Jump to content

Schedule 9 and 10 Institutions


Recommended Posts

ఉమ్మడి సంస్థల్ని జనాభా నిష్పత్తిలో పంచుకోవాల్సిందే 
25-08-2016 01:28:47
  • తీర్పు పునస్సమీక్షకు సుప్రీం తిరస్కృతి 
  • తెలంగాణ వ్యాజ్యం కొట్టివేత 
  •  గత తీర్పు పునస్సమీక్షకు సుప్రీం తిరస్కృతి 
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలను జనాభా ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలంటూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉన్నతవిద్యా మండలి వివాదంపై ఏపీ ఉన్నతవిద్యా మండలి, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉన్నత విద్యామండలితో సహా ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఇరు రాషా్ట్రలూ రెండు నెలల్లోపు చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తీర్పుచెప్పింది. రెండు రాషా్ట్రలూ స్పందించకపోవటంతో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంది. ఉమ్మడి సంస్థల విభజనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇరు రాషా్ట్రల నుంచి ఇద్దరేసి చొప్పున ప్రతినిధులతో ఈ కమిటీని నియమించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఏప్రిల్‌ 18న రివ్యూ పిటిషన్లను దాఖలు చేస్తూ, తీర్పును సమీక్షించాలని కోరాయి. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రెండు కేసులు దాఖలు చేసినా, ఆయా కేసుల్ని కలిపి విచారించిన సుప్రీంకోర్టు రెండింటికీ కలిపి ఒక్క తీర్పునే ఇచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి మాత్రం రెండు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయటం గమనార్హం. ఇందులో ఏపీ ప్రభుత్వ కేసులో తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈనెల10న జడ్జిలు జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలు చాంబర్‌లో పరిశీలించి, తిరస్కరించారు. ఏపీ ఉన్నతవిద్యామండలి కేసులో తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జడ్జిలు పరిశీలించారు. గతంలో తామిచ్చిన తీర్పును పునస్సమీక్షించేది లేదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు. దీనితో క్యురేటివ్‌ పిటిషన్‌ను దాఖలుచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్లను దాఖలు చేయవు. అలాంటి సంప్రదాయం లేదని సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, బ్యాంకుఖాతాల్లోని నగదును రెండు రాషా్ట్రలూ జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవటం అనివార్యమయ్యింది. రాషా్ట్రలు చొరవ చూపని పక్షంలో కేంద్రం ఈ పని చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి సంస్థల విభజన ఇప్పుడు కేంద్రం బాధ్యత. న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేనందున కేంద్రం నియమించిన కమిటీ ఇక వేగంగా పని పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

సెక్షన్ 9, 10లో ఉన్న ఆస్తులు పంచాలి అంటూ ఏపీ… మనల్ని ముంచాలి అని తెలంగాణ ఏడాదిన్నర నుంచి పెనుగులాడుతున్నాయ్ కదా ! రేపు 21న ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత అయినా వ్యవహారం కదలకపోదు. ఇప్పటికే తీసిన అధికారిక లెక్కల ప్రకారం ఏపీకి తెలంగాణ ఎంత ఇవ్వాల్సి వస్తుందో తెలుసా… ? మార్కెట్ వేల్యూ ప్రకారం కాకుండా ప్రభుత్వ లెక్కలే తీసుకున్నా… తెలంగాణ ఇప్పిటికిప్పుడు కనీసం 20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మనకి !

ఎలాగంటే…
పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ ఉజ్జాయింపుగా 16,070 కోట్లు ఉంటుంది. భూములు భవనాల విలువ మరో 17000 వేల కోట్లు. కార్లు లాంటి మూవబుల్ ఎస్సెట్స్ విలువ 218 కోట్లు అవుతుంది. యంత్ర పరికరాలు ఇతర సామాగ్రి మరో 340 కోట్లు తేలుతుంది. ఫిక్సిడ్ డిపాజిట్లు 3 వేల కోట్ల రూపాయలున్నాయ్. బ్యాంకుల్లో లిక్విడ్ డిపాజిట్లు మరో 1670 కోట్లు వరకూ ఉన్నాయ్. మొత్తం అంతా కలిపితే 38500 కోట్ల వరకూ ఉంటుంది సుమారుగా !

విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణ ఆస్తుల్ని 58:42 బేసిస్ లో పంచుకోవాలి. అంటే ఏపీకి కనీసం 20 వేల కోట్ల పైగా రావాల్సిఉంటుంది. ఇది కేవలం సర్కారీ లెక్క. అదే మార్కెట్ వేల్యూ తీస్తే మరో మూడునాల్గు రెట్లు ఉన్నా ఉండొచ్చు. తక్కువలో తక్కువ. ఇంత మొత్తం వచ్చిందంటే ఏపీలో ఇన్ ఫ్రా అవసరాలు అన్నీ తీరిపోతాయ్. రాజధాని తొలి దశ రాజసంగా కంప్లీట్ అవుతుంది. ఏపీ ఎదురుచూపులన్నీ ఒక్క ఉదుటన నెరవేర్చే అవకాశం ఉంటుంది కాబట్టే సెక్షన్ 10తోపాటు 9 లెక్క కూడా తీయాలని ఏపీ అడుగుతోంది. ఇప్పటికైనా తెలంగాణ మెడలు వంచి సాధించుకోవాలి. హైటైమ్.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
పదో షెడ్యూల్‌ సంస్థల విభజనపై నేడు నిర్ణయం
 
హైదరాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌ సంస్థల విభజనపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక భేటీ మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. పదో షెడ్యూల్‌లోని ఉన్నత విద్యా మండలిని జనాభా ప్రాతిప్రదికన విభజించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే! సుప్రీం కోర్టు తీర్పును అన్ని సంస్థలకు వర్తింపజేయాలని ఏపీ కోరుతుండగా... ఈ వాదనను తెలంగాణ అధికారులు కొట్టిపారేస్తున్నారు.
Link to comment
Share on other sites

ఈ భేటీలోనూ ఏకాభిప్రాయం కుదర‌లేదు!
* ఎటూ తేలని ప‌దో షెడ్యూల్ లో సంస్థ‌ల వ్య‌వ‌హారం
హైద‌రాబాద్‌: విభ‌జ‌న చ‌ట్టంలోని పదో షెడ్యూల్ లో సంస్థల వ్యవహారంపై  తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన రెండో స‌మావేశంలోనూ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, రాజీవ్ రంజన్ ఆచార్య, ఆంధ్రప్రదేశ్ నుంచి కుటుంబరావు, బాలసుబ్రమణ్యం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలికి సంబంధించి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా ప్రతిపాదనలు అందాయని... దానిపై వారం రోజుల్లో స్పందిస్తామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. పదో షెడ్యూల్ లో ఉన్న మొత్తం 142 సంస్థల విషయమై సమావేశంలో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు అన్నారు. అయితే ఒక్క ఉన్నత విద్యామండలికి సంబంధించి మాత్రమే లిఖిత పూర్వక ప్రతిపాదనలు వస్తే అన్ని సంస్థలపై ఎలా చర్చిస్తామని తెలంగాణ అధికారులు అంటున్నారు.  సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉన్నత విద్యామండలితో పాటు అన్ని సంస్థల ఆస్తులను జనాభా ప్రాతిపదికన 58 : 42 నిష్పత్తిలో పంచాలని ఏపీ ప్రతినిధులు అన్నారు. గతంలో ఐదు రాష్ట్రాల విభజన సంప్రదాయాలు, విభజన చట్టానికి లోబడి సెక్షన్ 75 ప్రకారం ఏ భూభాగంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ ప్రతినిధులు అన్నారు. దీంతో సమావేశంలో ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. అన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు తెలిపారు.

 

 

For 10th schedule, AP submitted valuation of 40K and our share is 24K.

Link to comment
Share on other sites

cash panchutam kani assets pancham ani oka step digaru.

Supreme court judgement lo Assets meda clarity ledu ani kotta comedy. A judgement ardam kaledu anta :roflmao:  :roflmao:

 

 

Anyway very soon CASH will be shared. On Assets AP asked Attorney general of India to explain judgement meaning.

 

 

VIJ_2016-10-25_maip6_10.jpg

Link to comment
Share on other sites

  • 2 months later...
విభజనకు గడువు కావాలి
 
  • ఏపీ భవన విభజనపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ భవన విభజనపై గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌, ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, మాజీ సీఎస్‌ రాజీవ్‌ శర్మ వారి కార్యాలయాల నుంచి ఈ కాన్ఫరెన్సలో పాల్గొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ భవన విభజనకు చర్యలు చేపట్టాలని ఇరు రాషా్ట్రల అధికారులకు రాజీవ్‌ మహర్షి సూచించినట్లు సమాచారం. విభజనకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు స్పష్టం చేయగా.. తమకు 15 రోజులు సమయం కావాలని తెలంగాణ కోరినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Division of Schedule X institutions: written arguments sought from TS, AP

The committee constituted by the Union Government to hear the views of Telangana and Andhra Pradesh on division of 142 Schedule X institutions completed its sittings in Delhi on Friday and asked the two State governments to submit their written arguments within 10 days as there was no convergence of viewpoints.

The committee headed by Jaideep Govind, Additional Secretary, Ministry of Home Affairs, was in particular looking into the division of AP State Council for Higher Education (APSCHE) as the Supreme Court had already ruled that it should be divided on the basis of population ratio as per the provision of the AP State Reorganisation Act, 2014 (APSR Act).

“ The committee finished with the meetings. Both the States stuck to their stated viewpoints based on their own interpretation of different sections of the APSR Act. It is for the Committee to give a final decision,” sources told .

The committee comprised two representatives each from Telangana and Andhra Pradesh -- ex-Chief Secretary and now Chief Advisor Rajiv Sharma and Advocate-General from Telangana K. Ramakrishna Reddy and Vice-Chairman of AP State Planning Board C.Kutumba Rao and retired IAS officer Balasubramanyam.
The APDCHE issue reached the Apex Court when Andhra Pradesh challenged the order of the High Court in favour of Telangana State which claimed absolute right over the council and its building. The SC verdict was in favour of AP. Telangana State filed a review petition after the Supreme Court verdict but it was also dismissed. Yet, the problem persists as the two States interpreted the Act differently.
Citing Section 75 of the AP State Reorganisation Act, 2014, Telangana said a state would have absolute ownership over the institutions located within that state and the other state could avail itself of the facilities of those institutions by entering into a memorandum of understanding. It used the same interpretation to take control over the premises of the APSCHE in Hyderabad but that was struck down by the Apex Court.

Andhra Pradesh, to substantiate its arguments, cited Part VI and Section 47 of the Act which stated that all the assets and liabilities of the erstwhile state of combined Andhra Pradesh were to be apportioned between the two successor States. The Schedule X institutions were not exempted, it pointed out.

/*****
If center plays any games then anyone can file contempt of Supreme court on Center so hope they reiterate Supreme's decision

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...