Jump to content
sonykongara

Prakruthi vyavasayam

Recommended Posts

‘ప్రకృతి వ్యవసాయానికి తానా చేయూత అవసరం’

కొర్నెపాడు, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రవాసాంధ్రులు నడుంకట్టాలని రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కోరారు. పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించే విషయంలో తానా భాగస్వామ్యం కావాలని సూచించారు.అమెరికాలోని సెయింట్‌లూయిస్‌లో ‘తానా’ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవసాయ సదస్సులో ఆదివారం ఆయన ప్రసంగించారు. రసాయన రహిత వ్యవసాయంపై సదస్సులు నిర్వహించాలన్నారు.

Share this post

Link to post
Share on other sites
ప్రకృతి వ్యవసాయం..పాలేకర్‌ విధానం
14-06-2017 10:35:15
 
636330334383126790.jpg
 నరసరావుపేట : ‘రసాయన, సేంద్రియ వ్యవసాయం ప్రమాదకరం.. ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి హాని కలుగ జేస్తాయి.. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సమాజానికి శ్రేయస్కరం..’ అని పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ స్పష్టం చేశారు. నరసరావుపేట డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో మంగళవారం జిల్లా రైతు సదస్సులో ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు వివరించారు. రసాయన వ్యవసాయం వల్ల రైతులు నష్ట పోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీంతో పాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ఇదే పరిస్థితి సేంద్రియ వ్యవసాయంలో కూడా తలెత్తుతున్నదని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం ఇతర దేశాల కుట్రలో భాగమేనని విమర్శించారు. వర్మి కంపోస్టు విధానం కూడా అంత మంచిది కాదన్నారు. వానపాముల స్థానంలో ఎసినోపిటోడా అనే జీవిని వర్మి కంపోస్టుకు వినియోగిస్తున్నారని, ఈ కంపోస్టును పంటలకు వినియోగించటం వలన ప్రమాదకరమన్నారు. ఈ సమస్యలను ప్రకృతి వ్యవసాయం ద్వారా అధికమించ వచ్చని పాలేకర్‌ చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వలన సాగు వ్యయం తగ్గటంతో పాటు అధిక దిగుబడులను సాధించ వచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. రానున్న మూడేళ్ళల్లో ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని ఆయన యోచిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదని గతంలో ఓ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ చేసిన వ్యాఖ్యలను పాలేకర్‌ ఖండించారు. జనవరిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
 
ప్రకృతి వ్యవసాయం చేసే విధానాన్ని పాలేకర్‌ రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆయన మాటల్లోనే ఇలా..
 •  ప్రకృతి వ్యవసాయం మూడు విధానాలు.. బీజామృతం, ఘనామృతం, జీవామృతం.. వీటికి ఆవు మూత్రాన్ని, పేడను వినియోగించ వచ్చు.
 • బీజామృతం అంటే విత్తన శుద్ధి. 20 లీటర్ల నీరు, ఐదు లీటర్ల ఆవు మూత్రం, ఐదు కేజీల ఆవు పేడ మిశ్రమాన్ని కలిపి రాత్రంతా వుంచి తదుపరి రోజు విత్తనాలను శుద్ధి చేసి వాటిని నాటినట్లయితే 90 శాతం మొలకెత్తుతాయి.
 •  ఘనామృతం ఆవు పేడతో దీన్ని తయారు చేసుకోవచ్చు. 200 కేజీల ఎండిన ఆవు పేడ జల్లిడ పట్టి దీనిలో 20 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఎండ బెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ ఘనామృతాన్ని చివరి దుక్కిలో, పంట కాపు దశలో పంటకు వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
 •  జీవామృతం అంటే ఆవు మూత్రంతో తయారు చేసేది. 200 లీటర్ల ఆవు మూత్రం ఒకటి రెండుసార్లు సాగు నీటితో పాటు పంటలకు అందించాలి. పంటలకు నాలుగు నుంచి ఐదుసార్లు జీవామృతం పిచికారి చేయాలి. దీంతో చీడ పీడలను నివారించు కోవచ్చు. 200 లీటర్లలో ఐదు నుంచి పది లీటర్లు గో మూత్రం, పది కేజీల ఆవు పేడ, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ పప్పుల పిండి, పిడెకెడు పుట్ట మన్నుతో వీటిని కలిపి 48 గంటలు నిల్వ చేయాలి.
 •  ద్రవ, ఘన జీవామృతాలు పంటలకు వినియోగించటం వలన నత్రజని పుష్కలంగా లబిస్తుంది. ఫాస్పేట్‌ నేలలో పుష్కలంగా వుంటుంది. పొటాష్‌ కూడా ఇదే రకంగా మొక్కలకు అందుతుంది. ఫ జీవద్రవ్యం కూడా భూమిలో పెరగటం వలన మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవామృతం వలన భూమిలోని వానపాములు సంచరించటం పెరుగుతుంది. దీని వలన భూమి 15 అడుగుల లోతు వరకు రంధ్రాలు ఏర్పడతాయి. కురిసిన వర్షం పూర్తిగా భూమిలోకి ఇంకుతుంది.
 •  200 లీటర్ల నీటిలో 50 లీటర్ల గో మూత్రం, ఐదు లీటర్ల పుల్లటి మజ్జిగ కలిపి పంటలకు పిచికారి చేసినట్లయితే వైరెస్‌ వంటి ప్రమాదకర తెగుళ్లను నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించవద్దు. రైతులే ప్రత్యేక మార్కెట్‌ను రైతులు రూపొందించుకోవాలి.
 •  ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం ఆర్జించవచ్చు. యాపిల్‌, ద్రాక్ష, స్ట్రాబెరి వంటి పంటలను కూడా ఆంధ్రప్రదేశ్‌ అనుకూలం.
 •  ఇలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వుంది. అధిక రేట్లు లబిస్తున్నాయి. రైతు బజారుల్లో ఇలాంటి ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. శాసనసభ, శాసన మండలిలో కూడా ప్రకృతి వ్యవసాయంపై నిర్మాణత్మక చర్చ జరగాలి.
 •  భూమిలో జీవన ద్రవ్యం(హ్యూమస్‌) మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవనద్రవ్యం ప్రకృతి వ్యవసాయం వల్ల భూమిలో పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర్‌ పంటలు సాగు చేయాలి. ఒక దేశీయ ఆవు నుంచి వచ్చే పేడ, మూత్రం ద్వారా 30 ఎకరాల్లో పంటలను సాగు చేయవచ్చు. చీడ, హైబ్రీడు, జర్మనేషన్‌ విత్తనాలు కన్నా దేశీయ విత్తనాలే మేలు. దేశీయ విత్తనాలు అందుబాటులో లేకపోయినా సంకర విత్తనాలను దేశీయ విత్తనాలుగా మార్చుకొనే అవకాశం వుంది. ప్రకృతి వ్యవసాయంలో సాగు నీరు, విద్యుత్‌ 90 శాతం ఆదా అవుతుంది. ఇలా పండించిన పంటలు ఆరోగ్యకరంగా వుంటాయి. పల్లెలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. పట్టణాలకు రైతుల వలసలను, ఆత్మహత్యలను నిరోధించవచ్చు.

Very good program by Government for Farmers. Really appreciated.

Aa bullet points vunnavi chala manchi points. If people start following at least to some extent then we can see good results. This will force/encourage farmers to raise cattle too.

Share this post

Link to post
Share on other sites
ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబుకు అవగాహన ఉంది: పాలేకర్

కృష్ణా: సీఎం చంద్రబాబుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ఉందని, ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని ధృడనిశ్చయంతో ఉన్నారని సుభాష్ పాలేకర్ అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని రైతుల కోసం జనవరిలో శిక్షణ తరగతులు, నిర్వహిస్తామన్నారు. మన భూముల్లో యాపిల్, స్ట్రాబేర్రి, దాల్చిన చెక్క ఎలా పండించాలో రైతులకు వివరిస్తామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో కృష్ణాజిల్లా బాసుమతి ధాన్యం పండించే జిల్లాగా మారబోతుందని సుభాష్ పాలేకర్ జోస్యం చెప్పారు.

Share this post

Link to post
Share on other sites

Organic Farming Revolution in Andhra Pradesh

CBN met agriculturist and inventor of Zero Budget Spiritual Farming Sri Subhash Palekar at his residence in Undavalli today. He has been officially appointed as Advisor to the State Government responsible for formulating policies and creating framework to encourage Organic Farming in Andhra Pradesh. CBN also requested Sri Subhash Palekar to help build a university in Amaravati exclusively for Organic Farming. For this purpose, the State government has agreed to allot 100 acres of land and Rs. 100 crores as investment. Speaking on the occasion, CBN said that he will strive to make Andhra Pradesh 100% Organic in the coming years and eliminate use of harmful chemicals and fertilizers in crop production. Last year, Subhash Palekar had organized a training programme for thousands of farmers from all over the State on ‘Natural Farming and Making Agriculture more Profitable by Reducing the Input Costs’. The State Government aims to train 10 lakh farmers in the coming 3 years and is devising necessary plans to achieve it.

19095320_1708904945789756_25054219798898

Share this post

Link to post
Share on other sites
ప్రకృతి సాగుకు విశ్వవిద్యాలయం
15-06-2017 02:47:05
 
636330917478052961.jpg
 • వంద ఎకరాలు, వంద కోట్లు నిధులు
 • అమరావతిలో ఏర్పాటు చేయండి
 • పాలేకర్‌కు చంద్రబాబు ఆహ్వానం
 • ప్రకృతి సాగుపై సలహాదారుగా పాలేకర్‌
 
అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో వంద ఎకరాల్లో, వంద కోట్ల నిధితో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ వర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ను ఆహ్వానించారు. పెట్టుబడి భారం లేకుండా ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించేందుకు సహకరించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పాలేకర్‌ను నియమించారు. బుధవారం ఉదయం ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. దేశీయ విత్తనాలు, దేశీయ పశు సంతతి వృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే మేలు జాతి పశువులుగా పేరొందిన ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల పరిరక్షణపై దృష్టి పెడతామని అన్నారు. రోజురోజుకూ పల్లెలను వదిలి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని... సాగు ప్రమాదంలో పడుతోందని పాలేకర్‌ ముఖ్యమంత్రి దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి లేకుండా రైతులు అధిక ఉత్పత్తులు సాధించి, ఎక్కువ ఆదాయం సమకూర్చుకునేలా చేయగలిగినప్పుడు వ్యవసాయ రంగానికి తిరుగుండదని చెప్పారు.
 
ప్రకృతి సాగుకు ‘బ్రాండింగ్‌’
‘‘అవసరం లేకున్నా ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడటంతో అటు సాగు భూమి, ఇటు వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయి. దీనిని అరికట్టాల్సిన అవసరముంది. ప్రతి రైతుకు భూ ఆరోగ్య కార్డులు ఇవ్వడంలో, సూక్ష్మ పోషకాలను ఉచితంగా పంపిణీ చేయడంలో ఏపీ దేశంలోనే ముందుంది. ప్రకృతి వ్యవసాయంలోనూ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపడమే మా లక్ష్యం. ప్రకృతి వ్యవసాయంతో వచ్చే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ తీసుకువచ్చి, రైతు బజార్లలోనూ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్న పాలేకర్‌ సూచనపై సానుకూలంగా స్పందించారు. పగటి వేళ సౌర విద్యుత్‌ను, రాత్రి సమయంలో బయోగ్యా్‌సతో ఉత్పత్తి అయ్యే కరెంటును వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. పాలేకర్‌ అవలంబిస్తున్న నీటి పరిరక్షణ విధానాలను ‘నీరు - ప్రగతి’ కార్యక్రమంలో చేర్చాలని సీఎం అదేశించారు. ఫైబర్‌ గ్రిడ్‌ సౌకర్యం అందుబాటులోకి రాగానే... రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారి సందేహాలు నివృత్తి చేయవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై సీఎంకు మంచి అవగాహన ఉందని పాలేకర్‌ ప్రశంసించారు.

100 ఎకరాలు ఇస్తాం

అమరావతిలో ప్రకృతి వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి

సుభాష్‌ పాలేకర్‌కు చంద్రబాబు ఆహ్వానం

సలహాదారుగా నియామకం

ఈనాడు - అమరావతి

14ap-main5a.jpg

అమరావతిలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే 100 ఎకరాల భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందుకు బాధ్యత తీసుకోవాలని ఆ రంగంలో నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ను ఆహ్వానించారు. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎంతో పాలేకర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. పాలేకర్‌, చంద్రబాబు మధ్య పలు అంశాలపై చర్చలు సాగాయి.

పేదల ఆర్థికాభివృధ్ధే ప్రభుత్వ లక్ష్యం

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారంతా మిగిలిన వారితో సమానంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమశాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఉచిత పథకాలు, రాయితీలే సరిపోవని, ప్రతి ఒక్కరూ నెలకు కనీసం రూ.10వేలు ఆర్జించేలా పేదలకు మార్గాలు చూపే ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాసాధికార సర్వే ఆధారంగా దళిత, గిరిజన ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసి వారందరికీ చేయూతనిచ్చేందుకు సూక్ష్మ, విస్తృత స్థాయి ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలల్లో ప్రవేశించే సమయంలోనే ఉపకార వేతనాల దరఖాస్తులు నమోదు చేసుకునేలా ఇటీవల ప్రారంభించిన జ్ఞానభూమి వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాపు, బ్రాహ్మణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలలో సారూప్యత తీసుకురావాలని చెప్పారు. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారి నైపుణ్యాన్ని గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాకే యూనిట్లు మంజూరు చేయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ బయెమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఇతర ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.

యాపిల్‌, స్ట్రాబెర్రీ మనమూ పండిద్దాం: పాలేకర్‌

ఉంగుటూరు, హనుమాన్‌ జంక్షన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కేవలం సంప్రదాయ పంటలే కాక యాపిల్‌, ద్రాక్ష, స్ట్రాబెర్రీ ఫలాలూ ఆంధ్రప్రదేశ్‌లో పండించగలమని, దానిని ప్రకృతి సాగు ద్వారా ఆచరణలో చూపుదామని ప్రకృతి వ్యవసాయ విధానకర్త, పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ పేర్కొన్నారు. బాస్మతి రకం బియ్యం సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేందుకు వీలుందని, కృష్ణాజిల్లా బాస్మతి సాగుకు కేంద్రంగా మారనుందని ఆయన చెప్పారు. పెట్టుబడి లేని ప్రకృతి సాగుపై కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో బుధవారం రైతులకు కార్యశాల నిర్వహించారు. సుభాష్‌ పాలేకర్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఏపీ మొత్తాన్ని ప్రకృతి సాగుకు నిలయంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆసక్తిగా ఉన్నారని, ఇది అమల్లోకి వస్తే పెట్టుబడి వ్యయం తగ్గి, గిట్టుబాటు ధర పెరుగుతుందని చెప్పారు. రసాయన ఎరువుల వాడకం లేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని, ప్రజలకు మేలు కలుగుతుందని వివరించారు. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో ప్రకృతి సాగుపై రైతులకు శిక్షణనిచ్చేందుకు కార్యశాల నిర్వహించే యోచనలో ఉన్నట్లు పాలేకర్‌ తెలిపారు. కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జలవనరుల మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీలు బీఎస్‌ రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సూచనలు

* ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి.

* ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి ఆదర్శంగా నిలవాలి.

* ఈ విధానం ద్వారా వచ్చే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ ఇచ్చి విక్రయించాలి.

* వీటికి రైతు బజార్లలో ప్రత్యేక మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి.

* ప్రతి గ్రామంలో బయోగ్యాస్‌ విద్యుత్తు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలి.

పాలేకర్‌ హామీలు

* ప్రకృతి వ్యవసాయ విస్తరణకు సహకరిస్తాం.

* దేశీయ విత్తనాలు, పశుసంతతి వృద్ధికి తోడ్పాటు అందిస్తాం.

* ప్రపంచంలో మేలుజాతులైన ఒంగోలు, పుంగనూరు ఆవుల పరిరక్షణపై దృష్టి పెడతాం.

Share this post

Link to post
Share on other sites

yela aina Zero budget forming forming chesevalla daaka velthe its good for them, in avoiding losses good for people that at least in some instances we can eat less chemical.. I wish this will happen sooner. I also downloaded subhash palekar videos from YOUTUBE will make CDs and send it my village.

Request other DB members to take the info, to villages as much as possible from our end

can u send one set of CDs for me?

Share this post

Link to post
Share on other sites

here is the youtube playlist with Telugu translation, by 2nd

posted/uploaded in channel "Anvesh Reddy Gurram", go to channel's "playlists" there you can find complete set of training videos

Share this post

Link to post
Share on other sites

As per Subhash palekar no need of extra mulch :) just go through the videos once.

just Desi Cow dung and urine is good enough instead of spending time on finding "wood chipper" spend time on exploring this videos.

you will get solution near to your house. ALL THE BEST :shakehands:  , if you can try and share info. to others with proof as your output it would be great.

lets be part in building healthy NATION.. healthy CULTURE with healthy CULTIVATION :) 

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

 • Recently Browsing   0 members

  No registered users viewing this page.

×