Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

నోటీస్‌ బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

ఏపీ సీఆర్‌డీఏ, విజయవాడ

 

* సంస్థ: ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీ సీఆర్‌డీఏ).
* పోస్టులు: టీమ్‌ లీడర్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర కాంట్రాక్టు పోస్టులు.
* ఖాళీలు: 10 వర్క్‌ లొకేషన్‌: విజయవాడ.
* అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ బీఈ/ బీటెక్‌, అనుభవం.
* ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 06.05.2018
వెబ్‌సైట్‌: https://crda.ap.gov.in/

బీఈఎంఎల్‌ లిమిటెడ్‌లో 140 బ్యాక్‌లాగ్‌ పోస్టులు

 

* సంస్థ: బీఈఎంఎల్‌ లిమిటెడ్‌ (భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌), బెంగళూరు.
* పోస్టులు: గ్రూప్‌ ఎ, బి, సి బ్యాక్‌లాగ్‌ (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ).
* ఖాళీలు: 140
* అర్హత, అనుభవం, వయసు: బీఈఎంఎల్‌ నిబంధనల ప్రకారం.
* ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
* దరఖాస్తు ఫీజు: రూ.500
* ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.04.2018 నుంచి 07.05.2018 వరకు.
* హార్డ్‌ కాపీలను పంపడానికి చివరితేది: 14.05.2018
వెబ్‌సైట్‌: http://www.bemlindia.in/

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌

 

* పోస్టు: స్పోర్ట్స్‌ కోటాలో ఎయిర్‌మెన్‌ (గ్రూప్‌ వై ట్రేడ్‌).
* అర్హత: 10+2 ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో జూనియర్‌/ సీనియర్‌ విభాగాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో పాల్గొని ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
* వయసు: 1997 జులై 1 నుంచి 2001 జూన్‌ 27 మధ్య జన్మించి ఉండాలి.
* ఎంపిక: సెలక్షన్‌ ట్రయల్స్‌ (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, స్పోర్ట్స్‌ స్కిల్‌ ట్రయల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా.
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
* చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (ఏప్రిల్‌ 21-27)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: http://indianairforce.nic.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి  

 

* పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తదితర టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (కాంట్రాక్టు).
* అర్హత, వయసు: స్కూలు నిబంధనల ప్రకారం.
* ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
* ఇంటర్వ్యూ తేది: 2018 ఏప్రిల్‌ 29, 30
* వేదిక: కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌:http://www.kvgachibowli.edu.in/

ప్రవేశాలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు  

 

* కోర్సు: ఇంటర్‌ మొదటి ఏడాది
* ప్రవేశాలు కల్పించనున్న కళాశాలలు: సాంఘిక/ గిరిజన సంక్షేమ గురుకులాలు
* గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యా కోర్సులు
* బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌
* అర్హత: తెలంగాణకు చెందిన 2018 పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
* ఎంపిక: గురుకుల్‌ జూనియర్‌ కాలేజ్‌ సెట్‌ ద్వారా.
* ప్రవేశపరీక్ష తేది: 28.05.2018
* దరఖాస్తు ఫీజు: రూ.100
* ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.04.2018 నుంచి 07.05.2018 వరకు.
వెబ్‌సైట్‌: http://tswreis.in/  

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.netచూడవచ్చు.

Link to comment
Share on other sites

  • 5 weeks later...
కొలువులే కొలువులు!
28-05-2018 04:06:59
 
  • తొమ్మిదిన్నర లక్షల మందికి ఉద్యోగాలు..
  • ప్రైవేట్‌లో 5.35 లక్షలు
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 9.5 లక్షల మందికి ఉద్యోగం లే దా స్వయం ఉపాధి కల్పించినట్లు మహానాడులో టీడీపీ తెలి పింది. ప్రైవేట్‌ రం గంలో 5.35 లక్షల మందికి, ప్రభుత్వ రంగంలో 4.25లక్షల మందికి ఉపాధి ల భించినట్లు వివరించిం ది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2.32లక్షల మంది, కాపు కార్పొరేషన్‌ ద్వారా 42వేల మంది, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా 11వేల మంది స్వయం ఉపాధి రుణాలు పొందినట్లు పేర్కొంది.
job.jpg 
Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 85 గ్రూప్‌-1 పోస్టులు
30-05-2018 00:49:26
 
  • డిప్యూటీ కలెక్టర్ల విభజనతో తేలిన లెక్క
  • సర్కారుకు నివేదించనున్న రెవెన్యూ
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త. కొత్తగా 81 గ్రూప్‌-1(డిప్యూటీ కలెక్టర్‌) పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఏపీలో 51, తెలంగాణలో 34 ఖాళీలు ఉన్నట్లు తేలింది. డిప్యూటీ కలెక్టర్‌ల విభజన సందర్భంగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌(ఎస్ ఆర్‌సీ)కి ఇచ్చిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగ ఖాళీలను రెండు రాష్ట్రాలు విడివిడిగానే నోటిఫై చేయాల్సి ఉంది. ఆ తర్వాతే వాటి భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది.
 
 
ఈ ప్రక్రియ ముందుకు సాగాలంటే ఏపీ రెవెన్యూశాఖ ఆ ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసేలా సర్కారుకు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర విభ జన అనంతరం డిప్యూటీ కలెక్టర్లను రెండు రాష్ట్రాలకు కేటాయించే సమయంలో సీనియారిటీ సమస్యలు తలెత్తాయి. ప్రమోటీ, డైరెక్ట్‌ రిక్రూటీ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీలో తేడాలు వచ్చాయి. సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసే పీడీసీ పోస్టుల్లోనూ పదోన్నతి అధికారులను ఉంచడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. చివరకు అశుతోష్ మిశ్రా కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసి 1993-94 నుంచి 2013-14 వరకు డిప్యూటీ కలెక్టర్‌ల సీనియారిటీ తేల్చింది.
 
 
స్పెషల్‌ గ్రేడ్‌తోపాటు డిప్యూటీ కలెక్టర్ల కేటగిరీలో మొత్తం 536 మంది పనిచేస్తున్నారని గుర్తించింది. వీరిలో 83 స్పెషల్‌గ్రేడ్‌, 266 డిప్యూటీ కలెక్టర్‌ల వాస్తవిక సంఖ్య అని తేల్చారు. అయితే ఈ గణాంకాలు మరింత గందరగోళానికి దారితీశాయి. చివరకు సీనియారిటీ తేల్చి ఎవరి పోస్టు ఏమిటో గుర్తించారు. దీనిపై ఇంకా కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. అయితే, కేడర్‌ విభజన సందర్భంగా.. సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ అయిన, భర్తీ కావాల్సిన పోస్టుల వివరాలను విభజన కమిషన్‌కు పంపిన నివేదికలో రెవెన్యూశాఖ పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణలో 89 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 4 పోస్టులను సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయించారు.
 
 
ఇక 85 స్పష్టమైన ఖాళీలు ఉన్నాయని రెవెన్యూశాఖ తేల్చింది. ఇందులో ఏపీకి 51, తెలంగాణలో 34 ఉన్నాయి. ఈ సంఖ్యపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని రెవెన్యూశాఖ తెలిపింది. గత ఏడాది నవంబరులో విభజన కమిషన్‌కు రెవెన్యూశాఖ ఈ నివేదిక ఇచ్చింది. ఐదు నెలలు గడుస్తున్నా రెవెన్యూశాఖ ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. నిజానికి ఏపీ, తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల కొరత తీవ్రంగానే ఉంది. ఇటీవలే రెండు రాష్ట్రాల్లో 18 మంది స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌లు ఐఏఎస్‌ పదోన్నతులు పొందారు. త్వరలో మరో 16 మంది పేర్లను ఐఏఎస్‌ జాబితాకు పంపించనున్నారు.
 
 
దీంతో స్పెషల్‌గ్రేడ్‌ కోటాలో చాలా ఖాళీలు ఏర్పడనున్నాయి. వీటిని భర్తీచేసేందుకు డిప్యూటీ కలెక్టర్‌లకు స్పెషల్‌గ్రేడ్‌ పదోన్నతులు ఇవ్వాల్సిందే. ఇదే జరిగితే డిప్యూటీ కలెక్టర్‌ల కేటగిరీలోనూ ఖాళీలు ఏర్పడతాయి. ఇందులో పదోన్నతులతో భర్తీచేసే వాటితోపాటు సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీచేసే కొత్త పోస్టులు ఉండనున్నాయి. అంటే, ఇప్పుడున్న 85కు మరికొన్ని అదనంగా తోడుకానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా ఏర్పడే పోస్టులు ఎన్ని ఉన్నా.. వాటిని సర్కారుకు నివేదించడంలో రెవెన్యూశాఖ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు నివేదించలేదని తెలిసింది.
 
 
దీంతో ఉద్యోగ ఖాళీలు కాగితాలకే పరిమితమయ్యాయి. అవి పోస్టులుగా నోటిఫై చేయాలంటూ రెవెన్యూశాఖ నుంచే కసరత్తు మొదలవ్వాలి. రెవెన్యూలో 85 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెవెన్యూశాఖ సర్కారుకు ప్రతిపాదించాలి. దాని ఆధారంగా ప్రభుత్వం ఆ పోస్టులను నోటిఫై చేస్తుంది. అనంతరం వాటిని భర్తీచేసే బాధ్యతను రెండు రాష్ట్రాల్లో సర్వీస్‌ కమిషన్‌కు అప్పగిస్తారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే సర్వీస్‌ కమిషన్‌లు ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
23 వేల ప్రభుత్వ కొలువులు
22-06-2018 02:39:10
 
636652319651416680.jpg
  • టీచర్లు 10 వేలు.. పోలీసులు 10 వేలు.. హాస్టళ్లలో 3 వేలు
  • త్వరలోనే అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం
  • నిరుద్యోగ భృతీ సత్వరమే చెల్లిస్తాం
  • 3.55 లక్షల మందికి ఇళ్లపట్టాలు
  • అన్న క్యాంటీన్లు వస్తున్నాయి
  • డ్వాక్రా సంఘాలు మానస పుత్రికలు
  • మరో రూ.2 వేల ఆర్థిక సాయం
  • ఎస్టీలకు ఇబ్బంది లేకుండా
  • జాబితాలో మత్స్యకారులకు చోటు
  • వడ్డెర, రజకులను ఎస్సీల్లో చేరుస్తాం
  • భూ అక్రమాల నిరోధానికి భూధార్‌
  • పనితీరు చూసి ఓటు వేయండి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
  • విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ
విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. త్వరలో పది వేల టీచరు పోస్టులు, మరో పది వేల పోలీసు ఉద్యోగాలు, సంక్షేమ వసతి గృహాల్లో మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగింది. సీఎం ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని అతిత్వరలో చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే భోగాపురం విమానాశ్రయం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ‘పిల్లల చదువుల కోసం రూ.23 వేల కోట్లు
ఖర్చు చేస్తున్నాం. విదేశీ విద్యకు ఒక్కొక్కరికి రూ.10 నుంచి 15 లక్షలు ఇస్తున్నాం. ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కింద రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలు అదిఇస్తున్నాం. అది సరిపోకపోతే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి అవసరమైనంత ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు. 4.6 లక్షల మందిని వాటిలో చేర్చుకున్నాం. వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశాం. ఇంకో రూ.2 వేలు అందిస్తాం. త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మూడు పూటలా అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందిస్తాం. విద్యార్థులకు డైట్‌ చార్జీలు పెంచాం. వీఆర్‌వోలు, అంగన్‌వాడీలు, హోంగార్డులకు కూడా జీతాలు పెంచాం’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే...
 
2.5 లక్షల బీసీలకు 750 కోట్ల రుణం
‘బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను ఆ జాబితాలో చేర్చినట్లే.. ఎస్టీలకు సమస్య రాకుండా మత్స్యకారులను ఆ జాబితాలో పెడతాం. వడ్డెర, రజకులను ఎస్సీల్లో చేరుస్తాం. పేదలందరికీ న్యాయం చేయాలదే నా లక్ష్యం. మైనార్టీలు, ఎస్సీలు, బీసీల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 1100 నంబరు ద్వారా ప్రజలకు ఫోన్‌ చేసి అన్నింటిపైనా ఆరా తీస్తున్నాం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. రోజుకు 15 లక్షల మందికి ఫోన్లు చేసి, పాలనపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే మా లక్ష్యం. మనుషులకు ఆధార్‌లాగే భూములకు 11 అంకెలతో భూధార్‌ పెట్టాం. వేలిముద్ర వేస్తే తప్ప భూమి రిజిస్ట్రేషన్‌ జరగదు. దీనివల్ల భూముల మోసాలు తగ్గుముఖం పడతాయి’ అన్నారు.
 
10,600 కోట్ల భూములపై హక్కులు
‘విశాఖలో ఇప్పటికి మొత్తం మూడు విడతల్లో 60,695 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రూ.10,600 కోట్ల విలువైన భూములపై హక్కులు కల్పించాం. ఈ భూముల్లో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్నా, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలన్నా, ఇంకేమైనా చేసుకోవాలనుకున్నా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా త్వరలోనే అధికారులకు ఆదేశాలిస్తాం. కొత్తగా ఇచ్చిన పట్టాలకే కాకుండా గతంలో ఇచ్చిన పట్టాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. పట్టా కోసం ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముందు పడిగాపులు IMG_4254.jpgకాసే అవసరం లేకుండా గౌరవప్రదంగా అందరినీ కుటుంబ సమేతంగా తీసుకొచ్చి.. పసుపు, కుంకుమలు ఇచ్చి మరీ పట్టాలు ఇస్తున్నాం. శుక్రవారం నుంచే లబ్ధిదారులు అందరికీ ఫోన్లు చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటా. ఎక్కడైనా అవకతవకలు జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ 37 వేల మందికి 79 వేల ఎకరాలకు పట్టాలిచ్చాం. అదనంగా మరో 13 వేల మందికి 90 వేల ఎకరాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలో 3.55 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం’ అన్నారు. అమరావతి తరహాలో ట్రై జంక్షన్‌లో 1,600 ఎకరాలకు భూసమీకరణ జరుగుతుందని, అందులో పేదలకు గృహాలు నిర్మిస్తామన్నారు. కొందరు కావాలనే భూవ్యవహారాలపై ఆరోపణలు చేస్తున్నారన్న సీఎం... ‘తప్పు జరగనివ్వను. మొదటి నుంచి చివరి వరకు అన్నీ నేనే పర్యవేక్షిస్తా. జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీలకు త్వరలో 1.14 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తాం’ అన్నారు. ఏ సిటీ పోటీకి రాలేని విధంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
 
అనుభవం లేదు.. అవినీతిపరులు
‘ఎన్నికలు వస్తే పనితీరును బేరీజు వేసుకుని ఓట్లు వేయండి. మంచి చేసే వారికి అండగా నిలబడండి. ప్రజల కోసం పనిచేసేవారిని గౌరవించండి. ఎటువంటి అనుభవం లేనివారు, అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయినవారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్‌డీఏతో కలిశాం. ప్రత్యేక హోదా ఇవ్వరని తెలిశాక బయటకు వచ్చాం’ అన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
20 వేల కొలువులు
27-07-2018 02:12:03
 
  • ఒకేసారి ప్రభుత్వ ప్రకటన!
  • 10,351 టీచర్లు.. కొత్తగా 3 వేల పోలీసు పోస్టులు
  • ఆరోగ్యంలో 2 వేలు, 1500 పంచాయతీ సెక్రటరీలు
  • ఆర్థిక శాఖ తుది ప్రతిపాదనలు.. 2నాటి కేబినెట్‌లో ఓకే
అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఒకేసారి ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీనే 10,351 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తుందనిఅంతా భావించారు. కానీ, ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో ఆ నోటిఫికేషన్‌ అనుకున్న సమయానికి రాలేదు. ఆ టీచర్‌ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని ఖాళీలను ఒకేసారి భారీస్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే గుర్తించిన 10వేల టీచర్‌పోస్టులు కాకుండా... వివిధ శాఖల్లో మరో పదివేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీసు శాఖ నుంచి 4 వేల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్‌ పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ 1600 పోస్టుల భర్తీకి ప్రతిపాదన పంపింది. వీటన్నింటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే... ఇదే తరహాకు చెందిన మరో 400 పోస్టులను కలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2000 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని భావిస్తోంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఆ శాఖకు అవసరమైనన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ తెలిపేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. పంచాయతీ రాజ్‌శాఖ నుంచి 1500 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం పదివేల ఆదాయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటన్నింటిని సక్రమంగా నిర్వహించేందుకు తగిన అధికార యంరత్రాంగం ఉండాలనే యోచనతో... పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.
 
అటవీ శాఖకు సంబంధించి దాదాపు 500 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశముంది. అలాగే, 1447 మున్సిపల్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు తెలిసింది. ఇవి కాకుండా, వాణిజ్య పన్నులు, దేవదాయం, విద్యుత్‌, వ్యవసాయ శాఖల్లో కూడా పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ శాఖల్లో పోస్టుల భర్తీ భారీ సంఖ్యలో ఉండబోదని తెలుస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, వాటి భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ ఇప్పటికే ఆసల్యమైందని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే కేబినెట్‌లో ఈ ప్రతిపాదనలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు నియామకాలపై భారీస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఈసారి అన్నిపోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...