Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

త్వరలో ఫైర్‌మెన్, డ్రైవర్ల ఉద్యోగాల భర్తీ : ఫైర్ డీజీ
10-05-2017 14:34:40
విజయవాడ: త్వరలో ఫైర్‌మెన్, డ్రైవర్ల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, నిబంధనలు పాటించని భవనాల యజమానులపై కేసుల నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫైర్‌ సేఫ్టీ పాటించని 67 మందికి నోటీసులు జారీ చేశామని, ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు తగ్గాయని డీజీ తెలిపారు. అగ్నిమాపక శాఖలో అత్యాధునిక పరికరాలను ప్రవేశపెడుతున్నామని కూడా సత్యనారాయణ చెప్పారు.
Link to comment
Share on other sites

గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ ఫలితాలు విడుదల
13-05-2017 06:22:56
636302534480398570.jpg
అమరావతి: గ్రూప్‌-3(పంచాయతీ కార్యదర్శి) స్ర్కీనింగ్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1055 పోస్టులకు గాను మొత్తం 52,750 మంది అభ్యర్థులకు మెయిన్స్‌కు అర్హత కల్పించారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో కటాప్‌ మార్కులను జిల్లాల వారీగా నిర్ణయించారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో ఫలితాలను ఉంచినట్లు కార్యదర్శి వై.వి.ఎ్‌స.టి.శాయి తెలిపారు. గత నెల 23న నిర్వహించిన పరీక్షకు 5,66,215 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,67,341 మంది మాత్రమే హాజరయ్యారు. స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 6న మెయిన్స్‌ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్‌-3 మెయిన్స్‌ రాసేందుకు హైదరాబాద్‌లోనూ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే హైదరాబాద్‌లో పరీక్ష రాయదలచుకున్న అభ్యర్థులు రీఆప్షన్‌ ఇచ్చుకోవాలని పేర్కొంది.
 
 
జూన్‌ 6, 7, 8 తేదీల్లో డిగ్రీ లెక్చరర్స్‌ రాత పరీక్షలు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం జూన్‌ 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గతంలో జూన్‌ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు అర్హత కలిగి ఉండటంతో 8న కూడా పరీక్ష నిర్వహించనున్నారు.
 
 
‘సర్వేయర్స్‌’ రాత పరీక్ష ఫలితాల విడుదల
అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, సర్వేయర్స్‌, డిప్యూటీ సర్వేయర్స్‌ రాత పరీక్ష మార్కులను శుక్రవారం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 22,978 మంది అభ్యర్థులకు సబెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెబ్‌సైట్లో ఉంచింది.
 
 
group.jpg
Link to comment
Share on other sites

కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల
 
636302377701604167.jpg
  • 5,128 మంది ఎంపిక
  • నిరుద్యోగ భృతిపై త్వరలో సీఎం ప్రకటన
అమరావతి, రాజమహేంద్రవరం, మే 12 (ఆంధ్ర‌జ్యోతి): కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో పోలీసు అధికారుల సమక్షంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవా రం వీటిని విడుదల చేశారు. మొత్తం 5,348 పోస్టులకు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ఈ పరీక్షలో 5128 మంది ఎంపికయ్యారు. బీసీ-సీ, ఈ విభాగాల్లో రిజర్వేష న్‌ అభ్యర్థులు లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ కాలేదు. మొత్తం 265 జైలు వార్డర్‌ పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. ఎంపికైన వారిలో 1340 మంది మహిళలు ఉన్నారు. వీరిలో సివిల్‌ విభాగంలో 1157 మంది అర్హత సాధించగా... మిగిలిన వారు ఏఆర్‌కు ఎంపికయ్యారు.
 
మొత్తంగా చూస్తే... ఫైనల్‌ పరీక్ష రాసిన వారు 72,044 మంది కాగా, వారిలో 63,407 మంది సివిల్‌ విభాగంలో, 46,156 మంది ఏఆర్‌కు మెరిట్‌ లిస్టులో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, ఎంపికైన వారికి త్వరలోనే శిక్షణ ఇస్తామని చినరాజప్ప చెప్పారు. పీజీలు, ఎంటెక్‌, బీటెక్‌ వంటి విద్యనభ్యసించిన వారు రావడం సంతోషకరమని, వీరంతా మెరికల్లాగా ఏపీలో శాంతిభద్రతలు కాపాడడంలో భాగస్వాములవుతారని అన్నారు. ఈ నియామకాలు పారదర్శకంగా చేపట్టినందుకు ఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ అతుల్‌ సింగ్‌ ను అభినందించారు. ఇంకా డ్రైవర్‌ పోస్టులు 136, మెకానిక్‌ పోస్టులు 25 పోస్టులు పెండింగ్‌ ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతిపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారని చినరాజప్ప తెలిపారు.
 
పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేయడానికి కమ్యూనిటీ పోలీసులను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే నెల్లూరులో ఏర్పాటు చేశామని, త్వరలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్నామన్నారు. వాళ్లకు ఒక యూనిఫామ్‌ ఉంటుందని, పోలీసుల్లానే వారికి అధికారాలు ఉంటాయని, కానీ జీతాలు ఉండవని, భవిష్యత్తులో జరిగే పోలీస్‌ రిక్రూట్‌మెంట్లలో వీరికి ప్రాధాన్యం ఉం టుందని తెలిపారు. అతుల్‌సింగ్‌ మాట్లాడుతూ... ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 9441450639 నెంబరుకు కాల్‌ చేయొచ్చుని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, పెందుర్తి వెంకటేష్‌, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఎస్పీ బి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కానిస్టేబుల్‌ ఫలితాల విడుదల

12ap-state4a.jpg

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. మొదటి దశలో సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఎంపికైన వారి నుంచి ఉభయగోదావరి జిల్లాలకు 800 కానిస్టేబుల్‌ పోస్టులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వివరాలు కావాలంటే 94414 50639 నెంబరుకు ఫోన్‌ చేయొచ్చన్నారు.

సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో మిగిలిపోయిన 220 ఖాళీలు

అమరావతి: సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో మొత్తం 5,348 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా 5,128 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 220 పోస్టులకు సంబంధించి రిజర్వేషన్‌ ప్రకారం అర్హులైన అభ్యర్థులు లభించలేదు. వీటిల్లో అత్యధిక శాతం బీసీ-సీ, బీసీ-ఈ విభాగాలకు కేటాయించినవే. చాలా జిల్లాల్లో ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు లేకపోవడం, ఉన్న చోట కూడా వారికి కేటాయించిన పోస్టులకు తగినంత మంది అర్హులు లేకపోవడంతో అవి మిగిలిపోయాయి. సివిల్‌ కానిస్టేబుల్‌ విభాగంలో 124 పోస్టులు, ఏఆర్‌ విభాగంలో 96 పోస్టులు మిగిలిపోయాయి. సివిల్‌ కానిస్టేబుల్‌ ఒక్కో పోస్టుకు 16 మంది చొప్పున, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఒక్కో పోస్టుకు 36 మంది తలపడ్డారు.

* జైలు వార్డరు 265 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా అన్నీ భర్తీ అయ్యాయి.

* సివిల్‌ విభాగంలో మొత్తం 1,287 మంది మహిళలు ఎంపిక కావాల్సి ఉండగా...1150 మందే లభించడంతో మిగిలిన పోస్టులను పురుషులతో భర్తీ చేశారు. ఏఆర్‌ విభాగంలో 253 మంది మహిళ అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉండగా..190 మందే ఎంపికయ్యారు.

* ఇటీవల విడుదల చేసిన ఎస్సై ఫలితాల్లో ఆ ఉద్యోగాలకు ఎంపికైన 402 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. వారి నుంచి సమ్మతి పత్రం తీసుకుని వారి పేర్లను కానిస్టేబుల్‌ ప్రతిభావంతుల జాబితా నుంచి తొలగించారు.

అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు

* జైలు వార్డరు ఉద్యోగాలకు క్రీడా కోటాను పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

* ఏఆర్‌ విభాగం పోస్టులకు సంబంధించి తాజాగా ప్రకటించిన మార్కులు తగ్గినట్లు చూపించారంటున్నా

Link to comment
Share on other sites

తగ్గిన గ్రూపు-3 కటాఫ్‌

ఈనాడు, అమరావతి: పంచాయతీ కార్యదర్శి (గ్రూపు-3) ప్రాథమిక పరీక్షలో రుణాత్మక మార్కుల విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అమలుచేసింది. ఒక్కో ఉద్యోగానికి 50 మంది అభ్యర్థులను జిల్లాలవారీగా ఎంపిక చేయగా ప్రకాశం జిల్లాలో కటాఫ్‌ గరిష్ఠంగా 51.67, చిత్తూరు జిల్లాలో కటాఫ్‌ కనిష్ఠంగా 32.21 నమోదైంది. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రకటించిన ఉద్యోగాల భర్తీ సంఖ్యను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 52,750 మందిని ప్రధాన పరీక్షకు ఎంపికచేశారు. కటాఫ్‌ కింద నిర్ధరించిన మార్కు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినట్లయితే వయస్సులో పెద్దవారిని ఎంపిక చేశామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి తెలిపారు. అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారా? లేదా? అన్న విషయాన్ని అభ్యర్థుల చరవాణి నెంబర్లు, ఈమెయిల్‌కు తెలియజేస్తున్నామన్నారు. ఎంపికైన వారికి ప్రధాన పరీక్ష ఆగస్టు 6న జరుగుతుందని ప్రకటించారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆప్షన్ల నమోదులో మార్పునకు అవకాశాన్ని కల్పించామని తెలిపారు.

12ap-state12a.jpg

అధ్యాపకుల పోస్టులకు పరీక్షలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీకి జూన్‌ 6,7,8 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే రెండు, మూడు సబ్జెక్టుల పోస్టులకు పరీక్ష రాయాల్సి రావడంతో మార్పులు జరిగాయి. వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Link to comment
Share on other sites

విద్యుత్‌ ఉద్యోగ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ సూపర్‌వైజర్‌లు, వైర్‌మెన్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి షెడ్యూల్‌ ప్రకటించింది. విద్యుత్‌ సూపర్‌వైజర్‌ల పరీక్ష జూన్‌ 28వ తేదీన జరుగుతుంది. వైర్‌మెన్‌ పరీక్ష తేదీలను సంబంధిత పరీక్షా కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు నిర్ణయిస్తారని పేర్కొంది. సూపర్‌వైజర్‌ల పరీక్షకు రూ.1,500, వైర్‌మెన్‌ పరీక్షకు రూ.వెయ్యి చొప్పున రుసుం చెల్లించాలి. ఈ నెల 17 నుంచి అందుబాటులో ఉండే ఆయా దరఖాస్తులను జూన్‌ 12వ తేదీ వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు, దరఖాస్తులకు http://sbtetap.gov.in వెబ్‌సైట్‌, అయా పాలిటెక్నిక్‌ కళాశాలలను సంప్రదించవచ్చని సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి నిర్మల్‌ కుమార్‌ ప్రియ తెలిపారు.

Link to comment
Share on other sites

స్టీల్‌ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు


636306042893592261.jpg



ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), మే 16: మేనేజ్‌మెంట్‌ ట్రైనీల కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 223 పోస్టుల (మెటలర్జీ 82, మెకానికల్‌ 68, ఎలక్ట్రికల్‌ 50, కెమికల్‌ 8, సివిల్‌ 10, సిరామిక్స్‌ 3, మైనింగ్‌ 2) భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటితోపాటు మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-3, జూనియర్ మెడికల్ ఆఫీసర్-7 పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టును అనుసరించి అర్హతలు ఉంటాయి.

 

మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్): మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, సిరామిక్స్, మైనింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ను పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులుంటే అర్హులు. అభ్యర్థి వయసు 01.05.2017 తేదీ నాటికి 27ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రిజర్వేషన్ల వారీగా మినహాయింపు ఉంటుంది.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 60 శాతం మార్కులతో బీటెక్ పాసయి ఉండాలి. ఐసీఏఐ లేదా ఐసీడబ్యూఏఐ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి వయసు 01.05.2017 తేదీ నాటికి 27ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రిజర్వేషన్ల వారీగా మినహాయింపు ఉంటుంది.

జూనియర్ మెడికల్ ఆఫీసర్స్: ఏదైనా యూనివర్శిటీ గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తయి ఉండాలి. అభ్యర్థి వయసు 01.05.2017 తేదీ నాటికి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు రిజర్వేషన్ల వారీగా మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.05.2017

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2017

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్ డేట్: 15.06.2017 to 25.06.2017

పరీక్ష తేదీ: 25.06.2017, 10:00 AM to 12:30 PM

ఆన్సర్ కీ రిలీజ్ డేట్: 25.06.2017 (after 5:00 PM)

 

రాత పరీక్ష ఫలితాల విడుదల తేదీ: 10.07.2017

 

ఇంటర్వ్యూలు: 25.07.2017 నుంచి మొదలవుతాయి.

మరిన్ని వివరాలకు www.vizagsteel.com ను చూడొచ్చు.



Link to comment
Share on other sites

ఏఈ ఉద్యోగాల అర్హుల్లోనూ ఏఈఈలు

అభ్యర్థుల ప్రాధాన్యాలు తెలుసుకుంటున్న ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: బీటెక్‌ సివిల్‌ అభ్యర్థుల్లో వంద నుంచి 150 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (పర్యావరణం.. ఎన్విరాన్‌మెంట్‌) పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తగిన జాగ్రత్తలను తీసుకుంటోంది. ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారిలో 150 మంది ఏఈ పోస్టులకు ఎంపికయ్యారు. ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారు కూడా వీరిలో 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు డిప్యూటీ సర్వేయర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌, అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌ ఉద్యోగాలఎంపికలో ముందు వరుసలో ఉన్నారు. ఒకే అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నందున ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ఇతర ఉద్యోగాలకు ఎంపికై ఉంటే వారి ప్రాధాన్యాన్ని ఏపీపీఎస్సీ తెలుసుకుంటోంది. ఎంపికైన వారు ఏఈఈ ఉద్యోగాల్లో చేరినట్లు నిర్థరించుకున్నాకే ఇతర పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. దీనివల్ల కింది వరుసలో ఉన్న వారు నష్టపోకుండా ఉద్యోగాలను పొందేందుకు అవకాశంఉంటుందని ఏపీపీఎస్సీఅధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

మారిన గ్రూపు-3 కటాఫ్‌

ఈనాడు, అమరావతి: గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) స్క్రీనింగ్‌ టెస్టు కటాఫ్‌ మార్కులు మారాయి. ఈనెల 12న జారీ చేసిన జాబితా స్థానంలో ఏపీపీఎస్సీ మరో కటాఫ్‌ జాబితాను జిల్లాలవారీగా విడుదల చేసింది. పరీక్ష రాసిన జిల్లాను అనుసరించి ఫలితాలను వెల్లడించడంలో పొరపాట్లను సరిదిద్ది కొత్త జాబితాను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి తెలిపారు. దీనివల్ల తొలుత ప్రధాన పరీక్షకు ఎంపిక కాకుండా ఉన్న సుమారు 1700 మంది అభ్యర్థులు ముందుకొచ్చారు. ఇదే సంఖ్యలో అభ్యర్థులు ప్రధాన పరీక్ష రాసే అర్హతను కోల్పోయారు. 1055 పోస్టుల భర్తీకిగాను స్క్రీనింగ్‌ టెస్టు నుంచి ప్రధాన పరీక్షకు 52,750 మందిని ఎంపికచేశారు. ఈ సంఖ్యలో తేడా లేదు. జిల్లాలవారీగా పరిశీలించినప్పుడు నాలుగు చోట్ల కటాఫ్‌ తగ్గగా ఎనిమిది చోట్ల పెరిగింది. గ్రూపు-3 జిల్లా పోస్టు అయినందున 80 శాతం ఉద్యోగాలు స్థానికులు, 20% ఉద్యోగాలను స్థానికేతరులకు కేటాయిస్తారు. దీనివల్ల అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఎంచుకున్న జిల్లాను అనుసరించి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఈ సమయంలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ (డేటా మ్యాపింగ్‌) చేసేటప్పుడు పొరపాట్లు దొర్లాయి. పరీక్ష రాసిన జిల్లాను అనుసరించి కాకుండా అభ్యర్థులు పేర్కొన్న స్థానికత ఆధారంగా ఫలితాలను వెల్లడించారు. దీనిపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. విన్నపాలను పరిశీలించి ఏపీపీఎస్సీ కొత్త జాబితాను వెల్లడించింది. స్క్రీనింగ్‌ టెస్టు రాసిన వారందరికీ మార్కుల వివరాలను వారి చరవాణులకు సంక్షిప్త సమాచారంతో పాటు ఈమెయిల్స్‌లో పంపామని కార్యదర్శి చెప్పారు. ప్రధాన పరీక్ష ఆగస్టు 6న జరగనుంది.

Link to comment
Share on other sites

ఏపీ గ్రూప్-1 స్క్రీనింగ్ ఫలితాలు విడుదల..
27-05-2017 19:15:06
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్-1 స్క్రీనింగ్ ఫలితాలను పెట్టారు. 79 పోస్టులకు గానూ 3900 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఆగస్టులో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

గ్రూప్‌-1 స్ర్కీనింగ్‌ ఫలితాల విడుదల
 
 
  • 79 పోస్టులకు 3900 మంది ఎంపిక
  • ఆగస్టు 17 నుంచి 27 వరకు మెయిన్స్
హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 స్ర్కీనింగ్‌ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ www.psc.ap.gov.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు, అభ్యర్థుల మార్కుల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి తెలిపారు. మొత్తం 79 పోస్టుల కోసం 3900 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఈ నెల 7వ తేదీన జరిగిన స్ర్కీనింగ్‌ పరీక్షకు 93,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. 54,956 మంది పరీక్షకు హాజరయ్యారు. మెయిన్స్‌ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 27 తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.
Link to comment
Share on other sites

ఆగస్టులో ఆంధ్రాకు ఏపీపీఎస్సీ
28-05-2017 02:00:45
 
636315337579244554.jpg
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఆగస్టులో నవ్యాంధ్రకు తరలిరానుంది. విజయవాడలోని బందర్‌ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న రోడ్లు భవనాల శాఖ భవనంలో ఏపీపీఎస్సీ కొలువు తీరనుంది. మరో రెండు నెలల్లో పూర్తి కానున్న ఈ ఐదంతస్థుల భవనంలోని మొదటి అంతస్థును ఏపీపీఎస్సీకి కేటాయించారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లోర్‌ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఏపీపీఎస్సీ తరలింపు ఖాయమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఉమ్మడి రాజధాని నుంచి సెక్రెటేరియెట్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు నవ్యాంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ తరలింపులో అనిశ్చితి కొనసాగుతూ వచ్చింది. తొలుత విజయవాడ అని.. తర్వాత గుంటూరుకు అని రకరకాల ప్రతిపాదనలు కమిషన్‌ ముంగిటకు వచ్చాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రైవేట్‌ భవనంలోకి లీజు ప్రాతిపదికన తరలించేందుకు ఏపీపీఎస్సీ అన్వేషణ ప్రారంభించింది. చివరికి గుంటూరు బస్‌స్టేషన్‌కు సమీపంలోని ఓ ప్రైవేట్‌ భవనంలోకి లీజుపై తరలింపునకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్రిసభ్య కమిటీ కూడా సదరు బిల్డింగ్‌కు ఆమోదం తెలిపింది. సరిగ్గా అగ్రిమెంట్‌ చేసుకునే సమయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పి.ఉదయ భాస్కర్‌ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో నిర్ణయం మారింది. ఏపీపీఎస్సీ వంటి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఓ ప్రైవేట్‌ భవనంలో కొనసాగించడం సరికాదన్న ముఖ్యమంత్రి విజయవాడలోని ఆర్‌అండ్‌బి కొత్తగా నిర్మిస్తున్న భవనంలోకి తరలించేందుకు ఇబ్బంది లేదని చెప్పడంతో సందిగ్దత తొలగిపోయినట్లయ్యింది. ఏపీపీఎస్సీలో 130 మంది రెగ్యులర్‌, 50 మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కార్యాలయాన్ని తరలిస్తే.. తమ పిల్లల అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

పోలీసు మెకానిక్‌, డ్రైవర్‌ తుది ఫలితాలు విడుదల

ఒక్కో డ్రైవర్‌ పోస్టుకు 40 మంది...

మెకానిక్‌ పోస్టుకు 33 మంది పోటీ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు మెకానిక్‌, డ్రైవర్‌ (కానిస్టేబుల్‌ స్థాయి) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను పోలీసు నియామక మండలి బుధవారం ప్రకటించింది. డ్రైవర్‌ పోస్టులకు 134 మంది, మెకానిక్‌ పోస్టులకు 25 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ వివరాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ ఒక ప్రకటనలోతెలిపారు.134 డ్రైవర్‌పోస్టులకు గాను మొత్తం 5,472 మంది అర్హత సాధించగా..25 మెకానిక్‌ పోస్టులకు గాను 842 మంది అర్హత సాధించారు. వారిలో నుంచి అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక జాబితాను సిద్ధం చేశారు. ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారి ప్రకారం ఒక్కో డ్రైవర్‌ పోస్టుకు 40మంది వరకూ అభ్యర్థులు పోటీపడగా...మెకానిక్‌ పోస్టు ఒక్కో దానికి 33 మంది అభ్యర్థులు

Link to comment
Share on other sites

కొలువుకు వేళాయె!
 
 
636320539947089769.jpg
  • జూలై-ఆగస్టు నెలల్లో 40 కొత్త నోటిఫికేషన్లు
  • గ్రూప్‌-1, 2, 3 తో పాటు ఈసారి గ్రూప్‌-4కి కూడా
  • ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చిన 15 రోజుల్లో విడుదల
  • వార్షిక క్యాలెండర్‌ అమలు దిశగా ఏపీపీఎస్సీ
అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ల విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) కసరత్తు ప్రారంభించింది. 2017-18 వార్షిక క్యాలెండర్‌ అమల్లో భాగంగా జూలై-ఆగస్టు నెలల్లో 40 కొత్త నోటిఫికేషన్లు జారీచేయాలని భావిస్తోంది. ప్రధానమైన గ్రూప్‌-1, 2, 3 తో పాటు ఈ సారి గ్రూప్‌-4 సర్వీసు పోస్టులను కూడా భర్తీ చేయబోతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, రోస్టర్‌ పాయింట్లతో ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చిన 15 రోజుల్లో ఆయా ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెబుతోంది. ఖాళీ పోస్టులకు సంబంధించిన ఇండెంట్‌ను పంపించాల్సిందిగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాలకు కమిషన్‌ లేఖలు రాసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. క్యాలెండర్‌ ఇయర్‌ అమలు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి సత్వర అనుమతులు అవసరమని తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన సీఎస్‌.. అన్ని విభాగాలనూ అప్రమత్తం చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. 2016-17లో కమిషన్‌ మొత్తం 4,275 పోస్టుల భర్తీ కోసం 32 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి సంబంధించి ఇప్పటికే స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. కొన్నింటికి మెయిన్స్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా చేపట్టింది. తక్కువ పోస్టులు ఉన్న కొన్ని మైనర్‌ నోటిఫికేషన్లకు సంబంధించి తుది ఫలితాలూ విడుదల చేసింది. మరో  పది రోజుల్లో 746 ఏఈ పోస్టుల భర్తీకి సన్నద్దమవుతోంది. పాత ప్రకటనలకు సంబంధించి ఈ నెలాఖరు కల్లా దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్‌-1, 2, 3 తదితర పోస్టులకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పలు సంస్కరణలకు కూడా శ్రీకారం చుడుతోంది. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (సీఈవో) నియామకం, ముగ్గురు అకడమిక్‌ అడ్వయిజర్ల నియామకం, ఐఅ, రీసెర్చ్‌ విభాగాల ఏర్పాటుతో కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించాలని ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Link to comment
Share on other sites

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్ల రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్ల (టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్‌) భర్తీ కోసం మే 14న ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను వెల్లడించినట్లు బార్కాస్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌సెంటర్‌ డిప్యూటీ కమాండెంట్‌ వివేకానంద్‌ సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ వెబ్‌సైట్లో ఫలితాలను వీక్షించవచ్చన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 నుంచి 16 వరకు ట్రేడ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షలు బార్కాస్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే తమ అడ్మిట్‌ కార్డులతో హాజరు కావాలని ఆయన సూచించారు.

 
Link to comment
Share on other sites

స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
 

 
విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారంలో జూనియర్‌ ట్రైనీ (జేటీ), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ట్రైనీస్‌ (ఎఫ్‌ఏటీ) పోస్టుల భర్తీకి యాజమాన్యం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 645 జూనియర్‌ ట్రైనీ (మెకానికల్‌ 344, ఎలక్ర్టికల్‌ 203, మెటలర్జీ 98) పోస్టులకు, 91 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు, గడువు 21వ తేదీతో ముగియనుంది. జూలై 9న ఉదయం జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు, అదేరోజు మధ్యాహ్నం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ అభ్యర్థులకు రాత పరీక్ష జరగనుంది. జూలై 10న కీ విడుదల, 12న అభ్యంతరాల స్వీకరణ, 19న ఫైనల్‌ కీ విడుదల, 22న ఫలితాలు విడుదల చేయనున్నట్టు యాజమాన్యం వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఉద్యోగాలకు నిర్వాసితుల కోటా 50 శాతం అమలు చేయనున్నామని యాజమాన్యం తెలిపింది. మరిన్ని వివరాలుకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వైజాగ్‌స్టీల్‌.కాం వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొంది.
Link to comment
Share on other sites

కూచిపూడి అధ్యాపకులకు నేటి నుంచి శిక్షణ
 
 
కూచిపూడి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూచిపూడి నాట్యకళను అందించేందుకు 200మంది నాట్య అధ్యాపకులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినట్టు కూచిపూడి నాట్యారామ చైర్మన్‌ కూచిభొట్ల ఆనంద్‌ తెలిపారు. కృష్ణాజిల్లా కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నాట్యఅధ్యాపకులకు సోమవారం నుంచి వారం రోజులపాటు కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కళాపీఠంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాట్య అధ్యాపకుల పోస్టులకు 240 దరఖాస్తులు అందాయని, శిక్షణ అనంతరం ఎంపికైన వారు ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఆరు రోజులపాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Link to comment
Share on other sites

ఏపీపీఎస్సీ రాత పరీక్షలు త్వరలో

ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ ఈ నెల 6 నుంచి 15వ తేదీ మధ్య ఐదు రకాల రాత పరీక్షలను నిర్వహించనుంది. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని కార్యదర్శి వైవీఎస్టీ శాయి సూచించారు.

* డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామకాల రాత పరీక్షను ఈ నెల 6, 7, 8 తేదీల్లో 59 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు 17,538 మంది దరఖాస్తు చేసుకున్నారు.

* జూన్‌ 11న నిర్వహించే బీసీ వసతిగృహాల సంక్షేమాధికారి రాత పరీక్షను 47,864 మంది రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 91 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

* జూన్‌ 14న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎకనామిక్స్‌) రాత పరీక్షను విజయవాడ, గుంటూరుల్లోని 18 కేంద్రాల్లో జరపనున్నారు. 5435 మంది దరఖాస్తు చేశారు.

* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఉద్యానవన) రాత పరీక్ష జూన్‌ 14, 15 తేదీల్లో జరగనుంది. దృష్టి లోపం కలిగిన వారికి సంబంధించిన ఈ ఉద్యోగానికి ఒకరే దరఖాస్తు చేశారు.

* జూనియర్‌ అసిస్టెంట్‌-కమ్‌-టైపిస్టు రాత పరీక్షను ఆన్‌లైన్‌లో జూన్‌ 15న నిర్వహించనున్నారు. 11 మంది రాసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దృష్టిలోపం కలిగిన వారికి సంబంధించిన ఉద్యోగాలివి.

* ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో జూన్‌ 8 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. 39,197 మంది హాజరుకానున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...