Jump to content

farmer ki


Recommended Posts

రైతుసేవ యాప్

ఆధార్ తో రిజిష్టర్ అయితే సర్వేనంబర్లు తో సహా మీ పొలంవివరాలు చూపిస్తాయ్

అలాగే ..నీటి లబ్యత , పరికరాల వివరాలు చీడ నివారణలు చూపిస్తాయ్

https://pbs.twimg.com/media/DcZxrSJVQAApq6i.jpg

Link to comment
Share on other sites

రైతన్నకు సౌర సిరి
14-05-2018 02:45:26
 
636618627270886413.jpg
  • రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సౌర పంపుసెట్లు..
  • విద్యుత్‌ వాడుకోవచ్చు.. మిగిలింది అమ్ముకోవచ్చు
  •  తొలుత మూడు జిల్లాల్లో.. ఆపై రాష్ట్రమంతటా అమలు
  •  ఇది వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవం
  •  టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మరో వినూత్న పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గ్రిడ్‌ అనుసంధానిత సౌర పంపుసెట్లు అందించడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చే సౌర సిరి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమయ్యింది. ఈ సౌర పంపుసెట్లతో రైతులు పంటల సాగుకు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవచ్చు. అంతేగాకుండా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి 5 నుంచి 10 వేల రూపాయలు సమకూర్చుకోవచ్చు. రైతులు ఏడాదిలో 200 రోజులు సౌర పంపుసెట్లను వినియోగించుకున్నా... మిగిలిన 165 రోజులూ గ్రిడ్‌కు విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. ఈ పథకాన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో పంపుసెట్‌కు రూ.3.5 లక్షల చొప్పున రూ.2625 కోట్లతో 75 వేల సౌర పంపుసెట్లను అందజేయాలని భావిస్తోంది. ప్రపంచబ్యాంకు, పీఎఫ్సీ, ఐఆర్‌ఈడీఏ, నాబార్డు వంటి సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులో డిస్కంలు ప్రాథమికంగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ పథకం అమలుపై రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా సౌర పంపుసెట్లు, ఇంధన సామర్థ్య పంపుసెట్లు అందుకున్న 25 వేల మంది రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ఈ పంపుసెట్లు ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించడంతోపాటు 15 శాతం ఎక్కువగా నీటిని తోడుతాయని తెలిపారు. తద్వారా 45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవడంతో ఏటా రూ.20 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని అంచనా వేశారు. కొత్త పథకం వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం సృష్టిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. కరువు పరిస్థితుల్లో సౌర విద్యుత్‌ను పూర్తిగా విద్యుత్‌ సంస్థలకు విక్రయించడం ద్వారా రైతులకు ఏడాదికి 12 నుంచి 15 వేల రూపాయల ఆదాయం సమకూరేలా చూడాలన్నారు. దీనివల్ల విద్యుత్‌ సంస్థలకు పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గి రూ.300 కోట్లు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 9.62 లక్షల హెచ్‌వీడీఎస్‌ పంపు సెట్లను రైతులకు సమకూర్చామని, ఫలితంగా మోటార్లు కాలిపోవడం, పంపిణీ నష్టాలు కూడా తగ్గాయని చెప్పారు. ఉచిత విద్యుత్‌ రూపంలో ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుపై రూ.30 వేలు వెచ్చిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో పంపుల తయారీదారులు, డిస్కంలు, బీమా కంపెనీలు, సౌర పంపుసెట్ల డెవలపర్లు తదితర అన్ని వర్గాల ప్రతినిధులతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ తెలిపారు. పథకానికి సంబంధించిన విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కళా వెంకట్రావు, సీఎస్‌ దినేశ్‌కుమార్‌, ఇంధన శాఖ సలహాదారు కె.రంగనాథం పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

https://economictimes.indiatimes.com/news/economy/agriculture/90-per-cent-subsidy-for-use-of-drip-irrigation-in-agri-sector-andhra-pradesh-chief-minister-n-chandrababu-naidu/articleshow/38499597.cms

90 per cent subsidy for use of drip irrigation in agri sector: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu

RAJAHMUNDRY (AP): Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today announced that use of drip irrigation technology will be promoted in agriculture sector and a subsidy of 90 per cent will be given for the purpose. 

He also said that the government was planning to implement sophisticated technology in the sector to yield good results. 

"The government is preparing a permanent scheme for drought-hit farmers in the state. Drip irrigation technology will be used in agricultur .. 

 

Link to comment
Share on other sites

గ్రామాల్లోనే గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు
20-05-2018 04:08:43
 
  •  ఉత్పత్తుల నిల్వ సదుపాయాల్లో రైతులకు భాగస్వామ్యం
  •  పంట ధరలపై పంచాయతీలలో ఎల్‌ఈడీ తెరల ఏర్పాటు
  •  వ్యవసాయ వార్షిక ప్రణాళికపై సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులను గ్రామాల్లో నెలకొల్పే దిశగా రైతులను ప్రోత్సహించాలని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2018-19 వ్యవసాయ వార్షిక ప్రణాళికపై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సరైన ధర వచ్చేవరకూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే గోదాములు గ్రామాల్లోనే ఉండాలని, అందులో రైతాంగాన్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నేరుగా కొనుగోళ్లు చేసే డైరెక్ట్‌ పర్చేజ్‌ సెంటర్లను నెలకొల్పాలని సూచించారు. వ్యవసాయ ధరలు, తాజా స్థితిగతులను ప్రదర్శించే ఎల్‌ఈడీ తెరలను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుబజార్లలోనూ ఇటువంటి వ్యవస్థలు ఉండాలన్నారు. పిడుగుపాటుపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్న తరహాలోనే వ్యవసాయ మార్కెటింగ్‌లో కూడా ధరలు హఠాత్తుగా పడిపోవడం వంటి అంశాలపై రైతాంగానికి ముందస్తుగా సూచనలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, వ్యవసాయ రంగంలో దేశమంతా సంక్షోభం నెలకొన్నా ఏపీ మాత్రం అద్భుత ఫలితాలు సాధిస్తోందని వ్యవసాయశాఖ సలహాదారు విజయకుమార్‌ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మన రాష్ట్ర విధానాలనే అనుసరిస్తోందని తెలిపారు. ఇదిలావుండగా, ఈ-నామ్‌ విధానంలో రూ.3,400కోట్ల మేర ఈ-ట్రేడ్‌ చేసిన గుంటూరు మార్కెట్‌ యార్డు ఈ ఏడాది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం అన్నారు. అలాగే పంట ఉత్పత్తులకు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రైతులకు చెల్లింపులు జరపడంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మార్కెట్‌ యార్డు దేశంలోనే నంబర్‌-1 స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ ఎల్‌వీఎ్‌సఆర్‌కే ప్రసాద్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజమౌళి, వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్‌, ఆగ్రోస్‌ ఎండీ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

చంద్రన్న రైతు క్షేత్రాలకు రూ.93లక్షలు
ఖరీఫ్‌లో 1160 హెక్టార్లు.. రబీలో 770హెక్టార్ల సాగు లక్ష్యం
చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే
ctr-gen7a.jpg

పంటల సాగులో నష్టాలను చవిచూస్తూ రైతులు అప్పులు పాలవుతున్నారు. ఇలా ఏటా నష్టపోతున్న అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించి అధిక దిగుబడుల సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు చంద్రన్న రైతు క్షేత్రాల పేరిట క్షేత్ర స్థాయిలోనే ప్రదర్శన క్షేత్రాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. జిల్లాలో చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణకు 2018-19 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లకుగాను రూ.93లక్షలు కేటాయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో 1160 హెక్టార్లు.. రబీ సీజన్‌లో 700హెక్టార్లలో క్షేత్రాలను విస్తరించాలని ఉత్తర్వులో పేర్కొంది.

ఖరీఫ్‌లో వేరుసెనగ క్షేత్రాలు..
ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో వర్షాధార పంటగా వేరుసెనగ విస్తారంగా సాగవుతుంది. వేరుసెనగ సాగయ్యే 50మండలాల్లో చంద్రన్న రైతు క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 116 వేరుసెనగ రైతు క్షేత్రాల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించింది. 10 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక చంద్రన్న రైతు క్షేత్రంగా పరిగణిస్తారు. ఈ లెక్కన 161 క్షేత్రాలు.. 1610 హెక్టార్లలో క్షేత్రాలు ఏర్పాటు చేయాలి. ఆయా క్షేత్రాల నిర్వహణకు వ్యవసాయశాఖ అధికారులు డివిజన్లు, మండలాల వారీగా సాగు విస్తరణ, నిధులను కేటాయించారు.

రాయితీపై వేపనూనె, సూక్ష్మపోషకాలు
చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణ అన్నదాతలకు వేపనూనె, వేపపిండి, విత్తనశుద్ధి మందు, బయోఫర్టి లైజర్లు, సూక్ష్మపోషకం జిప్సం అందించనున్నారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు నిర్ణీత మోతాదులో వ్యవసాయాధికారులు పంపిణీ చేస్తారు. పొలంబడి తరహాలో రైతు క్షేత్రాల్లో విత్తు నుంచి కోత వరకు యజమాన్య పద్దతులు, సస్యరక్షణ చర్యలు.. నాణ్యమైన అధిక దిగుబడులకు అనుసరించాల్సిన ఆధునిక సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలోనే వివరిస్తారు. ఈ ఏడాది ఎన్నడులేని విధంగా పటిష్టంగా చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌ తెలిపారు. ఇప్పటి నుంచే క్షేత్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన రైతులను ఎంపిక చేయాలని మండల వ్యవసాయాధికారులకు ఆయన సూచించారు.

Link to comment
Share on other sites

 
 
జొన్న, మొక్కజొన్న సాయం రూ.266 కోట్లు
2.86 లక్షల మంది రైతుల నమోదు
మొత్తం ఉత్పత్తిలో నమోదు 58 శాతమే
అంచనాల్లో లెక్క తప్పిన వ్యవసాయశాఖ
ఈనాడు - అమరావతి
2ap-state1a.jpg
జొన్న, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కల్పనలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక సాయం పొందడానికి రైతుల నమోదు గడువు ముగిసింది. మొత్తం ఉత్పత్తిలో 58 శాతం పంట సాయం లెక్కలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,86,973 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జాబితాల తుది పరిశీలన పూర్తి చేసిన అనంతరం క్వింటాలుకు రూ.200 చొప్పున రూ.265.99కోట్లు వీరందరి ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్‌ పెట్టుబడులకు ప్రత్యే సాయం సొమ్ము ఉపయోపడేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్‌ స్థిరీకరణ నిధి కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ.250 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. నమోదు చేసుకున్న రైతుల జాబితాలను గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆమోదం తర్వాత చెల్లింపులు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వారం నుంచి పదిరోజుల్లో పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

తగ్గిన నమోదు శాతం
రబీలో సాగైన పంట, దిగుబడులతో పోలిస్తే.. ప్రస్తుతం నమోదు చేసుకున్న విస్తీర్ణం తక్కువగా ఉంది. మొత్తం 2.29 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తిని అధికారులు అంచనా వేయగా 1.33 లక్షల క్వింటాళ్లే  నమోదైంది. అంచనా ఉత్పత్తిలో 58.4 శాతం పంట మాత్రమే నమోదైంది.  మే 16 నుంచి జూన్‌ 6 మధ్య నమోదు చేపట్టాలని అధికారులు ఆదేశించినా అనుకున్న ప్రకారం సాగలేదు. దీంతో నెలాఖరు దాకా పొడిగించారు. అయినా 2.30 లక్షల హెక్టార్లలో సాగైన మొక్కజొన్న పంటలో 45 శాతం మంది నమోదు చేసుకోలేకపోయారు.

2ap-state1b.jpg
చిత్తూరులో సున్నా.. కర్నూలులో అంచనాకు మించి..
పంటల ఉత్పత్తి, దిగుబడుల్లో వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. కొన్ని జిల్లాల్లో అంచనాకు మించి ఉత్పత్తి కన్పిస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో అతి తక్కువగా వచ్చింది.
* కర్నూలు జిల్లాలో జొన్న 4.74 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి అంచనా వేయగా.. 11.95 లక్షల క్వింటాళ్లు నమోదైంది. 245 శాతానికి పెరిగింది. మొక్కజొన్న 5.40 లక్షల క్వింటాళ్ల అంచనాకు 6.64 లక్షల క్వింటాళ్లు నమోదైంది.
* రెండు పంటల నమోదులో గుంటూరు ముందంజలో ఉంది. ఇక్కడ నుంచి ఏకంగా 50లక్షల క్వింటాళ్లకు పైగా ఉత్పత్తికి సంబంధించి సాయం అందించాల్సి ఉంది.
* చిత్తూరు జిల్లాలో 92,620 క్వింటాళ్ల మొక్కజొన్న పండించినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఒక్క క్వింటాలు కూడా నమోదు చేయలేదు. ఇక్కడ జొన్న పంట అసలు లేదని నివేదిక ఇచ్చారు.
* విశాఖపట్నం, శ్రీకాకుళంలోనూ జొన్న అసలు సాగే లేదు అని పేర్కొన్నారు.
* విజయనగరంలో 2 హెక్టార్లు వేయగా 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు తేల్చారు. అయితే ఈ జిల్లా నుంచి 601 క్వింటాళ్లకు సంబంధించి రైతులు నమోదు చేసుకున్నారు.
* పశ్చిమగోదావరిలో 60 హెక్టార్లు మాత్రమే వేయగా 1,490 క్వింటాళ్ల దిగుబడి లెక్క తేల్చారు. ఇందులో 75శాతం ఉత్పత్తినే నమోదు చేసుకున్నారు.
* కడప, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 10శాతానికి తక్కువగానే జొన్న రైతులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. కడప, శ్రీకాకుళంలో మొక్కజొన్న ఉత్పత్తిలో 10 శాతం లోపే నమోదైంది.
2ap-state1c.jpg
2ap-state1d.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...