Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు జాబ్స్
09-07-2016 09:47:52
636036544710819526.jpg
రిక్రూటర్ : ఇర్కాన్ (IRCON)
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్
మొత్తం పోస్టులు : 40
వయోపరిమితి : 33 సం.లు
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 60%
పేస్కేల్ : రూ.20,600 - 46,500లు
ఎంపిక : వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్ లైన్ http://www.ircon.org/erecruitment/Listofvacancies.aspx
Link to comment
Share on other sites

యుపిఎస్‌సి ఉద్యోగ ప్రకటన
09-07-2016 09:24:09
636036530475646161.jpg
రిక్రూటర్ : యుపిఎస్‌సి
పోస్టులు : జూనియర్ వర్క్స్ మేనేజర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడిషినల్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆంథ్రోపాలజిస్ట్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్...
మొత్తం పోస్టులు : 279
నియామకం : ఆయా విభాగాల్లో... దేశవ్యాప్తంగా...
తుది గడువు : 14-07-2016 - 28-07-2014
దరఖాస్తు, తదితర పూర్తి వివరాల కోసం...
Link to comment
Share on other sites

టెన్త్ అభ్యర్థులకు హ్యాండీమన్ ఉద్యోగాలు
09-07-2016 09:36:16
636036537750195273.jpg
రిక్రూటర్ : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ((AIATSL)
పోస్టులు : హ్యాండీమన్
మొత్తం పోస్టులు : 300
అర్హతలు : టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఎగుమతులు, దిగుమతులలో ఏడాది అనుభవం
శాలరీ : స్టార్టింగ్... రూ.11,040లు
వయో పరిమితి : 28 సం.లు (జనరల్)
దరఖాస్తు : వాక్ ఇన్ 11-07-2016 ఉ.9,00గం.ల నుంచి మ.12.00 గం.ల మధ్య
వెన్యూ : సిస్టమ్స్ అండ్ ట్రైనింగ్ డివిజన్, రెండవ అంతస్తు, జిఎస్డి కాంప్లెక్స్, 5వ గేట్ దగ్గర, సహర్, అంధేరి-ఇ, ముంబై-400 099
Link to comment
Share on other sites

రేపు యూజీసీ నెట్‌ పరీక్ష
09-07-2016 03:04:59
గౌతంనగర్‌/హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా లెక్చరర్‌ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్‌ పరీక్ష ఆదివారం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 41 సెంటర్లలో 25,651 మంది నెట్‌ రాస్తున్నారని సిటీ కో-ఆర్డినేటర్‌ సీతాకిరణ్‌ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.
Link to comment
Share on other sites

సమైక్య’ చరిత్ర యథాతథం!: ఏపీపీఎస్సీ

09-07-2016 02:50:03

636036294043319253.jpg
  • ప్రతిపాదిత సిలబస్ లో 15% మార్పుచేర్పులు
  • అదనంగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి
  • విభజన అంశాలపై మరింత దృష్టి
  • గ్రూప్స్‌ సిలబస్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
 
హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్స్‌ సిలబస్‌ విడుదలైంది. ఎన్నో కసరత్తులు.. మార్పుచేర్పుల అనంతరం గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసె్‌సకు సంబంధించిన ఫైనల్‌ సిలబ్‌సను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. కొత్త సిలబ్‌సను www.psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయ భాస్కర్‌ అధ్యక్షతన బోర్డు శుక్రవారం సమావేశమై సిలబ్‌సను ఖరారుచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రూప్స్‌ సిలబ్‌సలో పలు మార్పులు, చేర్పులపై కమిషన్‌ ఐదు నెలలుగా కసరత్తు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబ్‌సను సవరించేందుకు సబ్జెక్టుల వారీగా నిపుణులతో అధ్యయనం చేయించింది. ప్రతిపాదిత సిలబ్‌సను తయారు చేయించి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. వారికి మార్చి 15 వరకు గడువు పెట్టింది. గ్రూప్స్‌నకు సంబంధించిన ప్రతిపాదిత సిలబ్‌సపై మొత్తం 1,234 సూచనలు ఏపీపీఎస్సీకి అందాయి. మళ్లీ వాటిని పరిశీలించేందుకు సబ్జెక్టు నిపుణులతో కమిటీలను నియమించారు. వాటిలో చాలా వరకు రిపీట్‌ అయ్యాయని తేల్చిన నిపుణులు సుమారు ఐదు శాతం సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. కమిటీలు చేసిన సిఫారసులను పరిశీలించి స్వల్ప మార్పులతో ఆమోదం తెలపడంతో పాటు అదనంగా పలు అంశాలను సిలబ్‌సలో చేర్చారు. మొత్తం మీద.. మార్చిలో ప్రతిపాదించిన సిలబ్‌సలో సుమారు 15 శాతం మేర మార్పులు, చేర్పులు జరిగాయి.
 
జనరల్‌ స్టడీస్‌లో పర్యావరణ విద్య

జనరల్‌ స్టడీస్‌లో కొత్తగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి అంశాలు చేరాయి. పర్యావరణ విద్యకు ప్రాచుర్యం పెరుగున్నందున ఏపీపీఎస్సీ ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు సిలబ్‌సలో చేర్చింది. సుప్రీంకోర్టు కూడా పాఠ్యాంశాల్లో పర్యావరణ విద్యను కూడా ఒక ప్రధానమైన అంశంగా చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కమిషన్‌ వివరించింది. గ్రూప్‌-1 సర్వీసె్‌సలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీలో భాగంగా, గ్రూప్‌-2,3,4 సర్వీసె్‌సలో పేపర్‌-1 (జనరల్‌ స్టడీ్‌స)లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి అంశాలను అదనంగా చేర్చింది.
 
సమైక్య రాష్ట్ర చరిత్ర అలానే..

గ్రూప్స్‌ సిలబ్‌సలో సమైక్యరాష్ట్ర చరిత్రను యథాతథంగా కొనసాగించింది. రాష్ట్రం విడిపోయినా తెలంగాణను పాలించిన వ్యక్తులు, వంశాలతో ఏపీకి కూడా సంబంధం ఉందని కమిషన్‌ భావించింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలు, సమస్యలపై సిలబ్‌సలో మరింత ఫోకస్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ చైౖర్మన్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు గ్రూప్స్‌ నోటిఫికేషన్లకు ఈ కొత్త సిలబ్‌స మేరకు ప్రిపేర్‌ కావాలని ఆయన సూచించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...