Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

ఏపీపీఎస్సీ ఎదురుచూపులు

ఖాళీల వివరాలపై శాఖల నుంచి రాని సమాచారం

భర్తీ గురించి ముఖ్యమంత్రి ప్రకటించినా కనిపించని కదలిక

ఈనాడు - అమరావతి

* పాతవి.. కొత్తగా వివిధ శాఖల నుంచి సుమారు 1600 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అరకొర సమాచారం ఏపీపీఎస్సీకి అందింది. వీటికి సంబంధించిన అదనపు సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

* వీటిల్లో ఎక్కువగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, అవినీతి నిరోధక శాఖ, మున్సిపల్‌, పౌర సరఫరాలు, ఇతర శాఖల్లో జూనియర్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

8ap-main3a.jpg

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వచ్చే నెల నుంచి ఉద్యోగ నియామక ప్రకటనల్ని జారీ చేయాల్సి ఉండగా దానికి తగ్గట్లుగా సన్నద్ధతే కనిపించడం లేదు. దీనివల్ల కమిషన్‌ నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే... కమిషన్‌ ప్రకటనల్ని అనుసరించి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నష్టపోయే అవకాశాలున్నాయి. తొలిసారిగా వార్షిక ఉద్యోగ నియామకాల పట్టికద్వారా 42 ప్రకటనల్ని జులై నుంచి జారీ చేస్తామని కమిషన్‌ ఏప్రిల్‌ తొలివారంలో ప్రకటించింది. 2018 జనవరి వరకూ ఈ ప్రకటనల జారీ జరిగేలా ప్రణాళికల్ని సిద్ధం చేసి, నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీల్ని అధికారికంగా ప్రకటించింది. అయితే... ప్రభుత్వం నుంచి ఖాళీల వివరాలు అందితే కానీ ప్రకటనలు జారీచేసేందుకు వీలు కాదు. ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలు అంది.. సామాజికవర్గాల వారీగా వాటిని విభజించి, ఆర్థికశాఖ ఆమోదాన్ని తీసుకున్న అనంతరమే ఏపీపీఏస్సీ ఉద్యోగ ప్రకటనల్ని జారీ చేస్తుంది. ఖాళీల వివరాలను వెంటనే పంపించాలని ఏపీపీఎస్సీ నుంచి లేఖలు వెళ్తున్నా స్పందన తక్కువగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పటికీ ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీకి త్వరితగతిన రావడం లేదు. ఈ విషయాన్ని కమిషన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవంక.. వివిధ శాఖల నుంచి అందిన ఉద్యోగ ఖాళీల వివరాలకు తగినట్లుగా పూర్తి సమాచారం అందకపోవడమూ సమస్యగా మారింది. అసలే ఏపీపీఎస్సీలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి లేదా పొరుగుసేవల కింద నియామకాలకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల సకాలంలో వివరాలు అందితేనే అవసరమైన చర్యలను పకడ్బందీగా తీసుకునేందుకు వీలవుతుంది. లేకుంటే సమస్యలు తప్పనిసరి.

అరకొరగా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఇది: టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ - 227, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ - గిరిజన శాఖ - 134, జూనియర్‌ అసిస్టెంట్స్‌ - భూపరిపాలన శాఖ - 138, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ - 61, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చేనేత శాఖ) 41, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 - రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ - 15, ఏపీఆర్‌వో - సమాచార శాఖ - 12, డీపీఆర్‌వో - సమాచార శాఖ - 04, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ - 30, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు - 47 (నాన్‌ జాయినింగ్‌-భర్తీకానివి-49), డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ - 14 (వైద్య, ఆరోగ్య శాఖ), అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ - వ్యవసాయ మార్కెటింగ్‌- 16, అసిస్టెంట్‌ హైడ్రోలాజిస్ట్‌ - భూగర్భ గనులశాఖ - 12, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ - 05, జూనియర్‌ మేనేజర్స్‌ - గిరిజన సహకార సంస్థ - 12, లెజిస్లేచర్‌ ఆఫీసర్‌ - సచివాలయం - 09, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ - 04, ఇంగ్లీష్‌ రిపోర్టర్స్‌ - శాసనసభ - 08, జూనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్స్‌ - వ్యవసాయ మార్కెటింగ్‌ - 24, సీనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్స్‌ - వ్యవసాయ మార్కెటింగ్‌- 08, అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్స్‌ - శాసనసభ - 5, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ - ఔషధ నియంత్రణశాఖ - 02, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ - 5, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ - వ్యవసాయ మార్కెటింగ్‌ - 44.

Link to comment
Share on other sites

గూప్‌-2(1999) తుది ఎంపిక పూర్తి
14-06-2017 02:01:45
 
అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): దాదాపు 17 సంవత్సరాల పాటు న్యాయ, ఇతర వివాదాస్పద అంశాలతో కూరుకుపోయిన 1999 నాటి గ్రూప్‌-2 సర్వీసెస్‌ ఉద్యోగాలకు సంబంధించిన తుది ఎంపికలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. ఎట్టకేలకు ఆ జాబితాను బుధవారం యూనిట్‌ ఆఫీసులకు పంపేందుకు సిద్దమైంది. మొత్తం 867 ఎగ్జిక్యూటివ్‌, 180 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించిన కమిషన్‌ తదుపరి లాంఛనాలను పూర్తిచేస్తోంది. ఒకవైపు.. తుది ఎంపిక జాబితాను యూనిట్‌ ఆఫీసులకు పంపేందుకు ఏపీపీఎస్సీ సిద్ధం కాగా.. కొందరు అభ్యర్థులు మళ్లీ న్యాయస్థానంలో సవాల్‌ చేయడం గమనార్హం. సదరు క్యారీ ఫార్వర్డ్‌ పోస్టులను తొలగించరాదని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.
Link to comment
Share on other sites

త్వరలో 828 మంది వైద్యుల నియామకం

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడి

మంగళగిరి, న్యూస్‌టుడే: కొత్తగా 828 మంది వైద్యుల నియామకం చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఇందులో 327 పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్యులను ఏపీపీఎస్సీ ద్వారా నియమిస్తామన్నారు. ఒప్పంద పద్ధతిపై 501 మంది నియామకానికి ఆర్థి´క శాఖ నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. రహదారుల వెంట ఉన్న ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్‌ ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తామన్నారు. ఆస్పత్రులో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు నుంచి రూ.242 కోట్లు ఆర్థి´క సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఎయిమ్స్‌ నిర్మాణం పనులు జూలైలో మొదలు కానున్నాయని, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

Link to comment
Share on other sites

197 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి ఆమోదం

ఈనాడు, అమరావతి: ప్రజారోగ్యశాఖ పరిధిలో 197 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను ఒప్పంద విధానంలో నియామకంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వుల్ని జారీచేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు మూడేళ్లపాటు కొనసాగుతారు.

ఆయుష్‌లోనూ ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు!

ఆయుష్‌ (ఆయుర్వేద, యునాని, హోమియో) శాఖ పరిధిలోనూ పీజీ అర్హత కలిగిన వైద్యుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వుల్ని జారీచేశారు. ఇదే నిర్ణయాన్ని మే 31 నుంచి వైద్య విద్య సంచాలక, ప్రజారోగ్యం, ఏపీవీవీపీ పరిధిలో అమలుచేస్తున్నారు. ఆయుష్‌లో మంగళవారం నుంచి వర్తింపచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites


ఏపీపీఎస్సీలో మారిన పని తీరు.. కేసులు, వివాదాలకు దూరం

క్యాలెండర్‌ మేరకు నోటిఫికేషన్లు.. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు

పారదర్శకతకు పెద్దపీట.. నమ్మకం పెంచుతున్న ఇంటర్వ్యూ విధానం

డిసెంబరుకల్లా పాత నోటిఫికేషన్లకు రిక్రూట్‌మెంట్లు

 

 

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు.. ఏపీపీఎస్సీ అంటే వివాదాల పుట్ట! పరీక్ష అనగానే వాయిదాలు! ఫలితాల వెంటనే కేసులు! ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది! నోటిఫికేషన్ల జోరు పెరిగింది. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు... వివాదాలకు తావులేకుండా విధానాలు... నిర్దిష్ట గడువులోపే ఫలితాలు! నిరుద్యోగుల ‘జీవితాలకు పరీక్ష’ పెడుతుందన్న అపఖ్యాతిని ఏడాది కాలంలోనే ఏపీపీఎస్సీ చెరిపేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్‌ 27న ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ను నియమించింది. ఆ తర్వాత కార్యదర్శిగా వైవీఎ్‌సటీ శాయిని నియమించింది. గత ఏడాది కొత్త సభ్యులను కూడా నియమించింది. ఫలితంగా గతానికి భిన్నంగా కమిషన్‌ పనితీరులో వేగం మొదలైంది. గత రిక్రూట్‌మెంట్ల తాలూకు పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను.. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఇంటర్వ్యూలపై నిరుద్యోగుల్లోని అపనమ్మకాన్ని పోగొట్టేలా రెండంచెల విధానానికి శ్రీకారం చుట్టింది. సాధ్యమైనంత వరకు ఇంటర్వ్యూ లేకుండానే ఖాళీలను భర్తీ చేయాలని సంకల్పించింది.

 

 

ప్రణాళికాబద్ధంగా..

2016 జూన్‌లో 4009 పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. డిసెంబర్‌ 31లోగా ప్రధానమైన అన్ని నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రస్తుత కమిషన్‌ మొత్తం 4,275 పోస్టుల భర్తీకి సంబంధించి 34 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో ఇప్పటి వరకు 7 నోటిఫికేషన్లకు చెందిన దాదాపు 1000 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసి.. ప్రభుత్వ విభాగాలకు యూనిట్‌ లిస్టులను పంపించింది. మిగిలిన 27 నోటిఫికేషన్ల రిక్రూట్‌మెంట్‌ను కూడా ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందులో భాగంగానే.. 982 పోస్టులకు చెందిన గ్రూప్‌-2 సర్వీసెస్‌, 1055 పోస్టులకు చెందిన గ్రూప్‌-3 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌కు ఇప్పటికే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ పూర్తి చేసింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ జులై 15-16 తేదీల్లో, గ్రూప్‌-3 మెయిన్స్‌ ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్‌లోగా ఈ రెండు రిక్రూట్‌మెంట్లు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉంది.

 

 

గత సమస్యలకూ చెక్‌

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్లపై ప్రతిష్ఠంభనకు తెరదించేందుకూ ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టింది. 1999 నాటి గ్రూప్‌-2 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తాజాగా తుది సెలెక్షన్‌ లిస్టును విడుదల చేసి ప్రభుత్వ విభాగాలకు కూడా పంపడం గమనార్హం. దాదాపు 17 సంవత్సరాలుగా ఈ రిక్రూట్‌మెంట్‌పై వివాదం నడుస్తోంది. ఇక 2008 నాటి జేఎల్స్‌ ఎకనామిక్స్‌ వివాదాన్ని కూడా ఏపీపీఎస్సీ తాజాగా ఓ కొలిక్కి తీసుకువచ్చింది. గ్రూప్‌-2011 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ వివాదాన్ని ఈ నెలాఖరులోగా పరిష్కరించే యోచనలో కమిషన్‌ ఉంది.

 

 

ముందుగానే సిద్ధం

2017లోనూ విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లకు ఇయర్‌ క్యాలెండర్‌ను కూడా ఇటీవల ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఖాళీలను రోస్టర్‌ పాయింట్లతో కలిపి పంపిస్తే.. నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ క్లియరెన్స్‌ ఇచ్చిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు ఇస్తామని కమిషన్‌ ఛైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ తెలిపారు. ఈసారి దాదాపు 6 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని ఏపీపీఎస్సీ అంచనా వేసింది. ప్రభుత్వ, ఆర్థికశాఖ క్లియరెన్స్‌లు వస్తే ఆగస్టులో తొలి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

ఇరిగేషన్‌లో ఏఈఈల నియామకానికి కసరత్తు
 
 
  • వచ్చే నెల 10 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
 
అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖలో 518 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల (ఏఈఈ) నియామకానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించిన జల వనరుల శాఖ.. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 10వ తేదీ నుంచి జోన్ల వారీగా సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ఈఎన్‌సీ (అడ్మిన్‌) రవికుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎంపికయిన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వచ్చే నెల 10వ తేదీ నుంచి విజయవాడ కరెన్సీనగర్‌లోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌) కార్యాలయంలో ఇవ్వాలని, వాటిని పరిశీలించాక నియామక పత్రాలు ఇస్తామని రవికుమార్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

వర్సిటీ టీచర్ల భర్తీకి ఓకే
01-07-2017 02:32:13
 
636344732508064342.jpg
  • 14 విశ్వవిద్యాలయాల్లో 1,385 పోస్టుల్లో కొత్తవారికి చోటు
  • 100 ప్రొఫెసర్‌, 175 అసోసియేట్స్‌
  • 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
  • ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వుల జారీ
 
అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో ఖాళీ గా ఉన్న 1385 టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో 100 ప్రొఫెసర్‌, 175 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. తొలిదశ కింద 1104 పోస్టులు, సెకండ్‌ ఫేజ్‌ కింద 281 పోస్టులు భర్తీ చేయాలని తెలిపింది. వర్సిటీల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులను ప్రకటించింది. రేషనలైజేషన్‌ కమిటీ, హైపవర్‌ కమిటీల సిఫారసులకు వర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లు(ఈసీ), అకడమిక్‌ సెనేట్లు(ఏఎస్‌) తాజాగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఎంట్రీ లెవల్‌లోని 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులను మా త్రం అర్హులైన అధ్యాపకులు, అనుభవాలను ప్రాతిపదికగా తీసుకుని భర్తీ చేస్తారు. పోస్టుల కన్వర్షన్‌, ట్రాన్స్‌ఫర్‌, కుదింపు, విభాగాల విలీనం.. తదితర ప్రక్రియలను రేషనలైజేషన్‌ కమిటీ చేపట్టిన అనంతరం వర్సిటీలలోని ఖాళీలను ఖరారు చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలన్న సర్కారు అభిమతానికి అనుగుణంగా.. ఈ ప్రక్రియను ఏపీపీఎస్సీకి అప్పగించే అంశాన్ని వర్సిటీలు పరిశీలిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
324 మంది వైద్యుల భర్తీకి ఓకే
20-07-2017 02:07:11
 
  • 418 స్టాఫ్‌ నర్సు పోస్టులకూ లైన్‌క్లియర్‌
 
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ (ఏపీవీవీపీ)లో 324 వైద్యుల పోస్టులు, 418 స్టాప్‌ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై బుధవారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 324 వైద్యుల పోస్టుల్లో 113 గైనకాలజీ, 116 అనస్థీయా, 95 ప్రిడియాట్రిక్స్‌ పోస్టులు ఉన్నాయి. వెంటనే భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ఏపీవీవీపీ కమిషనర్‌కు సూచించారు. మరోవైపు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, ఏపీవీవీపీ నుంచి లేట్రల్‌ ఎంట్రీ కోసం సుమారు 700 దరఖాస్తులు డీఎంఈకి చేరాయి. ఈ 700 దరఖాస్తులతో పాటు సీనియారిటీ ప్రకారం వైద్యుల జాబితా.. డీహెచ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌ కార్యాలయాల నుంచి డీఎంఈకి అందాయి.
Link to comment
Share on other sites

త్వరలో 324 వైద్యుల పోస్టుల భర్తీ

ఏలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా 324 వైద్యుల, 418 మంది నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. త్వరలోనే ఈ నియామకాలు జరుగుతాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 2 weeks later...
  • 1 month later...
ఏడీఎస్‌లుగా 229 మంది
10-12-2017 03:30:04
 
636484734060636414.jpg
  • జాబితా రూపొందించిన ఏపీపీఎస్సీ
  • రేపోమాపో సర్వే శాఖ వద్దకు..
  • అపాయింట్‌మెంట్లు ఇవ్వడమే తరువాయి
  • మరో 30 పోస్టులకు సరైన అభ్యర్థులు కరువు
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సర్వే శాఖలో అసిస్టెంట్‌ డిప్యూటీ సర్వేయర్‌ (ఏడీఎస్‌) పోస్టుల భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సీ కొలిక్కి తీసుకొచ్చింది. 229 మందితో సెలక్షన్‌ లిస్టును రూపొందించింది. వీటిని రేపోమాపో సర్వేశాఖకు పంపించనున్నారు. ఆపై వారికి నియామక ఉత్తర్వులు(అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌) ఇవ్వడమే తరువాయి. ఈ జాబితా ఆధారంగా సర్వే శాఖ ఎంపికయిన అభ్యర్థులను పిలిచి నియామక ఉత్తర్వులు అందించాల్సి ఉంది. కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు ఏపీపీస్సీ నిర్ధేశించిన ప్రమాణాలను అందుకోలేకపోయారు. దీంతో 30 పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేయలేకపోయినట్లు తెలిసింది. ఈసారికి ఈ 30 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి. వీటిని మరోసారి రీ నోటిఫై చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. సర్వే శాఖలో 269 ఏడీస్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2016లో అనుమతి ఇచ్చింది.
 
వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని గత ఏడాది చివర్లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. తొలుత ఐటీఐ, డిప్లోమా విద్యార్హతగా పేర్కొన్నారు. తమకు కూడా అవకాశం కల్పించాలని బీటెక్‌ గ్రాడ్యుయేట్లు కోరడంతో ఆ డిమాండ్‌ను ఒకే చేశారు. ఈ ఏడాది మార్చిలో రాతపరీక్షలు నిర్వహించారు. లక్షలాది మంది హాజరవడంతో పోస్టులన్నీ బీటెక్‌ గ్రాడుయేట్లకే వెళ్లిపోతాయన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే, అంచనాలకు భిన్నంగా ఏపీపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహించింది. బీటెక్‌ గ్రాడ్యుయేట్లతో సమానంగా సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారికి కూడా పోస్టులు దక్కాయి. జిల్లాల వారీగా కేటాయించిన పోస్టులను బట్టి అర్హుల జాబితాను ఏపీపీఎస్సీ సిద్ధం చేసింది. ఇక ఇందులో మరే సాంకేతిక చిక్కులు, ఆలస్యం ఉండబోదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
ప్రస్తుతం సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ విజయమోహన్‌ ఎన్నికల విధుల్లో భాగంగా గుజరాత్‌లో ఉన్నారు. ఇన్‌ఛార్జి కమిషనర్‌గా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యదర్శి రామారావు వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ కమిషనర్‌ వచ్చాకే నియామక ఉత్తర్వులు ఇస్తారా? లేక వెంటనే దీన్ని చేపడతారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏడీఎ్‌సల నియామకంతో సర్వే దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
540 పోస్టులకు 519 మందే ఎంపిక!
21-03-2018 02:59:32
 
  • గ్రూప్‌-2 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ సెలెక్షన్‌ జాబితా విడుదల
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 (సర్వీసెస్‌) నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సెలెక్షన్‌ జాబితాను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో మొత్తం 540 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీచేయనున్నట్లు పేర్కొనగా.. 519 మందినే ఎంపిక చేశారు. అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా 17 పోస్టులకు ఎవరినీ ఎంపిక చేయలేదు. మరో 4 పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్‌ చేపట్టాల్సి ఉన్నందున సెలెక్షన్స్‌ చేపట్టలేదు. ఈ 21 పోస్టులకు మినహా మిగిలిన నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సెలెక్షన్‌ లిస్టును విడుదల చేశారు. ఇందులో జోన్‌లు, జిల్లాల వారీగా సెలెక్షన్స్‌ ఉన్నాయి. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో సెలెక్షన్‌ లిస్టును ప్రదర్శించింది.
Link to comment
Share on other sites

నైట్‌ వాచ్‌మెన్‌ పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
24-03-2018 07:30:53
 
636574734533984077.jpg
విజయవాడ: జిల్లాలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులు భర్తీకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత జిల్లా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌టి(మహిళ) కేటగిరిలో మూడు, ఎస్సీ(మహిళ) కేటగిరిలో ఒకటి, ఎస్సీ(జనరల్‌) కేటగిరిలో ఒక పోస్టుకు అభ్యర్థులను నియమించాల్సి ఉందన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే వారు అయిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, మాజీ సైనికులు లేదా సివిల్‌ డిఫెన్స్‌లో శిక్షణ పొందిన వారు లేదా హోంగార్డు, సైకిల్‌ రైడింగ్‌ తప్పనిసరి. వయస్సు 18 నుంచి 47 ఏళ్లు ఉండాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జాయింట్‌ డైరెక్టర్‌, సాంఘిక సంక్షేమ శాఖ, మచిలీపట్నం కార్యాలయంలో దరఖాస్తులను దాఖలు చేయాలని కోరారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...