Jump to content

farmer ki


Recommended Posts

రైతులకు రెయిన్‌ గన్‌ల పంపిణీ
 
పెనుగొండ: అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారుపల్లెలో రైతులకు ఎమ్మెల్యే బీకే పార్థసారథి రెయిన్‌ గన్‌లను పంపిణీ చేశారు. వేరుశనగ పంటలు ఎండిపోతే ప్రజాప్రతినిధులు, అధికారులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
Link to comment
Share on other sites

రెయిన్‌ గన్స్‌ వినియోగం ఓ చరిత్ర

చంద్రబాబు

20brk56aa.jpg

విజయవాడ: చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగులో రాయలసీమకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 30వరకు వర్షపాతం బాగుంటుందని నివేదికలు చెప్తున్నందున అప్పటి వరకు రెయిన్‌గన్‌ టెక్నాలజీ ద్వారా పంటలు కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై 6200మంది అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు లేక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే గతంలో రైతులు అసహాయంగా చూస్తుండిపోయేవారని, ఆ పరిస్థితి నుంచి రెయిన్‌ గన్స్‌ ద్వారా ఈ రోజు పంటలను కాపాడుతుండటం ఓ చరిత్రగా సీఎం అభివర్ణించారు.

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం వినియోగంలో దేశంలో మనరాష్ట్రమే ముందుండాలని సూచించారు. ఇప్పటి వరకు 22.79లక్షల మంది రైతులు బీమా చేశారని, ఆగస్టు 21వరకు బీమా చేసుకునే అవకాశం ఉందని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. రెయిన్‌గన్స్‌ ఇంకా 3వేలు రావాల్సి ఉందని వాటిని వెంటనే తెప్పించాలన్నారు. 10వేల రెయిన్‌గన్స్‌ ఏర్పాటు చేసిన ప్రాంతంలో డెమాన్‌స్టేషన్‌ పకడ్బందీగా జరగాలని తెలిపారు. ట్యాంకర్లకు, డీజిల్‌కు ఎకరానికి రూ.2700 నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కొంత రైతు, బీమా కంపెనీ పెట్టుకుంటే మిగిలినది ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో డ్రైస్పెల్స్‌ మిటిగేషన్‌ ఏవిధంగా ఎదుర్కొంటున్నామో ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వానికి నివేదికలు పంపాలని స్పస్టం చేసిన ముఖ్యమంత్రి దాని వల్ల రాష్ట్రానికి సహకారం పెరుగుతుందన్నారు.

8 జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో నవధాన్యాల సాగును ప్రోత్సహించాలని.. దీని వల్ల జీఎస్‌ డీపీ పెరిగే అవకాశం ఉందన్నారు. పంట కుంటల తవ్వకం వల్ల సమీపంలోని భూములకు కూడా లాభదాయకం కాబట్టి సాగునీటి వినియోగంలో రైతులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పంటరుణాల పంపిణీ లక్ష్యాన్ని చేరుకుంటూ ఆర్గానిక్‌ పార్మింగ్‌ ముందుకు తీసుకెళ్లాలని సీఎం తెలిపారు.

 
Link to comment
Share on other sites

160 కోట్లతో రెయిన్‌గన్స్‌: ఉమా
 
విజయవాడ (కృష్ణవేణి ఘాట్‌), ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ పంటలను కాపాడతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మెట్ట ప్రాంతాల్లో పంటల కోసం రూ.160 కోట్లతో రెయిన్‌ గన్స్‌ తెప్పించామని తెలిపారు. అవి వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయని, వాటిని రైతులకు అందజేసి సమీపంలోని కాల్వలు, చెరువులు, కుంటల్లో నీటితో పంటలను కాపాడతామని స్పష్టంచేశారు. పట్టిసీమ నిర్మాణంతో కృష్ణా డెల్టాకు ప్రాణం వచ్చిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును స్పూర్తితో పోలవరం ప్రాజెక్ట్‌ను 2018కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ నెలాఖరుకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులను సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గోదావరి అనుసంధానం ద్వారా డెల్టాకు సాగునీటి సమస్య తీరినట్టే వంశధార, నాగవళి అనుసంధానం ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. .
Link to comment
Share on other sites

మెట్ట పైర్లకు రెయిన్‌గన్లతో నీటిని అందిస్తున్నాం : జేడీ
 
నెల్లూరు : జిల్లాలోని 10 మండలాల్లో ఎండిపోతున్న మెట్టపైర్లకు 15 రెయిన్ గన్‌లతో నీటిని అందిస్తున్నామని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ హేమమహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మరో నాలుగైదు రోజుల్లో 270 రెయిన్‌గన్లు వాడతామన్నారు. పంటలను ఎండిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రభుత్వం కూడా పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
రైతులకోసం ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఇవే...636166208666416254.jpg

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్‌, రాష్ట్రీయ కృషి యోజన వంటి పథకాలతో పలు రాయితీలు అందిస్తున్నారు. ప్రతిఏటా వ్యవసాయ సీజన్‌లో కోట్లు వెచ్చించి రాయితీపై యంత్ర పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందచేస్తున్నారు. అయితే రైతులు వాటిని పొందే విధానం తెలియక అవకాశాలను కోల్పోతున్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, యంత్ర పరికరాల వివరాలు..
యంత్ర పరికరాలు

  • ఐదు ఎకరాల మెట్ట పొలం ఉన్న సన్న, చిన్నకారు మహిళా రైతులకు 50 శాతం రాయితీ, రెండున్నర ఎకరాలు మా గాణి దాటిన రైతులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన రైతులకు 70 శాతం రాయితీపై యంత్ర పరికరాలు అందజేస్తారు.
  • మినీ ట్రాక్టర్‌ ఖరీదు రూ. 2.42 లక్షలు కాగా, రూ.84,700 రాయితీతో అందిస్తున్నారు.
  • విత్తనాలు వేసే ముందు వాడే యంత్రాలైన రెండు, మూడు చెక్కల నాగళ్లు, గుంటక బ్లేడు, బొచ్చెల నాగళ్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 70 శాతం, ఇతరులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతంపై ఇస్తారు.
  • రోటోవీటర్‌ ధర రూ. లక్ష కాగా 50 శాతం రాయితీ వర్తిస్తుంది. ఎస్సీ,ఎస్టీలకు రూ. 70వేలకు ఇస్తారు.
ఆయిల్‌ ఇంజన్లు : సన్న, చిన్నకారు, మహిళా రైతులకు 50 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 70 శాతం రాయితీ, పెద్ద రైతులకు 40 శాతం రాయితీ వర్తిస్తుంది.
తైవాన్‌ స్ర్పేయర్లు : మందుల పిచికారీకి అవసరమైన తైవాన్‌స్ర్పేయర్లపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం రాయితీ కాగా మహిళా సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై వీటిని అందిస్తున్నారు. వీటితో పాటు బ్యాటరీతో పని చేసే స్ర్పేయర్లను కూడా పొందవచ్చు,
పీవీసీ పైపులు : ఐదెకరాల లోపు భూమి ఉన్న మహిళా రైతులు, సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక యూనిట్‌ కింద 43 పైపులను అందచేస్తారు. రెండు అంగుళాల పైపుల యూనిట్‌ ఖరీదు రూ. 13,870 కాగా మీటరుకు రూ. 25 చొప్పున రాయితీ ఇస్పారు. రైతు వాటా రూ. 7,420 చెల్లించాల్సి ఉంటుంది.

  • రెండున్నర అంగుళాల పైపుల యూనిట్‌ ఖరీదు రూ.20,124 కాగా, రైతు వాటా రూ. 13,674 చెల్లించాలి.
  • స్ర్పింకర్‌ పైపులు రెండున్నర అంగుళాల 25 స్ర్పింకర్‌ పైపులు, ఐదు స్ర్పింక్లర్లు పూర్తి ఖరీదు రూ.18,617 కాగా, 50 శాతం రాయితీపై అందిస్తారు.
ఎరువులకు రాయితీ ఇలా..
  • భూముల్లో జింక్‌ లోపాన్ని సవరించుకునేందుకు ఎకరాకు 20 కిలోలు పొందవచ్చు. 50 శాతం రాయితీతో కిలో ధర రూ.19.20 లకు అందిస్తారు. ఒక్కో రైతుకు ఐదెకరాలకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.
  • బోరాన్‌ ఎకరానికి టన్న ఇస్తారు. ధర రూ. 41.80లు
  • జిప్సం ఎకరానికి టన్న ఇస్తారు. ధర రూ.1,860 ఉండగా రూ. 930కే అందజేస్తారు.
  • జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద 70 శాతం రాయితీతో వేపనూనె కూడా అందిస్తున్నారు.
  • యంత్రపరికరాలు పొం దేందుకు ఆధార్‌, పట్టాదా రు పాసుపుస్తకం, బ్యాం కు ఖాతా నంబరు, పాస్‌పోర్టు సైజు ఫొటోతో వ్యవసాయశాఖ కార్యాలయంలో సం ప్రదించాలి. వారిచ్చిన దరఖాస్తు పూరించి మీసేవ కేంద్రంలో అందజేసి పరికర విలువను బట్టి రూ. 500 నుంచి 2 వేల వరకు రుసుం చెల్లించాలి. ట్రాక్టర్లతో నడిపే యంత్ర పరికరాలు పొందాలంటే ట్రాక్టర్‌ రిజిస్ట్రే‌షన్‌ ధ్రువపత్రం జత చేయాలి.
Link to comment
Share on other sites

iivi papers lonyy...metta vallaki isteyyy eyydho okkapanta pandichukuntaruu gaa kaadu anni maa mandalam lo antha ettukellii ahh maagaani pollalki veysaaruuuu

ma orilo okadu 18lacs ki vari kosedi machine konnadu 9lacs  subsidy vacchindi migathavi loan pettadu metta polame valladi

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
రైతు ఇంట సిరులు పండాలి!
 
636198622329381459.jpg
  • వ్యవసాయానికి సంపూర్ణ సాయం.. ఇదే ప్రభుత్వ తొలి లక్ష్యం
  • ఒకవైపు సాగు నీటి పథకాలు .. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు
  • అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
 
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ‘‘సాగు సాగాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించాలి. నా రైతు ఇంట సిరులు పండాలి. ఈ ధ్యేయంతోనే నా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. పట్టిసీమ పథకంతో నదుల అనుసంధానంలో నూతన అధ్యాయానికి తెరతీశాం. రాయలసీమలోనూ నీరు పారించే భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటు.. పగటిపూటే రైతుకు ఉచితంగా వ్యవసాయానికి 7 గంటలు నిరంతర విద్యుతను అందిస్తున్నాం. వ్యవసాయమే రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకు మూలాధారం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే రైతన్నకు సంక్రాం తి శుభాకాంక్షలు. తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని రైతులను ఉద్దేశించి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. సీఎం లేఖ యథాతథ పాఠం..
 
 
‘‘రాష్ట్ర విభజనతో ప్రధానంగా నష్టపోయింది రైతన్నలే. సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా భావించాను. పెండింగ్‌ సాగునీటి పథకాలను పూర్తి చేయడంతో పాటు.. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాను. పొలంలోనే రైతులు కుంటలు తవ్వి భూగర్భ జలాలు పెంచుకునేలా కార్యక్రమాన్ని చేపట్టాం. కరువు జిల్లా అనంతపురం రైతుల నీటి కష్టాలు తీర్చేందుకు రెయిన్‌గన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. వీటికి తోడు విద్యుత సంస్థలు రైతులకు ఎల్లవేళలా స్నేహహస్తం అందించేలా కార్యాచరణను రూపొందించాం. 2015-16లో రాష్ట్ర వ్యవసాయోత్పత్తిలో 25% వృద్ధిరేటు సాధించింది. రూ.37,000 విలువజేసే ఒక్కో పంపుసెట్‌నూ రైతుకు ఉచితంగా అందిస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయానికి 7 గంటల నిరంతరం విద్యుత కోసం రూ.3180 కోట్ల సబ్సిడీని ఇచ్చాం.
 
రాయలసీమలో వ్యవసాయానికి 24 గంటల విద్యుతను అందజేశాం. పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాలు, భూసార-భూగర్భ జలాల పరిరక్షణ, రుణ మాఫీ, వడ్డీ లేని రైతు రుణాలు, వ్యవసాయ బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఎమ్మెల్యే అధ్యక్షతన సబ్‌స్టేషన్‌ వారీ కమిటీని వేసి.. విద్యుత సరఫరా తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం ద్వారా ప్రతి రైతునూ ఇంధన సంస్థల ఉద్యోగి కలిసేలా చర్యలు తీసుకు న్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వృద్ధి రేటులో దూసుకుపోతుందని బలీయంగా విశ్వసిస్తాను. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.’’
Link to comment
Share on other sites

 

రైతు ఇంట సిరులు పండాలి!

 

636198622329381459.jpg
  • వ్యవసాయానికి సంపూర్ణ సాయం.. ఇదే ప్రభుత్వ తొలి లక్ష్యం
  • ఒకవైపు సాగు నీటి పథకాలు .. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు
  • అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
 

 

I cannot tell you how much I appreciate your posts/contributions, brother ... thank you  :shakehands:

Link to comment
Share on other sites

Guest Urban Legend

దేశానికి వెన్నెముక రైతన్న ...ఆ రైతన్న కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పలు సబ్సిడీ లు పలు పధకాలు ప్రవేశ పెట్టింది ...కాని అది అందరి రైతులకి అవగాహనా లేకపోవటం తో చాలా పధకాలు మరుగున పడి పోతున్నవి ...
ఈ వీడియో లో మల్చింగ్ షీట్స్ వల్ల ఉపయోగాలు వాటి కొరకు ప్రభుత్వ పధకం గురించి తెలుసుకోవచ్చు
ఈ క్రమం లో ఈ పధకాలని రైతన్న కి తెలియ చేయాలి అన్న ఒక ప్రయత్నం చేసాడు మిత్రుడు సురేష్ కుమార్ ...అతని ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ...అందరు ఈ వీడియో ని షేర్ చేసి మరింత మందికి చేరువ అయ్యేలా చూడగలరు అని ఆశిస్తున్నాము

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...