Jump to content

farmer ki


Recommended Posts

  1. Home
  2. Economy
  3. Andhra Pradesh farmers to generate power with ‘Solar Farming’ scheme
 
Andhra Pradesh farmers to generate power with ‘Solar Farming’ scheme Farmers in Andhra Pradesh will soon be producing electricity apart from growing crops.
By: PTI | Amaravati | Published: February 23, 2017 12:25 PM
solar-farming-R.jpg A farmer could generate about 9000 units of power from a solar pump set per annum, taking an average of 300 sunny days. (Representative Image: Reuters)

Farmers in Andhra Pradesh will soon be producing electricity apart from growing crops. The State Energy Department is set to launch the scheme ‘Solar Farming’, the first-of-its-kind in the country, under which existing pump sets will be replaced with energy- efficient solar pump sets that will enable generation of power. After utilising the power required for drawing water to his field, the farmer could pump the remaining energy into the grid and thereby earn income.

A farmer could generate about 9000 units of power from a solar pump set per annum, taking an average of 300 sunny days. “We will fix a price for this power after discussing with the power regulator. This will be an extra income to the farmer,” Principal Secretary (Energy and Infrastructure) Ajay Jain has said.

Government of India’s Energy Efficiency Services Ltd (EESL) would be the implementing agency for this scheme. “The EESL is now preparing a detailed project report for the scheme and we are talking to funding agencies for the money. We require about Rs 3,000 crore to launch this scheme,” Jain said.

You may also like to watch:

Link to comment
Share on other sites

  • 1 month later...
మిర్చి రైతులకు శుభవార్త..!
 
అమరావతి: ఏపీలోని మిర్చి రైతులకు ఓ శుభవార్త. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసింది. మార్కెట్‌ ధరపై అదనంగా రూ. 1500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. మిర్చి రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తామని కూడా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీంతో మిర్చి రైతులకు ఊరట కలిగింది.
Link to comment
Share on other sites

స్థానిక పంటలకు విదేశీ మార్కెట్‌
 
  • రైతులకు ప్రయోజనం కలిగేలా మార్కెటింగ్‌ శాఖ చర్యలు
అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే అరుదైన కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేసి అన్నదాతలను ప్రోత్సహించాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో అరుదుగా పండే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొని విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. ‘విశాఖలో వేలంగి వంకాయలు, ప్రకాశం జిల్లాలో మోటపల్లి వంకాయ, అనంతపురంలో ముళ్ల వంకాయలకు మంచి ప్రాచుర్యం ఉంది. గుంటూరులోనే పండే నక్షత్ర కాకరకాయలు, కృష్ణా జిల్లాలో పండే బుంగ మిర్చి వంటి కూరగాయలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఇటువంటి కూరగాయలను గుర్తించి తొలుత భౌగోళిక గుర్తింపు కోసం పంపిస్తాం. ఆతర్వాత ఆ కూరగాయలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ వస్తుంది. ఈ డిమాండ్‌ను బట్టి వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే పది రెట్లకుపైగానే ధర వచ్చే అవకాశం ఉంది’ అని రైతుబజార్‌ సీఈవో వి.భాస్కర రమణమూర్తి తెలిపారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి అవసరమైతే ఆ కూరగాయలను పెద్ద మొత్తంలో సాగు చేయించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. వీటితోపాటు రాష్ట్రంలోని నేల స్వభావాన్ని పండే పంటల్లో విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి.. వాటి అంతర్జాతీయ మార్కెట్‌పై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అటువంటి పంటల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాకింగ్‌, నిల్వ చేసుకునే పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

రైతుకు విక్రయించిన ఎరువులకే రాయితీ

అమల్లోకి వచ్చిన నిబంధనలు

అన్ని ఎరువుల దుకాణాల్లో ఈ-పాస్‌ యంత్రాలు

atp-gen7a.jpg

పుట్టపర్తిగ్రామీణం,న్యూస్‌టుడే: ప్రభుత్వం ఎరువుల విక్రయం..చెల్లించే రాయితీల్లో కొన్ని మార్పులు చేసింది. గతంలో దుకాణదారు తాను విక్రయించిన ఎరువుల వివరాలను వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే రాయితీ సొమ్మును వారి ఖాతాలకు జమచేసేవారు. దీనివల్ల కొన్ని అక్రమాలకు ఆస్కారం ఉన్నట్లు భావించిన ప్రభుత్వం ఈ ఏడు కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రైతుకు విక్రయించిన ఎరువులకే రాయితీని కంపెనీలకు ఇస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జిల్లా, డివిజన్‌, మండల వ్యవసాయాధికారులకు అందాయి. జిల్లాలో 100 ఎరువుల దుకాణాల్లో ఈవిధానం కింద ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. జూన్‌ ప్రారంభానికి జిల్లాలోని 700 దుకాణాల్లో ఈ విధానం కింద ఎరువుల అమ్మకాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు వ్యవసాయశాఖ ఇప్పటికే అవగాహన కల్పించింది.

వేలిముద్ర వేస్తేనే: గతంలో ఎరువుల విక్రయంలో గందరగోళం ఉండేది. ప్రభుత్వం ఎరువుల సంస్థలకు నేరుగా రాయితీ చెల్లించేది. రైతులు ఎరువులు తీసుకోక పోయినా డీలర్లకు ఆ మొత్తం చేరిపోయేది. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డీలర్లవద్ద రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రైతు ఈపాస్‌ యంత్రంలో వేలిముద్ర వేయాలి. భూమిగల రైతు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రభుత్వ రాయితీ దక్కుతుంది. కౌలు రైతుల విషయానికి వస్తే యజమాని భూమి వివరాలు ఆధార్‌ నెంబర్లను నమోదు చేయించుకోవాలి.

అమలు ఇలా: ప్రతి ఎరువుల దుకాణంలో ఈ-పాస్‌ యంత్రాలను విధిగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కోరమాండల్‌ కంపెనీ ఈ యంత్రాలను ఎరువుల డీలర్లకు సరఫరా చేయనుంది. జిల్లాలో 700 వరకు ఎరువుల దుకాణాలు, 34 సొసైటీల్లో ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 100 దుకాణాలకు ప్రభుత్వం ఈ-పాస్‌ యంత్రాలను సమకూర్చింది. మిగిలిన వాటికి త్వరలో అందించనుంది. పంటలు సాగుచేసే రైతుల వివరాలు, వారి భూముల సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌లో ఉంచారు. రైతు ఎరువుల దుకాణానికి వెళ్లినప్పుడు ఆధార్‌ సంఖ్యను నమోదుచేసి ఈపాస్‌ యంత్రంలో వేలిముద్ర వేయాలి. రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దీన్ని బట్టి ఎన్ని క్వింటాళ్ల ఎరువులు రైతులకు విక్రయించారో గుర్తించి ఆమేరకు డీలరకు రాయితీ చెల్లిస్తారు. జిల్లాలో ఏడాదికి 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల టన్నుల ఎరువుల విక్రయం జరుగుతున్నట్లు అంచనా. దుకాణాదారుడు ముందుగా ఫర్టిలైజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్‌ü్డ రిజిస్టర్‌ చేసుకోవాలి. దుకాణానికి వచ్చే రైతుల ఆధార్‌ సంఖ్యలను సేకరించాలి.

అక్రమాలకు అడ్డుకట్ట: ఏటా ఖరీఫ్‌, రబీ కాలాల్లో ఎరువుల కంపెనీలు, వ్యాపారులు అక్రమ నిల్వలు చేసి రైతులకు ఎరువులు అవసరమైన సమయాల్లో కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎరువుల కంపెనీలు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ప్రభుత్వం నుంచి భారీగా రాయితీలను పొందుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిÏ్టలో పెట్టుకుని ప్రభుత్వం ఈ-పాస్‌ విధానం తీసుకొస్తోంది. ఇది రైతులకు ఏమేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

యూరియా బస్తాపై రూ.600 రాయితీ

ప్రస్తుతం రైతులు యూరియా బస్తాను రూ.298కి కొనుగోలు చేస్తున్నారు. వాస్తవ ధర రూ.898. ప్రభుత్వం బస్తాపై చెల్లించే రాయితీ రూ.600. రాయితీ పోను రైతుకు డీలరు రూ.298కి బస్తా విక్రయిస్తాడు. ఇప్పటి వరకు యూరియాను రైతులే కాకుండా ఇతర వర్గాల వారు కొంటున్నారు. చర్మశుద్ధి కర్మాగారాలు, నాటుసారా తయారీ, బెల్లం, పశుగ్రాసం, పాల తయారీలో వినియోగించేవారు. దీనివల్ల రైతులకు దక్కాల్సిన రాయితీలను ఇతరులు, పరోక్షంగా డీలర్లు కాజేస్తున్నారు. ఇక నుంచి ఈ తరహా అక్రమాలకు తావుండదు. డీఏపీ, పొటాష్‌, ఎంవోపి, ఫాస్పేట్‌, కాంప్లెక్సు ఎరువులకు ఇచ్చే రాయితీలు కూడా గతంలో పక్కదారి పట్టేవి. నూతన విధానంలో వీటికన్నిటికీ అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

రైతు కొన్న ఎరువుకే రాయితీ

బయోమెట్రిక్‌ ద్వారా ఎరువుల విక్రయం ప్రదాన ఉద్దేశం రాయితీల్లో అక్రమాల నియంత్రణ. బయోమెట్రిక్‌ ద్వారా ఎరువుల కొనుగోలుకు రైతులే వెళ్లాలన్న నిబంధనలేదు. అయితే వెళ్లిన వ్యక్తి ఆధార్‌, రైతు పట్టాదారు పుస్తకం, ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో ఇటీవలే 100 దుకాణాలకు ఈ-పాస్‌ యంత్రాలను సమకూర్చాం. త్వరలో అందరికి ఇస్తాం. ఈ విధానంవల్ల పంటకు అవసరమైన మోతాదులో ఎరువులు వాడాలనే అవగాహన రైతుల్లో ఏర్పడుతుంది. తద్వారా ఎరువుల వాడకం తగ్గుతుంది. ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఇతరులు తీసుకోకుండా కట్టడి జరుగుతుంది. భవిష్యత్తులో అంతా ఆన్‌లైన్‌ విధానం అమలు కానున్నందున ఇప్పటి నుంచే రైతులు తమ వివరాలను నమోదు చేయించుకోవడం ఉత్తమం.

శ్రీరామూర్తి, వ్యవసాయశాఖ, జేడీ
Link to comment
Share on other sites

పైరు తెగులు తెలుసుకునేందుకు ఏపీలో కొత్త యాప్
 
636313336390512529.jpg
అమరావతి: కొత్త, కొత్త టెక్నాలజీలను వినియోగించుకోవడంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా రాష్ట్రంలో పంటలను కాపాడుకోవడానికి కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాంటిక్ యాప్‌ను సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా చేనును ఫొటో తీస్తే పైరుకు సోకిన తెగుళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. రైతులందరూ ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యాప్ వినియోగంలో రైతులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

ICRISAT @ICRISAT

 

.@AndhraPradeshCM launching crop damage diagnosis @PlantixApp w/ @ICRISAT_DG at the District Collectors' Conf at Vijayawada today #DigitalAg

DAqxHfkWAAEf2AU.jpg

Plantix @PlantixApp

Plantix Retweeted ICRISAT

We're happy and excited! Plantix is launched in #andhrapradesh #India to support #farmers! https://play.google.com/store/apps/details?id=com.peat.GartenBank&hl=de 

 

 

Link to comment
Share on other sites

onourable Chief Minister Nara Chandrababu Naidu launched Plantix today at the District Collectors' Conference in Vijayawada. Plantix is an app that allows one to identify the variety of pest affecting the crop through artificial intelligence, just by clicking a photo of the infected area of the leaf/crop.

This revolutionary app can be accessed in Telugu language and covers nutrient deficiencies of 17 kinds of crops. 
App link: http://bit.ly/plantixapp

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...