Jump to content

Prakruthi vyavasayam


Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే శరణ్యం: చంద్రబాబు
02-06-2018 16:57:17
 
636635554448727965.jpg
అమరావతి: భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున చేపట్టడం ద్వారా... ప్రపంచానికి మనం మంచి సందేశం ఇవ్వాలన్నారు. ప్రపంచమంతా ప్రకృతి సాగు వైపు మరలుతోందని, 2024 నాటికి ఏపీని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బాబు చెప్పారు. 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొస్తామని, ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు... ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థలు ముందుకు వస్తున్నాయని చంద్రబాబు చెప్పకొచ్చారు.
Link to comment
Share on other sites

This topic is close to my heart ... hope to pursue this passion at some point in my life ... after I fulfill my current obligations.

Will take some adjustment ... but, raithu bidda gaa shouldn't be too hard to pick up where my father left it ... will be interesting ... 

 

Link to comment
Share on other sites

ద్యమంలా ప్రకృతి సేద్యం
03-06-2018 10:00:30
 
636636168379996853.jpg
  • రైతులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతాం
  • ప్రకృతి సేద్యం ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌
  • రైతు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు
గుంటూరు: ప్రకృతి సేద్యం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఓ ఉద్యమంలా సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రైతులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో రెండోరోజు శనివారం ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంలో ఉన్నారని.. 2024-25 నాటికి 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యానికి ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సేద్యం, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌పై నాలెడ్జ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
 
 
ప్రపంచంలోనే ఏపీ రాజధాని అమరావతి అన్ని రంగాల్లో ముందుకు సాగే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఉద్యానపంటల సాగులో లాభాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రకృతి సేద్యం రాష్ట్రంలో విజయవంతం కావడానికి పెండేకంటి విజయకుమార్‌ కృషిని సీఎం ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి సేద్యానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌కే పట్నాయక్‌ తెలిపారు. రాష్ర్టీయ కృషి వికాస యోజన, పరంపరాగ్‌ కృషి వికాస్‌ యోజన పథకాల ద్వారా ప్రకృతి సేద్యానికి నిధులు కేటాయిస్తున ్నట్లు చెప్పారు. ఏపీ అమలు చేస్తున్న ఈపథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రవేశ పెడతామన్నారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రకృతి సేద్యం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర సలహాదారుడు పెండేకంటి విజయకుమార్‌ మాట్లాడుతూ సుభాష్‌ పాలేకర్‌ విధానాలను అమలు చేసిన రైతులు లబ్ధి పొందినట్లు చెప్పారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు.
 
 
కార్యక్రమంలో కలెక్టర్‌ కోన శశిధర్‌, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ డాక్టర్‌ రామకృష్ణ, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, ప్రకృతి సేద్యం రాష్ట్ర కన్సెల్టెంట్‌ డాక్టర్‌ రాయుడు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఫిలిప్‌ థొచర్‌, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ మురళీధరరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, జడ్పీటీసీ ఆకుల జయసత్య, రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ గుంటుపల్లి వీరభుజంగరాయలు, గుంటూరు ఎంపీపీ తోట లక్ష్మీకుమారి, వ్యవసాయశాఖ జేడీ విజయభారతి, ఏజేసీ విజయకుమార్‌, ఆర్డీవో బండ్ల శ్రీనివాస్‌, డీఎస్‌వో చిట్టిబాబు, సీపీవో శ్రీనివాస్‌, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతిసేద్యం రైతులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు విద్యార్థిని శ్రీవైష్ణవి పాడిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం అందర్నీ ఆకట్టుకుంది. విదేశీ పర్యటనలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి రైతు సదస్సు విజయవంతం కావాలంటూ సందేశం పంపారు.
 
 
pragati-01.jpgసుభాష్‌ పాలేకర్‌.. వీడియో సందేశం
జాతీయ స్థాయిలో ప్రకృతి సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉన్నట్లు దాని సృష్టికర్త సుభాష్‌ పాలేకర్‌ తెలిపారు. అనారోగ్యంతో గుంటూరు సదస్సుకు హాజరు కలేకపోయిన పాలేకర్‌ రైతు సదస్సుకు వీడియో సందేశం పంపారు. ఈ సందేశాన్ని పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని కొనియాడారు.
 
 
రైతు సదస్సులో విదేశీ ప్రతినిధులు
వ్యవసాయోత్పత్తులను పెంచాలని విచ్చలవిడిగా రసాయనిక సేద్యాన్ని అన్ని దేశాలు అమలు చేసినట్లు ఇండోనేషియా మాజీ మంత్రి డాక్టర్‌ సుబ్రతో అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆహార ఉత్పత్తుల విభాగానికి చెందిన సన్నీ వర్గీస్‌ మాట్లాడుతూ రసాయనిక సేద్యం వలన భూగర్భ జల వనరులు కలుషితమై నీటి కాలుష్యం ఏర్పడిందన్నారు. ఐక్యరాజ్య ఉపాధి విభాగానికి చెందిన ఎరిన్‌ సోలేన్‌ మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
 
సస్టైనబుల్‌ ఇండియా ఫైనాన్స్‌ ఫెసిలిటి (ఎస్‌ఐఎఫ్‌ఎఫ్‌) చైర్మన్‌ సత్యత్రిపాఠి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రకృతి సేద్యం వ్యవసాయోత్పత్తులకు పూర్తిస్థాయిలో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన పిఎన్‌ ఫారిబా బ్యాంక్‌ ప్రతినిధి అంత్వాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో యూరిపియన్‌ బ్యాంక్‌ ద్వారా వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ వసతులను మెరుగు పరుస్తున్నట్లు చెప్పారు. స్విట్జర్‌లాండ్‌కు చెందిన పవన్‌ సుఖదేవ్‌ మాట్లాడుతూ భారత్‌లో పురుగు మందులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల ప్రతినిధి శాంభర్గ్‌, నైరోబీకి చెందిన డాక్టర్‌ రవి ప్రభు, ఐక్యరాజ్య సమితికి చెందిన సీనియర్‌ అధికారి యూరీ తదితరులు ప్రసంగించారు.
 
 
ప్రగతి దీపిక ఆవిష్కరణ
జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై జిల్లా యంత్రాంగం తయారుచేసిన ప్రగతి దీపికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్సంగా నాలుగేళ్లలో జరిగిన కార్యక్రమాలను కలెక్టర్‌ శశిధర్‌ సీఎం దృష్టికి తెచ్చారు. ప్రగతి దీపికను పరిశీలించిన చంద్రబాబు జిల్లా యంత్రాగాన్ని అభినందించారు.
 
 
pragati-00.jpg75 సెంట్లలో రూ.3లక్షల ఆదాయం..
1960 నుంచి వ్యవసాయం చేస్తున్నా.. అతివృష్టి, అనావృష్టి చూసి తీవ్రంగా నష్టపోయా.. చివరకు మిగిలిన 75 సెంట్లలో ప్రకృతి సేద్యం మొదలు పెట్టా. అందులో వేసిన పంటల ద్వారా సంవత్సరానికి ఖర్చులు మినహా సుమారు రూ.3లక్షలు ఆదాయం లభిస్తోంది. ఈ పద్ధతిని వివరిస్తూ ఈ సంవత్సరం కనీసం 50మంది రైతులను తయారు చేస్తా.
- రోశయ్య, pragati-04.jpgగుంటూరు జిల్లా
 
 
ఆరు సెంట్లతో ఆరెకరాలు కొనుగోలుచేశా
13 ఏళ్ల వయసులో పెళైంది.... 19 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలు ఉన్న ఆస్తి ఆరు సెంట్లు, పుట్టింటివారు ఇచ్చిన ఆవు మాత్రమే. ఈ పరిస్థితులో ఈ వ్యవసాయ పద్ధతిని తెలుసుకొని ఆచరించటం మొదలు పెట్టా. ఆరు సెంట్లలో వివిధ రకాల పంటలు సాగు చేయటంతో పాటు వాటిని స్వయంగా వినియోగదారులకు అమ్మాను. రూ.12 లక్షల అప్పు తీర్చటంతో పాటు 12 ఆవులు, ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేయటంతో పాటు పిల్లలను మంచి చదువులు చదివించుకుంటున్నా. - పుష్పలత, కర్నూలు జిల్లా
 
 
pragati-03.jpgలెక్చరర్‌ ఉద్యోగం వదిలేశా..
మా నాన్నగారి నుంచి వచ్చిన ఎకరాన్నర మామిడి తోట నిర్జీవమైంది. అప్పుడు తెలిసిన ప్రకృతి సేద్యంతో సాగు మొదలు పెట్టా అందులో భాగంగా అంతర్‌ పంటలు సాగు చేశాను. రెండు సంవత్సరాలలో తోట బాగు పడటంతో పాటు అంతర్‌ పంటలతో అధిక లాభాలు ఆర్జించా. దీంతో అప్పటివరకు చేస్తున్న లెక్చరర్‌ ఉద్యోగాని వదిలేసి పూర్తి స్థాయి రైతునయ్యా.
- మహాలక్ష్మణుడు, కృష్ణా జిల్లా
 
 
pragati-02.jpgనేను నమ్మటానికే ఆరు నెలలు పట్టింది
బీస్సీ ఆగ్రికల్చరర్‌ అవగానే ప్రకృతి సేద్యం గురించి తెలుసుకున్నా అయితే ఇందులో శాస్ర్తీయత ఎంత అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ తరుణంలో పాలేకర్‌ శిక్షణా తరగతులకు హాజరయ్యా. పూర్తి స్థాయి నమ్మకం కలగటానికి ఆరు నెలలు పట్టింది. ఇప్పుడు రెతులను ప్రకృతి సేద్యం వైపు మరలచటానికి ప్రయత్నిస్తున్నా.
- శ్రీనిజ ,తూర్పుగోదావరి జిల్లా
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...