమావేశం జరుగనుంది.
Link to comment
Share on other sites

  • 2 months later...
గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకే
04-01-2018 03:15:03
 
  • దీనికోసం ఏపీకి నిధులివ్వలేదు: కేంద్రం
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని 2017 జూన్‌ 2నుంచే తెలంగాణకు పూర్తిగా అప్పగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని తెలిపింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ ఆహిర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ సిబ్బంది కేటాయింపు పూర్తయినట్లు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

3 hours ago, swarnandhra said:
గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకే
04-01-2018 03:15:03
 
  • దీనికోసం ఏపీకి నిధులివ్వలేదు: కేంద్రం
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని 2017 జూన్‌ 2నుంచే తెలంగాణకు పూర్తిగా అప్పగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని తెలిపింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ ఆహిర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ సిబ్బంది కేటాయింపు పూర్తయినట్లు పేర్కొన్నారు.

Mari appude KVP saab.. adagochu ga eppudu allocate chesthunnaru funds ani :kick:

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Andhra Pradesh to file contempt plea against Centre

DECCAN CHRONICLE.
Published Dec 8, 2017, 1:41 am IST
Updated Dec 8, 2017, 1:41 am IST
Challenging the High Court orders the AP government has filed a petition in the Supreme Court.
dc-Cover-qjvq7nui22nsmbp60836fd09s0-2017
 Supreme Court

Hyderabad: In an unusual development the AP government has decided to file contempt petition in the Supreme Court against the central government regarding its orders o sharing of assets of 9th and 10th Scheduled institutions. Interestingly, the Telugu Desam party which is in power in AP is also a partner in the NDA coalition government at the Centre headed by the BJP.  On the petition filed by the Telangana government AP High court issued orders that the assets of the higher education council should be shared on location basis.  Challenging the High Court orders the AP government has filed a petition in the Supreme Court.

Directing the central government to constitute a committee on bifurcation of assets between AP and Telangana states the Supreme Court said that the sharing of assets should not be done on location basis and should be done on population basis. Accordingly the central government has constituted a committee to look into this issue. But, meanwhile union home department has issued orders on sharing of assets between the two states. 

 

 

The central government in its order said that the movable and immovable assets should be bifurcated on  location basis, funds of these institutions should be bifurcated  between the two states on population basis and the employees should be bifurcated between the two states on the basis of where they are working  at present they belong to that state. AP government has opposed the home ministry orders and filed a petition in the Supreme Court seeking clarification on location issue.

Link to comment
Share on other sites

అవసరమైతే సుప్రీం కోర్ట్ కి వెళ్తాం... మోడీకి ఇదే చెప్పా... కేంద్రం పై మారుతున్న చంద్రబాబు స్వరం...

   
cbn-collectors-conf-19012018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై స్వరం పెంచారు... గుంటూరు జిల్లా ఉండవల్లిలో సియం నివాసం వద్ద జరుగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కేంద్రం పై సీరియస్ వ్యాఖ్యలే చేసారు... ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని, అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

 

cbn collectors conf 19012018 2

విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నారని, కాని న్యాయం చెయ్యండి అంటే, మాత్రం ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు... పెద్దన్న పాత్ర పోషించి, ఆదుకోవాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, విభజన హామీల విషయంలో రాజీ లేదు అని, ఎవరితోనైనా పోరాడతామని చంద్రబాబు అనంరు.... విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుంటే, కేంద్రం పై సుప్రీం కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అని చంద్రబాబు అన్నారు...

cbn collectors conf 19012018 3

మొన్న ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు... విభజన చట్టంలో ఉన్నవే కోరుతున్నామని, అదనంగా అడగటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో మనం అట్టడుగున ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామర్ధ్యం లేక తలసరి ఆదాయం తగ్గలేదన్నారు... ఇవన్నీ విభజన పాపాలు అని అన్నారు... ఇతర రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవాల్సిందే అని, అది కేంద్రం బాధ్యత అని తెగేసి చెప్పారు...

Link to comment
Share on other sites

  • 2 months later...
మైనార్టీ ఆర్థిక సంస్థ విభజనకు ఉత్తర్వులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థకు సంబంధించి ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విభజనపై గతంలో వేసిన నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఉమ్మడి సంస్థలో పనిచేసే ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ ఆర్థిక సంస్థలకు 58:42 నిష్పత్తిలో విభజించనున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఉమ్మడి సంస్థలోని 117 మంది ఉద్యోగుల్లో 66 మంది ఆంధ్రప్రదేశ్‌కు, 51 మంది తెలంగాణకు చెందనుండగా.. ముఖ్య కార్యాలయాల్లో పనిచేసే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు 14 మందిని, తెలంగాణకు 11 మందిని కేటాయించారు. ఉమ్మడి మైనార్టీ సంస్థకు ఉన్న మొత్తం 22 కార్యాలయాల్లో 12 ఆంధ్రప్రదేశ్‌కు, పది తెలంగాణకు దక్కనున్నాయి. జిల్లా కార్యాలయాల్లోని 45 మంది శాశ్వత ఉద్యోగుల్లో 22 మంది ఆంధ్రప్రదేశ్‌కు, 23 మంది తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి క్రైస్తవ మైనార్టీ సంక్షేమ సంస్థను కూడా ఇదే తరహాలో విభజించారు. ఈ సంస్థకు చెందిన ఇద్దరు శాశ్వత ఉద్యోగుల్లో ఒకరిని ఆంధ్రప్రదేశ్‌కు, మరొకరిని తెలంగాణకు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Link to comment
Share on other sites

  • 1 month later...
ఆ 40 సంస్థలపై నాన్చుడెందుకు?
12-05-2018 02:58:56
 
636616907366982217.jpg
  • 9వ షెడ్యూల్‌లోని ఆస్తుల పంపిణీపై తెలంగాణను అడిగిన రాష్ట్ర ప్రభుత్వం
  • ‘షీలా బిడే’ ప్రకారం ఆదేశాలివ్వాలంటూ సూచన
  • స్థిరాస్తులు లేని 45 సంస్థలనూ పంచేద్దాం
  • ఉద్యోగుల మార్పిడికి ఇద్దరు సభ్యుల కమిటీ
  • ఏపీ, తెలంగాణ సీఎ్‌సల భేటీలో చర్చ
  • సచివాలయ భవనాలు ఇవ్వాలన్న తెలంగాణ
  • సీఎంను అడిగి చెప్తామన్న దినేశ్‌కుమార్‌
 అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల ఆస్తుల పంపకాలపై నాన్చుడు ధోరణిని విడనాడాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వీటి పంపిణీ కోసం కేంద్వ్రం నియమించిన షీలాబిడే కమిటీ ఇచ్చిన సిఫారసులను అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేసిందని, వాటి పంపకాలు కూడా దాదాపుగా జరిగిపోయినట్లేనని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మేరకు ఉత్తర్వులిస్తే.. అక్కడితో అది పూర్తయిపోతుందని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి విభజన వ్యవహారాలు చూస్తున్న ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ నుంచి ఆ వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం షెడ్యూలు 9, 10లలో ఉన్న సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలపై చర్చించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారు, అదేవిధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇలాంటి ఉద్యోగుల పరస్పర మార్పిడికి ప్రేమ్‌చంద్రారెడ్డి, రామకృష్ణారావు ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు. ఈ ఇద్దరు సభ్యుల కమిటీ... అవసరమైన శాఖల అధికారులతో మాట్లాడుతూ ఉద్యోగుల మార్పిడికి మార్గం సానుకూలం చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి విషయంలో కూడా సానుకూలంగా ఉండాలని, సబ్జెక్టులతో సంబంధం లేకుండా పరస్పర మార్పిడి ఉండేలా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా విభాగం సిబ్బంది, ఐపీఎస్‌ అధికారులు, పోలీసు సిబ్బంది పరస్పర మార్పిడి విషయంలోనూ అంగీకారం కుదిరింది. మరోవైపు హైదరాబాద్‌లో సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ వాటాగా వచ్చిన భవనాలు తమకు అప్పగించేయాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. తమ ముఖ్యమంత్రి తో చర్చించి చెప్తామని దినేశ్‌ సమాధానమిచ్చారు. మరోవైపు 9వ షెడ్యూలులో స్థిరాస్తులు లేని సంస్థలు కొన్ని అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో కొందరు ఉద్యోగులు, కొద్దిపాటి నిధులు మాత్రం ఉన్నాయి. వీటి విషయంలోనూ సానుకూల పంపకాలకు సుముఖత వ్యక్తమైంది.
 
పురావస్తు సంపదను పంచాలి
మరోవైపు హైదరాబాద్‌లోని మ్యూజియంలలో ఉన్న పురావస్తు సంపదను కూడా పంచాలని ఏపీ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఆయా మ్యూజియంలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కళాఖండాలు, ఇతర పురావస్తు సంపదను అప్పగించాలని అడిగారు. ఏపీ జెన్‌కోకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ బకాయిలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటోంది. బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శిని అడిగారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...