Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
 
636017913391951195.jpg
హైదరాబాద్‌ : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10వేలకుపైగా పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4009, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 5,991, గ్రూపు-1 ద్వారా 94, గ్రూప్‌-2లో 750 పోస్టులు భర్తీ చేయనున్నారు. 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 422 పోస్టుల భర్తీకి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జలవనరులశాఖలో 350 ఏఈఈ పోస్టుల భర్తీ, రెవెన్యూశాఖలో 200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

Link to comment
Share on other sites

Andhra Pradesh Government has given green signal to recruite 10000 jobs in various government departments. Finance Department also have given its nod to go ahead with the notification.


The State Police Recruitment Board would fill 6,000 vacancies in the department; the Andhra Pradesh Public Service Commission (APPSC) would fill 94 Group-1, 750 Group-2 and 1,000 Group-3 posts. Another 1,000 posts of technicians, 422 posts in medical and health would also be filled through the APPSC


  • GROUP 1 - 94 Posts
  • GROUP 2 - 750 Posts
  • GROUP 3 - 1000 Posts
  • APPSC - 4009 posts
  • Police Department - 5991 Posts
  • Health Department - 422 Posts
  • Irrigation Department - 350 AEE Posts
  • Revenue Department - 200 Posts
Link to comment
Share on other sites

ఏపీ గ్రూప్‌-1లో A,B పోస్టులు!
 
636020833441383603.jpg
  • 2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులన్నీ గ్రూప్‌-1లోకి
  • గ్రూప్‌-1బీగా 10 రకాల ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
  • 2లో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు మాత్రమే
  • 622, 623 జీవోల అమలుకు అనుమతివ్వండి
  • కోరనున్న ఏపీపీఎస్‌సీ!
హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల పునర్వ్యవస్థీకరణకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సమాయత్తమమవుతోంది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-2 సర్వీసుల నుంచి తొలగించి.. గ్రూప్‌-1 సర్వీసుల్లో విలీనంచేయాలని, వాటిని గ్రూప్‌-1 బీ సర్వీసులుగా పరిగణిస్తూ 2012 డిసెంబర్‌లో జారీచేసిన జీవో.నెం. 622, 623లను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయాల్సిన ఖాళీ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జీవోలు ఏం చెబుతున్నాయంటే.. ప్రస్తుతం గ్రూప్‌-1లో ఉన్న పోస్టులన్నిటినీ గ్రూప్‌-1ఏ సర్వీసులుగా పరిగణిస్తారు. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రూప్‌-1బీ సర్వీసుల్లో ఉంటాయి. ఇందులో.. మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3), సహాయ వాణిజ్య పన్నుల అధికారులు అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్స్‌ (ఏసీటీవోలు), డిప్యూటీ తహశీల్దార్‌, సబ్‌ రిజిసా్ట్రర్‌ (గ్రేడ్‌-2), జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌ (కోఆపరేటివ్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(పంచాయతీరాజ్‌), ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (గ్రామీనాభివృద్ధి) పోస్టులు ఉంటాయి. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రూప్‌-1బీ కిందకు వస్తే.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు మాత్రమే గ్రూప్‌-2లో ఉంటాయి. గ్రూప్‌-1ఏ, గ్రూప్‌-1బీ సర్వీసులకు ఒకే పరీక్ష నిర్వహిస్తారని జీవోల్లో పేర్కొన్నారు.
 
 
ఏపీపీఎ్‌ససీ రిక్రూట్‌మెంట్లలో సంస్కరణల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం.. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులన్నిటినీ గ్రూప్‌-1లో విలీనం చేయాలని, గ్రూప్‌-1 ను గ్రూప్‌-1ఏ, గ్రూప్‌-1బీలుగా విభజిస్తూ 623, 624 నంబర్ల జీవోలు ఇచ్చింది. అప్పట్లో ఈ ఉత్తర్వులను నిరుద్యోగులు వ్యతిరేకించారు. గ్రూప్‌-1ఎ, గ్రూప్‌-1బి సర్వీసు ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహిస్తూ.. ఒక్క మార్కు తేడాతో వారి స్థాయులు మారిపోయేలా చేయడం సరికాదని తెలిపారు. గ్రూప్‌-2లోని పోస్టులకు 450 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహించి, గ్రూప్‌-1బీలోని పోస్టులకు 825 మార్కుల (రాత పరీక్ష 750 మార్కులు+ ఇంటర్వ్యూ 75 మార్కులు)కు డిస్ర్కిప్టివ్‌ పరీక్ష నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో ఇంటర్వ్యూల విధానంలోనూ మార్పులు తీసుకువచ్చారు. అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సత్యనారాయణ కమిటీ చేసిన సిఫారసుల్లో భాగంగా.. రాష్ట్ర స్థాయి సర్వీసులతో పాటు గ్రూప్‌-1, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లు, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌).. ఈ పోస్టులకు మాత్రమే ఇంటర్యూలు నిర్వహించాలి. ఇతర పోస్టులకు రాత పరీక్షల ద్వారా ఉద్యోగాలివ్వాలని నివేదించింది. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏడాది వరకు వీటిని అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి అమలు చేసేలా 2013 జులైలో జీవో నంబర్‌ 556 విడుదల చేసింది. కానీ ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు గానీ రిక్రూట్‌మెంట్లు గానీ చేపట్టలేదు. ప్రస్తుతం కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నందున కమిషన్‌ అప్రమత్తమైంది. పాత ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నట్లుగానే భావించాల్సి ఉన్నందున ఎందుకైనా మంచిదని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 622, 623 జీవోలను కొనసాగించాలో వద్దో వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వు (జీవో 110)లో ఈ విషయమై స్పష్టత లేదు. పాత జీవోలను కొనసాగించాలో వద్దో ప్రస్తావన లేదు. ఒకవేళ వాటిని కొనసాగించవచ్చంటే సరే.. లేకుంటే మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

ఆంధ్రాలో ఆరువేల పోలీసు కొలువులు !
 
636023730648594615.jpg
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖాకీ కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉద్యోగులు దాదాపుగా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో కొలువుల భర్తీని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో ముందుగా దాదాపు 6వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాపిటల్ రీజియన్ సెక్యురిటీ నిమిత్తం ఈ నియామకాలు జరగనున్నట్లు సమాచారం. పోలీసు కొలువుల భర్తీ ఇలా సాగనుంది. శుక్రవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 5591 పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఏ ప్రాంతంలో ఎన్నెన్ని పోస్ట్‌లు ఉన్నాయో తెలుసుకోండి.
 
విజయవాడ కమీషనరేట్
  • 310 కానిస్టేబుల్స్
  • 14 మంది మహిళా కానిస్టేబుల్స్
  • 188 మంది ఏఆర్ కానిస్టేబుల్స్‌
గుంటూరు రూరల్, తుళ్లూరు సబ్‌డివిజనల్ ఆఫీస్
  • 1. 398 మంది కానిస్టేబుల్స్
  • 2. 97 ఏఆర్ పోస్ట్‌లు
గుంటూరు అర్బన్
  • 1. 45 మంది కానిస్టేబుల్స్
  • 2. 10 మంది మహిళా కానిస్టేబుల్స్
  • 3. 20 మంది ఏఆర్ కానిస్టేబుల్స్
ఇతర పోస్టులు
  • 1. డిప్యూటీ జైలర్(16)
  • 2. మేల్ వార్డర్(240)
  • 3. ఫిమేల్ వార్డర్(25)
  • 4. సివిల్ ఎస్‌ఐ(245)
  • 5. మహిళా ఎస్‌ఐలు(110)
  • 6. పోలీస్ కానిస్టేబుల్స్(2319)
  • 7. మహిళా కానిస్టేబుల్స్(113)
  • 8. ఏఆర్ ఎస్‌ఐ(113)
  • 9. ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్(733)
  • 10. ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్‌ఐ(209)
  • 11. కమ్యూనికేషన్స్ పోలీస్ కానిస్టేబుల్స్(330)
Link to comment
Share on other sites

గ్రూప్-1‌ను వేర్వేరుగా నిర్వహించాలి : సుప్రీం
29-06-2016 13:05:52
636028023530679428.jpg
న్యూఢిల్లీ: గ్రూప్-1 పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు పాత సిలబస్‌ ప్రకారం తెలంగాణ పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అలాగే పరీక్షల ప్రక్రియను 3నెలల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...