Jump to content

farmer ki


Recommended Posts

1680 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల
02-06-2017 04:20:04
 
గత ఏడాది కరువు కారణంగా పంట నష్టపోయిన ఏడు జిల్లాల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.1680 కోట్లు విడుదల చేసింది. 2016లో కరువు బారిన పడిన శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రైతులను అదుకునేందుకు ఈ నిధులను గురువారం విడుదల చేసింది.
Link to comment
Share on other sites

రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమకు ఏర్పాట్లు: రాష్ట్రంలో 13.20 లక్షల మంది రైతుల ఖాతాల్లో జూన్‌ 4న రూ.1,683 కోట్ల పెట్టుబడి రాయితీ జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వారి ఫోన్లకు తన పేరుతో సందేశం వెళ్తుందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో 9.45 లక్షల మంది రైతులకు రూ.595 కోట్లు పంటల బీమా అందించనున్నట్లు తెలిపారు. ఒక్కో రైతుకు బీమా కనీసం రూ.15 వేలు అందజేస్తామన్నారు. అంతకంటే ఎక్కువ వచ్చేవారికి ఎక్కువ ఇస్తామని, తక్కువ వస్తే కనీసం రూ.15 వేలు ఉండేలా, పెట్టుబడి రాయితీని జత చేస్తామని వివరించారు.

Link to comment
Share on other sites

#chandrababu releases 1032cr input subsidy to anatapuram dt farmers 6.25Laks farmers to be benefittedDBo-IyHUMAAMBbZ.jpg

1680 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

02-06-2017 04:20:04

 
గత ఏడాది కరువు కారణంగా పంట నష్టపోయిన ఏడు జిల్లాల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.1680 కోట్లు విడుదల చేసింది. 2016లో కరువు బారిన పడిన శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రైతులను అదుకునేందుకు ఈ నిధులను గురువారం విడుదల చేసింది. mpottam 1680cr fa atp ke entha icchara,
Link to comment
Share on other sites

కుప్పంలో ఇజ్రాయెల్‌ తరహా వ్యవసాయం

తక్కువ విస్తీర్ణం, నీటి ఖర్చుతో అధిక ఉత్పత్తే ధ్యేయం

ctr-gen7a.jpg

కుప్పం, న్యూస్‌టుడే: కుప్పంలో ఇజ్రాయెల్‌ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నివిధాలా కృషి చేస్తున్నారని కడా ఎస్వో శ్యామ్‌ప్రసాద్‌ స్పష్టంచేశారు. ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు, స్థానిక ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు సోమవారం కుప్పంలో పర్యటించారు. కుప్పం-మల్లానూరు మార్గంలోని ఇంజినీరింగ్‌ కళాశాల సమీపాన నిర్మిస్తున్న కృషి హబ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు అధిక దిగుబడి సాధించేందుకు శిక్షణ కల్పించనున్న నేపథ్యంలో.. కృషి హబ్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు కడా ఎస్వో వివరించారు. ఈ కేంద్రంలో పూలు, పండ్లు, కూరగాయలు పెంచి ఇక్కడి రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. తక్కువ వర్షపాతమున్న ఈ ప్రాంతంలో అందుబాటులోని నీటిని తక్కువగా ఖర్చు చేసి అధిక ఫలసాయం పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే రైతులకు రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కుప్పం ప్రాంతంలో వందశాతం రైతులు బిందుసేద్యం పద్ధతిలో వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త డాన్‌ అల్లూఫ్‌, వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ శాఖాధిపతి శాస్త్రవేత్త ఆర్‌వీఎస్‌కె రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ డీడీ మైఖేల్‌రాజు, పలమనేరు ఉద్యాన శాఖ ఏడీ సుభాని, ఉద్యానశాఖ కమిషనర్‌ కార్యాలయ ఏడీ శరవణన్‌, రాష్ట్ర సూక్ష్మ సేద్యం ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు, స్థానిక ఉద్యాన శాఖాధికారి హరేంద్ర, ఇంజినీర్‌ పవన్‌, బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

సిద్ధమవుతున్న ‘రైతు రథం’!

6వేల ట్రాక్టర్ల పంపిణీ లక్ష్యం

మార్గదర్శకాల తయారీకి కమిటీ

ఈనాడు, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ట్రాక్టర్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు 6వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు రూ.125కోట్లు రాయితీ రూపంలో ఖర్చవుతుందని అంచనా వేసింది. పథకానికి ‘రైతురథం’ అని పేరు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాక్టర్ల ద్వారా ఉపయోగించే పరికరాలే ఎక్కువగా వస్తున్నాయి. విదేశాల్లో వీటిని ఉపయోగించి పెట్టుబడులు తగ్గించడంతోపాటు సేద్యాన్ని సులభతరంగా మారుస్తున్నారు. వాటిని రాష్ట్ర రైతులకు చేరవేసే క్రమంలో ముందుగా పెద్దట్రాక్టర్లను అందించే ఏర్పాట్లు చేస్తోంది.

కమిటీ నియామకం.. మూడు రోజుల్లో మార్గదర్శకాలు: రైతులకు ట్రాక్టర్ల పంపిణీపై మార్గదర్శకాల తయారీకి ప్రభుత్వం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.వి.సత్యనారాయణ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు వినయ్‌చంద్‌ కన్వీనర్‌గా, ప్రొఫెసర్‌ సి.రమణ(అసోసియేట్‌ డీన్‌, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కాలేజి, మడకశిర), పి.పి.రావు(డైరెక్టర్‌, దక్షిణప్రాంత యంత్ర పరికరాల శిక్షణ, పరిశోధన సంస్థ, గార్లదిన్నె), డి.హరిబాబు చౌదరి(జేడీఏ), ఎం.చంద్రరాజమోహన్‌(జీఎం, ఏపీ ఆగ్రోస్‌) సభ్యులుగా వ్యవహరిస్తారు. మూడు రోజుల్లోనే విధివిధానాలు, మార్గదర్శకాలు తయారు చేసి ఇవ్వాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

రైతు రథం కింద 6,600 ట్రాక్టర్లు

రైతులకు రూ.120 కోట్ల విలువైన సూక్ష్మపోషకాలు ఉచితం: సోమిరెడ్డి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సూక్ష్మషోషకాలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. దీని వల్ల రైతులకు దాదాపు రూ.120 కోట్ల మేర లబ్ధి కలుగుతుందన్నారు. రైతులకు రాయితీలు కల్పించడం ద్వారా పత్తి సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం తగ్గించాలనుకుంటోందని వెల్లడించారు. అమరావతి సచివాలయంలో సోమవారం సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రైతురథం పథకం కింద 6,600 ట్రాక్టర్లు అన్ని జిల్లాల్లో రైతులకు రాయితీపై ఇస్తామని చంద్రమోహన్‌రెడ్డి వివరించారు. ప్రతి జిల్లాకు కనీసం 500 ట్రాక్టర్లు దక్కేలా చూస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.407 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. ఉద్యానవనాలకురూ.1,170 కోట్లు వెచ్చించబోతున్నట్లు వివరించారు. జూన్‌ 14 నుంచి 20 వరకు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులకు పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామన్నారు. రైతు రుణమాఫీలో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రూ.3,300 కోట్ల విలువైన ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఇక్రిశాట్‌ సాయంతో రైతులను తెగుళ్లపై అప్రమత్తం చేయగలుగుతున్నామన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన రైతులు సాగు చేసే ప్రాంతాల్లో దిగుబడులు పెంచేందుకు త్వరలో ఓ ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర రైతులకు విత్తన రాయితీ పెంచనున్నట్లు చెప్పారు.

పత్తిసాగు వదిలేసే రైతులకు కల్పించే రాయితీలు

* పురుగుమందుల్లో 75 శాతం రాయితీ. దీని వల్ల ఒక్కో రైతుకు రూ.1000 మేర ప్రయోజనం.

* కలుపు నివారణకు రూ.1500 ప్రయోజనం.

* పండించిన పంటకు మద్దతు ధర రూ.200 అదనం.

* దాదాపు 1.50 లక్షల హెక్టార్ల మేర మళ్లిన వారికి రాయితీలు ఇస్తారు.

Link to comment
Share on other sites

పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ..?
 
 
అమరావతి: అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇన్‌పుట్‌ సబ్సిడీపై జిల్లా నేతలతో చంద్రబాబు చర్చించారు. పంటల బీమాతో సంబంధంతో లేకుండా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించే అంశంపై నేతలతో సీఎం చర్చించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.15 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గరిష్టంగా ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

కోరినట్లే ఇచ్చేద్దాం

బీమాతో సంబంధం లేకుండా రైతుకు పెట్టుబడి రాయితీ చెల్లింపు

హెక్టారుకు రూ.15వేలు.. గరిష్ఠంగా 2 హెక్టార్లకు

రైతులకు రూ.2214 కోట్ల లబ్ధి

వచ్చే ఏడాది నుంచే విద్యుత్తు ఛార్జీల తగ్గింపు

కార్యాచరణపై వారంలో నివేదిక

మంత్రులు, అధికారులతో వేర్వేరు భేటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు

ఈనాడు - అమరావతి

17ap-main1a.jpg

బీమా, పెట్టుబడి రాయితీ పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఒకదానితో మరో దానికి సంబంధం లేకుండా పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీనివల్ల రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో రూ.1,680కోట్లు, బీమా పరిహారంగా రూ.534కోట్లు దక్కనున్నాయి. రెండూ కలిపి రూ.2,214కోట్లు అందుతాయి. పెట్టుబడిరాయితీ హెక్టారుకు రూ.15వేలు చొప్పున గరిష్ఠంగా రెండు హెక్టార్లకు కు ఇస్తారు.

శనివారం అనంతపురం జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే రోజు ముఖ్యమంత్రి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి విద్యుత్తు ఛార్జీలు తగ్గించే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రెండోదశ విద్యుత్తు సంస్కరణలతో విద్యుత్తు ఉత్పత్తి వ్యయం తగ్గిస్తున్నామని, దీంతో ఛార్జీలు తగ్గించే పరిస్థితులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గించడానికున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి వారం రోజుల్లో ఒక నివేదిక సమర్పించాలని కోరారు. రాష్ట్రంలో మొదలు పెట్టిన అన్ని మౌలికసదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

గత ఏడాది కరవు కారణంగా పంటలు దెబ్బతిన్న రాయలసీమ రైతులకు హెక్టారుకు రూ.15వేల చొప్పున పెట్టుబడిరాయితీ ఇస్తామని ప్రభుత్వం మొదట్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీమా పరిహారంతో కలిపి గరిష్ఠంగా రూ.15వేలు అందిస్తామని ప్రకటించింది. అయితే రైతులు రెంటికీ ముడిపెట్టొద్దని డిమాండు చేశారు. బీమాతో సంబంధం లేకుండా జాబితాలో ఉన్న వారందరికీ పెట్టుబడి రాయితీ ఇవ్వాలని, కోత ఆలోచన వద్దని కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని నేతలు, అధికారులు కూడా ఉన్నతస్థాయికి సమాచారం ఇచ్చారు. శనివారం

ముఖ్యమంత్రితో అనంతపురం జిల్లా నేతల భేటీ సందర్భంగా ప్రధాన చర్చ దీనిపైనే జరిగింది. పంటలబీమా, పెట్టుబడి రాయితీ కలిపి ఇస్తామని చెప్పడంపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఆయన ముందుంచారు. కేంద్ర రాయితీ మాత్రమే ఇస్తామని చెప్పినా ఫలితం కన్పించడం లేదని వివరించారు. బీమాతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయమై చర్చ నడిచింది. అనంతరం రైతులు కోరుతున్నట్లుగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. చివరికి ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు భారీగా లబ్ధి కలుగుతున్నా... ఇప్పటిదాకా ఆలస్యం చేయడమే తీవ్ర చర్చనీయాంశమైంది.

17ap-main1b.jpg సాహసోపేత నిర్ణయం: మంత్రులు

సీఎంతో సమావేశం అనంతరం వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులకు కేవలం పెట్టుబడి రాయితీనే హెక్టారుకు రూ.15వేల చొప్పున గరిష్ఠంగా 2 హెక్టార్ల వరకు ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి బీమా సంబంధం ఉండదన్నారు. రైతుల విషయంలో ఇలాంటి నిర్ణయం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని చెప్పారు. అధిక మొత్తంలో అనంతపురం జిల్లాకే పెట్టుబడి రాయితీ కింద రూ.1,032కోట్లు, బీమా రూపంలో రూ.419కోట్లు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయశాఖ చరిత్రలో తీసుకున్న సాహసోపేత నిర్ణయమిదని గ్రామీణ గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. మొత్తం 13లక్షల మంది రైతులకు లబ్ధి కలగబోతోందని చెప్పారు. 20 ఏళ్లలో 17 ఏళ్ల కరవు ఉన్న అనంతపురం రైతుకు నేనున్నా ‘నువ్వు ధైర్యంగా వ్యవసాయం చేయమ’ని సీఎం భరోసా ఇచ్చారని అన్నారు.

జూమ్‌ విమాన సర్వీసులు...

ఈ నెలాఖరు నుంచీ రాష్ట్రంలో ‘జూమ్‌’ విమానయాన సంస్థ సర్వీసులు ప్రారంభించనున్నట్లు మౌలికవసతులపై సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ సంస్థ దిల్లీ-ఇండోర్‌-తిరుపతి-విజయవాడ-ముంబయి, విజయవాడ-తిరుపతి-ఇండోర్‌-దిల్లీ మధ్య విమానాలు నడపనుంది. రీజినల్‌ కనెక్టివిటీ పథకం ద్వారా రాష్ట్రానికి విమాన సర్వీసులు పెంచి అందరికీ ఆ సర్వీసులు అందేలా చూడాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి దుబాయ్‌, హాంకాంగ్‌, కౌలాలంపూర్‌లకు కూడా విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. బోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం భూ సమస్యలను సత్వరం పరిష్కరించి పనులు ప్రారంభించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో హెలీపాడ్‌లు నిర్మించాలని, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఏటా వైమానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీని లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చే అంశంపై ఒక టాస్కుఫోర్సును ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ సమావేశంలో మౌలికసదుపాయాలు పెట్టుబడుల విభాగం ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్‌, ఏపీఐఐసీ ఎండీ ఏ.బాబు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఫోన్‌ కొడితే పొలానికి యంత్రం

త్వరలో అద్డెకిచ్చేందుకు సిద్ధం

పీపీపీ పద్ధతిలో 72 సీహెచ్‌సీ కేంద్రాలు

ఒక్కోదానిలో రూ.కోటి విలువైన పరికరాలు..

తక్కువ ధరకే రైతుకుఅందుబాటులోకి..

ఈనాడు - అమరావతి

22ap-main2a.jpg

వ్యవసాయం రైతుకు రోజురోజుకు భారంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా పంట చేతికొచ్చే సమయంలో సకాలంలో కూలీలు దొరక్క మామూలుగా ఇచ్చే కూలీకి రెండింతలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఆరుగాలం శ్రమించినా రైతుకు ఫలితం దక్కడం లేదు. వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలన్నా..అద్దెకు తెచ్చుకోవాలన్నా ధరలు అందనంతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చు తగ్గించి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందింపజేయడమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, ఇతర ఆధునాతన యంత్రపరికరాలను అద్దె పద్ధతిపై సరఫరా చేసే (కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల-సీహెచ్‌సి)కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. బహిరంగ మార్కెట్‌ కంటే దాదాపు 30నుంచి 50శాతం వరకూ తక్కువ ధర చెల్లించి దుక్కులు, వరినాట్లు, వరికోత, నూర్పుడి యంత్రాలు తదితరాలతో పనులు చేయించుకోవచ్చు. ఫోన్‌ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు యంత్రాలు వస్తాయి. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచే కొన్ని మండలాల్లో ఈ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో కేంద్రంలో రూ.కోటి వ్యయంతో కూడిన పరికరాలు సమకూరుస్తారు. ఇందులో 50శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది.

తొలివిడతలో 72 కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోనూ సీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నా ప్రస్తుతం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే పని లభించే అవకాశం ఉండటంతో వడ్డీల భారం పడుతుందనే ఆలోచనతో వెనకాడుతున్నారు. అందుకే స్థానికంగా ఉండే డీలర్ల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయించేందుకు కొన్ని తయారీ సంస్థలు సిద్ధమయ్యాయి. తొలిదశలో 200 మండలాల్లో కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలవగా 110 చోట్ల ముందుకు వచ్చారు. ఇందులో 72 చోట్ల మాత్రమే ఒప్పందాలు జరిగాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, కడప, విజయనగరం జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ట్రాక్టర్‌ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయి. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ తయారు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఎలాంటి యంత్రాలు అవసరమో వాటిని అందుబాటులో ఉంచుతారు.

మార్కెట్‌ కంటే తక్కువకే..

ఏ పనికి ఎంత వసూలు చేయాలనే విషయాన్ని జిల్లా కలెక్టర్‌, వ్యవసాయ సంయుక్త సంచాలకులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. రోటోవేటర్‌కు(నేలను దున్నేందుకు) మార్కెట్‌ ధర ఎకరానికి రూ.1,400 ఉంటే ఇందులో రూ.800 నిర్ణయించారు. వరికోతకు రూ.1,900, వరినాట్లకు రూ.2,750 చొప్పున వసూలు చేసే విధంగా అధికారులు జాబితా తయారు చేశారు. ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీ నిర్ణయించిన ధరలే అమలవుతాయి. తక్కువ ధరకు యంత్రాలను అందుబాటులో ఉంచడమే కాకుండా అక్కడ ఇప్పటిదాకా లభించని యంత్రాలను కూడా అందుబాటులో ఉంచేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మార్క్‌ఫెడ్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...